Xiaomi
-
అమ్మకాల్లో షావోమీ ఎలక్ట్రిక్ కార్ సరికొత్త రికార్డ్‌లు
చైనా టెక్ దిగ్గజం షావోమీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కార్లు ఊహించని విధంగా అమ్ముడు పోతున్నట్లు తెలుస్తోంది. షావోమీ గతేడాది ఎస్‌యూ7 (ఎస్‌యూ అంటే స్పీడ్ ఆల్ట్రా) ను ఎలక్ట్రిక్ కారును మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ కారును గత నెల చివరి వారంలో విడుదల చేసింది. టెస్లా, బీవైడీ కార్లను తట్టుకుని నిలబడేందుకు ధర 2,15,900 యువాన్లు (సుమారు రూ.24,90లక్షలు)గా నిర్ణయించింది. ఇప్పుడు ఈ మోడల్ కార్లను విడుదల చేసిన మొదటి నెలలో సుమారు 70వేల ఆర్డర్లు వచ్చినట్లు తెలిపింది. ఈ సందర్భంగా సంస్థ సీఈఓ లీ జున్ మాట్లాడుతూ.. ఎస్‌యూ 7ను ఈ ఏడాది మొత్తం లక్ష యూనిట్లను అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. కాగా షావోమీ ఎస్‌యూ7 సెడాన్ మూడు వేరియంట్ ధరల్లో లభ్యమవుతుంది. స్టాండర్డ్ ధర 215,900 యువాన్లు, హై ఎండ్ ఎస్‌యూ7 ప్రో 245,900 యువాన్లు, ఎస్‌యూ 7 మ్యాక్స్ 299,900 యువాన్లుగా ఉంది. -
ఒకసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ టు శ్రీకాకుళం!
చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షావోమీ తాజాగా తమ తొలి విద్యుత్ కారును ఆవిష్కరించింది. బీజింగ్‌లో జరిగిన కార్యక్రమంలో కంపెనీ సీఈఓ ‘లీ జున్’ దీన్ని పరిచయం చేశారు. ఎస్‌యూ7గా వ్యవహరించే ఈ కారును మార్చి 28న చైనాలో విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఈ సెడాన్‌లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ కంపెనీ ప్రముఖ ఫోన్లతో అనుసంధానమయ్యేలా రూపొందించారు. చైనాలో దిగ్గజ కంపెనీలుగా పేరొందిన ‘కాన్టెంపరరీ యాంపరెక్స్ టెక్నాలజీ’, బీవైడీ నుంచి తీసుకున్న బ్యాటరీలను ఈ కార్లలో వాడుతున్నారు. భవిష్యత్తులో ప్రపంచంలో తొలి ఐదు దిగ్గజ వాహన తయారీ సంస్థల్లో ఒకటిగా నిలుస్తామని లీ జున్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కారుని ‘సెల్-టు-బాడీ’ టెక్నాలజీతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. దీంతో బ్యాటరీని నేరుగా వాహన నిర్మాణానికే అనుసంధానం చేసినట్లు వివరించారు. ఫలితంగా కారు దృఢత్వం పెరిగిందని పేర్కొన్నారు. ఇప్పటికే కంపెనీ రూపొందించిన అనేక యాప్‌లకు ఈ కారులో యాక్సెస్ ఉంటుందన్నారు. ఈ కారు ఎస్‌యూ7, ఎస్‌యూ7 మ్యాక్స్ పేరిట రెండు వేరియంట్లలో లభించనుంది. ఎస్‌యూ 7 విషయానికి వస్తే.. 0-100 kmph వేగాన్ని 5.28 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ తెలిపింది. అలాగే ఒక్కసారి ఛార్జ్ చేస్తే 668 కిలోమీటర్లు వెళ్తుంది. గరిష్ఠ వేగం 210 కి.మీ/గం. అత్యధికంగా 400 ఎన్ఎం టార్క్ వద్ద 299 పీఎస్ శక్తిని విడుదల చేస్తుంది. ఇదీ చదవండి: కంపెనీని బురిడీ కొట్టించి రూ.180 కోట్లు గ్యాంబ్లింగ్.. అసలేం జరిగిందంటే.. మరోవైపు ఎస్‌యూ7 మ్యాక్స్ 2.78 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకుంటుంది. ఒక్క ఛార్జింగ్‌తో 800 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. దీని గరిష్ఠ వేగం 265 కి.మీ/గం. 838 ఎన్ఎం టార్క్ వద్ద 673 పీఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కార్ల ధరలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. -
షావోమీ స్మార్ట్ ఫోన్ యూజర్లకు అలెర్ట్!
స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమీ తన వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. లిక్విడ్ యూవీ స్క్రీన్ ప్రొటెక్టర్లను వాడొద్దని సూచించింది. వాటిల్లో ద్రవరూపంలో ఉండే రసాయన జిగురు స్మార్ట్‌ఫోన్ చార్జింగ్ పోర్ట్, స్పీకర్, ఇతర భాగాల్లోకి వెళ్లి.. ఫోన్ పనితీరును దెబ్బతీస్తుందని హెచ్చరించింది. దీంతో పరికరం వారంటీ పూర్తి కాలం రాదని తెలిపింది. స్మార్ట్ ఫోన్ లలో స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్ అమర్చబడి ఉంటుంది. అయినప్పటికి ఫోన్ కింద పడినప్పుడు డిస్ ప్లేకి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు యూజర్లు అదనంగా స్క్రీన్ ప్రొటెక్టర్ లను ఉపయోగిస్తుంటారు. అయితే మార్కెట్లో లభించే వివిధ రాకలైన స్క్రీన్ ప్రొటెక్ట్ లలో లిక్విడ్ యూవీ అడెసివ్ ప్రొటెక్టర్లు మంచివని అంటుంటారు. ముఖ్యంగా కర్డ్వ్ ఫోన్ లకు ఫోన్ స్క్రీన్ కు, గ్లాస్ లేయర్ లు భద్రతగా ఉంటాయని వ్యాపారస్తులు నమ్మిస్తుంటారు. కానీ అలాంటి స్క్రీన్ ప్రొటెక్ట్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని షావోమీ ఓ నోట్ ను షేర్ చేసింది. ఈ ప్రొటెక్టర్‌లలో ఉపయోగించే లిక్విడ్ అంటుకునే పదార్థం ఫిజికల్ కీలు, ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్ హోల్, బ్యాటరీ కవర్లోకి ప్రవేశించి, ఊహించని రీస్టార్ట్‌లు, బటన్ పనిచేయకపోవడం, స్పీకర్ శబ్దం, బ్యాటరీ కవర్ లెదర్ ఊడిపోవడం వంటి సమస్యలకు దారి తీస్తుందని నోట్ లో పేర్కొంది. వాటికి బదులుగా టెంపర్డ్ గ్లాస్, నాన్ టెంపర్డ్ లేదా ఎలక్ట్రోస్టాటిక్ ఫిల్మ్‌ల వంటి ప్రత్యామ్నాయాలను వినియోగించాలని సిఫార్సు చేస్తోంది. -
షావోమీ 14 సిరీస్ వచ్చేస్తోంది.. ధర ఎంతంటే?
చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ తన షావోమీ 14 సిరీస్ ను మార్కెట్ కు పరిచయం చేసేందుకు సిద్ధమైంది. వచ్చే నెల 7న షావోమీ 14తో పాటు షావోమీ 14 ప్రో, షావోమీ 14 ఆల్ట్రా సహా షావోమీ 14 సిరీస్ ఫోన్లలో తొలుత షావోమీ 14 ఫోన్ మాత్రమే భారత్ మార్కెట్ లో విడుదల చేయనుంది. కాగా, ఈ సిరీస్ ఫోన్లను షావోమీ ఇప్పటికే చైనా మార్కెట్ లో విడుదల చేసింది. ఇప్పుడు గ్లోబుల్ మార్కెట్ లో ఆవిష్కరించనుంది. షియోమీ 14 ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.36 అంగుళాల 1.5 కే ఎల్టీపీఓ ఓలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 3000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో వస్తున్నది. షావోమీ 14 120హెచ్ జెడ్ వరకు రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో 1.5కే ఎల్ టీ పీ ఓ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ డాల్బీ విజన్‌తో పాటు స్టీరియో స్పీకర్లతో కూడిన డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్ చేస్తుందని తెలిపింది. హ్యాండ్సెట్ 90డబ్ల్యూ వైర్డ్ హైపర్‌ఛార్జ్, 50డబ్ల్యూ వైర్లెస్ టర్బో ఛార్జ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది ఫోన్‌ను 10 నిమిషాల కంటే తక్కువ సమయంలో సున్నా నుండి 50కి ఛార్జ్ చేస్తుందని షావోమీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇందులో లైకా కో-ఇంజినీర్డ్ కెమెరా సెటప్ ఉంటది. ఓఐఎస్ 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 50 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్, 50-మెగా పిక్సెల్ ఆల్డ్రావైడ్ యాంగిల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. సెల్పీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా సైతం యూజర్లను అలరిస్తుంది. షియోమీ 14 ఫోన్ 90వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50వాట్ల వైర్ లెస్ చార్జింగ్ మద్దతుతో 4610 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. జేడ్ గ్రీన్, బ్లాక్, వైట్, స్నో మౌంటేన్ పింక్ వేరియంట్స్ కలర్స్ లో రానున్న ఈ ఫోన్ ధర రూ.50 వేల నుంచి రూ.60 వేల మధ్య ఉండొచ్చునని అంచనా -
అదిరిపోయే ఫీచర్లతో.. భారత్‌లో రెడ్మీ ఏ3 విడుదల.. ధర ఎంతంటే?
స్మార్ట్ ఫోన్ ప్రియులకు శుభవార్త. ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ తన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రెడ్మీ సిరీస్‌లో రెడ్మీ ఏ2కి కొనసాగింపుగా రెడ్మీ ఏ3ని తీసుకొచ్చింది. మూడు కలర్ ఆప్షన్లు, మూడు స్టోరేజ్ వేరియంట్లలో లభ్యమవుతున్న ఫోన్ ధర రూ.7,299గా ఉంది. రెడ్ మీ ప్రీమియం ఫోన్లలో కనిపించే హాలో డిజైన్ ఈ బడ్జెట్ ఫోన్లలో కనిపిస్తుంది. రెడ్మీ ఏ3 ధర ఫిబ్రవరి 23 నుండి రిటైల్ అవుట్లెట్లలో లభ్యమయ్యే రెడ్మీ ఏ3 ధర 3జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 7,299 ఉండగా.. 4జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 8,299, 6జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,299 అందుబాటులో ఉంటుంది. రెడ్మీ ఏ3 స్పెసిఫికేషన్స్ రెడ్మీ ఏ3 1650*720 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.7 అంగుళాల హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లేను కలిగి ఉంది. 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్‌ను కలిగి ఉంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియా జీ36 చిప్సెట్తో 6జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జీబీ వరకు ఈఎంఎంసీ 5.1 స్టోరేజ్‌తో పనిచేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కోసం బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్, కనెక్టివిటీ పరంగా రెడ్మీ ఏ3 సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, డ్యూయల్ 4జీ సిమ్ కార్డ్ స్లాట్లు, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.3లు ఉన్నాయి. 8ఎంపీ ప్రైమరీ సెన్సార్, 0.08 ఎంపీ సెకండరీ సెన్సార్‌తో సహా వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్, సెల్ఫీ, వీడియో కాల్ సంబంధిత అవసరాలను తీర్చడానికి 5ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ ఉంది. -
స్మార్ట్‌ఫోన్ కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ కారు - సింగిల్ ఛార్జ్‌తో 800కిమీ రేంజ్
చైనాలోని బీజింగ్‌లో గురువారం జరిగిన 'షావోమి' (Xiaomi) ఈవీ టెక్నాలజీ లాంచ్ ఈవెంట్ వేదికగా.. కంపెనీ తన సరికొత్త ఎలక్ట్రిక్ కారుని ఆవిష్కరించింది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఆవిష్కరించిన ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. షావోమి కంపెనీ మార్కెట్లో విడుదల చేయనున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు 'SU7' (స్పీడ్ అల్ట్రా7). ఇది ప్రపంచ మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న అగ్ర సంస్థల ఎలక్ట్రిక్ కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉండనున్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహన విభాగంలో తప్పకుండా గొప్ప గుర్తింపు పొందటానికి కంపెనీ కృషి చేస్తున్నట్లు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. SU7 అనేది నాలుగు డోర్స్ కలిగిన ఎలక్ట్రిక్ కారు. ఇది అద్భుతమైన డిజైన్ కలిగి, ఆధునిక ఫీచర్స్ పొందనుంది. పరిమాణం పరంగా ఉత్తమంగా ఉండే ఈ కారు 73.6 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి, ఒక సింగిల్ చార్జితో గరిష్టంగా 800కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. 2025నాటికి లాంచ్ షావోమి ఎలక్ట్రిక్ కారు 2025 నాటికి మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ కార్లు మొత్తం చైనాలోని బీజింగ్ తయారీ కర్మాగారంలోనే తయారవుతాయని కంపెనీ వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే ఈ కార్లు చైనా నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదీ చదవండి: రతన్ టాటా గురించి ఐదు ఆసక్తికర విషయాలు అంచనా ధర SU7 ధరలు 200000 యువాన్ల నుంచి 300000 యువాన్ల వరకు ఉండే అవకాశం ఉంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ రూ. 25 లక్షల నుంచి రూ. 35 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ కారు భారతీయ మార్కెట్లో విడుదలవుతుందా.. లేదా అనేదానిపైన అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. #XiaomiSU7 makes a significant #Stride as Xiaomi expands from the smartphone industry to the automotive sector, completing the Human x Car x Home smart ecosystem. #XiaomiSU7 will forever journey alongside those steering toward their dreams.#XiaomiEVTechnologyLaunch pic.twitter.com/ZLW5m7PTQN — Xiaomi (@Xiaomi) December 28, 2023 -
ఎలక్ట్రిక్ కారు తయారీలో చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ - సింగిల్ చార్జ్‌తో 265 కిమీ రేంజ్!
గ్లోబల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతున్న తరుణంలో కేవలం ఆటోమొబైల్ తయారీ సంస్థలు మాత్రమే కాకుండా ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం 'షావోమీ' (Xiaomi) కూడా ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలో అడుగుపెట్టింది. ఇందులో భాగంగానే తన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ కారు SU7 ఆవిష్కరించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. SU7, SU7 ప్రో, SU7 మాక్స్ అనే మూడు వేరియంట్లలో విడుదలకానున్న కొత్త షావోమీ SU7 ఎలక్ట్రిక్ కారు రియర్-వీల్ డ్రైవ్ (RWD), ఆల్-వీల్ డ్రైవ్ (AWD) అనే రెండు పవర్‌ట్రెయిన్ ఎంపికలతో లభించనుంది. రియర్-వీల్ డ్రైవ్ పవర్‌ట్రెయిన్ కలిగిన షావోమీ ఎలక్ట్రిక్ కారు 295 Bhp పవర్ అందించే ఎలక్ట్రిక్ మోటారు పొందుతుంది. అయితే ఆల్-వీల్ డ్రైవ్ మోడల్ 663 Bhp పవర్ అందిస్తుంది. ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు అందుబాటులో ఉంటాయి. ఇదీ చదవండి: లాంచ్‌కు ముందే రూ.10 కోట్ల కారు కొన్న చెన్నై వాసి - ఫోటోలు వైరల్ షావోమీ ఎలక్ట్రిక్ కారు LFP బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంటడం వల్ల మంచి రేంజ్ అందిస్తాయి. బేస్ మోడల్స్ ఒక ఫుల్ చార్జ్‌తో 210 కిమీ/గం, హై ఎండ్ వేరియంట్స్ 265 కిమీ/గం రేంజ్ అందిస్తాయి. బేస్ మోడల్స్ బరువు 1980 కేజీలు కాగా, టాప్ ఎండ్ మోడల్స్ 2205 కేజీల వరకు ఉంటుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు ఉత్పత్తిని 2023 డిసెంబర్ నుంచి ప్రారంభించే అవకాశం ఉంటుంది. డెలివరీలు 2024 ఫిబ్రవరి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సంస్థ బీజింగ్ ఫ్యాక్టరీలో ట్రయల్ ప్రొడక్షన్ కూడా ప్రారంభించింది. ఈ ఎలక్ట్రిక్ కారు డిజైన్, ఇతర ఫీచర్స్, ధరలు వంటి మరిన్ని అధికారిక వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. -
టెక్ దిగ్గజం యాపిల్‌కు భారీ షాక్!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌కు భారీ షాక్ తగిలింది. చైనాలో యాపిల్ అమ్మకాలు తగ్గగా.. స్థానిక కంపెనీ షావోమీకి మాత్రం కొనుగోలు దారులు పట్టం కట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది జూన్ నుంచి ప్రస్తుతం వరకు మొత్తం 20 బిలియన్ డాలర్లకు మార్కెట్ విలువ పెరిగింది. ఆ సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్స్‌తో పాటు ఇతర రంగాల్లోని వ్యాపారాలు గణనీయమైన వృద్దిని సాధించాయి. ఫలితంగా హాంకాంగ్ స్టాక్ మార్కెట్లో షావోమీ స్టాక్ విలువ 60 శాతం పెరిగినట్లు హాంగ్ సెంగ్ టెక్ ఇండెక్స్ తెలిపింది. ఇటీవల యాపిల్ క్యూ4 ఫలితాలు విడుదల చేసింది. ఆ ఫలితాల్లో కంపెనీకి రెవెన్యూ తగ్గినా.. కొత్తగా విడుదల చేసిన ఐఫోన్ 15 సిరీస్ కొనుగోళ్లు భారీగా జరిగినట్లు నివేదించింది. జులై నుంచి సెప్టెంబర్ నెల ముగిసే సమయానికి ఈ లేటెస్ట్ సిరీస్ ఫోన్ల 73.5 బిలియన్ డాలర్ల విలువైన అమ్మకాలు జరిగాయి. ఈ మొత్తం గత ఏడాదితో పోలిస్తే 1శాతం తగ్గింది. అయితే ఆండ్రాయిడ్ మార్కెట్లో యాపిల్ సేల్స్ తగ్గినా.. రానున్న రోజుల్లో ఆ సంస్థకు ఆశించిన స్థాయిలో మార్కెట్ ఫలితాలు ఉంటాయని అంచనాలు నెలకొన్నాయి. ఫలితంగా చైనాలో ఇతర ఆండ్రాయిడ్ ఫోన్ల తయారీ సంస్థలు సైతం అమ్మకాలు పెరుగుతాయని ఆశిస్తున్నాయి. షోవోమీ 14 సిరీస్ అమ్మకాల జోరు చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమీ గత నెల 26న ‘షావోమీ 14’ సిరీస్‌ను విడుదల చేసింది. అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు మొత్తం 10 లక్షల ఫోన్లు అమ్ముడు పోయాయి. చైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఈ అమ్మకాల్ని షావోమీ రెండో సారి సాధించింది. షావోమీ తర్వాతి స్థానంలో హువావే టెక్నాలజీ విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్ మేట్ 60 ప్రొ ఉంది. కాగా, షావోమీ ఫోన్లే కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్, ఏఐ ఆధారిత ఉత్పత్తులకు మార్కెట్ అదే స్థాయిలో ఉందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చైనా కంపెనీల ఫోన్ల జోరు డ్రాగన్ దేశం ఆర్ధిక మాంద్యం దెబ్బకు ఉక్కిరి బిక్కిరవుతుంది. కాబట్టే అక్కడి పౌరులు ఖర్చు పెట్టే విషయంలో ఆలోచిస్తున్నారు. వారి నిర్ణయం స్మార్ట్ ఫోన్ కొనుగోళ్లపై పడింది. ఇటీవల ప్రముఖ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ నివేదికలో క్యూ3లో స్మార్ట్‌ఫోన్ సేల్స్ 3 శాతం పడిపోయాయి. దీనిపై అమెరికా పెట్టుబడి సంస్థలు మోర్గాన్ స్టాన్లీ, సిటీ గ్రూప్‌లు స్పందిస్తూ.. వచ్చే ఏడాది నాటికి చైనాలో స్మార్ట్‌ఫోన్ సేల్స్ పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశాయి. చదవండి👉 ఆస్తులన్నీ పోగొట్టుకుని దీనస్థితిలో అమితాబ్.. నలుగురిలో నిలబెట్టిన ధీరూభాయ్.. -
రెడ్మీ నోట్ 13 సిరీస్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్ - సూపర్ ఫీచర్లు
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ.. షావోమీ రెడ్మీ నోట్ 13 సిరీస్ స్మార్ట్ ఫోన్లను మార్కెట్‌కు పరిచయం చేసింది. షావోమీ 12 సిరీస్ సూపర్ హిట్ కావడంతో.. లేటెస్ట్ సిరీస్ షోవోమీ 13పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ సిరీస్‌లో రెడ్మీ నోట్ 13, రెడ్మీ నోట్ 13 ప్రో, రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ మోడళ్లను సెప్టెంబర్ 22న చైనాలో లాంచ్ చేసింది. రేపటి నుంచి ఈ సిరీస్ ఫోన్ల అమ్మకాలు ప్రారంభమవుతున్నాయి. రెడ్మీ నోట్ 13 స్పెసిఫికేషన్లు 6.67-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఉన్న రెడ్మీ నోట్ 13లో 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, మీడియా టెక్ డైమెన్సిటీ 6080 SoC, 12జీబీ ర్యామ్ 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందిస్తుంది. దీంతో పాటు ఈ ఫోన్లో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్లో 100-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్లు ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ సెన్సార్ సౌకర్యం ఉండగా..ఫోన్ 33డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. రెడ్మీ నోట్ 13 ప్రో స్పెసిఫికేషన్లు ప్రో మోడల్లో 6.67-అంగుళాల 1.5కే హెచ్డీ ప్లస్ అమోలెడ్ ప్యానల్,120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 2 చిప్సెట్తో పాటు 16జీబీ ర్యామ్ 512జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. ఫోటోగ్రఫీ విభాగంలో నోట్ 13 ప్రో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 200-మెగాపిక్సెల్ శాంసంగ్ ISOCELL హెచ్‌పీ3 ప్రైమరీ రియర్ సెన్సార్, అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, ఫ్రంట్ అండ్ బ్యాక్ 16 మెగాపిక్సెల్ సెన్సార్‌తో వస్తుండగా 67డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,100ఎంఏహెచ్ బ్యాటరీని పొందవచ్చు. రెడ్మీ నోట్ 13ప్రో ప్లస్ స్పెసిఫికేషన్లు ఈ రెడ్మీ నోట్ 13 ప్రో+ రేర్‌లో లో 200ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా వైడ్, 2ఎంపీ షూటర్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఫ్రెంట్లో 16ఎంపీ కెమెరా వస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా ప్రాసెసర్, 16జీబీ ర్యామ్- 512జీబీ స్టోరేజ్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 120 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, యూఎస్బీ-సీ పోర్ట్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఐఆర్ బ్లాస్టర్, 5జీ, వైఫై-6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్సీ వంటి కనెక్టివిటీ ఫీచర్స్ సైతం ఉన్నాయి. రెడ్మీ నోట్ 13, రెడ్ మీ నోట్ 13 ప్రో, రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ ధరలు రెడ్మీ నోట్ 13, 6జీబీ ప్లస్ 128జీబీ వేరియంట్ ఫోన్ ధర దాదాపు రూ. 13,900, 8జీబీ ప్లస్ 128 జీబీ, 8జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్ల ఫోన్ ధరలు రూ. 15,100, రూ. 17,400గా ఉంది. 12జీబీ ప్లస్ 256 జీబీ ఫోన్ ధర రూ. 19,700గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. రెడ్మీ నోట్ 13 ప్రో 8జీబీ ర్యామ్, 128 జీబీ, 256 జీబీ వేరియంట్ ఫోన్ల ధరలు రూ. 17,400, రూ. 19,700 వద్ద అందుబాటులో ఉన్నాయి. నోట్ 13 ప్రో 12జీబీ ప్లస్ 256జీబీ వేరియంట్ రూ. 22,000, 12జీబీ ప్లస్ 512 జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ. 23,100కే కొనుగోలు చేయొచ్చు.హై-ఎండ్ ప్రో మోడల్ 16జీబీ ప్లస్ 512 జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ. రూ. 24,300గా ఉంది. -
దిగొచ్చిన చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి: సంచలన నిర్ణయం
Xiaomi smartphone plant: చైనా స్మార్టఫోన్ తయారీదారులపై కొనసాగుతున్న ఒత్తిడి నేపథ్యంలో చైనా కంపెనీ షావోమి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాలతో, చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు షావోమి సప్లయిర్ డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ న్యూఢిల్లీ శివార్లలో భారీ ఫ్యాక్టరీని నిర్మించనుంది. దీంతో ఐఫోన్ తయారీ దారు తైవాన్ కంపెనీ ఫాక్స్‌కాన్‌కు పోటీగా డిక్సన్‌కు షావోమి పార్టనర్ షిప్ మరింత బలాన్నివ్వనుందని అంచనా. అయితే ఈ వార్తలపై అటు షావోమిగానీ, డిక్సన్‌గానీ అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు. (ఎమర్జెన్సీ అలర్ట్ సివియర్..ఈ ఫ్లాష్ మెసేజ్‌మీకూ వచ్చిందా?) బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం 300,000 చదరపు అడుగులకు మించి, దాదాపు ఆరు ఫుట్‌బాల్ మైదానాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఫ్యాక్టరీలో డిక్సన్ మూడు సంవత్సరాలలో రూ. 400 కోట్ల రూపాయలు (48.2 మిలియన్ డాలర్లు) కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టనుంది. ప్రధానంగా ఇక్కడ షావోమి స్మార్ట్ఫోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్లాంట్‌ను ఈ నెలాఖరులో ప్రభుత్వ అధికారి ప్రారంభించనున్నారు. (తొలి భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్ ఘనత: దిగ్గజ కంపెనీల ప్లేస్ ఎక్కడ?) అలాగే షావోమీ గతంలో చైనానుంచి దిగుమతి చేసుకున్న బ్లూటూత్ నెక్‌బ్యాండ్ ఇయర్ఫోన్లను తయారు చేయడానికి దేశీయ ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీకి కాంట్రాక్ట్‌ను కుదుర్చుకుంది. ఇది గతంలో చైనా నుండి దిగుమతి అయ్యేవి. డిక్సన్ వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రానిక్స్ కంపెనీ. మోటరోలా, శాంసంగ్ వంటి బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లు, వాషింగ్ మెషీన్లు, టెలివిజన్ సెట్లతో సహా ఇతర ఉత్పత్తులను తయారు చేస్తుంది. మూడు దశాబ్దాల క్రితం డిల్లీ శివార్లలో సునీల్ వచాని డిక్సన్ను ప్రారంభించారు. కాగా ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఒకపుడు టాప్‌లో ఎదురు లేకుండా ఉన్న షావోమి కేంద్ర నిబంధనలు, నియంత్రణలతో అధిక నియంత్రణ త తర్వాట్ మార్కెట్ షేర్‌ను కోల్పోయింది. దీన్నుంచు కోలుకునే చర్యల్లో భాగంగా మేడిన్ ఇండియా 5G స్మార్ట్ఫోన్లను సరసమైన ధరలో అందించాలని ప్లాన్ చేస్తోంది. Leadership of @XiaomiIndia met me tdy - hv set out to them our expectations of thm increasing exports, deepening supply chain eco-system n value addition in India n all products to be data privacy compliant @PMOIndia @GoI_MeitY pic.twitter.com/Y8E1YXnOxv — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) July 6, 2022 -
చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు భారీ షాక్! కేంద్రం సీరియస్
GST Evasion: చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు భారత ప్రభుత్వం భారీ షాకిచ్చింది. జీఎస్టీ ఎగవేత ఆరోపణలపై షావోమీ, ఒప్పో, వివో,లెనోవో కంపెనీలపై విచారణ జరుగుతోందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని, దర్యాప్తు ప్రారంభించామని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభలో తెలిపారు. పన్ను మొత్తం/వడ్డీ/పెనాల్టీని వర్తించే విధంగా జమ చేయాలని ఆదేశించినట్టు కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. షావోమి, రియల్‌మి, ఒప్పో, వివో, వన్‌ప్లస్ లాంటి చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారులు 2023-24 వరకు గత ఐదేళ్లలో రూ. 1,108.98 కోట్ల జీఎస్టీ, రూ. 7,966.09 కోట్ల కస్టమ్ డ్యూటీలను ఎగవేసినట్లు కేంద్రం శుక్రవారం పార్లమెంటుకు తెలిపింది. ఇది 2017-18, 2023-24 మధ్య (జూలై 1 వరకు) డేటా రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభ ఎంపీ నారాయణ్ దాస్ గుప్తా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తెలిపారు. 2019-20లో, షావెమి రూ. 653.02 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసింది, అందులో కేవలం రూ. 46 లక్షలు మాత్రమే చెల్లించింది. కంపెనీ లోటుపై ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీ చేసిందని చంద్రశేఖర్ తెలిపారు. అదే విధంగా, 2020-21లో, ఒప్పో మొబైల్ ఇండియా రూ. 4,389 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసింది, అందులో రూ. 450 కోట్లు మాత్రమే చెల్లించింది. (లండన్‌లో లగ్జరీ భవనాన్ని దక్కించుకున్న భారత బిలియనీర్) వివో ఇండియా అదే సంవత్సరంలో రూ.2,217 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసింది, అందులో కేవలం రూ.72 కోట్లు మాత్రమే చెల్లించింది. మొత్తంగా వివో ఈ రెండేళ్లలో 2,875 కోట్ల కస్టమ్స్ డ్యూటీలను ఎగవేసినట్లు ఆరోపణలు రాగా, కేవలం రూ. 117 కోట్లను రికవరీ చేసిందని మంత్రి తెలిపారు. జీఎస్టీ పరంగా కంపెనీ రూ.48.25 కోట్లు ఎగవేసిందని, ఎగవేతలో కొంత భాగం ఇంకా ప్రాసెస్‌లో ఉందని మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు కంపెనీ నుంచి రూ.51.25 కోట్లను ప్రభుత్వం వసూలు చేసింది. ( జస్ట్ పోజింగ్...ఆనంద్ మహీంద్రా హనీమూన్ పిక్ వైరల్) భారతదేశంలో మోటరోలా బ్రాండ్‌ను కూడా నిర్వహిస్తున్న లెనోవా ఇంకా రికవరీలు నమోదు చేయనప్పటికీ, రూ. 42.36 కోట్ల జీఎస్టీ ఎగవేసిందన్నారు. ప్రధాన చైనీస్ మొబైల్ హ్యాండ్సెట్ బ్రాండ్లు భారతదేశంలో 2022 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5 లక్షల కోట్ల టర్నోవర్‌ను కలిగి ఉన్నాయని, అలాగే నేరుగా 75 వేల మందికి పైగా , అమ్మకాలు ,కార్యకలాపాలలో మరో 80,000 మందికి ఉపాధి కల్పించారని మంత్రి చెప్పారు. -
రూ.10 వేల ధరలో షావొమీ 5జీ!
న్యూఢిల్లీ: స్మార్ట్ ఉపకరణాల తయారీలో ఉన్న షావొమీ రూ.10–15 వేల ధరల శ్రేణిలో 5జీ మోడళ్లను పెద్ద ఎత్తున తీసుకు రానుంది. మార్కెట్ వాటాను తిరిగి చేజిక్కించుకోవాలన్న వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ప్రకటించింది. ‘ప్రస్తుతం 5జీ మోడళ్లు ఎక్కువగా రూ.20 వేలకుపైగా ధర పలుకుతున్నాయి. రూ.15–20 వేల ధరల శ్రేణిలో విస్తృతి పెరిగింది. రూ.10–15 వేల ధరల విభాగంలో మార్కెట్ ఉండబోతోంది. షావొమీకి ఈ సెగ్మెంట్లో భారీ అవకాశాలు ఉన్నాయి. 4జీ స్మార్ట్ఫోన్ల రంగంలో అమలు చేసిన విధానాన్ని పునరావృతం చేయడానికి, 5జీ మ్యాజిక్‌ను మళ్లీ సృష్టించడానికి కంపెనీకి స్పష్టమైన అవకాశం ఉంది’ అని షావొమీ ఇండియా ప్రెసిడెంట్ బి.మురళీకృష్ణన్ తెలిపారు. రిటైల్ స్టోర్ల లో సేల్స్ ప్రమోటర్ల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 4,000 నుంచి 2023 డిసెంబర్ నాటికి రెండింతలకు చేస్తామన్నారు. -
షావోమి కూడా రంగంలోకి: ఆందోళనలో ఉద్యోగులు
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి కూడా ఉద్యోగాల తీసివేత దిశలో మరింతగా అడుగులు వేస్తోంది. ఇటీవలి కాలంలో భారత ప్రభుత్వ ఏజెన్సీల నుంచి పెరిగిన ఒత్తిడి, మార్కెట్ వాటా క్షీణత తదితర కారణాల నేపథ్యంలో ఉద్యోగులను, తద్వారా తగ్గించుకునే పనిలో పడినట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే షావోమి ఇండియా మరికొంత మందికి ఉద్వాసన పలకనుంది. తద్వారా మొత్తం సిబ్బంది సంఖ్యను దాదాపు వెయ్యికి తగ్గించుకోవాలని చూస్తోందట. దీంతో ఎపుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియని ఆందోళనలో ఉద్యోగులున్నారు. అయితే ఎంతమందిని, ఏయే విభాగాల్లో తొలగింనుందని అనేది స్పష్టత లేదు. (ఆషాఢంలో శుభవార్త: తగ్గుతున్న బంగారం,వెండి ధరలు) ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం షావోమి ఇండియా 2023 ప్రారంభంలో సుమారు 1400-1,500 మంది ఉద్యోగులను నియమించుకుంది. కానీ ఇటీవల దాదాపు 30 మంది ఉద్యోగులను తొలగించింది. రాబోయే నెలల్లో మరింత మందిని తొలగించాలని భావిస్తోంది. సంస్థాగత నిర్మాణాన్ని క్రమబద్ధీకరణ, వనరుల కేటాయింపును ఆప్టిమైజ్ చేసే వ్యూహంలో భాగంగా తాజా నిర్ణయం తీసుకున్నట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. (థ్యాంక్స్ టూ యాపిల్ స్మార్ట్ వాచ్, లేదంటే నా ప్రాణాలు: వైరల్ స్టోరీ) ఇదీ చదవండి: తొలి జీతం 5వేలే...ఇపుడు రిచెస్ట్ యూట్యూబర్‌గా కోట్లు, ఎలా? -
షావోమీ సరికొత్త ట్యాబ్లెట్ వచ్చేసింది, ధర, ఆఫర్లు ఎలా ఉన్నాయంటే?
చైనా స్మార్ట్‌మేకర్ షావోమీ కొత్త ట్యాబ్లెట్‌ను లాంచ్ చేసింది. హైఎండ్ ఫీచర్స్‌తో షావోమీ ప్యాడ్ 6 మోడల్‌ను తీసుకొచ్చింది. షావోమీ ప్యాడ్ 5 అప్‌గ్రేడ్ వేరియంట్‌గా ఆల్ మెటల్ డిజైన్‌తో దీన్ని ఆవిష్కరించింది. ధర, ఆఫర్ షావోమీ ప్యాడ్ 6 రెండు వేరియంట్లలో లభిస్తుంది. 6జీబీ ర్యామ్ , 128జీబీ స్టోరేజ్ ధర రూ.26,999గా నిర్ణయించింది.అలాగే 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.28,999. జూన్ 21న సేల్ ప్రారంభం. షావోమీ ఆన్లైన్ స్టోర్లతోపాటు,అమెజాన్‌లో లభిస్తుంది. (స్టార్ క్రికెటర్ కోహ్లీ పార్టనర్, ఈ బిలియనీర్ గురించి తెలుసా? నెట్‌వర్త్ ఎంతంటే?) ఇక ఆఫర్ విషయానికి వస్తే..ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారికి రూ.3,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.ఫలితంగా షావోమీ ప్యాడ్ 6 ట్యాబ్లెట్ 6జీబీ+128జీబీ వేరియంట్ రూ.23,999కు, 8జీబీ+256జీబీ వేరియంట్ రూ.26,999 ధరకు కొనుగోలుచేయవచ్చు. షావోమీ ప్యాడ్ 6 స్పెసిఫికేషన్స్ 11 అంగుళాల 2.8K ఎల్సీడీ డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 స్క్రీన్ ప్రొటెక్షన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 13 + ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టమ్ HDR10+, డాల్బీ విజన్ ఫీచర్స్ 13 ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్పీ కె కెమెరా 8,840mAh బ్యాటరీ 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ -
46 శాతం డిస్కౌంట్‌తో ప్రీమియం మొబైల్.. ఇలా చేస్తే మీ సొంతం!
Xiaomi 12 Pro: మార్కెట్లో అత్యంత ఖరీదైన స్మార్ట్ఫోన్ల జాబితాలో 'షావోమి 12 ప్రొ' (Xiaomi 12 Pro) ఒకటి. ఈ మొబైల్ ఇప్పుడు ఏకంగా 46 శాతం డిస్కౌంట్‌తో సరసమైన ధరకే లభిస్తుంది. ఈ లేటెస్ట్ మొబైల్‌ని అందుబాటు ధరకు ఎలా కొనాలి? ఎక్కడ కొనాలి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో సేవింగ్స్ డేస్ సేల్స్‌లో భాగంగా షావోమి 12 ప్రొ మొబైల్ 46 శాతం తక్కువ ధరకే లభిస్తుంది. ఈ సేల్స్‌లో కేవలం ఈ మొబైల్ ఫోన్ మీద మాత్రమే కాకుండా.. ఇతర ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్, బడ్జెట్ స్మార్ట్ఫోన్ల మీద కూడా ఆకర్షణీయమైన తగ్గింపు లభిస్తుంది. 8 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ కలిగిన షావోమి 12 ప్రొ 5జీ ఫోన్ అసలు ధర రూ. 79999. అయితే డిస్కౌంట్ పొందిన తరువాత ఇది రూ. 42,499కే లభిస్తుంది. అంతే కాకుండా బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ ఆఫర్స్ కింద ఈ ధర మరింత తగ్గుతుంది. అన్ని ప్రీమియం ఫీచర్స్ కలిగిన ఈ మొబైల్ ఫోన్ 5జీ నెట్వర్క్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్ సెట్ అమర్చారు. 120 హెర్జ్స్ రిఫ్రెష్ రేటుతో 6.72 ఇంచెస్ అమొలెడ్ డిస్ప్లే, అద్భుతమైన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. (ఇదీ చదవండి: ఒక్క బిజినెస్.. వందల కోట్ల టర్నోవర్ - వినీత సింగ్ సక్సెస్ స్టోరీ!) షావోమి 12 ప్రొ కొనాలనుకునే వారు HDFC క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1000 డిస్కౌంట్ లభిస్తుంది. అంతే కాకుండా మంచి కండిషన్లో ఉన్న మొబైల్‌ని ఎక్స్చేంజ్ చేసుకుంటే ధర ఇంకా తగ్గుతుంది. దాదాపు రూ. 80వేల మొబైల్ సగం ధరకే కొనుగోలు చేయడానికి తప్పకుండా ఈ కండిషన్స్ పాటించాలి. -
ఫెమా ఉల్లంఘనకు షావోమీకి ఈడీ షోకాజ్ నోటీసులు
న్యూఢిల్లీ: విదేశీ మారక నిర్వహణ చట్ట (ఫెమా) నిబంధనల ఉల్లంఘనకు గాను చైనా మొబైల్ తయారీ దిగ్గజం షావోమీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షోకాజ్‌నోటీసులు జారీ చేసింది. రాయల్టీ ముసుగులో అనధికారికంగా రూ. 5,551.27 కోట్ల విలువ చేసే మొత్తాన్ని విదేశాలకు బదలాయించడానికి సంబంధించి ఈడీ ఈ మేరకు చర్యలు తీసుకుంది. సదరు మొత్తాన్ని జప్తు చేస్తూ.. షావోమీ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సమీర్ రావు, మాజీ ఎండీ మను జైన్‌తో పాటు సిటీ బ్యాంక్, హెచ్ఎస్బీసీ బ్యాంక్, డాయిష్ బ్యాంక్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. -
సగ భాగం 5జీ ఫోన్లే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఈ ఏడాది అమ్ముడయ్యే స్మార్ట్ఫోన్లలో సగ భాగం 5జీ మోడళ్లు ఉంటాయని షావొమీ ఇండియా ప్రెసిడెంట్ మురళీకృష్ణన్ తెలిపారు. వివిధ నివేదికలూ ఈ విషయాన్నే వెల్లడిస్తున్నాయని ఆయన అన్నారు. హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. ‘భారత్‌లో రూ.20 వేలకుపైగా ఖరీదు చేసే స్మార్ట్ఫోన్లు అన్నీ 5జీ మోడళ్లే. రూ.15–20 వేల ధరల విభాగంలో 5జీ వాటా 80 శాతం కాగా, రూ.10–15 వేల సెగ్మెంట్లో 40–50 శాతం కైవసం చేసుకుంది. రూ.10 వేల లోపు ధరల శ్రేణిలో ఈ ఏడాది 5జీ వచ్చే అవకాశం లేదు. 4జీతో పోలిస్తే 5జీ చిప్సెట్ కనీసం రూ.3,000 ఖరీదు ఎక్కువగా ఉంటుంది’ అని వివరించారు. మూడు పునాదులు.. ఉత్తమ ఫీచర్లు, అత్యంత నాణ్యత, ధర విషయంలో నిజాయితీ.. ఈ మూడు అంశాలు పునాదులుగా వ్యాపారం సాగిస్తున్నామని మురళీకృష్ణన్ తెలి పారు. ‘2014 నుంచి ఇప్పటి వరకు దేశంలో 20 కోట్ల ఫోన్లు విక్రయించాం. కంపెనీ అమ్మకాల్లో ఆన్లైన్, ఆఫ్‌లైన్ వాటా సమంగా ఉంది. పరిశ్రమలో ఆఫ్‌లైన్ వాటా 60 శాతం కైవసం చేసుకుంది. ఒక్కో ఉత్పాదన అభివృద్ధికి 9–12 నెలల సమయం తీసుకుంటున్నాం. కనీసం 4జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమరీ కావాల్సిందేనని కస్టమర్లు కోరుతు న్నారు. ఫాస్ట్ చార్జింగ్, అమోలెడ్ డిస్ప్లే, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ డిమాండ్ చేస్తున్నారు’ అని వివరించారు. -
రెడ్మీ నోట్ 12 5జీపై భారీ డిస్కౌంట్, రూ.12,999కే కొనుగోలు చేయొచ్చు!
ఈ ఏడాది జనవరిలో విడుదలైన 5జీ స్మార్ట్‌ఫోన్ రెడ్మీ నోట్ 12 5జీ ఫోన్‌పై ప్రముఖ ఫోన్ తయారీ సంస్థ షావోమీ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. వీటితో పాటు రెడ్మీ నోట్ 12ప్రో 5జీ, రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్ 5జీ రేట్లను సవరించింది. అమెజాన్, ఎంఐ.కామ్ డిస్కౌంట్లలో ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చని తెలిపింది. విడుదల సమయంలో రెడ్మీ నోట్ 5జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ ప్లస్ 128 స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర రూ.17,999 ఉండగా.. తాజాగా ఆఫోన్ ధరను వెయ్యిరూపాయలు తగ్గించింది. దీంతో పాటు ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసిన కస్టమర్లు రూ.2,000 వరకు డిస్కౌంట్‌ను సొంతం చేసుకోవచ్చు. ఆ ఫోన్ ధర రూ.14,999కే తగ్గుతున్నట్లు షావోమీ కంపెనీ పేర్కొంది. కొనుగోలు దారులు హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి ఈఎంఐ ఆప్షన్‌ను ఎంపిక, ఐసీఐసీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.2,000 ఇన్స్టంట్ డిస్కౌంట్, మరో రెండు వేలు ఎక్ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు. ఇలా రూ.17,999 ఉన్న ఫోన్ ధర రూ.12,999కి తగ్గుతుంది. అలాగే, 6జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ మోడల్ రెడ్మీ నోట్ 12 5జీ ధర రూ.18,999 ఉండగా 8జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999గా ఉంది. ఇప్పుడు ఆ రెండు వేరియంట్ ఫోన్ ధరల్ని షావోమీ తగ్గించడంతో బ్యాంక్ డిస్కౌంట్‌తో కలిపి రూ.16,999, 18,999కే లభిస్తుంది. రెడ్మీ నోట్ 12 5జీ స్పెసిఫికేషన్లు రెడ్మీ నోట్ 12 5జీ (1,080*2,400) పిక్సెల్స్‌తో 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ప్లేతో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 5000 ఏఎంహెచ్ బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4జెనరేషన్ 1 ఎస్ఓఎస్, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 13 మెగా పిక్సెల్ సెల్ఫీ సెన్సార్, 128 జీబీ స్టోరేజ్, 33 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. చదవండి👉 ‘విలాసాల రుచి మరిగి’.. అశ్నీర్ గ్రోవర్ దంపతులకు మరో ఎదురు దెబ్బ! -
రూ. 6 వేలకే సరికొత్త స్మార్ట్ఫోన్లు.. లాంచ్ చేసిన షావోమీ
అతి తక్కువ ధరలో సరికొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది షావోమీ (Xiaomi). రెడ్మీ ఏ2 (Redmi A2), రెడ్మీ ఏ2 ప్లస్ (Redmi A2 Plus) ఫోన్లు భారత్‌లో అధికారికంగా విడుదలయ్యాయి. ఇదీ చదవండి: Motorola Edge 40: మోటరోలా ఎడ్జ్ 40 లాంచ్‌కు రెడీ.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు భలే ఉన్నాయే! రెడ్మీ ఏ2 సిరీస్ గత సంవత్సరం వచ్చిన రెడ్మీ ఏ1 సిరీస్‌కు కొనసాగింపు. పైకి చూడటానికి ఒకేలా ఉన్నా ఏ2 సిరీస్‌లో మరికొన్ని హంగులు చేర్చారు. మరింత శక్తివంతమైన చిప్‌ను జోడించారు. తాజా ఆండ్రాయిడ్ ( Android 13 Go) ఎడిషన్ సాఫ్ట్‌వేర్‌ను జత చేశారు. ఇక రెడ్మీ ఏ2, ఏ2 ప్లస్ డిజైన్ పరంగా రెండూ ఒకే రకంగా ఏ2 ప్లస్ ఫోన్లో అదనంగా ఫింగర్‌ప్రింట్ రీడర్ ఫీచర్ ఉంటుంది. రెడ్మీ ఏ2 సిరీస్ ధర రూ. 5,999 నుంచి ప్రారంభమవుతుంది. మే 23 తర్వాత ఈ ఫోన్లు కొనుగోలుదారులకు అందుబాటులోకి వస్తాయి. రేట్లు ఎంత.. ఎక్కడ కొనాలి.. ఆఫర్ల సంగతేంటి? రెడ్మీ ఏ2 2జీబీ/32జీబీ వేరియంట్ ధర రూ.5,999. 2జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ వెర్షన్ ధర రూ.6,499. ఇది 4జీబీ/64జీబీ కాన్ఫిగరేషన్‌లో కూడా కూడా అందుబాటులో ఉంది. దీని ధర రూ.7,499. ఇక రెడ్మీ ఏ2 ప్లస్ ధర రూ. 8,499. ఇది 4జీబీ/64జీబీ కాన్ఫిగరేషన్‌లో మాత్రమే వస్తుంది. సీ గ్రీన్, కామింగ్ ఆక్వా బ్లూ, క్లాసిక్ బ్లాక్ కలర్స్‌లో ఈ ఫోన్స్ లభిస్తాయి. ఈ ఫోన్లను ఆన్లైన్లో అయితే అమెజాన్, షావోమీ ఆన్లైన్ స్టోర్‌లో, అదే ఆఫ్‌లైన్‌లో అయితే ఎంఐ హోమ్ స్టోర్లతో పాటు కంపెనీ ఇతర రిటైల్ పార్టనర్ స్టోర్లలో మే 23 (మధ్యాహ్నం 12 తర్వాత) నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇక ఆఫర్ల విషయానికి వస్తే షావోమీ ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ వినియోగదారులకు ఈ ఫోన్ల కొనుగోలుపై రూ. 500 వరకు అదనపు తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఈ మోడళ్లపై 2 సంవత్సరాల వారంటీ ఉంటుందని కంపెనీ పేర్కొంది. సీనియర్ సిటిజన్లకైతే ఈ ఫోన్లను హోం సర్వీస్‌లో అందించనున్నట్లు తెలిపింది. స్పెసిఫికేషన్లు, ఫీచర్లు వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌తో 6.52 అంగుళాల 720p డిస్ప్లే MediaTek Helio G36 చిప్సెట్ 4GB ర్యామ్ 64GB ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ Android 13 Go సాఫ్ట్వేర్. వెనుకవైపు 8MP ప్రధాన సెన్సార్‌తో డ్యూయల్ కెమెరా సెటప్, ముందువైపు మరో 5MP కెమెరా 10W మైక్రో USB ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ. ఇదీ చదవండి: అదిరిపోయే రంగులో శాంసంగ్ గెలాక్సీ ఎస్23.. ధర ఎంతంటే.. -
‘వావ్’ కొత్త ఫోన్ అదిరింది.. ధర ఎంతంటే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షోవోమీ ‘షావోమీ13 ఆల్ట్రా’ ఫోన్‌ను లాంఛ్ చేసింది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2ఎస్వోసీ చిప్ సెట్, 12 బిట్ డిస్ప్లే, ఎల్టీపీవో సపోర్ట్, 90 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి. షావోమీ13 ఆల్ట్రా ఫీచర్లు షావోమీ13 ఆల్ట్రా 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.73 అంగుళాల 2కే అమోలెడ్ ఎల్టీపీవో డిస్ప్లే, Dolby Visionతో హెచ్డీఆర్ 10 ప్లస్ రెజెల్యూషన్, పీ3 కలర్ గమ్ముట్,1920 హెచ్‌జెడ్ పీడబ్ల్యూఎం డిమ్నింగ్, 2600నిట్స్ పీక్ బ్రైట్ నెస్, హెడ్సెట్ కర్వడ్ ఎడ్జ్, ఫోన్ ముందు భాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్, ప్రీమియం లెథర్ ఫినిష్ సౌకర్యం ఉంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ సపోర్ట్, 50 వాట్ల వైర్ లెస్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, సెల్ఫీ కోసం ముందు భాగంలో 32 ఎంపీ కెమెరా, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8జనరేషన్ 2 చిప్ సెట్, 16జీబీ 16జీబీ ఎల్పీడీడీఆర్5ఎక్స్ రామ్ అండ్ 1టిగా బైట్ ఆఫ్ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ. వీటితో పాటు వెనక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ . 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ ప్రైమరీ సెన్సర్ కెమెరా విత్ హైపర్-ఓఐఎస్, 8పీ లెన్స్ ఈఐఎస్, ఎల్ఈడీ ఫ్లాష్, వారియబుల్ అపెర్చర్ (ఎఫ్/1.9 టూ ఎఫ్/4.0 అండ్ ఎల్ఈడీ ఫ్లాష్. 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 858 ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, ఐఓఎస్‌తో 50 ఎంపీ సూపర్ టెలిఫొటో సెన్సార్, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 50 ఎంపీ టెలిఫోటో సెన్సార్లు ఉన్నాయి. షావోమీ13 ఆల్ట్రా ఫోన్ ధరలు షావోమీ13 ఆల్ట్రా బేస్ వేరియంట్ 12 జీబీ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.71,600.16జీబీ రామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.77,600.16 జీబీ రామ్ విత్ ఒక టిగా బైట్ వర్షన్ ఫోన్ ధర సుమారు రూ.87,200.గా ఉంది. చదవండి👉 షాకిచ్చిన మెటా.. ఊహించినట్టే భారీగా ఊడుతున్న ఉద్యోగాలు! -
రెడ్మి 12సీ, రెడ్మి నోట్12 వచ్చేశాయ్! అందుబాటు ధరలే
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్‌కు షావోమి రెడ్ మి 12 సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. గత వారం యూరప్‌లో విడుదల చేసిన రెడ్మినోట్12 4జీతోపాటు, రెడ్మి12 సీనిక ఊడా ఇపుడు భారతదేశంలో తీసుకొచ్చింది. రెడ్మినోట్12 4జీ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ అనే రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంటుంది రెడ్మినోట్12 4జీ ధర , లభ్యత 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ.16,999 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర రూ.14,999గా ఉంది. లూనార్ బ్లాక్, ఫ్రాస్టెడ్ ఐస్ బ్లూ సన్‌రైజ్ గోల్డ్ కలర్స్‌లో లభ్యం. అలాగే లిమిటెడ్ ఆఫర్ కింద కొనుగోలుదారులు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ. 1,000 తగ్గింపుకు అర్హులు. ఏప్రిల్ 6 నుండి ఎం స్టేర్లతోపాటు, అమెజాన్, ఇతర రిటైల్ స్టోర్ల ద్వారా విక్రయంజ రెడ్మినోట్12 4జీ స్పెసిఫికేషన్స్ 6.67అంగుళాల పంచ్-హోల్ AMOLED FHD+ డిస్ప్లే | 2400 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ 120Hz వరకు రిఫ్రెష్ రేట్ Qualcomm Snapdragon 685 చిప్సెట్ Android 13 ఆధారంగా MIUI 14 50+ 8+ 2ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 13ఎంపీ సెల్ఫీ కెమెరా 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు 5,000mAh బ్యాటరీ రెడ్మి 12 సీ స్పెసిఫికేషన్స్ 6.71-అంగుళాల HD+ డిస్ప్లే MediaTek Helio G85 SoC ఆండ్రాయిడ్ 12 OS 50 + 2 ఎంపీ రియర్ డ్యూయల్ కెమెరాలు 5ఎంపీ సెల్ఫీ కెమెరా 5,000W బ్యాటరీ రెడ్మి 12 సీ లభ్యత,ధరలు 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ ధర : రూ. 8,999 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రూ. 10,999 ఏప్రిల్ 16నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ కార్డ్‌తో 500 తక్షణ తగ్గింపు -
అదిరిపోయే షావోమీ ఎలక్ట్రిక్ కార్.. ఒక్క ఫుల్ చార్జ్‌తో 1000 కి.మీ మైలేజ్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ ఎలక్ట్రిక్ వాహన తయారీ రంగంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సంస్థ తయారు చేస్తున్న ఎలక్ట్రిక్ కారు గురించి ఇంట్రస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. షావోమీ వచ్చే ఏడాది ప్రారంభంలో తన మొదటి ఎలక్ట్రిక్ వాహనం విడుదలతో పాటు ఉత్పత్తి పెంచుతున్నట్లు తెలిపింది. ఇటీవల చైనా వార్షిక పార్లమెంటరీ సమావేశంలో షావోమీ సీఈవో లీ జున్ ఈవీ కార్ల తయారీ, పెట్టుబడుల గురించి మాట్లాడారు. అయితే షావోమీ తయారు చేసే కారు ఎలా ఉంటుందో చెప్పేలా షావోమీ కార్ల ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. కానీ ధరపై ఎలాంటి స్పష్టత రాలేదు. అయినప్పటికీ ఆ ఫోటోల్ని బట్టి చూస్తుంటే కారు మెక్లారెన్ 720ఎస్ మాదిరిగానే కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు పెద్ద విండ్‌షీల్డ్, మంచి సైడ్ గ్లాస్ ఏరియా, పనోరమిక్ సన్‌రూఫ్, చక్రాల మధ్యలో షావోమీ లోగో, విండ్‌షీల్డ్ పైన కూర్చునే సెన్సార్ కూడా ఉంది. షావోమీ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1,000 కి.మీ వరకు ప్రయాణించగలదని ఆటోమొబైల్ వర్గాలు చెబుతున్నాయి. ఈవీ దాదాపు 260 కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగల 800 వోల్ట్ సిస్టమ్‌తో వస్తుంది. ఈ కారు గురించి తెలుసుకునేందుకు వాహనదారులు మక్కువ చూపుతున్నారు. -
Redmi Fire TV: కొత్త ఓఎస్‌తో, కొత్త కొత్తగా వచ్చేస్తోంది!
సాక్షి,ముంబై:బడ్జెట్ ధరల స్మార్టఫోన్లు, స్మార్ట్ టీవీలతో ఆకట్టుకున్న చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమికి చెందిన రెడ్మీ స్మార్ట్ టీవీని తీసుకొచ్చింది. ఇండియన్ మార్కెట్లో తొలిసారిగా ఫైర్ ఓఎస్‌తో సరికొత్త టీవీని పరిచయం చేసింది. ఈమేరకు షావోమీ ట్విటర్లో షేర్ చేసింది. రెడ్మీ ఫైర్ స్మార్ట్ టీవీ ఈ నెల (మార్చి) 14వ తేదీన లాంచ్ కానుంది. అమెజాన్‌కు చెందిన ఫైర్ ఓఎస్ 7 (Fire OS7)పై ఈ స్మార్ట్ టీవీ రన్ అవుతుంది. రెడ్మీ ఫైర్ టీవీని లాంచ్ కోసం మైక్రోపేజీని క్రియేట్ చేసింది. అమెజాన్ భాగస్వామ్యంతో ఈ టీవీని షావోమీ రూపొందించింది. అమెజాన్ ద్వారా ఈ టీవీ అందుబాటులోకి రానుంది. రెడ్మీ ఫైర్ టీవీ ఫీచర్లు, అంచనాలు రెడ్మీ ఫైర్ టీవీ బెజిల్లెస్ డిజైన్, క్వాడ్-కోర్ ప్రాసెసర్, మెటాలిక్ బాడీ డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 వెర్షన్ కనెక్టివిటీ ఫోన్, ల్యాప్‌టాప్, టాబ్లెట్ టీవీ స్క్రీన్ కాస్టింగ్ కోసం మిరాకాస్ట్, యాపిల్ ఎయిర్ ప్లే , అలెక్సా వాయిస్ అసిస్టెంట్ ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగాఫైర్ ఓఎస్‌తో గ్లోబల్‌గా ఇటీవల షావోమీ ఎఫ్2 సిరీస్‌లో కొన్ని టీవీలను లాంచ్ చేసింది. 4K అల్ట్రా స్క్రీన్ రిజల్యూషన్, 43, 50, 55 అంగుళాల సైజుల్లో మెటల్ యూనీబాడీ డిజైన్‌తో వీటిని రూపొందించినట్టు తెలుస్తోంది. ఇక ధర, ఇతర స్పెషికేషన్లపై లాంచింగ్ తరువాత మాత్రమే క్లారిటీ రానుంది. Experience the excitement of curtain raiser performances from the comfort of your home. Stay Tuned!#FireUp pic.twitter.com/mcQv20qN09 — Xiaomi TV India (@XiaomiTVIndia) March 2, 2023 -
Xiaomi AR Smart Glass: కళ్ళముందున్న ప్రపంచాన్ని చేతితో..
చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ తన వైర్లెస్ AR గ్లాస్ డిస్కవరీ ఎడిషన్ ప్రోటోటైప్‌ను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023లో ప్రదర్శించింది. ఇది ఏఆర్ హెడ్సెట్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్ఆర్2 జెన్ 1 చిప్సెట్ ద్వారా పనిచేస్తుంది. ఇది వైర్‌లెస్‌గానే మొబైల్ ఫోన్‌కి కనెక్ట్ అవుతుంది. వైర్లెస్ ఏఆర్ గ్లాసెస్ చూడటానికి సింపుల్‌గా ఉండటమే కాకుండా, చాలా తేలికగా కూడా ఉంటుంది. కంపెనీ ఇందులో కార్బన్ ఫైబర్, మెగ్నీషియం టైటానియం వంటి మిశ్రమాలను ఉపయోగించింది. దీని బరువు కేవలం 126 గ్రాములు మాత్రమే. ఇది కస్టమ్ సిలికాన్-ఆక్సిజన్ యానోడ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. షియోమీ ఏఆర్ గ్లాసెస్ తేలికగా ఉండటమే కాకుండా ఒక జత మైక్రో OLED స్క్రీన్లను కలిగి ఉండటం వల్ల లైట్ గైడింగ్ ప్రిజమ్లకి కనెక్ట్ చేయబడతాయి. ఇది 12 నకిల్స్ ఫంక్షన్‌కి సపోర్ట్ చేస్తుంది. చైనీస్ నైన్-కీ ఇన్పుట్ మాదిరిగా ఇది వినియోగదారుల థంబ్ ద్వారా టెక్స్ట్ ఇన్పుట్ చేయడానికి అనుమతిస్తుంది. ఏఆర్ గ్లాస్లో లెన్స్‌లు ఎలెక్ట్రోక్రోమిక్ టెక్నాలజీని ఉపయోగిస్తాయి, కావున ఆన్ చేయడం ఆఫ్ చేయడం రెండు సులభంగా ఉంటాయి. ఇది కేవలం స్ట్రీమింగ్కు మాత్రమే కాకుండా అంతకు మించిన ఉపయోగాలను వినియోగదారులకు అందిస్తుంది. ఇందులో హ్యాండ్ ట్రాకింగ్ టెక్నాలజీ కూడా ఉంది. షియోమీ విడుదల చేయనున్న లేటెస్ట్ ఏఆర్ గ్లాసెస్ చాలా ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. అయితే కంపెనీ దీనిని ఎప్పుడు లాంచ్ చేస్తుంది, ధరలు ఎలా ఉంటాయనేది తెలియాలి. అయితే కంపెనీ దీనిని త్వరలోనే మార్కెట్లో విడుదల చేయడానికి కావలసిన అన్ని సన్నాహాలు చేస్తోంది. Boasting a retina-level near-eye display for AR glasses, Xiaomi Wireless AR Glass Discovery Edition delivers a truly immersive visual experience. Moreover, our self-developed Xiaomi AR Gesture Control empowers effortless control between virtual and real space. pic.twitter.com/EipqBWxkpW — Lei Jun (@leijun) February 27, 2023 -
పవర్ఫుల్ షావోమీ 13 ప్రో వచ్చేసింది: రూ. 22 వేల దాకా ఆఫర్
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమీ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇటీవల మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2023లో ఆవిష్కరించిన షావోమీ 13 ప్రోని తీసుకొచ్చింది. పవర్ఫుల్ చిప్సెట్తో ఐఫోన్ 14 పోటీగా దీన్ని లాంచ్ చేసిందని టెక్ వర్గాల అంచనా. షావోమీ 13 ప్రో స్పెసిఫికేషన్స్ 6.73 2K E6 AMOLED LTPO కర్వ్డ్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 1900నిట్స్ పీక్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 LPDDR5X UFS 4.0 ఆండ్రాయిడ్ 13 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 50+50+50 ట్రిపుల్రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 4820mAh బ్యాటరీ 120 వాట్ 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ ధర, సేల్, ఆఫర్: మార్చి 10 నుండి షావోమీ 13 ప్రో సేల్ మొదలవుతుంది. ధర రూ. 79,999 అమెజాన్, ఎంఐ రిటైల్ స్టోర్లలో రూ.79,999కి అందుబాటులో ఉంటుంది. ఐసీఐసీఐ కార్డ్ హోల్డర్లకు ప్రత్యేక తక్షణ బ్యాంక్ తగ్గింపు రూ. 10,000 లేదా షావోమీ యూజర్లకు రూ. 12,000 అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది.