![Motorola Tipped To Launch 200MP Camera Phone in 2022 - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/28/Motorola-200MP-sensor.jpg.webp?itok=A4MZWgav)
గత కొంత కాలంగా స్మార్ట్ ఫోన్ ఫీచర్స్‌లలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొంత కాలం క్రితం వరకు బ్యాటరీ మీద జరిగిన పరిశోదనలు ఇప్పుడు, స్మార్ట్ ఫోన్ కెమెరా అభివృద్ది మీద జరుగుతున్నాయి. తాజాగా వచ్చిన సమాచార ప్రకారం ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటోరోలా 200 మెగా పిక్సల్ కెమెరాతో మొబైల్ ఫోన్ తీసుకుని రాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే శాంసంగ్, రియల్ మీ, షియోమీ, మోటోరోలా 108 ఎంపీ సామర్ధ్యం గల మొబైల్ ఫోన్స్ మార్కెట్లోకి విడుదల చేశాయి. ఇప్పుడు,మోటరోలాతో పాటు శాంసంగ్, షియోమీ కూడా 200 మెగా పిక్సల్ రియర్ కెమెరాతో స్మార్ట్ ఫోన్ లాంఛ్ చేయాలని యోచిస్తున్నాయి.
అయితే, చైనా షియోమీ కంపెనీ దీనిని 2022 ద్వితీయార్ధంలో ఆవిష్కరించనున్నట్లు ఒక టిప్స్టర్ పేర్కొన్నారు. శాంసంగ్ కంపెనీకి మాత్రం కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. 2023లో శామ్ సంగ్ తన 200 మెగా పిక్సల్ కెమెరా ఫోన్ ను తీసుకువస్తుందని పేర్కొంది. మోటోరోలా ఈ కెమెరాలో ఐఎస్‌ఓఎల్‌ఈఎల్‌ఎల్ హెచ్‌పీ1 అనే శాంసంగ్ లెన్స్‌ను ఉపయోగించింది. ఇది కొత్త పిక్సెల్-బిన్నింగ్ టెక్నాలజీ సహాయంతో పనిచేస్తుంది. ఈ లెన్స్‌తో 30ఎఫ్‌పిఎస్ రేట్‌తో 8కే వీడియోలను, 12ఎఫ్‌పిఎస్ రేట్‌తో 4కే వీడియోలను రికార్డ్ చేయొచ్చు.
(చదవండి: జియో యూజర్లకు భారీ షాక్..!)
వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ ఫోన్‌ను విడుదలచేయాలని మోటోరోలా కంపెనీ భావిస్తోంది. మోటోరోలా ఇప్పటికే 108 ఎంపీ కెమెరా సామర్ధ్యంతో మోటో జీ60, మోటో ఎడ్జ్ 20, మోటో ఎడ్జ్ 20 ప్యూజన్, మోటో ఎడ్జ్ 20ప్రో మోడల్ ఫోన్లను విడుదల చేసింది. మోటోరోలా తన తాజా మోటో జి31 స్మార్ట్ ఫోన్ ను నవంబర్ 29న భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ డివైస్ 50 మెగా పిక్సల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 6.4 అంగుళాల అమోల్డ్ డిస్ ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుంది. ఈ ఫోన్ మీడియా టెక్ హెలీయో జీ85 ప్రాసెసర్ సహాయం చేత పనిచేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment