యూపీఐ పేమెంట్స్‌లో కొత్త రూల్స్‌.. అవేంటో మీకు తెలుసా? | New Year 2024: New Regulations And Changes In UPI Transactions That Come Effect From January 1, Check Details - Sakshi
Sakshi News home page

UPI Transactions New Rules 2024: గూగుల్‌పే,ఫోన్‌ పే వినియోగిస్తున్నారా?

Published Tue, Jan 2 2024 12:07 PM | Last Updated on Tue, Jan 2 2024 12:54 PM

New Regulations And Changes In Upi Transactions Effect From January 1 - Sakshi

యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ ఫేస్‌ పేమెంట్స్‌ వినియోగదారులకు ముఖ్య గమనిక. ఆర్‌బీఐ జనవరి 1, 2024 నుంచి యూపీఐ పేమెంట్‌ అకౌంట్‌ ఐడీల నిబంధనల్ని మార్చింది. వాటికి అనుగుణంగా లేని యూపీఐ పేమెంట్స్‌ అకౌంట్‌ ఐడీల రద్దుతో పాటు రోజూవారి లిమిట్‌ను పెంచింది. దీంతో పాటు కొన్ని మార్పులు చేసింది. అవేంటో తెలుసుకుందాం పదండి.  

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)  గూగుల్‌ పే, పేటీఎం, ఫోన్‌ పేతో పాటు ఇతర పేమెంట్‌ యాప్స్‌ ఏడాది కంటే ఎక్కువ కాలం యాక్టీవ్‌గా లేని యూపీఐ ఐడీలను డీయాక్టీవ్‌టే చేయాలని బ్యాంకులను కోరింది. 

ఎన్‌పీసీఐ ప్రకారం..యూపీఐ లావాదేవీల రోజువారీ చెల్లింపు పరిమితి గరిష్టంగా 1 లక్ష వరకు చేసుకోవచ్చు. అయితే, డిజిటల్‌ పేమెంట్స్‌ను ప్రోత్సహించేలా ఆర్‌బీఐ డిసెంబర్ 8, 2023 నుంచి ఆసుపత్రులు, విద్యా సంస్థలకు యూపీఐ చెల్లింపుల లావాదేవీ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచింది.

ఆన్‌లైన్ వాలెట్లను ఉపయోగించి రూ. 2,000 కంటే ఎక్కువ నగదు మర్చంట్‌ ట్రాన్సాక్షన్‌లపై మాత్రమే 1.1 శాతం ఇంటర్‌చేంజ్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది సాధారణ యూపీఐ వినియోగదారులకు వర్తించదు.   

యూపీఐ పేమెంట్స్‌ వినియోగం పెరిగే కొద్ది ఆర్ధిక నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీన్ని అరికట్టేందుకు ఆర్‌బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉదాహరణకు మీ ఫోన్‌పే నెంబర్‌ నుంచి తొలిసారిగా మరో కొత్త ఫోన్‌పే నెంబర్‌కు రూ.2వేల కంటే ఎక్కువ మొత్తంలో నగదు పంపిస్తే.. ఆ నగదు వెళ్లేందుకు 4 గంటల సమయం పట్టనుంది. అది ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. 

మనం ఇప్పటి వరకు ఏదైనా కిరాణా స్టోర్‌లో యూపీఐ పేమెంట్స్‌ చేయాలంటే స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు నియర్‌ ఫీల్డ్‌ కమ్యూనికేషన్‌ (NFC) సాయంతో పేమెంట్‌ చేసుకునే సౌకర్యం కలగనుంది. అయితే ఇందుకోసం యూపీఐలలో ఎన్‌ఎఫ్‌సీ ఫీచర్‌ను తప్పని సరి

త‍్వరలో మనం కొత్త రకం ఏటీఎంలను చూడబోతున్నాం. ప్రస్తుతం ఏదైనా బ్యాంక్‌ డెబిట్‌ కార్డ్‌ను వినియోగించి ఏటీఎం మెషిన్‌ నుంచి డబ్బుల్ని డ్రా చేయడం సర్వసాధారణం. ఇకపై అలాగే ఫోన్‌లో యూపీఐ ఐడీని ఉపయోగించి యూపీఐ ఏటీఎంలో డబ్బుల్ని స్కాన్‌ చేసి డబ్బుల్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం ఆర్‌బీఐ జపాన్‌ కంపెనీ హిటాచీతో ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలో అందుబాటులోకి రానుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement