
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి అతి త్వరలోనే మరో ఫోల్డబుల్ మొబైల్‌ను లాంచ్ చేయనుంది. హై ఎండ్ ఫీచర్స్‌తో ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో తీసుకురానుంది. తన కంపెనీ నుంచి ఎంఐ మిక్స్ ఫోల్డ్ సిరీస్‌లో భాగంగా ఏంఐ మిక్స్ ఫోల్డ్ 2ను కొనసాగింపుగా మార్కెట్‌లోకి రిలీజ్ చేయనుంది. కాగా ఈ ఫోల్డబుల్ ఫోన్‌లో ఆప్‌గ్రేడేడ్ హింజ్ మెకానిజం రానున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా ఏంఐ మిక్స్ ఫోల్డ్ 2 శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2 కు పోటీగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఎంఐ మిక్స్ ఫోల్డ్ 2 స్పాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో, 5000ఎంఏహెచ్ బ్యాటరీతో కంపెనీ రిలీజ్ చేయనుంది. వీటితో పాటుగా 108 ఎంపీ రియర్ కెమరాను అమర్చనుంది. అత్యధికంగా 120హెర్జ్ రిఫ్రెష్ రేటుతో ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ మొబైల్‌ను 2021 క్యూ4లో లాంచ్ చేయాలని కంపెనీ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment