ఇప్పటివరకు మనుషులకు, జంతువులకు, వ్యాపారాలకు, వాహనాలకు ఇన్సూరెన్స్ తీసుకోవడం గురించి వినే ఉంటారు. ఇప్పుడు కొన్ని సంస్థలు ఏకంగా సైబర్ మోసాలకు కూడా ఇన్సూరెన్స్ అందిస్తున్నాయి. దీనికోసం రోజుకు కేవలం మూడు రూపాయలు మాత్రమే వెచ్చించాల్సి ఉంటుంది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..
టెక్నాలజీ రోజురోజుకి విపరీతంగా పెరుగుతున్న తరుణంలో సైబర్ మోసాలు కూడా అంతకంతకూ పెరిగిపోతూ ఉన్నాయి. సైబర్ మోసాల భారీగా పడి నష్టపోయిన ప్రజలు చాలామందే ఉన్నట్లు గతంలో చాలా కథనాల్లో తెలుసుకున్నాం. ఈ నష్టాలను భర్తీ చేయడానికి చిన్న ఇన్సూరెన్స్ ప్లాన్లను కూడా కొన్ని సంస్థలు తీసుకురావడం జరిగింది.
ఐడెంటిటీ చోరీ, డబ్బు పోగొట్టుకోవడం, ఫిషింగ్, ఈ-మెయిల్ స్పూపింగ్, సైబర్ స్టాకింగ్ మొదలం వాటికి ఇన్సూరెన్స్ లభిస్తుంది. అయితే ఇవన్నీ చిన్న మొత్తంలో కవరేజికి పనికొస్తాయి. ఈ రిస్క్ కవరేజీలు రోజుకు మూడు రూపాయల వద్ద లభిస్తున్నాయి. భారీ మొత్తంలో జీవిత భీమా, వెహికల్స్ ఇన్సూరెన్స్ మాదిరిగా లభించదు.
ఇదీ చదవండి: ఈ-సిమ్ పేరుతో మోసం.. రూ.27 లక్షలు మాయం
సైబర్ నేరగాళ్లు ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ప్రజలను నిలువునా దోచేస్తున్నారు. ఇందులో నకిలీ వీడియోలు, వాయిస్ క్లోనింగ్, టెక్స్ట్ మెసేజస్, ఫ్రాడ్ కాల్స్, పేస్ మార్పింగ్, ఓటీపీ వంటివి ఎన్నో ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే.. నేరగాళ్లు ప్రజలను దోచుకోవాడానికి అన్ని విధాలా ప్రయాణాలు చేస్తూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళ మాయలో పడితే.. భారీ నష్టాలను చవి చూడాలి ఉంటుంది. కాబట్టి ఈ భారీ నుంచు కొంత ఉపసమయం పొందటానికి ఈ ఇన్సూరెన్స్ ఉపయోగోపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment