Cyber security
-
సైబర్.. సైరన్..!
పెరుగుతున్న సాంకేతికతతో పాటు సైబర్ నేరాలు(Cyber Crime) సైతం పెచ్చుమీరుతున్నాయి. రోజుకొక మోసంతో కేటుగాళ్లు కోట్లలో కొళ్లగొడుతున్నారు. ఒకరికి ఒకరు కనిపించకుండా, ముఖ పరిచయం లేకపోయినా లింక్ సిస్టమ్‌లా వీళ్లు పనిచేస్తున్నారు. సామాన్యుల నుంచి సంపన్న వర్గాలు, యువతీ, యువకుల నుంచి వృద్ధుల వరకు అమాయక ప్రజలంతా వీరి బాధితులే. సెల్లో లింకే కదా అని క్లిక్ చేస్తే మిమ్మల్ని బుక్ చేస్తారు. ఇలాంటి మోసాలతో రూ.లక్షలు పోగొట్టుకుని పరువు సమస్యతో పోలీసులకు ఫిర్యాదులివ్వలేక అనేకమంది సతమతం అవుతున్నారు. ఈ సైబర్ నేరాలపై అవగాహనకు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. – శ్రీకాకుళం క్రైమ్అందమైన వల.. చిక్కారో విలవిలమనుషులను కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేసే పద్ధతి ఎక్స్‌టార్సన్. అలాగే అందమైన అమ్మాయిలను ఎరవేసి, తర్వాత బెదిరించి డబ్బులు దోచుకోవడం సెక్స్‌టార్సన్. వాట్సాప్, ఫేస్బుక్, టిండర్ (డేటింగ్ యాప్), ఇన్‌స్ట్రాగామ్ (Instagram) వంటి సోషల్ మీడియా యాప్‌ల ద్వారా మనలో ఉండే బలహీనతలను క్యాష్ చేసుకుని సైబర్ నేరగాళ్లు సెక్స్‌టార్సన్ పద్ధతిలో మోసాలు చేస్తుంటారు. వీరు బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) వంటి రాష్ట్రాల నుంచి నెట్వర్క్ నడుపుతున్నట్లు దర్యాప్తు విభాగాలు చెబుతున్నాయి. సంపన్న వర్గాలకు చెందిన వృద్ధులు, యువత అధికంగా ఈ మాయలో పడుతుండటం విశేషం. వీరితో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయవేత్తలు సైతం వందల సంఖ్యలో మోసపోతున్నారు.ఎలా చేస్తారంటే.. సైబర్ కేటుగాళ్లు అమ్మాయి పేరుతో ఉన్న నకిలీ ఫేస్బుక్ (ఇతర యాప్స్) ఐడీని క్రియేట్ చేసి సెలెక్ట్ చేసుకున్న వ్యక్తికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతారు. యాక్సెప్ట్ చేయగానే ముందుగా చాటింగ్.. అలా నంబర్లు ఇచ్చిపుచ్చుకోవడం.. ఆ తర్వాత వాట్సాప్‌లో వ్యక్తిగత సమాచారం (వ్యక్తిది) తెలుసుకుని అడల్ట్ కంటెంట్, న్యూడ్ చాట్ చేసుకునేవరకు కథ తీసుకెళ్తారు. అనంతరం చాట్ నుంచి వీడియో కాల్స్‌లోకి లాగి అవతలివైపు నుంచి రికార్డ్ చేసిన ఓ న్యూడ్ వీడియోను వాట్సాప్ కాల్లో లైవ్లాగా చిత్రీకరించి ఎదుటి వ్యక్తిని న్యూడ్‌చాట్‌లోకి తీసుకొస్తారు. వెంటనే మొత్తం కాల్ రికార్డ్ చేసి అదే వ్యక్తి వాట్సాప్‌కు వీడియోను షేర్ చేసి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తారు. లేదంటే యూట్యూబ్‌లో పెడతామని బెదిరిస్తారు.అప్రమత్తతే ఆయుధం » సైబర్ మోసానికి గురయ్యేవారు గోల్డెన్ అవర్‌లో తక్షణమే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలి. » www.cybercrime.gov.in పోర్టల్‌లో ఆన్లైన్ ఫిర్యాదివ్వాలి. సంబంధిత బ్యాంకు ప్రతినిధులను సంప్రదించి ఖాతాలను ఫ్రీజ్ చేయించాలి. పరిధి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలి. » ఎవరైనా బ్యాంకులో మ్యూల్ ఖాతా తమకు తెలియకుండా వేరే వ్యక్తులు తెరవాలనుకుంటే వెంటనే 1930 సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేయాలి. అంతేకాక ఆర్టీజీఎస్ ద్వారా రూ.2 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని సేవింగ్స్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్‌కు బదిలీ చేస్తే ఖాతాదారులను అప్రమత్తం చేయాలి. ఈ మోసాలు పరిశీలిస్తే.. » శ్రీకాకుళం జిల్లాలో ఓ ప్రముఖ కుటుంబానికి చెందిన వ్యక్తి తనకున్న బలహీనతతో ఫేస్బుక్లో అమ్మా యి పరిచయం కాగానే మాటామాటా కలిపాడు. ఆమె కూడా వీడియో కాల్ మాట్లాడటం, న్యూడ్ గా కనిపించడంతో తనూ న్యూడ్‌గా మారి కొంతకాలం ఆనందం పొందాడు. అక్కడికి కొద్దిరో జులకు ఆ అమ్మాయి న్యూడ్ వీడియోలు బయటపెడతానంటూ భయపెట్టి రూ.5 లక్షలు కావా లని బ్లాక్ మెయిల్ చేసింది. బయట తెలిస్తే పరు వు పోతుందని చేసేదేమీలేక డబ్బులు వేసేశాడు. » జిల్లాలోని ఒక ప్రముఖ వైద్యుడు తెలియని లింక్ క్లిక్ చేయడంతో హాయ్ అని ఓ అమ్మాయి వాట్సాప్ మెసేజ్ పెట్టింది. రిప్లయ్ ఇవ్వడంతో న్యూడ్ వీడియో కాల్స్ తరచూ చేసేది. అక్కడికి కొద్దిరోజులకు వీడియోలు బయటపెడతామంటూ, డిజిటల్ అరెస్టు అవుతావంటూ ఢిల్లీ పోలీస్ సెటప్‌తో కొందరు వ్యక్తులు స్కైప్కాల్లో దర్శనమవ్వడంతో వాళ్లడిగిన రూ.18.50 లక్షలు చదివించేశారు. » శ్రీకాకుళం రూరల్ మండలంలో సంపన్న వర్గానికి చెందిన ఓ వృద్ధుడు అశ్లీల వీడియోలు చూసే అలవాటుండడంతో అందులో ఓ మెసేజ్ రావడంతో ఆన్సర్ చేశాడు. ఓ ఇద్దరు యువతుల ముఖాలతో ఉన్న పురుషులు వీడియో కాల్లో కనిపించి వృద్ధునికి మత్తెక్కే మాటలతో మైమరిపించగా వృద్ధుడు న్యూడ్‌గా మారాడు. తక్షణమే ఆ వీడియోలు వృద్ధునికి పంపించి రూ.10 లక్షలు డిమాండ్ చేయగా. రూ.6 లక్షల వరకు సమర్పించేశాడు. » ఇదే తరహాలో ఏఐ సాయంతో జిల్లాలో ఓ మహిళా అధికారికి మోసం చేసే క్రమంలో ఆమె అప్రమత్తం అవ్వడంతో త్రుటిలో సైబర్ ఉచ్చునుంచి తప్పించుకున్నారు. జాగ్రత్తగా ఉండాలి ఏ బ్యాంకు కూడా ఆన్లైన్ కేవైసీ వివరాలు అడగదు. అపరిచితులు పంపే లింక్‌లు ఓపెన్ చేయరాదు. వాళ్లు మన ఫోన్‌ను హ్యాక్ చేసే సమయంలో మన అకౌంట్లో డబ్బులు ఎంత ఉంటే అంత మాయం చేస్తారు. డబ్బులు లేకపోతే ఏమీ చేయలేరు. ఎప్పటికప్పుడు మన ఖాతాను పరిశీలిస్తుండాలి. సెక్స్‌టార్షన్‌కు గురయ్యేవారు తామేదో తప్పు చేసినట్లు భావించి భయపడి పరువు సమస్యతో ఫిర్యాదు చేయకపోతే సైబర్ నేరగాళ్లకు మీరే బలమైన ఆయుధాన్ని ఇచ్చిన వారవుతారు. తక్షణమే ఫిర్యాదు చేస్తే ఆపద నుంచి బయటపడవచ్చు. – కేవీ మహేశ్వరరెడ్డి, ఎస్పీ, శ్రీకాకుళం జిల్లా -
తక్కువ మొత్తంలో జమ చేస్తారు.. ఆపై దోచేస్తారు!
ఆన్లైన్ వేదికగా సైబర్ నేరస్థులు కొత్త మోసాలకు తెర తీస్తున్నారు. ఆన్లైన్ బ్యాంకింగ్, పేటీఎం, ఫోన్‌పే, జీపే వంటి థర్డ్‌పార్టీ మోబైల్ యాప్‌ల ద్వారా నగదు లావాదేవీలు చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలని, తెలియని నంబర్ నుంచి మెసేజ్‌లు, లింకులు వస్తే వాటిని ఓపెన్ చేయకూడదని సైబర్ పోలీసులు తెలియజేస్తున్నారు. సైబర్ కేటుగాళ్లు చిన్నమొత్తాల్లో ఖాతాల్లోకి డబ్బు పంపించి తిరిగి ఆ ఖాతాలను లూటీ చేసేలా ప్రయత్నిస్తున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు.ఇటీవల సైబర్ మోసగాళ్లు ఫోన్‌పే, జీపే, పేటీఎం వంటి థర్డ్‌పార్టీ పేమెంట్ యాప్‌ల ద్వారా తక్కువ మొత్తంలో నగదును ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. దాంతో డబ్బు అందుకున్న వారికి మెసేజ్ వస్తుంది. దాన్ని ఆసరాగా చేసుకుని, వారిని నమ్మించి ‘మీ ఖాతాలో నగదు జమైంది. ఈ లింక్‌పై క్లిక్ చేయండి’అంటూ మెసేజ్‌లో కింద లింక్ ఇస్తున్నారు. లింక్ క్లిక్ చేస్తే పిన్ జనరేట్ చేయమనేలా అడుగుతుంది. పొరపాటున పిన్ జనరేట్ చేస్తే బ్యాంకు ఖాతాలోని డబ్బు ట్రాన్స్పర్ చేసుకునేందుకు పూర్తి అనుమతి ఇచ్చినట్లవుతుందని పోలీసులు చెబుతున్నారు.ఇదీ చదవండి: చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయంఖాతాలో గుర్తు తెలియని నంబర్ల ద్వారా చిన్న మొత్తాల్లో డబ్బు జమ అవుతుందంటే అనుమానించాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు. తెలియని నంబర్ల నుంచి వచ్చిన మేసేజ్‌లను, లింక్‌లను ఓపెన్ చేయకుండా నేరుగా డెలిట్ చేయాలని చెబుతున్నారు. -
ఆన్లైన్ మోసాలు.. విస్తుపోయే వాస్తవాలు!
ఇంటర్నెట్, మొబైల్ డేటా వినియోగంతో దేశంలో ఆన్లైన్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సైబర్ మోసగాళ్లు రకరకాల పేర్లతో మభ్యపెట్టి అమాయకులను దారుణంగా వంచిస్తున్నారు. ఎంతోమంది వీరి బారిన పడి డబ్బులతో పాటు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. తాజాగా తెలంగాణలో ఓ యువ రైతు ఆన్లైన్ మోసాలకు బలయ్యాడు. సైబర్ కేటుగాళ్ల మాటలు నమ్మి డబ్బులు పొగొట్టుకున్న వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామానికి చెందిన బందెనోల్ల పోచిరెడ్డి(30) అనే రైతు బలవనర్మణం చెందాడు.11 వేల కోట్ల రూపాయలు నష్టంప్రతిఏటా వేల కోట్ల రూపాయలను సైబర్ మోసగాళ్లు కొల్లగొడుతున్నారు. ఆన్లైన్ మోసాలకు మనదేశం 2024 మొదటి 9 నెలల్లోనే 11,333 కోట్ల రూపాయలు నష్టపోయిందని హోంశాఖ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ) వెల్లడించింది. స్టాక్ ట్రేడింగ్ పేరుతో రూ.4636 కోట్లు, ఇన్వెస్ట్మెంట్ సంబంధిత పేర్లతో రూ.3216 కోట్లు మాయం చేశారని పేర్కొంది. డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి రూ1616 కోట్లు దోచేశారని లెక్క చెప్పింది. ఆన్లైన్ మోసాలపై ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 12 లక్షల ఫిర్యాదులు వచ్చినట్టు సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టం (సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్) తెలిపింది. వచ్చే ఏడాదిలోనూ సైబర్ దాడుల ముప్పు కొనసాగుతుందని డేటా సెక్యురిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(డీఎస్‌సీఐ) హెచ్చరించింది.డిజిటల్ అరెస్ట్.. లేటెస్ట్ ట్రెండ్మన దైనందిన జీవితాల్లో డిజిటలైజేషన్ వినియోగం పెరగడంతో తప్పనిసరిగా ఆన్లైన్, మొబైల్ సేవలపై ఆధారపడాల్సి వస్తోంది. మన అవసరాలు, ఆశలను ఆసరాగా తీసుకుని సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త అవతారాల్లో జనాన్ని వంచించి, కేసుల పేరుతో భయపెట్టి సొమ్ములు చేసుకుంటున్నారు. ఫలితంగా దేశంలో సైబర్ మోసాల కేసులు నానాటికీ ఎగబాకుతున్నాయి. ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీగా డబ్బులు కొట్టేసిన ఘటనలు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. దీంతో ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ.. మన్ కీ బాత్ కార్యక్రమం 115వ ఎపిసోడ్లో డిజిటల్ అరెస్ట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రభుత్వానికి చెందిన ఏ దర్యాప్తు సంస్థ కూడా ఫోన్ లేదా వీడియో కాల్స్ ద్వారా విచారణ చేపట్టదని ఆయన తెలిపారు.30 లక్షల ఫిర్యాదులుఅమాయకులను లక్ష్యంగా చేసుకుని సైబర్ దుండగులు మోసాలకు పాల్పుడుతున్నారు. వృద్ధులు, మహిళలను టార్గెట్ చేసి సొమ్ములు కాజేస్తున్నారు. సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్ డేటా ప్రకారం 2021 నుంచి ఇప్పటి వరకు సైబర్ మోసాలపై 30.05 లక్షల ఫిర్యాదులు నమోదు కాగా, రూ.27,914 కోట్లను కేటుగాళ్లు కొల్లగొట్టారు. 2023లో 11,31,221 కేసులు నమోదు కాగా, 2022లో 5,14,741, 2021లో 1,35,242 ఫిర్యాదులు వచ్చాయి. కాగా, కంబోడియా, మయన్మార్, లావోస్ లాంటి ఆగ్నేయాసియా దేశాలు సైబర్ మోసాలకు అడ్డాలు మారాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. మనదేశంలో నమోదైన ఆన్లైన్ మోసాల్లో 45 శాతం ఈ దేశాల నుంచే జరుగుతున్నట్టు గుర్తించారు. చదవండి: సైబర్ స్కామర్స్‌తో జాగ్రత్త.. మోసపోకుండా ఉండాలంటే ఇలా చేయండి..అప్రమత్తతే రక్షణ కవచంసైబర్ మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే స్వీయ అప్రమత్తతే ఆయుధమని నిపుణులు సూచిస్తున్నారు. మొబైల్ ఫోన్లు, వ్యక్తిగత ఇ-మెయిల్, వాట్సాప్‌లో వచ్చే అనుమానాస్పద లింకులు.. సందేశాలకు స్పందించవద్దని కోరుతున్నారు. ఎక్కువ డబ్బు ఆశచూపే వారి పట్ల అలర్ట్‌గా ఉండాలని చెబుతున్నారు. ప్రభుత్వ దర్యాప్తు సంస్థల పేరుతో ఎవరైనా భయపడితే కంగారు పడొద్దని, నేరుగా పోలీసులను సంప్రదించాలని నిపుణులు సలహాయిస్తున్నారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైనట్టు భావిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. మున్ముందు కూడా కొత్త తరహా సైబర్ మోసాలకు పాల్పడే అవకాశం ఉన్నందున వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. -
టెలికం సంస్థలకు సైబర్ సెక్యూరిటీ నిబంధనలు
న్యూఢిల్లీ: దేశ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, సర్వీసులకు భద్రత కల్పించే దిశగా టెలికం సైబర్ సెక్యూరిటీ నిబంధనలను కేంద్రం నోటిఫై చేసింది. సైబర్ సెక్యూరిటీకి భంగం కలగకుండా పాటించాల్సిన మార్గదర్శకాలు, ఒకవేళ ఉల్లంఘన ఉదంతాలేమైనా తలెత్తితే తీసుకోవాల్సిన చర్యలు మొదలైనవి వీటిలో ఉన్నాయి.వీటి ప్రకారం ప్రతి టెలికం సంస్థ సైబర్ సెక్యూరిటీ పాలసీని (భద్రత చర్యలు, రిస్క్ మేనేజ్మెంట్ విధానాలు, శిక్షణ, ఉత్తమ విధానాలు.. టెక్నాలజీలను వినియోగించడం మొదలైనవి) అమలు చేయాల్సి ఉంటుంది. చీఫ్ టెలికమ్యూనికేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ని నియమించుకోవాల్సి ఉంటుంది. సెక్యూరిటీ ఉల్లంఘన జరిగితే ఆరు గంటల్లోగా ప్రభావిత సిస్టం వివరాలను కేంద్రానికి తెలియజేయాలి. 24 గంటల వ్యవధిలో ఏ ప్రాంతంలో, ఎంత మంది యూజర్లపై, ఎంత సేపు ప్రభావం పడింది, తీసుకున్న దిద్దుబాటు చర్యలేమిటి తదితర వివరాలను ఇవ్వాలి.అలాగే, మొబైల్ పరికరాల తయారీ సంస్థలు ఆయా ఉత్పత్తులను విక్రయించడానికి ముందే, వాటి ఐఎంఈఐ నంబరును ప్రభుత్వం దగ్గర నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. సైబర్ సెక్యూరిటీని మెరుగుపర్చే దిశగా టెలికం సంస్థల నుంచి ట్రాఫిక్ డేటా, ఇతరత్రా వివరాలను తీసుకునేందుకు ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి. -
హైదరాబాద్‌లో ‘హాక్ 2.0’కు కసరత్తు!
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచడానికి, ప్రతి ఒక్కరినీ సైబర్ వారియర్స్‌గా తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ సమ్మిట్స్ను మరోసారి నిర్వహించాలని సిటీ కొత్వాల్ సీవీ ఆనంద్ నిర్ణయించారు. గత ఏడాది ఆయన హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా ఉండగా తొలి హాక్–2023 సమ్మిట్ నిర్వహించారు. తాజాగా మరోసారి హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ సమ్మిట్–2024కు (హాక్ 2.0) సన్నాహాలు చేస్తున్నారు.నగర పోలీసు విభాగం, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్సీఎస్సీ) సంయుక్తంగా నిర్వహించే ఈ సమ్మిట్ వచ్చే నెల 6న నగరంలోని ది పార్క్ హోటల్లో జరుగనుంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రతి ఏడాదీ ఇలాంటి సమ్మిట్స్ నిర్వహించాలని, సైబర్‌తో పాటు ట్రాఫిక్, నార్కోటిక్స్, ఉమెన్ సేఫ్టీ విభాగాలకు వీటిని విస్తరించాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ గతంలోనే నిర్ణయించారు.యువత... ప్రధానంగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్న చేపట్టబోయే సైబర్ సమ్మిట్‌లో కొన్ని విద్యా సంస్థలకు చెందిన సైబర్ స్వ్కాడ్స్‌ను ఆవిష్కరించే అవకాశం ఉంది. వీళ్లు వారి పాఠశాలల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తారు. ఎప్పటికప్పుడు కొత్త ముప్పులు పుట్టుకువస్తున్న ఈ తరుణంలో ప్రతి ఒక్కరికీ సైబర్ సెక్యూరిటీ అన్నది అత్యంత కీలకాంశంగా మారింది. దీనికోసమే సిటీ పోలీసులు, హెచ్సీఎస్సీ కలిసి పనిచేస్తూ ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నాయి.చదవండి: సైబర్ స్కామర్స్‌తో జాగ్రత్త.. మోసపోకుండా ఉండాలంటే ఇలా చేయండి.. -
రాజస్థాన్ లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసుల భారీ ఆపరేషన్
-
అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ గ్యాంగ్ అరెస్ట్.. 27 మందిపై 2023 కేసులు
సాక్షి, హైదరాబాద్: తొలిసారి అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేసినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. వీరిని పట్టుకొవాడినికి స్పెషల్ ఆపరేషన్ నిర్వహించామని, రాజస్థాన్‌లో నాలుగు బృందాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయని చెప్పారు. రాజస్థాన్, జైపూర్, జోధ్పూర్లలో ఈ ఆపరేషన్ నిర్వహించామని. 15 రోజుల అపరేషన్‌లో భాగంగా 27 మంది సైబర్ క్రిమినల్స్‌ను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నిందితులు అందరూ విద్యావంతులేననని, మొత్తం ముప్పై ఏళ్ళ లోపు వారే ఉన్నారని తెలిపారు.ఒక్కొక్కరు పదుల కేసుల్లో నిందితులుగా ఉన్నారని, ఈ 27 మందిపై తెలంగాణ వ్యాప్తంగా 189 కేసులు నమోదైనట్లు శిఖా గోయల్ చెప్పారు. దేశ వ్యాప్తంగా 2023 కేసులో వీరు నిందితులుగా ఉన్నారన్నారు. నిందితుల నుంచి 31 మొబైల్ ఫోన్స్, 37 సిమ్ కార్డ్స్, చెక్ బుక్స్లను స్వాధీనం చేసుకున్నామని ెప్పారు. నిందితులు 29 మ్యూల్ అకౌంట్లను సైబర్ క్రైమ్స్ కోసం సేకరించారని తెలిపారు. 11 కోట్లు లావాదేవీలు 29 అకౌంట్ల ద్వారా నిందితులు చేశారని, విచారణలో లావాదేవీల జరిపిన మొత్తం అమౌంట్ పెరిగే అవకాశం ఉందన్నారు.‘సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు స్పెషల్ ఆపరేషన్ చేయలేదు. స్పెషల్ ఆపరేషన్ కోసం ప్రత్యేకంగా టీమ్‌లను ఏర్పాటు చేశాం. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితులు అందర్నీ పట్టుకోగలిగాం. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా టీమ్స్ బృందాలుగా డిస్పాచ్ అయ్యి నిందితులను అరెస్ట్ చేశారు. మా బృందాలు ఎప్పటికపుడు నేరస్తుల కదలికలు, లోకేషన్లపై నిఘా పెట్టీ అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది కమిషన్ కోసం ఉద్దేశ పూర్వకంగానే మ్యూల్ అకౌంట్ లను నేరస్తులకు ఇస్తున్నారునేరస్తులకు క్రిమినల్ కార్యకలాపాల కోసం అకౌంట్స్ ఇవ్వవద్దు. తెలంగాణ వ్యాప్తంగా 189 కేసులో నిందితులు రూ. 9 కోట్లు కొల్ల గొట్టారు. నిందితులను అరెస్ట్ చేయడానికి లోకల్ పోలీసుల సహకరించారు. సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆపరేషన్ ఇది లాస్ట్ ఆపరేషన్ కాదు. మొదటిది. నేరాలకు పాల్పడిన క్రిమినల్స్ దేశంలో ఎక్కడ ఉన్నా పట్టుకుని వస్తాం. నేరగాళ్లు సిటీలు వదిలి గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ నేరాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్ల కొల్లగొట్టిన రూ. 114 కోట్ల రూపాయలను ఈ సంవత్సరం బాధితులకు తిరిగి ఇచ్చాం. సైబర్ నేరగాళ్లు మోసం చేస్తే వెంటనే కాల్ సెంటర్ కు పిర్యాదు చేయాలి. మ్యూల్ అకౌంట్లను ఓపెన్ చేసేముందు క్రాస్ చెక్ చేయాలని బ్యాంకర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని తెలిపారు. -
పెట్టుబడుల ఆశచూపి.. అందినకాడికి దోపిడీ
సాక్షి, హైదరాబాద్: స్టాక్ మార్కెట్లో తాము చెప్పే కంపెనీల్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశచూపి బ్యాంకు ఖాతాలు ఖాళీచేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. షేర్ల కొనుగోలు పేరిట అమాయకులకు గాలం వేసి రూ.కోట్లలో దోచుకుంటున్నారు. ఈ తరహా ఐపీఓ ట్రేడింగ్ మోసాలు ఇటీవల పెరిగినట్టు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. కొత్తగా మార్కెట్లోకి వచ్చే ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్)లను ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్మెంట్ కింద కొనుగోలు చేయండి అంటూ సైబర్ నేరగాళ్లు నమ్మబలుకుతున్నట్టు పేర్కొంది. 2023లో ఈ తరహా కేసులు 627 నమోదు కాగా, బాధితులు రూ.3,91,54,683 పోగొట్టుకున్నట్టు టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వెల్లడించింది. ఈ ఏడాదిలో రెండు నెలల్లోనే మొత్తం 213 కేసులు నమోదయ్యాయని, బాధితులు రూ.27,40,76,211 పోగొట్టుకున్నట్టు అధికారులు తెలిపారు. ఇలా మోసగిస్తున్నారు.. సైబర్ మోసగాళ్లు తొలుత వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా యాప్‌ల ద్వారా లింక్‌లు పంపుతున్నారు. ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్(ఎఫ్‌పీఐ)ల వంటి ఇన్స్టిట్యూషనల్ విధానాల్లో ఐపీఓలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మబలుకుతున్నారు. ఈ ప్రకటనలు నమ్మి ఎవరైనా పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపితే, వారిని ఫేక్ ట్రేడింగ్ యాప్‌లను డౌన్లోడ్ చేసుకునేలా సైబర్ నేరగాళ్లు ప్రోత్సహించి తమ అదీనంలో ఉండే బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు వేయించుకుంటారు. నకిలీ యాప్‌లో బోగస్ డ్యాష్ బోర్డులను సృష్టించి వారికి లాభాలు వస్తున్నట్టుగా చూపుతున్నా రు. మరింత పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయ ని నమ్మిస్తారు. బాధితులు చివరకు తమ సొమ్మును డ్రా చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు మోసపోయిన విషయం తెలుస్తుంది. ఈ తరహా ట్రేడింగ్ మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరిస్తున్నా రు. ఒకవేళ తాము మోసపోయినట్టు గుర్తిస్తే బాధితులు వెంటనే 1930 టోల్ఫ్రీనంబర్లో లేదా cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. -
అయోధ్య ప్రసాదం.. వీఐపీ దర్శనం!
సాక్షి, హైదరాబాద్: అయోధ్య రామమందిరం పేరును సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు ఉపయోగించుకుంటున్నట్లు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీఎస్‌సీఎస్‌బీ) హెచ్చరించింది. అయోధ్య ప్రసాదం పంపిణీ పేరిట, విరాళాల సేకరణ పేరిట, వీఐపీ దర్శనం టికెట్ల విక్రయం పేరిట సైబర్ నేరగాళ్లు వాట్సాప్‌లలో సందేశాలు పంపుతున్నట్లు పేర్కొంది. అయోధ్య రామమందిరం పేరుతో సైబర్ నేరస్తులు పంపే క్యూఆర్ కోడ్లు, ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజ్ (ఏపీకే) ఫైల్స్‌ను నమ్మి మోసపోవద్దని టీఎస్‌సీఎస్‌బీ డైరెక్టర్ షికా గోయల్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రామమందిరం పేరిట సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్సైట్లు సృష్టించినట్లు తమ దృష్టికి వచ్చి నట్లు చెప్పారు. డబ్బు పంపాలంటూ వాట్సాప్ సందేశాల్లో నకిలీ లింక్‌లు పంపుతున్నారని, ఆ లింక్‌లు క్లిక్ చేసిన వారి నుంచి బ్యాంకుల వివరాలు, ఫోన్‌నంబర్లను సేకరిస్తున్నారని తెలిపారు. అలాగే వివిధ మొబైల్ యాప్‌లను డౌన్లోడ్ చేసి ఓటీపీలు చెప్పాలని కోరుతున్నారని, అలా చేస్తే ఫోన్ల పనితీరు సైబర్ నేరగాళ్ల అ«దీనంలోకి వెళ్తుందని హెచ్చరించారు. ఈ డిజిటల్ ముప్పును ఎదుర్కోవడానికి వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో వచ్చే అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని షికా గోయల్ సూచించారు. ఈ తరహా మెసేజ్‌లు వస్తే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు. అదేవిధంగా www. cybercrime. gov. in ద్వారా లేదా వాట్సాప్‌లో సైబర్ ఫ్రాడ్ రిజిస్ట్రీ నంబర్ 87126 72222కు సమాచారం ఇవ్వాలని సూచించారు. పాత నాణేలిస్తే లక్షలిస్తామని బురిడీ పాత నాణేలు తమకు ఇస్తే బదులుగా రూ. లక్షలు చెల్లిస్తామంటూ సైబర్ నేరగాళ్లు మోసగిస్తున్నారని... ఇందిరా గాంధీ, భారతదేశ మ్యాప్ చిత్రాలున్న పాత రూ. 2 లేదా రూ. 5 నాణేలు పంపిస్తే రూ. లక్షల్లో ఆదాయం వస్తుందని మోసపూరిత ప్రకటనలు ఇస్తున్నట్లు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికా గోయల్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సైబర్ నేరగాళ్ల మాయలో చిక్కే అమాయకులకు డబ్బు చెల్లిస్తామని... అందుకోసం ముందుగా టీడీఎస్, సర్విస్ చార్జీలు చెల్లించాలంటూ కేటుగాళ్లు డబ్బు దండుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి మోసాలపట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. -
ఆందోళనలో దేశీయ కంపెనీలు.. ముప్పు తప్పదా..?
న్యూదిల్లీ: దాదాపు అన్ని రంగాలూ, సకల కార్యకలాపాలూ అంతర్జాలంతో అనుసంధానమైవుతున్న డిజిటల్ ప్రపంచంలో జీవిస్తున్నాం. దీని ద్వారా వేగవంతమైన అద్భుత ప్రయోజనాలు ఒక కోణమైతే.. హ్యాకింగ్‌లూ, వైరస్ దాడులూ, మోసాలూ దీని మరో కోణం. దీంతో సైబర్ భద్రత అనివార్యమైంది. చాలా కంపెనీలకు సైబర్ భద్రతకు సంబంధించిన ఆందోళనలు పెరుగుతున్నాయి. పీడబ్ల్యూసీ నిర్వహించిన 2023 గ్లోబల్ రిస్క్ సర్వే–ఇండియా నివేదికలో సైబర్ సెక్యూరిటీపై కంపెనీలు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు వెల్లడయ్యింది. దీని ప్రకారం భారతీయ కంపెనీలకు పొంచి ఉన్న రిస్కుల్లో సైబర్ సెక్యూరిటీ అగ్ర స్థానంలో ఉంది. రాబోయే 12 నెలల్లో తమ సంస్థలకు అత్యధికంగా సైబర్ సెక్యూరిటీ రిస్కులు పొంచి ఉన్నాయని సుమారు 38 శాతం మంది రిస్క్ మేనేజ్మెంట్ లీడర్లు తెలిపారు. తర్వాత స్థానాల్లో వాతావరణ మార్పులు (37 శాతం మంది), ద్రవ్యోల్బణం (36 శాతం), ఇతరత్రా డిజిటల్.. టెక్నాలజీ (35 శాతం) రిస్కులు ఉన్నాయి. 67 ప్రాంతాలకు చెందిన 3,910 మంది బిజినెస్, రిస్క్ మేనేజ్మెంట్ లీడర్లు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఇందులో 163 భారతీయ సంస్థలు ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీపరమైన రిస్కు గతేడాది నివేదికలో మూడో స్థానంలో ఉండగా ఈ ఏడాది మొదటి స్థానానికి చేరింది. నివేదికలో మరిన్ని వివరాలు.. సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు భారతీయ సంస్థలు సైబర్ సెక్యూరిటీని పటిష్టం చేసుకునేందుకు భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సర్వేలో పాల్గొన్న వాటిలో 55 శాతం సంస్థలు వచ్చే 1–3 ఏళ్లలో కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, ఆటోమేషన్ టెక్నాలజీలపై పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నాయి. 71 శాతం దేశీ సంస్థలు రిస్క్ మేనేజ్మెంట్కి సంబంధించి సైబర్ సెక్యూరిటీ, ఐటీ డేటాను సేకరించి, విశ్లేషిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఈ సంఖ్య 61 శాతంగా ఉంది. దేశీ వ్యాపార దిగ్గజాలు రిస్కు తీసుకునే సామర్థ్యాలను పెంచుకోవడంతో పాటు రిసు్కల వల్ల వచ్చే అవకాశాలను గుర్తించడంలోనూ సముచితంగా వ్యవహరిస్తున్నాయి. ఆలోచనా ధోరణిలో ఈ తరహా మార్పులనేవి సంస్థ పురోగతికి దోహదపడనున్నాయి. 99 శాతం దిగ్గజాలు ఇటు రిస్కులను సమర్ధంగా ఎదుర్కొంటూనే అటు వృద్ధి సాధించగలమనే ధీమాతో ఉన్నాయి. ఇందులో 66 శాతం సంస్థలు అత్యంత ధీమాగా ఉన్నాయి. అంతర్జాతీయంగా ఈ గణాంకాలు వరుసగా 91 శాతం, 40 శాతంగా ఉన్నాయి. టెక్నాలజీల్లో విప్లవాత్మక మార్పులను రిసు్కలుగా కాకుండా అవకాశాలుగా భారతీయ వ్యాపార సంస్థలు భావిస్తున్నాయి. 69 శాతం దేశీ ఎగ్జిక్యూటివ్‌లు జనరేటివ్ ఏఐని ముప్పుగా కాకుండా అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయంగా వీరి సంఖ్య 60 శాతంగా ఉంది. ఇదీ చదవండి: చనిపోయినా సంపద సేఫ్..! కానీ.. రిస్క్ మేనేజ్మెంట్ కోసం జెనరేటివ్ ఏఐలాంటి కొత్త టెక్నాలజీలను కూడా కంపెనీలు పెద్ద యెత్తున వినియోగించుకుంటున్నాయి. ఆటోమేటెడ్ రిస్క్ అసెస్మెంట్, స్పందన కోసం 48 శాతం దేశీ సంస్థలు ఏఐ, మెషిన్ లెర్నింగ్‌ను ఉపయోగిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఇది 50 శాతంగా ఉంది. -
స్ట్రిప్డ్ ఫ్లై మాల్వేర్తో జాగ్రత్త
ఫుకెట్ (థాయిల్యాండ్): సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్స్కీ.. స్ట్రిప్డ్ ఫ్లై అనే మాల్వేర్ విషయమై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక జారీ చేసింది. గత ఆరేళ్లలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ మాల్వేర్ బారిన పడినట్టు తెలిపింది. ఆరంభంలో ఇది క్రిప్టోకరెన్సీ మాదిరిగా నటించి, ఆ తర్వాత మొండి మాల్వేర్గా మారిపోయినట్టు పేర్కొంది. ఈ మాల్వేర్ బహుళ మాడ్యూల్‌ను కలిగి ఉండడం, క్రిప్టో మైనర్‌గా, రామ్సమ్వేర్ సమూహంగా వ్యవహరించి.. ఆర్థిక లాభం నుంచి గూఢచర్యం వరకు కార్యకలాపాలు విస్తరించగలదని కాస్పర్స్కీ హెచ్చరించింది. బాధితులపై విస్తృతంగా నిఘా పెట్టే సామర్థ్యాలను ఈ మాల్వేర్ వెనుకనున్న వ్యక్తులు సంపాదించినట్టుగా తెలిపింది. యూజర్‌కు తెలియకుండానే, వారి స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ షాట్లు ఈ మాల్వేర్ తీసుకోగలదని, స్మార్ట్‌ఫోన్‌పై గణనీయమైన నియంత్రణ పొందగలదని వివరించింది. స్టిప్డ్ ఫ్లై మాల్వేర్ బారిన పడకుండా కొన్ని చర్యలు సాయపడతాయని తెలిపింది. ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్డేట్ చేసుకోవడం, అప్లికేషన్లు, యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని సూచించింది. అనుమానిత లింక్‌లపై క్లిక్ చేసే ముందు, వ్యక్తిగత వివరాలు షేర్ చేసే ముందు పంపించిన వారి ఐడెంటిటీని పరిశీలించాలని పేర్కొంది. -
పటిష్ఠతే పరమావధి!
అనుమానం పెనుభూతం! ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ గుర్తింపు కార్యక్రమమైన మన ‘ఆధార్’ విశ్వసనీయతపై ఏళ్ళు గడిచినా ఇప్పటికీ ఏవో అనుమానాలు వస్తూనే ఉన్నాయి. భారత సర్కార్ ఎప్పటికప్పుడు ఆ అనుమానాల్నీ, ఆరోపణల్నీ కొట్టిపారేస్తున్నా అవి మాత్రం ఆగడం లేదు. ప్రపంచశ్రేణి రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తన తాజా నివేదికలో ఆధార్ భద్రత, వ్యక్తిగత గోప్యతలపై లేవనెత్తిన ప్రశ్నలతో ఈ అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. ఎలాంటి సాక్ష్యాధా రాలూ పేర్కొనకుండా, అర్థం లేని ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటూ ప్రభుత్వం సహజంగానే ఈ నివేదికను కొట్టిపారేసింది. అయితే, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద శ్రామికులకు జరిపే చెల్లింపులు సహా సమస్తం ఇకపై ఆధార్‌తోనే జరపాలని ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్ని స్తున్న వేళ మూడీస్ నివేదికలోని మాటలు కొంత ఆందోళన రేపుతున్నాయి. సత్వరమే ఆ అనుమా నాల్ని నివృత్తి చేసి, ఆధార్ సందేహాతీతమైనదని మరోసారి చాటాల్సిన అవసరం ఏర్పడింది. న్యూయార్క్ కేంద్రంగా నడిచే రేటింగ్ ఏజెన్సీ మూడీస్ గురువారం విడుదల చేసిన పరిశోధనా నివేదిక ఆ మధ్య కొత్తగా రంగప్రవేశం చేసిన ‘వరల్డ్ కాయిన్’తో మన ఆధార్‌ను పోల్చింది. విస్తృత పరిమాణం, సృజనాత్మక ఆలోచన రీత్యా రెండూ ప్రత్యేకంగా నిలిచాయని ప్రశంసించింది. అయితే, భద్రత, గోప్యతలే అసలు సమస్యలంటూ కొన్ని ప్రాథమికమైన ప్రశ్నలు వేసింది. ఉష్ణోగ్రత, ఉక్క పోత ఎక్కువగా ఉండే చోట ఆధార్ లాంటి బయోమెట్రిక్ సాంకేతిక పరిజ్ఞానం ఏ మేరకు సమర్థంగా పనిచేస్తుందన్నది సదరు నివేదిక అనుమానం. ఆధార్ ధ్రువీకరణలో ఇబ్బందుల వల్ల పలుమార్లు సేవలు అందడం లేదనేది దాని వాదన. అన్నిటి కన్నా ముఖ్యంగా, ఆధార్ వ్యవస్థ సురక్షితమేనా, అందులోని వ్యక్తిగత సమాచారం గోప్యమేనా అన్నది మూడీ సంధిస్తున్న ప్రశ్న. దేశంలో 120 కోట్లమందికి పైగా బయోమెట్రిక్, జనసంఖ్యా సంబంధ వివరాలను ఈ ఆధార్ బృహత్ యజ్ఞంలో నమోదు చేశారు. ఎవరికి వారికి 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించారు. వేలిముద్రలు, కనుపాపల స్కానింగ్, వన్‌టైమ్ పాస్వర్డ్ లాంటì పద్ధతుల్లో వ్యక్తులు తమ గుర్తింపును నిర్ధారించి, ప్రభుత్వ, ప్రైవేట్ సేవలను అందుకొనే వీలు కల్పించారు. మొదట కొంత తటపటాయింపు ఉన్నా, క్రమంగా ఆధార్ నమోదు, దాని వినియోగం విస్తరించింది. బలహీనవర్గా లకు అందించే ప్రభుత్వ సహాయాలకే కాదు... చివరకు బ్యాంకు ఖాతాల ఆరంభం, మొబైల్ కనెక్షన్, పన్నుల చెల్లింపు సహా అనేక రోజువారీ పనులకు సైతం ఆ నంబర్ తప్పనిసరైంది. దళారుల బాధ లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే సంక్షేమ పథకాల సాయం అందేలా ఆధార్ బాట వేసింది. ఆధార్ వ్యవహారాలన్నీ చూసే కేంద్ర సంస్థగా ‘భారత యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ’ (యూఐడీఎఐ) వ్యవహరిస్తోంది. చిత్రం ఏమిటంటే, సదరు సంస్థకు నాలుగేళ్ళుగా నాధుడు లేడు. ఎట్టకేలకు గత నెలలో ప్రభుత్వం ఓ తాత్కాలిక ఛీఫ్‌ను నియమించింది. ఇలాంటి చర్యలు ఆధార్ నిర్వహణ పట్ల పాలకుల చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అలాగే, ఈ సంస్థపై ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా’ (కాగ్) నిరుడు విడుదల చేసిన నివేదిక సైతం ఆధార్ నమోదు ప్రక్రియలో లోపాలు, తప్పుడు బయోమెట్రిక్ లాంటి అనేక అంశాలను ఎత్తిచూపడం గమనార్హం. ఆధార్‌లో నమోదైన సమాచారపు భద్రత, వ్యక్తిగత గోప్యత గాలికి పోయే ప్రమాదాన్ని హెచ్చరించింది. ఇవాళ్టి మూడీస్ నివేదిక కన్నా చాలా ముందే మన ‘కాగ్’ వ్యక్తం చేసిన ఈ భయాలపై ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నదీ సమాచారం లేదు. కేంద్రంలో గడచిన ‘ఐక్య ప్రగతిశీల కూటమి’ (యూపీఏ) ప్రభుత్వ హయాంలో ఆరంభమైన ప్పటి నుంచి ఆధార్‌పై భిన్న వాదనలు వస్తూనే ఉన్నాయి. ఆధార్‌కు అనేక సానుకూలతలు ఉన్నప్ప టికీ ఈ ప్రక్రియ, వినియోగం నిర్దుష్టమైనదేమీ కాదని సర్కార్ నుంచి సామాన్యుల దాకా అందరికీ తెలుసు. ఇవాళ్టికీ గ్రామీణ భారతావనిలో డిజిటల్ గుర్తింపు చూపలేనివారికి రేషన్ అంద ట్లేదనీ, కొన్ని ఆకలి చావులకు అదీ ఒక కారణమనీ వార్తలొచ్చాయి. ఆధార్ లోపానికీ, ఆ చావులకూ కారణం లేదన్న ఖండనలూ విన్నాం. అయితే, అతిగా టెక్నాలజీపై ఆధారపడి, సాయం పొందా ల్సినవారిని తృణీకరించడం, అసలు లక్ష్యాన్ని విస్మరించడం అమానవీయతే! రోజూ పనిపాటలతో శ్రమించే వారి చేతిరేఖలు చెరిగిపోతే అది వారి పాపమా? కంటిపాపల స్కానింగ్, వన్‌టైమ్ పాస్వర్డ్ లాంటివి కూడా ఉన్నా నెట్ సౌకర్యం లేని సుదూర గ్రామీణ ప్రాంతాల్లో వాటి మీద పూర్తిగా ఆధారపడలేం. అలాగే, అంచెలంచెల సైబర్ భద్రత ఉందని సర్కారు చెబుతున్నప్పటికీ, అనేక సందర్భాల్లో ఆధార్ సమాచారం గంపగుత్తగా లీకవడం చూశాం. ఈ సమాచార నిధి సైబర్ దొంగల చేతిలో పడితే పర్యవసానాలూ తీవ్రమే! అందుకే, లోపాలను ప్రస్తావించినవారిని నిందించే కన్నా, వాటిని సరిదిద్దడంపై దృష్టి పెట్టడం తక్షణ కర్తవ్యం. ముఖ్యంగా ప్రస్తుతం నడుస్తున్న కేంద్రీకృత విధానం బదులు సమాచార గోప్యత, రక్షణ కోసం మూడీస్ సూచించినట్లుగా ఆధార్‌కు వికేంద్రీకరణ విధానాన్ని అవలంబించడం మంచిదేమో చూడాలి. తద్వారా ఒక అంచెలో ఉల్లంఘన జరిగినప్పటికీ, అక్కడితో నష్టనివారణ చేయగలమని గుర్తించాలి. ఇటీవల జీ–20లోనూ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ)లో అద్భుతమంటూ మనం చెప్పుకున్న ఆధార్ వ్యవస్థపై సమగ్ర సమీక్ష జరపాలి. పూర్తి లోపరహితంగా మార్చే పని మొదలుపెట్టాలి. ఓటర్ల జాబితా సహా సమస్తానికీ ఆధారంగా అనుసంధానించాలని అనుకుంటున్న వేళ అది మరింత అవసరం. -
లైక్ కొడితే రూ.50...కామెంట్ పెడితే రూ.100
కూర్చున్నచోటే రోజుకు రూ.వేల సంపాదన మీ సొంతం.. మీరు చేయాల్సిందల్లా మేం పంపే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను ఓపెన్ చేసి వాటిలోని వీడియోలు, ఫొటోలకు లైక్ కొట్టడమే.. అలా లైక్ కొట్టిన స్క్రీన్‌షాట్ మాకు పంపితే ఒక్కో అకౌంట్ స్క్రీన్‌షాట్‌కు రూ.100 చొప్పున మీ ఖాతాలో జమ చేస్తాం... మేం చెప్పిన యూట్యూబ్ వీడియోకు లైక్ కొడితే రూ.50... మేం చెప్పిన సినిమా రివ్యూకు ఐదు పాయింట్లు ఇస్తే.. మీ ఖాతాల్లో రూ.150 వేస్తాం.... ఏంటి ఇదంతా నిజం అనుకుంటున్నారా..? ఇదో సరికొత్త సైబర్ మోసం.. టెలిగ్రామ్ వేదికగా జరుగుతున్న ఈ తరహా మోసాలు ఇప్పుడు పెరిగాయని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. టాస్క్‌బేస్డ్ స్కాం అంటే.. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్తదారులు వెతుకుతూనే ఉన్నారు. టెలిగ్రామ్ యూజర్లను టార్గెట్ చేసుకుని టాస్క్‌బేస్డ్ స్కాంలు చేస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. టెలిగ్రామ్ యూజర్లకు సైబర్ నేరగాళ్లు కొన్ని మెసేజ్‌లు పంపుతూ అందులో పేర్కొన్న టాస్క్పూర్తి చేస్తే డబ్బులు మీ ఖాతాలో వేస్తామని చెప్పే మోసాన్నే టాస్క్‌బేస్డ్ స్కాంగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న టాస్క్‌బేస్డ్ మోసాలు చూస్తే... ఈ ఖాతాలు ఫాలోకండి.. టెలిగ్రామ్ యూజర్లకు పంపే మెసేజ్‌లలో మేం పంపే లింక్ ఓపెన్ చేసి ఈ ఇన్స్టాగ్రామ్ ఖాతా లను ఫాలో అవుతూ, వాటిని ఓపెన్ చేసి స్క్రీన్‌షాట్ తీసి పంపితే డబ్బులు పంపుతామంటారు. రోజుకు 30 నుంచి 50 ఖాతాలు ఫాలో కావాలని చెబుతారు. యూ ట్యూబ్ వీడియోలకు లైక్‌లు..: సైబర్ మోసగాళ్లు పంపే మెసేజ్‌లలో కొన్ని యూట్యూబ్ వీడియోల లింక్‌లు పెడతారు. వాటిని ఓపెన్ చేసి ఆ వీడియోకు కాసేపు వాచ్ చేయడంతోపాటు లైక్ కొడితే మీ ఖాతాలో డబ్బులు వేస్తామని నమ్మబలుకుతారు. హోటళ్లు, రెస్టారెంట్లకు రేటింగ్ పేరిట..: ఫలానా హోటల్, లేదంటే ఒక ఏరియాలోని రెస్టారెంట్లో సదుపాయాలు చాలా బాగున్నాయని, ఫుడ్ ఐటమ్స్ బాగున్నాయని, ఆఫర్లు బాగున్నాయని..ఇలాంటి రివ్యూలు, రేటింగ్ ఇచ్చినందుకు డబ్బులు ఇస్తామని చెబుతుంటారు. సినిమా రివ్యూలకు రేటింగ్.. మేం పంపే లింక్ ఓపెన్ చేసి అందులోని వెబ్సైట్లో ఉన్న సినిమా రివ్యూలకు రేటింగ్ ఇవ్వాలని టాస్క్ ఇస్తారు..ఇలా ఒక్కో రివ్యూకు రేటింగ్ ఇస్తే మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు వేస్తామని టాస్క్ ఇస్తారు. మోసానికి తెరతీస్తారు ఇలా.. ముందుగా ఇచ్చిన టాస్క్పూర్తి చేసిన తర్వాత, మీ బ్యాంకు ఖాతాలోకి డబ్బులు జమ చేస్తామంటూ పేరు, వయస్సు, వృత్తి, వాట్సాప్ నంబర్, ఏ ప్రాంతంలో ఉంటారు..విద్యార్హతలు, బ్యాంకు ఖాతా నంబర్, బ్యాంకు పేరు, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఇలా పూర్తి వివరాలు సేకరిస్తారు. మొదట ఒకటి రెండు సార్లు మన బ్యాంకు ఖాతాలోకి చిన్నచిన్న మొత్తాలు జమ చేసి నమ్మకాన్ని పెంచుతారు. ఆ తర్వాత మన బ్యాంకు ఖాతాలోంచి ఆన్లైన్లో డబ్బులు కొల్లగొట్టే మోసానికి తెరతీస్తారు. మన పూర్తి వివరాలతోపాటు, మన ఫోన్, కంప్యూటర్ను వారి అ«దీనంలోకి తీసుకుని ఓటీపీలను సైతం తెలుసుకుని, మన బ్యాంకు ఖాతాలు లూటీ చేస్తారని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ఇలాంటి మెసేజ్‌లు చూస్తే అనుమానించాల్సిందే.. ఆన్లైన్లో సైబర్ మోసాలు పెరుగుతున్నందున వీలైనంత వరకు అనుమానాస్పద మెసేజ్‌లలోని లింక్‌లపై ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు. అడ్డగోలు లాభాలు ఇస్తామని ఊదరగొడుతున్నారంటే అది కచ్చితంగా సైబర్ మోసమని గ్రహించాలి. వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు అడుగుతున్నట్టు గమనిస్తే జాగ్రత్తపడాలి. అపరిచిత వ్యక్తులు ఆన్లైన్లో మనకు పంపే మెసేజ్‌లను నమ్మవద్దు. -
నాగ్‌పూర్ పోలీస్ శాఖ క్రియేటివ్ యాడ్
నాగ్‌పూర్: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నాగ్‌పూర్ పోలీస్ శాఖ తాజాగా మరో ఆసక్తికరమైన పోస్ట్‌తో ముందుకొచ్చింది. షారుఖ్ ఖాన్ జవాన్ చిత్రాన్ని ఉదాహరణగా చూపిస్తూ సైబర్ నేరగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఈ క్రియేటివ్ పోస్టుకు నెటిజన్ల నుంచి విశేష స్పందన రావడంతో క్షణాల్లో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. దేశవ్యాప్తంగా ఈరోజు విడుదలై కలెక్షన్ల ప్రవాహాన్ని సృష్టించిన షారుఖ్ ఖాన్ 'జవాన్' చిత్రాన్ని ప్రమోషనల్ యాడ్‌గా మార్చి సైబర్ నేరగాళ్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు నాగ్‌పూర్ సిటీ పోలీసులు. జవాన్ చిత్రంలో షారుఖ్ ఖాన్ వివిధ గెటప్‌లను వివిధ రకాల పాస్‌వర్డ్‌లుగా ఉదహరిస్తూ ఒక్కో సోషల్ మీడియా అకౌంట్‌కు ఒక్కో పాస్వర్డ్ పెట్టుకుంటే సైబర్ నేరగాళ్లు ఏమీ చేయలేరని తెలిపింది. ఇంకేముంది ఈ ట్వీట్ అతి తక్కువ వ్యవధిలోనే ఇంటర్నెట్లో స్వైరవిహారం చేయడం మొదలుపెట్టింది. Jab aap aise passwords rakhte ho na, toh koi bhi fraudster tik nahi sakta.#KingKhanPasswords #CyberSafety #NagpurCityPolice pic.twitter.com/lby0zr3ixJ — Nagpur City Police (@NagpurPolice) September 6, 2023 ఇది కూడా చదవండి: అడ్డగుట్ట విషాదం.. నిబంధనలకు విరుద్ధంగా పనులు -
సైబర్ సెక్యూరిటీకి సమిష్టి కృషి అవసరం
న్యూఢిల్లీ: సైబర్ దాడుల ముప్పులను దీటుగా ఎదుర్కొనేందుకు సైబర్‌సెక్యూరిటీ విషయంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. జీ20 సభ్య దేశాలన్నీ కలిసికట్టుగా.. సవాళ్లను అధ్యయనం చేసి, పరిష్కార సాధనాలను కనుగొనడంపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. యూపీఐ, ఓఎన్డీసీ, కోవిన్ వంటి భారీ స్థాయి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఊతంతో టెక్నాలజీ ప్రయోజనాలను సామాన్యులకు కూడా భారత్ అందజేయగలుగుతోందని ఆయన పేర్కొన్నారు. ‘సైబర్‌సెక్యూరిటీ అనేది అందరికీ ఉమ్మడి సవాలే. అది చాలా సంక్లిష్టమైనది దానికి సరిహద్దులేమీ లేవు. టెక్నాలజీ నిత్యం రూపాంతరం చెందుతోంది. ఇవాళ ఒక సమస్యకు పరిష్కారం కనుగొంటే.. రేపు మరో కొత్త సమస్య పుట్టుకొస్తోంది. కృత్రిమ మేథ (ఏఐ)తో సంక్లిష్టత మరిన్ని రెట్లు పెరుగుతుంది‘ అని మంత్రి వివరించారు. ఈ నేపథ్యంలో అందరి ప్రయోజనాల కోసం కొత్త పరిష్కార సాధనాలను రూపొందించడం, పరస్పరం పంచుకోవడం అవసరమని ఆయన చెప్పారు. తాము అభివృద్ధి చేసిన కొన్ని సైబర్‌సెక్యూరిటీ సాధనాలను, వాటిపై ఆసక్తి గల దేశాలతో పంచుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని వైష్ణవ్ తెలిపారు. -
మహేష్ బ్యాంకుకు ఆర్బీఐ భారీ జరిమానా
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏపీ మహేష్ అర్బన్ కోపరేటవ్ బ్యాంకుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) భారీ విధించింది. సైబర్ భద్రతను నిర్లక్ష్యం చేసినందుకు గానూ రూ. 65 లక్షల జరిమానా విధిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది జనవరి 24న మహేష్ బ్యాంక్ సర్వర్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఖాతాదారులకు సంబంధించిన రూ. 12.48 కోట్లను వివిధ ఖాతాలకు నైజీరియన్ ముఠా బదిలీ చేసుకుంది. బ్యాంకు ప్రతినిధుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహేష్ బ్యాంకు యాజమాన్యం సైబర్ భద్రతను పూర్తిగా గాలికొదిలేసినట్లు సైబర్ క్రైం పోలీసులు విచారణలో తేల్చారు. సైబర్ నేరగాళ్లు బ్యాంకు సిబ్బందికి ఫిషింగ్ మెయిళ్లు పంపించి సర్వర్ లోకి చొరబడినట్లు గుర్తించారు. ఇదే విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ వద్ద హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రస్తావించి ఆ బ్యాంకు లైసెన్సును రద్దు చేయాలని సూచించారు. అయితే లైసెన్స్ రద్దు న్యాయపరంగా వీలు కాకపోవడంతో ఆర్బీఐ మహేష్ బ్యాంకుకు భారీ జరిమానా విధించింది. సైబర్ భద్రత లోపాల కారణంగా ఆర్బీఐ జరిమానా విధించడం దేశంలో ఇదే తొలిసారి అని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఇదీ చదవండి: సైబర్ ఇన్సూరెన్స్ గురించి తెలుసా? రూ. కోటి వరకూ కవరేజీ.. -
సైబర్ సేఫ్టీకి 5 S సూత్రం.. పాస్‌వర్డ్‌ల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి!
రోజువారీ జీవితంలో స్మార్ట్ఫోన్లలోనే సగం సమయం గడిచిపోతోంది. సోషల్ మీడియా యాప్స్ వాడకం మొదలు ఆన్లైన్ ఆర్డర్లు, ఆన్లైన్ బ్యాంకు లావాదేవీల వరకు పని ఏదైనా ఫోన్, ఇంటర్నెట్ వినియోగం తప్పనిసరైంది. టెక్నాలజీ వాడకంతో ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో అంతేస్థాయిలో సైబర్ ముప్పు పొంచి ఉంటుంది. అందుకే సైబర్ జమానాలో సేఫ్‌గా ఉండేందుకు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కొన్ని సూచనలు చేసింది. 5ఎస్ సూత్రాన్ని పాటిస్తే సురక్షితంగా ఉండొచ్చని పేర్కొంది. ఏమిటి ఆ 5ఎస్? స్ట్రాంగ్ అండ్ యూనిక్ పాస్వర్డ్, సెక్యూర్ నెట్వర్క్, సెక్యూర్ వెబ్‌సైట్స్ లేదా యాప్స్, సాఫ్ట్వేర్ అప్డేట్స్, సస్పీషియస్ లింక్ అలర్ట్...కలిపి 5 ఎస్‌లుగా పోలీసులు సూత్రీకరించారు. స్ట్రాంగ్ పాస్వర్డ్ మనం సోషల్ మీడియా ఖాతాలకు, ఆన్లైన్ బ్యాంకు ఖాతాలకు, ఈ–మెయిల్స్‌కు వేర్వేరు పాస్వర్డ్లు పెట్టుకోవడం ఉత్తమం. ఒకటే పాస్‌వర్డ్‌ను అన్నింటికీ పెట్టడం రిస్క్ అని గుర్తించాలి. పాస్‌వర్డ్‌లో వీలైనంత వరకు మన పేరు, బర్త్‌డే తేదీలు, పిల్లల పేర్లు లేకుండా చూసుకోవడం ఉత్తమం. పాస్‌వర్డ్‌ను అంకెలు, క్యారెక్టర్లు, పెద్ద, చిన్న అక్షరాల మిళితంగా పెట్టుకోవాలి. పాస్‌వర్డ్‌లను ఇతరులకు షేర్ చేయవద్దు. సెక్యూర్ వెబ్‌సైట్స్, యాప్స్, సెక్యూర్ నెట్వర్క్.. మనం వాడే వెబ్సైట్లు, డౌన్లోడ్ చేసుకొనే యాప్స్ సరైనవేనా అన్నది ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాలి. యాప్‌లను డౌన్లోడ్ చేసే ముందు ఆ యాప్ రేటింగ్ పరిశీలించాలి. సాఫ్ట్వేర్ అప్డేట్స్.. మొబైల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లను ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్‌తో అప్డేట్ చేసుకోవాలి. సాఫ్ట్వేర్ అప్డేట్ వల్ల సైబర్ దాడుల ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. సరైన యాంటీవైరస్ సాఫ్ట్వేర్లను వినియోగించుకోవాలి. సస్పీషియస్ లింక్ అలర్ట్... మనకు మెసేజ్‌లు, వాట్సాప్ సందేశాలు, ఈ–మెయిల్స్ రూపంలో వచ్చే మెసేజ్‌లలోని అనుమానాస్పద లింక్‌లపై ఎట్టిపరిస్థతుల్లోనూ క్లిక్ చేయవద్దు. చాలా తక్కువ అక్షరాలతో ఉండే లింక్‌లు చాలా వరకు అనుమానాస్పదమైనవని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా అక్షర దోషాలు ఉన్న లింక్‌లు సైతం అనుమానాస్పదమైనవని తెలుసుకోవాలి. -
భారత్‌కు మాల్వేర్ ముప్పు.. సైబర్‌సెక్యూరిటీ సంస్థ నివేదికలో కీలక విషయాలు
న్యూఢిల్లీ: మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌కు మాల్‌వేర్‌పరమైన ముప్పులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2022లో ఇవి ఏకంగా 31 శాతం ఎగిశాయి. అలాగే రాన్సమ్వేర్ దాడులు 53 శాతం పెరిగాయి. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సైబర్‌సెక్యూరిటీ సొల్యూషన్స్ సంస్థ సోనిక్‌వాల్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. భారత్ వంటి దేశాల్లో సైబర్ నేరగాళ్లు తమ దాడుల పరిధిని మరింతగా పెంచుకుంటున్నారని, కొత్త టార్గెట్లను ఎంచుకోవడం, కొంగొత్త విధానాలు అమలు చేస్తున్నారని సంస్థ వైస్ ప్రెసిడెంట్ దేబాశీష్ ముఖర్జీ తెలిపారు. వారు అవకాశాల కోసం నిరంతరం అన్వేషిస్తూ, ఒకసారి విజయవంతమైతే మళ్లీ మళ్లీ దాడులు చేసేందుకు ప్రయత్నిస్తుంటారని వివరించారు. ఈ నేపథ్యంలో కంపెనీలకు సైబర్ నేరగాళ్ల వ్యూహాలను ఆకళింపు చేసుకుని, వారి దాడులను ఎదుర్కొనగలిగే నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయంగా సైబర్ సెక్యూరిటీ మార్కెట్ 2022లో 173.5 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. ఇది వార్షికంగా 8.9 శాతం వృద్ధి చెందుతూ 2027 నాటికి 266.2 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగలదని అంచనాలు ఉన్నాయి. సోనిక్‌వాల్ సర్వీసులు అందించే క్లయింట్లలో 55 శాతం పెద్ద సంస్థలు ఉండగా, 45 శాతం చిన్న, మధ్య తరహా సంస్థలు ఉన్నాయి. ఇదీ చదవండి: టెక్నో కామన్ 20 సిరీస్ ఫోన్ల విడుదల.. కెమెరానే ప్రత్యేకం! -
సైబర్ వార్ఫేర్ను ఎదుర్కొనేలా మన ‘పవర్’
సాక్షి, అమరావతి: దేశ విద్యుత్ అవసరాల్లో దాదాపు 40 శాతం పునరుత్పాదక ఇంధనమైన గాలి, నీరు, సౌర విద్యుత్ నుంచే సమకూరుతోంది. మన రాష్ట్రంలో ప్రభుత్వం ఈ స్వచ్ఛ ఇంధనానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులతో పాటు సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు రాష్ట్రం అనుకూలంగా మారింది. ఇటీవల గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో జరిగిన దాదాపు రూ.9.47 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలే దీనికి నిదర్శనం. అయితే, ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ప్రాజెక్టులు సైబర్ దాడులకు గురవుతాయనే హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రెండేళ్ల క్రితం పవర్ గ్రిడ్ పనితీరులో అంతరాలను నిపుణులు గుర్తించారు. దీనికి సైబర్ దాడి కారణం కావచ్చనే అనుమానాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో దిగుమతి చేసుకున్న విద్యుత్ సరఫరా విడి భాగాలపై మంత్రిత్వ శాఖ సైబర్ భద్రతా చర్యలను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీచే సింది. మాల్వేర్, ట్రోజన్లు వంటి ఏదైనా సైబర్ బెదిరింపుల కోసం దిగుమతి చేసుకున్న అన్ని విద్యుత్ సరఫరా విడి భాగాలను నేరస్తులు వాడుకునే అవకాశం ఉండటంతో హానికరమైన ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఉందేమో అనే విషయాన్ని తప్పనిసరిగా తనిఖీ చేయాలని స్పష్టం చేసింది. అలాగే ఆ పరికరాలు భారతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉన్నాయో లేదో తనిఖీ చేస్తామని చెప్పింది. సైబర్ దాడులు దేశ విద్యుత్ సరఫరా వ్యవస్థకు విఘాతం కలిగించడంతో మొత్తం దేశాన్ని నిర్విర్యం చేయగలవని కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన పరీక్షలన్నీ తాము నిర్దేశించిన, ధ్రువీకరించిన ప్రయోగశాలల్లో తప్పనిసరిగా నిర్వహించాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. సీఎస్ఐఆర్ టీమ్ ఏర్పాటు సైబర్ సెక్యూరిటీలో భాగంగా పవర్ ఐలాండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. సెంట్రల్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్ (సీఎస్ఐఆర్టీ)ను కూడా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) ఆధ్వర్యంలో వివిధ ప్రైవేటు సంస్ధల్లో శిక్షణ పొందిన సైబర్ (ఇంటర్నెట్) నిపుణులు ఈ బృందంలో ఉంటారు. మన దేశంలో నార్తరన్, వెస్ట్రన్, సదరన్, ఈస్ట్రన్, నార్త్ ఈస్ట్రన్ అనే ఐదు ప్రాంతీయ పవర్ గ్రిడ్లు ఉన్నాయి. వీటన్నిటినీ ‘వన్ నేషన్.. వన్ గ్రిడ్’ కింద సెంట్రల్ గ్రిడ్‌కు అనుసంధానించారు. ఈ గ్రిడ్‌లన్నిటి కార్యకలాపాలన్నీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పరిధిలో జరుగుతుంటాయి. ఇంత పెద్ద గ్రిడ్‌కు సంబంధించిన సమాచార వ్యవస్థను శత్రువులు చేజిక్కుంచుకుంటే దేశం మొత్తం చీకటైపోతుంది. ఈ నేపథ్యంలో పవర్ గ్రిడ్ వంటి మౌలిక సదుపాయాలపై సైబర్, ఉగ్ర దాడులను ఎదుర్కోవటానికి రాష్ట్రాల్లోని పలు నగరాల్లో పవర్ ఐలాండ్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. గ్రిడ్‌లో ఏదైనా అంతరాయం ఏర్పడితే విద్యుత్ వ్యవస్థను వెంటనే దాని నుంచి వేరు చేయడాన్ని పవర్ ఐలాండింగ్ సిస్టమ్ అంటారు. దీనివల్ల పవర్ గ్రిడ్లు కుప్పకూలకుండా నియంత్రించవచ్చు. ఏపీ ఇంధన శాఖ అనుసరిస్తున్న జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) వల్ల ఏపీ ట్రాన్స్‌కో, డిస్కంల మొత్తం ట్రాన్స్మిషన్, డి్రస్టిబ్యూషన్ నెట్‌వర్క్‌లను జియో ట్యాగింగ్ చేయడం తేలికైంది. దీంతో భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్లో భాగమైన సదరన్ రీజినల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఆర్ఎల్డీసీ), దక్షిణాది రాష్ట్రాల్లో పవర్ గ్రిడ్‌ను పర్యవేక్షించడానికి ఏపీ ట్రాన్స్‌కో జీఐఎస్ మోడల్‌ను తీసుకుంది. విద్యుత్ సంస్థల్లో ఎక్కువ మంది సిబ్బంది విద్యుత్ కార్యకలాపాలను తమ సెల్ఫోన్ల ద్వారానే నియంత్రిస్తున్నారు. వారిని మోసగించి వారి ఫోన్లో హానికర సాఫ్ట్వేర్ పంపి విలువైన సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది. -
మైక్రోసాఫ్ట్ గుడ్ న్యూస్: సైబర్ సెక్యూరిటీలో వారికి ప్రత్యేక శిక్షణ
ప్రపంచంలోనే అతి పెద్దఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ మహిళలకు శుభవార్త అందించింది. లక్షమందికి సైబర్ సెక్యూరిటీ శిక్షణను అందించేందుకు ముందుకొచ్చింది. 2025లో ప్రపంచవ్యాప్తంగా 3.5 మిలియన్ల సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాలు భర్తీ కావచ్చన్న అంచనాల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధానంగా Ready4Cybersecurity ప్రోగ్రామ్, దాని గ్లోబల్ సైబర్‌సెక్యూరిటీ స్కిల్లింగ్ ఇనిషియేటివ్‌లో ఈ శిక్షణను ఇవ్వనుంది. రానున్న ఎనిమిదేళ్లలో సైబర్ సెక్యూరిటీ నిపుణుల డిమాండ్ 350 శాతం పెరగనుంది. దీంతో యువతుల్లో సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాలను పెంచేందుకు ప్రయత్నిస్తోంది మైక్రోసాఫ్ట్. శిక్షణ అనంతరం వారికి సర్టిఫికేట్లను ప్రదానం చేయనుంది. సైబర్ సెక్యూరిటీలో ఉపాధి అవకాశాలను పెంపొందించడం, నైపుణ్య విషయంలో అంతరాల్ని పూరించడం, విభిన్న సైబర్ సెక్యూరిటీ వర్క్‌ఫోర్స్‌ను నిర్మించడమే తమ లక్క్ష్యమని సంస్థ పేర్కొంది. (ఇదీ చదవండి: నెలకు రూ.7లక్షలు స్టైఫెండ్: టెక్ సీఈవోలు, ఐపీఎల్ ఆటగాళ్లను మించి .!) మైక్రోసాఫ్ట్ డిజిటల్ డిఫెన్స్ రిపోర్ట్ ప్రకారం, 2022లో పాస్వర్డ్ ఎటాక్ ఘటనలు ప్రతి సెకనుకు 921కు పెరిగింది. కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే ఇది 74శాతం పెరిగింది. తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్న సైబర్ దాడులనష్టం 4.35 మిలియన్ల డాలర్లుగా ఉంది. మరోవైపు గ్లోబల్‌గా సైబర్ సెక్యూరిటీ వర్క్‌ఫోర్స్‌లో మహిళలు కేవలం 25 శాతం మాత్రమే ఉన్నందున, వీరిని ప్రోత్సహించేందుకు సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. (Vanisha Mittal Amit Bhatia Love Story: వనీషా...అమిత్ లవ్ స్టోరీ తెలుసా? ఈ లవ్ బర్డ్స్ పెళ్లి ఒక రికార్డ్ ) -
‘అజ్ఞాత’ శత్రువు.. దడపుట్టిస్తున్న ‘అనానిమస్ సూడాన్’
ఎలాంటి డిమాండ్లు చేయట్లేదు... ఏ ప్రతిఫలం ఆశించట్లేదు... కేవలం ఉనికి చాటుకోవడానికే దాడులు చేస్తున్నారు! ఏ రోజు, ఎక్కడ, ఎవరిపై దాడి చేసేది ట్విట్టర్ ద్వారా ముందే ప్రకటించి మరీ దెబ్బతీస్తున్నారు!! ప్రభుత్వరంగ, ప్రైవేటు సంస్థలతోపాటు కార్పొరేట్ ఆస్పత్రులే లక్ష్యంగా సైబర్ యుద్ధం చేస్తున్నారు!! గతవారం రోజులుగా దేశవ్యాప్తంగా హడలెత్తిస్తున్న ‘అనానిమస్ సూడాన్’వ్యవహారమిది. ఈ దాడులకు గురైన వాటిలో హైదరాబాద్‌కు చెందిన అనేక సంస్థలు సైతం ఉన్నాయి. సాక్షి, హైదరాబాద్: అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక సైబర్ సెక్యూరిటీ సంస్థ రెడ్‌వేర్ సేకరించిన ఆధారాల ప్రకారం సూడాన్‌కు చెందిన కొందరు హ్యాకర్లు ‘అనానిమస్ సూడాన్’గ్రూప్ నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ముస్లింలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా తాము ఈ–ఎటాక్స్ చేస్తున్నామని ఈ గ్యాంగ్ ప్రచారం చేసుకుంటోంది. కేవలం తమ ఉనికిని చాటుకోవడానికి, యావత్ ప్రపంచానికి సైబర్ సవాల్ విసరడానికే తమ ‘ఆపరేషన్స్’అని చెప్పుకుంటోంది. గత నెల నుంచే ఎటాక్స్ మొదలుపెట్టిన ఈ హ్యాకర్లు... తొలుత ఫ్రాన్స్‌ను టార్గెట్ చేశారు. అక్కడి ఆస్పత్రు లు, యూనివర్సిటీలు, విమానాశ్రయాల వెబ్సైట్లపై విరుచుకుపడ్డారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా సైబర్ రంగంలో వారి పేరు మారుమోగిపోయింది. ట్విట్టర్ ద్వారా ప్రకటించి మరీ... అనానిమస్ సూడాన్ గ్యాంగ్ తాము ఏ దేశాన్ని టార్గెట్ చేస్తున్నామో ముందే ప్రకటిస్తుండటం గమనార్హం. ఈ నెల 6న తమ ట్విట్టర్ ఖాతా హ్యష్‌ట్యాగ్ అనానిమస్ సూడాన్‌లో ‘ఆఫ్టర్ ఫ్రైడే.. ఇండియా విల్ బీ ది నెక్ట్స్ టార్గెట్’(శుక్రవారం తర్వాత భారతదేశమే మా లక్ష్యం) అంటూ ప్రకటించారు. ఆ తర్వాతి రోజే కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం వెబ్‌సైట్‌పై సైబర్ దాడి జరిగింది. అప్పటి నుంచి వరుసబెట్టి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)పాటు ఢిల్లీ, ముంబై, గోవా, హైదరాబాద్‌లలోని విమానాశ్రయాలు, ఆస్పత్రుల వెబ్సైట్లపై ఈ–ఎటాక్స్ జరిగాయి. అయితే ఈ–దాడులు పోలీసు, సైబర్‌క్రైమ్ అధికారుల రికార్డుల్లోకి వెళ్లకపోయినా ఈ బాధిత సంస్థల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నో డిమాండ్స్... కేవలం సవాళ్లే సాధారణంగా సైబర్ ఎటాక్స్ చేసే హ్యాకర్లు అనేక డిమాండ్లు చేస్తారు. వీలైనంత మేర బిట్కాయిన్ల రూపంలో సొమ్ము చేజిక్కించుకోవాలని, డేటా తస్కరించాలని చూస్తుంటారు. సంస్థలు, వ్యవస్థల్ని హడలెత్తిస్తున్న ర్యాన్సమ్వేర్ ఎటాక్స్ తీరుతెన్నులే దీనికి ఉదాహరణ. అయితే అనానిమస్ సూడాన్ ఎటాకర్స్ మాత్రం ఎలాంటి డిమాండ్లు చేయట్లేదు. చివరకు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను ఎటాక్ చేయడానికి సిద్ధమైన ఈ హ్యాకర్లు... కేవలం తమ ఉనికి చాటుకోవడం, సైబర్ ప్రపంచాన్ని సవాల్ చేయడం కోసమే వరుసపెట్టి దాడులు చేస్తున్నారు. కొవిడ్ తర్వాత కాలంలో హాస్పిటల్స్, వాటి రికార్డులు కీలకంగా మారిన నేపథ్యంలో ప్రధానంగా వాటిపైనే అనానిమస్ సూడాన్ హ్యాకర్లు విరుచుకుపడుతున్నారు. డాక్స్ ఎటాక్స్‌తో సర్వర్లు క్రాష్ ఇతర మాల్వేర్స్, హాకర్ల ఎటాక్స్‌కు భిన్నంగా అనానిమస్ సూడాన్ ఎటాక్స్ ఉంటున్నాయి. డీ డాక్స్‌గా పిలిచే డి్రస్టిబ్యూటెడ్ డినైయెల్ ఆఫ్ సర్వీసెస్ విధానంలో వారు దాడి చేస్తుంటారు. ప్రతి సంస్థకు చెందిన వెబ్‌సైట్‌కు దాని సర్వర్‌ను బట్టి సామర్థ్యం ఉంటుంది. ఆ స్థాయి ట్రాఫిక్‌ను మాత్రమే అది తట్టుకోగలుగుతుంది. అంతకు మించిన హిట్స్ వస్తే కుప్పకూలిపోతుంది. పరీక్షల రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆయా బోర్డులకు చెందిన వెబ్సైట్లు మొరాయించడానికి ఇదే కారణం. అనానిమస్ సూడాన్ ఎటాకర్స్ దీన్నే ఆధారంగా చేసుకున్నారు. టార్గెట్ చేసిన వెబ్సైట్లకు ప్రత్యేక ప్రొగ్రామింగ్ ద్వారా ఒకేసారి కొన్ని లక్షల హిట్స్, క్వెర్రీస్ వచ్చేలా చేస్తున్నారు. దీంతో ఆ ట్రాఫిక్‌ను తట్టుకోలేని సర్వర్ ఒక్కసారిగా కుప్పకూలిపోతోంది. ఈ కారణంగా నిజమైన వినియోగదారులు ఆ వెబ్‌సైట్‌ను సాంకేతిక నిపుణులు మళ్లీ సరిచేసే వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ‘హ్యాక్టివిస్ట్ ఇండోనేసియా’తోనూ ముప్పు ప్రపంచవ్యాప్తంగా ‘అనానిమస్ సూడాన్’ఎటాక్స్ ఓవైపు కలకలం సృష్టిస్తుంటే మరోవైపు ‘హ్యాక్టివిస్ట్ ఇండోనేసియా అనే హాకర్ల గ్రూప్ సైతం దేశంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల వెబ్సైట్లను టార్గెట్ చేసినట్లు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) తాజాగా ప్రకటించింది. ఐ4సీ పరిధిలోని సైబర్ థ్రెట్ ఇంటెలిజెన్స్ వింగ్ హాకర్ల కుట్రను బయటపెట్టింది. డినైయెల్ ఆఫ్ సర్వీస్ (డీఓఎస్), డిస్ట్రిబ్యూటెడ్ డినైయెల్ ఆఫ్ సర్వీసెస్ (డీ–డాక్స్) విధానాల్లో ఈ హ్యాకర్లు ఆయా వెబ్‌సైట్స్ సర్వర్లు కుప్పకూలేలా చేయనున్నారని అప్రమత్తం చేసింది. దాదాపు 12 వేల వెబ్సైట్లు వారి టార్గెట్ లిస్టులో ఉన్నట్లు అంచనా వేసింది. గతేడాది ఢిల్లీ ఎయిమ్స్ జరిగిన సైబర్ దాడి ఈ తరహాకు చెందినదే అని, దేశంలోనే అతిపెద్ద సైబర్ ఎటాక్‌గా ఈ గ్రూప్ మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు సైబర్ దాడులు, హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల వెబ్సైట్లను సైబర్ దాడుల నుంచి ఎలా కాపాడుకోవాలో కీలక సూచనలు చేసింది. ఉమ్మడిగా పని చేస్తే కట్టడి అనానిమస్ సూడాన్ ఎటాక్స్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటి వల్ల నష్టం తగ్గించడానికి పోలీసులతోపాటు సైబర్ నిపుణులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలసి పనిచేయాల్సి ఉంటుంది. హ్యాకర్ల టార్గెట్‌లో ఉన్న సంస్థలను అప్రమత్తం చేయడం, అవసరమైన స్థాయిలో ఫైర్ వాల్స్ అభివృద్ధి చేయడం వంటి చర్యలు తీసుకోవాలి. ఈ ప్రపంచంలో ఏ ఒక్క వ్యవస్థకూ పూర్తిస్థాయిలో సైబర్ భద్రత ఉండదు. అయితే కొత్త సవాళ్లకు తగ్గట్లు ఎప్పటికప్పుడు మార్పుచేర్పులు చేసుకోవాలి. – రాజేంద్రకుమార్, సైబర్ నిపుణుడు -
అప్పనంగా డేటా ఇచ్చేస్తున్నాం!
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుత సాంకేతికత యుగంలో మన పేరు, ఫోన్ నంబర్, ఇంటి చిరునామా, పాన్, ఆధార్, ఈ–మెయిల్ అడ్రస్, పాస్వర్డ్లు కేవలం సమాచారం మాత్రమే కావు. మన జీవితాలను నిర్దేశించే అంశాలు. ఇవి సైబర్ నేరగాళ్ల చేతికి వెళితే బ్యాంకు ఖాతాలో ఉన్న మన కష్టార్జితం క్షణాల్లో హాంఫట్ అవ్వొచ్చు. మన పేరిట లోన్లు తీసుకొని ఎగ్గొట్టొచ్చు. కోట్ల మంది డేటాను కొల్లగొట్టిన ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు ఇటీవలే రట్టు చేశారు. మన డేటా లీక్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపైనా ఉందని, వ్యక్తిగత సమాచారం ఎక్కడ ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వకూడదో తప్పనిసరిగా అవగాహన ఏర్పరుచుకోవాలని సైబర్ భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. రియల్ ఎస్టేట్ అమ్మకాలని, క్రెడిట్ కార్డులని, ఇన్స్టంట్ లోన్లని, మార్కెట్లోకి కొత్త ప్రొడక్ట్స్ వచ్చాయని, కొత్త రెస్టారెంట్లు, షాపింగ్స్ మాల్స్ ప్రారంభోత్సవాలకు విచ్చేయాలంటూ దాదాపు నిత్యం మనకు అపరిచితుల నుంచి ఫోన్‌కాల్స్ రావడం పరిపాటిగా మారింది. అయితే వారందరికీ మన పేర్లు, ఫోన్ నంబర్లు, ఇంటి అడ్రస్‌లు, ఈ–మెయిల్స్ ఎలా తెలుస్తున్నాయి. మన వివరాలు మరెవరో కాదు... అప్పనంగా మనమే ఇచ్చేస్తున్నాం! తప్పక డిలీట్ చేయించాలి.. వివిధ అవసరాలు, ప్రభుత్వ పథకాల నిమిత్తం ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, పాస్‌బుక్ మొదటి పేజీ, వివిధ సర్టిఫికెట్ల వంటి వాటిని ఫొటోకాపీ తీయించుకోవడం అనివార్యమవుతోంది. అయితే అలాంటప్పుడు మనం వాట్సాప్ లేదా ఈ–మెయిల్ ద్వారా పంపిన వివరాలను ప్రింట్ అవుట్ తీసుకున్న తర్వాత ఆ జిరాక్స్ సెంటర్ లేదా నెట్ సెంటర్ నుంచి డిలీట్ చేయించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. కేస్ – 01 ‘గుడ్‌మార్నింగ్ సార్. యాదాద్రి దగ్గరలో కొత్త వెంచర్ ప్రారంభం కాబోతోంది. తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభాలు. మీ సొంత ప్రాంతానికి వెళ్లే దారిలోనే వెంచర్ ఉంది. తీసుకోండి...’ అంటూ టెలికాలర్ ఫోన్ చేసి తన పేరు, పూర్తి చిరునామా చెప్పడంతో ఓ ప్రభుత్వ ఉద్యోగి అవాక్కయ్యాడు. కేస్ – 02 ‘సార్.. మీరు వాడుతున్న ఫ్యూరిఫయర్తో పోలిస్తే మా ప్రొడక్ట్ అన్ని విధాలా ఉత్తమ మైనది. మీరు సరే అంటే మా ఏజెంట్‌ను మీ ఇంటికి డెమోకు పంపుతాం. మీ చిరునామా ఇదే కదా..’ అంటూ తన ఇంటి అడ్రస్‌ను ఓ ఉత్పత్తుల సంస్థ ఉద్యోగి ఫోన్లో చెబుతుంటే ఓ ప్రైవేటు ఉద్యోగి నోరెళ్లబెట్టాడు. లాటరీలు, కూపన్ల పేరుతో డేటా సేకరణ... మనం షాపింగ్ మాల్స్‌కు వెళ్లినప్పుడు లాటరీల కోసమనో లేదా గిఫ్ట్ కూపన్లు ఇచ్చేందుకనో మన వ్యక్తిగత వివరాలు అడుగుతున్నారు. అలా అడిగిందే తడవుగా రివార్డు పాయింట్ల కోసం, డిస్కౌంట్ల కోసం, గిఫ్ట్ కూపన్ల కోసం ఆశపడి మన వ్యక్తిగత వివరాలు ఇతరులకు ఇచ్చేస్తున్నాం. ఇలా పోగేసిన డేటాను కొందరు కేటుగాళ్లు కన్సల్టెన్సీలకు 5 పైసలకు ఒక కాంటాక్ట్ చొప్పున అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఆయా కన్సల్టె న్సీలు కొన్ని వేల రూపాయల ఖర్చుతోనే కోట్ల మంది సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఈ తరహా సంస్థల నుంచి సైబర్ నేరస్తులు గంపగుత్తగా డేటాను కొని ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. అలాగే సోషల్ మీడియా ఖాతాల్లో ఉండే వ్యక్తిగత వివరాలను కొన్ని ఆన్లైన్ సంస్థలు డేటా ఎనలిటిక్స్ టెక్నిక్‌లతో సేకరించి వివిధ కంపెనీలకు వాణిజ్య ప్రకటనలు ఇచ్చేందుకు అమ్ముకుంటున్నాయి. డేటా ప్రైవసీలో యూరోపియన్ చట్టాలు ఎంతో కఠినం.. యురోపియన్ దేశాల్లో వ్యక్తిగత సమాచారం. వివరాలకు, వ్యక్తి గత గోప్యతకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మన వివరాలను అను మతి లేకుండా ఎవరు తీసుకున్నా... వినియోగించినా వెంటనే వారిపై జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ చట్టం కింద భారీ జరిమానాలతోపాటు జైలుశిక్షలు విధించే అవకాశం ఉంది. ఆ తరహా చట్టాలు మన దేశంలోనూ వస్తేనే వ్యక్తిగత వివరాల గోప్యతకు రక్షణ ఉంటుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. వీలైనంత వరకు ఇవ్వొద్దు... వీలైనంత వరకు మీ ఫోన్ నంబర్, చిరునామా, ఈ–మెయిల్ ఐడీ, ఆధార్, పాన్ వంటి వివరాలను ఇతరులకు ఇవ్వొద్దు. ఇలా ఇవ్వడం వల్ల మన డేటాను ఆధారంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే ప్రమాదం ఉంటుందని గ్రహించాలి. – పాటిబండ్ల ప్రసాద్, సైబర్ సెక్యూరిటీ నిపుణుడు, ఢిల్లీ -
సైబర్ దాడులను తట్టుకునే సామర్థ్యం మనకుందా?
జైపూర్: ఒకవైపు సైబర్ దాడులు అంతకంతకూ పెరిగిపోతుంటే.. మరోవైపు ఆ దాడుల నుంచి రక్షించుకునే సామర్థ్యాలు దేశంలో చాలా కంపెనీలకు లేవన్న విషయాన్ని సైబర్ సెక్యూరిటీపై సిస్కో నిర్వహించిన సర్వేలో తెలిసింది. అధునాతన సైబర్ దాడులను తట్టుకునే సామర్థ్యాలు కేవలం 24 శాతం కంపెనీలకే ఉన్నట్టు సిస్కో ప్రకటించింది. ఇదీ చదవండి: స్టార్‌బక్స్ సీఈవోగా నరసింహన్.. బాధ్యతలు చేపట్టిన ప్రవాస భారతీయుడు వచ్చే మూడేళ్లలో భారత్‌లో ఐదు లక్షల మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులకు శిక్షణ ఇవ్వాలన్నది తన లక్ష్యంగా పేర్కొంది. వచ్చే 12–24 నెలల్లో తమ వ్యాపారాలకు విఘాతం కలిగించే సైబర్ దాడులు జరగొచ్చని భావిస్తున్నట్టు సిస్కో సర్వేలో 90 శాతం మంది చెప్పారు. అంతర్జాతీయంగా సైబర్ సెక్యూరిటీ సన్నద్ధత సగటున కేవలం 15 శాతంగానే ఉందని, ఈ విధంగా చూస్తే భారత్ మెరుగ్గా ఉన్నట్టు సిస్కో తెలిపింది. భారత్‌లోని 38 శాతం కంపెనీలు ఆరంభ, ఏర్పాటు స్థాయిలో ఉన్నవేనని పేర్కొంది. స్వతంత్ర థర్డ్ పార్టీతో సిస్కో ఈ సర్వే చేయించింది. 27 మార్కెట్ల నుంచి 6,700 మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులు సర్వేలో పాల్గొన్నారు. సైబర్ దాడులను ఎదుర్కొనేందుకు ఎలాంటి సొల్యూషన్లను కంపెనీలు ఏర్పాటు చేశాయి, అమలు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇదీ చదవండి: గోపీనాథన్‌ను వదులుకోలేకపోతున్న టీసీఎస్.. కీలక బాధ్యతలపై చర్చలు! చిన్న కంపెనీలకు ముప్పు అధికం.. ఇందులో ఆరంభ, స్టార్టప్, పురోగతి, పూర్తి స్థాయి కంపెనీలు అని సిస్కో సర్వే వర్గీకరించింది. ఆరంభ దశలోని కంపెనీలు సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్లను ఏర్పాటు చేసే దశలో ఉన్నాయి. వీటికి 10 కంటే తక్కువే స్కోర్ లభించింది. ఏర్పాటు దశలోని కంపెనీలు సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్లను అమలు చేసే దశలో ఉన్నాయి. వీటికి స్కోర్ 11–44 మధ్య ఉంది. సైబర్ భద్రతా సన్నద్ధత విషయంలో ఇవి సగటు కంటే తక్కువ పనితీరు చూపిన్నట్టు సర్వే నివేదిక తెలిపింది. పురోగతి దశలోని కంపెనీలు సైబర్ భద్రతా సన్నద్ధత పరంగా సగటు కంటే ఎక్కువ పనితీరు చూపిస్తున్నాయి. ఇక పూర్తి స్థాయికి చేరిన కంపెనీలు సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్లలో చాలా ముందంజలో ఉండడమే కాకుండా, రిస్క్‌లను ఎదుర్కొనే సామర్థ్యాలతో ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో తాము సైబర్ దాడిని ఎదుర్కొన్నామని, వీటి కారణంగా తమకు రూ.4–5 కోట్ల స్థాయిలో నష్టం ఎదురైనట్టు 53 శాతం మంది సర్వేలో చెప్పారు. ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.. ‘‘సైబర్ సెక్యూరిటీకి వ్యాపార సంస్థలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే అవి తమ డిజిటైజేషన్ ప్రయాణాన్ని కొనసాగించగలవు. హైబ్రిడ్ పని విధానం ప్రముఖంగా మారడం, సేవలు అప్లికేషన్ ఆధారితం కావడంతో.. సైబర్ భద్రతా సన్నద్ధత పరంగా ఉన్న అంతరాలను తగ్గించుకోవడం కంపెనీలకు కీలకం’’ అని సిస్కో ఇండియా సెక్యూరిటీ బిజినెస్ గ్రూప్ డైరెక్టర్ సమీర్ మిశ్రా తెలిపారు. ఇదీ చదవండి: గేమింగ్ హబ్‌గా భారత్.. భారీ ఆదాయం, ఉపాధి కల్పన -
భారత్‌లో సైబర్ భద్రత, గోప్యత బలహీనం
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ ఆవిష్కరణలు, వాటిని ఉపయోగించుకోవడంలో భారత్ ఎంతో మెరుగైన స్థానంలో ఉన్నట్టు ఐసీఆర్ఐఈఆర్ విడుదల చేసిన భారత డిజిటల్ ఎకనామీ నివేదిక తెలిపింది. కానీ, సైబర్ భ్రదత, గోప్యత విషయంలో భారత్ ఇంకా ఎంతో మెరుగుపడాల్సి ఉన్నట్టు పేర్కొంది. ప్రత్యేకంగా సైబర్ భద్రత చట్టం లేకపోవడం వల్ల, భారతీయులు ఆయా రంగాల నిబంధనలపైనే ఆధారపడాల్సి వస్తోందని పేర్కొంది. అసాధారణ స్థాయిలో డిజిటల్ పరివర్తన చూపిస్తున్న భారత్‌లో, సైబర్ భద్రత బలహీనంగా ఉన్నట్టు అభిప్రాయడింది. భారత్‌లో ఆవిష్కరణలు, డిజిటల్ సేవల సామర్థ్యాలను వినియోగించుకునే తీరుపై ఈ నివేదిక దృష్టి పెట్టింది. ఇంటరెŠన్ట్‌ను ఉపయోగించుకుని, వృద్ధి చెందడం, ఉపాధి కల్పన, పరిపానాల మెరుగుదల అంశాలు ఏ విధంగా ఉన్నాయన్నది విశ్లేషించింది. ‘‘జీ20లోని తోటి దేశాలతో పోలిస్తే తక్కువ మధ్యాదాయం కలిగిన దేశం భారత్. కానీ, ఆవిష్కరణల్లో మాత్రం భారత్ ఎంతో ఉన్నత స్థానంలో ఉంది. భారతీయులు త్వరితగతిన డిజిటల్ సేవలను వినియోగించుకోవడం తదుపరి వృద్ధిని వేగవంతం చేస్తుంది’’అని ఈ నివేదిక వివరించింది. సైబర్ నేరాలు, గోప్యతపై దాడి ఈ రెండు అంశాలపై భారత్ అత్యవసరంగా దృష్టి సారించాల్సి ఉందని సూచించింది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు ద్వారా ఈ అంశాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం పనిచేస్తున్నట్టు తెలిపింది. సైబర్ దాడుల నుంచి డిజిటల్ ఆర్థిక వ్యవస్థను రక్షించుకునేందుకు భారత్ ఎంతో చేయాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది. భారత్‌లో డిజిటైజేషన్ పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ.. సైబర్ భద్రత కవచాలు ఏర్పాటు చేసుకోవడంలో మోస్తరు పురోగతినే చూపించినట్టు స్పష్టం చేసింది. -
వచ్చేస్తున్నారు.. సైబర్ కమాండోలు
సాక్షి, హైదరాబాద్: పోలీసు కమాండోలు అంటే మనకు తెలిసిందే. ప్రత్యేక ఆపరేషన్ల కోసం శిక్షణ పొంది రెప్పపాటులో శత్రు శ్రేణులపై దాడి చేస్తారు. అదే తరహాలో ఇప్పుడు రాష్ట్రంలో సైబర్ కమాండోలు రంగంలోకి దిగనున్నారు. రోజుకో సవాల్ విసురుతున్న సైబర్ నేరస్తుల ఆటకట్టించేందుకు ఇప్పటికే శిక్షణ పొందారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో ఇటీవల రాష్ట్రం ప్రభుత్వం ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మూడు డివిజన్లు, 14 విభాగాలుగా ఏర్పాటైన ఈ బ్యూరో మరో రెండు నెలల్లో కార్యకలాపాలు కొనసాగించేందుకు సిద్ధమైంది. కమిషనరేట్‌లో ఠాణా, జిల్లాలో సైబర్ సెల్స్.. రాష్ట్రంలో సైబర్ నేరాలను నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలు, విధివిధానాలపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. సైబర్ నేరాలను కూకటివేళ్లతో సహా పెకిలించేలా క్షేత్రస్థాయి నుంచే సైబర్ నేరాలను నివారించేందుకు ఈ బ్యూరో పనిచేయనుంది. ఈ బ్యూరోలో ప్రధానంగా మూడు డివిజన్లు, 14 విభాగాలుంటాయి. ప్రధాన కార్యాలయం సైబరా బాద్ కమిషనరేట్‌లో ఉంటుంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లు సహా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట, రామగుండం కమిషనరేట్లలో ప్రత్యేకంగా సైబర్ పోలీసుస్టేషన్ ఉంటుంది. మిగిలిన జిల్లాలలో సైబర్ కో–ఆర్డినేట్ సెల్స్ ఉంటాయి. స్థానిక పోలీసుల సహకారంతో సైబర్ నేరాల నివారణకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు విధులు నిర్వర్తిస్తారు. అధికారులకు విధుల కేటాయింపు.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు 454 మంది అధికారులను కేటాయించింది. ఆయా పోలీసులు హ్యాకింగ్, ఫిషింగ్, సైబర్ భద్రతపై శిక్షణ పూర్తి చేసుకొని సైబర్ కమాండోలుగా సిద్ధమయ్యారు. 140 మంది వారియర్లు సైబరాబాద్ కమిషనరేట్‌లోని ప్రధాన కార్యాల యంలో, మిగిలిన 314 మంది ఇతర కమిషనరేట్లు, జిల్లా కేంద్రాల్లో విధులు నిర్వర్తించనున్నారు. సైబర్ సెక్యూరిటీబ్యూరో ప్రధాన విధులివే.. ►సైబర్ నేరాలకు పాల్పడేవారిని గుర్తించడం, ఆయా రాష్ట్రాల సహకారంతో పట్టుకోవడం ►బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, టెలికం ఆపరేటర్ల నోడల్ ఏజెన్సీలతో ఎప్పటి కప్పుడు సంప్రదింపులు జరుపుతూ నేర గాళ్లు కొల్లగొట్టిన డబ్బును స్తంభింప జేయడం. ►నకిలీ బ్యాంకు ఖాతాలు, తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఉన్న ఫోన్ నంబర్లను గుర్తించి నియంత్రించడం. ►పలుమార్లు నేరాలకు పాల్పడే అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ నిందితులను గుర్తించి పీడీ యాక్ట్‌లు నమోదు చేయడం. అంతర్రాష్ట్ర నిందితుల ఆటకట్టు రాజస్తాన్, బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాలు సైబర్‌నేరాలకు అడ్డాలుగా మారాయి. కొన్ని సందర్భాల్లో అంతర్రాష్ట్ర నేరస్తు లను పట్టుకొనేందుకు వెళ్లిన రాష్ట్ర పోలీసులకు అక్కడి పోలీసులు సహకరించకపోవడం, నేరస్తు లు పోలీసులపై కాల్పులు, దాడులు జరపడం కూడా జరిగాయి. ఈ తరహా ఆటంకాలకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో పరిష్కారమార్గాలను కను గొంది. ఇతర రాష్ట్రాల పోలీసు విభాగాలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) వంటి సంస్థల సమన్వయంతో ఈ బ్యూరో పనిచేయనుంది.