దేశ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లోకి మరో మడత ఫోన్ వచ్చేస్తోంది. ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ వివొ గ్రేటర్ నోయిడాలోని కర్మాగారంలో తయారైన తన లేటెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ ఎక్స్ ఫోల్డ్ 3 ప్రోను భారత్ మార్కెట్‌లో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది.
వివో తన నాలుగో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రోను గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేసిన తర్వాత, ఈ ఫోన్‌ను భారత్‌కు తీసుకురానుంది. భారత మార్కెట్లో వివో నుంచి దేశంలోకి వచ్చిన తొలి ఫోల్డబుల్ ఫోన్ ఇదే అవుతుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ తేదీని జూన్ 6గా వివో ధ్రువీకరించింది. తొలి ఫోల్డబుల్ ఫోన్ తో ప్రీమియం సెగ్మెంట్ లో శాంసంగ్, యాపిల్ సరసన చేరాలని వివో భావిస్తోంది.
వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో స్పెసిఫికేషన్లు (అంచనా)
తేలికపాటి డిజైన్‌ను మన్నికతో సమతుల్యం చేసేలా కార్బన్ హింజ్ ఫైబర్.
6.53 అంగుళాల కవర్ డిస్ ప్లే, 8.03 అంగుళాల ఇన్నర్ అమోల్డ్ ఎల్‌టీపీఓ ఫోల్డింగ్ డిస్ ప్లే
2480-2200 రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, హెచ్ డీఆర్ 10+ సపోర్ట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఎస్ఓసీ, అడ్రినో జీపీయూ
16 జీబీ వరకు ర్యామ్, 1 టీబీ యూఎఫ్ఎస్ 4.0 వరకు స్టోరేజ్
ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 4 ఆపరేటింగ్ సిస్టం
50 మెగాపిక్సెల్ అల్ట్రా-సెన్సింగ్ మెయిన్ కెమెరా, 64 మెగాపిక్సెల్ 3ఎక్స్ టెలిఫోటో లెన్స్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, వీ3 ఇమేజింగ్ చిప్
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
అంచనా ధర
వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రోను ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా విక్రయించనున్నారు. చైనాలో దీని ధర 9,999 యువాన్లుగా(సుమారు రూ.1.17 లక్షలు) ఉండగా, భారత్‌లో దీని ధర రూ.1.2 లక్షలుగా ఉండొచ్చని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment