డిజిటల్ చెల్లింపుల యుగంలో యూపీఐ (UPI - యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) వినియోగం వేగంగా పెరుగుతోంది. చాలా మంది ఇప్పుడు నగదు లావాదేవీల కంటే యూపీఐ పేమెంట్స్‌నే ఎక్కువగా చేస్తున్నారు. అయితే ఇదే క్రమంలో యూపీఐ మోసాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి.
యూపీఐ పేమెంట్స్ భద్రతకు సంబంధించి ప్రస్తుతం పిన్ (PIN) ఆధారిత ధ్రువీకరణ విధానం ఉంది. పేమెంట్స్ ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రతిసారి పిన్ నంబర్ ఎంటర్ చేసి ధ్రువీకరించాల్సి ఉంటుంది. అయినప్పటికీ కొన్నిసార్లు మోసాలు జరగుతున్నాయి. దీనిపై దృష్టిసారించిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మరో కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతోంది.
బయోమెట్రిక్ ధ్రువీకరణ!
సీక్రెట్ పిన్ నంబర్‌ను తెలుసుకుని మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఎన్‌పీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మింట్ నివేదిక ప్రకారం.. పిన్ ఆధారిత ధ్రువీకరణ ప్రక్రియకు బదులుగా బయోమెట్రిక్ ధ్రువీకరణను తీసుకురానుంది. ఈ కొత్త విధానంలో యూపీఐ లావాదేవీలను వేలిముద్ర స్కానింగ్ లేదా ఫేస్ ఆథెంటికేషన్ ద్వారా ధ్రువీకరించాల్సి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌లను ఉపయోగించి యూపీఐ చెల్లింపులను మరింత సురక్షితంగా, సులభంగా చేసే విధానంపై ఎన్‌పీసీఐ కసరత్తు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment