సైబర్ సెక్యూరిటీ.. ఇప్పుడు ఎక్కువగా దీనిపైనే చర్చ.. అందుకే ప్రతిదానికి ఓ రహస్య పాస్‌వర్డ్. అది ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే.. మీ ఖాతా అంత సురక్షితం అన్నట్లు లెక్క. అయితే.. చాలామంది కామన్‌గా ఉండే పాస్ట్‌వర్డ్స్ వాడుతుంటారు.. ఐ లవ్ యూ అని.. 12345 అని ఇలా.. హ్యాకింగ్ చేయడానికి కొందరు ఏదో ఒకటి తగిలేదాకా.. కామన్‌గా ఉండే పాస్‌వర్డ్‌లను ట్రై చేస్తూ ఉంటారు. ఒకవేళ అలాంటి పాస్‌వర్డ్ పెట్టుకుంటే.. మన ఖాతా ప్రమాదంలో పడ్డట్లే.
దీనికి సంబంధించి నార్డ్‌పాస్ ఏటా వరస్ట్ పాస్‌వర్డ్స్ జాబితా విడుదల చేస్తోంది. అంటే.. వాటిని ఈజీగా హ్యాక్ చేయొచ్చని అర్థం. ఇలాంటివి మొత్తం 200 పాస్‌వర్డ్‌ల వివరాలు.. వాటిని హ్యాక్ చేయడానికి పట్టే సమయం వంటివాటిని https://nordpass.com/most commonpasswordslistలోఉంచింది. మీరూ ఓసారి చెక్ చేసుకోండి.. ఒకవేళ మీ పాస్‌వర్డ్ కనుక ఇందులో ఉంటే.. వెంటనే మార్చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇక్కడైతే.. టాప్–8 జాబితా చూద్దాం..
Comments
Please login to add a commentAdd a comment