గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత డిజిటల్ పేమెంట్స్ ఎక్కువయ్యాయి. ఇప్పటి వరకు యూపీఐ పేమెంట్స్ రోజుకు/ఒకసారికి ఒక లక్ష మాత్రమే పంపించుకోవడానికి అవకాశం ఉండేది. తాజాగా ఈ పరిమితిని పెంచుతూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NCPI) కీలక ప్రకటన వెల్లడించింది.
ఎన్‌సీపీఐ ప్రకారం రేపటి (సెప్టెంబర్ 16) నుంచి రోజుకు లేదా ఒకసారికి గరిష్టంగా ఐదు లక్షల రూపాయల వరకు పంపించుకోవచ్చు. దీంతో యూజర్లు ఆసుపత్రి బిల్లులు, విద్యాసంస్థల ఫీజులకు సంబంధించిన పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఐపీఓకు అప్లై చేసుకునేటప్పుడు రూ. 5 లక్షలు పేమెంట్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు అన్నివిధాలా చాలా అనుకూలంగా ఉంటుంది.
ఇదీ చదవండి: సైబర్ మోసాలకు ఇన్సూరెన్స్: రోజుకు మూడు రూపాయలే..
Comments
Please login to add a commentAdd a comment