UPI Plugin: యూపీఐ చెల్లింపులు అమలులోకి వచ్చిన తరువాత జేబులో డబ్బు పెట్టుకునే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. దీంతో ఫోన్‌పే, గూగుల్ పే వంటి ఆన్‌లైన్ ట్రాన్సక్షన్ యాప్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. ఈ రోజు మొబైల్ నెంబర్ టైప్ చేసి కూడా అమౌంట్ పంపించేస్తున్నాము. కాగా ఈ రెండు యాప్‌లకి ఓ కొత్త టెక్నాలజీ సవాళ్ళను విసురుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం.. ఫోన్‌పే, గూగుల్ పే వంటి వాటికి సరైన ప్రత్యర్థిగా నిలువడానికి 'యూపీఐ ప్లగిన్' (UPI Plugin) అందుబాటులోకి రానుంది. దీనిని మర్చెంట్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్ (SDK) అని కూడా పిలుస్తారు. దీని ద్వారా పేమెంట్స్ యాప్ అవసరం లేకుండానే సులభంగా అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అంటే అమౌంట్ చెల్లించడానికి థర్డ్ పార్టీ అవసరం లేదని స్పష్టమవుతోంది.
ఉదాహరణకు మనం ఎప్పుడైనా జొమాటో లేదా స్విగ్గీ వంటి వాటిలో ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలంటే అమౌంట్ చెల్లించడానికి యూపీఐ ఆప్సన్ ఎంచుకుంటాము. ఇలా చేసినప్పుడు కొన్ని సార్లు ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే యూపీఐ ప్లగిన్ దీనికి చెక్ పెట్టనున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: అక్కడ అద్దె తెలిస్తే అవాక్కవుతారు.. ఆఫీస్ రెంట్ నెలకు ఎన్ని కోట్లంటే?
పేటీఎమ్, రేజర్‌పే, జస్‌పే వంటివి ఎస్డీకేను ఎనేబుల్ చేసుకొనేందుకు మర్చంట్స్‌కు అవకాశం కల్పిస్తున్నాయి. దీంతో సక్సెస్ రేటు 15 శాతం పెరుగుతుందని అంచనా. ఇది అమలులోకి వచ్చిన తరువాత తప్పకుండా వినియోగదారుల సంఖ్య పెరుగుతుంది. దీంతో ఫోన్‌పే, గూగుల్ పే ఆదరణ తగ్గే అవకాశం ఉంటుంది.
ఇదీ చదవండి: పొట్టి మొక్కతో పుట్టెడు లాభాలు.. నెలకు రూ. 4 లక్షలు పక్కా!
ప్రస్తుతం ఫోన్‌పే మార్కెట్ వాటా 47 శాతం, గూగుల్ పే వాటా 33 శాతం వరకు ఉంది. అయితే స్విగ్గి, జొమాటో, ఫ్లిప్‌కార్ట్, మింత్రా వంటి సంస్థలు ఈ కొత్త వ్యవస్థకు మారితే మిగిలిన యాప్స్ సంగతి అధోగతి అయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ కొత్త టెక్నాలజీ వినియోగదారులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment