సాక్షి, న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు షావోమి తన దూకుడును మరింత పెంచేస్తోంది. 2021 ఏడాదిలో కొత్తగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయనుందని తెలుస్తోంది. మూడు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లతో 2021లో హల్ చల్ చేయనుంది. అవుట్-ఫోల్డింగ్, ఇన్-ఫోల్డింగ్ మరియు క్లామ్‌షెల్ వంటి డిజైన్లతో ఆవిష్కరిస్తుందని భావిస్తున్నారు.అనలిస్ట్ రాస్ యంగ్ అందించిన సమాచారంప్రకారం మూడు వేర్వేరు డిజైన్లలో షావోమి మెయిన్ స్ట్రీమ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయబోతోంది. ఈ అవుట్-ఫోల్డింగ్ ఫోల్డబుల్ ఫోన్ హువావే మేట్ ఎక్స్ లాగా ఉంటుందని యంగ్ అంచనావేశారు.
అవుట్-ఫోల్డింగ్, ఇన్-ఫోల్డింగ్, క్లామ్‌షెల్ వంటి డిజైన్లతో ఆవిష్కరించనుందని తెలిపారు. అంతేకాదు ఒప్పో, వివో షావోమి కూడా ఫోల్డ్‌బుల్ ఫోన్లను తీసుకొస్తాయన్నారు. అంతేకాదు గూగుల్ కూడా వచ్చే ఏడాది ఆరంభంలో ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్ చేస్తుందని ఆయన పేర్కొన్నారు. మార్కెట్లోకి వచ్చే తదుపరి ఫోల్డబుల్ ఫోన్ షియోమి నుండి కావచ్చునని యంగ్ పేర్కొన్నారు. సుమారు 8 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉండే అవకాశం ఉందని ఆయన సూచించారుషావోమి ఫోల్డబుల్ ఫోన్ గురించి మనం వినడం ఇదే మొదటిసారి కాదు. స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ మరియు 108 మెగాపిక్సెల్ కెమెరా లాంటి ఫీచర్లతో సెటస్ పేరుతో ఫోల్డబుల ఫోన్ ను ఈఏడాది ఆరంభంలోతీసుకొస్తుందని పలు నివేదికలు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతానికి సెటస్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఆవిష్కారం ఎలాంటి స్పష్టత లేదు.
Comments
Please login to add a commentAdd a comment