సాక్షి, హైదరాబాద్: అండర్ గ్రాడ్యుయేషన్‌లో కొత్తగా సైబర్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ కోర్సును ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కసరత్తు వేగవంతం చేసింది. 2023–24 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ప్రకటించిన టీఎస్‌సీహెచ్‌ఈ... ఆ కోర్సు పాఠ్యాంశం, విధానాలు తదితరాల ఖరారు కోసం డీజీపీ కార్యాలయం, ఉస్మా ని యా, జేఎన్‌టీయూ, నల్సార్ యూనివర్సిటీల తో పాటు ఐఐటీ హైదరాబాద్‌లను ప్రతి పాది స్తూ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా గురువారం టీఎస్‌సీ హెచ్‌ఈ కార్యాలయంలో ప్రత్యేక కమిటీ ప్రతినిధులతో సమావేశం జరిగింది. సైబర్ సెక్యూరిటీ అండ్ సైన్స్ కోర్సు విధివిధానాలపై చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment