jitender
-
ములుగు ఎన్కౌంటర్.. పౌరహక్కుల సంఘం ఆరోపణలను ఖండించిన డీజీపీ
సాక్షి, హైదరాబాద్: ములుగు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో పౌరహక్కుల సంఘం ఆరోపణలను తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి ఖండించారు. ఎదురుకాల్పుల్లో విష ప్రయోగం చేశారనేది తప్పుడు ప్రచారం అంటూ కొట్టిపారేశారు.ములుగు జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల ఘటనపై తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ.. ‘ఎదురుకాల్పుల్లో విష ప్రయోగం చేశారనేది దుష్ప్రచారం. పౌరహక్కుల సంఘం ఆరోపణలను ఖండిస్తున్నాను. ఎదురుకాల్పులకు కొద్ది రోజుల ముందు ఇన్ఫార్మర్ అనే నెపంతో ఇద్దరు ఆదివాసీలను దారుణంగా హత్య చేశారు. ఇలాంటి ఘటనలను అడ్డుకొనేందుకు పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులకు దిగారు.మావోయిస్టులు అత్యాధునిక ఆయుధాలు వినియోగించారు. పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో సాయుధులైన ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. శవపరీక్షలు.. హైకోర్టు, ఎన్హెచ్ఆర్సీ సూచనల మేరకే జరుగుతున్నాయి. విచారణ అధికారిగా ఇతర జిల్లా డిఎస్పీని నియమించాము. దర్యాప్తు కొనసాగుతోంది అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. ఆదివారం తెల్లవారుజామున ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఓ మహిళా మావో సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నర్సంపేట-ఇల్లందు ఏరియా కమిటీ కార్యదర్శి కుర్సం మంగు అలియాస్ భద్రు, ఏటూరునాగారం-మహాదేవ్‌పూర్ డివిజన్ కమిటీ కార్యదర్శి ఈగోలపు మల్లయ్య అలియాస్ మధు సైతం ఉన్నారు. మధు స్వస్థలం పెద్దపల్లి జిల్లా రాణాపూర్ కాగా, మిగతా ఆరుగురు ఛత్తీస్‌గఢ్ జిల్లాకు చెందినవారు. ఉదయం 6.16 గంటల ప్రాంతంలో చెల్పాక-ఐలాపూర్ అభయారణ్యంలోని పోలకమ్మవాగు సమీపంలో మావోయిస్టులకు, బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. దాదాపు అరగంటకుపైగా కాల్పులు జరిగినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ఆ తర్వాత సంఘటనా స్థలంలో ఏడుగురి మృతదేహాలను గుర్తించారు. ఘటనాస్థలిలో రెండు ఏకే-47 తుపాకులు, 303 రైఫిల్, ఇన్సాస్ తుపాకీ, ఎస్బీబీఎల్ గన్, సింగిల్‌షాట్ తుపాకీ, తపంచా, కిట్‌బ్యాగులు, విప్లవ సాహిత్యం తదితర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
రాజకీయ ప్రేరేపిత హింసే సరికొత్త సవాల్
సాక్షి, హైదరాబాద్/ఖిలా వరంగల్: రాష్ట్రంలో ఇటీవలి కాలంలో రాజకీయ ప్రేరేపిత హింస పోలీసులకు సరికొత్త సవాల్‌గా మారిందని డీజీపీ జితేందర్ అన్నారు. సైబర్ నేరాలు, మత్తుపదార్థాల అక్రమ రవాణాతోపాటు రాజకీయ ప్రేరేపిత హింసను కూడా సమర్థంగా ఎదుర్కొనేందుకు పోలీస్ సిబ్బంది సర్వదా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. 2024 బ్యాచ్ సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్), ఐటీ అండ్ కమ్యూనికేషన్, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ (పీటీఓ) విభాగాలకు చెందిన 8,047 మంది కానిస్టేబుల్ కేడెట్లు 9 నెలల శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని మొత్తం 19 శిక్షణ కేంద్రాల్లో గురువారం పాసింగ్ అవుట్ పరేడ్లు నిర్వహించారు. హైదరాబాద్‌లోని రాజా బహదూర్ వెంకటరామి రెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో 1,211 మంది మహిళా కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి డీజీపీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్‌తో కలిసి కానిస్టేబుళ్ల గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన కేడెట్లకు ట్రోఫీలు, మెమొంటోలు అందించారు. అనంతరం కానిస్టేబుళ్లను ఉద్దేశించి ప్రసంగించారు. మహిళా పోలీసులు పెరగటం శుభ పరిణామం రాష్ట్ర పోలీస్‌శాఖలో మహిళా సిబ్బంది సంఖ్య పెరగడం శుభ పరిణామం అని డీజీపీ జితేందర్ అన్నారు. 2024 బ్యాచ్‌లో మొత్తం 2,338 మంది మహిళా పోలీసులు ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారని గుర్తుచేశారు. ఉన్నత విద్యావంతులు కానిస్టేబుల్స్‌గా చేరినందున పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో మరింత నమ్మకం పెంచేలా పనిచేయాలని సూచించారు. వృత్తిగత జీవితంలోనూ కొత్త అంశాలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని కోరారు. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన యువకులను ఉత్తమ అధికారులుగా తీర్చిదిద్దడంలో తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, ఇతర సిబ్బంది కృషి అభినందనీయమని ప్రశంసించారు. ఉత్తమ శిక్షణ, వసతుల కల్పనకుగాను తెలంగాణ పోలీస్ అకాడమీకి ఎనర్జీ, ఫుడ్ సేఫ్టీ, హెల్త్ సహా ఐదు అంశాల్లో ఐఎస్ఓ సరి్టఫికెట్లు దక్కడంపై డీజీపీ సంతోషం వ్యక్తం చేశారు. కొత్త కానిస్టేబుళ్లతో ప్రమాణం చేయించిన తర్వాత అభిలాష బిస్త్ మాట్లాడుతూ సవాళ్లను అధిగమించి కొత్త సిబ్బందికి అత్యుత్తమ శిక్షణ ఇచ్చామని తెలిపారు. పరేడ్ కమాండర్‌గా ఏఆర్ కానిస్టేబుల్ ఉప్పునూతల సౌమ్య వ్యవహరించారు. కండ్లకోయలోని పోలీసు శిక్షణ కళాశాలలో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఇంటలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి పాల్గొన్నారు.నా తల్లిదండ్రుల ఆశయం నెరవేర్చా మాది హైదరాబాద్. మా నాన్న కారు డ్రైవర్. మా అమ్మానాన్నలకు ముగ్గురం కుమార్తెలమే. మేం పోలీసులం కావాలని మా తల్లిదండ్రుల ఆశయం. వారి కష్టాన్ని చూసి కష్టపడి చదువుకున్నాం. మొదటి ప్రయత్నంలోనే ఒకే కుటుంబం నుంచి ఇద్దరం కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాం. – హరిణి సురేష్, రోషిణి సురేష్ రాణీ రుద్రమ స్ఫూర్తితో ముందుకు సాగండి: మంత్రి సీతక్క ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలంటే పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. వరంగల్ మామునూరు పోలీస్ శిక్షణ కళాశాలలో శిక్షణ పూర్తిచేసుకొన్న 1,127 మంది కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్‌లో గురువారం ఆమె పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మహిళా కానిస్టేబుళ్లు రాణీ రుద్రమదేవి స్ఫూర్తితో అంకితభావంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య తదితరులు పాల్గొన్నారు. -
డ్రగ్స్ సరఫరాపై కఠినంగా వ్యవహరించండి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా ముఠా లపై కఠినంగా వ్యవహరించాలని డీజీపీ డాక్టర్ జితేందర్ స్పష్టం చేశారు. డీజీపీ కార్యాలయంలో గురువారం యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధి కారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఇన్ చార్జి సందీప్ శాండిల్యతోపాటు పలువురు పోలీ సు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ....రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మకాల ను నియంత్రిస్తూ కేసులు పెడుతున్నప్పటికీ సరఫ రా విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశా లు జారీ చేశారు.రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూ రో పకడ్బందీగా వ్యవహరించి డ్రగ్స్ సరఫరాపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు విభాగం నుంచి సిబ్బందిని అదనంగా బ్యూరోకి కేటాయిస్తామని తెలిపారు. విదేశీయులెవరైనా డ్రగ్ వ్యవహారాల్లో తల దూర్చితే వారిని తిరిగి వారి దేశాలకు పంపించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతల అదనపు డీజీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ...నిందితులను పట్టుకోవడంతోపాటు వారికి శిక్ష పడేలా సాక్ష్యాధారాలను కోర్టులకు సమర్పించాలని సూచించారు. అదనపు సిబ్బందిని కేటాయించడం పట్ల సందీప్ శాండిల్య సంతోషం వ్యక్తం చేశారు.నూతన నేర చట్టాలను పకడ్బందీగాఅమలు చేసేందుకు చర్యలు తీసు కో వాలని డీజీపీ జితేందర్ సూచించారు. క్షేత్రస్థాయి లో నూతన నేర చట్టాల అమలుకు తీసుకోవలసిన చర్యలపై గురువారం డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో డీజీపీ పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమీక్షలో సీఐడీ డీజీ శిఖాగోయెల్, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, శాంతిభద్రతల అడిషనల్ డీజీ మహేశ్‌భగవత్ ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రెడ్ కార్నర్ నోటీస్ జారీ సులువు కాదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు రెడ్‌కార్నర్ నోటీసు జారీ ప్రక్రియ సీబీఐ వద్ద ప్రాసెస్‌లో ఉందని డీజీపీ జితేందర్ చెప్పారు. రెడ్ కార్నర్ నోటీసు జారీకి సమయం పట్టొచ్చన్నారు. ‘రెడ్ కార్నర్ నోటీస్ జారీ అనేది చాలా పెద్ద ప్రాసెస్. అందులో అంతర్జాతీయ మార్గదర్శకాలు, ఇంటర్‌పోల్ గైడ్‌లైన్స్ పాటించాలి. దేశాల మధ్య ఒప్పందాలనూ పరిశీలించాలి. ఇలా ఎన్నో స్థాయిల్లో ప్రొటోకాల్స్ పాటించాల్సి ఉంటుంది. స్థానికంగా ఒక పోలీస్‌స్టేషన్ నుంచి నోటీసులు ఇచ్చినట్టుగా రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేయలేం. ఈ ప్రక్రియకు సమయం పడుతుంది’అని జితేందర్ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును హైదరాబాద్ సీపీ, వెస్ట్‌జోన్ డీసీపీల పర్యవేక్షణలో స్పెషల్ టీం దర్యాప్తు చేస్తోందని, కేసు కోర్టు పరిధిలో ఉన్నందున తాను ఇంతకుమించి మాట్లాడలేనన్నారు. ఇటీవల గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులపై జితేందర్ మంగళవారం డీజీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. డీజేల వాడకాన్ని తగ్గిస్తున్నాం..: ‘ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కదలికలు ఇంకా ఉన్నాయి. తెలంగాణలో మావోయి స్టుల ప్రభావం లేదు. పోలీసుల పట్టు కొనసాగుతోంది. తమ ఉనికి చాటుకునేందుకు కొన్నిసార్లు తెలంగాణ ప్రాంతంలోకి వచి్చనా.. పోలీసు బలగాలు గట్టిగా తిప్పికొడుతున్నాయి. రాష్ట్రంలో ఉగ్ర కదలికలపై పూర్తిస్థాయిలో నిఘా కొనసాగుతోంది’అని డీజీపీ చెప్పారు. జైనూర్‌లో ఇటీవల ఓ గిరిజన మహిళపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత దురదృష్టకరమని, తదనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలకు బాధ్యులైన 38 మందిపై కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పండుగలు, ఉత్సవాల్లో డీజేల ను వాడొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని, వీలైనంత వరకు డీజేల వాడకాన్ని తగ్గిస్తూ వస్తున్నామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎమ్మెల్యే అరికెపూడి గాందీ.. కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడిన ఘటనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నామన్నారు. సివిల్ తగాదాల్లో ఉన్నట్టుగా చిక్కడపల్లి ఏసీపీపై వచి్చన ఆరోపణలపై హైదరాబాద్ సీపీ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ నవరాత్రులు, నిమజ్జనాలు, మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను విజయవంతంగా పూర్తి చేసినట్టు పేర్కొన్నారు. ఈ సమావేశంలో శాంతిభద్రతల అడిషనల్ డీజీ మహేశ్ భగవత్, ఐజీలు రమేశ్, సత్యనారాయణ, చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
గణేశ్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు డీజీపీ జితేందర్ తెలిపారు. నిమజ్జన ఏర్పాట్లపై సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 35వేల మంది పోలీస్ సిబ్బందిని నిమజ్జన బందోబస్తు విధులకు వినియోగిస్తున్నట్టు పేర్కొన్నారు. హైదరాబాద్ పరిధిలోనే 25వేల మంది విధుల్లో ఉంటారని తెలిపా రు. నిమజ్జనాన్ని పర్యవేక్షించేందుకు లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయంలో, బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇతర ప్రభుత్వ విభాగాల సమన్వయంతో .. నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో ముగిసేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. -
ప్రభుత్వాన్నిఇబ్బంది పెట్టే కుట్రలు
సాక్షి, హైదరాబాద్: అధికారం కోల్పోయామనే అక్కసుతో కొందరు శాంతిభద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేందుకు రకరకాల కుట్రలకు తెరలేపుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేలా ఎవరు ప్రవర్తించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని డీజీపీ జితేందర్‌ని ఆదేశించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. -
‘మత్తు’ చిత్తుకు ద్విముఖ వ్యూహం
సాక్షి, హైదరాబాద్: యువత భవిష్యత్తును చిత్తు చేసే ‘మత్తు’మహమ్మారి కట్టడికి ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. ఒకవైపు డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాల ముఠాల సప్లై చైన్ కట్టడి మరోవైపు మత్తు పదార్థాల వైపు యువత వెళ్లకుండా అవగాహన పెంచే వ్యూహంతో పనిచేస్తున్నామన్నారు. మత్తుదందాలో ఎంతటివారున్నా చట్టప్రకారం కఠిన చర్య లు తప్పవని హెచ్చరించారు.అదేవిధంగా పౌరుల కష్టార్జితాన్ని దోచుకొనే సైబర్ ముఠాలను సమర్థంగా ఎదుర్కొంటున్నామని.. గత ఆరు నెలల్లోనే రూ. 150 కోట్లను బాధితులకు రీఫండ్ చేయించగలిగామని చెప్పారు. శాంతిభద్రతల విషయంలో రాజీ లేదని, మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టామ న్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే పోలీసు సిబ్బందికి క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రాష్ట్ర ఐదో డీజీపీగా జూలై 10న బాధ్యతలు స్వీకరించిన జితేందర్ శనివారంతో పదవీబాధ్యతలు చేపట్టి నెల రోజులు పూర్తవుతున్న సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన విజన్‌ను ఆవిష్కరించారు. ప్రశ్న: పోలీస్ బాస్‌గా మీ నెల రోజుల పనితీరు ఎంతమేర సంతృప్తినిచి్చంది? జవాబు: డీజీపీగా ఈ నెల రోజుల పనితీరు ఎంతో సంతృప్తినిచి్చంది. అసెంబ్లీ సమావేశాలు సజావుగా పూర్తి చేశాం. భారీ నేరాలేవీ జరగకుండా కట్టడి చేశాం. పోలీస్ కమిష నర్లు, జిల్లా ఎస్పీలతో ఓ రోజంతా సమావేశమై రాష్ట్రంలో పోలీసింగ్ తీరుతెన్నులు, దృష్టిపెట్టాల్సిన అంశాలు, మత్తుపదార్థాల రవాణా, సైబర్ నేరాల కట్టడికి తీసుకోవాల్సిన చర్య లపై స్పష్టత ఇవ్వగలిగాం. దీనివల్ల క్షేత్రస్థాయిలో ఫలితాలు మెరుగయ్యాయి. ప్రజలకు అత్యవసర సేవలందించే డయల్ 100 సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టా. డయల్ 100 రెస్పాన్స్ టైం గతంలో కంటే సరాసరిన 5నిమిషాలు తగ్గింది. ప్రశ్న: మీ ప్రధాన ఫోకస్ ఏ అంశాలపై ఉండనుంది? జవాబు: శాంతిభద్రతల పరిరక్షణతోపాటు ప్రజలను ఆర్థికంగా గుల్ల చేస్తున్న సైబర్ నేరాల కట్టడిపై, యువతను పెడదోవ పట్టించే డ్రగ్స్, గంజాయి వంటి మత్తు ముఠాల అణచివేతపై ప్రధానంగా దృష్టి పెడుతున్నా. అదే సమయంలో మహిళలు, చిన్నారుల భద్రతలో రాజీ ఉండదు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారెవరైనా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవు. ప్రశ్న: రాష్ట్రవ్యాప్తంగా హత్యలు, అత్యాచారాలకు అడ్డుకట్ట వేసేందుకు మీరు తీసుకుంటున్న చర్యలేమిటి? జవాబు: రాష్ట్రంలో గతంతో పోలిస్తే నేరాల సంఖ్యలో చెప్పదగ్గ స్థాయిలో పెరగలేదు. హత్యలు, అత్యాచారాలు పెరిగాయని కొన్ని రకాల దు్రష్పచారాలు జరుగుతున్నాయి. ఈ విషయాలపై గణాంకాలతో సహా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం అసెంబ్లీలో ఇటీవలే స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణలో ఎంతో కఠినంగా ఉన్నాం. విజుబుల్ పోలీసింగ్‌ను పెంచాం. ప్రశ్న: డ్రగ్స్ కేసుల్లో శిక్షలు అంతంతమాత్రమేనన్న విమర్శలపై ఏమంటారు? జవాబు: కొన్ని సాంకేతిక కారణాలతో గతంలో ఎన్డీపీఎస్ చట్టాల కింద కేసుల్లో శిక్షలు తక్కువగానే ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టీజీ యాంటీనార్కోటిక్స్ బ్యూరోతో కలిసి దాదాపు 18 వేల మందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. పక్కాగా కేసుల నమోదు, దర్యాప్తుతో శిక్షలు పెరిగాయి. ఈ నెల రోజుల్లో నాలుగు ఎన్డీపీఎస్ కేసుల్లో శిక్షలు పడ్డాయి. ఇందులో రెండు కేసుల్లో దోషులకు పదేళ్ల చొప్పున జైలు శిక్ష ఖరారైంది. కొందరు విదేశీయులు అక్రమంగా ఇక్కడే ఉంటూ ఇక్కడ డ్రగ్స్ దందాలో దిగుతున్నారు. అలాంటి వారిపై దృష్టిపెట్టాం. డ్రగ్స్ కేసుల్లో దొరికిన వారిని స్వదేశాలకు పంపుతున్నాం. గత నెల రోజుల్లో ముగ్గురు విదేశీయులను వెనక్కి పంపాం. ప్రశ్న: దొంగతనం కేసులో ఇటీవల ఓ దళిత మహిళను పోలీసులు కొట్టడం వంటి ఘటనల్లో ఏం చర్యలు తీసుకుంటున్నారు? జవాబు: చట్టాన్ని అతిక్రమిస్తే పోలీసు సిబ్బందిపైనా కఠినంగానే ఉంటాం. ఇందులో ఏ మినహాయింపు ఉండదు. క్రమశిక్షణ చర్యలు ఎదుర్కోవాల్సిందే. శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో సిబ్బందిని ఎప్పటికప్పుడు సెన్సిటైజ్ చేస్తూనే ఉంటాం. ప్రశ్న: మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్న ఘటనల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలేంటి? జవాబు: కేవలం మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడంతోనే మార్పు రాదు. దీనిపై తల్లిదండ్రులు సైతం ఆలోచించాలి. తమ పిల్లలే ప్రమాదాల బారిన పడతారన్న విషయాన్ని వారు గుర్తిస్తేనే దీనికి సరైన పరిష్కారం దొరుకుతుంది. రోడ్డు ప్రమాదాల నియ ంత్రణకు అన్ని ప్రభుత్వ విభాగాల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నాం. ప్రశ్న: అతిపెద్ద ముప్పుగా మారిన సైబర్ నేరాలను ఎలా ఎదుర్కొంటున్నారు? జవాబు: సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేకంగా బ్యూరో ఏర్పాటు చేసిన ఏకైన రాష్ట్రం తెలంగాణ. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సైబర్ నేర ముఠాలకు అడ్డుకట్ట వేస్తున్నాం. గత ఆరు నెలల్లో సైబర్ బాధితులకు రూ. 150 కోట్లు రీఫండ్ చేయించడం గొప్ప ఏచీవ్మెంట్. ఒకవైపు సైబర్ కేసుల సత్వర దర్యాప్తు మరోవైపు మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నాం. ప్రశ్న: డ్రగ్స్, గంజాయిని ఎంత మేర కట్టడి చేశామనుకుంటున్నారు? జవాబు: మత్తు పదార్థాలపై ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. పూర్తిస్వేచ్ఛ ఉండటంతో డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలోకి గంజాయి రవాణా కాకుండా అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో మొబైల్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో తనిఖీలు పెంచాం. ఫలితంగా పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడుతోంది. గతానికి భిన్నంగా పబ్బులు, క్లబ్బుల్లోనూ జాగిలాలతో తనిఖీలు చేస్తున్నాం. కేసుల నమోదు పెరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ మాదిరిగానే గంజాయి కట్టడికి గంజాయి తాగిన వాళ్లను గుర్తించే కిట్లను హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ వంటి కమిషనరేట్లతోపాటు అన్ని జిల్లాలకు పంపాం.