Xiaomi Pad 6 Launched in India Price Offers Details Inside - Sakshi
Sakshi News home page

షావోమీ సరికొత్త ట్యాబ్లెట్‌ వచ్చేసింది, ధర, ఆఫర్లు ఎలా ఉన్నాయంటే?

Published Tue, Jun 13 2023 3:17 PM | Last Updated on Tue, Jun 13 2023 4:36 PM

Xiaomi Pad 6 launched in India Price offers details inside - Sakshi

చైనా స్మార్ట్‌మేకర్‌  షావోమీ కొత్త ట్యాబ్లెట్‌ను లాంచ్‌ చేసింది. హైఎండ్ ఫీచర్స్‌తో షావోమీ ప్యాడ్ 6  మోడల్‌ను తీసుకొచ్చింది. షావోమీ ప్యాడ్ 5   అప్‌గ్రేడ్ వేరియంట్‌గా  ఆల్ మెటల్ డిజైన్‌తో దీన్ని ఆవిష్కరించింది.

 ధర, ఆఫర్‌
షావోమీ ప్యాడ్ 6 రెండు వేరియంట్లలో  లభిస్తుంది. 6జీబీ ర్యామ్ , 128జీబీ స్టోరేజ్ ధర రూ.26,999గా నిర్ణయించింది.అలాగే  8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.28,999. జూన్ 21న సేల్ ప్రారంభం. షావోమీ ఆన్‌లైన్ స్టోర్లతోపాటు,అమెజాన్‌లో లభిస్తుంది.  (స్టార్‌ క్రికెటర్‌ కోహ్లీ పార్టనర్‌, ఈ బిలియనీర్‌ గురించి తెలుసా? నెట్‌వర్త్‌ ఎంతంటే?)

ఇక ఆఫర్‌ విషయానికి వస్తే..ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారికి రూ.3,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.ఫలితంగా షావోమీ ప్యాడ్ 6 ట్యాబ్లెట్ 6జీబీ+128జీబీ వేరియంట్‌ రూ.23,999కు,  8జీబీ+256జీబీ వేరియంట్‌ రూ.26,999 ధరకు  కొనుగోలుచేయవచ్చు. 

షావోమీ ప్యాడ్ 6 స్పెసిఫికేషన్స్
11 అంగుళాల 2.8K ఎల్‌సీడీ డిస్‌ప్లే 
144Hz రిఫ్రెష్ రేట్‌, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 స్క్రీన్ ప్రొటెక్షన్
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్ 13 + ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌
HDR10+, డాల్బీ విజన్ ఫీచర్స్ 
13 ఎంపీ  రియర్ కెమెరా 
8 ఎంపీ సెల్పీ కె కెమెరా 
8,840mAh బ్యాటరీ 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement