PhonePe
-
ఐపీవో రూట్లో ఫోన్‌పే
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) ద్వారా దేశీ స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయ్యేందుకు ఫిన్‌టెక్ దిగ్గజం ఫోన్‌పే కసరత్తు ప్రారంభించింది. ఈ ఏడాది పదో వార్షికోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో తమ సంస్థకు ఇదొక కీలక మైలురాయి అవుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫోన్‌పే పోటీ సంస్థలు పేటీఎం, మొబిక్విక్ ఇప్పటికే దేశీ మార్కెట్లలో లిస్టయిన సంగతి తెలిసిందే. సింగపూర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన ఫోన్‌పే 2022లో తమ ప్రధాన కార్యాలయాన్ని భారత్‌కి మార్చుకుంది. 2023లో చివరిసారిగా నిధులు సమీకరించినప్పుడు ఫోన్‌పే వేల్యుయేషన్‌ను 12 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టారు. ఫోన్‌పేలో వాల్‌మార్ట్‌కి చెందిన లక్సెంబర్గ్ సంస్థ ఫిట్ హోల్డింగ్స్ ఎస్‌ఏఆర్‌ఎల్‌కి 83.91 శాతం, జనరల్ అట్లాంటిక్ సింగపూర్‌కి 5.14 శాతం, ఫోన్‌పే సింగపూర్ విభాగానికి 6.7 శాతం వాటాలు ఉన్నాయి. -
ఫోన్‌పేలో కొత్త ఫీచర్.. ఇక ప్రతిసారీ కార్డు వివరాలు అక్కర్లేదు
ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ ఫోన్‌పే (PhonePe) కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. క్రెడిట్, డెబిట్ కార్డుల కోసం డివైజ్ టోకనైజేషన్ సొల్యూషన్‌ను ప్రారంభించింది. వినియోగదారులు ఇప్పుడు ఫోన్‌పే యాప్‌లో తమ కార్డులను టోకనైజ్ చేసుకుని బిల్లు చెల్లింపులు, రీఛార్జ్‌లు, ప్రయాణ బుకింగ్‌లు, బీమా కొనుగోళ్లతోపాటు పిన్‌కోడ్, ఫోన్‌పే పేమెంట్ గేట్‌వేను ఉపయోగించి చేసే చెల్లింపులు వంటి వివిధ సేవలలో ఉపయోగించవచ్చు.ఈ కొత్త ఫీచర్‌తో వినియోగదారులు మెరుగైన భద్రత, సౌలభ్యం నుండి ప్రయోజనం పొందుతారు. ఇకపై మర్చంట్ ప్లాట్‌ఫామ్‌లలో కార్డ్ వివరాలను సేవ్ చేయాల్సిన అవసరం లేదు లేదా ప్రతి లావాదేవీకి సీవీవీని నమోదు చేయాల్సిన అవసరం లేదని ఫోన్‌పే తెలిపింది. టోకెనైజ్డ్ కార్డులు కార్డ్ వివరాలను ఫోన్లకు సురక్షితంగా లింక్ చేయడం ద్వారా మోసాల ప్రమాదాలను తగ్గిస్తాయి. ఇది ఆన్లైన్ చెల్లింపులపై వినియోగదారుల విశ్వాసాన్ని పెంచుతుంది. ప్రారంభంలో వినియోగదారులు వీసా క్రెడిట్, డెబిట్ కార్డులను టోకెనైజ్ చేయవచ్చు.ఈ ఫీచర్ నుండి వ్యాపారులు కూడా ప్రయోజనం పొందుతారు. టోకెనైజ్డ్ కార్డులు వేగవంతమైన లావాదేవీలను, అధిక మార్పిడి రేట్లను అనుమతిస్తాయి. ఎక్కువ మంది వినియోగదారులు ఈ పద్ధతిని అవలంబించడంతో, వ్యాపారాలు మెరుగైన కస్టమర్ నిలుపుదల, సున్నితమైన చెక్అవుట్ అనుభవాన్ని పొందుతాయి. ఫోన్‌పే పేమెంట్ గేట్‌వే ఉపయోగించే వ్యాపారులకు ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్ డిజిటల్ చెల్లింపు భద్రత, సౌలభ్యాన్ని పెంచుతుందని ఫోన్‌పే సహ వ్యవస్థాపకుడు, సీటీవో రాహుల్ చారి అన్నారు. ఈ సర్వీస్‌ను మరిన్ని కార్డ్ నెట్‌వర్క్‌లతో అనుసంధానించాలని, ఫోన్‌పే పేమెంట్ గేట్‌వే వ్యాపారులందరికీ విస్తరించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. -
'ఏఏ' వ్యాపారానికి ఫోన్‌పే గుడ్‌బై.. లైసెన్స్ వెనక్కి..
ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ ఫోన్‌పే (PhonePe) అకౌంట్ అగ్రిగేషన్ (ఏఏ) వ్యాపారం నుంచి వైదొలిగినట్టు ప్రకటించింది. ఈ సేవలు అందించేందుకు సరిపడా భాగస్వాములను పొందలేకపోయినట్టు తెలిపింది. ఎన్బీఎఫ్సీ–ఏఏ లైసెన్స్‌ను (license) ఆర్బీఐకి (RBI) స్వాధీనం చేయాలని నిర్ణయించినట్టు, అకౌంట్ అగ్రిగేషన్ కార్యకలాపాలను మూసివేసే చర్యలు తీసుకున్నట్టు వెల్లడించింది.తన యూజర్ల ఆమోదం మేరకు వారి ఆర్థిక సమాచారాన్ని బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్లతో పంచుకోవడం ద్వారా రుణాలు, క్రెడిట్ కార్డులు తదితర సేవలు అందించేందుకు ఈ లైసెన్స్ కింద అనుమతి ఉంటుంది. 2023 జూన్‌లో ఫోన్‌పేకు ఎన్బీఎఫ్సీ–ఏఏ లైసెన్స్ రావడం గమనార్హం. ‘‘రెండేళ్లలోపే మా ఏఏ ప్లాట్‌ఫామ్‌పై 5 కోట్ల మంది భారతీయులను చేర్చుకోవడం గర్వకారణంగా ఉంది. పోటీ ప్రాధాన్యతల దృష్ట్యా ఎక్కువ మంది ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్లను మా ప్లాట్‌ఫామ్ వైపు ఆకర్షించలేకపోయాం. దీంతో ఫోన్‌పే గ్రూప్ అకౌంట్ అగ్రిగేషన్ వ్యాపారం నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. దీనికి బదులు మార్కెట్లో ఉన్న ఇతర ఏఏలతో జట్టు కడతాం’’అని ఫోన్‌పే ప్రకటించింది. తమ ఏఏ యూజర్లకు త్వరలోనే ఈ విషయాన్ని తెలియజేస్తామని తెలిపింది. -
రూ.లక్షల్లో పానీపూరి వ్యాపారం.. రంగంలోకి జీఎస్టీ డిపార్ట్మెంట్
వీధి వ్యాపారులు ముఖ్యంగా పానీపూరి విక్రేతలు ఏ స్థాయిలో సంపాదిస్తున్నారో తెలిపే ఉదంతం ఇది. కొంత మంది వ్యాపారులు రూ.లక్షల్లో సంపాదిస్తున్నా ప్రభుత్వానికి ఎటువంటి పన్నులు కట్టడం లేదు. ఇలాగే ట్యాక్స్ (Tax) కట్టకుండా రూ.లక్షల్లో వ్యాపారం చేస్తున్న పానీపూరి విక్రేతకు (PANIPURI WALA) జీఎస్టీ డిపార్ట్మెంట్ షాక్ ఇచ్చింది.తమిళనాడులో సంవత్సరానికి రూ.40 లక్షలు సంపాదిస్తున్న పానీపూరీ విక్రేతకు జీఎస్టీ డిపార్ట్మెంట్ పన్ను నోటీసు ఇచ్చింది. ఫోన్‌పే (Phonepe), రేజర్‌పే (Razor Pay) రికార్డ్ల ఆధారంగా పానీపూరి వాలాకు నోటీసు పంపింది. ఇది కేవలం ఆన్లైన్ చెల్లింపు మాత్రమే. ఇక నగదు రూపంలో ఎంత సంపాదించి ఉంటాడో ఊహించండి.“రేజర్‌పే, ఫోన్‌పేల నుండి అందిన నివేదికల ఆధారంగా మీరు వస్తువులు/సేవల సరఫరా కోసం పరిమితికి మించి యూపీఐ (UPI) చెల్లింపులను స్వీకరించారు. 2021-22, 2022-23, 2023-24 సంవత్సరాలకు మీరు అందుకున్న మొత్తం చెల్లింపులు రూ.40,11,019” అని నోటీసులో జీఎస్టీ అధికారులు పేర్కొన్నారు. జీఎస్టీ చట్టం నిబంధనల ప్రకారం సదరు వ్యాపారి నమోదు చేసుకోలేదని తెలిపారు.జీఎస్టీ చట్టం 2017 సెక్షన్ 22లోని సబ్‌సెక్షన్ (1) ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షల మొత్తం టర్నోవర్ కలిగిన ప్రతి వ్యాపారి తప్పనిసరిగా జీఎస్టీ నమోదు చేసుకోవాలి. పరిమితిని దాటిన తర్వాత కూడా జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేకుండా వ్యాపారం చేయడం నేరం. ఇందుకుగానూ రూ.10,000 లేదా టర్నోవర్‌లో 10% వరకు జరిమానా విధిస్తారు.Pani puri wala makes 40L per year and gets an income tax notice 🤑🤑 pic.twitter.com/yotdWohZG6— Jagdish Chaturvedi (@DrJagdishChatur) January 2, 2025 -
గూగుల్ పే, ఫోన్‌పేకి ఎన్పీసీఐ ఊరట
ఫోన్‌పే, గూగుల్ పేలాంటి యూపీఐ యాప్‌లకు ఊరటనిచ్చే దిశగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్ణయం తీసుకుంది. థర్డ్ పార్టీ ఏకీకృత చెల్లింపుల విధానం (UPI) యాప్‌ల ద్వారా జరిగే లావాదేవీల పరిమాణంలో నిర్దిష్ట యాప్‌ల వాటా 30 శాతానికి మించరాదన్న ప్రతిపాదనను మరో రెండేళ్లు పెంచింది. 2026 డిసెంబర్ 31 వరకు పొడిగించినట్లు వెల్లడించింది.ప్రస్తుతం యూపీఐ లావాదేవీల్లో గూగుల్ పే, ఫోన్‌పేలాంటి థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్ల (TPAP) వాటా 80 శాతం స్థాయిలో ఉంటోంది. ఈ పరిమితిని క్రితం మూడు నెలల్లో నమోదైన మొత్తం యూపీఐ లావాదేవీల ప్రాతిపదికన లెక్కిస్తారు. మరోవైపు, వాట్సాప్ పే యాప్ మరింత మంది యూజర్లను చేర్చుకునేందుకు వీలు కల్పిస్తూ ఎన్పీసీఐ పరిమితిని తొలగించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. దీంతో వాట్సాప్ పే ఇకపై దేశవ్యాప్తంగా తమకున్న యూజర్లందరికీ యూపీఐ సర్వీసులను అందించేందుకు వీలవుతుంది. గతంలో వాట్సాప్ పే దశలవారీగా యూపీఐ యూజర్లను పెంచుకునే విధంగా పరిమితి విధించింది. ఇది 10 కోట్ల యూజర్లుగా ఉండేది.ఆన్లైన్ చెల్లింపుల్లో కొన్ని థర్డ్‌పార్టీ యాప్‌లే ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నాయి. దాంతో కొన్ని లాభాలతోపాటు నష్టాలు కూడా ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.సానుకూల పరిణామాలుసులువుగా లావాదేవీలు..రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పూర్తి కేవైసీతో ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్(PPI)ను థర్డ్ పార్టీ యుపీఐ యాప్స్‌కు అనుసంధానించడానికి అనుమతించింది. ఇది లావాదేవీలను మరింత అంతరాయం లేకుండా సౌకర్యవంతంగా చేస్తుంది.మరింత చేరువగా..ఎక్కువ మంది డిజిటల్ చెల్లింపు వ్యవస్థలను యాక్సెస్ చేయవచ్చు. ఇది బ్యాంకింగ్ లేని లేదా బ్యాంకింగ్ వ్యవస్థ ఎక్కువగా అందుబాటులోలేని వారికి ఎంతో ఉపయోగపడుతుంది.సౌలభ్యంగా..వినియోగదారులు తమ డిజిటల్ వాలెట్లను (పేటీఎం, ఫోన్ పే..) ఉపయోగించిన సౌకర్యవంతంగా చెల్లింపులు చేయవచ్చు.ఇదీ చదవండి: 2024లో కార్ల అమ్మకాలు ఎలా ఉన్నాయంటే..ప్రతికూల పరిణామాలుమార్కెట్ ఆధిపత్యంకొన్ని థర్డ్ పార్టీ యాప్‌ల(ఫోన్ పే, గూగుల్ పే.. వంటివి) ఆధిపత్యం ద్వంద్వ ధోరణికి దారితీస్తుంది. ఇది డిజిటల్ పేమెంట్ మార్కెట్లో పోటీని, సృజనాత్మకతను తగ్గిస్తుంది.సాంకేతిక సవాళ్లుకొన్ని థర్డ్‌పార్టీ యాప్‌లనే అధికంగా వినియోగించడం వల్ల భవిష్యత్తులో ఏదైనా సాంకేతిక అవాంతరాలు జరిగితే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది.విదేశీ యాజమాన్యంఈ యాప్‌లు చాలా వరకు విదేశీ యాజమాన్యంలో ఉన్నాయి. వాల్‌మార్ట్ ఆధ్వర్యంలో ఫోన్‌పే, గూగుల్ - గూగుల్ పే.. వంటివాటిని నిర్వహిస్తున్నాయి. స్థానికంగా జరిగే డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాలపై విదేశీ నియంత్రణకు సంబంధించి ఆందోళనలకు దారితీస్తుంది. -
తక్కువ మొత్తంలో జమ చేస్తారు.. ఆపై దోచేస్తారు!
ఆన్లైన్ వేదికగా సైబర్ నేరస్థులు కొత్త మోసాలకు తెర తీస్తున్నారు. ఆన్లైన్ బ్యాంకింగ్, పేటీఎం, ఫోన్‌పే, జీపే వంటి థర్డ్‌పార్టీ మోబైల్ యాప్‌ల ద్వారా నగదు లావాదేవీలు చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలని, తెలియని నంబర్ నుంచి మెసేజ్‌లు, లింకులు వస్తే వాటిని ఓపెన్ చేయకూడదని సైబర్ పోలీసులు తెలియజేస్తున్నారు. సైబర్ కేటుగాళ్లు చిన్నమొత్తాల్లో ఖాతాల్లోకి డబ్బు పంపించి తిరిగి ఆ ఖాతాలను లూటీ చేసేలా ప్రయత్నిస్తున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు.ఇటీవల సైబర్ మోసగాళ్లు ఫోన్‌పే, జీపే, పేటీఎం వంటి థర్డ్‌పార్టీ పేమెంట్ యాప్‌ల ద్వారా తక్కువ మొత్తంలో నగదును ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. దాంతో డబ్బు అందుకున్న వారికి మెసేజ్ వస్తుంది. దాన్ని ఆసరాగా చేసుకుని, వారిని నమ్మించి ‘మీ ఖాతాలో నగదు జమైంది. ఈ లింక్‌పై క్లిక్ చేయండి’అంటూ మెసేజ్‌లో కింద లింక్ ఇస్తున్నారు. లింక్ క్లిక్ చేస్తే పిన్ జనరేట్ చేయమనేలా అడుగుతుంది. పొరపాటున పిన్ జనరేట్ చేస్తే బ్యాంకు ఖాతాలోని డబ్బు ట్రాన్స్పర్ చేసుకునేందుకు పూర్తి అనుమతి ఇచ్చినట్లవుతుందని పోలీసులు చెబుతున్నారు.ఇదీ చదవండి: చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయంఖాతాలో గుర్తు తెలియని నంబర్ల ద్వారా చిన్న మొత్తాల్లో డబ్బు జమ అవుతుందంటే అనుమానించాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు. తెలియని నంబర్ల నుంచి వచ్చిన మేసేజ్‌లను, లింక్‌లను ఓపెన్ చేయకుండా నేరుగా డెలిట్ చేయాలని చెబుతున్నారు. -
ఫోన్‌పేకు 'బిన్నీ బన్సాల్' గుడ్‌బై
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బోర్డు నుంచి బయటకు వచ్చిన సంస్థ కో-ఫౌండర్ 'బిన్నీ బన్సాల్'.. తాజాగా డిజిటల్ పేమెంట్స్ యాప్ 'ఫోన్‌పే' నుంచి కూడా బయటకు వచ్చేసారు. అయితే కంపెనీ నుంచి వైదొలగడానికి కారణం ఏమిటనే విషయాన్ని వెల్లడించలేదు.నిజానికి బిన్నీ బన్సాల్ ఆప్‌డోర్ ప్రారంభించిన తరువాత ఫ్లిప్‌కార్ట్‌లో కొన్ని వైరుధ్యాలు తలెత్తాయి. దీంతో ఈయన 2024 జనవరిలో సంస్థను వీడి బయటకు వచ్చేసారు. ఆ తరువాత ఫోన్‌పే బోర్డులో చేరారు. దానికిప్పుడు గుడ్ బై చెప్పేసారు.బిన్నీ బన్సాల్ ఫోన్‌పే నుంచి బయటకు వెళ్లడం గురించి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO), వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ స్పందిస్తూ.. సంస్థ ఎదగటానికి ప్రారంభం నుంచి ఆయన ఎంతో మద్దతు తెలిపారని.. ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. టీమ్‌లీజ్ సర్వీసెస్‌లో వైస్-ఛైర్మన్‌గా ఉన్న 'మనీష్ సబర్వాల్'ను స్వతంత్ర డైరెక్టర్, ఆడిట్ కమిటీ అధ్యక్షుడిగా నియమించారు. -
ఉద్యోగులను తొలగించలేదు: ఫోన్‌పే
ఆన్లైన్ పేమెంట్ సేవల సంస్థ ఫోన్‌పే తన కస్టమర్ సపోర్ట్ స్టాఫ్‌ను తొలగించినట్లు వచ్చిన వార్తలను కొట్టిపారేసింది. దీనిపై స్పష్టతనిస్తూ ప్రకటన విడుదల చేసింది. కంపెనీలు ఎవరినీ ఉద్యోగం నుంచి తొలగించలేదని పేర్కొంది. అయితే కస్టమర్ సపోర్ట్ విభాగంలోని ఉద్యోగులు తగ్గిపోవడానికి కారణాన్ని తెలియజేసింది.ఫోన్‌పే తన కస్టమర్ సపోర్ట్ స్టాఫ్ కార్యకలాపాల్లో 90 శాతం ఏఐ చాట్బాట్లను వినియోగిస్తోంది. దాంతో గత ఐదేళ్లలో 60 శాతం ఉద్యోగులను తొలగించినట్లు పలు మీడియా సంస్థలు వార్తాకథనాలు ప్రచురించాయి. గతంలో ఈ విభాగంలో ఉన్న 1,100 మంది ఉద్యోగులను 400కు తగ్గించినట్లు తెలిపాయి. దీనిపై కంపెనీ తాజాగా స్పందించింది. ‘ఏఐ, ఆటోమేషన్ వల్ల కంపెనీలో ఉద్యోగులను తొలగించినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు. గడిచిన ఐదేళ్ల కాలంలో కస్టమర్ సపోర్ట్ విభాగంలో ఏఐను వాడుతున్నాం. అదే సమయంలో కొత్తగా ఆ విభాగంలో స్టాఫ్‌ను నియమించలేదు. అలాగని ఉన్నవారిని బలవంతంగా తొలగించలేదు. ఐదేళ్ల కిందట ఈ విభాగంలో ఉన్న సిబ్బంది వివిధ కారణాలతో ఉద్యోగం మానేశారు. అయితే కొత్త స్టాఫ్‌ను నియమించకపోవడం వల్ల వీరి సంఖ్య తగ్గినట్లు కనిపింది’ అని ఫోన్‌పే ప్రకటన విడుదల చేసింది.ఇదీ చదవండి: ఇంటి రుణం త్వరగా తీర్చండిలా..ఏఐ వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోనున్నారని కొందరు నిపుణులు భావిస్తున్నారు. కస్టమర్ సర్వీస్ విభాగంలో కొత్తగా కొలువులు సృష్టించే అవకాశం ఉండడం లేదు. ఏఐ వల్ల ఈ విభాగంలో పని చేస్తున్నవారు ఇతర రంగాలకు మారాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ఏఐకు శిక్షణ ఇచ్చే విభాగంలో సరైన నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల కొరత ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇప్పటికే సర్వీస్ సెక్టార్లో పని చేస్తున్నవారు నిరాశ పడకుండా తమ రంగంలో ఏఐకు శిక్షణ ఇచ్చే నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచిస్తున్నారు. దాంతో ప్రస్తుతం ఉద్యోగం కోల్పోయినా భవిష్యత్తులో మెరుగైన నైపుణ్యాలు సాధన చేస్తే మంచి ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. -
అమ్మో ఏఐ.. ఉద్యోగాలు ఊడుతున్నాయ్!
కృత్రిమమేధ(ఏఐ) ఉద్యోగుల పాలిట శాపంగా మారుతుంది. వివిధ కంపెనీ యాజమాన్యాలు ఉద్యోగుల కార్యకలాపాల స్థానంలో ఏఐని వాడడం ప్రారంభించాయి. దాంతో ఆయా స్థానాల్లోని ఉద్యోగులను తొలగిస్తున్నాయి. థర్డ్‌పార్టీ ఆన్లైన్ పేమెంట్ సేవల సంస్థ ఫోన్‌పే తన కస్టమర్ సపోర్ట్ స్టాఫ్ కార్యకలాపాల్లో 90 శాతం ఏఐ చాట్బాట్లను వినియోగిస్తోంది. దాంతో గత ఐదేళ్లలో 60 శాతం ఉద్యోగులను తొలగించింది. గతంలో ఈ విభాగంలో ఉన్న 1,100 మంది ఉద్యోగులను 400కు కుదించింది.ఫోన్‌పే అక్టోబర్ 21న విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం..గత ఐదేళ్లలో కస్టమర్ సపోర్ట్ విభాగంలో 90 శాతం ఏఐ చాట్‌బాట్‌ను వినియోగిస్తున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-24 వరకు లావాదేవీలు 40 రెట్లు పెరిగాయి. కొవిడ్ 19 పరిణామాల వల్ల గతంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నా ఆటోమేషన్ విధానం కోసం ప్రణాళికలు సిద్ధం చేసింది. దానివల్ల ప్రస్తుతం కంపెనీ రెవెన్యూ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. కస్టమర్ సంతృప్తికి పెద్దపీట వేస్తూ, అదే సమయంలో గణనీయంగా ఖర్చు ఆదా చేసేలా పని చేస్తోంది. గత పదేళ్లలో కస్టమర్ నెట్ ప్రమోటర్ స్కోర్ (ఎన్పీఎస్-కస్టమర్లు కంపెనీ అందించే సేవల వల్ల సంతృప్తి పొందడం) పెరుగుతోందని కంపెనీ తెలిపింది.కంపెనీ వార్షిక నివేదికలో తెలియజేసిన వివరాల ప్రకారం కస్టమర్ సపోర్ట్ విభాగంలో ఉద్యోగుల సంఖ్య 400కు చేరింది. ఇది గతంలో 1,100గా ఉండేది. ఈ విభాగంలో 90 శాతం ఏఐను వినియోగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. దేశం అంతటా సంస్థలో దాదాపు 22 వేల ఉద్యోగులున్నట్లు పేర్కొంది. 1,500 కంటే ఎక్కువ మంది అగ్రశ్రేణి ఇంజినీర్లకు కంపెనీ ఉపాధి కల్పిస్తోందని చెప్పింది. ఫోన్‌పే ఆగస్టులో తెలిపిన వివరాల ప్రకారం మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.5,064 కోట్ల ఆదాయం సమకూరినట్లు నివేదించింది. ఇది అంతకుముందు సంవత్సరంలో రూ.2,914 కోట్లగా నమోదైంది. అంటే ఏడాదిలో 74 శాతం వృద్ధిని సాధించినట్లయింది.ఇదీ చదవండి: పెళ్లి చేసే కుటుంబాలకు ధీమా.. వివాహ బీమాఏఐ వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోనున్నారని కొందరు నిపుణులు భావిస్తున్నారు. కస్టమర్ సర్వీస్ విభాగంలో ఇలా ఉద్యోగాలు కోల్పోయే వారి సంఖ్య అధికంగా ఉంటుందన్నారు. అయితే ఏఐకు శిక్షణ ఇచ్చే విభాగంలో సరైన నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల కొరత ఉందని చెబుతున్నారు. కాబట్టి ఇప్పటికే సర్వీస్ విభాగంలో పని చేస్తున్నవారు నిరాశ పడకుండా తమ రంగంలో ఏఐకు శిక్షణ ఇచ్చే నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచిస్తున్నారు. దాంతో ప్రస్తుతం ఉద్యోగం కోల్పోయినా భవిష్యత్తులో మెరుగైన నైపుణ్యాలు సాధన చేస్తే మంచి ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. -
రూ.9 చెల్లిస్తే.. రూ.25000 ప్రయోజనం: ఫోన్‌పేలో కొత్త ప్లాన్
దీపావళి సమీపిస్తోంది. ఈ పండుగ ఎంత సంతోషాన్ని ఇస్తుందో, ఆదమరిస్తో అంత విషాదాన్ని నింపేస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మొబైల్ పేమెంట్స్ యాప్ 'ఫోన్‌పే' బాణసంచా సంబంధిత ప్రమాదాలు జరిగినప్పుడు ఉపశమనం కల్పించడానికి ఫైర్‌క్రాకర్ బీమా ప్లాన్ తీసుకువచ్చింది.ఫోన్‌పే పరిచయం చేసిన ఈ కొత్త ఫైర్‌క్రాకర్ బీమా ప్లాన్ కేవలం తొమ్మిది రూపాయలకే అందుబాటులో ఉంది. దీని ద్వారా 10 రోజుల పాటు రూ. 25,000 వరకు కవరేజి లభిస్తుంది. ప్రమాదం జరిగినప్పుడు.. బాధితులు ఆసుపత్రిలో చేరడం లేదా మరణం సంభవిస్తే దానికయ్యే ఖర్చుల నుంచి ఆర్థికంగా కొంత నిలదొక్కుకోవడానికి ఈ బీమా ఉపయోగపడుతుంది.ఫైర్‌క్రాకర్ బీమా ప్లాన్ కవరేజ్ అక్టోబర్ 25 నుంచి ప్రారంభమవుతుంది. ఈ బీమా కోసం ఫోన్‌పే యాప్‌లోనే అప్లై చేసుకోవచ్చు. ఇది కేవలం వినియోగదారుకు మాత్రమే కాకుండా.. జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలతో సహా గరిష్టంగా నలుగురు కుటుంబ సభ్యులకు కవరేజి లభిస్తుంది.ఇదీ చదవండి: 'అప్పుడు రతన్ టాటా ముఖంలో చిరునవ్వు కనిపించింది'ఫైర్‌క్రాకర్ బీమా కోసం ఎలా అప్లై చేయాలంటే➤ఫోన్‌పే యాప్‌లోని బీమా విభాగాన్ని సెలక్ట్ చేసుకున్న తరువాత, అక్కడే ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్ కనిపిస్తుంది.➤ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్ ఎంచుకున్న తరువాత ప్లాన్ వివరాలు చూడవచ్చు. ఇక్కడే బీమా మొత్తం రూ. 25000, ప్రీమియం రూ. 9 ఉండటం చూడవచ్చు.➤కింద కనిపించే కంటిన్యూ బటన్ క్లిక్ చేసిన తరువాత పాలసీ పీరియడ్ అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3 వరకు ఉన్నట్లు కనిపిస్తుంది. దాని కిందనే పాలసీదారు వివరాలు ఇవ్వవలసి ఉంటుంది. అన్నీ పూర్తయిన తరువాత తొమ్మిది రూపాయలు చెల్లించాలి. ఇలా సులభంగా ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్ అప్లై చేసుకోవచ్చు. -
ఫోన్‌పేలో ‘పసిడి’ పొదుపు..
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే (PhonePe) 'డైలీ సేవింగ్స్' పేరుతో కొత్త ఉత్పత్తిని పరిచయం చేయనుంది. ఇందుకోసం మైక్రో-సేవింగ్స్ ప్లాట్‌ఫామ్ ‘జార్’తో భాగస్వామ్యం కుదుర్చికుంది. ఇది యూజర్లు రోజువారీ చిన్న పెట్టుబడి ద్వారా 24 క్యారెట్ల డిజిటల్ బంగారంలో డబ్బును ఆదా చేయడానికి వీలు కల్పిస్తుందని ఫోన్‌పే ఒక ప్రకటనలో తెలిపింది.ఈ కొత్త ఉత్పత్తి కింద వినియోగదారులు డిజిటల్ గోల్డ్‌లో రోజుకు కనిష్టంగా రూ. 10, గరిష్టంగా రూ. 5,000 వరకు పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. స్థిరమైన పొదుపును అలవరచుకోవడంలో ఇది తోడ్పడుతుంది. డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియను కేవలం 45 సెకన్లలోపు క్రమబద్ధీకరించే జార్ ఇంటిగ్రేటెడ్ గోల్డ్ టెక్ సొల్యూషన్‌ను ఫోన్‌పే 'డైలీ సేవింగ్స్' ఫీచర్‌కు జోడించనున్నట్లు కంపెనీ పేర్కొంది.ఇటీవలి కాలంలో తమ ప్లాట్ఫామ్లో డిజిటల్ బంగారంపై యూజర్ల ఆసక్తిలో గణనీయమైన పెరుగుదలను చూసినట్లు ఇన్‌యాప్ కేటగిరీస్, కన్స్యూమర్ పేమెంట్స్ హెడ్ నిహారిక సైగల్ చెప్పారు. ఇటీవల సూక్ష్మమైన, సురక్షితమైన డిజిటల్ గోల్డ్ సేవింగ్స్ ఆప్షన్లకు వినియోగదారుల ప్రాధాన్యత పెరుగుతున్నట్లు ఫోన్‌పే సైతం గుర్తించింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం 560 మిలియన్ల మందికి పైగా ఫోన్‌పే యూజర్లకు డిజిటల్ గోల్డ్‌లో చిన్నపాటి పెట్టుబడులు పెట్టేందుకు వీలు కల్పిస్తుంది. -
ఒకేసారి రూ.5 లక్షలు: ఎన్సీపీఐ కీలక నిర్ణయం
గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత డిజిటల్ పేమెంట్స్ ఎక్కువయ్యాయి. ఇప్పటి వరకు యూపీఐ పేమెంట్స్ రోజుకు/ఒకసారికి ఒక లక్ష మాత్రమే పంపించుకోవడానికి అవకాశం ఉండేది. తాజాగా ఈ పరిమితిని పెంచుతూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NCPI) కీలక ప్రకటన వెల్లడించింది.ఎన్సీపీఐ ప్రకారం రేపటి (సెప్టెంబర్ 16) నుంచి రోజుకు లేదా ఒకసారికి గరిష్టంగా ఐదు లక్షల రూపాయల వరకు పంపించుకోవచ్చు. దీంతో యూజర్లు ఆసుపత్రి బిల్లులు, విద్యాసంస్థల ఫీజులకు సంబంధించిన పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఐపీఓకు అప్లై చేసుకునేటప్పుడు రూ. 5 లక్షలు పేమెంట్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు అన్నివిధాలా చాలా అనుకూలంగా ఉంటుంది.ఇదీ చదవండి: సైబర్ మోసాలకు ఇన్సూరెన్స్: రోజుకు మూడు రూపాయలే.. -
పోటీలోకి మరో యూపీఐ యాప్
న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థలో యూపీఐ చెల్లింపులదే అగ్రస్థానం. ఇప్పటికే పలు యూపీఐ యాప్‌లు యూజర్లకు సేవలందిస్తున్నాయి. ఇప్పుడీ పోటీలోకి మరో యాప్ వచ్చింది. వినియోగదారులు డిజిటల్ చెల్లింపులు జరిపేందుకు వీలు కల్పించేలా ఫిన్‌టెక్ ప్లాట్‌ఫాం భారత్‌పే తాజాగా యూపీఐ టీపీఏపీని (థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్) ఆవిష్కరించింది.ఇందుకోసం యూనిటీ బ్యాంకుతో జట్టుకట్టినట్లు తెలిపింది. ఈ సేవల కోసం కస్టమర్లు భారత్‌పే యాప్‌లో @bpunity ఎక్స్‌టెన్షన్‌తో తమ యూపీఐ ఐడీని క్రియేట్ చేసుకుని ఇటు వ్యక్తులకు అటు వ్యాపార వర్గాలకు చెల్లింపులు జరపవచ్చని పేర్కొంది. కంపెనీ ఇప్పటివరకు వ్యాపారవర్గాల మధ్య యూపీఐ చెల్లింపుల కోసం భారత్‌పే ఫర్ బిజినెస్ యాప్‌ను నిర్వహిస్తోంది.తాజాగా తమ బై–నౌ–పే–లేటర్ యాప్ ’పోస్ట్‌పే’ పేరును ’భారత్‌పే’గా మార్చి వినియోగదారుల చెల్లింపుల సేవల కోసం మరో యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతానికి ఇది ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలో యాపిల్ డివైజ్‌లకు సంబంధించిన యాప్స్టోర్లోనూ అందుబాటులోకి రానుంది. -
యూపీఐ పేమెంట్స్‌లో కీలక మార్పులు..!
డిజిటల్ చెల్లింపుల యుగంలో యూపీఐ (UPI - యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) వినియోగం వేగంగా పెరుగుతోంది. చాలా మంది ఇప్పుడు నగదు లావాదేవీల కంటే యూపీఐ పేమెంట్స్‌నే ఎక్కువగా చేస్తున్నారు. అయితే ఇదే క్రమంలో యూపీఐ మోసాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి.యూపీఐ పేమెంట్స్ భద్రతకు సంబంధించి ప్రస్తుతం పిన్ (PIN) ఆధారిత ధ్రువీకరణ విధానం ఉంది. పేమెంట్స్ ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రతిసారి పిన్ నంబర్ ఎంటర్ చేసి ధ్రువీకరించాల్సి ఉంటుంది. అయినప్పటికీ కొన్నిసార్లు మోసాలు జరగుతున్నాయి. దీనిపై దృష్టిసారించిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మరో కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతోంది.బయోమెట్రిక్ ధ్రువీకరణ!సీక్రెట్ పిన్ నంబర్‌ను తెలుసుకుని మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఎన్పీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మింట్ నివేదిక ప్రకారం.. పిన్ ఆధారిత ధ్రువీకరణ ప్రక్రియకు బదులుగా బయోమెట్రిక్ ధ్రువీకరణను తీసుకురానుంది. ఈ కొత్త విధానంలో యూపీఐ లావాదేవీలను వేలిముద్ర స్కానింగ్ లేదా ఫేస్ ఆథెంటికేషన్ ద్వారా ధ్రువీకరించాల్సి ఉంటుంది. స్మార్ట్ఫోన్లలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్లను ఉపయోగించి యూపీఐ చెల్లింపులను మరింత సురక్షితంగా, సులభంగా చేసే విధానంపై ఎన్పీసీఐ కసరత్తు చేస్తోంది. -
ఫోన్‌పే క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం ఫోన్‌పే తాజాగా క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ ప్రారంభించింది. బ్యాంకులు ఆఫర్ చేసే ప్రీ–అప్రూవ్డ్ క్రెడిట్ లైన్‌ను యూపీఐకి అనుసంధానించి కస్టమర్లు సులభంగా చెల్లింపులు జరుపవచ్చు.రుణాల విషయంలో యూపీఐపై రూపే క్రెడిట్ కార్డులు విజయవంతం అయిన తరువాత కంపెనీ నుంచి ఇది రెండవ ఉత్పాదన అని ఫోన్‌పే పేమెంట్స్ హెడ్ దీప్ అగర్వాల్ తెలిపారు. రుణ లభ్యత విషయంలో దేశంలో క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ సేవలు సంచలనం కలిగిస్తాయని అన్నారు.వినియోగదారు యూపీఐ ఖాతాకు క్రెడిట్ లైన్‌ను జోడించడం ద్వారా విభిన్న క్రెడిట్ కార్డ్‌లను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. యూజర్లు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) యాప్ ద్వారా వర్తకులకు పేమెంట్స్ చేయవచ్చు. కస్టమర్ యూపీఐ లావాదేవీల ఆధారంగా బ్యాంకులు స్వల్పకాలిక ప్రీ–సాంక్షన్డ్ క్రెడిట్ లైన్ ఆఫర్ చేస్తున్నాయి. -
ఫోన్ పేతో వివాదం.. కన్నడిగులకు మద్దతుగా సుదీప్
కర్ణాటకలోని స్థానికులకు ఉద్యోగ రిజర్వేషన్లను వ్యతిరేకించిన ఫోన్ పే సంస్థపై బహిష్కరణ ప్రచారం ప్రారంభమైంది. ఈ క్రమంలో ఫోన్ పేపై కన్నడిగులు చేస్తున్న పోరాటానికి హీరో సుదీప్ మద్దతు తెలిపారు. ఫోన్ పేతో చేసుకున్న అగ్రిమెంట్‌ను రద్దు చేసుకోవాలని సుదీప్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.కర్ణాటకలో ఉండే ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ నియామకాల్లో స్థానికులకే ప్రాముఖ్యత ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేటు సంస్థల్లో కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. అయితే, దీనిని పోన్ పే సీఈవో సమీర్ నిగమ్ తప్పుబట్టారు. దీంతో అక్కడి ప్రజల నుంచి ఫోన్ పే పట్ల తీవ్రమైన వ్యతిరేఖత వచ్చింది.నటుడు సుదీప్ కర్ణాటకలో ఫోన్ పే బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. అక్కడ వినియోగదారులు డబ్బును పంపుతున్న సమయంలో 'థ్యాంక్యూ బాస్' అంటూ సుదీప్ వాయిస్ వినిపిస్తుంది. అయితే, కన్నడిగుల పట్ల ఫోన్ పే వ్యవహరించిన తీరుతో ఆ సంస్థ మీద అక్కడ ప్రజలు ఫైర అవుతున్నారు. ఈ నేపథ్యంలో కిచ్చ సుదీప్ ఓ కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతున్నాడు. తనను ఆదరించిన కన్నడిగుల పక్షాన నిలబడేందుకు ఆయన సిద్ధపడుతున్నట్లు సమాచారం. కన్నడిగులకు క్షమాపణలు చెప్పకుంటే ఫోన్ పే సంస్థతో తాను చేసుకున్న అగ్రిమెంట్‌ను రద్దు చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై సుదీప్ రేపు అధికారికంగా తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.తమ ఫోన్లలో ఫోన్ పే యాప్‌ను అన్ఇన్స్టాల్ క్యాంపెయిన్‌ను అక్కడి ప్రజలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కన్నడిగులకు సపోర్ట్ చేసేందుకు సుదీప్ ముందుకు వచ్చినట్లు ఆయన టీమ్ నుంచి సమాచారం అందుతోంది. అయితే, కన్నడిగులకు ఉద్యోగ రిజర్వేషన్లను చాలా మంది వ్యాపారవేత్తలు వ్యతిరేకించారు. దీంతో ఆయా పారిశ్రామికవేత్తలపై నిరసన కూడా వ్యక్తమైంది. ప్రైవేట్ సంస్థల్లో కన్నడిగులకు రిజర్వేషన్ తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త బిల్లుకు వ్యతిరేకంగా ఫోన్ పే సీఈవో సమీర్ నిగమ్ మొదటగా వ్యతిరేకించారు. అందుకే, కన్నడిగుల అతనికి గుణపాఠం చెప్పాలని ప్రచారం జరుగుతోంది.రిజర్వేషన్ల విషయంలో వెనక్కు తగ్గిన కర్ణాటక ప్రభుత్వంకర్ణాటకలోని ప్రైవేటు సంస్థల్లో గ్రూప్ సీ, డీ గ్రేడ్ పోస్టుల్లో కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై ప్రభుత్వం వెనకడుగు వేసింది. అక్కడి పరిశ్రమవర్గాల నుంచి భారీగా వ్యతిరేకత రావడంతో బిల్లును తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. దీనిపై మరింత లోతుగా పరిశీలించి రానున్న రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయ వెల్లడించింది. -
ఫోన్ పే, జీపే, పేటీఎం.. ద్వారా విద్యుత్తు బిల్లు చెల్లించకూడదు
ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం..వంటి థర్డ్‌పార్టీ యాప్‌ల ద్వారా ఎలాంటి విద్యుత్తు బిల్లులు చెల్లించకూడదని టీజీఎస్పీడీసీఎల్ తెలిపింది. జులై 1 నుంచి ఈ నిబంధన అమలులోకి వచ్చిందని చెప్పింది. భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. భవిష్యత్తులో టీజీఎస్పీడీసీఎల్ లేదా ఎస్పీడీసీఎల్ అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే విద్యుత్తు బిల్లులు చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో వివరాలు వెల్లడించింది.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..‘ఎస్పీడీసీఎల్ పరిధిలో 85 శాతానికి పైగా పవర్ బిల్లు చెల్లింపులు థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ల (టీపీఏపీ) ద్వారానే జరుగుతున్నాయి. ఇందుకోసం కొన్ని యూపీఐ ఆధారిత యాప్‌లను మాత్రమే ఎక్కువగా వినియోగిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం..బ్యాంకు యాప్‌లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఆధ్వర్యంలోని భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్)లో నమోదవ్వాలి. కానీ చాలా థర్డ్ పార్టీ యాప్‌లకు సేవలందిస్తున్న బ్యాంకులు ఇంకా ఈ సిస్టమ్‌ను యాక్టివేట్ చేసుకోలేదు. దాంతో సదరు చెల్లింపులను నిలిపేస్తున్నాం’ అని తెలిపారు.Dear Consumers, As per the RBI directions, the Service Providers viz., PhonePe, Paytm, Amazon Pay, Google Pay and Banks have stopped to accept the electricity bills of TGSPDCL w.e.f. 01/07/2024. Hence, all the consumers are requested to make the monthly current bill payments…— TGSPDCL (@tgspdcl) July 1, 2024ఆర్బీఐ నిబంధనలు..జులై 1 నుంచి ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఆధ్వర్యంలోని భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్) ద్వారానే చెల్లింపులు చేయాలని పేర్కొంది. వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఇందులో భాగంగా యూపీఐ సేవలందించే బ్యాంకులు బీబీపీఎస్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. కానీ ఇప్పటివరకు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు ఈ సిస్టమ్‌ను ఎనేబుల్ చేసుకోలేదు. దానివల్ల ఫోన్‌పే, గూగుల్ పే, అమెజాన్ పే.. వంటి థర్డ్‌పార్టీ యాప్‌ల్లో బిల్లులు చెల్లించలేరు. ఆ యాప్‌ల ద్వారా క్రెడిట్ కార్డుల నుంచి కూడా బిల్లు పేమెంట్ చేయలేరు.ఇదీ చదవండి: హెచ్డీఎఫ్సీ యూపీఐ సేవలు నిలిపివేత.. ఎప్పుడంటే..ఇదిలాఉండగా ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ బ్యాంకులు బీబీపీఎస్ ప్లాట్ఫామ్లో నమోదయ్యాయి. కాబట్టి పైన తెలిపిన బ్యాంక్ కస్టమర్లు థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చెల్లింపులను కొనసాగించవచ్చు. -
TGSPDCL: ఫోన్‌పే, పేటీఎంలో కరెంటు బిల్లులు చెల్లించకండి
సాక్షి,హైదరాబాద్: ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే లాంటి యూపీఐ పేమెంట్ యాప్‌ల ద్వారా ఈజీగా విద్యుత్ బిల్లులు చెల్లించే ఛాన్సు ఇక లేదు. ఈ నెల నుంచి విద్యుత్ బిల్లులు యూపీఐ యాపుల్లో పే చేయడం కుదరదు. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల తరహాలోనే యూపీఐ పేమెంట్ యాప్స్ ఈ సేవలను నిలిపి వేశాయి. ఈ నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) తమ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ రెండింటి ద్వారానే ఈ నెల కరెంటు బిల్లులు చెల్లించాలని వినియోగదారులను కోరింది. ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి జులై 1 నుంచి ఆయా చెల్లింపు సంస్థలు టీజీఎస్పీడీసీఎల్ విద్యుత్ బిల్లుల చెల్లింపులను నిలిపివేశాయని ఆ సంస్థ ఎక్స్(ట్విటర్) ద్వారా తెలిపింది. ఒక్క దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థే కాకుండా ఉత్తర తెలంగాణకు సంబంధించిన టీజీఎన్పీడీసీఎల్ విద్యుత్ పంపిణీ సంస్థది అదే పరిస్థితని తెలుస్తోంది. Dear Consumers, As per the RBI directions, the Service Providers viz., PhonePe, Paytm, Amazon Pay, Google Pay and Banks have stopped to accept the electricity bills of TGSPDCL w.e.f. 01/07/2024. Hence, all the consumers are requested to make the monthly current bill payments…— TGSPDCL (@tgspdcl) July 1, 2024 -
గూగుల్ పే, ఫోన్ పే ఇక అవసరం లేదు..మీ అర చేయి చూపిస్తే చాలు !
-
ఎన్పీసీఐ సమావేశం..గూగుల్‌పే, ఫోన్‌పేకు లేని ఆహ్వానం!
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఆధ్వర్యంలోని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఇటీవల నిర్వహించిన ఓ సమావేశానికి యూపీఐ థర్డ్‌పార్టీ చెల్లింపు యాప్‌లైన గూగుల్‌పే, ఫేన్‌పేను ఆహ్వానించలేదు. క్రెడ్, స్లైస్, ఫ్యామ్‌పే, జొమాటో, గ్రో, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థల యాజమాన్యాలకు ఆహ్వానం అందింది. ఈమేరకు వివరాలు ఉటంకిస్తూ టైక్స్‌ఆఫ్‌ఇండియాలో కథనం వెలువడింది. ఎన్పీసీఐ ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా యూపీఐ చెల్లింపుల వ్యవస్థలో కొత్త సంస్థలకు ప్రోత్సాహం అందించేలా చర్చలు జరిగినట్లు తెలిసింది. పైన తెలిపిన కంపెనీలు తమ వినియోగదారులను పెంచుకుని ఇంటర్నల్ యూపీఐ సర్వీస్‌లను అందించేలా చూడాలని ఎన్పీసీఐ చెప్పింది. అయితే సమావేశానికి గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం వంటి ప్రధాన యూపీఐ చెల్లింపు యాప్ యాజమాన్యాలకు ఆహ్వానం అందలేదు. ఈ మూడు కంపెనీల యూపీఐ లావాదేవీల పరిమాణం ఇప్పటికే 90 శాతానికి చేరినట్లు తెలిసింది. దాంతో వీటిని సమావేశానికి ఆహ్వానించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యక్రమం ప్రధానంగా కొత్తగా యూపీఐ చెల్లింపుల రంగంలోకి అడుగుపెడుతున్న కంపెనీలు, స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందించడానికి ఏర్పాటు చేయబడినట్లు తెలిసింది. ఆయా కంపెనీల అవసరాలు ఏమిటో తెలుసుకుని వాటిని పరిష్కరించేలా చర్చలు జరిగినట్లు సమాచారం. సమావేశంలో భాగంగా కొత్త సంస్థలు రూపేకార్డుల కోసం ప్రభుత్వం అందిస్తున్న జీరో మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) వంటి సౌకర్యాన్ని తమకు కల్పించాలని ఎన్పీసీఐను కోరినట్లు తెలిసింది. ఇతర కార్డ్‌లతో పోల్చితే రూపేకార్డు చెల్లింపులను అంగీకరించే వ్యాపారులకు ప్రయోజనాలు అధికంగా ఉంటున్నాయి. చిన్న సంస్థలు యూపీఐ చెల్లింపుల రంగంలోకి రావాలంటే ప్రత్యేకంగా కొన్ని ప్రోత్సాహకాలు కల్పించాలని కోరినట్లు తెలిసింది. రెండు సంస్థలదే గుత్తాధిపత్యం.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు సంబంధించి అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇటీవల ఫోన్‌పే, గూగుల్పేలకు ఆదరణ పెరిగింది. యూపీఐ చెల్లింపుల్లో 2 సంస్థలదే ఆధిపత్యం కావడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విభాగంలో గుత్తాధిపత్యం లభించకుండా చూసేందుకు ఫోన్‌పే, గూగుల్‌పే సంస్థలకు ప్రత్యామ్నాయంగా దేశీయ ఫిన్‌టెక్ సంస్థల వృద్ధికి సహకరించాలని ప్రభుత్వానికి పార్లమెంటరీ కమిటీ సూచించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ఏడాదిలోపు ప్రముఖ యాప్‌లో 100 కోట్ల యూజర్లు యూపీఐ విభాగంలో కంపెనీలకు 30% మార్కెట్ వాటా పరిమితి నిబంధన గడువును 2024 డిసెంబరు వరకు పొడిగించాలని ఎన్పీసీఐ అంటోంది. సాంకేతిక పరిమితుల రీత్యా ఇది సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. -
ప్రముఖ దేశంలో యూపీఐ సేవలు ప్రారంభించిన ఫోన్‌పే
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ) ద్వారా సింగపూర్‌లో తమ వినియోగదారులు ఆర్థిక లావాదేవీలు నిర్వహించవచ్చని ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే ఇటీవల తెలియజేసింది.ఈ మేరకు సింగపూర్ టూరిజమ్ బోర్డు (ఎస్టీబీ)తో ఒప్పందంపై సంతకాలు చేసినట్లు తెలిపింది. భారత్, సింగపూర్ల మధ్య ఇప్పటికే ఉన్న యూపీఐ అనుసంధానతపై ఈ ఒప్పందం కుదిరిందని, ఖాతాదార్లు తమ ప్రస్తుత భారతీయ బ్యాంక్ ఖాతాల నుంచి నేరుగా రెండు దేశాల మధ్య విదేశీ లావాదేవీలను (క్రాస్-బోర్డర్ ట్రాన్సాక్షన్స్) తక్షణమే అనుమతిస్తున్నట్లు సంస్థ తెలిపింది.కొవిడ్ పరిణామాలు, పెద్దనోట్ల రద్దు వంటి నిర్ణయాల తర్వాత దేశంలో యూపీఐ వాడకం పెరిగింది. డిజిటల్ లావాదేవీల్లో కీలక పాత్ర పోషిస్తున్న యూపీఐ లావాదేవీలు గతేడాదిలోనే వెయ్యి కోట్ల మార్కును అధిగమించాయి. 2023 అక్టోబరులో యూపీఐ లావాదేవీల సంఖ్య 1,141 కోట్లకు చేరింది. దీంతో వాటి విలువ రూ.17.16 లక్షల కోట్లుగా నమోదైనట్లు ఎన్పీసీఐ అధికారిక ప్రకటలో తెలిపింది. -
ప్రముఖ దేశంలో యూపీఐ సేవలు ప్రారంభించిన ఫోన్‌పే
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ) ద్వారా సింగపూర్‌లో తమ వినియోగదారులు ఆర్థిక లావాదేవీలు నిర్వహించవచ్చని ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే తాజాగా తెలియజేసింది. ఈ మేరకు సింగపూర్ టూరిజమ్ బోర్డు (ఎస్టీబీ)తో ఒప్పందంపై సంతకాలు చేసినట్లు సంస్థ తెలిపింది. భారత్, సింగపూర్ల మధ్య ఇప్పటికే ఉన్న యూపీఐ అనుసంధానతపై ఈ ఒప్పందం కుదిరిందని, ఖాతాదార్లు తమ ప్రస్తుత భారతీయ బ్యాంక్ ఖాతాల నుంచి నేరుగా రెండు దేశాల మధ్య విదేశీ లావాదేవీలను (క్రాస్-బోర్డర్ ట్రాన్సాక్షన్స్) తక్షణమే అనుమతిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుల జాబితాలో తెలుగువారు ఎక్కడంటే.. కొవిడ్ పరిణామాలు, పెద్దనోట్ల రద్దు వంటి నిర్ణయాల తర్వాత దేశంలో యూపీఐ వాడకం పెరిగింది. డిజిటల్ లావాదేవీల్లో కీలక పాత్ర పోషిస్తున్న యూపీఐ లావాదేవీలు గతేడాదిలోనే వెయ్యి కోట్ల మార్కును అధిగమించాయి. 2023 అక్టోబరులో యూపీఐ లావాదేవీల సంఖ్య 1,141 కోట్లకు చేరింది. దీంతో వాటి విలువ రూ.17.16 లక్షల కోట్లుగా నమోదైనట్లు ఎన్పీసీఐ అధికారిక ప్రకటలో తెలిపింది. -
ఓర్నీ..! ఆఖరికి భిక్ష కూడా డిజటల్ చెల్లింపుల్లోనే..!
ఇప్పుడూ టెక్నాలజీ ఫుణ్యమా! అని అందరూ డిజిటల్ లావాదేవీల ద్వారానే ఈజీగా చెల్లింపులు చేసేస్తున్నారు. బ్యాంకుల వద్దకు వెళ్లి.. బారులు తీరి ఉండాల్సిన పనిలేకుండా పోయింది. ఎలాంటి పని అయినా ఒక్కఫోన్పేతో చకచక అయిపోతుంది. ప్రతిదీ ప్రస్తుతం డిజిటల్ చెల్లిపులే, క్యూర్ కోడ్ స్కానింగ్‌లే. ఇప్పుడు ఆ డిజిటల్ చెల్లింపుల్లోనే బిచ్చగాళ్లు భిక్ష వేయడం వచ్చేసింది. ఓ బిచ్చగాడు ఫోన్ పే క్యూర్ కోడ్‌తో భిక్ష కోరుతూ ఆకర్షించాడు. ఈ ఘటన గౌహతిలో చోటు చేసుకుంది. ఇది చూస్తే నిజంగా టెక్నాలజీకి హద్దులు లేవంటే ఇదే కథ అనిపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని కాంగ్రెస్ నాయకుడు గౌరవ్ సోమాని సోషల్ మీడియా ఎక్స్‌లో పంచుకున్నారు. అందులో ఆ వ్యక్తి మెడలో క్యూర్ కోడ్‌తో ఉన్న ఫోన్‌పేని ధరించి భిక్ష కోరుతున్నట్లు కనిపిస్తుంది. ఒక కారులోని ఇద్దరు వ్యక్తులు అతడి క్యూర్ కోడ్‌ని స్కాన్ చేసి భిక్ష వేస్తున్నట్లు కనిపిస్తుంది. అతడు తన ఫోన్‌ని చెవి దగ్గర పెట్టకుని తన ఖాతాలో డబ్బులు జమ అవ్వుతున్న సమాచారం వింటున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఈ మేరకు కాంగ్రెస్ నాయకుడు సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్‌లో దీన్ని మానవత్వంలో డిజిటల్ పురోగతిగా అభివర్ణించాడు. ఇది 'ఆలోచనను రేకెత్తించే క్షణం' అనే క్యాప్షన్‌తో వీడియోని ఎక్స్‌లో షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఇలా ఒక బిచ్చగాడు డిజిటల్ చెల్లింపులను ఉపయోగించడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుమునుపు బిహార్‌లో ఒక డిజటల్ బిచ్చగాడు ఇలానే మెడలో క్యూఆర్ కోడ్ ప్లకార్డ్‌తో చెల్లింపులు జరిపేలా ప్రజలకు ఆప్షన్ ఇవ్వడం కనిపించింది. అతనను ప్రధాని నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమంలో దీన్ని గురించి వినడం ఎప్పటికీ మర్చిపోనని ఆ డిజిటల్ బిచ్చగాడు చెప్పుకొచ్చాడు కూడా. అలాగే న్యూఢిల్లీలో అయేషా శర్మ అనే 29 ఏళ్ల ట్రాన్స్విమన్ కూడా యూపీఐ పేమెంట్ యాప్‌ల ద్వారా డబ్బులను స్వీకరిస్తుంది. Stumbled upon a remarkable scene in bustling #Guwahati – a beggar seamlessly integrating digital transactions into his plea for help, using PhonePe! Technology truly knows no bounds. It's a testament to the power of technology to transcend barriers, even those of socio-economic… pic.twitter.com/7s5h5zFM5i — Gauravv Somani (@somanigaurav) March 24, 2024 (చదవండి: ఆవుని ఆస్పత్రికి తరలించడం కోసం ఏకంగా హెలికాప్టర్..!) -
Flipkart: రెండేళ్లలో రూ.41000 కోట్లు తగ్గిన ఫ్లిప్‌కార్ట్ విలువ!
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వేల్యుయేషన్ గత రెండేళ్లలో రూ. 41,000 కోట్ల మేర (సుమారు 5 బిలియన్ డాలర్లు) తగ్గింది. 2022 జనవరిలో ఇది 35 బిలియన్ డాలర్లుగా ఉండగా ఈ ఏడాది జనవరి 31 నాటికి 35 బిలియన్ డాలర్ల స్థాయికి పరిమితమైంది. ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ ఈక్విటీ స్వరూపంలో వచి్చన మార్పుల పరిశీలనతో ఇది వెల్లడైంది. 2022 ఆర్థిక సంవత్సరంలో ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ 8 శాతం వాటాని 3.2 బిలియన్ డాలర్లకు విక్రయించింది. తద్వారా సంస్థ వేల్యుయేషన్ 40 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టినట్లయింది. మరోవైపు, 2024 ఆర్థిక సంవత్సరంలో వాల్‌మార్ట్ 3.5 బిలియన్ డాలర్లతో తన వాటాను 10 శాతం పెంచుకోవడంతో వేల్యుయేషన్ 35 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టినట్లయింది. అయితే, వేల్యుయేషన్ తగ్గిపోయిందనడానికి లేదని, 2023లో ఫోన్‌పే సంస్థను విడగొట్టడం వల్ల సర్దుబాటు అయినట్లుగా మాత్రమే భావించాల్సి ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ వర్గాలు తెలిపాయి. సంస్థ వేల్యుయేషన్ ప్రస్తుతం 38–40 బిలియన్ డాలర్లుగా ఉంటుందని సంబంధిత వర్గాలు వివరించాయి. -
అప్పుడు అమితాబ్ బచ్చన్.. ఇప్పుడు మహేశ్ బాబు
పబ్లిక్ ఫిగర్స్ (ప్రముఖులు) వేలకోట్ల వ్యాపార రంగాన్ని కనుసైగతో శాసిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అగ్గిపుల్ల నుంచి సబ్బు బిళ్ల వరకు ఆయా ప్రొడక్ట్ ల అమ్మకాలు జరిగేలా బ్రాండ్ అంబాసీడర్లుగా రాణిస్తున్నారు. ఆయా ఉత్పత్తుల అమ్మకాలు జరిగేలా ప్రచారం చేస్తున్నారు. స్పోర్ట్స్ పర్సన్, సినిమా స్టార్లయినా బ్రాండ్ అంబాసీడర్‌గా వాళ్లు చేయాల్సిందల్లా మూమెంట్లు,డబ్బింగ్ చెబితే సరిపోతుంది. ఒక్కసారి సదరు బ్రాండ్ అంబాసీడర్ యాడ్ మార్కెట్ లోకి విడుదలైందా అంతే సంగతులు. ఊహించని లాభాల్ని చూడొచ్చు. అందుకే చిన్న చిన్న కంపెనీల నుంచి బడబడా కంపెనీల వరకు ఆయా రంగాల్లో రాణిస్తున్న వారిని తమ కంపెనీ ప్రొడక్ట్ ల అమ్మకాల కోసం బ్రాండ్ అంబాసీడర్ లు గా నియమించుకుంటాయి. వారికి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ చెల్లించుకుంటాయి. తాజాగా, డిజిటల్ లావాదేవీల్లో దూసుకుపోతున్న ప్రముఖ ఫిన్ టెక్ కంపెనీ ఫోన్ పే యూజర్లను ఆకట్టుకునేందుకు వినూత్న ప్రయత్నం చేసింది. గత ఏడాది తన స్మార్ట్ స్పీకర్లకు బిగ్ బి అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్‌ను అందించిన 'ఫోన్ పే'.. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్‌ను జోడించింది. ఇకపై చెల్లింపులు చేసినప్పుడు మనీ రిసీవ్డ్ అనే కంప్యూటర్ జనరేటెడ్ వాయిస్ కి బదులు 'మహేశ్ బాబు' గొంతు వినిపిస్తుంది. ఇందుకోసం ఫోన్ పే ప్రతినిధులు మహేష్ వాయిస్ తీసుకుని కృత్రిమ మేధస్సు ద్వారా వాయిస్‌ను జనరేట్ చేశారు. ఈ ప్రకటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూజర్ చెల్లించిన మొత్తాన్ని ప్రకటించిన తర్వాత ధన్యవాదాలు బాస్ అనే వాయిస్ వినిపిస్తుంది. Babu voice vasthundhi phone pay lo ma shop lo 💥💥😅🔥@urstrulyMahesh #GunturKaaram #SSMB29 pic.twitter.com/1lib8hIjl7 — babu fan ra abbayilu 💥💥🔥🤙 (@Vamsi67732559) February 20, 2024 బిగ్ బికి ఎంత రెమ్యునరేషన్ అంటే బిగ్ బి అమితాబ్ బచ్చన్ సుమారు 30కి పైగా సంస్థలకు బ్రాండ్ అంబాసీడర్ గా పనిచేస్తున్నారు. కుర్ర హీరోలతో పోటీ పడి మరి బ్రాండ్ అంబాసీడర్ గా పని చేస్తూ తన ప్రచారంతో ఆయా కంపెనీలకు కనకవర్షం కురిపిస్తున్నారు. ఇందుకోసం ఆయన ఒక్కో సంస్థ నుంచి రూ.5కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. -
పేటీఎంకు బైబై.. సంబరపడిపోతున్న ప్రత్యర్థులు!
పేటీఎంపై ఆర్బీఐ విధించిన ఆంక్షలు ఆ సంస్థను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అటు వ్యాపారం, ఇటు వినియోగదారుల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. ఫలితంగా పేటీఎం వినియోగాన్ని తగ్గించి ప్రత్యర్ధి సంస్థల యాప్‌లను వినియోగించే వారి సంఖ్య పెరిగిపోతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన ఒక రోజు తర్వాత అంటే ఫిబ్రవరి 1న పేటీఎం యాప్ రోజువారి డౌన్లోడ్లు భారీగా తగ్గాయి. ఈ సమయంలో భీమ్ యూపీఐ యాప్ డౌన్లోడ్లు 49 శాతం పెరిగాయి. గూగుల్ పే యాప్ రోజువారీ డౌన్లోడ్లు 10.6 శాతం తగ్గాయి. న్యూయార్క్‌లోని మొబైల్ అనలిటిక్స్, ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్ Appfigures షేర్ చేసిన డేటా ప్రకారం.. ఫిబ్రవరి 1న 135,139గా ఉన్న పేటీఎం యాప్ డౌన్లోడ్లు ఫిబ్రవరి 19న 55 శాతం క్షీణించి 60,627కి పడిపోయాయి. ♦ భీమ్ యూపీఐ డౌన్లోడ్లు ఈ నెల మొదటి రోజున 222,439 నుండి ఫిబ్రవరి 19న 331,781కి పెరిగాయి. ♦ గూగుల్ పే రోజువారీ యాప్ డౌన్లోడ్లు 105,296 నుండి 94,163కి పడిపోయాయి. ♦ ఫోన్ పే డౌన్లోడ్లు ఫిబ్రవరి 1న 317,522 నుండి ఫిబ్రవరి 7న 503,436కి పెరిగాయి. ఫిబ్రవరి 19న 163,011కి తగ్గాయి. డిజిటల్ చెల్లింపు లావాదేవీల కోసం వ్యాపారులు ఇతర యాప్‌లు, బ్యాంక్ అకౌంట్లకు మారడం ప్రారంభించారు. ఢిల్లీలోని బులియన్ మార్కెట్ అసోసియేషన్ చైర్మన్ యోగేష్ సింఘాల్ మాట్లాడుతూ.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై వార్తలు వచ్చినప్పటి నుండి వ్యాపారులు ఫోన్ పే, గూగుల్ పే, భీమ్ యూపీఐ యాప్‌లకు మారారు. ‘ఈ చర్య కేవలం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై మాత్రమేనని, పేటీఎం యాప్‌పై ఎటువంటి ప్రభావం లేదని మాకు తెలుసు. అయితే, ముందస్తు చర్యల్లో భాగంగా మేము మా ఖాతాలను ఇతర చెల్లింపు అగ్రిగేటర్లకు తరలిస్తున్నాము. చూడండి, వ్యాపారంలో నమ్మకం అనేది అత్యంత ముఖ్యమైన విషయం’అని సింఘాల్ అన్నారు. ఈ సందర్భంగా ‘పేటీఎం యాప్ డౌన్లోడ్లలో క్షీణత వినియోగదారుల మధ్య అనిశ్చితి, నమ్మకం కోల్పోవడం ప్రతిధ్వనిస్తుంది’అని ఇండియా బ్లాక్‌చెయిన్ ఫోరమ్ కో-ఫౌండర్ శరత్ చంద్ర అన్నారు. -
యాపిల్, గూగుల్ ప్లేస్టోర్‌కు పోటీగా ఫోన్‌పే యాప్ స్టోర్..? ప్రత్యేకతలివే..
భారత డిజిటల్ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పే తెరతీసింది. తాజాగా ఫోన్‌పే ఇండస్ యాప్‌స్టోర్‌ను దిల్లీ వేదికగా బుధవారం ఆవిష్కరించింది. 45 విభాగాల్లో 2 లక్షలకుపైగా యాప్స్, గేమ్స్‌ను ఈ యాప్‌స్టోర్‌లో పొందుపరిచింది. తెలుగు, ఇంగ్లిష్, హిందీ సహా 12 భాషల్లో వినియోగదారులు తమకు కావాల్సిన యాప్స్‌ను ఇందులో సర్చ్ చేయవచ్చు. ఇన్-యాప్ కొనుగోళ్లపై గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్స్టోర్లు 15-30% వరకు ఫీజు వసూలు చేస్తున్నాయి. అయితే డెవలపర్లు 2025 ఏప్రిల్ 1 వరకు యాప్ లిస్టింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. తర్వాత ఇన్–యాప్ బిల్లింగ్ కోసం తమకు నచ్చిన థర్డ్‌పార్టీ పేమెంట్ గేట్‌వేను ఎంచుకునే వెసులుబాటును తీసుకొచ్చారు. ఫోన్‌పే యాప్ లేదా ఇండస్యాప్స్టోర్.కామ్ నుంచి ఇండస్ యాప్‌స్టోర్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ‘మొబైల్ యాప్ మార్కెట్లో మరింత పోటీకి ఈ యాప్‌స్టోర్ నాంది పలికింది. ఇది మరింత శక్తివంతమైన భారతీయ డిజిటల్ పర్యావరణ వ్యవస్థను రూపొందించడంలో సహాయపడుతుంది’ అని ఫోన్‌పే సీఈవో, ఫౌండర్ సమీర్ నిగమ్ తెలిపారు. ఇదీ చదవండి: పూర్తి మహిళా సిబ్బందితో కార్యకలాపాలు.. ఎక్కడో తెలుసా.. ఇ-మెయిల్ ఖాతాతో సంబంధం లేకుండా మొబైల్ నంబర్‌తో లాగిన్ అయ్యే విధానాన్ని ఈ యాప్ స్టోర్ తీసుకొచ్చింది. ఇప్పటికే నోకియా, లావా వంటి కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 2023లో మొబైల్ యాప్‌లపై 1.19 లక్షల కోట్ల గంటలను భారతీయులు గడిపినట్లు కొన్ని సర్వేల ద్వారా తెలిసింది. 2021లో నమోదైన 95,400 కోట్ల గంటలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. యాప్‌ల డౌన్లోడ్ల విషయంలో ప్రపంచంలోనే మనదేశం అతిపెద్ద మార్కెట్ కావడం విశేషం. -
సంబరపడిపోతున్న ప్రత్యర్థులకు షాక్.. సరికొత్త ప్లాన్‌లో పేటీఎం!
సంక్షోభంలో చిక్కుకున్న ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం మూతపడుతుందని, ఇక తమకు తిరుగులేదని సంబరపడిపోతున్న ప్రత్యర్థి కంపెనీలకు పేటీఎం షాక్ ఇవ్వబోతోంది. తమ కస్టమర్లను కాపాడుకునేందుకు ఈ ఫిన్‌టెక్ సరికొత్త ప్లాన్ చేస్తోంది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. సంక్షోభంలో చిక్కుకున్న పేటీఎం (Paytm) మాతృ సంస్థ One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ తమ కస్టమర్లకు యూపీఐ ( యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ - UPI ) సేవలు అందుబాటులో ఉండేలా థర్డ్-పార్టీ పేమెంట్ యాప్ (TPAP) మార్గంపై దృష్టి సారిస్తోంది. ఇదీ చదవండి: ఆ జీతమే శాపమైందా.. దిక్కుతోచని పేటీఎం ఉద్యోగులు "పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ చెల్లింపు సేవలను నిలిపివేస్తుంది కాబట్టి, ఇతర బ్యాంకుల ద్వారా యూపీఐని ఏకీకృతం చేస్తూ ముందుకు సాగే థర్డ్-పార్టీ యాప్‌గా మారుతుంది" అని పేటీఎంలో పరిణామాల గురించి తెలిసిన ఒక వ్యక్తి చెప్పినట్లు నివేదిక పేర్కొంది. దీని ప్రకారం.. దేశంలో యూపీఐ వ్యవస్థను నడుపుతున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)తో One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ఇప్పటికే చర్చలు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. మారనున్న వీపీఏ ప్రస్తుతం యూపీఐ చెల్లింపుల కోసం పేటీఎం యూజర్లు @paytmతో ముగిసే వర్చువల్ పేమెంట్ అడ్రస్ (VPA) కలిగి ఉన్నారు. అయితే, మార్చి 1 తర్వాత ఈ వీపీఏలు వేరే బ్యాంక్ హ్యాండిల్‌కి మారుతున్నాయి. పేటీఎం యూపీఐ సర్వీస్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) కిందకు వస్తుంది. ఫిబ్రవరి 29 తర్వాత నుంచి కస్టమర్ల నుంచి డబ్బు తీసుకోకుండా ఆర్బీఐ జనవరి 31న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ని నిషేధించింది. ఈ నేపథ్యంలో పేటీఎం తమ యూపీఐ కస్టమర్లకు కొత్త వీపీఏల కోసం మూడు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకులతో భాగస్వామ్యం చేసుకోనుందని తెలుస్తోంది. నివేదిక ప్రకారం.. యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యస్ బ్యాంకులు ఈ జాబితాలో ఉన్నాయి. అమెజాన్ పే, గూగుల్ పే (Google Pay), ఫోన్‌పే (PhonePe)లతో సహా ఇప్పటికే 22 థర్డ్-పార్టీ పేమెంట్ యాప్‌లు యూపీఐ సర్వీసులు అందిస్తున్నాయి. యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులు థర్డ్-పార్టీ రూట్ ద్వారా ఇలాంటి ఫిన్టెక్లకు సహకారం అందిస్తున్నాయి. సాధారణంగా వీపీఏను బ్యాంక్, ఫిన్‌టెక్ రెండింటి బ్రాండ్ పేర్లను కలిపి రూపొందిస్తారు. -
PhonePe: కొత్త సీఈవోను ప్రకటించిన ఫోన్‌పే
ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పే అంతర్జాతీయ విస్తరణపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో రితేష్ పాయ్‌ను తమ ఇంటర్నేషనల్ పేమెంట్స్ బిజినెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించింది. ఫోన్‌పేలో చేరిన రితేష్ పాయ్.. యూకేకి చెందిన టెర్రాపే (TerraPay)లో ప్రాడక్ట్స్ అండ్ సొల్యూషన్స్ విభాగానికి ప్రెసిడెంట్‌గా పనిచేసేవారు. యస్ బ్యాంక్‌లో సీనియర్ గ్రూప్ ప్రెసిడెంట్, చీఫ్ డిజిటల్ ఆఫీసర్‌గా కూడా పనిచేసిన ఆయన అక్కడ బ్యాంక్ డిజిటల్ వ్యూహానికి నాయకత్వం వహించారు. రితేష్ పాయ్ చేరికపై ఫోన్‌పే చీఫ్, వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ సంతోషం వ్యక్తం చేశారు. తమ అంతర్జాతీయ వృద్ధి ప్రణాళికలకు నాయకత్వం వహించడానికి రితేష్ మాతో చేరినందుకు సంతోషిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫోన్‌పే 2015 డిసెంబర్లో ఏర్పాటైంది. ఆ తర్వాత దీన్ని ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేసి వాలెట్‌గా రీబ్రాండ్ చేసింది. ఫోన్‌పే వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ కంపెనీ సీఈవోగా నియమితులయ్యారు. యూపీఐ యాప్‌ను ప్రారంభించిన మూడు నెలల్లోనే కోటి మంది యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నారు. 2018లో గూగుల్ ప్లేస్టోర్‌లో ఐదు కోట్ల బ్యాడ్జ్‌ని పొందిన అత్యంత వేగవంతమైన భారతీయ చెల్లింపు యాప్‌గా ఫోన్‌పే నిలిచింది. -
ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం యూజర్లకు అలర్ట్!
ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌లు వాడుతున్నారా..? ఒకటి కంటే ఎక్కువ యూపీఐ యాప్‌లు వినియోగిస్తున్నారా..? అయితే మీకో ముఖ్యమైన సమాచారం. కొన్ని యూపీఐ ఐడీలు డిసెంబర్ 31 నుంచి పనిచేయవు. అవేంటి.. ఎందుకు పనిచేయవు.. ఇక్కడ తెలుసుకోండి.. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆన్లైన్ పేమెంట్స్ విస్తృతమయ్యాయి. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌లు అందుబాటులోకి వచ్చిన తర్వాత దాదాపుగా ప్రతిఒక్కరూ ఈ యాప్‌లను ఉపయోగించే చెల్లింపులు చేస్తున్నారు. చిరు దుకాణాల దగ్గర నుంచి ఆన్లైన్ షాపింగ్ వరకూ యూపీఐ చెల్లింపులే అత్యధికం ఉంటున్నాయి. ప్రస్తుతం ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటివాటితోపాటు ఇంకా మరికొన్ని యూపీఐ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఆయా యాప్‌లు రకరకాల ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు వంటివి అందిస్తున్నాయి. దీంతో చాలా మంది వివిధ యాప్‌లను డౌన్లోడ్ చేసుకుని కొద్దికాలం వినియోగించి మళ్లీ వాటి గురించి మరిచిపోతున్నారు. ఇలా 2023 డిసెంబర్ 31 నాటికి ఒక సంవత్సరం పాటు ఇన్‌యాక్టివ్‌గా ఉన్న యూపీఐ ఐడీలను డీయాక్టివేట్ చేయాలని ఆయా యాప్‌లను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (NPCI) కోరింది. కారణం ఇదే.. బ్యాంక్ అకౌంట్లకు లింక్ చేసిన ఫోన్ నంబర్లను డీలింక్ చేయకుండా కస్టమర్లు ఫోన్ నంబర్లను మార్చినప్పుడు పాత నంబర్ల ద్వారా లావాదేవీలు జరగకుండా చూడటమే ఇన్‌యాక్టివ్ యూపీఐ ఐడీల డీయాక్టివేషన్ లక్ష్యమని తెలుస్తోంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) మార్గదర్శకాల ప్రకారం, 90 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత కొత్త సబ్స్క్రైబర్లకు టెల్కోలు డియాక్టివేటెడ్ నంబర్లను జారీ చేస్తుంటాయి. బ్యాంక్‌తో లింక్ చేసిన పాత మొబైల్ నంబర్‌ను కస్టమర్ అప్డేట్ చేసుకోకపోతే దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్లు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు 2023 డిసెంబర్ 31 లోపు ఈ విషయంపై తగిన చర్య తీసుకోవాలని ఎన్పీసీఐ కోరినట్లు సమాచారం. -
ఫోన్‌పే క్రెడిట్సెక్షన్, లోన్లు.. ఇవీ బెనిఫిట్లు..!
టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకులతో పాటు ఇతర ఫిన్‌టెక్ కంపెనీలు తమ వినియోగదారులకు క్రెడిట్, రుణాలు ఇవ్వడం, కార్డు బిల్లుల చెల్లింపులు వంటి ఎన్నో సదుపాయాలు అందిస్తున్నాయి. అందులో భాగంగా తాజాగా ఫిన్ టెక్ కంపెనీ ఫోన్‌పే తన యూజర్ల కోసం కొత్తగా ‘క్రెడిట్’ ఆప్షన్ తెచ్చింది. ఈ విభాగంలో యూజర్లు ‘క్రెడిట్ బ్యూరో స్కోర్’ చెక్ చేసుకోవచ్చు. యూజర్ల క్రెడిట్ వాడకం, క్రెడిట్ ఏజ్, ఆన్ టైం పేమెంట్స్ తదితర వివరాలతో కూడిన నివేదికను క్రెడిట్ బ్యూరో స్కోర్ అందిస్తుంది. హోం పేజీలోని క్రెడిట్ సెక్షన్‌ను ఉపయోగించుకుని క్రెడిట్ లేదా రూపే కార్డుల లావాదేవీలు, రుణాల చెల్లింపులు, అదనపు భారం లేకుండా క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇదీ చదవండి: ‘డాలర్’కు భారత్ అంటేనే ఇష్టం..! ఫోన్‌పే సీఈఓ హేమంత్ గాలా స్పందిస్తూ ‘ఫోన్‌పే యాప్‌లో క్రెడిట్ సెక్షన్ ప్రారంభించడానికి ఆసక్తిగా ఉన్నాం. పలు సెగ్మెంట్లలో యూజర్ల క్రెడిట్ అవసరాలను తీర్చడమే క్రెడిట్ సెక్షన్ లక్ష్యం. యూజర్ల క్రెడిట్ హెల్త్ నిర్వహణతోపాటు ఆర్థిక సాధికారత కల్పించేందుకు సంస్థ కృషిచేస్తోంది. భవిష్యత్తులో వినియోగదారులకు కన్జూమర్ లోన్లు అందుబాటులోకి తీసుకురానున్నాం. ఇందుకోసం బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నాం’ అని ఆయన వివరించారు. -
గూగుల్, యాపిల్ ఆధిపత్యానికి చెక్! రంగంలోకి ఫోన్‌పే..
గూగుల్ (Google), యాపిల్ (Apple) ఆధిపత్యానికి చెక్ పెడుతూ మరో కొత్త యాప్ స్టోర్ రాబోతోంది. వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పే (PhonePe) తన మొబైల్ యాప్ స్టోర్‌ను డెవలపర్ల కోసం తెరుస్తోంది. ఇండస్ యాప్‌స్టోర్ (Indus Appstore) అనే పేరుతో మొబైల్ యాప్ మార్కెట్ ప్లేస్ ప్లాట్ఫామ్లో తమ యాప్‌లను ప్రచురించడానికి ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్లను ఆహ్వానిస్తోంది. ఈ యాప్‌స్టోర్‌లో యాప్‌లను ఉంచడానికి కానీ, డౌన్లోడ్ చేసుకునేందుకు కానీ ఎటువంటి రుసుము ఉండదని తెలుస్తోంది. (High Severity Warning: ఐఫోన్లు, యాపిల్ ప్రొడక్ట్స్‌కు హై సివియారిటీ వార్నింగ్!) ఇండస్ యాప్‌స్టోర్ డెవలపర్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించినట్లు ఫోన్‌పే ధ్రువీకరించింది. ప్లాట్‌ఫామ్‌లోని యాప్ లిస్టింగ్‌లు మొదటి సంవత్సరం ఉచితంగా ఉంటాయని, ఆ తర్వాత నామమాత్రపు వార్షిక రుసుము వసూలు చేయనున్నట్లు తెలిపింది. ఇండస్ యాప్ స్టోర్‌లో డెవలపర్లు తమ యాప్‌లను ఇంగ్లిష్ కాకుండా మరో 12 భారతీయ భాషల్లో లిస్ట్ చేయవచ్చు. అలాగే ఆయా భాషల్లోని తమ యాప్ లిస్టింగ్‌లకు ఫొటోలు, వీడియోలను అప్లోడ్ చేయవచ్చు. యాప్‌లకు సంబంధించి తలెత్తే సమస్యల పరిష్కారానికి గూగుల్, యాపిల్ యాప్ స్టోర్ల లాగే ఇండస్ యాప్ స్టోర్ కూడా భారత్ కేంద్రంగా ఈ-మెయిల్ లేదా చాట్‌బాట్ ద్వారా 24x7 అంకితమైన సపోర్ట్ వ్యవస్థను అందిస్తున్నట్లు పేర్కొంది. యాప్‌స్టోర్ ప్రారంభానికి సంబంధించిన సమాచారాన్ని తాజాగా ఇండస్ యాప్‌స్టోర్ తమ వైబ్సైట్లో ప్రచురించింది. ఇండస్ యాప్‌స్టోర్ యూజర్లకు ఎలా అందుబాటులోకి రానున్నదో కూడా చూపించింది. అయితే ఈ యాప్‌స్టోర్ ఎప్పుడు లాంచ్ అవుతుందన్న దానిపై ప్రస్తుతం ఎటువంటి సమాచారం లేదు. -
కొత్త విభాగంలో అడుగెట్టిన ఫోన్‌పే - వివరాలు
బెంగళూరు: ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే తాజాగా స్టాక్ బ్రోకింగ్ విభాగంలోకి ప్రవేశించింది. షేర్డాట్మార్కెట్ పేరిట ప్రత్యేక ప్లాట్‌ఫాంను ప్రారంభించింది. బీఎస్ఈ ఎండీ సుందరరామన్ రామమూర్తి బుధవారం దీన్ని ఆవిష్కరించారు. ప్రాథమికంగా స్టాక్స్, ఈటీఎఫ్‌లతో ప్రారంభించి క్రమంగా ఫ్యూచర్స్, ఆప్షన్స్ తదితర సెగ్మెంట్స్‌ను కూడా ఇందులో అందుబాటులోకి తేనుంది. దీనికి ఉజ్వల్ జైన్ సీఈవోగా వ్యవహరిస్తారు. స్టాక్ బ్రోకింగ్ సెగ్మెంట్లోకి ఎంట్రీ ద్వారా తమ ఆర్థిక సేవల పోర్ట్‌ఫోలియో సంపూర్ణమైందని ఫోన్‌పే వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ నిగమ్ తెలిపారు. మరోవైపు, 2025 నాటికల్లా ఫోన్‌పే నిర్వహణ లాభాలను సాధించే అవకాశం ఉందని సమీర్ నిగమ్ తెలిపారు. -
స్క్రీన్ షేరింగ్ పేరుతో మోసం.. రూ. 50000 మాయం.. ఎలా అంటే?
ఆధునిక కాలంలో టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ.. ఆన్లైన్ మోసాలు మరింత వేగంగా పెరుగుతున్నాయి. ఇటీవల ఫోన్‌పే (PhonePe) అప్డేట్ చేసుకోవడం వల్ల రూ. 50,000 కంటే ఎక్కువ నష్టపోయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. కర్ణాటక ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఫోన్‌పే వినియోగించడంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఆ యాప్ అప్పటికే యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులతో లింక్ అయి ఉంది. దీంతో అతడు పరిష్కార మార్గం కోసం గూగుల్‌లో వెతికే ప్రయత్నంలో 08918924399 నెంబర్ చూసి దానికి కాల్ చేసాడు. అవతలి వైపు ఉన్న వ్యక్తి ఫోన్ తీయగానే మొదట కాల్ కట్ చేసి, మరొక నంబర్ (01725644238) నుండి కాల్ చేసాడు. బాధితుడు ఫోన్‌పే యాప్ వినియోగించడంలో వచ్చిన సమస్యను గురించి అపరిచిత వ్యక్తికి చెప్పాడు. ఆ సమయంలో అతని రెండు బ్యాంక్ అకౌంట్స్ గురించి కూడా తెలుసుకున్నాడు. ఆ తరువాత స్క్రీన్ షేరింగ్ యాప్ అయిన రస్ట్ డెస్క్‌ని ఇన్స్టాల్ చేయమని బాధితుడిని కోరాడు. అపరిచిత వ్యక్తి సలహా మేరకు స్క్రీన్ షేరింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాడు. అప్పటికే బ్యాంక్ అకౌంట్స్ మీద నిఘా వేసిన స్కామర్ బాధితుని బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ నుంచి రూ.29,998 & యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నుంచి రూ.27,803 దోచేశాడు. మోసపోయామని తెలుసుకున్న బాధితుడు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు ఫిర్యాదు చేయగా, బెల్తంగడి పోలీసులు జూలై 31న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదీ చదవండి: అకౌంట్లో డబ్బు లేకున్నా రూ. 80000 విత్‌డ్రా చేసుకోవచ్చు ఇలాంటి మోసాలకు చెక్ పెట్టడం ఎలా.. ప్రస్తుతం ఇలాంటి మోసాలు ఎక్కువవుతున్నాయని అందరికి తెలుసు. కాబట్టి వీటి నుంచి బయటపడాలంటే ఉత్తమ మార్గం అపరిచితులను నమ్మకుండా ఉండటమే.. ఒకవేళా ఏదైనా సమస్య తలెత్తితే అధికారికి నెంబర్స్ లేదా ఈమెయిల్స్ ద్వారా పరిష్కరించుకోవాలి. సమస్యకు పరిష్కారం వెతికే క్రమంలో ప్రాసెస్ గురించి ఖచ్చితంగా తెలియకపోతే.. నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన మరో అంశం ఏమిటంటే ఏ కంపెనీ అయినా ఇతర యాప్స్ డౌన్లోడ్ చేయమని గానీ.. ఫోన్ స్క్రీన్ షేర్ చేయమని గానీ అడగదు. ఇటీవల వాట్సాప్ & టెలిగ్రామ్ ద్వారా జరుగుతున్న మోసాలు చాలా ఎక్కువవుతున్నాయి. కావున మీకు తెలియని నెంబర్ నుంచి మెసేజ్ వస్తే బ్లాక్ చేయడం ఉత్తమం. -
నెలవారీ ప్రీమియంలలో హెల్త్ ఇన్సూరెన్స్.. రూ.1 కోటి వరకు బీమా కవరేజ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటి వరకు దేశంలో ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలంటే ఏడాది ప్రీమియం ఒకేసారి చెల్లించాల్సిందే. ఇక నుంచి సులభంగా నెల వాయిదాల్లో హెల్త్ పాలసీ తీసుకోవచ్చు. డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం ఫోన్‌పే భారత్‌లో తొలిసారిగా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ఆరోగ్య బీమా సంస్థలతో ఫోన్‌పే ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్ చేతులు కలిపింది. ‘రూ.1 కోటి వరకు బీమా కవరేజ్ ఉంది. ఎటువంటి పరిమితి లేకుండా ఆసుపత్రిలో గదిని ఎంచుకోవచ్చు. క్లెయిమ్ చేయనట్టయితే ఏడాదికి బేస్ కవర్ మొత్తం మీద ఏడింతల వరకు బోనస్ కవర్ పొందవచ్చు’ అని ఫోన్‌పే ప్రకటించింది. ఇదీ చదవండి ➤ IT Dept clarification on PAN: పనిచేయని పాన్ కార్డులపై ఐటీ శాఖ క్లారిఫికేషన్ ప్రస్తుతానికి ఫోన్‌పే వేదికగా కేర్ హెల్త్, నివా బూపా నెల వాయిదాల్లో ఆరోగ్య బీమా పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. కాగా, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 56 లక్షలకుపైగా పాలసీలను విక్రయించినట్టు ఫోన్‌పే తెలిపింది. ఇక ఫోన్‌పే యూజర్ల సంఖ్య 47 కోట్లకుపైమాటే. -
‘ఎస్బీఐ యోనో’ ఇక అందరిది.. ఆ యూపీఐ యాప్‌లకు గట్టిపోటీ!
SBI YONO App: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ యోనో మొబైల్ యాప్ సేవలను మరింత విస్తృతం చేసింది. ఇకపై ఈ యాప్‌ను ఎస్బీఐ కస్టమర్లు మాత్రమే కాకుండా ఎవరైనా వినియోగించుకోవచ్చు. ఎస్బీఐ అకౌంట్ లేని వారు కూడా ఎస్బీఐ యోనో మొబైల్ యాప్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేసే సౌలభ్యాన్ని స్టేట్ బ్యాంక్ కల్పించింది. తమ డిజిటల్ బ్యాంకింగ్ యాప్ సేవలను ప్రతిఒక్కరికీ అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఈ ఫీచర్‌ను ఎస్బీఐ తీసుకొచ్చినట్లు చెబుతోంది. ‘యోనో ఫర్ ఎవ్రీ ఇండియన్’ చొరవ ద్వారా స్కాన్ అండ్ పే, పే బై కాంటాక్ట్స్, రిక్వెస్ట్ మనీ వంటి యూపీఐ సేవలను ఏ బ్యాంక్ కస్టమర్ అయినా పొందవచ్చని ఎస్బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. యూపీఐ సేవలతో పాటు కార్డ్ లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ సౌకర్యాన్ని కూడా ఎస్బీఐ కల్పించింది. ఐసీసీడబ్ల్యూ సౌకర్యం ఉన్న ఏటీఎంలలో ఏ బ్యాంక్ కస్టమర్ అయినా ఎస్బీఐ యోనో యాప్‌లోని ‘యూపీఐ క్యూఆర్ క్యాష్’ అనే ఆప్షన్ ద్వారా ఏటీఎం కార్డు లేకుండానే నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎస్బీఐ అకౌంట్ లేనివారికి కూడా యూపీఐ చెల్లింపుల సౌకర్యాన్ని కల్పించడం ద్వారా ఎస్బీఐ యోనో యాప్.. ఇప్పుడున్న ఫేన్పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇతర బ్యాంక్ కస్టమర్లు యోనో యాప్‌ను ఉపయోగించండిలా.. ఎస్బీఐ యోన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ‘న్యూ టు ఎస్బీఐ’ను క్లిక్ చేసి ‘రిజిస్టర్ నౌ’పై నమోదు చేసుకోండి. మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసిన ఫోన్ నంబర్‌ను ధ్రువీకరించి యూపీఐ చెల్లింపులకు నమోదు చేసుకోండి యూపీఐ ఐడీని సృష్టించడానికి మీ బ్యాంక్‌ని ఎంచుకోండి ఎస్బీఐ పే కోసం రిజిస్ట్రేషన్‌ని నిర్ధారిస్తూ ఒక మెసేజ్ మీ మొబైల్‌కు వస్తుంది అందించిన ఆప్షన్ల నుంచి ఒకదాన్ని ఎంచుకోవడం ద్వారా ఎస్బీఐ యూపీఐ హ్యాండిల్‌ను సృష్టించండి లాగిన్ చేయడానికి, చెల్లింపులు చేయడానికి ఆరు అంకెల శాశ్వత ఎంపిన్‌ను సెట్ చేసుకోండి క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయడం, కాంటాక్ట్స్‌కు డబ్బు పంపడం, ట్రాన్సాక్షన్ హిస్టరీని చెక్ చేసుకోవడం వంటివి ప్రారంభించండి ఇదీ చదవండి: ఎస్బీఐ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త.. కార్డ్ లేకున్నా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయొచ్చు -
ఫోన్‌పే యూజర్లకు బంపరాఫర్.. దేశంలోనే తొలిసారిగా..
Phonepe Link 2 Lakh Rupay Credit Cards To Upi : ప్రముఖ ఫిన్‌టెక్ దిగ్గజం ఫోన్‌పే యూపీఐ(యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్)కు 2 లక్షల రూపే క్రెడిట్ కార్డులను విజయవంతంగా అనుసంధానం చేసింది. దీంతో రూపే క్రెడిట్ కార్డ్ సాయంతో యూజర్లు, వ్యాపారస్థులు నగదు చెల్లింపులు చేసుకోవచ్చు’ అని ఐఏఎన్ఎస్ నివేదిక పేర్కొంది. ఇప్పటికే రూపే క్రెడిట్ కార్డ్‌తో యూపీఐ టోటల్ పేమెంట్ వ్యాల్యూ (టీపీవీ) రూ. 150 కోట్ల వరకు చేరుకోగా.. తొలిసారి క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి యూపీఐ చెల్లింపులు చేయడం తొలి సంస్థగా గుర్తింపు పొందింది. చెల్లింపు సమస్యలకు పరిష్కార మార్గంగా యూపీఐ నిర్వహణ సంస్థ ఎన్సీపీఐ భాగస్వామ్యంతో రూపే క్రెడిట్ కార్డ్‌ను అందుబాటులోకి తెచ్చామని ఫోన్‌పే వెల్లడించింది. యూజర్లు, వ్యాపారులు రూపే క్రెడిట్ కార్డ్‌తో యూపీఐ చెల్లింపులు చేస్తున్నట్లు సూచించింది. దేశ వ్యాప్తంగా 12 మిలియన్ల మర్చెంట్ అవుట్ లెట్లలో ఆమోదం పొందినట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ఫోన్‌పే యూపీఐ ద్వారా రూ.2లక్షల క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి చెల్లింపులు జరిపేలా ఎన్పీసీఐ భాగస్వామ్యంతో చేతులు కలపడం సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అటు కస్టమర్లు, ఇటు వ్యాపారులు జరిపే చెల్లింపుల్ని మరింత సులభతరం చేసేలా క్రెడిట్ కార్డ్ ఈకో సిస్టంను అభివృద్ధి చేయడం శుభపరిణామమని ఫోన్‌పే కన్జ్యూమర్ ప్లాట్‌ఫామ్ అండ్ పేమెంట్స్ వైస్‌ప్రెసిడెంట్ సోనికా చంద్రా తెలిపారు. చదవండి👉 చంద్రుడిపై రొమాన్స్.. రూ.158 కోట్లు నష్టం! -
ఫోన్‌పే రూ.828 కోట్ల నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పే తాజాగా రూ.828 కోట్ల అదనపు నిధులను జనరల్ అట్లాంటిక్ నుంచి సమీకరించింది. ప్రస్తుతం కొనసాగుతున్న రూ.8,281 కోట్ల ఫండింగ్ రౌండ్లో భాగంగా జనరల్ అట్లాంటిక్, దాని సహ ఇన్వెస్టర్లు ఫోన్‌పే కంపెనీకి తాజా నిధులతో కలిపి రూ.4,554 కోట్లు అందించారు. ఈ పెట్టుబడులకు ముందు ఫోన్‌పే విలువను రూ.99,372 కోట్లుగా లెక్కించారు. ‘ఈ పెట్టుబడి సంస్థ వ్యాపారం, వృద్ధి సామర్థ్యంలో జనరల్ అట్లాంటిక్ నమ్మకాన్ని పునరుద్ఘాటిస్తుంది’ అని ఫోన్‌పే తెలిపింది. జనరల్ అట్లాంటిక్ నుండి ఈ తాజా నిధులతో ఫోన్‌పే ప్రస్తుత రౌండ్లో మొత్తం రూ.7,039 కోట్ల ప్రాథమిక మూలధనాన్ని సేకరించింది. రిబ్బిట్ క్యాపిటల్, టైగర్ గ్లోబల్, టీవీఎస్ క్యాపిటల్ ఫండ్లు కూడా కంపెనీ ప్రస్తుత రౌండ్లో పెట్టుబడి పెట్టాయి. -
ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలకు షాక్!
Zomato UPI: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి యూపీఐ సంస్థలకు షాక్ ఇస్తూ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తాజాగా సొంతంగా యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. సాధారణంగా జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసి పేమెంట్ చేసేటప్పుడు థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పడు ఇలా కాకుండా జొమాటోనే సొంతంగా యూపీఐ సర్వీస్‌ను తీసుకువచ్చింది. ఇదీ చదవండి: Paytm New Features: పేటీఎంలో సరికొత్త ఫీచర్లు.. యూపీఐ బిల్లును పంచుకోవచ్చు! కస్టమర్లు చెల్లింపుల కోసం థర్డ్ పార్టీ యాప్స్ పై ఆధారపడకుండా జొమాటో ఈ కొత్త సర్వీసును తీసుకువచ్చింది. దీని వల్ల కస్టమర్లకు కూడా ప్రయోజనం కలుగుతుంది. జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు పేమెంట్ సమయంలో థర్డ్ పార్టీ యాప్స్ ని ఓపెన్ చేయాల్సిన పని ఉండదు. నేరుగా జొమాటో యూపీఐ ద్వారానే కస్టమర్లు తమ బ్యాంక్ అకౌంట్ నుంచి సులువుగా డబ్బులు చెల్లించొచ్చు. జొమాటో కంపెనీ ఐసీఐసీఐ బ్యాంక్‌తో భాగస్వామ్యంతో ఈ కొత్త యూపీఐ సర్వీస్ ని తీసుకువచ్చింది. జొమాటో యూజర్లు యూపీఐ సేవలని ఉపయోగించుకోవాలనుకుంటే ముందుగా యూపీఐ ఐడీని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. పైలట్ ప్రాజెక్ట్ ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్ట్ కింద జొమాటో ఈ యూపీఐ సర్వీసెస్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అందువల్ల ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. త్వరలో ఈ యూపీఐ సర్వీస్ అందరికీ అందుబాటులోకి రానుంది. ఇదీ చదవండి: Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ! -
అలర్ట్: ‘ఫోన్‌పే’లో అందుబాటులోకి వచ్చిన ఫీచర్ ఏంటో తెలుసా?
ప్రముఖ దేశీయ ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పే యూపీఐ పేమెంట్ కోసం లైట్ పేమెంట్స్ ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ వల్ల రూ.200 లోపు చిన్న చిన్న లావాదేవీల కోసం ఎలాంటి పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. ఇప్పటికే ఫోన్‌పే ప్రత్యర్ధి సంస్థ పేటీఎం ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో యూపీఐ లైట్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ఫోన్‌పే సైతం ఈ సరికొత్త సేవల్ని వినియోగించేలా యూజర్లకు అవకాశం కల్పించింది. చిన్న చెల్లింపుల కోసం ముందుగానే యూపీఐ లైట్లో రూ.2,000 వరకు జమ చేసుకోవచ్చని ఫోన్‌పే తెలిపింది. ఫలితంగా బ్యాంకు ఖాతాతో సంబంధం లేకుండా వేగంగా చెల్లింపులు పూర్తవుతాయి. చెల్లింపులు జరిగే సమయంలో ఎలాంటి అవాంతరాలు ఉండవని వెల్లడించింది. అన్నీ బ్యాంకుల సపోర్ట్ ఫోన్‌పే యూపీఐ లైట్‌కు దేశంలో అన్నీ బ్యాంకుల్లో వినియోగించుకోవచ్చని ఆ సంస్థ సీఈవో సమీర్ నిఘమ్ చెప్పారు. యూపీఐ మర్చంట్, క్యూఆర్ కోడ్ చెల్లింపులకు అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్యాంక్ స్టేట్మెంట్తో పనిలేదు వీటితో పాటు యూపీఐ లైట్ వినియోగంతో ఆయా ట్రాన్సాక్షన్లపై యూజర్లకు మెసేజ్ అలెర్ట్ వెళ్లనుంది. యూజర్లు ఏ రోజు ఎన్ని లావాదేవీలు జరిపారో తెలుసుకునేందుకు వీలుగా ట్రాన్సాక్షన్ హిస్టరీ చూడొచ్చు. దీనికి సంబంధించి మెసేజ్ అలెర్ట్ పొందవచ్చు. తద్వారా చెల్లింపులపై బ్యాంక్ స్టేట్మెంట్, పాస్‌బుక్ అవసరం తీరిపోనుందని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. చెల్లింపుల్ని సులభతరం చేసేందుకే అయితే ఈ యూపీఐ లైట్ ఫీచర్ ద్వారా దేశంలో ప్రతి రోజు జరిగే చిన్న చిన్న లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు ఫోన్‌పేలో ఈ కొత్త ఆప్షన్‌ను అభివృద్ది చేసినట్లు ఫోన్‌పే కో- ఫౌండర్, సీటీవో రాహుల్ చారి చెప్పినట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఎన్సీపీఐ నిర్ణయం.. యూపీఐ లైట్‌కి ఊతం ఇటీవల కాలంలో ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలలో జరిపే లావాదేవీల సమయంలో నెట్వర్క్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఈ సమస్యను అధిగమించేలా గత ఏడాది డిసెంబర్లో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ (ఎన్సీపీఐ) నెట్వర్క్ లేకపోయినా రూ.200 లోపు చిన్న చిన్న లావాదేవీలు జరిపేలా అనుమతిచ్చింది. చదవండి👉 కొనసాగుతున్న తొలగింపులు.. దిగ్గజ ఐటీ కంపెనీలో 600 మందిపై వేటు! -
ఫోన్‌పే దూకుడు.. కొత్త వ్యాపారాలకు నిధుల సమీకరణ
వాల్‌మార్ట్ యాజమాన్యంలోని భారతీయ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే (PhonePe) దూకుడు పెంచింది. వ్యాపార విస్తరణ కోసం నిధుల సమీకరణ చేపట్టిన ఫిన్‌టెక్ కంపెనీ అందులో భాగంగా తాజాగా మరో 100 మిలియన్ డాలర్లను (సుమారు రూ.820 కోట్లు) సమీకరించింది. (గూగుల్ చీకటి ‘గేమ్’! రూ.260 కోట్ల భారీ జరిమానా..) 12 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ ఉన్న ఫోన్‌పే వ్యాపార విస్తరణలో భాగంగా 1 బిలియన్ డాలర్లను విడతలవారీగా సమీకరించినట్లు గత జనవరిలో ప్రకటించింది. అప్పటి నుంచి ఈ ఫిన్‌టెక్ కంపెనీ జనరల్ అట్లాంటిక్ నుంచి 350 మిలియన్ డాలర్లు, టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్, రిబ్బిట్ క్యాపిటల్, టీవీఎస్ క్యాపిటల్ నుంచి 100 మిలియన్ డాలర్లు, వాల్‌మార్ట్ నుంచి 200 మిలియన్ డాలర్లు సమీకరించింది. (ఆండ్రాయిడ్ యూజర్లకు కొత్త ఫీచర్.. స్టోరేజ్ సమస్యకు పరిష్కారం) భారతదేశంలో తమ చెల్లింపులు, బీమా వ్యాపారాలను విస్తరించడంతో పాటు బ్యాంకింగ్, స్టాక్‌బ్రోకింగ్, ఓఎన్డీసీ ( ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్) ఆధారిత షాపింగ్ వంటి కొత్త వ్యాపారాలను ప్రారంభించేందుకు సమీకరించిన నిధులను వినియోగించనున్నట్లు ఫోన్‌పే గత ప్రకటనల్లో పేర్కొంది. ఈ నెల ప్రారంభంలోనే ‘పిన్‌కోడ్’ అనే ఓఎన్డీసీ ఆధారిత ఈ-కామర్స్ వ్యాపారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
ఈ-కామర్స్ వ్యాపారంలోకి ఫోన్‌పే.. కొత్త యాప్ పేరు ఏంటంటే..
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే తాజాగా ఈ–కామర్స్ వ్యాపారంలోకి ప్రవేశించింది. పిన్‌కోడ్ పేరిట షాపింగ్ యాప్‌ను రూపొందించింది. తొలుత బెంగళూరులో ఈ యాప్ సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఫోన్‌పే వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ తెలిపారు. రోజుకు 10,000 పైచిలుకు లావాదేవీలు సాధించిన తర్వాత ఇతర నగరాలకు కూడా దీన్ని విస్తరిస్తామని చెప్పారు. డిసెంబర్ నాటికి రోజుకు లక్ష లావాదేవీలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. వినియోగదారులకు సంబంధించి గత ఏడేళ్లలో ఫోన్‌పే నుంచి ఇది రెండో యాప్ అని చెప్పారు. కేంద్రం తీర్చిదిద్దిన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) ప్లాట్‌ఫాం ఆధారంగా పిన్‌కోడ్ యాప్‌ను రూపొందించారు. -
యూపీఐ చెల్లింపులపై అదనపు చార్జీలు..
ఏప్రిల్ 1 నుంచి పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే వంటి యూపీఐ యాప్స్ ద్వారా రూ.2000లకు పైగా లావాదావేలు చేస్తే అదనపు చార్జీలు ఉంటాయని, ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఉత్తర్వులు జారీ చేసిందని, దీంతో యూజర్లకు చార్జీల మోత తప్పదని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో వాస్తవం లేదు. ఇదీ చదవండి: పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్.. పేటీఎం వ్యాలెట్ నుంచి ఏ మర్చంట్‌కైనా చెల్లింపులు ఆన్లైన్ వాలెట్లు లేదా ప్రీ లోడెడ్ గిఫ్ట్ కార్డ్‌లు మొదలైన ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (పీపీఐ) ద్వారా రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలకు ఇంటర్చేంజ్ రుసుము విధించేందుకు ఎన్పీసీఐ ప్రతిపాదనలు చేసిన విషయం నిజమే. అయితే ఈ చార్జీలు యూజర్లకు వర్తించవు. ఇంటర్చేంజ్ రుసుము అనేది వ్యాలెట్ జారీ చేసే బ్యాంకులు లావాదేవీలను అంగీకరించడం, ప్రాసెస్ చేయడం, ఆథరైజ్ చేయడం వంటి వాటి కోసం పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే వంటి పేమెంట్స్ సర్వీస్ ప్రొవైడర్లు చెల్లించాల్సిన రుసుము. బ్యాంక్, ప్రీపెయిడ్ వాలెట్ మధ్య వ్యక్తి-వ్యక్తి లావాదేవీలు లేదా వ్యక్తి నుంచి వ్యాపారి లావాదేవీలకు ఈ ఇంటర్చేంజ్ రుసుము వర్తించదు. అంటే యూపీఐ చెల్లింపులు చేసే యూజర్లు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఇదీ చదవండి: అడక్కుండానే రూ. 8,800 కోట్లు.. ఎస్బీఐపై కాగ్ రిపోర్ట్ పీపీఐ ద్వారా చేసిన రూ. 2,000 కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీలకు 1.1 శాతం ఇంటర్చేంజ్ ఫీజు ఉంటుంది. ఆపై వాలెట్ లోడింగ్ ఛార్జీలు ఉంటాయి. కాబట్టి పేటీఎం లేదా ఓలా ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి ప్రీ పెయిడ్ ఇన్స్ట్రుమెంట్లను జారీ చేసేవారు వాలెట్ లోడింగ్ ఛార్జీలుగా 15 బేసిస్ పాయింట్లను రెమిటర్ బ్యాంక్‌కి చెల్లించాలి. మర్చెంట్స్ ప్రొఫైల్‌ను బట్టి ఇంటర్‌ఛేంజ్ రుసుము రేట్లు మారుతాయని ఎన్పీసీఐ స్పష్టం చేసింది. వివిధ పరిశ్రమలకు ఇంటర్‌ఛేంజ్ రుసుము వేరువేరుగా ఉంటుంది. లావాదేవీ విలువలో 0.50 శాతం నుంచి 1.10 శాతం వరకు ఛార్జీలు ఉంటాయని ఎన్పీసీఐ పేర్కొంది. -
వాల్‌మార్ట్ భారీ పెట్టుబడులు: ఫోన్‌పే రూ. 1,650 కోట్ల సమీకరణ
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే కొత్తగా 200 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,650 కోట్లు) సమీకరించింది. 12 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో ప్రధాన వాటాదారు వాల్‌మార్ట్ ఈ మేరకు నిధులు సమకూర్చింది. సింగపూర్ నుంచి భారత్‌కు కార్యాలయాన్ని మార్చుకున్న నేపథ్యంలో ఫోన్‌పే 1 బిలియన్ డాలర్ల వరకూ మూలధనాన్ని సేకరించే ప్రయత్నాల్లో ఉంది. తాజాగా అందిన నిధులతో ఇప్పటివరకూ 650 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 5,360 కోట్లు) సమీకరించినట్లవుతుంది. (ఇదీ చదవండి: బిస్లెరీతో చర్చలకు ‘టాటా’: అసలేమైంది?) మిగతా పెట్టుబడులను కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ నిధులను బీమా, వెల్త్ మేనేజ్మెంట్, రుణాలు, స్టాక్ బ్రోకింగ్ మొదలైన వ్యాపార విభాగాల వృద్ధికి ఉపయోగించుకోనుంది. గూగుల్ పే, పేటీఎంలతో ఫోన్‌పే పోటీ పడుతోంది. సరికొత్త ఫీచర్లతో బజాజ్ పల్సర్ ఎన్ఎస్ సిరీస్ -
వామ్మో రూ. 84 లక్షల కోట్లా? ఎదురులేని ఫోన్‌పే!
యూపీఐ చెల్లింపుల్లో ఎదురు లేకుండా దూసుకుపోతున్న ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పే అరుదైన ఘనత సాధించింది. వార్షిక మొత్తం చెల్లింపు విలువ రన్ రేట్ 1 ట్రిలియన్ డాలర్లు (రూ. 84 లక్షల కోట్లు) సాధించినట్లు ఫోన్‌పే తెలిపింది. దేశంలోని టైర్ 2, 3, 4 నగరాలే కాకుండా దాదాపు అన్ని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తూ మూడున్నర కోట్ల మందికిపైగా ఆఫ్‌లైన్ వ్యాపారులను డిజిటలైజ్ చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఇదీ చదవండి: రైళ్లలో సూపర్ సౌకర్యాలు.. ఇక అంతా ఆటోమేటిక్కే! టోటల్ పేమెంట్ వ్యాల్యూ(టీపీవీ) రన్ రేట్ 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడం సంతోషంగా ఉందని ఫోన్‌పే కన్స్యూమర్ బిజినెస్ హెడ్ సోనికా చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. యూపీఐ లైట్, యూపీఐ ఇంటర్నేషనల్, క్రెడిట్ ఆన్ యూపీఐ వంటి ఆఫర్లతో దేశంలో కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు. పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్‌కు ఆమోదం? యూపీఐ చెల్లింపు విభాగంలో 50 శాతానికి పైగా మార్కెట్ వాటాను కలిగి ఉండటంతోనే తమకు ఈ ఘనత సాధ్యమైందని కంపెనీ తెలిపింది. మరోవైపు పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించినట్లు పేర్కొంది. -
జోరు మీదున్న ఫోన్‌పే... రూ.828 కోట్లు!
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ దిగ్గజం ఫోన్‌పే తాజాగా 10 కోట్ల డాలర్లు(రూ. 828 కోట్లు) సమీకరించింది. కొత్తగా రిబ్బిట్ క్యాపిటల్, టీవీఎస్ క్యాపిటల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయగా.. ఇప్పటికే వాటాలున్న టైగర్ గ్లోబల్ సైతం నిధులు అందించింది. 12 బిలియన్ డాలర్ల విలువలో ఫోన్‌పే తాజా పెట్టుబడులను సమకూర్చుకుంది. జనవరి 19న సైతం కంపెనీ జనరల్ అట్లాంటిక్ నుంచి 35 కోట్ల డాలర్లను పొందింది. కంపెనీ కేంద్ర కార్యాలయాన్ని ఇండియాకు మార్చిన తదుపరి బిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే రెండు దశలలో 45 కోట్ల డాలర్లు అందుకోగా.. మిగిలిన పెట్టుబడులను తగిన సమయంలో సుప్రసిద్ధ దేశ, విదేశీ ఇన్వెస్టర్లు అందించే వీలున్నట్లు భావిస్తోంది. ఈ నిధులను పేమెంట్స్, ఇన్సూరెన్స్ బిజినెస్‌ల విస్తరణకు వినియోగించనుంది. అంతేకాకుండా లెండింగ్, స్టాక్‌బ్రోకింగ్ తదితర కొత్త విభాగాలలోనూ ప్రవేశించాలని ప్రణాళికలు వేసింది. -
అయిదు దేశాల్లో ఫోన్‌పే సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పే అయిదు దేశాల్లో యూపీఐ ఇంటర్నేషనల్ సేవలను ప్రారంభించింది. యూఏఈ, నేపాల్, సింగపూర్, మారిషస్, భూటాన్ వీటిలో ఉన్నాయి. ఈ దేశాల్లో వర్తకులకు ఫోన్‌పే కస్టమర్లు యూపీఐ ఆధారంగా క్యూఆర్ కోడ్‌ను ఉపయోగించి చెల్లింపులు చేయవచ్చు. సాధారణంగా భారతీయ కస్టమర్లు విదేశీ కరెన్సీ, అంతర్జాతీయ క్రెడిట్/డెబిట్ కార్డు, ఫారెక్స్ కార్డును ఉపయోగించి అక్కడి వర్తకులకు చెల్లించాల్సి ఉంటుంది. యూపీఐ ఇంటర్నేషనల్ సౌకర్యంతో భారతీయ బ్యాంకు నుంచే విదేశీ కరెన్సీ రూపంలో ఈ లావాదేవీ పూర్తి అవుతుందని ఫోన్‌పే ప్రకటించింది. ఇటువంటి సేవలను అందుబాటులోకి తెచ్చిన తొలి భారతీయ ఫిన్‌టెక్ కంపెనీ తామేనని తెలిపింది. ఈ సౌకర్యం గేమ్ చేంజర్ అవుతుందని వివరించింది. ఫోన్‌పే యూజర్ల సంఖ్య 43.5 కోట్లు. -
ఫోన్‌పే వాడుతున్నారా? అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు గురించి తెలుసా!
ఫోన్‌పే(Phone Pay) .. డిజిటల్ లావాదేవీలు పెరిగినప్పటి నుంచి ఈ పేరు బాగా పాపలర్ అయిపోయింది. పర్సలో మనీ లేకపోయినా పర్లేదు ఫోన్లో ఫోన్‌పే ఉంటే చాలు అనుకునేంతగా ప్రజాదారణ పొందింది ఈ యాప్. ప్రస్తుతం 350 మిలియన్ల మంది రిజిస్టర్డ్ కస్టమర్లతో పలు సేవలు అందిస్తూ భారత్‌లో దూసుకుపోతుంది ఫోన్‌పే. ఎప్పటికప్పడు కొత్త సేవలో కస్టమర్లను ఆకట్టుకుంటూ వారి సంఖ్యను పెంచుకుంటున్న ఈ యాప్ తాజాగా మరో సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. సరికొత్త సేవల మీ కోసం.. ఇది వరకు ఫోన్‌పే ఉపయోగించాలంటే తప్పనిసరిగా మన డెబిట్ కార్డుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే డెబిట్ కార్డు అవసరం లేకుండా సరికొత్త సేవలను ఫోన్‌పే అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో వినియోగదారుడు కేవలం ఆధార్ కార్డు ఉపయోగించి యూపీఐ సేవలు పొందవచ్చని ఫోన్ పే తెలిపింది. ఇకపై ఫోన్ పేలో మీ డెబిట్ కార్డ్ అవసరం లేకుండా కేవలం మీ ఆధార్ కార్డ్ ద్వారా ఫోన్‌పేలో మీ యూపీఐ (UPI)ని సెటప్ చేయాలనుకుంటే, సింపుల్‌గా ఇలా ఫాలో అవ్వండి. ►ముందుగా ప్లేస్టోర్ (PlayStore) లేదా యాప్ స్టోర్( App Store) నుంచి ఫోన్‌పేని డౌన్లోడ్ చేసుకోండి. ►ఆపై ఓపెన్ చేసి మీ మొబైల్ నంబర్ని యాడ్ చేయండి, తర్వాత OTP వస్తుంది దాని ఎంటర్ చేయండి. ►ఇప్పుడు మై మనీ పేజీకి వెళ్లి, ఆపై పేమెంట్స్ మెతడ్స్ (payments method)పై క్లిక్ చేయండి. ►తర్వాత మీ బ్యాంక్‌ని ఎంచుకోని, 'Add New Bank Account'పై క్లిక్ చేయండి. ► మీ బ్యాంక్‌ని సెలక్ట్ చేసుకుని, మీ ఫోన్ నంబర్ని ధృవీకరించాల్సి ఉంటుంది. ►దీంతో ఫోన్‌పే మీ ఖాతా వివరాలను యాక్సెస్ పొందుతుంది, వీటితో పాటు మీ అకౌంట్ యూపీఐకి లింక్ అవుతుంది. ►తర్వాత మీ డెబిట్/ఏటీఎం కార్డ్ వివరాలను నమోదు చేయవచ్చు లేదా ఆధార్ కార్డ్ ఎంపికను ఎంచుకోవచ్చు. ►మీ ఆధార్‌లోని చివరి ఆరు అంకెలను నమోదు చేయండి. మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. ► OTPని ఎంటర్ చేసి ఆపై మీ యూపీఐ పిన్ నెంబర్ సెట్ చేసుకోవడంతో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. చదవండి: వణుకుతున్న ఉద్యోగులు.. డిసెంబర్ నాటికి మాంద్యంలోకి ఆ దేశాలు! -
ధంతేరస్ 2022: బంగారు, వెండిపై ఫోన్‌పే క్యాష్ బ్యాక్ ఆఫర్
సాక్షి, ముంబై: ధంతేరస్ 2022కి టాప్ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్ ఫోన్‌పే బంపర్ ఆఫర్ అందిస్తోంది. తన ఫ్లాట్‌ఫాం ద్వారా బంగారం, వెండి కొనుగోలు చేసిన వినియోగ దారులకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తోంది. రానున్న ధన్తేరస్ సందర్భంగా గోల్డెన్ డేస్ ప్రచారంలో భాగంగా వినియోగదారుల బంగారం, వెండి కొనుగోళ్లపై ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను ప్రకటించింది. ముఖ్యంగా బంగారం కొనుగోళ్లపై రూ. 2,500, వెండి కొనుగోళ్లపై రూ. 500 వరకు క్యాష్ బ్యాక్‌ను పొందవచ్చు. క్యాష్‌బ్యాక్ ఆఫర్‌కు ఎవరు అర్హులు? అక్టోబర్ 26 వరకు బంగారం లేదా వెండి కొనుగోళ్లను చేసినట్లయితే, కస్టమర్లు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌కు అర్హులు. ధంతేరస్ సందర్భంగా యాప్లోఈ ఆఫర్ పొందాలంటే రూ. 1,000 లేదా అంతకంటే ఎక్కువ బంగారం ,వెండి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కస్టమర్లు 99.99 శాతం స్వచ్ఛమైన 24కె బంగారం, వెండిని కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బీమా చేయబడిన డోర్‌స్టెప్ డెలివరీ అవకాశం ఉంది. లేదంటే ధృవీకృత 24కే గోల్డ్ బార్లను ఉచితం సేఫ్‌గా డిజిటల్‌గా గ్రేడ్ గోల్డ్ లాకర్లో దాచుకోవచ్చు. బంగారాన్ని ఎలా కొనుగోలు చేయాలి ♦ ఫోన్‌పేలో సైట్ దిగువన ఉన్న వెల్త్ చిహ్నాన్ని ఎంచుకోండి. ♦ బంగారం, వెండి ఏది కొనుగోలు చేయాలనుకుంటున్నారో, ఎంచుకుని, పేమెంట్ పద్ధతిని ఎంచుకోవాలి. ♦ ఆప్షన్లలో 'స్టార్ట్ అక్యుమ్యులేటింగ్' లేదా ‘బై మోర్ గోల్డ్ ఎంచుకోవాలి. ఆ తరువాత డోర్ డెలివరీ కావాలనుకుంటే ఆ ఆప్షన్ ఎంచుకోవాలి. ♦ చివరగా మీరుకొనాలనుకునే బంగారు లేదా వెండి నాణేలను క్లిక్ చేయవచ్చు. సంబంధిత నగదును నమోదు చేసి 'ప్రొసీడ్' బటన్‌పై క్లిక్ చేయాలి. -
యాచన.. డిజిటల్ యోచన
అర్వపల్లి: అంతా డిజిటల్‌మయం కావడంతో యాచకులు కూడా స్కానర్లు, ఫోన్‌పే, గూగుల్‌పేలను వినియోగిస్తున్నారు. సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో శనివారం ఓ టీస్టాల్లో యాచకుడు యాచించగా యజమాని గోవర్ధన్ నగదు లేదన్నాడు. వెంటనే యాచకుడు తన వద్ద ఉన్న డిజిటల్ పేమెంట్ స్కానర్‌ను చూపించాడు. దీంతో గోవర్దన్ తన సెల్‌తో స్కాన్ చేసి డిజిటల్ పేమెంట్ విధానంలో చెల్లించాడు. ఈ సందర్భంగా యాచకుడు చిన్నమారన్న మాట్లాడుతూ.. అంతా డిజిటల్ కాలం కావడంతో యాచకులం కూడా మారాల్సి వచ్చిందని చెప్పాడు. తనది ఏపీలోని నంద్యాల జిల్లా గుండాల (ఎస్) గ్రామమని తెలిపాడు. హనుమాన్ వేషధారణలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు తిరుగుతూ యాచిస్తున్నట్లు చెప్పాడు. -
ఆ విషయంలో ఫోన్‌పే సరికొత్త రికార్డు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫోన్‌పే రోజుకు 10 కోట్లకుపైగా లావాదేవీల మార్కును దాటింది. నెలకు 250 కోట్ల లావాదేవీలను పూర్తి చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ‘ఫోన్‌పే వేదికగా ఏటా రూ.59,28,000 కోట్ల విలువ చేసే చెల్లింపులు నమోదవుతున్నాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, చిన్న పట్టణాల్లోనూ డిజిటల్ వైపు కస్టమర్లు పెద్ద ఎత్తున మళ్లడమే ఈ స్థాయికి కారణం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 19,000 పైచిలుకు పిన్‌కోడ్స్ నుంచి ఫోన్‌పేకి వినియోగదారులు ఉన్నారు. యాక్టివ్ యూజర్లు నెలకు 16.5 కోట్ల మంది. నమోదిత యూజర్ల సంఖ్య 37 కోట్లకుపైమాటే. నలుగురు భారతీయుల్లో ఒకరు ఫోన్‌పే వాడుతున్నారు. 3 కోట్ల ఆఫ్‌లైన్ రిటైలర్లు సంస్థ వేదికపైకి వచ్చి డిజిటల్ చెల్లింపులను స్వీకరిస్తున్నారు’ అని ఫోన్‌పే వివరించింది. చదవండి: 1.5 లక్షల మొబైల్ రిటైలర్ల భవిష్యత్తు అయోమయం -
వచ్చేసింది..గూగుల్ పే, ఫోన్ పే యాప్స్‌కు పోటీగా టాటా పే...!
అమెజాన్, జియో లాంటి సంస్థలకు పోటీగా టాటా గ్రూప్స్ గురువారం రోజున టాటా న్యూ యాప్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. డిజిటల్ ఎకానమీలో మరింత బలోపేతం అయ్యేందుకుగాను స్వంత యూపీఐ ‘టాటా పే’ సర్వీసును టాటా న్యూలో జోడించింది. టాటా పేతో చెల్లిస్తే రివార్డులు..! టాటా పే యూపీఐ సేవలు టాటా న్యూ యాప్‌లో అందుబాటులో ఉండనుంది. టాటా న్యూ యాప్‌తో జరిపే లావాదేవీలను టాటా పే ఉపయోగించి చెల్లించవచ్చును. ఈ చెల్లింపులతో యూజర్లకు న్యూకాయిన్స్(Neucoins)ను లభించనున్నాయి. టాటా న్యూ అందించే రిడెంప్షన్ ప్రోగ్రామ్‌లో భాగంగా టాటా పే ఉపయోగించి లేదా ఏదైనా టాటా గ్రూప్స్‌కు చెందిన స్టోర్లలో జరిపే కొనుగోళ్ల ద్వారా మాత్రమే న్యూకాయిన్స్ లభిస్తాయి. ప్రతి ఒక్క న్యూకాయిన్స్ విలువ రూ. 1 సమానం. కొత్త టాటా పే యూపీఐ ఖాతాను సృష్టించడానికి... ప్రతి ఒకరు మూడు-దశల రిజిస్ట్రేషన్ ప్రక్రియను అనుసరించాలి. స్కానింగ్, బ్యాలెన్స్ చెక్, ఖాతా/ స్వీయ-బదిలీ మొదలైన అన్ని సేవలను పొందవచ్చును. భారత్‌లో యూపీఐ సేవలు గణనీయంగా పుంజుకున్నాయి. దేశ వ్యాప్తంగా యూపీఐ లావాదేవీలు ఫిబ్రవరి, 2022లో రూ. 8.26 లక్షల కోట్లతో పోలిస్తే మార్చి 2022లో రూ. 9.6 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరలో యూపీఐ లావాదేవీలు ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా రూ. 81 లక్షల కోట్ల మార్కును దాటాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వెల్లడించింది. చదవండి: 'టాటా న్యూ యాప్ లాంచ్, రతన్ టాటా మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా! -
టాటా యూపీఐ పేమెంట్ యాప్ వచ్చేస్తోంది!
గూగుల్ పే, ఫోన్‌పేలకు టాటా గ్రూప్ షాకివ్వనుంది. ఆ రెండు సంస్థలకు ధీటుగా టాటా గ్రూప్ యూపీఐ పేమెంట్ యాప్‌ను త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఎకనమిక్ టైమ్స్ కథనం ప్రకారం..యూపీఐ పేమెంట్స్ సర్వీసుల్ని అందుబాటులోకి తెచ్చేందుకు టాటా గ్రూప్ ఇప్పటికే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) అనుమతులు తీసుకున్నట్లు టాటా గ్రూప్ డిజిటల్ కామర్స్ యూనిట్ తెలిపిందని ఎకనమిక్ టైమ్ పేర్కొంది. అంతేకాదు ఈ యూపీఐ పేమెంట్ కార్యకాలపాల్ని నిర్వహించేందుకు ఐసీఐసీఐ బ్యాంక్‌తో చర్చలు జరిపినట్లు వెల్లడించింది. నాన్ బ్యాంక్ సంస్థలు థర్డ్ పార్టీ పేమెంట్ సర్వీసులను ప్రారంభించేందుకు బ్యాంక్‌లతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే దేశీయంగా యూపీఐ సేవల్ని అందిస్తున్న గూగుల్ పే ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. భారతదేశంలో ఎక్కువ శాతం యూపీఐ లావాదేవీలు గూగుల్ పే లేదా ఫోన్‌పేలో జరుగుతాయి. ఇక పేటీఎం, అమెజాన్ పే, వాట్సాప్ పే వంటి ఇతర యాప్‌లు మార్కెట్‌ను కలిగి ఉండగా..తాజాగా టాటా గ్రూప్ రంగంలోకి దిగడంతో యూపీఐ పేమెంట్స్ యాప్స్ మధ్య పోటీ తత్వం నెలకొంది. -
దేశీ డిజిటల్ పే ప్లాట్ఫామ్లో ఇదే నంబర్ వన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవితకాల నమోదిత యూజర్ల సంఖ్య దేశవ్యాప్తంగా 35 కోట్లు దాటిందని ఫిన్‌టెక్ దిగ్గజం ఫోన్‌పే వెల్లడించింది. 2021 జనవరితో పోలిస్తే ఇది 28 శాతం వృద్ధి అని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. ‘నలుగురు భారతీయుల్లో ఒకరు ఫోన్‌పే వాడుతున్నారు. డిసెంబర్ నెల యాక్టివ్ యూజర్లు 15 కోట్లు నమోదైంది. గత నెలలో 50 కోట్లకుపైగా లావాదేవీలు జరిగాయి. ఫోన్‌పే వేదికగా ఏడాదిలో రూ.48,34,977 కోట్ల చెల్లింపులు జరిగాయి’ అని వివరించింది. భారతదేశపు అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫామ్‌గా అవతరించామని ఫోన్‌పే కంజ్యూమర్ ప్లాట్‌ఫాం, పేమెంట్స్ హెడ్ సోనికా చంద్ర తెలిపారు. లావాదేవీలు విజయవంతంగా పూర్తి అయ్యేలా నిరంతరం శ్రమిస్తున్న సాంకేతిక బృందం కారణంగానే ఇది సాధ్యమైందని చెప్పారు. 15,700 పట్టణాలు, గ్రామాల్లో 2.5 కోట్ల స్టోర్లలో వ్యాపారులు ఫోన్‌పే ద్వారా చెల్లింపులను స్వీకరిస్తున్నట్టు వెల్లడించారు. -
యూపీఐ లావాదేవీలు చేస్తున్నారా..! అయితే వీటిని కచ్చితంగా గుర్తుంచుకోండి..!
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేజ్(యూపీఐ) రాకతో నగదు లావాదేవీలు మరింత సులభంగా మారాయి. బ్యాంకుల ప్రమేయం లేకుండా క్షణాల్లో నగదును ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. పాన్ షాపు నుంచి మెడిసిన్స్ షాపుల వరకు అందరూ యూపీఐ పేమెంట్స్‌కు అలవాటు పడ్డారు. దీంతో కొత్త సైబర్ నేరస్తులు కూడా కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ క్యూ ఆర్ కోడ్లను, అడ్రస్‌లను యూజర్లకు గాలం వేసి డబ్బులను కాజేస్తున్నారు. ఇలాంటి నేరాల నుంచి తప్పించుకోవాలంటే యూపీఐ పేమెంట్స్ విషయంలో పలు సూచనలను పాటిస్తే సురక్షితంగా ఉండవచ్చును. చదవండి: హైటెక్ ఘరానా మోసగాళ్లు..! నమ్మించి సింపుల్‌గా రూ. 58 వేల కోట్లు స్వాహా..! 1. మీ యూపీఐ చిరునామాను ఎప్పుడూ తెలియనివారితో పంచుకోవద్దు. యూపీఐ చిరునామాను సురక్షితంగా ఉంచడం అత్యంత కీలకమైన భద్రతా చిట్కా. ఏదైనా చెల్లింపు లేదా బ్యాంక్ అప్లికేషన్ ద్వారా మీ యూపీఐ ఖాతాను యాక్సెస్ చేయడానికి మీరు ఎవరినీ అనుమతించకూడదు. 2. శక్తివంతమైన స్క్రీన్ లాక్‌ని సెట్ చేయండి మీరు వాడే గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్స్‌కు శక్తివంతమైన స్క్రీన్ లాక్‌ను ఏర్పాటు చేయడం మంచింది. మీ డేట్ ఆఫ్ బర్త్ను, మొబైల్ నంబర్ అంకెలను, స్క్రీన్ లాక్‌గా ఉంచకూడదు. మీ పిన్ను ఎవరితోనూ షేర్ చేయకూడదు ఒకవేళ మీ పిన్ బహిర్గతమైందని మీకు అనుమానం వస్తే, వెంటనే దాన్ని మార్చండి. 3. వేరిఫైకాని లింక్‌లపై క్లిక్ చేయవద్దు, నకిలీ కాల్స్‌ను హాజరుకావద్దు సైబర్ నేరస్తులు కొంత పుంతలు తొక్కుతూ..యూపీఐ పేమెంట్స్ లింక్స్‌ను యూజర్లకు పంపిస్తున్నారు. యూపీఐ స్కామ్ అనేది యూజర్లను ట్రాప్ చేయడానికి హ్యాకర్లు ఉపయోగించే ఒక సాధారణ టెక్నిక్. హ్యాకర్లు సాధారణంగా లింక్‌లను షేర్ చేస్తూ లేదా కాల్ చేసి డబ్బులను ఊడ్చేస్తారు. మీరు అలాంటి లింక్‌లపై ఎప్పుడూ క్లిక్ చేయకూడదు. మీ పిన్ లేదా మరేదైనా సమాచారాన్ని ఎవరితోనైనా షేర్ చేయకూడదు. బ్యాంకులు ఎప్పుడూ పిన్, ఓటీపీ, మరే ఇతర వ్యక్తిగత వివరాలను అడగవు. 4. ఎక్కువ యాప్స్ వాడకండి. ఆయా యూపీఐ పేమెంట్స్ యాప్స్ భారీగా ఆఫర్లను ఇస్తున్నాయని చెప్పి ఒకటి, రెండు కంటే ఎక్కువ యూపీఐ యాప్స్ వాడడం మంచింది కాదు. 5. క్రమం తప్పకుండా యాప్స్‌ను అప్డేట్ చేయాలి. ఆయా యూపీఐ యాప్స్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. కొత్త అప్డేట్లు మెరుగైన UI , కొత్త ఫీచర్లు మీకు ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి. యాప్‌లను తాజా వెర్షన్‌కి అప్‌గ్రేడ్ చేయడంతో మీ యూపీఐ ఖాతాలను సురక్షితంగా ఉంచుతుంది. చదవండి: ‘ప్రపంచ బ్లాక్ చైయిన్ టెక్నాలజీకి క్యాపిటల్‌గా తెలంగాణ..!’ -
‘అదే జరిగితే బ్యాంకులకు తప్పని ముప్పు..!’
భారత్‌లో డిజిటల్ చెల్లింపులు భారీ ఎత్తున ఊపందుకున్నాయి. గత ఏడాది కాలంగా కార్డు పేమెంట్స్‌తో పోల్చుకుంటే డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయని ప్రధాని మోదీ కూడా వెల్లడించారు. ఇప్పుడు ఆయా డిజిటల్ చెల్లింపుల యాప్స్ టెక్నాలజీను అందిపుచ్చుకోవడంలో బ్యాంకులు వెనకబడి ఉన్నాయని కోటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్ వెల్లడించారు. చిన్న చూపు తగదు..! గత రెండేళ్లుగా భారతీయ బ్యాంకర్లు డిజిటల్ చెల్లింపుల వ్యాపారాలను చిన్న చూపు చూసున్నాయని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (IFSCA) బ్లూమ్‌బెర్గ్ నిర్వహించిన ఇన్ఫినిటీ ఫోరమ్‌లో ఉదయ్ కోటక్ అన్నారు. 85 శాతం మార్కెట్ వాటాను పొందిన గూగుల్ పే, ఫోన్‌పే యాప్స్ ద్వారా యూపీఐ సేవలను ఆయా బ్యాంకులు అనుమతించినట్లు పేర్కొన్నారు. దీంతో రానున్న రోజుల్లో సాంప్రదాయ మార్కెట్ల నుంచి పెద్దభాగంలో కస్టమర్లు బయటకు వెళ్లే అవకాశం ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో విఫలమైతే బ్యాంకులకు ముప్పు ఏర్పడే అవకాశం లేకపోలేదని హెచ్చరించారు. ఫోన్‌పై,గూగుల్ పే అనుసరిస్తోన్న సాంకేతికతను వీలైనంత త్వరగా అందిపుచ్చుకుంటే మంచిందని, అందుకు కావాల్సిన వారిపై నియమాకాలను బ్యాంకులు చేపట్టాలని ఆయన అన్నారు. బ్యాంకు ఖాతాలను ఇచ్చేస్తాయి డిజిటల్ చెల్లింపుల యాప్స్ దూకుడు మీద ఉన్నాయి. దేశవ్యాప్తంగా గణనీయమైన డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి. పేటీఎం లాంటి డిజిటల్ చెల్లింపుల యాప్ పేటీఎం పేమెంట్స్ బ్యాంకు పేరుతో సేవలు మొదలు పెట్టిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం గూగుల్ పే యూజర్లకు ఖాతాలను అందించే విషయంతో వెనకడుగు వేసింది. రానున్న రోజుల్లో ఆయా డిజిటల్ చెల్లింపుల యాప్స్ యూజర్లకు ఖాతాలను అందించే అవకాశం లేకపోలేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: రూ. 999కే ఆరోగ్య బీమా..! లాంచ్ చేసిన ఫోన్‌పే..! వివరాలు ఇవే..! -
ఎలాంటి హెల్త్ రిపోర్ట్స్ అవసరం లేదు..! రూ. 999కే ఆరోగ్య బీమా..!
కరోనా రాకతో ఆరోగ్య బీమా ప్రతీ కుటుంబానికీ ఉండాలన్న అవగాహన అందరిలో వస్తోంది. ఊహించకుండా ఏదైనా పరిస్థితులు ఎదురైతే.. ఆస్పత్రుల్లో భారీ బిల్లులను కడుతూ ఆర్థికంగా కుదేలవ్వకుండా ఆరోగ్య బీమాతో కాస్త ఉపశమనం పొందవచ్చును. బీమా కంపెనీలకు పోటీగా డిజిటల్ చెల్లింపుల యాప్స్ కూడా పలు ఆరోగ్య బీమాలను యూజర్లకు అందిస్తోన్నాయి. తాజాగా ఫోన్‌పే యూజర్ల కోసం సరికొత్త ఆరోగ్యబీమాను మొదలుపెట్టింది. బీమా వివరాలు ఇలా ఉన్నాయి... ఆరోగ్య బీమాను అందించే మొదటి డిజిటల్ చెల్లింపుల యాప్ ఫోన్‌పే . బీమా పొందడానికి ఎలాంటి ఆరోగ్య పరీక్ష లేదా రిపోర్టు చూపించాల్సిన అవసరం లేదు. పేరు, లింగం, వయసు, ఈమెయిల్ లాంటి వివరాలను ఫిల్ చేయడంతో సులభంగా బీమా సౌకర్యాన్ని పొందవచ్చును. ఫోన్‌పే కేవలం రూ. 999 చెల్లిస్తే కస్టమర్లకు ఏడాది గాను రూ. 1,00,000 వరకు బీమా రక్షణ వస్తోంది. అయితే మీరు బీమా కవర్ మొత్తాన్ని పెంచాలనుకుంటే...రూ. 2,00,000 ఆరోగ్య బీమా ప్లాన్‌కు రూ. 1999, రూ. 3,00,000 ప్లాన్‌కు రూ. 2649 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఆయా వ్యక్తుల వయసును బట్టి ఆరోగ్యబీమా ప్రీమియం మారుతూ ఉంటుంది. రూ.999 బీమాలో వచ్చే కవరేజ్ ఇవే.. రూ. 999 బీమా పథకంతో లక్ష వరకు ఆసుపత్రి ఖర్చులకు కవరేజీ దక్కుతుంది. ఐసీయూ చికిత్స, డేకేర్ , అంబులెన్స్ ఛార్జీలు, ఆయుష్ చికిత్సతో సహా ఈ బీమాలో పొందవచ్చును. ఇతర ప్రీమియంలో కూడా ఇవే బెనిఫిట్స్ రానున్నాయి. ఈ ఆరోగ్య బీమా సుమారు దేశంలోని 7600 ఆసుపత్రులలో అందుబాటులో ఉంది. ఫోన్‌పే నుంచి ఆరోగ్య బీమాను ఇలా పొందండి. మీ స్మార్ట్‌ఫోన్‌లోని ఫోన్‌పే యాప్‌ను ఒపెన్ చేయండి. హోమ్ స్క్రీన్‌పై ఉన్న బీమా ట్యాబ్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు Health@999 ప్లాన్‌పై నొక్కండి. ఆ తరువాత వయసు, ఆరోగ్య బీమా ప్రీమియంను ఎంచుకోండి. దీని తర్వాత మీ పేరు, లింగం, పుట్టిన తేదీ , ఈ-మెయిల్ ఐడిని నమోదుచేయాలి. అన్ని వివరాలను ఫిల్ చేసిన తర్వాత...మీరు ఆయా పాలసీను సబ్‌స్రైబ్ చేసుకున్నట్లు మెసేజ్ వస్తోంది. గమనిక: ఈ ఆరోగ్యబీమాపై జీఎస్టీ వర్తిస్తుంది. చివరిగా చెల్లించే మొత్తం విలువ మారుతుంది. -
‘పే’యాప్‌ల జోరు.. ఏటీఎం, క్రెడిక్ కార్డుల బేజారు
న్యూఢిల్లీ: మొబైల్ చెల్లింపులు దేశంలో శరవేగంగా విస్తరిస్తున్నాయి. ఈ వేగం కార్డు చెల్లింపుల కంటే ఎక్కువగా ఉంది. కరోనా మహమ్మారి రాక తర్వాత చిన్న దుకాణాల నుంచి పెద్ద వ్యాపార సంస్థల వరకు డిజిటల్ చెల్లింపులను (యూపీఐ/క్యూఆర్‌కోడ్) ఆమోదిస్తుండడం ఈ వృద్ధికి దోహదపడుతున్నట్టు ‘ఇండియా మొబైల్ పేమెంట్స్ మార్కెట్ 2021’ నివేదిక తెలిపింది. 67 శాతం వృద్ధి మొబైల్ యాప్స్ ద్వారా చేసే చెల్లింపుల విలువ 2020లో 67 శాతం పెరిగి 478 బిలియన్ డాలర్లుగా ఉంటే.. 2021లో ట్రిలియన్ డాలర్లుగా ఉంటుందని నివేదిక అంచనా వేసింది. ‘‘భారత్‌లో మొబైల్ ఫోన్ల ద్వారా చేసే చెల్లింపులు వేగంగా పెరుగుతున్నాయి. యాప్‌ద్వారా చెల్లింపులు ఆదరణ పొందడం ఇందుకు తోడ్పడుతోంది’’ అని ఈ నివేదికను విడుదల చేసిన ఎస్అండ్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ పరిశోధన బృందం తెలిపింది. స్మార్ట్ ఫోన్లతో చెల్లింపులు చేసేందుకు వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నందున కార్డు చెల్లింపులకు కంటే ఇవే ఎక్కువగా వృద్ధి చెందుతాయని అంచనా వేసింది. తగ్గుముఖం డెబిట్, క్రెడిట్ కార్డులు, ఆన్లైన్ లావాదేవీల విలువ 2020లో 14 శాతం తగ్గి 170 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ నివేదిక అంచనా మేరకు.. 2020లో బ్యాంకులు 524 మిలియన్ డాలర్ల మేర క్రెడిట్ కార్డుల ఇంటర్చేంజ్ ఆదాయాన్ని కోల్పోయాయి. లాక్డౌన్లతో కార్డు చెల్లింపులు తగ్గిపోవడం తెలిసిందే. అనుకూలమైన ఎంపిక.. ‘‘చెల్లింపుల యాప్‌ల ద్వారా లావాదేవీలు (పీర్ టు పీర్ సహా), మొబైల్ చెల్లింపులు.. రిటైల్ ఇన్వెస్టర్లకు పాయింట్ ఆఫ్ సేల్, ఆన్లైన్ మాధ్యమాలకు అనుకూలమైన ఎంపికగా మారుతోంది. మొబైల్ చెల్లింపులు ప్రాచుర్యం కావడంతో నగదు వినియోగానికి డిమాండ్ నిదానించింది. 2020లో ప్రతీ ఏటీఎం నగదు ఉపసంహరణతో పోల్చి చూస్తే 3.7 మొబైల్ లావాదేవీలు నమోదయ్యాయి. రానున్న సంవత్సరాల్లోనూ భారత్‌లో డిజిటల్ చెల్లింపులు శరవేగంగా విస్తరించే అవకాశాలే ఉన్నాయి’’ ఈ నివేదిక పేర్కొంది. ఇన్స్టంట్ చెల్లింపుల విషయంలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని నాలుగు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలతో పోల్చి చూస్తే.. 2020లో భారత్‌లోనే అధిక సంఖ్యలో రియల్‌టైమ్ లావాదేవీలు నమోదైనట్టు తెలిపింది. ఎంతకాలం ఈ అగ్రస్థానం ‘‘ఫోన్‌పే, గూగుల్‌పే అత్యంత ప్రాచుర్యమైన యూపీఐ చెల్లింపులు యాప్‌లుగా భారత్‌లో అగ్రస్థానాల్లో ఉన్నాయి. 2021లో మొదటి ఆరు నెలల్లో ఫోన్‌పే 44 శాతం మార్కెట్ వాటాతో ఉండగా, గూగుల్ పే 35 శాతం వాటా కలిగి ఉంది. ఈ రెండు యాప్‌లు కలసి 338 బిలియన్ డాలర్ల విలువైన 12 బిలియన్ల లావాదేవీలు నిర్వహించాయి’’ అని ఈ నివేదిక వెల్లడించింది. పేటీఎం, అమెజాన్ పే సంస్థలు పోటీలో వెనుకబడినట్టు ఈ నివేదిక ఆధారంగా తెలుస్తోంది. యూపీఐ లావాదేవీల్లో పేటీఎం వాటా 14 శాతమే కాగా, అమెజాన్ పే 2 శాతం వాటాను కలిగి ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. అయితే ఫోన్‌పే, గూగుల్ పే యూపీఐ చెల్లింపుల్లో ఎప్పటికీ ఆధిపత్యం కొనసాగించే అవకాశం లేదని గుర్తు చేసింది. ‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ యూపీఐ లావాదేవీల్లో 30 శాతం పరిమితి (మొత్తం లావాదేవీల్లో) విధించింది. ఫోన్‌పే, గూగుల్‌పే మాత్రమే ఈ పరిమితిని దాటేశాయి. ఈ నిబంధనల అమలుకు 2022 వరకు సమయం ఉంది’ అని నివేదిక వివరించింది. చదవండి: పేటీఎమ్ మెగా ఐపీవో రెడీ -
కోర్టుమెట్లెక్కిన ఫోన్‌పే..! ఎందుకంటే..?
ప్రముఖ యూపీఐ పేమెంట్స్ కంపెనీ భారత్‌పే ‘బై నౌ పే ల్యాటర్’ అంటూ పోస్ట్‌పే యాప్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. కాగా పోస్ట్‌పే బ్రాండ్ నేమ్ కాపీరైట్ వ్యవహరంలో ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ప్రముఖ యూపీఐ పేమెంట్స్ యాప్ ఫోన్‌పే బాంబే హైకోర్టు మెట్లను ఎక్కింది. చదవండి: మొబైల్ యూజర్లకు షాకింగ్ న్యూస్...! ఎందుకంటే..? రెసిలియంట్ ఇన్నోవేషన్స్‌కు చెందిన పోస్ట్‌పే యాప్‌లో 'Pe' ప్రత్యయం వినియోగంపై రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్‌లను దుర్వినియోగం చేయకుండా నిరోధించాలని కోరుతూ ఫోన్‌పే బొంబాయి హైకోర్టును ఆశ్రయించింది. ఈ నెల ఆరో తారీఖున పోస్ట్‌పే సేవలను భారత్‌పే ప్రారంభించింది. ఈ విషయంపై బాంబే హైకోర్టులో ఫోన్‌పే అభ్యర్థనపై, కోర్టు అక్టోబర్ 22న విచారణకు స్వీకరించింది. అంతేకాకుండా పోస్ట్‌పే ఫోన్‌పే ప్రత్యయాన్ని పోలి ఉందనే విషయాన్ని హైకోర్టు గమనించింది. అయితే కోర్టు చేసిన కొన్ని పరిశీలనలను పరిష్కరించడం కోసం పిటిషన్‌ను ఫోన్‌పే ఉపసంహరించుకుంది. కాగా భారత్‌పే పై మరో దావాను వేసేందుకు సిద్దమైనట్లు కంపెనీ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇదే మొదటిసారి కాదు..! ఫోన్‌పే ‘పే’ ప్రత్యయం వినియోగంపై భారత్‌పేని కోర్టుకు లాగడం ఇదే మొదటిసారి కాదు. 2019 సెప్టెంబరులో ఫోన్‌పే ఇదే విధమైన నిషేధాన్ని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా...అప్పుడు కోర్టు భారత్‌పే ట్రేడ్‌మార్క్‌ను ఉల్లంఘించడం లేదని ఢిల్లీ హైకోర్టు ఫోన్‌పే పిటిషన్‌ను తోసిపుచ్చింది. చదవండి: ఫేస్బుక్ నెత్తిన మరో పిడుగు..! -
UPI Payments: ఆగస్టులో ఎంతమంది ఉపయోగించారంటే..
కరోనా కారణంగా డిజిటల్ చెల్లింపులు విపరీతంగా పెరిగాయి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. రూరల్‌కు సైతం చేరడం, దాదాపు ఇంటికొక్కరు చొప్పున ఆన్లైన్ పేమెంట్లే చేస్తుండడంతో కోట్ల విలువైన చెల్లింపులు రోజూ జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆగష్టులో అన్ని పేమెంట్ యాప్‌ల నుంచి డిజిటల్ చెల్లింపులు రికార్డు స్థాయికి చేరుకోవడం విశేషం. యూపీఐ సంబంధిత లావాదేవీలు రికార్డు లెవెల్‌ను చేరుకున్నాయి. ఒక్క ఆగష్టు నెలలోనే 6.39 ట్రిలియన్ రూపాయల విలువైన చెల్లింపులు జరిగాయి. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఒక ప్రకటన విడుదల చేసింది. ఆగష్టు నెలలో సుమారు 3.5 బిలియన్ల ట్రాన్జాక్షన్స్ యూపీఐ యాప్ చెల్లింపుల ద్వారా జరిగినట్లు తెలుస్తోంది. తద్వారా కిందటి నెలతో పోలిస్తే ట్రాన్జాక్షన్స్ రేటు 9.5 శాతం పెరగ్గా.. ట్రాన్జాక్షన్స్ విలువ 5.4 శాతం పెరిగింది. ►ఏప్రిల్ మే నెల మధ్య సెకండ్ వేవ్ ప్రభావంతో కొంతవరకు తగ్గినా.. తిరిగి మళ్లీ పుంజుకుంది. ఇక యూపీఐ మోడ్‌లో చెల్లింపులు జులైలో 3.24 బిలియన్ ట్రాన్జాక్షన్స్(జూన్‌తో పోలిస్తే 15.7 శాతం) జరగ్గా.. ఆగష్టులో అది మరింత పెరిగింది. 2016లో మొదలైన యూపీఐ సర్వీస్ చెల్లింపులు.. కరోనా కారణంగా పుంజుకున్నాయి. భారత్‌లో మొత్తం 50 థర్డ్‌పార్టీ యూపీఐ యాప్స్ ఉండగా.. అందులో ఫోన్‌పే(వాల్‌మార్ట్), గూగుల్‌పే(గూగుల్) ఆ తర్వాత పేటీఎం, అమెజాన్ పే.. డిజిటల్ మార్కెట్లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాయి. ►యూపీఐతో పాటు ఇమ్మిడియట్ పేమెంట్స్ సర్వీసెస్(IMPS) ద్వారా ఆగష్టులో 377.94 మిలియన్ ట్రాన్జాక్షన్స్ జరిగాయని, జులైతో పోలిస్తే అది 8.5 శాతం పెరుగుదలగా ఉందని, ట్రాన్జాక్షన్స్ విలువ 3.18 ట్రిలియన్ రూపాయలుగా పేర్కొంది. ►ఎన్పీసీఐ డెవలప్ చేసిన ఫాస్ట్‌ట్యాగ్(టోల్ కలెక్షన్ కోసం రూపొందించిన ప్రోగ్రాం).. ద్వారా ఆగష్టులో 201.2 మిలియన్ ట్రాన్జాక్షన్స్ జరగ్గా.. విలువ మూడువేల కోట్ల రూపాయలుగా ఉంది. అదే విధంగా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా 58.88 మిలియన్ ట్రాన్జాక్షన్స్ జరగ్గా.. వాటి విలువ పది వేల కోట్లకుపైనే ఉంది. చదవండి: అకౌంట్ లేకుండానే ఫిక్స్డ్ డిపాజిట్! -
ఇక ఫోన్‌పే, గూగుల్ పేతో పనిలేకుండానే ఈ-ట్రాన్జాక్షన్స్!
e-RUPI: ఫోన్‌పే, గూగుల్ పే, డెబిట్‌కార్డ్, క్రెడిట్ కార్డులు..... ఇలాంటివేమీ అక్కర్లేకుండానే నగదు రహిత చెల్లింపులు చేసేలా కేంద్రం కొత్త పథకాన్ని అమల్లోకి తేనుంది. మరింత తేలికగా నగదు లావాదేవీలు నిర్వహించేందుకు కొత్త విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తేబోతోంది. ఢిల్లీ: నగదు రహిత లావాదేవీలకు సంబంధించి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త స్కీంని రూపొందించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పేమెంట్ విధానాలకంటే సరళమైన పద్దతిలో క్యాష్‌లెస్, కాంటాక్ట్‌లెస్‌గా ఉండేలా ఈ-రూపీ స్కీం(E-RUPI)ని ప్రవేశపెట్టనుంది. ఎలాగంటే.. ఈ-రూపీ చెల్లింపులో నగదు చెల్లింపులను క్యూర్ కోడ్ లేదా ఎస్ఎమ్మెస్ స్ట్రింగ్ వోచర్ల ద్వారా లబ్ధిదారుడి మొబైల్ ఫోన్‌కి పంపిస్తారు. ఈ వోచర్ లేదా క్యూఆర్ కోడ్‌ను లబ్ధిదారుడు తనకు అవసరమైన చోట వినియోగించుకోవచ్చని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. డిజిటల్ లావాదేవీలను మరింత వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా ఈ- రూపీ పద్దతి అమల్లోకి తెస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. తొలిదశలో వీళ్లకే? ప్రస్తుతం ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనా పథకంలో టీబీ రోగులకు ప్రతీ నెల ఔషధాలు అందిస్తోంది, అవసరమైన రోగ నిర్థారణ పరీక్షలు చేయిస్తోంది, అంతేకాదు మాతా శిశు అభివృద్ధి పథకం కింద పౌష్టికాహారం అందిస్తోంది. వీటితో పాటు రైతులకు సబ్సిడీ కింద ఎరువులు అందిస్తోంది. వీటికి సంబంధించిన ఆర్థిక సహయాన్ని రాబోయే రోజుల్లో ఈ రూపే ద్వారా కేంద్రం చేపట్టనుంది. ప్రైవేటు రంగ సంస్థలు సైతం తమ ఉద్యోగుల సంక్షేమం విషయంలో e-RUPI పద్దతిని ఉపయోగించుకోవచ్చని సూచించింది కేంద్రం. క్లారిటీ రేపే! ఈ-రూపీ పథకం ఆగస్టు 2 నుంచి అమల్లోకి రానుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కొత్త విధానాన్ని లాంఛ్ చేయనున్నారు. తొలి దశలో కేంద్రం నుంచి ఆర్థిక సాయం పొందే లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలతో సంబంధం లేకుండానే ప్రభుత్వ సాయం అందనుంది. లబ్ధిదారుల మొబైల్ ఫోన్‌కి క్యూఆర్ కోడ్, ఎస్సెమ్మెస్ వోచర్ రూపంలో నగదు చేరుతుంది. అయితే దీన్ని ఉపయోగించే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. అంతేకాదు ఇది అందరికీ అందుబాటులోకి వచ్చేది రానిది కూడా తెలిసేది రేపే!. -
ఫోన్‌పే కస్టమర్లకు గుడ్‌న్యూస్.. క్షణాల్లో డెలివరీ పేమెంట్ చెల్లింపు
డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్ పే, ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో పే-ఆన్-డెలివరీ ఆర్డర్ల కోసం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా "క్యాష్ ఆన్ డెలివరీని ఎంచుకున్న వినియోగదారులు ప్రొడక్ట్ డెలివరీ సమయంలో ఫోన్ పే యుపీఐ ద్వారా డిజిటల్ గా చెల్లించడానికి వీలు కల్పిస్తుంది" అని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా మహమ్మారి సమయంలో యూజర్ల వ్యక్తిగత భద్రతపై దృష్టి పెట్టినట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఫోన్ పే బిజినెస్ డైరెక్టర్ అంకిత్ గౌర్ మాట్లాడుతూ.. "డిజిటల్ చెల్లింపుల కోసం గత కొన్ని సంవత్సరాలుగా యుపీఐ యాప్స్‌ను విస్తృతంగా వినియోగిస్తున్నందుకు ధన్యవాదాలు. డెలివరీ సమయంలో కొంతమంది కస్టమర్లు క్యాష్ ఆన్ డెలివరీ చేయడంతో వీటి ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ నగదు ఆధారిత చెల్లింపులను డిజిటైజ్ చేయడం కేవలం ఈ-కామర్స్‌కు మాత్రమే కాకుండా డిజిటల్ ఇండియా పెద్ద లక్ష్యానికి దోహదపడుతుంది" అని అన్నారు. ఈ ఒప్పందం వల్ల ఫ్లిప్‌కార్ట్ క్యాష్ ఆన్ డెలివరీ సమయంలో కాంటాక్ట్ లెస్ పేమెంట్లు చేయడం కొరకు కస్టమర్లు ఫోన్ పే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా చాలామంది కస్టమర్లు తమ అవసరాల కోసం ఆన్లైన్ షాపింగ్‌కు మారారని, పే ఆన్ డెలివరీ ఎంచుకునే కస్టమర్లకు పేమెంట్ సమయంలో మనశ్శాంతితో ఇకనుంచి పేమెంట్స్ చేయొచ్చని ఫ్లిప్‌కార్ట్‌లో ఫిన్‌టెక్ అండ్ గ్రూప్ హెడ్ రంజిత్ బోయనపల్లి అన్నారు. -
ఐపీఎల్ 2021 స్పాన్సర్‌షిప్‌ల జాబితాలో మరో సంస్థ
న్యూ ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 కోసం ఆరు స్పాన్సర్షిప్ ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే తెలిపింది. ఇప్పుడు ఫోన్‌పే అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ ఇండియాతో మాత్రమే స్పాన్సర్షిప్ కాకుండా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో అసోసియేట్ స్పాన్సర్‌గా ఉంది. అలాగే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ అనే నాలుగు ఐపిఎల్ ఫ్రాంచైజీలకు కూడా ఫోన్‌పే స్పాన్సర్ చేస్తోంది. ఫోన్‌పే ఐపీఎల్‌కు సహ-స్పాన్సర్ చేయడం వరుసగా ఇది మూడో సంవత్సరం. ఫోన్‌పే ఐపీఎల్ ప్రచారం స్మార్ట్ టీవీ, డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో నడుస్తుందని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఉన్న 280 మిలియన్ల ఫోన్‌పే వినియోగదారుల సంఖ్యను డిసెంబర్ 2022 నాటికి 500 మిలియన్లకు విస్తరించడంపై దృష్టి పెట్టినట్లు కంపెనీ తెలిపింది. ఫోన్‌పే వ్యవస్థాపకుడు & సీఈఓ సమీర్ నిగమ్ మాట్లాడుతూ.. “వచ్చే నెలలో ఐపీఎల్ 2021తో ప్రారంభమయ్యే జాతీయ మార్కెటింగ్ ప్రచారాన్ని అత్యంత వేగంగా తీసుకెళ్తున్నాము. ఈ ఏడాది ఐపిఎల్‌లో ఆరు వేర్వేరు స్పాన్సర్‌షిప్‌లపై భారీగా పెట్టుబడులు పెట్టాము. ప్రతి భారతీయుడి చెంతకు డిజిటల్ చెల్లింపులను తీసుకురావాలనేది మా ఆశయం. అందుకే మా మార్కెటింగ్ ప్రయత్నాలు దానికి అనుగుణంగా ఉన్నాయి" అని అన్నారు. ఫోన్‌పే అనేది ఒక డిజిటల్ చెల్లింపుల సంస్థ. దీని ద్వారా వినియోగదారులు డబ్బు పంపించడం, స్వీకరించడం, మొబైల్, డిటిహెచ్, డేటా కార్డులను రీఛార్జ్ చేయడం, దుకాణాలలో డబ్బులు చెల్లించడం చేయవచ్చు. చదవండి: వాట్సాప్‌లో మరో కొత్త స్కామ్ జర జాగ్రత్త! -
గూగుల్ పేకు మరో ఝలక్
సాక్షి, న్యూఢిల్లీ: వరుసగా రెండో నెలలో కూడా పేమెంట్ యాప్ ఫోన్‌పే టాప్‌లో నిలిచింది. ఫ్లిప్‌కార్ట్ మద్దతున్న ఫోన్‌పే మళ్లీ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యుపీఐ) చార్టులో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. తద్వారా వాల్‌మార్ట్‌కు చెందిన ఈ పేమెంట్ యాప్ గూగుల్ పేని అధిగమించి, టాప్ యూపీఐ యాప్‌గా ఫోన్‌పే నిలిచింది. జనవరిలో మొత్తం యుపీఐ లావాదేవీల్లో 41శాతం వాటాతో 968.72 మిలియన్ల లావాదేవీల వాల్యూమ్‌తో ఉన్న ఫోన్‌పే వరుసగా రెండవ నెలలో పరంపరను కొన సాగించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం ఫోన్‌పే లావాదేవీలు 7 శాతం పెరిగాయి, ట్రాన్సాక్షన్స్ విలువ జనవరిలో 5 శాతం పెరిగింది. ఫోన్‌పే తరువాత రూ .1.71 లక్షల కోట్ల విలువైన 853.53 మిలియన్ లావాదేవీలతో గూగుల్ పే రెండవ స్థానంలో ఉంది. 33,910 కోట్ల రూపాయల విలువైన 281.18 మిలియన్ లావాదేవీలను రికార్డు చేసిన పేటీఎం మూడో స్థానంలో నిలిచింది. అమెజాన్ పే, భీమ్, వాట్సాప్ పే లావాదేవీల విలువ వరుసగా రూ .4,004 కోట్లు, రూ .7,463 కోట్లు, రూ .36 కోట్లుగా ఉన్నాయి. జనవరిలో యూపీఐ ద్వారా మొత్తం రూ .4.2 లక్షల కోట్ల 2.3 బిలియన్ లావాదేవీలు నమోదయ్యాయని, నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ గతవారం ట్విటర్లో వెల్లడించారు. ఈ ఘనతను ఇది అసాధారణమైన ఘనత అని పేర్కొన్నారు. నెలకు ఒక బిలియన్ లావాదేవీలను దాటడానికి యూపీఐకి 3 సంవత్సరాలు పట్టిందని, అయితే ఆ తరువాతి బిలియన్ టార్గెట్‌ను ఏడాదిలోపే సాధించామన్నారు. లావాదేవీలు 76.5 శాతం పెరుగుదలను నమోదు చేయగా, లావాదేవీల విలువ దాదాపు 100 శాతం పెరిగిందని ట్వీట్లో పేర్కొన్నారు. కాగా డిసెంబరులో, ఫోన్‌పే 1.82 లక్షల కోట్ల రూపాయల విలువైన 902 మిలియన్ లావాదేవీలతో ఫోన్‌పే టాప్ ప్లేస్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. గూగుల్ పే 854 మిలియన్ లావాదేవీలను 1.76 లక్షల కోట్ల రూపాయలను నమోదు చేసింది. Phenomenal ! UPI recorded 2.3 billion transactions worth ₹ 4.3 trillion in Jan 2021. On a YOY basis, UPIs transaction value jumped 76.5 % while transaction value jumped nearly 100%. Took UPI 3 years to cross 1 billion transactions a month. Next billion came in less than a year.— Amitabh Kant (@amitabhk87) February 3, 2021 -
‘వాటిపై అదనపు చార్జీలు వసూలు చేయడం లేదు’
న్యూఢిల్లీ: కోవిడ్-19 కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో ప్రజలు డబ్బులను పంపించడం కోసం ఆన్లైన్ చెల్లింపులు మీద ఆధారపడుతున్నారు. దీంతో 2020లో యూపీఐ లావాదేవీల విలువ 105 శాతం పెరిగింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యుపిఐ) 2019 డిసెంబర్ నుండి 2020 డిసెంబర్ వరకు లావాదేవీల విలువలో 105 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2019 డిసెంబర్ చివరిలో యుపీఐ ప్లాట్‌ఫాం లావాదేవీల మొత్తం విలువ రూ.2,02,520.76 కోట్లుకు పైగా ఉంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) అధికారిక గణాంకాల ప్రకారం ఈ సంఖ్య 2020 డిసెంబర్ నాటికి రూ.4,16,176.21 కోట్లకు చేరుకుంది.(చదవండి: అమ్మో.. 5జీ ఇంటర్నెట్ స్పీడ్ ఇంతనా?) గత ఏడాది 2020 సెప్టెంబర్‌లో రూ.3 లక్షల కోట్ల బెంచ్‌మార్క్‌ను దాటింది. యుపీఐ ప్లాట్‌ఫాం ద్వారా 2019 డిసెంబర్ చివరి నాటికి 1308.40 మిలియన్ లావాదేవీలను జరపగా.. అదే 2020 డిసెంబర్ చివరి నాటికి కరోనా మహమ్మారి కారణంగా 2234.16 మిలియన్లకు చేరుకుంది. యుపీఐ ప్రతి నెలా లావాదేవీల సంఖ్య అక్టోబర్ నుండి రెండు బిలియన్ల మార్కును దాటుతోంది. అక్టోబర్ 2020లో మొదటిసారి ఈ సంఖ్యను దాటింది. అయితే, ఇటీవల ఈ లావాదేవీలపై జనవరి 1 నుంచి అదనపు చార్జీలు విధిస్తారనే రూమర్లు బాగా వినిపిస్తాయి. మొత్తానికి ఈ ప్రచారం అబద్ధం అని తాజాగా తేలింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, యూపీఐ ద్వారా జరిపే లావాదేవీలపై ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది. దీంతో గూగుల్ పే, ఫోన్ పే, పే టీమ్ వంటి ఆన్లైన్ ద్వారా నగదు లావాదేవీలు జరిపే వారికి ఇది గొప్ప ఉపశమనం. ఎప్పటి లాగానే యూపీఐ ట్రాన్సాక్షన్స్ నిర్వహించుకోవచ్చని ఎన్పీసీఐ స్పష్టం చేసింది. -
ఫోన్‌పేలో కొత్త ఫీచర్
సాక్షి, న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే వినియోగదారుల సౌలభ్యం కోసం సరికొత్త వెసులు బాటునుకల్పించింది. తన ప్లాట్‌ఫాంలో లావాదేవీలను మరింత సులువుగా జరుపుకునేలా వినియోగదారులకు చాట్ ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలలో చాట్ ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ ఫీచర్ ద్వారా, యూజర్లు ఇప్పుడు మరే ఇతర మెసేజింగ్ అనువర్తనం అవసరం లేకుండా డబ్బును అడగడం లేదా ధృవీకరణ కోసం చెల్లింపు రసీదును కూడా సెండ్ చేసుకోవచ్చు. ఫోన్‌పే చాట్ ద్వారా వినియోగదారులు, అవతలివారితో చాట్ చేస్తూ ట్రాన్సాక్షన్ పూర్తి చేయవచ్చు. అలాగే ఈ చాట్‌కు సంబంధించిన చాట్ హిస్టరీ కూడా ‘చాట్ ఫ్లో’ లో డిస్ ప్లే అవుతుంది. దీంతో ఆ తరువాత లావాదేవీ కూడా సులభం అవుతుంది. తమ చాట్ ఫీచర్ తమ కస్టమర్లకు చాలా ఆకర్షణీయమైన అనుభవంగా మారుతుందని ఫోన్‌పే అని సహ వ్యవస్థాపకుడు, సీటీవో రాహుల్ చారి ఒక ప్రకటనలో తెలిపారు. రాబోయే వారాల్లో ఫోన్‌పే చాట్‌ను గ్రూప్ చాట్ ఫీచర్‌తో మరింత మెరుగుపరుస్తామని చారి తెలిపారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ పరికరాల కోసం వారం క్రితం లాంచ్ చేసిన ఈ ఫీచర్ 185 మిలియన్ల ఫోన్‌పే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిందని కంపెనీ తెలిపింది. ఫోన్‌పే యాప్‌లో ఈ ఫీచర్‌ను ఎలా వాడాలి? యాప్‌ను ఓపెన్ చేసి కాంటాక్ట్ లిస్ట్ నుంచి సంబంధిత కాంటాక్ట్ నెంబరును ఎంచుకోవాలి ఇక్కడ రెండు ఆప్లన్లు ఉంటాయి. 1. చాట్ 2. సెండ్ చాటింగ్ కోసం చాట్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. నగదు పంపడానికి సెండ్ అనే ఆప్షన్ ఎంచుకొని, నగదును పంపొచ్చు. -
వాల్‌మార్ట్ భారీ పెట్టుబడులు : ఇక దిగ్గజాలకు దిగులే
ప్రపంచ ఆన్‌లైన దిగ్గజం వాల్‌మార్ట్.. పేటీఎం, అమెజాన్, గూగుల్‌కు షాకిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దేశీయ ఆన్లైన్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మెజార్టీ వాటాను కొనేసిన వాల్‌మార్ట్ తాజాగా ఫ్లిప్‌కార్ట్ సొంతమైన ఆన్లైన్, ఆఫ్‌లైన్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పేలో భారీ పెట్టుబడులను పెడుతోంది. సమీర్ నిగమ్ నేతృత్వంలోని కంపెనీ 500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని, ప్రత్యేకించి రానున్న ఐపిఎల్ సీజన్లో ప్రకటనలు, ప్రమోషన్లపై వెచ్చించాలని భావిస్తున్న సమయంలో తాజా నిధులు అందడం విశేషం. డిజిటల్ పేమెంట్ మార్కెట్లో రానున్న విప్లవాత్మక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వాల్‌మార్ట్ ఈ పెట్టుబడులను పెడుతోంది. ఫోన్ పేలో 763 కోట్ల రూపాయలు (సుమారుగా 111 మిలియన్ డాలర్లు) సమకూర్చింది. 2019లో కంపెనీకి మొట్టమొదటి పెట్టుబడి నిధిగా భావిస్తున్నారు. బెంగళూరుకు చెందిన సమీర్ నిగమ్ స్థాపించిన మొబైల్ పేమెంట్ సంస్థ ఫోన్‌పేను ఫ్లిప్‌కార్ట్ 2016లో కొనుగోలు చేసింది. 2017లో 500మిలియన్ డాలర్ల నిధులు సమకూర్చింది. దీంతో డిజిటల్ చెల్లింపుల రంగంలో మార్కెట్ లీడర్‌గా దూసుకుపోతోంది. 50 మిలియన్లకు పైగా నెలవారీ వినియోగదారులతో, ప్రత్యర్థులకు ధీటుగా దూసుకుపోతోంది. పేటీఎం, గూగుల్ పే, అమెజాన్ పే, వాట్సాప్ పేమెంట్స్, జియోతో పాటు కొత్తగా షావోమి ఎంఐ పే ఇటీవల డిజిటల్ చెల్లింపుల రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. -
డిజిటల్ పేమెంట్లు : ఆర్బీఐ ప్రమాద హెచ్చరికలు
న్యూఢిల్లీ : డిజిటల్ పేమెంట్లు... పెద్ద నోట్ల రద్దు తర్వాత అతివేగంగా విస్తరించిన వ్యవస్థ. ప్రస్తుతం నగదు రహిత చెల్లింపులకు డిజిటల్ పేమెంట్లు ఎంతో సహకరిస్తున్నాయి. ఈ పేమెంట్లను ప్రస్తుతం కొన్ని దిగ్గజ కంపెనీలు మాత్రమే తమ గుప్పిట్లో పెట్టుకున్నాయి. ఓ కస్టమర్ డిజిటల్ పేమెంట్‌ను చేయాలంటే ఆ సంస్థను ఆశ్రయించాలే తప్ప, మరో మార్గం లేకుండా చేస్తున్నాయి. వీటిలో పేటీఎం, ఫోన్‌పే, అమెజాన్ పే, గూగుల్ తేజ్ ఉండగా.. తాజాగా ఫేస్బుక్ కూడా చేరిపోయింది. అయితే డిజిటల్ పేమెంట్లు కొద్ది మంది ప్లేయర్ల చేతిలోనే ఉండటం అత్యంత ప్రమాదకరమని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా హెచ్చరించింది. దేశీయ డిజిటల్ పేమెంట్ల రంగాన్ని కొన్ని దిగ్గజ కంపెనీలే తమ ఆధిపత్యంలో పెట్టుకోవడం సరియైనది కాదని అంటోంది. ‘స్టేట్మెంట్ ఆన్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ పాలసీస్’ ను విడుదల చేసిన ఆర్బీఐ, రిటైల్ పేమెంట్ల రంగంలో నెలకొన్న ప్రమాదంపై హెచ్చరికలు జారీచేసింది. ఆర్థిక స్థిరత్వ దృక్పథం నుంచి రిటైల్ చెల్లింపుల సిస్టమ్‌లో ప్రమాదాలను తగ్గించవచ్చని పేర్కొంది. ఈ సిస్టమ్‌లో మరింత మంది ప్లేయర్లు, కంపెనీలు పాల్గొనాలనే ప్రోత్సహించనున్నామని ఆర్బీఐ తెలిపింది. ప్యాన్ ఇండియా పేమెంట్ ప్లాట్‌ఫామ్స్‌ను ప్రమోట్ చేయాలని, దీంతో ఈ రంగంలో పోటీ పెరిగి, సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతుందని తెలిపింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం డిజిటల్ పేమెంట్ల వల్ల ఎక్కువగా లాభపడింది పేటీఎంనే. ఈ రంగంలోకి తాజాగా ఫేస్బుక్ కూడా ఎంట్రీ ఇస్తోంది. తన వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌పై పేమెంట్ సర్వీసులను యాడ్ చేసి, ఈ రంగంలోకి ఫేస్బుక్ ప్రవేశిస్తోంది. గూగుల్, అమెజాన్, పేటీఎం మొబిక్విక్, ఫోన్‌పేలు ఇప్పటికే భారత్‌లో దిగ్గజ డిజిటల్ పేమెంట్ల కంపెనీలుగా ఉన్నాయి. దీంతో కొద్ది మంది చేతులోనే ఉన్న డిజిటల్ పేమెంట్ల పరిశ్రమను ప్రస్తుతం ఆర్బీఐ ఎంతో నిశితంగా పరిశీలిస్తోంది. అందరి యూజర్ల డేటాను కూడా భారత్‌లోని సర్వర్లలోనే స్టోర్ చేయాలని ఆర్బీఐ ఈ కంపెనీలను ఆదేశించింది. ఆర్బీఐ ఆదేశాలను స్థానిక కంపెనీలు స్వాగతించగా.. గ్లోబల్ టెక్నాలజీ కంపెనీలకు మాత్రం ఆర్బీఐ ఆదేశాలు మింగుడు పడటం లేదు. -
జియో హాలిడే హంగామా : బంపర్ ఆఫర్
రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తన వినియోగదారులను ఆశ్చర్యపరచడానికి హాలిడే హంగామా ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఈ ఆఫర్ కింద తన పాపులర్ ప్లాన్ 399 రూపాయలపై డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో ఈ ప్లాన్ 299 రూపాయలకే అందుబాటులోకి వచ్చింది. జియో రూ.399 ప్లాన్ అత్యధిక యూజర్లు రీఛార్జ్ చేసుకునే ప్లాన్. జియో ప్రస్తుతం ప్రకటించిన వంద రూపాయల డిస్కౌంట్ 15 రోజులు మాత్రమే అందుబాటులో ఉండనుంది. అంటే జూన్ 1 నుంచి జూన్ 15 వరకే ఈ డిస్కౌంట్ యూజర్లకు లభిస్తుంది. అయితే ఫోన్‌పే వాలెంట్ ద్వారా రీఛార్జ్ చేసుకున్న కొనుగోలుదారులకు మాత్రమే ఈ డిస్కౌంట్ లభ్యమవుతుంది. రీఛార్జ్ చేసుకున్న వెంటనే 50 రూపాయల డిస్కౌంట్‌ను పొందనున్నారు. ఆ అనంతరం రూ.50ను ఓచర్ల రూపంలో కస్టమర్లకు లభిస్తుంది. మైజియో యాప్‌లో ఉన్న ఫోన్‌పే ద్వారా ఈ రీఛార్జ్ చేసుకోవాలి. ఈ ప్లాన్ కింద 84 రోజుల కాలపరిమితితో రోజుకు 1.5 జీబీ చొప్పున నెలకు 126 జీబీ డేటాతోపాటు, అన్లిమిటెడ్ కాల్స్, రోజులకు 100 ఎస్ఎంఎస్లను జియో అందిస్తోంది. రోజుకు 1.5 జీబీ డేటా అయిపోయిన తర్వాత కూడా నెట్ వాడుకోవచ్చు. కానీ స్పీడ్ 64కేబీపీఎస్‌కు పడిపోతుంది. -
జియో మరో సూపర్ ఆఫర్
న్యూఢిల్లీ : దేశీయ మేజర్ టెలికాం ఆపరేటర్ల గుండెల్లో దడ పుట్టిస్తున్న రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్‌తో ముందుకొచ్చింది. మొబైల్ పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్ రీచార్జిలపై ఉత్తేజకరమైన ఆఫర్లను లాంచ్ చేసింది. పేటీఎం, ఫోన్ పే ద్వారా క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. తాజా నివేదికల ప్రకారం ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ జియో పేటీఎం, ఫోన్ పే యాప్‌ల ద్వారా రీచార్జిలపై క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. పేటీఎం ద్వారాఅయితే రూ.300 ఆఫర్‌పై రూ.76ల క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఫోన్‌పే ద్వారా రీచార్జి చేసుకుంటే రూ.75 క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. అయితే దీనికి జియో యూజర్లకు కంపెనీ పంపిన ఒక ప్రోమో కోడ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పేటీఎం యాప్‌లో 'మొబైల్ ప్రీపెయిడ్' లేదా 'మొబైల్ పోస్ట్ పెయిడ్' అప్షన్స్ను ఎంచుకుని జియో ఫోన్ నెంబర్‌ను ఎంటర్ చేసి 'ప్రోగ్రెస్ టు రీఛార్జ్'పై క్లిక్ చేయాలి. ఆ తరువాత ప్రోమో కోడ్‌నుకూడా జతచేయాలి. దీంతో రీచార్జ్ పూర్తవుతుంది. అయితే ఈ ప్రోమో కోడ్ ఎంట్రీ పై కొంత గందరగోళం నెలకొంది. ముఖ్యంగా ఇప్పటికే జియో వినియోగదారుల ప్రోమో కోడ్ జాబితాలో ఉందనీ, అందుకనీ పేటీఎం ద్వారా రీచార్జ్ సందర్భంగా ఈ ప్రోమో కోడ్ ఎంటర్ అవసరం లేదని తెలుస్తోంది. రీఛార్జ్ పూర్తి అయిన 24 గంటల్లో ఈక్యాష్ బ్యాక్ ఆఫర్ రూ. 76 కస్టమర్ల ఖాతాలో చేరుతుంది. మరిన్ని వివరాలను అధికారిక జియో వెబ్సైట్లో పరిశీలించవచ్చు. మరోవైపు మరికొన్ని రోజుల్లోనే ఉచిత ఫీచర్ ఫోన్ వినియోగదారుల చేతుల్లోకి రానుంది. దీంతో దేశీయ సర్వీసు ప్రొవైడర్లు ఆందోళనలో పడిపోయారు. రిలయన్స్ జియో ఉచిత ఫీచర్ల ఫోన్ల వల్ల టెలికం పరిశ్రమపై ప్రతికూల ప్రభావం పడుతుందని దేశీ రెండో అతిపెద్ద టెలికం ఆపరేటర్ వొడాఫోన్ ఫిర్యాదు కూడా చేసింది. జియో ఫోన్ల వల్ల ఆపరేటర్ల ఆదాయాలు మరింత తగ్గే ప్రమాదముందని పేర్కొంది. ఈ నేపథ్యంలో తాజా ఆఫర్‌తో ప్రధాన టెలికాం సంస్థలకు గుండెల్లోగుబులే. కాగా జియో తారిఫ్ ప్లాన్స్ రూ.19 నుంచి రూ.309మధ్య ఉన్న సంగతి తెలిసిందే. -
వివరణను డిమాండ్ చేసిన ఫోన్ పే
ముంబై: ఫ్లిప్ కార్ట్ కు చెందిన ఫోన్ పే తన సేవలను బ్లాక్ చేయడంపై ఆగ్రహం వక్తం చేసింది..ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే తమ సేవల్ని అడ్డుకోవడంపై ఐసిఐసిఐ బ్యాంక్ నుండి వివరణ కోరింది. బ్యాంక్ చర్యపై నిరసన వ్యక్తం చేసిన ఫోన్ పే వివరణ యివ్వాల్సిందిగా బ్యాంకును డిమాండ్ చేసింది. 20,000 లకుపైగా యూపీఐ ఆధారిత సేవల ద్వారా రూ. 5కోట్ల మేర ట్రాన్స్ క్షన్ విఫలమైనట్టు ఆరోపణలపై స్పందించినసంస్థ బ్యాంకింగ్ దిగ్గజం నుంచి సమాధానాన్ని కోరింది. కనీస వివరణ, ఎలాంటి ఫిర్యాదు లేకుండానే తమ వాలెట్ కస్టమర్ లింక్ ను బ్లాక్ చేసిందని మండిపడింది. ఎన్ పీసిఐ నిబంధనలను తాముపాటిస్తున్నామని వివరణ ఇచ్చింది. ఎన్పీసీఐ వివరణాత్మక మార్గదర్శకాలు, విధానాలను తాము అనుసరిస్తున్నామని 100 కు పైగా టెస్ట్ కేసులను పరిశీలించినట్టు ఫోన్ పే సీఈవో సీఈఓ సమీర్ నిగమ్ తెలిపారు. తాము యూపీఐ మార్గదర్శకాలను పాటించడంలేదని భావిస్తే కనీసం రెండు నెలల ముందు తమకు గానీ, ఎన్ పీసీఐ కిగానీ సమాచారం అందించాల్సిఉందని తెలిపారు. ఈ విషయంపై కూర్చుని నిర్ణయించుకుంటే బావుండేదన్నారు. ఇప్పటికైనా తమతో సమస్యలపై సంప్రదించాలని బ్యాంకు ను విజ్ఞప్తి చేసింది. తద్వారా వాటిని సమీక్షించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ మేరకు సమీర్ నిగమ్ తన వినియోగదారులకు ఒక బహిరంగ లేఖ రాశారు వివరణాత్మక సర్టిఫికేషన్, బలహీనతల అంచనా, థర్డ్ పార్టీ అప్లికేషన్ టెస్టింగ్ తరువాత మాత్రమే వాలెట్ ను లాంచ్ చేసినట్టు నిగమ్ వినియోగదారులకు తన లేఖలో పేర్కొన్నారు. డిజిటల్ పేమెంట్ మిడియేటర్గా సేవలందిస్తున్న ఫోన్ పేను కొనుగోలు చేసిన ఫ్లిప్ కార్ట్, ఆపై దాన్ని యూపీఐగా మార్చింది. దీన్ని బ్యాంకు ఆధారిత వ్యాలెట్‌గా మార్చేందుకు యస్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది. భద్రతా కారణాలు, నియంత్రణ పద్ధతుల కారణాలతో ఫోన్‌పే ఈ-వ్యాలెట్ ద్వారా లావాదేవీలను దేశీయ ప్రైవేట్ దిగ్గజ బ్యాంకు ఐసీఐసీఐ బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే. -
స్టార్టప్ కంపెనీని టేకోవర్ చేసిన ఫ్లిప్‌కార్ట్
డిజిటల్ చెల్లింపులో కొత్త ఒరవడికి ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ శ్రీకారం చుట్టింది. బెంగళూరుకు చెందిన ఫోన్ పే అనే స్టార్టప్ సంస్థను తాము సొంతం చేసుకున్నట్టు ఫ్లిప్ కార్డ్ శుక్రవారం ప్రకటించింది. బ్యాంకు వివరాలు లేకుండానే, వినియోగదారుల యూనిక్ ఐడెంటిటీ, మొబైల్ ఫోన్ నంబర్ లేదా ఇతర వర్చువల్ చెల్లింపుల చిరునామా ద్వారా లావాదేవీలకు అనుమతించే ఫోన్ పే అనే ఈ స్టార్టప్ సంస్థను ఫ్లిప్ కార్ట్ టేకోవర్ చేసింది. డిజిటల్ చెల్లింపుల్లో ఇది చాలా సురక్షితమైందని ఫ్లిప్ కార్ట్ సీఈవో బిన్నీ బన్సల్ తెలిపారు. ఫోన్ పే ను సొంతం చేసుకోవడం ద్వారా చెల్లింపుల ప్రక్రియలో నూతన ఒరడికి శ్రీకారం చుట్టామన్నారు. ఏప్రిల్ నెలలో తన సేవలను ప్రారంభించాల్సి ఉన్న ఫోన్ పే సంస్థను విలీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న చెల్లింపుల ప్రక్రియతో పోలిస్తే ఇది అత్యంత సురక్షితమైనది, సులువైనందని బిన్నీ బన్సల్ చెప్పారు. బ్యాంకు ఖాతా కలిగి ఉన్నవారెవరైనా సులభంగా కేవలం వారి మొబైల్ ఫోన్ ఉపయోగించి తక్షణ లావాదేవీలు చేయొచ్చని ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలోని లక్షలాదిమంది వినియోగదారులకు ఆన్లైన్, ఆఫ్‌లైన్ డిజిటల్ చెల్లింపుల సౌలభ్యానికి ఇది దారి తీస్తుందన్నారు. దీనిపై ఫోన్ పే సహ సంస్థాపకుడు సమీర్ నిగం కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఈ విలీనంతో తమ పరిధి మరింత విస్తరించనందన్నారు. ఫోన్ పే టీం ఫ్లిప్‌కార్ట్ కిందికి వచ్చినా, స్వతంత్ర వ్యాపార విభాగంగా పని చేస్తుందని ఫ్లిప్ కార్ట్ స్పష్టం చేసింది. కాగా ఈ కామర్స్ రంగానికి చెందిన ఇద్దరు మాజీ ఉద్యోగులు సమీర్ నిగమ్, రాహుల్ చారి సిటి-ఆధారిత మొబైల్ చెల్లింపుల కోసం ఫోన్ పే సంస్థను స్థాపించారు. వీరు సహసంస్థాపకులుగా ఉన్న ఈ సంస్థ దేశంలో మొదటి యూనిఫైడ్ చెల్లింపుల ఇంటర్ఫేస్ లకు శ్రీకారం చుట్టింది.