Google Pay
-
గూగుల్ పే, ఫోన్‌పేకి ఎన్పీసీఐ ఊరట
ఫోన్‌పే, గూగుల్ పేలాంటి యూపీఐ యాప్‌లకు ఊరటనిచ్చే దిశగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్ణయం తీసుకుంది. థర్డ్ పార్టీ ఏకీకృత చెల్లింపుల విధానం (UPI) యాప్‌ల ద్వారా జరిగే లావాదేవీల పరిమాణంలో నిర్దిష్ట యాప్‌ల వాటా 30 శాతానికి మించరాదన్న ప్రతిపాదనను మరో రెండేళ్లు పెంచింది. 2026 డిసెంబర్ 31 వరకు పొడిగించినట్లు వెల్లడించింది.ప్రస్తుతం యూపీఐ లావాదేవీల్లో గూగుల్ పే, ఫోన్‌పేలాంటి థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్ల (TPAP) వాటా 80 శాతం స్థాయిలో ఉంటోంది. ఈ పరిమితిని క్రితం మూడు నెలల్లో నమోదైన మొత్తం యూపీఐ లావాదేవీల ప్రాతిపదికన లెక్కిస్తారు. మరోవైపు, వాట్సాప్ పే యాప్ మరింత మంది యూజర్లను చేర్చుకునేందుకు వీలు కల్పిస్తూ ఎన్పీసీఐ పరిమితిని తొలగించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. దీంతో వాట్సాప్ పే ఇకపై దేశవ్యాప్తంగా తమకున్న యూజర్లందరికీ యూపీఐ సర్వీసులను అందించేందుకు వీలవుతుంది. గతంలో వాట్సాప్ పే దశలవారీగా యూపీఐ యూజర్లను పెంచుకునే విధంగా పరిమితి విధించింది. ఇది 10 కోట్ల యూజర్లుగా ఉండేది.ఆన్లైన్ చెల్లింపుల్లో కొన్ని థర్డ్‌పార్టీ యాప్‌లే ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నాయి. దాంతో కొన్ని లాభాలతోపాటు నష్టాలు కూడా ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.సానుకూల పరిణామాలుసులువుగా లావాదేవీలు..రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పూర్తి కేవైసీతో ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్(PPI)ను థర్డ్ పార్టీ యుపీఐ యాప్స్‌కు అనుసంధానించడానికి అనుమతించింది. ఇది లావాదేవీలను మరింత అంతరాయం లేకుండా సౌకర్యవంతంగా చేస్తుంది.మరింత చేరువగా..ఎక్కువ మంది డిజిటల్ చెల్లింపు వ్యవస్థలను యాక్సెస్ చేయవచ్చు. ఇది బ్యాంకింగ్ లేని లేదా బ్యాంకింగ్ వ్యవస్థ ఎక్కువగా అందుబాటులోలేని వారికి ఎంతో ఉపయోగపడుతుంది.సౌలభ్యంగా..వినియోగదారులు తమ డిజిటల్ వాలెట్లను (పేటీఎం, ఫోన్ పే..) ఉపయోగించిన సౌకర్యవంతంగా చెల్లింపులు చేయవచ్చు.ఇదీ చదవండి: 2024లో కార్ల అమ్మకాలు ఎలా ఉన్నాయంటే..ప్రతికూల పరిణామాలుమార్కెట్ ఆధిపత్యంకొన్ని థర్డ్ పార్టీ యాప్‌ల(ఫోన్ పే, గూగుల్ పే.. వంటివి) ఆధిపత్యం ద్వంద్వ ధోరణికి దారితీస్తుంది. ఇది డిజిటల్ పేమెంట్ మార్కెట్లో పోటీని, సృజనాత్మకతను తగ్గిస్తుంది.సాంకేతిక సవాళ్లుకొన్ని థర్డ్‌పార్టీ యాప్‌లనే అధికంగా వినియోగించడం వల్ల భవిష్యత్తులో ఏదైనా సాంకేతిక అవాంతరాలు జరిగితే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది.విదేశీ యాజమాన్యంఈ యాప్‌లు చాలా వరకు విదేశీ యాజమాన్యంలో ఉన్నాయి. వాల్‌మార్ట్ ఆధ్వర్యంలో ఫోన్‌పే, గూగుల్ - గూగుల్ పే.. వంటివాటిని నిర్వహిస్తున్నాయి. స్థానికంగా జరిగే డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాలపై విదేశీ నియంత్రణకు సంబంధించి ఆందోళనలకు దారితీస్తుంది. -
జీపేలో నిమిషానికి రూ.1.. నెలకు రూ.40 వేలు!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మోసాలు, వేధింపులు అధికమవుతున్నాయి. ఇటీవల ఓ యువతి తన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని విభిన్న ప్లాట్ఫామ్ల్లో తనను బ్లాక్ చేసింది. అయినా అతడు ఇటీవల గూగుల్‌పే ద్వారా తనను వేధిస్తున్నట్లు యువతి పోస్ట్ చేసింది. గూగుల్‌పే యాప్‌లో ప్రతి నిమిషానికి రూ.1 పంపిస్తూ తనను వేధిస్తున్నట్లు చెప్పింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అదికాస్తా వైరల్‌గా మారింది.ఆయుషి అనే యువతి చేసిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘జీపే ద్వారా నిమిషానికి రూ.1 చొప్పన 30 రోజుల్లో 43,800 నిమిషాల్లో రూ.40,000 కంటే ఎక్కువే సంపాదించవచ్చు. మీ ఇద్దరి మధ్య గతంలో ఎలాంటి రిలేషన్షిప్ ఉన్నా దాన్ని మీరు వదిలించుకోవాలనుకున్నారు. సింపల్‌గా ఇగ్నోర్ చేయండి. కానీ మీ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌ను గూగుల్‌పేలో బ్లాక్ చేయవద్దు. ఎందుకంటే మీరు దాని ద్వారా నెలకు రూ.40 వేలు సంపాదిస్తారు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘మీరు కొంత డబ్బు సమకూర్చుకోండి. తర్వాత గూగుల్‌పేలో కూడా తనను బ్లాక్ చేయండి’ అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు.ఇదీ చదవండి: నకిలీ షాపింగ్ వెబ్సైట్లు.. తస్మాత్ జాగ్రత్త!ఏదేమైనా ప్రతి రిలేషన్‌షిప్‌కు ఇద్దరి అంగీకారం అవసరం. అందుకు ఏ కారణంతోనైనా ఒకరికి ఇష్టం లేదంటే వేరొకరు దాన్ని గౌరవించి అందుకు అనుగుణంగా వ్యవహరించాలి. కానీ ఏ విధమైన వేధింపులకు పాల్పడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. టెక్నాలజీని మంచికే వినియోగించుకోవాలని చెబుతున్నారు. -
గూగుల్‌పేలో గోల్డ్ లోన్..
గూగుల్‌కు చెందిన మొబైల్ పేమెంట్ సర్వీస్ యాప్ గూగుల్‌పే (google Pay) కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. యాజర్ల కోసం కొత్త గోల్డ్ లోన్ స్కీమ్‌ను ప్రారంభించింది. ఇందుకోసం గోల్డ్ లోన్లలో ప్రత్యేకత కలిగిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అయిన ముత్తూట్ ఫైనాన్స్‌తో గూగుల్ ఇండియా భాగస్వామ్యాన్ని ప్రకటించింది.దీంతో చిరు వ్యాపారులు, ఇతర కస్టమర్లు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు గూగుల్‌పే ద్వారా సులభంగా బంగారు ఆభరణాలపై రుణాలను పొందవచ్చు. గోల్డ్ లోన్ల కోసం మరో ఎన్బీఎఫ్సీ ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్‌తో కూడా గూగుల్‌పే జట్టు కట్టింది. గూగుల్‌పే అందిస్తున్న ఈ ఫీచర్‌తో వినియోగదారులు క్రెడిట్ రిపోర్ట్ లేదా విస్తృతమైన డాక్యుమెంటేషన్ సమర్పించాల్సిన అవసరం లేకుండానే రూ. 50 లక్షల వరకు లోన్ తీసుకోవడానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.బంగారు ఆభరణాలపై రుణాలు తీసుకుంటున్నవారిలో 80 శాతం కంటే ఎక్కువ మంది టైర్-2 నగరాలు, చిన్న పట్టణాలకు చెందినవారే ఉంటున్నారు. ఇక్రా ప్రకారం.. వ్యవస్థీకృత గోల్డ్ లోన్ మార్కెట్ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షల కోట్లను అధిగమిస్తుందని, 2027 మార్చి నాటికి రూ. 15 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా. -
జీపే ద్వారా ‘బంగారు’ రుణాలు
న్యూఢిల్లీ: దేశీయంగా కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తాజాగా పేర్కొంది. దీనిలో భాగంగా మొబైల్ చెల్లింపుల ప్లాట్‌ఫామ్ జీపే బంగారు ఆభరణాలపై రుణాలు అందించనున్నట్లు పేర్కొంది. ఇందుకు ముత్తూట్ ఫైనాన్స్‌తో చేతులు కలిపినట్లు వెల్లడించింది. అంతేకాకుండా ఏఐ అసిస్టెంట్ జెమినీ లైవ్‌ను హిందీ భాషలో ప్రారంభించినట్లు తెలియజేసింది. తదుపరి దశలో మరో 8 ప్రాంతీయ భాషలలో జెమినీ సేవలు లభ్యంకానున్నట్లు వెల్లడించింది. గూగుల్ ఫర్ ఇండియా 10వ సదస్సులో ఇంకా పలు విషయాలను తెలియజేసింది. వీటి ప్రకారం దేశవ్యాప్తంగా ప్రజలు చౌక వడ్డీ రేట్లలో గోల్డ్ లోన్ సౌకర్యాన్ని వినియోగించుకొవచ్చు. ఇందుకు రుణగ్రహీతలకు సౌకర్యవంతమైన అవకాశాలను కల్పిస్తోంది. మరోపక్క రుణదాతలకు సెక్యూరిటీని అందిస్తోంది. కాగా.. ప్రపంచ పసిడిలో ఇండియా వాటా 11 శాతమని గూగుల్ ఇండియా ఎండీ రోమ దత్త చోబే తెలియజేశారు. తెలుగులోనూ.. ఏఐ అసిస్టెంట్ జెమినీ లైవ్ యూజర్లలో 40శాతానికిపైగా వాయిస్ ద్వారానే సేవలను వినియోగించుకుంటున్నట్లు గూగుల్ ఇండియా ప్రొడక్ట్ మేనేజ్మెంట్ సీనియర్ డైరెక్టర్ హేమ బూదరాజు పేర్కొన్నారు. ప్రస్తుతం హిందీ భాషలో జెమినీ లైవ్‌ను ఆవిష్కరించినట్లు తెలియజేశారు. రానున్న రోజుల్లో తెలుగుసహా మలయాళం, తమిళ్, బెంగాలీ, కన్నడ, గుజరాతీ, మరాఠీ, ఉర్దూ భాషలలో ఏఐను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. గూగుల్ సెర్చ్ లో జెన్–ఏఐ ఆధారిత ఏఐ ఓవర్వ్యూను ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేశారు. ఈ గూగుల్ సెర్చ్‌ను తెలుగు, తమిళ్, బెంగాలీ, మరాఠీ భాషలలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. రానున్న రెండు నెలల్లో దేశీయంగా జెమినీ ఫ్లాష్ 1.5ను ఆవిష్కరించనున్నట్లు గూగుల్ వెల్లడించింది. దీంతో వివిధ సంస్థలు క్లౌడ్, ఏఐ సొల్యూషన్లను భద్రంగా అమలు చేయవచ్చని తెలిపింది. తద్వారా డేటాను భద్రపరచుకోవడంతోపాటు.. దేశవ్యాప్తంగా మెషీన్ లెరి్నంగ్ ప్రాసెస్‌కు తెరతీయవచ్చని వివరించింది. 2025లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు పేర్కొంది. -
ఒకేసారి రూ.5 లక్షలు: ఎన్సీపీఐ కీలక నిర్ణయం
గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత డిజిటల్ పేమెంట్స్ ఎక్కువయ్యాయి. ఇప్పటి వరకు యూపీఐ పేమెంట్స్ రోజుకు/ఒకసారికి ఒక లక్ష మాత్రమే పంపించుకోవడానికి అవకాశం ఉండేది. తాజాగా ఈ పరిమితిని పెంచుతూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NCPI) కీలక ప్రకటన వెల్లడించింది.ఎన్సీపీఐ ప్రకారం రేపటి (సెప్టెంబర్ 16) నుంచి రోజుకు లేదా ఒకసారికి గరిష్టంగా ఐదు లక్షల రూపాయల వరకు పంపించుకోవచ్చు. దీంతో యూజర్లు ఆసుపత్రి బిల్లులు, విద్యాసంస్థల ఫీజులకు సంబంధించిన పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఐపీఓకు అప్లై చేసుకునేటప్పుడు రూ. 5 లక్షలు పేమెంట్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు అన్నివిధాలా చాలా అనుకూలంగా ఉంటుంది.ఇదీ చదవండి: సైబర్ మోసాలకు ఇన్సూరెన్స్: రోజుకు మూడు రూపాయలే.. -
పోటీలోకి మరో యూపీఐ యాప్
న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థలో యూపీఐ చెల్లింపులదే అగ్రస్థానం. ఇప్పటికే పలు యూపీఐ యాప్‌లు యూజర్లకు సేవలందిస్తున్నాయి. ఇప్పుడీ పోటీలోకి మరో యాప్ వచ్చింది. వినియోగదారులు డిజిటల్ చెల్లింపులు జరిపేందుకు వీలు కల్పించేలా ఫిన్‌టెక్ ప్లాట్‌ఫాం భారత్‌పే తాజాగా యూపీఐ టీపీఏపీని (థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్) ఆవిష్కరించింది.ఇందుకోసం యూనిటీ బ్యాంకుతో జట్టుకట్టినట్లు తెలిపింది. ఈ సేవల కోసం కస్టమర్లు భారత్‌పే యాప్‌లో @bpunity ఎక్స్‌టెన్షన్‌తో తమ యూపీఐ ఐడీని క్రియేట్ చేసుకుని ఇటు వ్యక్తులకు అటు వ్యాపార వర్గాలకు చెల్లింపులు జరపవచ్చని పేర్కొంది. కంపెనీ ఇప్పటివరకు వ్యాపారవర్గాల మధ్య యూపీఐ చెల్లింపుల కోసం భారత్‌పే ఫర్ బిజినెస్ యాప్‌ను నిర్వహిస్తోంది.తాజాగా తమ బై–నౌ–పే–లేటర్ యాప్ ’పోస్ట్‌పే’ పేరును ’భారత్‌పే’గా మార్చి వినియోగదారుల చెల్లింపుల సేవల కోసం మరో యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతానికి ఇది ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలో యాపిల్ డివైజ్‌లకు సంబంధించిన యాప్స్టోర్లోనూ అందుబాటులోకి రానుంది. -
యూపీఐ పేమెంట్స్‌లో కీలక మార్పులు..!
డిజిటల్ చెల్లింపుల యుగంలో యూపీఐ (UPI - యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) వినియోగం వేగంగా పెరుగుతోంది. చాలా మంది ఇప్పుడు నగదు లావాదేవీల కంటే యూపీఐ పేమెంట్స్‌నే ఎక్కువగా చేస్తున్నారు. అయితే ఇదే క్రమంలో యూపీఐ మోసాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి.యూపీఐ పేమెంట్స్ భద్రతకు సంబంధించి ప్రస్తుతం పిన్ (PIN) ఆధారిత ధ్రువీకరణ విధానం ఉంది. పేమెంట్స్ ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రతిసారి పిన్ నంబర్ ఎంటర్ చేసి ధ్రువీకరించాల్సి ఉంటుంది. అయినప్పటికీ కొన్నిసార్లు మోసాలు జరగుతున్నాయి. దీనిపై దృష్టిసారించిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మరో కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతోంది.బయోమెట్రిక్ ధ్రువీకరణ!సీక్రెట్ పిన్ నంబర్‌ను తెలుసుకుని మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఎన్పీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మింట్ నివేదిక ప్రకారం.. పిన్ ఆధారిత ధ్రువీకరణ ప్రక్రియకు బదులుగా బయోమెట్రిక్ ధ్రువీకరణను తీసుకురానుంది. ఈ కొత్త విధానంలో యూపీఐ లావాదేవీలను వేలిముద్ర స్కానింగ్ లేదా ఫేస్ ఆథెంటికేషన్ ద్వారా ధ్రువీకరించాల్సి ఉంటుంది. స్మార్ట్ఫోన్లలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్లను ఉపయోగించి యూపీఐ చెల్లింపులను మరింత సురక్షితంగా, సులభంగా చేసే విధానంపై ఎన్పీసీఐ కసరత్తు చేస్తోంది. -
ఫోన్ పే, జీపే, పేటీఎం.. ద్వారా విద్యుత్తు బిల్లు చెల్లించకూడదు
ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం..వంటి థర్డ్‌పార్టీ యాప్‌ల ద్వారా ఎలాంటి విద్యుత్తు బిల్లులు చెల్లించకూడదని టీజీఎస్పీడీసీఎల్ తెలిపింది. జులై 1 నుంచి ఈ నిబంధన అమలులోకి వచ్చిందని చెప్పింది. భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. భవిష్యత్తులో టీజీఎస్పీడీసీఎల్ లేదా ఎస్పీడీసీఎల్ అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే విద్యుత్తు బిల్లులు చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో వివరాలు వెల్లడించింది.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..‘ఎస్పీడీసీఎల్ పరిధిలో 85 శాతానికి పైగా పవర్ బిల్లు చెల్లింపులు థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ల (టీపీఏపీ) ద్వారానే జరుగుతున్నాయి. ఇందుకోసం కొన్ని యూపీఐ ఆధారిత యాప్‌లను మాత్రమే ఎక్కువగా వినియోగిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం..బ్యాంకు యాప్‌లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఆధ్వర్యంలోని భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్)లో నమోదవ్వాలి. కానీ చాలా థర్డ్ పార్టీ యాప్‌లకు సేవలందిస్తున్న బ్యాంకులు ఇంకా ఈ సిస్టమ్‌ను యాక్టివేట్ చేసుకోలేదు. దాంతో సదరు చెల్లింపులను నిలిపేస్తున్నాం’ అని తెలిపారు.Dear Consumers, As per the RBI directions, the Service Providers viz., PhonePe, Paytm, Amazon Pay, Google Pay and Banks have stopped to accept the electricity bills of TGSPDCL w.e.f. 01/07/2024. Hence, all the consumers are requested to make the monthly current bill payments…— TGSPDCL (@tgspdcl) July 1, 2024ఆర్బీఐ నిబంధనలు..జులై 1 నుంచి ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఆధ్వర్యంలోని భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్) ద్వారానే చెల్లింపులు చేయాలని పేర్కొంది. వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఇందులో భాగంగా యూపీఐ సేవలందించే బ్యాంకులు బీబీపీఎస్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. కానీ ఇప్పటివరకు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు ఈ సిస్టమ్‌ను ఎనేబుల్ చేసుకోలేదు. దానివల్ల ఫోన్‌పే, గూగుల్ పే, అమెజాన్ పే.. వంటి థర్డ్‌పార్టీ యాప్‌ల్లో బిల్లులు చెల్లించలేరు. ఆ యాప్‌ల ద్వారా క్రెడిట్ కార్డుల నుంచి కూడా బిల్లు పేమెంట్ చేయలేరు.ఇదీ చదవండి: హెచ్డీఎఫ్సీ యూపీఐ సేవలు నిలిపివేత.. ఎప్పుడంటే..ఇదిలాఉండగా ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ బ్యాంకులు బీబీపీఎస్ ప్లాట్ఫామ్లో నమోదయ్యాయి. కాబట్టి పైన తెలిపిన బ్యాంక్ కస్టమర్లు థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చెల్లింపులను కొనసాగించవచ్చు. -
గూగుల్ పే, ఫోన్ పే ఇక అవసరం లేదు..మీ అర చేయి చూపిస్తే చాలు !
-
'ఇప్పుడు కొనండి.. తరువాత చెల్లించండి'.. గూగుల్ పే కొత్త ఫీచర్
ప్రముఖ యూపీఐ పేమెంట్స్ యాప్ 'గూగుల్ పే' తన వినియోగదారులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఆన్లైన్ పేమెంట్స్ మరింత సులభతరం చేసేందుకు మూడు సరికొత్త ఫీచర్స్ పరిచయం చేసింది. అవి "రివార్డ్స్, బై నౌ పే లేటర్, సెక్యూరిటీ ఫీచర్.రివార్డ్లుప్రస్తుతం క్రెడిట్ కార్డ్‌ల వినియోగం పెరిగిపోయింది. అయితే కార్డులను ఉపయోగించడం ద్వారా వినియోగదారులు కొన్ని ప్రయోజనాలను పొందుతారు. దీని కోసం తనిఖీ చేయడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి గూగుల్ పే పరిచయం చేసిన ఈ కొత్త ఫీచర్ ముందుగానే రివార్డ్‌లు గురించి చూపిస్తుంది.ఇప్పుడే కొనండి తర్వాత చెల్లించండిఇప్పుడు కొనండి.. మళ్ళీ చెల్లించండి అనే స్కీమ్ ఒకప్పుడు కొన్ని కార్ల కంపెనీలు అందుబాటులోకి తెచ్చాయి. సరిగ్గా ఇలాంటి ఫీచర్ గూగుల్ పే పరిచయం చేసింది. వస్తువులను కొనుగోలు వినియోగదారు పూర్తి మొత్తాన్ని అప్పుడే చెల్లించకుండా.. మళ్ళీ చెల్లించవచ్చు. లేదా వాయిదాల రూపంలో కూడా చెల్లించవచ్చు. దీని కోసం అమౌంట్ చెల్లించే సమయంలోనే.. ఈ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ సదుపాయం అమెరికాలో అందుబాటులో ఉంది. మన దేశంలో ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియాల్సి ఉంది.సెక్యూరిటీ ఫీచర్ఆన్లైన్ పేమెంట్ చేసే సమయంలో మరింత సురక్షితమైన లావాదేలీల కోసం గూగుల్ పే ఆటోఫిల్ ఆప్షన్ తీసుకువచ్చింది. ఇది వేలిముద్ర, స్క్రీన్ లాక్ PIN లేదా ఫేస్ స్కాన్ ద్వారా సేవ్ చేసిన కార్డ్ వివరాలను ఆటోమేటిక్‌గా ఇన్పుట్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. -
జూన్ 4 తర్వాత 'గూగుల్ పే' బంద్.. ఎక్కడంటే?
ఆన్లైన్ పేమెంట్ యాప్‌లలో అత్యంత ప్రజాదరణ పొందిన 'గూగుల్ పే' (Google Pay) చాలా దేశాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అయితే ఈ సర్వీస్ (గూగుల్ పే) జూన్ నాలుగు తరువాత నిలిపివేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని గూగుల్ గతంలోనే వెల్లడించింది.ఇండియా, సింగపూర్ మినహా జూన్ 4 తరువాత గూగుల్ పే సేవలు పూర్తిగా నిలిచిపోతాయి. దీని స్థానంలో గూగుల్ వాలెట్ వస్తుంది. అమెరికాలో గూగుల్ పే కంటే 'గూగుల్ వాలెట్' ఎక్కువమంది ఉపయోగిస్తున్న కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సేవలు భారత్, సింగపూర్ దేశాల్లో యధివిధాగా కొనసాగుతాయి. కాబట్టి గూగుల్ పే ఉపయోగించే భారతీయ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.2024 జూన్ 4 వరకు వినియోగదారులు గూగుల్ పే ఉపయోగించుకోవచ్చు, గడువు తీరిన తరువాత అమెరికన్ యూజర్లు అమౌంట్ సెండ్ చేసుకోవడానికి, రిసీవ్ చేసుకోవడానికిగానీ అవకాశం లేదు. కాబట్టి యూఎస్ఏలోని గూగుల్ పే యూజర్స్ దీనిని తప్పకుండా గమనించాలి.అమెరికాలోని గూగుల్ పే యూజర్లను గూగుల్ వాలెట్‌కి మారాలని కంపెనీ కోరింది. గూగుల్.. తన గూగుల్ వాలెట్‌ను చేసుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 'గూగుల్ పే'ను కంపెనీ సుమారు 180 దేశాల్లో గూగుల్ వాలెట్‌తో రీప్లేస్ చేసినట్లు సమాచారం. -
భారత్‌లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
న్యూఢిల్లీ: గూగుల్ తన డిజిటల్ వాలెట్ అప్లికేషన్ గూగుల్ వాలెట్‌ను భారత్‌లో విడుదల చేసింది. గూగుల్ ఈ యాప్‌ను తొలిసారి 2022లో అమెరికాలో లాంచ్ చేసింది. రెండు సంవత్సరాల తర్వాత భారత్ వినియోగదారులకు పరిచయం చేసింది. గూగుల్ వాలెట్అంటే ఏమిటి?గూగుల్ వాలెట్ వివిధ డిజిటల్ ఆస్తులను ఒకే అనుకూలమైన ప్రదేశంలో స్టోర్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. యాప్‌లో బోర్డింగ్ పాస్‌లు, లాయల్టీ కార్డ్‌లు, ఈవెంట్ టిక్కెట్లు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పాస్‌లు, గిఫ్ట్ కార్డ్‌లు ఇతర డిజిటల్ డాక్యుమెంట్లను భద్రపరుచుకోవచ్చు. గూగుల్పేపై ప్రభావం గూగుల్ వాలెట్ లాంచ్‌తో గూగుల్ పే యాప్ పనిచేస్తోందా? అనే అనుమానాలపై గూగుల్ స్పందించింది. గూగుల్ వాలెట్ వల్ల గూగుల్ పే వల్ల ఎలాంటి ప్రతి కూల ప్రభావం చూపదని గూగుల్ స్పష్టం చేసింది. గూగుల్ పేకి, గూగుల్ వాలెట్‌కి మధ్య తేడా చెల్లింపు కార్డ్‌లను గూగుల్ వ్యాలెట్‌కు అనుసంధానిస్తే.. గూగుల్ పే పనిచేసే ఎక్కడైనా ఆఫ్‌లైన్‌లో చెల్లింపులు చేయొచ్చు. ప్రధాన కంపెనీలతో భాగస్వామ్యం పీవీఆర్ ఐనాక్స్, ఫ్లిప్‌కార్ట్, ఎయిర్ ఇండియా, షాపర్స్ స్టాప్, ఇక్సిగోతో పాటు ఇతర కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు భారతదేశంలో గూగుల్ వాలెట్ ప్రారంభించిన సందర్భంగా గూగుల్ ప్రకటించింది.ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి గూగుల్ వాలెట్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. డెబిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్‌లు, లాయల్టీ కార్డ్‌లు, గిఫ్ట్ కార్డ్‌లను ఒక అనుకూలమైన ప్లాట్‌ఫారమ్‌లో నిల్వ చేయడానికి దాన్ని ఉపయోగించవచ్చు. -
ఎన్పీసీఐ సమావేశం..గూగుల్‌పే, ఫోన్‌పేకు లేని ఆహ్వానం!
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఆధ్వర్యంలోని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఇటీవల నిర్వహించిన ఓ సమావేశానికి యూపీఐ థర్డ్‌పార్టీ చెల్లింపు యాప్‌లైన గూగుల్‌పే, ఫేన్‌పేను ఆహ్వానించలేదు. క్రెడ్, స్లైస్, ఫ్యామ్‌పే, జొమాటో, గ్రో, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థల యాజమాన్యాలకు ఆహ్వానం అందింది. ఈమేరకు వివరాలు ఉటంకిస్తూ టైక్స్‌ఆఫ్‌ఇండియాలో కథనం వెలువడింది. ఎన్పీసీఐ ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా యూపీఐ చెల్లింపుల వ్యవస్థలో కొత్త సంస్థలకు ప్రోత్సాహం అందించేలా చర్చలు జరిగినట్లు తెలిసింది. పైన తెలిపిన కంపెనీలు తమ వినియోగదారులను పెంచుకుని ఇంటర్నల్ యూపీఐ సర్వీస్‌లను అందించేలా చూడాలని ఎన్పీసీఐ చెప్పింది. అయితే సమావేశానికి గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం వంటి ప్రధాన యూపీఐ చెల్లింపు యాప్ యాజమాన్యాలకు ఆహ్వానం అందలేదు. ఈ మూడు కంపెనీల యూపీఐ లావాదేవీల పరిమాణం ఇప్పటికే 90 శాతానికి చేరినట్లు తెలిసింది. దాంతో వీటిని సమావేశానికి ఆహ్వానించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యక్రమం ప్రధానంగా కొత్తగా యూపీఐ చెల్లింపుల రంగంలోకి అడుగుపెడుతున్న కంపెనీలు, స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందించడానికి ఏర్పాటు చేయబడినట్లు తెలిసింది. ఆయా కంపెనీల అవసరాలు ఏమిటో తెలుసుకుని వాటిని పరిష్కరించేలా చర్చలు జరిగినట్లు సమాచారం. సమావేశంలో భాగంగా కొత్త సంస్థలు రూపేకార్డుల కోసం ప్రభుత్వం అందిస్తున్న జీరో మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) వంటి సౌకర్యాన్ని తమకు కల్పించాలని ఎన్పీసీఐను కోరినట్లు తెలిసింది. ఇతర కార్డ్‌లతో పోల్చితే రూపేకార్డు చెల్లింపులను అంగీకరించే వ్యాపారులకు ప్రయోజనాలు అధికంగా ఉంటున్నాయి. చిన్న సంస్థలు యూపీఐ చెల్లింపుల రంగంలోకి రావాలంటే ప్రత్యేకంగా కొన్ని ప్రోత్సాహకాలు కల్పించాలని కోరినట్లు తెలిసింది. రెండు సంస్థలదే గుత్తాధిపత్యం.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు సంబంధించి అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇటీవల ఫోన్‌పే, గూగుల్పేలకు ఆదరణ పెరిగింది. యూపీఐ చెల్లింపుల్లో 2 సంస్థలదే ఆధిపత్యం కావడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విభాగంలో గుత్తాధిపత్యం లభించకుండా చూసేందుకు ఫోన్‌పే, గూగుల్‌పే సంస్థలకు ప్రత్యామ్నాయంగా దేశీయ ఫిన్‌టెక్ సంస్థల వృద్ధికి సహకరించాలని ప్రభుత్వానికి పార్లమెంటరీ కమిటీ సూచించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ఏడాదిలోపు ప్రముఖ యాప్‌లో 100 కోట్ల యూజర్లు యూపీఐ విభాగంలో కంపెనీలకు 30% మార్కెట్ వాటా పరిమితి నిబంధన గడువును 2024 డిసెంబరు వరకు పొడిగించాలని ఎన్పీసీఐ అంటోంది. సాంకేతిక పరిమితుల రీత్యా ఇది సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. -
'గూగుల్ పే' సౌండ్పాడ్ వచ్చేస్తోంది..
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో గూగుల్ సంస్థ గత ఏడాది కాలం నుంచి 'గూగుల్ పే' సౌండ్పాడ్ తీసుకురావడానికి సన్నద్ధమవుతోంది. అయితే ఇది ఎట్టకేలకు పూర్తి కావొస్తోంది. త్వరలోనే దీనిని లాంచ్ చేయనున్నట్లు టెక్ దిగ్గజం ప్రకటించింది. వ్యాపారులు చెక్అవుట్ సమయాన్ని తగ్గించడానికి గూగుల్ పే సెప్టెంబరు 2017లోనే భారత్‌లో ఆవిష్కరించింది. ఇది సురక్షితమైన డిజిటల్ చెల్లింపులను జరుపుకోడానికి అనుమతిస్తుందని గూగుల్ పే వైస్ ప్రెసిడెంట్ 'అంబరీష్ కెంఘే' ఫిబ్రవరి 22న ఒక బ్లాగ్ పోస్ట్‌లో రాశారు. గూగుల్ పే సౌండ్పాడ్ ఎలా పనిచేస్తుందంటే.. సౌండ్పాడ్ అనేది ఆడియో పరికరం, ఇది చెల్లింపు స్వీకరించబడినప్పుడు ఆడియో ద్వారా వెల్లడిస్తుంది. దీంతో వ్యాపారాలు ప్రత్యేకంగా అమౌంట్ వచ్చిందా? లేదా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డిజిటల్ చెల్లింపు చేసే కస్టమర్ తప్పకుండా.. వ్యాపారికి సంబంధించిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవాలి. అమౌంట్ పంపిన వెంటనే సౌండ్పాడ్ సౌండ్ చేస్తుంది. ఇప్పటికే మనదేశంలో పేటీఎం, ఫోన్ పే వంటివి అందించే బాక్సులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం పేటీఎం సంక్షోభంలో ఉన్న కారణంగా కస్టమర్లు గూగుల్ పే దిశగా అడుగులు వేస్తున్నారు. -
జూన్ 4 నుంచి 'గూగుల్ పే' బంద్!
ఆన్లైన్ పేమెంట్ యాప్‌లలో అత్యంత ప్రజాదరణ పొందిన 'గూగుల్ పే' (Google Pay) చాలా దేశాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అయితే 2024 జూన్ 4 నుంచి అమెరికాలో గూగుల్ పే సేవలు నిలిపివేసేందుకు గూగుల్ సిద్ధమవుతోంది. అమెరికాలో ఎక్కువమంది గూగుల్ పే కంటే 'గూగుల్ వాలెట్' ఉపయోగిస్తున్న కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. గూగుల్ వాలెట్ ద్వారా పేమెంట్ కార్డులను యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తరువాత షాపింగ్ లేదా ఇతరత్రా ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు ట్యాప్ అండ్ పే పద్దతిలో పని సులభంగా పూర్తయిపోతుంది. కేవలం ఆన్లైన్ పేమెంట్ కోసం మాత్రమే కాకుండా.. ట్రాన్సిట్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర ఐడీ కార్డ్స్ వంటి డాక్యుమెంట్ కూడా ఇందులో భద్రపరుచుకోవచ్చు. ఈ కారణంగానే అమెరికాలో గూగుల్ పే కంటే గూగుల్ వాలెట్ ఎక్కువ ఆదరణ పొందింది. గూగుల్ పేలో ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా గూగుల్ వాలెట్లో లభిస్తాయి. 2024 జూన్ 4 వరకు వినియోగదారులు గూగుల్ పే ఉపయోగించుకోవచ్చు, గడువు తీరిన తరువాత అమెరికన్ యూజర్లు అమౌంట్ సెండ్ చేసుకోవడానికి, రిసీవ్ చేసుకోవడానికిగానీ అవకాశం లేదు. కాబట్టి యూఎస్ఏలోని గూగుల్ పే యూజర్స్ దీనిని తప్పకుండా గమనించాలి. ఇదీ చదవండి: జెరోధా సీఈఓపై మండిపడుతున్న నెటిజెన్స్!.. కారణం ఇదే.. ఇండియా, సింగపూర్ వంటి దేశాల్లో గూగుల్ పే యధావిధిగా సేవలను అందిస్తుంది. అంతే కాకుండా ఆయా దేశాల్లోని యూజర్లకు కావలసిన మరిన్ని సేవలను అందించడానికి సంస్థ ఈ యాప్‌ను మరింత అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం. కాబట్టి ఇండియాలోని గూగుల్ పే యూజర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. -
పేటీఎంకు బైబై.. సంబరపడిపోతున్న ప్రత్యర్థులు!
పేటీఎంపై ఆర్బీఐ విధించిన ఆంక్షలు ఆ సంస్థను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అటు వ్యాపారం, ఇటు వినియోగదారుల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. ఫలితంగా పేటీఎం వినియోగాన్ని తగ్గించి ప్రత్యర్ధి సంస్థల యాప్‌లను వినియోగించే వారి సంఖ్య పెరిగిపోతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన ఒక రోజు తర్వాత అంటే ఫిబ్రవరి 1న పేటీఎం యాప్ రోజువారి డౌన్లోడ్లు భారీగా తగ్గాయి. ఈ సమయంలో భీమ్ యూపీఐ యాప్ డౌన్లోడ్లు 49 శాతం పెరిగాయి. గూగుల్ పే యాప్ రోజువారీ డౌన్లోడ్లు 10.6 శాతం తగ్గాయి. న్యూయార్క్‌లోని మొబైల్ అనలిటిక్స్, ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్ Appfigures షేర్ చేసిన డేటా ప్రకారం.. ఫిబ్రవరి 1న 135,139గా ఉన్న పేటీఎం యాప్ డౌన్లోడ్లు ఫిబ్రవరి 19న 55 శాతం క్షీణించి 60,627కి పడిపోయాయి. ♦ భీమ్ యూపీఐ డౌన్లోడ్లు ఈ నెల మొదటి రోజున 222,439 నుండి ఫిబ్రవరి 19న 331,781కి పెరిగాయి. ♦ గూగుల్ పే రోజువారీ యాప్ డౌన్లోడ్లు 105,296 నుండి 94,163కి పడిపోయాయి. ♦ ఫోన్ పే డౌన్లోడ్లు ఫిబ్రవరి 1న 317,522 నుండి ఫిబ్రవరి 7న 503,436కి పెరిగాయి. ఫిబ్రవరి 19న 163,011కి తగ్గాయి. డిజిటల్ చెల్లింపు లావాదేవీల కోసం వ్యాపారులు ఇతర యాప్‌లు, బ్యాంక్ అకౌంట్లకు మారడం ప్రారంభించారు. ఢిల్లీలోని బులియన్ మార్కెట్ అసోసియేషన్ చైర్మన్ యోగేష్ సింఘాల్ మాట్లాడుతూ.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై వార్తలు వచ్చినప్పటి నుండి వ్యాపారులు ఫోన్ పే, గూగుల్ పే, భీమ్ యూపీఐ యాప్‌లకు మారారు. ‘ఈ చర్య కేవలం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై మాత్రమేనని, పేటీఎం యాప్‌పై ఎటువంటి ప్రభావం లేదని మాకు తెలుసు. అయితే, ముందస్తు చర్యల్లో భాగంగా మేము మా ఖాతాలను ఇతర చెల్లింపు అగ్రిగేటర్లకు తరలిస్తున్నాము. చూడండి, వ్యాపారంలో నమ్మకం అనేది అత్యంత ముఖ్యమైన విషయం’అని సింఘాల్ అన్నారు. ఈ సందర్భంగా ‘పేటీఎం యాప్ డౌన్లోడ్లలో క్షీణత వినియోగదారుల మధ్య అనిశ్చితి, నమ్మకం కోల్పోవడం ప్రతిధ్వనిస్తుంది’అని ఇండియా బ్లాక్‌చెయిన్ ఫోరమ్ కో-ఫౌండర్ శరత్ చంద్ర అన్నారు. -
సంబరపడిపోతున్న ప్రత్యర్థులకు షాక్.. సరికొత్త ప్లాన్‌లో పేటీఎం!
సంక్షోభంలో చిక్కుకున్న ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం మూతపడుతుందని, ఇక తమకు తిరుగులేదని సంబరపడిపోతున్న ప్రత్యర్థి కంపెనీలకు పేటీఎం షాక్ ఇవ్వబోతోంది. తమ కస్టమర్లను కాపాడుకునేందుకు ఈ ఫిన్‌టెక్ సరికొత్త ప్లాన్ చేస్తోంది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. సంక్షోభంలో చిక్కుకున్న పేటీఎం (Paytm) మాతృ సంస్థ One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ తమ కస్టమర్లకు యూపీఐ ( యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ - UPI ) సేవలు అందుబాటులో ఉండేలా థర్డ్-పార్టీ పేమెంట్ యాప్ (TPAP) మార్గంపై దృష్టి సారిస్తోంది. ఇదీ చదవండి: ఆ జీతమే శాపమైందా.. దిక్కుతోచని పేటీఎం ఉద్యోగులు "పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ చెల్లింపు సేవలను నిలిపివేస్తుంది కాబట్టి, ఇతర బ్యాంకుల ద్వారా యూపీఐని ఏకీకృతం చేస్తూ ముందుకు సాగే థర్డ్-పార్టీ యాప్‌గా మారుతుంది" అని పేటీఎంలో పరిణామాల గురించి తెలిసిన ఒక వ్యక్తి చెప్పినట్లు నివేదిక పేర్కొంది. దీని ప్రకారం.. దేశంలో యూపీఐ వ్యవస్థను నడుపుతున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)తో One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ఇప్పటికే చర్చలు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. మారనున్న వీపీఏ ప్రస్తుతం యూపీఐ చెల్లింపుల కోసం పేటీఎం యూజర్లు @paytmతో ముగిసే వర్చువల్ పేమెంట్ అడ్రస్ (VPA) కలిగి ఉన్నారు. అయితే, మార్చి 1 తర్వాత ఈ వీపీఏలు వేరే బ్యాంక్ హ్యాండిల్‌కి మారుతున్నాయి. పేటీఎం యూపీఐ సర్వీస్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) కిందకు వస్తుంది. ఫిబ్రవరి 29 తర్వాత నుంచి కస్టమర్ల నుంచి డబ్బు తీసుకోకుండా ఆర్బీఐ జనవరి 31న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ని నిషేధించింది. ఈ నేపథ్యంలో పేటీఎం తమ యూపీఐ కస్టమర్లకు కొత్త వీపీఏల కోసం మూడు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకులతో భాగస్వామ్యం చేసుకోనుందని తెలుస్తోంది. నివేదిక ప్రకారం.. యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యస్ బ్యాంకులు ఈ జాబితాలో ఉన్నాయి. అమెజాన్ పే, గూగుల్ పే (Google Pay), ఫోన్‌పే (PhonePe)లతో సహా ఇప్పటికే 22 థర్డ్-పార్టీ పేమెంట్ యాప్‌లు యూపీఐ సర్వీసులు అందిస్తున్నాయి. యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులు థర్డ్-పార్టీ రూట్ ద్వారా ఇలాంటి ఫిన్టెక్లకు సహకారం అందిస్తున్నాయి. సాధారణంగా వీపీఏను బ్యాంక్, ఫిన్‌టెక్ రెండింటి బ్రాండ్ పేర్లను కలిపి రూపొందిస్తారు. -
సంక్షోభంలో పేటీఎం - ప్రత్యర్థులకు పెరిగిన డిమాండ్..
ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎం (Paytm) ప్రస్తుతం అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న తరుణంలో.. దాని ప్రత్యర్థులు గణనీయమైన వృద్ధి పొందుతున్నాయి. దీంతో పేటీఎం యూజర్లు చాలామంది గూగుల్ పే, ఫోన్‌పే, BHIM యాప్‌ల వినియోగానికి ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిబ్రవరి 29 తరువాత నుంచి కస్టమర్ అకౌంట్లు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌ల వంటి వాటి ద్వారా డిపాజిట్లు, టాప్ అప్‌లను స్వీకరించకూడదని పేటీఎంకు కొన్ని షరతులు విధించింది. దీంతో కంపెనీ షేర్లు బాగా తగ్గిపోయాయి. ప్రస్తుతం పేటీఎం యూజర్ల సంఖ్య కూడా బాగా తగ్గింది. ఫిబ్రవరి 3 వరకు ఫోన్‌పే 2.79 లక్షల ఆండ్రాయిడ్ డౌన్లోడ్లను పొందిందని యాప్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఒక నివేదికలో వెల్లడించింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు నాలుగు రోజుల వ్యవధిలో ఆండ్రాయిడ్ డౌన్లోడ్లు 24.1 శాతం పెరిగి 10.4 లక్షలకు చేరుకుంది. యూజర్లను ఆకర్శించడానికి ఫోన్‌పే కావలసిన ప్రయత్నాలను చేస్తోంది. దీని ఫలితంగా భారతదేశంలో గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో ఫ్రీ యాప్ విభాగంలో కంపెనీ అగ్రస్థానానికి చేరుకుంది. యాప్ ర్యాంకింగ్‌లలో కూడా ఈ యాప్ గణనీయమైన పురోగతిని సాధించింది. ఎక్కువ మంది యూజర్లు విరివిగా ఫోన్‌పే డౌన్లోడ్ చేసుకుంటున్న కారణంగా గూగుల్ ప్లేలో 188వ స్థానంలో ఉన్న కంపెనీ ఫిబ్రవరి 5 నాటికి 33వ స్థానానికి, యాప్ స్టోర్లలో 227వ స్థానం నుంచి 72వ స్థానానికి చేరింది. భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (BHIM) యాప్ కూడా ఫిబ్రవరి 3న 1.35 లక్షల ఆండ్రాయిడ్ డౌన్లోడ్లను సాధించి, 21.5 శాతం వృద్ధి కైవసం చేసుకుంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు నాలుగు రోజుల్లో.. 50 శాతం పెరిగి 5.93 లక్షల డౌన్లోడ్స్ పొందింది. దీంతో 356వ స్థానంలో ఉన్న ఈ యాప్ గూగుల్ ప్లేలో 7వ స్థానానికి, యాప్ స్టోర్లలో 171 స్థానం నుంచి 40వ స్థానానికి చేరింది. ఇదీ చదవండి: భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ ధరలు - కారణం ఇదే.. గూగుల్ పే విషయానికి వస్తే.. ఈ యాప్ డౌన్లోడ్ల విషయంలో స్వల్ప వృద్ధిని సాధించింది. ఇది ఫిబ్రవరి 3న 1.09 లక్షల డౌన్లోడ్లను సాధించింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు నాలుగు రోజుల వ్యవధిలో ఆండ్రాయిడ్ డౌన్లోడ్స్ 8.4 శాతం పెరిగి 3.95 లక్షలకు చేరుకుంది. -
పేటీఎం, గూగుల్ పే నుండి అయోధ్య రాముడికి విరాళం..
-
గూగుల్‌పే యూజర్లకు శుభవార్త.. అదేంటంటే?
'గూగుల్‌పే' (Google Pay) తాజాగా 'నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్' (NPCI)కు చెందిన 'ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్'తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. భారతదేశం వెలుపల ఉన్న భారతీయులు యూపీఐ చెల్లింపులు చెల్లించడానికి అనుకూలంగా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గూగుల్‌పే ఇప్పుడు ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్‌తో చేసుకున్న ఒప్పందం ఫలితంగా.. విదేశాలకు వెళ్లే ప్రజలు డబ్బు తీసుకెళ్లడం లేదా అంతర్జాతీయ గేట్‌వే చార్జీల భారం తగ్గిపోయింది. ఇది కేవలం వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని మాత్రమే కాకుండా.. సంస్థ తన ఉనికిని విస్తరించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: రూ.8300 కోట్ల సామ్రాజ్యంగా మారిన ఒక్క ఆలోచన.. ఇతర దేశాల్లో కూడా డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి రావడం వల్ల.. గూగుల్‌పే కస్టమర్లు అంతర్జాతీయ కరెన్సీ కోసం లేదా ఫారెక్స్ కార్డుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. రెండు కంపెనీలు తీసుకున్న ఈ నిర్ణయం చాలా ఉపయోగకరంగా ఉంటుందని NPCL సీఈఓ రితేష్ శుక్లా పేర్కొన్నారు. -
యూపీఐ పేమెంట్స్‌లో కొత్త రూల్స్.. అవేంటో మీకు తెలుసా?
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ పేమెంట్స్ వినియోగదారులకు ముఖ్య గమనిక. ఆర్బీఐ జనవరి 1, 2024 నుంచి యూపీఐ పేమెంట్ అకౌంట్ ఐడీల నిబంధనల్ని మార్చింది. వాటికి అనుగుణంగా లేని యూపీఐ పేమెంట్స్ అకౌంట్ ఐడీల రద్దుతో పాటు రోజూవారి లిమిట్‌ను పెంచింది. దీంతో పాటు కొన్ని మార్పులు చేసింది. అవేంటో తెలుసుకుందాం పదండి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పేతో పాటు ఇతర పేమెంట్ యాప్స్ ఏడాది కంటే ఎక్కువ కాలం యాక్టీవ్‌గా లేని యూపీఐ ఐడీలను డీయాక్టీవ్టే చేయాలని బ్యాంకులను కోరింది. ఎన్పీసీఐ ప్రకారం..యూపీఐ లావాదేవీల రోజువారీ చెల్లింపు పరిమితి గరిష్టంగా 1 లక్ష వరకు చేసుకోవచ్చు. అయితే, డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించేలా ఆర్బీఐ డిసెంబర్ 8, 2023 నుంచి ఆసుపత్రులు, విద్యా సంస్థలకు యూపీఐ చెల్లింపుల లావాదేవీ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచింది. ఆన్లైన్ వాలెట్లను ఉపయోగించి రూ. 2,000 కంటే ఎక్కువ నగదు మర్చంట్ ట్రాన్సాక్షన్లపై మాత్రమే 1.1 శాతం ఇంటర్చేంజ్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది సాధారణ యూపీఐ వినియోగదారులకు వర్తించదు. యూపీఐ పేమెంట్స్ వినియోగం పెరిగే కొద్ది ఆర్ధిక నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీన్ని అరికట్టేందుకు ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉదాహరణకు మీ ఫోన్‌పే నెంబర్ నుంచి తొలిసారిగా మరో కొత్త ఫోన్‌పే నెంబర్‌కు రూ.2వేల కంటే ఎక్కువ మొత్తంలో నగదు పంపిస్తే.. ఆ నగదు వెళ్లేందుకు 4 గంటల సమయం పట్టనుంది. అది ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. మనం ఇప్పటి వరకు ఏదైనా కిరాణా స్టోర్‌లో యూపీఐ పేమెంట్స్ చేయాలంటే స్కాన్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (NFC) సాయంతో పేమెంట్ చేసుకునే సౌకర్యం కలగనుంది. అయితే ఇందుకోసం యూపీఐలలో ఎన్ఎఫ్సీ ఫీచర్‌ను తప్పని సరి త్వరలో మనం కొత్త రకం ఏటీఎంలను చూడబోతున్నాం. ప్రస్తుతం ఏదైనా బ్యాంక్ డెబిట్ కార్డ్‌ను వినియోగించి ఏటీఎం మెషిన్ నుంచి డబ్బుల్ని డ్రా చేయడం సర్వసాధారణం. ఇకపై అలాగే ఫోన్లో యూపీఐ ఐడీని ఉపయోగించి యూపీఐ ఏటీఎంలో డబ్బుల్ని స్కాన్ చేసి డబ్బుల్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం ఆర్బీఐ జపాన్ కంపెనీ హిటాచీతో ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలో అందుబాటులోకి రానుంది. -
ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం యూజర్లకు అలర్ట్!
ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌లు వాడుతున్నారా..? ఒకటి కంటే ఎక్కువ యూపీఐ యాప్‌లు వినియోగిస్తున్నారా..? అయితే మీకో ముఖ్యమైన సమాచారం. కొన్ని యూపీఐ ఐడీలు డిసెంబర్ 31 నుంచి పనిచేయవు. అవేంటి.. ఎందుకు పనిచేయవు.. ఇక్కడ తెలుసుకోండి.. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆన్లైన్ పేమెంట్స్ విస్తృతమయ్యాయి. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌లు అందుబాటులోకి వచ్చిన తర్వాత దాదాపుగా ప్రతిఒక్కరూ ఈ యాప్‌లను ఉపయోగించే చెల్లింపులు చేస్తున్నారు. చిరు దుకాణాల దగ్గర నుంచి ఆన్లైన్ షాపింగ్ వరకూ యూపీఐ చెల్లింపులే అత్యధికం ఉంటున్నాయి. ప్రస్తుతం ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటివాటితోపాటు ఇంకా మరికొన్ని యూపీఐ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఆయా యాప్‌లు రకరకాల ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు వంటివి అందిస్తున్నాయి. దీంతో చాలా మంది వివిధ యాప్‌లను డౌన్లోడ్ చేసుకుని కొద్దికాలం వినియోగించి మళ్లీ వాటి గురించి మరిచిపోతున్నారు. ఇలా 2023 డిసెంబర్ 31 నాటికి ఒక సంవత్సరం పాటు ఇన్‌యాక్టివ్‌గా ఉన్న యూపీఐ ఐడీలను డీయాక్టివేట్ చేయాలని ఆయా యాప్‌లను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (NPCI) కోరింది. కారణం ఇదే.. బ్యాంక్ అకౌంట్లకు లింక్ చేసిన ఫోన్ నంబర్లను డీలింక్ చేయకుండా కస్టమర్లు ఫోన్ నంబర్లను మార్చినప్పుడు పాత నంబర్ల ద్వారా లావాదేవీలు జరగకుండా చూడటమే ఇన్‌యాక్టివ్ యూపీఐ ఐడీల డీయాక్టివేషన్ లక్ష్యమని తెలుస్తోంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) మార్గదర్శకాల ప్రకారం, 90 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత కొత్త సబ్స్క్రైబర్లకు టెల్కోలు డియాక్టివేటెడ్ నంబర్లను జారీ చేస్తుంటాయి. బ్యాంక్‌తో లింక్ చేసిన పాత మొబైల్ నంబర్‌ను కస్టమర్ అప్డేట్ చేసుకోకపోతే దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్లు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు 2023 డిసెంబర్ 31 లోపు ఈ విషయంపై తగిన చర్య తీసుకోవాలని ఎన్పీసీఐ కోరినట్లు సమాచారం. -
ఉచితంగా సిబిల్ స్కోర్ చెక్ చేసుకోండిలా..!
సిబిల్ స్కోరు నివేదిక చూసి, ఒక వ్యక్తి ఆర్థిక పరిస్థితి గురించి ఒక అంచనాకు రావచ్చు. బ్యాంకులూ కొత్తగా అప్పు ఇచ్చేటప్పుడు దీన్ని నిశితంగా పరిశీలిస్తాయి. సిబిల్ స్కోరు 750 పాయింట్లకు మించి ఉందంటే ఆర్థిక క్రమశిక్షణ బాగుందని అర్థం. చాలా వెబ్సైట్లు, యాప్‌లు సిబిల్ స్కోర్‌ను ఉచితంగా అందిస్తున్నాయి. అందులో ఒకటి చాలా మంది తరచుగా ఉపయోగించే గూగుల్ పే ద్వారా ఈ స్కోర్‌ను ఎలా చెక్ చేసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం. భారత్‌లో కోట్లాది మంది గూగుల్ పే యాప్‌ను వివిధ రకాల చెల్లింపుల కోసం వాడుతున్నారు. తొలుత దీంట్లో కేవలం నగదు బదిలీకి మాత్రమే అవకాశం ఉండేది. దశలవారీగా అనేక సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. బిల్లు చెల్లింపులు, రీఛార్జ్‌లకూ దీన్ని విస్తరించారు. ఇటీవల సిబిల్ స్కోర్‌ను కూడా ఉచితంగా అందిస్తున్నారు. ఎలా చెక్ చేసుకోవాలంటే.. గూగుల్ పే యాప్ ఓపెన్ చేయాలి ‘మేనేజ్ యువర్ మనీ’ సెక్షన్ వచ్చే వరకు స్క్రోల్ చేయాలి. అక్కడ కనిపించే ‘చెక్ యువర్ సిబిల్ స్కోర్ ఫర్ ఫ్రీ’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత ‘Your CIBIL score does not decrease after you check it. Google Pay does not share credit report data with any 3rd party’ అనే పాప్అప్ కనిపిస్తుంది. దాని కింద సబ్మిట్ బటన్ వస్తుంది. అది క్లిక్ చేయాలి. క్షణాల్లో మీ సిబిల్ స్కోర్ తెరపై కింద కనిపిస్తుంది. ఇదీ చదవండి: రూ.20 వేలతో రూ.100 కోట్లు సంపాదించొచ్చా..? సిబిల్ స్కోర్ అంటే.. సిబిల్ అంటే ‘క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(ఇండియా) లిమిటెడ్’. ఇంకా సులువుగా చెప్పాలంటే రుణ హిస్టరీను అందించే సంస్థ. ఇది ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (ఆర్బీఐ) ఆధ్వర్యంలోని క్రెడిట్ ఏజెన్సీ. సిబిల్.. వ్యక్తులకు చెందిన రుణాలు, క్రెడిట్ కార్డుల చెల్లింపు వ్యవహారాలు వంటి సమాచారాన్ని సేకరించి నివేదికలు తయారుచేస్తుంది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఇతర ఆర్థిక సంస్థలు ప్రతినెలా రుణ గ్రహీతల సమాచారాన్ని సిబిల్‌కు అందజేస్తాయి. ఈ సమాచారాన్ని ఉపయోగించి సిబిల్ రుణ చరిత్ర నివేదిక, సిబిల్ స్కోర్‌ను తయారుచేస్తుంది. సిబిల్ స్కోర్ 300-900 మధ్య ఉంటుంది. 600 కంటే తక్కువ ఉంటే ‘బ్యాడ్ సిబిల్ స్కోర్’గా పరిగణిస్తారు. అలాంటి వారికి రుణం ఇవ్వడం రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం అని అర్థం. 750 కంటే ఎక్కువ ఉంటే మెరుగైన స్కోర్‌గా పరిగణిస్తారు. -
గూగుల్‌పేలో రీఛార్జిపై ఫీజు.. ఎంతంటే..?
గూగుల్ ఆధ్వర్యంలోని పేమెంట్ యాప్ గూగుల్‌పే మొబైల్ రీఛార్జీలపై అదనంగా ఫీజు వసూలు చేయనుంది. ఏ విధానంలో పేమెంట్ చేసినా కన్వీనియన్స్ ఛార్జీల రూపంలో ఫీజు వసూలు చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఫోన్‌పే, పేటీఎం సంస్థలు ఇదే మాదిరి ప్రత్యేక ఫీజును వసూలు చేస్తున్నాయి. ఇప్పటివరకు ఉచితంగా సేవలందించిన గూగుల్‌పే ప్రస్తుతం ఛార్జీలు వసూలు చేయనుందనే వార్తలు వస్తున్నాయి. అయితే రూ.100లోపు రీఛార్జిపై గూగుల్‌పే ఎలాంటి ఫీజూ వసూలు చేయబోదని కొన్ని మీడియాలో వస్తున్న కథనాల ద్వారా తెలుస్తోంది. రూ.100 నుంచి రూ.200 వరకు రీఛార్జిపై ఒక రూపాయి, రూ.200 నుంచి రూ.300 వరకు రూ.2, రూ.300 కంటే ఎక్కువ రీఛార్జి చేస్తే రూ.3 చొప్పున కన్వీనియన్స్ ఫీజు వసూలు చేయబోతున్నట్లు సమాచారం. కొత్తగా కన్వీనియన్స్ ఫీజు వసూలు చేయనున్నట్లు గూగుల్ నిబంధనలు విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
గూగుల్ పే యూజర్లకు గుడ్‌న్యూస్!
దేశంలో రోజువారి లెక్కన సరకులు తెచ్చి అమ్ముకొని జీవనం సాగించే వీధి వ్యాపారులకు లోన్లు కావాలంటే బ్యాంకులు, లేదంటే ఇతర ఫైనాన్స్ కంపెనీలు చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఆ ఇబ్బందుల నుంచి వ్యాపారస్తుల్ని గట్టెక్కించేలా ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. తన యూపీఐ పేమెంట్స్ ఫ్లాట్‌ఫారమ్ గూగుల్ పే ద్వారా వారికి రుణాలు అందించేందుకు సిద్ధమైంది. భారత్‌లో గూగుల్ 9వ ఎడిషన్ ‘గూగుల్ ఫర్ భారత్’ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా టెక్ దిగ్గజం వినియోగదారుల కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుందనేది వివరించడంతో పాలు పలు ప్రొడక్ట్‌లు విడుదల, భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తుంది. చిరు వ్యాపారులకు శుభవార్త సెప్టెంబర్ 19 ఉదయం 11 గంటలకు ప్రారంభించిన ఈవెంట్లో చిరు వ్యాపారులకు గూగుల్ శుభవార్త చెప్పింది. భారత్‌లోని చిరు వ్యాపారులకు చేయూతనందించేలా తన యూపీఐ పేమెంట్ ఫ్లాట్‌ఫారమ్ ‘గూగుల్ పే’ ద్వారా రుణాలు ఇవ్వనున్నట్లు చెప్పింది. ఇప్పటికే గూగుల్ పే ద్వారా లోన్ అప్లికేషన్ ప్రాసెస్ అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. Our experience with merchants has taught us that they often need smaller loans and simpler repayment options. To meet this need, sachet loans on Google Pay with @DMIFinance will provide flexibility and convenience to SMBs, with loans starting at just 15,000 rupees and can be… pic.twitter.com/SehpcQomCA — Google India (@GoogleIndia) October 19, 2023 రూ.10,000 నుంచి రూ.1లక్ష వరకు రుణాలు చిన్న మొత్తంలో రుణాలు అందించేలా గూగుల్.. డీఎంఐ ఫైనాన్స్ సంస్థతో చేతులు కలిపింది. దీంతో వ్యాపారులు గూగుల్ యూపీఐ నుంచి రూ.10,000 నుంచి రూ.1లక్ష వరకు లోన్లు అందిస్తుంది. వాటిని తిరిగి 7 నెలల నుంచి 12 వ్యవధిలోపు చెల్లించాల్సి ఉంటుంది. నెలవారీ ఈఎంఐ రూ.111 అంతేకాదు, వ్యాపార నిమిత్తం అవసరమే నిధుల అవసరాల్ని తీర్చేలా క్రెడిట్లైన్ (credit line) సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ పద్దతిలో అతి తక్కువ రూ.15,000 తీసుకుంటే నెల ప్రారంభ ఈఎంఐ రూ.111 చెల్లించాలి. వ్యక్తిగత రుణాలు చెల్లించేలా యాక్సిస్ బ్యాంక్‌తో, యూపీఐ ద్వారా క్రెడిట్ లైన్స్ రుణాలు కోసం ఐసీఐసీఐ బ్యాంక్‌తో జతకట్టింది. చిరు వ్యాపారులకోసం ఏఐ సాయం భారత్‌లోని చిరు వ్యాపారుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు పునరుద్ఘాటించింది. ఏఐ సాయంతో గూగుల్ మర్చెంట్ సెంటర్ నెక్ట్స్(Google Merchant Center Next)లో వ్యాపారుల ప్రొడక్ట్‌ల వివరాల గురించి పూర్తిస్థాయిలో సమాచారాన్ని అందించనుంది. అయితే, ఉత్పత్తుల గురించి ఎలాంటి సమాచారాన్ని గూగుల్ మర్చెంట్ సెంటర్ నెక్ట్స్‌లో ఇవ్వాలనే అంశం వ్యాపారుల నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. 100కి పైగా ప్రభుత్వ పథకాల సమాచారం త్వరలో, భారత్‌లోని వినియోగదారులకు 100కి పైగా ప్రభుత్వ పథకాల గురించి పూర్తి స్థాయిలో సమాచారాన్నిఅందించేలా నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా గూగుల్ భవిష్యత్ కార్యచరణను ప్రకటించింది. రూ.12,000 కోట్ల విలువైన మోసాలకు చెక్ గూగుల్‌లో పేలో రూ.12,000 కోట్ల విలువైన ఆర్ధిక మోసాలకు చెక్ పెట్టిన గూగుల్.. అందుకు సాయం చేసే 3,500 లోన్ యాప్‌లను బ్లాక్ చేసేలా చర్యలు తీసుకుంది.