సైబర్‌ నేరాలకు అమాయకులే మోసపోతున్నారు | SHIELD Cybersecurity Conclave 2025 Closing Ceremony on Wednesda | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరాలకు అమాయకులే మోసపోతున్నారు

Published Thu, Feb 20 2025 4:56 AM | Last Updated on Thu, Feb 20 2025 4:56 AM

SHIELD Cybersecurity Conclave 2025 Closing Ceremony on Wednesda

తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో దేశంలోనే అగ్రగామిగా ఉంది 

14 రాష్ట్రాల నుంచి వెయ్యి మంది ప్రతినిధులు హాజరయ్యారు

షీల్డ్‌ 2025 విజయవంతమైంది 

డీజీపీ జితేందర్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ‘ఇటీవల మా స్నేహితుడి నంబరు హ్యాక్‌ అయ్యింది. రూ.లక్ష కావాలని ఇప్పుడే అడుగుతున్నారు. ఆ వ్యక్తికి సుమారు రూ.వెయ్యి లక్షలు ఉంటాయి. రూ.లక్ష అడగడం ఏంటని అనుమానం వచ్చింది. చెక్‌ చేస్తే సైబర్‌ నేరగాళ్ల పనిగా తేలింది’అని డీజీపీ జితేందర్‌ పేర్కొన్నారు. తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో, సైబరాబాద్‌ పోలీస్, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సంయుక్తంగా నిర్వహించిన షీల్డ్‌ సైబర్‌ సెక్యూరిటీ కాన్‌క్లేవ్‌ 2025 ముగింపు సమావేశం బుధవారం జరిగింది. 

ఈ సందర్భంగా జితేందర్‌ మాట్లా డుతూ.. ‘ప్రతిరోజూ రాష్త్రంలో వందల సంఖ్యలో, దేశంలో వేల సంఖ్యలో సైబర్‌ క్రైమ్‌ ఫిర్యాదులు వస్తున్నాయి. చాలామంది అమాయక ప్రజలు మోసపోతున్నారు. ఇది చాలా క్లిష్టమైన సమయం. ప్రజల భద్రత మా డ్యూటీ. సైబర్‌ నేరగాళ్లు డిజిటల్‌ మీడియాలో కొత్త ఆవిష్కరణలతో వచ్చి ప్రజలను మోసం చేస్తున్నారు. మేము కూడా అదే స్థాయిలో బాధ్యత కలిగి ఉండాలి. 

తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో దేశంలో అగ్రగామిగా ఉంది. సైబర్‌ సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేశాం. ప్రతినిత్యం కొత్త పద్ధతుల్లో ఆలోచించాలి. కచ్చితంగా దీనిపై పరిశోధనలు కొనసాగిస్తాం. అత్యాధునిక సాంకేతిక పద్ధతులు, అధునాతన ఫోరెన్సిక్‌ నైపు ణ్యాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తున్నాం. సమ ర్థవంతమైన, సురక్షితమైన డిజిటల్‌ వాతావర ణాన్ని సృష్టించడం దీని ముఖ్య ఉద్దేశం’అని పేర్కొన్నారు. 

షీల్డ్‌ 2025 నిర్వహించిన ప్రధాన ఉద్దేశం విజయవంతమైందని చెప్పారు. అంతకు ముందు టీజీసీఎస్‌బీ డైరెక్టర్‌ శిఖాగోయల్‌ మాట్లా డుతూ గడిచిన రెండు రోజులుగా నడుస్తున్న సమా వేశాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇచ్చిపు చ్చుకోవడం, ఒకరికి ఒకరు సహకరించుకోవడం, కార్యాచరణకు ఒక బలమైన వేదికగా నిలిచిందన్నా రు. దీనికోసం మేం రెండు నెలలు కష్టపడ్డామని, విజయవంతంగా ముగించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.

ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్‌ మాట్లాడుతూ దశాబ్దకాలం క్రితం ప్రధాని డిజిటల్‌ ఇండియా ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. భౌతికయుద్ధాలు ఉండవని, రక్తం చిందించకుండా సైబర్‌ దాడులే ఉంటాయన్నారు. ప్రస్తుతం రాష్ట్ర పోలీసులు అద్భుతమైన ఖ్యాతిని గడించారంటూ సైబర్‌ సెక్యూరిటీ బృందాన్ని అభినందించారు. అంతకు ముందు పలుఅంశాలపై బృంద చర్చలు జరి గాయి. 

ఏఐ పనితీరుపై వర్క్‌షాప్‌ నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లు సందర్శకులను ఆక ట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సైబరాబాద్‌ సీపీ అవినాశ్‌ మహంతి, పోలీసు అధికారులు జోయెల్‌ డేవిడ్, హర్షవర్ధన్, దేవేందర్‌సింగ్‌  పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement