టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ మోసాలకు బలైపోయి భారీగా డబ్బు పోగొట్టుకున్నవారు కోకొల్లలు. ఇటీవల ఇలాంటి సంఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. ఇందులో ఓ మహిళ సుమారు రూ. 27 లక్షలు పోగొట్టుకుంది.
నోయిడాలోని సెక్టార్ 82లో నివాసం ఉంటూ.. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న 'జ్యోత్సానా భాటియా'కు ఆగస్టు 31న టెలికాం కంపెనీకి చెందిన కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ నుంచి తనకు వాట్సాప్ కాల్ వచ్చిందని పోలీసులకు తెలిపింది. మొబైల్ ఫోన్ పోయినట్లయితే.. యాక్టివేట్ అయ్యే ఈసిమ్ కొత్త ఫీచర్ల గురించి కాలర్ ఆమెకు చెప్పినట్లు వెల్లడించింది. కాలర్ చెప్పేది నిజమని నమ్మని భాటియా 'ఈసిమ్'కు మారేందుకు అతడు సూచించిన విధంగా చేసింది. ఇందులో భాగంగానే ఆమె మొబైల్‌కు వచ్చిన ఒక కోడ్ ఎంటర్ చేయమని అడగగా.. ఆమె అది కూడా పూర్తి చేసింది.
కాలర్ చెప్పినవన్నీ చేసిన తరువాత ఆమె సిమ్ డీయాక్టివేట్ అవుతుందని.. మరో రెండు మూడు రోజుల్లో ఫిజికల్ సిమ్ వస్తుందని చెప్పాడు. మూడు రోజుల తరువాత కూడా ఆమెకు సిమ్ రాలేదు. దీంతో ఆమె కస్టమర్ కేర్ సిబ్బందికి కాల్ చేసింది. వారు డూప్లికేట్ సిమ్ కోసం సర్వీస్ సెంటర్ వద్దకు రావాలని సూచించారు. ఆమె వారు చెప్పినట్లుగా సర్వీస్ సెంటర్ వద్ద డూప్లికేట్ సిమ్ తీసుకుని ఫోన్‌లో వేసుకుని యాక్టివేట్ చేసింది.
మొబైల్ నెంబర్ యాక్టివేట్ అవ్వగానే.. బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బు డిడెక్ట్ అయినట్లు వరుస మెసేజ్‌లు వచ్చాయి. సైబర్ నేరస్థుడు తన ఫిక్డ్ డిపాజిట్ నుంచి డబ్బు తీసుకున్నట్లు, కొంత డబ్బు ఇతర ఖాతాలకు మళ్లించినట్లు తెలిసింది. అంతే కాకుండా ఆమె పేరుమీద రూ. 7.40 లోన్ కూడా తీసుకున్నట్లు తీసుకుంది.
ఇదీ చదవండి: ఆధార్ ఫ్రీ అప్‌డేట్: యూఐడీఏఐ కీలక నిర్ణయం
సైబర్ నేరగాడు.. మొబైల్ నెంబర్ ద్వారా బ్యాంకింగ్ అప్లికేషన్ హ్యాక్ చేసి.. ఈ మెయిల్ ఐడీలను సైతం మార్చేశాడని ఆమె పోలీసులకు వెల్లడించింది. మొత్తం మీద ఆమె రూ. 27 లక్షలు పోగొట్టుకున్నట్లు తెలిపింది. నిందితున్న పట్టుకోవడానికి పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.
ఈ-సిమ్ అంటే..
ఈ-సిమ్ అనేది ఒక డిజిటల్ సిమ్ కార్డు. కాబట్టి ఈ-సిమ్ ఉపయోగిస్తే.. ఫిజికల్ సిమ్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. దీనిని అధికారిక వెబ్‌సైట్‌లో లేదా సర్వీస్ సెంటర్లలో పొందవచ్చు. ఈ-సిమ్ పొందాలనుకునేవారు టెలికామ్ ఎగ్జిక్యూటివ్‌ను కలిసిన తరువాత మారడం ఉత్తమం.
Comments
Please login to add a commentAdd a comment