స్మార్ట్‌ఫోన్లలో భారీస్క్రీన్, భారీ కెమెరా, భారీ స్టోరేజ్, డబుల్, ట్రిపుల్ కెమెరా ఫీచర్ల హవాతో పాటు మడతపెట్టే ఫోన్లపై భారీ క్రేజ్ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో దిగ్గజ కంపెనీలన్నీ ఆ వైపుగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ షావోమీ తన ప్రోటోటైప్ టు-వే ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించి మరో వీడియోని షేర్ చేసింది. ఫోల్డబుల్ ప్రోటోటైప్ డబుల్ ఫోల్డింగ్ డిజైన్‌తో వస్తోంది. అయితే ఈ ఫోన్ ఫీచర్లు, తదితర వివరాలను వెల్లడించలేదు.
కాగా ఈ ఫోన్‌కు సంబంధించి షావోమి వైస్ ప్రెసిడెంట్ వాంగ్ చాంగ్ ఈ ఏడాది జనవరిలో ఒక వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా 10 సెకన్ల నిడివిగల మరో వీడియో టీజర్‌ను కంపెనీ షేర్ చేసింది. ఫీచర్లు, ధర వివరాలపై అధికారికంగా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ సినిమా లెవల్లో టీజర్లు, రిలీజ్ డేట్ అంటూ భారీ హైప్ మాత్రం క్రియేట్ చేస్తోంది.
2019 రెండవ త్రైమాసికంలో దీన్ని లాంచ్ చేయనుందని తెలుస్తోంది. ఇక ధర విషయానికి వస్తే.. లక్షా 37వేల రూపాయల వరకు ధర నిర్ణయించవచ్చని అంచనా. ఫ్లాట్, డబుల్ ఫోల్డబుల్ డిజైన్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ రానుంది. అంతేకాదు ఇప్పటి వరకు వచ్చిన ఇతర ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లకు ఇది పూర్తిగా విభిన్నంగా ఉండనుందట.
Comments
Please login to add a commentAdd a comment