ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ త్వరలోనే మరో అద్భుతమైన టెక్నాలజీని ఆవిష్కరించనుంది. స్మార్ట్‌ఫోన్లనుపయోగించి ముందుగానే భూకంపాలను గుర్తించగల టెక్నాలజీని షావోమీ అభివృద్ధి చేస్తోంది. అందుకు సంబంధించిన పేటెంట్ హక్కులను షావోమీ రిజిస్టర్ చేసింది. ‘ మెథడ్ అండ్ ఎక్విప్‌మెంట్ ఫర్ రియలైజింగ్ సెసిమిక్ మానిటరింగ్ ఆఫ్ మొబైల్ డివైజెస్’ పేరిట ఒక రిపోర్ట్‌ను షావోమీ ప్రచురించింది. భూకంపాలను గుర్తించడంలో ఈ టెక్నాలజీ ఉపయోగించబడుతుందని గిజ్మోచైనా నివేదించింది.
చదవండి: SpaceX: చీకటి పడటాన్ని ఆకాశం నుంచి చూశారా?
ఈ టెక్నాలజీలో భాగంగా స్మార్ట్‌ఫోన్స్ గుర్తించిన డేటాను భూకంప ప్రాసెసింగ్ యూనిట్‌కు బదిలీచేస్తోంది. అంతేకాకుండా స్మార్ట్‌ఫోన్లలో ఏర్పాటుచేసిన టెక్నాలజీతో ముందుగానే భూకంపాలను గుర్తించడంతో పాటు, హెచ్చరికలను కూడా జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ టెక్నాలజీతో భూకంప తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. గతంలో షావోమీ సౌండ్‌నుపయోగించి స్మార్ట్‌ఫోన్లను ఛార్జ్ చేసే పేటెంట్‌ను కూడా తీసుకున్న విషయం తెలిసిందే.
చదవండి: క్రిప్టోకరెన్సీ నుంచి పొంచి ఉన్న పెనుముప్పు...!
Comments
Please login to add a commentAdd a comment