సైబర్ నేరాల కట్టడిలో యువత ముందుండాలిసైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్‌లో డీజీపీ జితేందర్సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాల కట్టడిలో యువత ముందుండాలని డీజీపీ జితేందర్ పిలుపునిచ్చారు. కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా, యువత వారి ఆలోచన విధానాన్ని విస్తృతపర్చుకోవాలన్నారు. సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతోకలిసి టీజీ సైబర్ సెక్యూరిటీ ‘ది గ్రేట్ యాప్‌సెక్ హ్యాకథాన్ 2024’ నిర్వహిస్తోంది. శుక్రవారం బంజారా హిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన ఈ హ్యాకథాన్ ప్రారంభ కార్యక్రమానికి డీజీపీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వ్యక్తిగత గోప్యత, సామాజిక భద్రత విషయంలో సైబర్ భద్రత అత్యంత ప్రధానంగా మారిందని డీజీపీ అభిప్రాయపడ్డారు. ⇒ టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ మాట్లాడుతూ ౖఈ హ్యాకథాన్‌లో 20కి పైగా దేశాల నుంచి 10 వేల మంది పాల్గొంటున్నారని చెప్పారు. ఈనెల 22న ఈ హ్యాకథాన్ ఫలితాలు వెల్లడిస్తామని, తెలంగాణలో మొదటి ఐదుగురు, జాతీయస్థాయిలో తొలి ఐదుగురు, అంత ర్జాతీయ స్థాయిలో తొలి ఐదుగురిని విజేతలుగా ప్రకటిస్తామ న్నారు. వీరికి తెలంగాణ సైబర్‌సెక్యూరిటీ బ్యూరోతో కలిసి పనిచేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. ⇒ ఐటీ ఎలక్ట్రానిక్స్ విభాగం డిప్యూటీ సెక్రెటరీ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ గతేడాది సైబర్ క్రైమ్ కారణంగా రూ. 7,500 కోట్లు కోల్పోగా, ఆ సొమ్మును టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కాపాడారని చెప్పారు. దీనికి సంబంధించి రీఫండ్ ఆర్డర్లను బాధితులకు ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ చేతులమీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో సెబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీలు దేవేందర్‌సింగ్, హర్షవర్ధన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌కు అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటాంబంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తాజా పరిణామాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు డీజీపీ జితేందర్ స్పందించారు. హైదరాబాద్‌లో ఉంటున్న బంగ్లా దేశీ యులపై నిఘా ఉంచామన్నారు. హైదరాబాద్‌కు అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల ప్రకారమే నడుచుకుంటామన్నారు. -
స్నేహమే నన్ను ఈ స్థాయిలో నిలిపింది
సాక్షి, హైదరాబాద్: మంచి స్నేహితుల సాన్నిహిత్యం దొరికితే జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఛేదించవచ్చని.. జీవితాన్ని ఉత్తమంగా ఆస్వాదించవచ్చని చెప్పారు డీజీపీ జితేందర్. తాను ఈ స్థాయికి ఎదగడంలో తన స్నేహితుల సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగపడ్డాయని గుర్తు చేసుకున్నారాయన. 36 ఏళ్ల తమ స్నేహ జీవితంలో ఎన్నో సందర్భాలు చూశామని, ఆ మధురస్మృతులను స్నేహితుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్నారు డీజీపీ జితేందర్... ఆ విషయాలు ఆయన మాటల్లోనే... ‘‘నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు. ఒకరు ప్రస్తుతం జార్ఖండ్‌లో ఐఏఎస్‌గా పనిచేస్తున్న డా.ఏపీ సింగ్, మరొకరు కేంద్ర ప్రభుత్వ సైంటిస్ట్‌గా పనిచేస్తున్న డా.రాజీవ్ వర్‡్షనై. మేం ముగ్గురం ఢిల్లీ జేఎన్‌యూలో స్కూల్ లైఫ్ సైన్స్‌లో ఎంఫిల్ చేశాం. ఐదేళ్లపాటు ఒకే దగ్గర కలిసి ఉన్నాం.. మా జీవితాలను మలుపు తిప్పింది ఆ ఐదేళ్లే. యూపీఎస్సీకి బీజం పడింది అక్కడే.. నేను ఈ రోజు డీజీపీగా ఉన్నానంటే అందుకు ఆ స్నేహమే కారణం. నేను ఐపీఎస్, ఏపీ సింగ్ ఐఏఎస్, రాజీవ్ సైంటిస్ట్‌లుగా కెరీర్ మలచుకున్నాం. 36 ఏళ్లుగా మా స్నేహం కొనసాగుతూనే ఉంది.. నా ప్రతి కష్టంలో, సంతోషంలో ప్రాణ మిత్రులిద్దరూ నాతో ఉన్నారు. మేం ఎప్పుడు కలిసినా కుటుంబాలతో సహా కలుస్తాం. ప్రతి రెండు, మూడేళ్లకు ఒకసారి తప్పకుండా మా ఫ్యామిలీస్ గెట్ టు గెదర్ ఉంటుంది. స్నేహం గురించి చెప్పాలంటే ఏదో ఆశించి చేసే స్నేహం ఎప్పటికీ నిలవదు. ఫ్రెండ్షిప్ అనేది ఒక ఎమోషనల్ ఫీలింగ్..ఒక సెక్యూరిటీ..మంచి స్నేహితులున్న వారు జీవితంలో ఉన్నతంగా ఉంటారు. ఉత్తమ జీవితం గడుపుతారు. అందుకు నేను ఉదాహరణ. ప్రతి ఒక్కరి జీవితంలో బెస్ట్ ఫ్రెండ్ చాలా ముఖ్యం. మంచి స్నేహితుడు ఉంటే ఏ ఒత్తిడీ మన దరి చేర దు. అందుకే యువతకు నేను చెప్పేది ఒక్కటే. మంచి స్నేహితులను సంపాదించుకోండి.. జీవితాన్ని ఫలవంతంగా..ఆనందంగా గడపండి’’అని డీజీపీ జితేందర్ తెలిపారు. -
మర్యాదతో మన్నన పొందండి
సాక్షి, హైదరాబాద్: పోలీస్స్టేషన్లలో ప్రజలు ఇచ్చే ఫిర్యాదుల ఆధారంగా వెంటనే కేసులు నమోదు చేయాలని, ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని డీజీపీ జితేందర్ పోలీస్ ఉన్నతాధికారులకు సూచించారు. పోలీసు కమిషనర్లు, ఎస్పీలు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లలో ఆకస్మిక తని ఖీల చేయాలని, తాను సైతం త్వరలోనే జిల్లాల వారీగా తనిఖీలు చేపడతానని వెల్ల డించారు. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిష నర్లతో డీజీపీ జితేందర్ పోలీస్ కేంద్ర కార్యా లయంలో సమావేశమయ్యారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రాష్ట్రంలోని అన్నియూనిట్ల ఉన్నతాధికారు లతో నిర్వ హించిన ఈ సమీక్షలో జితేందర్ పలు కీలక సూచనలు ఇచ్చారు. ప్రజావాణి దరఖాస్తుల్లోని ప్రజాసమస్యల పరిష్కారా నికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టాల్సిన అవ సరాన్ని నొక్కిచెప్పిన డీజీపీ, అవసరమైతే ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహించా లని ప్రతిపాదించారు. ఆయుధాల లైసెన్స్‌ల జారీపై జాగ్రత్త వహించాలని స్పష్టం చేశారు. సమావేశంలో శాంతి భద్రతల అడిషన ల్ డీజీ మహేశ్‌భగవత్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, అదనపు డీజీలు శిఖా గోయెల్, అభిలాష బిస్త్, వీవీ శ్రీనివాస్ రావు, విజయ్ కుమార్, స్టీఫెన్ రవీంద్ర, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి, రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్‌బాబుతో పాటు జోనల్ ఐజీలు, జిల్లా ఎస్పీలు పాల్గొన్నారు. -
అనూహ్యంగా తెరపైకి జితేందర్
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి రాష్ట్ర డీజీపీ మార్పుపై కసరత్తులు జరుగుతున్నాయి. తెరపైకి కొందరు సీనియర్ అధికారుల పేర్లు వచ్చినా అవకాశం మాత్రం అనూహ్యంగా డాక్టర్ జితేందర్‌కు దక్కింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చివరిలో డీజీపీగా కొనసాగిన సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనీకుమార్ గతేడాది డిసెంబర్ 4న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న క్రమంలోనే నాటి పీసీసీ చీఫ్ ఎ.రేవంత్‌రెడ్డిని ఇంటికి వెళ్లి కలిసి అభినందించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం అంజనీకుమార్‌ను సస్పెండ్ చేసింది. ఆయన స్థానంలో రవి గుప్తాను నియమిస్తూ మరసటి రోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఏసీబీలో కీలకంగా మారిన ఆనంద్... రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ ఏడాది జనవరి నుంచి దఫదఫాలుగా పోలీసు బదిలీలు జరిగినా రవి గుప్తాను మాత్రం కొనసాగించారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో కొత్త అధికారిని డీజీపీగా నియమించడానికి కసరత్తులు ప్రారంభం అయ్యాయి. రాష్ట్రానికి సంబంధించి డీజీపీ హోదాలో ఉన్న అధికారుల సీనియారిటీ జాబితాలో తొలి పేరు 1990 బ్యాచ్‌కు చెందిన రవి గుప్తాదే. ఈ తర్వాతి స్థానంలో 1991 బ్యాచ్‌కు చెందిన రాజీవ్‌రతన్ ఉండగా... ఇటీవల ఆయన కన్ను మూయడంతో అదే బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్ ఆ స్థానంలోకి వచ్చారు. ఈ పరిణామంతో 1992 బ్యాచ్‌కు చెందిన జితేందర్ సీనియారిటీ జాబితాలో నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి వచ్చారు. రవి గుప్తా తర్వాత సీనియర్ అయిన సీవీ ఆనంద్ ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్నారు. ఏసీబీ దర్యాప్తు చేస్తున్న గొర్రెల స్కామ్ సహా అనేక కేసులు కీలక దశలో ఉన్నాయి. ఈ విభాగానికి డైరెక్టర్‌గా పని చేసిన ఏఆర్ శ్రీనివాస్ సైతం గత నెల ఆఖరున పదవీ విరమణ చేశారు. దీంతో ఏసీబీలో ఆనంద్ కీలకం కావడంతో అన్ని అర్హతలు ఉన్నప్పటికీ.. ఆయనకు ఈసారి డీజీపీగా అవకాశం దక్కలేదు. ఇక అనుభవం, సమర్థతతో పాటు వివాదరహితుడు, మృదుస్వభావి కావడంతోనే జితేందర్‌ను డీజీపీ పోస్టు వరించింది. పదోన్నతులు పూర్తి కాకపోవడంతోనే... ప్రస్తుతం నిఘా విభాగాధిపతిగా ఉన్న 1994 బ్యాచ్‌కు చెందిన బి.శివధర్‌రెడ్డి పేరు కూడా డీజీపీ రేసులో వినిపించిది. అయితే ఆయన ప్రస్తుతం అదనపు డీజీ హోదాలో ఉన్నారు. డీజీపీ హోదాలో ఉన్న రాజీవ్‌రతన్ కన్ను మూయడం, సందీప్ శాండిల్య పదవీ విరమణ చేయడం రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. అదనపు డీజీల సీనియారిటీ జాబితాలో ముందున్న కొత్తకోట శ్రీనివాసరెడ్డితో (హైదరాబాద్ పోలీసు కమిషనర్) పాటు శివధర్రెడ్డికీ డీజీలుగా పదోన్నతి రావాల్సి ఉంది. అయితే ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో లైన్ క్లియర్ కాలేదు.పూర్తి స్థాయి డీజీపీని నియమించాలంటే... రాజకీయ కారణాల నేపథ్యంలో కొన్నేళ్లుగా రాష్ట్ర పోలీసు విభాగానికి ఇన్చార్జ్ లేదా ఫుల్ అడిíÙనల్ చార్జ్ (ఎఫ్ఏసీ) డీజీపీలే నేతృత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం పూర్తి స్థాయి డీజీపీగా నియమించాలంటే సీరియారిటీ ఆధారంగా ఐదుగురు ఐపీఎస్ అధికారుల జాబితాను కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. సీనియారిటీ, గతంలో పని చేసిన స్థానాలు, అనుభవం, సెంట్రల్ డెప్యుటేషన్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకునే కేంద్రం వీటిలో మూడు పేర్లను వెనక్కు పంపుతుంది. ఆ ముగ్గురి నుంచి ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా నియమించుకోవాల్సి ఉంటుంది. శ్రీనివాసరెడ్డి, శివధర్‌రెడ్డి పదోన్నతుల తర్వాత కేంద్రానికి సీనియారిటీ జాబితా పంపితే అందులో వీరితో పాటు రవి గుప్త, సీవీ ఆనంద్, జితేందర్‌ల పేర్లు ఉంటాయి. వీటిలో ఏ మూడు పేర్లు వెనక్కు వస్తాయి? వారిలో ఎవరిని డీజీపీగా నియమిస్తారు? లేదా గతంలో మాదిరిగా జితేందర్ పదవీ విరమణ చేసే వరకు, ఆ తర్వాత కూడా ఎఫ్ఏసీ డీజీపీతోనే నడిపిస్తారా? అనేవి మిలియన్ డాలర్ల ప్రశ్నలు. -
Telangana: తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ జితేందర్ నియామకం
-
తెలంగాణకు కొత్త బాస్
-
ఎన్ఎస్యూఐ విద్యార్థులతో రాహుల్ ములాఖత్‌కు అనుమతించండి
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: చంచల్‌గూడ జైల్లో ఉన్న ఎన్ఎస్యూఐ విద్యార్థి నేతలను కలిసేందుకు తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి అనుమతివ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, జైళ్ల శాఖ డీజీ జితేందర్‌ను కోరారు. ఈ మేరకు ఆయన గురువారం కాంగ్రెస్ నేతల బృందంతో జితేందర్‌ను కలసి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ములాఖత్‌పై విజ్ఞప్తిని పరిశీలించి తమ నిర్ణయం వెల్లడిస్తామని డీజీ తెలిపినట్టు చెప్పారు. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై అధికార పార్టీ ఒత్తిడి తీసుకువస్తోందని, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ చంచల్‌గూడ జైల్లో ఉన్న విద్యార్థి నేతలను కలిసేందుకు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని రేవంత్ ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ పర్యటన విషయంలో కూడా టీఆర్ఎస్ కుట్రలు చేసిందని ధ్వజమెత్తారు. కనీసం శనివారం విద్యార్థి నేతలను జైల్లో పరామర్శించాలన్నా ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. తాము ఇప్పటికే జైలు సూపరింటెండెంట్‌కు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నామని, అ యితే ఉన్నతాధికారులను కలసి విజ్ఞప్తి చేయాలని ఆయన సూచించడంతో డీజీ జితేందర్‌ను కలసినట్టు వెల్లడించారు. జైళ్ల శాఖ డీజీని కలసిన వారిలో కాంగ్రెస్ నేతలు మధుయాష్కీ, జగ్గారెడ్డి, గీతారెడ్డి, సంపత్, మానవతారాయ్ ఉన్నారు. ఎంత అడ్డుకుంటే అంత ప్రతిఘటిస్తాం.. టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్‌ను అడ్డుకునేందుకు చూస్తోందని, కానీ ఎంత అడ్డుకుంటే అంతకన్నా ఎక్కువ బలంగా ఎదుర్కొంటామని రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం ఓయూ జేఏసీ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌తో పాటు మరో ఏడుగురు ప్రగతిభవన్ ముట్టడికి రాగా వారిని పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారిని పరామర్శిం చేందుకు రేవంత్‌రెడ్డి తదితరులు ఠాణాకు వచ్చారు. వైట్ చాలెంజ్‌కు రాహుల్ సిద్ధమా? రాష్ట్ర పర్యటనకు వస్తున్న రాహుల్ గాంధీ ‘వైట్ చాలెంజ్’కు సిద్ధమా అంటూ హైదరాబాద్‌లోని గన్‌పార్క్, ట్యాంక్‌బండ్ సహా పలు చోట్ల ఫ్లెక్సీ లు, పోస్టర్లు వెలిశాయి. రాష్ట్రంలో డ్రగ్స్ రాకెట్ బయటపడ్డ సమయంలో మంత్రి కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి ‘వైట్ చాలెంజ్’విసిరిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల నేపాల్‌లోని ఓ క్లబ్లో రాహుల్‌గాంధీ కనిపించడంతో.. ఆయన ఫొటోలతో ‘వైట్ చాలెంజ్’కు సిద్ధమా అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఆ ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేసిన పలువురు టీఆర్ఎస్ నేతలు ‘వైట్ చాలెంజ్‌కు సిద్ధమా?’అంటూ రాహుల్‌ను ప్రశ్నిస్తున్నారు. -
హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్?
సాక్షి, హైదరాబాద్: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఐపీఎస్ అధికారుల బదిలీలకు త్వరలో మోక్షం కలగనుంది. అదనపు డీజీపీల నుంచి ఎస్పీ ర్యాంకు అధికారుల వరకు భారీ స్థాయిలో బదిలీలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కీలక విభాగాలు మొదలుకొని 80 శాతం జిల్లాల ఎస్పీలు, కమిషనరేట్లలో ఉన్న డీసీపీలను బదిలీ చేసేందుకు ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు రూపొందించినట్టు తెలుస్తోంది. తెలంగాణ పోలీస్ శాఖకు ఆయువుపట్టు లాంటి హైదరాబాద్ కమిషనరేట్‌కూ కొత్త బాస్‌ను నియమించేందుకు కసరత్తు జరిగినట్టు తెలిసింది. అంజనీకుమార్ స్థానంలో ఇటీవల కేంద్ర డిప్యుటేషన్ పూర్తిచేసుకున్న అదనపు డీజీపీ సీవీ ఆనంద్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అదేవిధంగా మరో అదనపు డీజీపీ జితేందర్ పేరూ ప్రతిపాదనలో ఉన్నట్లు తెలిసింది. ఇకపోతే రాచ కొండ కమిషనరేట్‌కూ కొత్త చీఫ్‌ని నియమించనున్నారు. మహేష్ భగవత్ స్థానంలో ఐజీ నాగిరెడ్డి లేదా ఐజీ డీఎస్ చౌహాన్ ఉండనున్నట్టు సమాచారం. దర్యాప్తు విభాగాలకు కొత్త బాస్‌లు రాష్ట్రంలో ఉన్న రెండు దర్యాప్తు విభాగాలకు నూతన బాస్‌లను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేసింది. అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు డైరెక్టర్ జనరల్‌గా అదనపు డీజీపీ జితేందర్ లేదా అంజనీకుమార్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. అదేవిధంగా నేర పరిశోధన విభాగానికి (సీఐడీ) చీఫ్‌గా మహేష్ భగవత్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. విజిలెన్స్‌తోపాటు అవినీతి నియంత్రణనూ ఒకే విభాగం కిందకి తేవాలని ప్రభుత్వం భావిస్తున్నందున రెండింటికీ కలిపి ఒకే డీజీని నియమించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం సీఐడీ చీఫ్‌గా ఉన్న గోవింద్‌సింగ్‌ను జైళ్ల శాఖకు డైరెక్టర్ జనరల్‌గా నియమించే అవకాశం ఉంది. లాంగ్ స్టాండింగ్‌కు స్థాన చలనం చాలాకాలంగా గ్రేహౌండ్స్, ఆక్టోపస్ అదనపు డీజీపీగా ఉన్న కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డితోపాటు సిబ్బంది విభాగం అదనపు డీజీపీగా ఉన్న బి.శివధర్‌రెడ్డిని సైతం బదిలీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు చర్చ జరుగుతోంది. వీరిలో ఒకరిని శాంతి భద్రతల అదనపు డీజీపీగా నియమిస్తారని, మరొకొరిని ప్రొవిజినల్ అండ్ లాజిస్టిక్ అదనపు డీజీపీగా బదిలీచేసే అవకాశాలున్నట్టు తెలిసింది. రాచకొండలో అదనపు సీపీగా ఉన్న సుధీర్‌కుమార్‌ను ఒక జోన్‌కు ఐజీగా నియమించే అవకాశముంది. అదేవిధంగా నగర కమిషనరేట్లలో డీఐజీలుగా ఉన్న ఎం.రమేష్‌రెడ్డి, ఏఆర్.శ్రీనివాస్, విశ్వప్రసాద్‌లను కొత్తగా ఏర్పడబోతున్న రేంజులకు డీఐజీలుగా లేదా జాయింట్ సీపీలుగా బదిలీ చేయనున్నట్టు తెలిసింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న రవిగుప్తాకు సైతం స్థానచలనం కలిగే అవకాశముంది. కాగా, ప్రస్తుతం డీఐజీ పదోన్నతి కోసం వేచిచూస్తున్న సీనియర్ ఎస్పీలను దర్యాప్తు విభాగాల్లోకి తీసుకొని కీలక కేసుల పర్యవేక్షణ బాధ్యత అప్పగిస్తారన్న చర్చ జోరుగా నడుస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం జిల్లాల నుంచి బదిలీ అయ్యే అవకాశం ఉన్న అధికారులను సీఐడీతోపాటు ఏసీబీలో నియమించే అవకాశం ఉంది. జిల్లాలకు కన్ఫర్డ్ ఐపీఎస్‌లు కన్ఫర్డ్ ఐపీఎస్ జాబితాలోకి వచ్చిన 23 మంది అధికారులను వివిధ జిల్లాలతోపాటు ఎస్పీ హోదా ఉన్న కమిషనరేట్లకు బదిలీ చేయా లని పోలీస్ శాఖ ప్రతిపాదించినట్టు సమాచారం. అదేవిధంగా జిల్లాల్లో లాంగ్ స్టాండింగ్‌లో ఉన్న ఐపీఎస్, నాన్‌కేడర్ అధికారులను రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్‌లోని జోన్లకు డీసీపీలుగా నియమించేందుకు ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. -
ఢిల్లీ గ్యాంగ్‌వార్: ఒకప్పటి ఫ్రెండ్స్.. శత్రువులుగా ఎందుకు మారారు?
దేశ రాజధాని ఢిల్లీలో రెండు హంతక ముఠాల గ్యాంగ్‌వార్ పెను సంచలనం రేపింది. ఏకంగా న్యాయస్థానం ఆవరణలోనే మారణహోమం సృష్టించింది. మోస్ట్ వాండెటెడ్ గ్యాంగ్‌స్టర్ జితేందర్ గోగిని కోర్టు ప్రాంగణంలోనే పట్టపగలు ప్రత్యర్థులు కాల్చి చంపారు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు దుండగులు మృతి చెందారు. దుండగులు టిల్లు తాజ్పూరియా గ్యాంగ్‌కు చెందిన వారని అనుమానిస్తున్నారు. కాలేజీ రోజుల నుంచే వైరం జితేందర్ గోగి, టిల్లు తాజ్పూరియా ఒకప్పుడు స్నేహితులుగా ఉండేవారు. కాలేజీ స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు వీరిద్దరి మధ్య వైరానికి దారితీశాయి. 2010లో ఔటర్ ఢిల్లీలో జరిగిన కాలేజీ విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో వీరిద్దరి మధ్య మొదలైన గొడవలు గ్యాంగ్‌వార్‌గా మారాయి. 2018లో బూరారీ ప్రాంతంలో ఈ రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవల్లో ముగ్గురు చనిపోగా, ఐదుగురు గాయపడ్డారు. రెండు ముఠాల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో ఇప్పటివరకు 100 మందికి పైగా మరణించారని సమాచారం. ఎవరీ జితేంద్ర? గ్యాంగ్‌స్టర్ జితేంద్ర మన్ అలియాన్ గోగి.. ఢిల్లీ-హరియాణా సరిహద్దులోని అలీపూర్ ప్రాంతానికి చెందినవాడు. పోలీసులు టాప్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో అతడి పేరే ముందుంది. 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్తను తీహార్ జైలు నుంచి బెదిరించడంతో మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కాడు. కారాగారం లోపల నుంచే హంతక దందా నడిపించినట్టు ఆరోపణలు ఉన్నాయి. మూడుసార్లు జైలు నుంచి పారిపోయాడు. 2016, జూలై 30న బహదూర్‌గఢ్‌లో పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. గతేడాది మార్చి 3న గురుగ్రామ్‌లోని సెక్టార్ 82లో జితేంద్రను పోలీసులు పట్టుకున్నారు. ఈ రోజు రోహిణి కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరయ్యేందుకు వెళుతుండగా ప్రత్యర్థుల దాడిలో హతమయ్యాడు. దశాబ్ద కాలంగా గ్యాంగ్‌వార్ టిల్లు తాజ్‌పురియా కూడా తీహార్ జైలులో ఉన్నాడు. కారాగారం నుంచే ముఠా కార్యాలపాలు సాగించినట్టు ఇతడిపైనా ఆరోపణలు ఉన్నాయి. 2010 నుంచి గోగి, టిల్లు ముఠాల మధ్య ఆధిపత్య పోరు సాగుతున్నా 2013లో జరిగిన ఘటనతో గ్యాంగ్‌వార్ మరింత తీవ్రమైంది. ఢిల్లీకి డాన్‌గా చెప్పుకునే మరో గ్యాంగ్‌స్టర్ నీతూ దబోడియా అప్పట్లో పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు. దీంతో జితేంద్ర గోగి, టిల్లు తాజ్‌పురియా మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. దశాబ్ద కాలంగా రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్‌వార్ కొనసాగుతోంది. తాజాగా ఢిల్లీలోని రోహిణి కోర్టు రూమ్ 206లో ప్రత్యర్థులు జరిపిన కాల్పుల్లో జితేంద్ర హతమయ్యాడు. లాయర్ డ్రెస్‌లో వచ్చిన దుండగులు అతడిని తుపాకులతో కాల్చి చంపారు. -
ఢిల్లీలో కాల్పుల కలకలం
-
కోర్టులోనే రెండు గ్రూపుల కాల్పులు
-
లాయర్ దుస్తుల్లో వచ్చి కోర్టు ఆవరణలో కాల్పులు.. నలుగురు మృతి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. న్యాయస్థానం ఆవరణలో ఓ గ్యాంగ్ లాయర్ దుస్తుల్లో వచ్చి కాల్పులకు పాల్పడటంతో నలుగురు మృతి చెందారు. ఢిల్లీలోని రోహిణి కోర్టు రూమ్ 207లో ఈ ఘటన జరిగింది. రెండు గ్యాంగుల మధ్య వాగ్వాదం ఏర్పడి కాల్పులకు దారి తీసింది. లాయర్ దుస్తుల్లో వచ్చిన సునీల్ గ్యాంగ్ కాల్పులకు పాల్పడింది. ఈ ఘటనలో గ్యాంగ్ స్టర్ జితేంద్ర మృతి చెందాడు. ఓ కేసు విషయంలో గ్యాంగ్ స్టర్ జితేంద్ర కోర్టు రాగా లాయర్ దుస్తులు వచ్చిన కొంతమంది కాల్పులకు తెగబడ్డారు. ప్రత్యర్థి ముఠా కాల్పులకు దిగగానే షూటర్లను కాల్చి చంపిన గోగి గ్యాంగ్. కాగా, ఈ ఘటనలో గ్యాంగ్‌స్టర్ జితేంద్రతోపాటు మరో ముగ్గురు మృతి చెందారు. అందరూ చూస్తుండగానే ఇరు గ్యాంగ్‌లు విచ్చల విడిగా కాల్పులు జరుపుకున్నాయి. కొంతకాలంగా సునీల్ గ్యాంగ్-జితేంద్ర గ్యాంగ్‌ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలోనే జితేంద్ర టార్గెట్ చేసుకున్న సునీల్ గ్యాంగ్.. కోర్టు ఆవరణలోనే కాల్పులకు దిగింది. జితేంద్ర గోగి అలియాస్ దాదా మోస్గ్ వాంటెడ్ క్రిమినల్. 2016లో పోలీస్ కస్టడీ నుంచి జితేంద్ర గోగి పరారీ కాగా, ఆ గ్యాంగ్ స్టర్‌పై రూ. 4 లక్షల రివార్డు ఉంది. కాగా, గోగిపై ఇప్పటికే 12 దోపిడీ, హత్య కేసులున్నాయి. కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కింద కూడా గోగిపై కేసు నమోదైంది. చదవండి: ఫారెన్ వెళ్లలేకపోతున్నా.. మనస్తాపంతో యువతి #WATCH | Visuals of the shootout at Delhi's Rohini court today As per Delhi Police, assailants opened fire at gangster Jitender Mann 'Gogi', who has died. Three attackers have also been shot dead by police. pic.twitter.com/dYgRjQGW7J — ANI (@ANI) September 24, 2021 -
‘విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు’
సాక్షి, హైదరాబాద్: ఓట్ల లెక్కింపు తర్వాత విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని అడిషనల్ డీజీ జితేందర్ తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పోలింగ్ ప్రశాతంగా జరిగిందని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కౌంటింగ్ సెంటర్ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. సీసీ కెమరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని వెల్లడించారు. కౌంటింగ్ సెంటర్ల వద్ద అదనపు బలగాలను కూడా మోహరించామని అన్నారు. పాస్‌లు ఉన్నవారినే కౌంటింగ్ సెంటర్లలోనికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. అన్ని కౌంటింగ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరు ఎన్నికల సంఘం నిబంధనలను పాటించాలని కోరారు. సున్నితమైన ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘనకు సంబంధించి 2014లో 1600కు పైగా కేసులు నమోదు కాగా, ఈ సారి 1500కు పైగా కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. కాంగ్రెస్ నేత రోహిత్ రెడ్డికి భద్రత కల్పించాలని ఆ పార్టీ నేతలు డీజీపీని కోరిన విషయాన్ని గుర్తుచేశారు. కౌంటింగ్ సెంటర్లలోకి సెల్‌ఫోన్ అనుమతి లేదని స్పష్టం చేశారు. -
బాక్సర్ దారుణ హత్య
నోయిడా : హర్యానాకు చెందిన మాజీ బాక్సర్ జితేందర్ మన్ శుక్రవారం అనుమానాస్పదంగా హత్యకు గురయ్యాడు. జెటా సెక్టార్‌లోని ఏవీజే హైట్స్ అపార్ట్మెంట్లో తన ఇంటిలో శవమై కనిపించాడు. జితేందర్‌ను కలవాడినికి ప్రీతం అనే స్నేహితుడు జితేందర్ ప్లాట్ వెళ్లాడు. ఎంతసేపటికి తలపుతట్టినా తీయకపోవడంతో బద్దలు కొట్టి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే ప్రీతం పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. దీనిపై ఎస్పీ సునీత్ మట్లాడుతూ జితేందర్ శరీరంపై పలు బుల్లెట్ గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక జితేందర్ విషయానికి వస్తే జూనియర్ బాక్సింగ్‌లో భారత్ తరపున ఉబ్జెకిస్తాన్, క్యూబా, ఫ్రాన్స్, రష్యాలతో పాటు పలు అంతర్జాతీయ ఛాంపియన్షిప్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. గాయాల కారణంగా గత ఏడు నెలల క్రితం బాక్సింగ్‌కు వీడ్కొలు పలికి జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. అయితే శుక్రవారం అనుమానాస్పదంగా గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హత్యకు గురయ్యాడు. -
ఎన్డీయేలో చేరం: జితేందర్
హైదరాబాద్: తమ పార్టీకి ఎన్డీయే కూటమిలో చేరే ఉద్దేశం లేదని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నాయకుడు జితేందర్‌రెడ్డి స్పష్టంచేశారు. అయితే కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వానికి అంశాలవారీ మద్దతు కొనసాగుతుందని బుధవారం ఆయన తెలిపారు. అలాగే కాంగ్రెస్ నాయకత్వంలోని 16 విపక్ష పార్టీల కూటమిలో చేరే ఉద్దేశంకూడా లేదని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణను తమ ప్రభుత్వం అభివృద్ధి పథంలో తీసుకెళుతోందని, రాష్ట్రానికి మేలు చేసినంతకాలం ఎన్డీయేకు అంశాలవారీ మద్దతు కొనసాగుతుందని, అలా కాని పక్షంలో ఆ కూటమిపై కూడా పోరాటం చేస్తామని చెప్పారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్న బీజేపీ లక్ష్యం గురించి ప్రశ్నించగా, రాష్ట్రంలో బీజేపీని గట్టి ప్రత్యర్థిగా భావించడం లేదన్నారు. -
అమీర్‌పేట కేంద్రంగా ట్రాఫిక్ ఆంక్షలు
⇒ ‘మెట్రో’ పనుల నేపథ్యంలో అమీర్‌పేట వద్ద ట్రాఫిక్ మళ్లింపులు ⇒ బుధవారం నుంచి వచ్చే మంగళవారం వరకు అమలు హైదరాబాద్: మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణాల నేపథ్యంలో నగరంలోని అమీర్‌పేట బిగ్‌బజార్ కేంద్రంగా ట్రాఫిక్ మళ్లింపులు విధిస్తూ అదనపు సీపీ (ట్రాఫిక్) జితేందర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం నుంచి వారం రోజుల పాటు అమలులో ఉండే వీటిని దృష్టిలో పెట్టుకుని వాహనచోదకులు సహకరించాలని ఆయన కోరారు. ట్రాఫిక్ మళ్లింపు దారులు ఇవే.. ⇒ ఖైరతాబాద్, పంజగుట్ట వైపు నుంచి అమీర్‌పేట వైపు వచ్చే భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సుల్ని షాలిమార్ ‘టి’ జంక్షన్ నుంచి ముందుకు వెళ్లడానికి అనుమతించరు. వీటిని బిగ్‌బజార్ వెనుక వైపు నుంచి పంపిస్తారు. ⇒ కృష్ణానగర్, ఇందిరానగర్, శ్రీనగర్‌కాలనీ వైపుల నుంచి షాలిమార్ ‘టి’ జంక్షన్ మీదుగా అమీర్‌పేట వైపు వచ్చే వాహనాలను (భారీ వాహనాల మినహా) జీహెచ్ఎంసీ పార్క్, శ్రీనగర్‌కాలనీ క్రాస్‌రోడ్, పార్క్ వ్యూ జీఎస్ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్, గౌతమ్ చికెన్ సెంటర్, ఇమేజ్ హాస్పటల్ లైన్ మీదుగా పంపిస్తారు. ⇒ ఎర్రగడ్డ, ఎస్సార్‌నగర్, అమీర్‌పేట వైపు నుంచి ఖైరతాబాద్, పంజగుట్ట వైపు వెళ్ళే వాహనాలను బిగ్‌బజార్ నుంచి షాలిమార్ ‘టి’ జంక్షన్ వరకు ఒకే మార్గంలో రెండు వైపులకూ వెళ్లే వాహనాలను అనుమతిస్తారు. ⇒ ఈ మళ్లింపుల ప్రభావం సిటీ బస్సు రూట్ నంబర్లు 218, 225, 9, 9 ఎం, 9 ఎక్స్, 9/ఎఫ్, 189 ఎం, 19/ఎఫ్, 158, 113, 19 జే, 19 ఎం, 185, 19 కె/జె రూట్ బస్సులపై ఉంటుందని ట్రాఫిక్ అదనపు సీపీ జితేందర్ తెలిపారు. -
భారత రెజ్లర్ల పసిడి పట్టు
న్యూఢిల్లీ: కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. సింగపూర్‌లో ఆదివారం ముగిసిన ఈ ఈవెంట్లో చివరిరోజు భారత కుస్తీ వీరులు 8 స్వర్ణాలు, 8 రజతాలు సొంతం చేసుకున్నారు. పురుషుల ఫ్రీస్టరుుల్ విభాగంలో హర్ఫుల్ (61 కేజీలు), బజరంగ్ (65 కేజీలు), జితేందర్ (74 కేజీలు), దీపక్ (86 కేజీలు), హితేందర్ (125 కేజీలు) స్వర్ణ పతకాలను దక్కించుకున్నారు. వికాస్ (61 కేజీలు), రాహుల్ మాన్ (65 కేజీలు), సందీప్ (74 కేజీలు), అరుణ్ (86 కేజీలు), కృషన్ (125 కేజీలు) రజత పతకాలు గెలిచారు. పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో రవీందర్ (59 కేజీలు), దీపక్ (71 కేజీలు), హర్దీప్ (98 కేజీలు) పసిడి పతకాలను కై వసం చేసుకున్నారు. కృషన్ (59 కేజీలు), రఫీక్ (71 కేజీలు), సచిన్ (98 కేజీలు) రజత పతకాలను సాధించారు. -
రూ.2 కోట్ల ‘కిక్’ వదిలింది!
సాక్షి, హైదరాబాద్: మద్యం సేవించి నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న వారిపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఇలాంటి ‘నిషా’చరుల్లో పలువురికి జైలు శిక్షలూ పడ్డాయి. జనవరి నుంచి అక్టోబర్ 20 వరకు మద్యం సేవించి వాహనాలు నడిపిన వారు జరిమానాల రూపంలో ఖజానాకు మొత్తం రూ.2,01,17,100 సమర్పించారు. ఈ ఏడాది ఇప్పటివరకు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌ల్లో 13,447 మంది చిక్కారని ట్రాఫిక్ చీఫ్ జితేందర్ శుక్రవారం తెలిపారు. వీరిలో 6,245 మందికి ఎర్రమంజిల్‌లోని కోర్టులు శిక్షలు విధించాయని వెల్లడించారు. ఇప్పటివరకు 10,065 ద్విచక్ర, 983 త్రిచక్ర, 2,115 తేలికపాటి వాహనాలతో పాటు 284 ఇతర వాహనాలను పట్టుకున్నట్లు చెప్పారు. వీటి చోదకులకు కౌన్సెలింగ్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు ఎర్రమంజిల్‌లోని మూడు, నాల్గో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుల్లో హాజరుపరిచారు. చోదకులు తీసుకున్న మద్యం మోతాదును పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానాలు ఒక రోజు నుంచి 20 రోజుల వరకు జైలు శిక్షలు విధించాయి. 582 మందికి ఒక రోజు, 1,161 మందికి రెండు రోజులు, 544 మందికి మూడు రోజులు, 227 మందికి నాలుగు రోజులు, 189 మందికి ఐదు రోజులు, 33 మందికి ఆరు రోజులు, 136 మందికి వారం, 138 మందికి పది రోజులు, 161 మందికి 15 రోజులు, ముగ్గురికి 20 రోజుల చొప్పున శిక్షలు పడ్డాయని జితేందర్ తెలిపారు. మరో 3,071 మందికి కోర్టు సమయం ముగిసే వరకు న్యాయస్థానంలోనే నిలబడేలా, సామాజిక సేవలు చేసేలా కోర్టులు శిక్ష విధించాయన్నారు. -
ఫుట్‌పాత్‌లు ఆక్రమిస్తే అరెస్టే
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు పెరగడానికి ఆక్రమణలు కూడా ప్రధాన కారణం. వ్యాపారులు ఫుట్పాత్ల్ని ఆక్రమించడంతో పాదచారులకు రహదారులే ఆధారమవుతున్నాయి. ఫలితంగా ట్రాఫిక్ జామ్స్ ఏర్పడటమే కాదు... కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఈ పరిణామలను దృష్టిలో పెట్టుకున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ఫుట్‌పాత్‌లను ఆక్రమించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అలా అలా ముందుకొస్తూ... ఈ ఆక్రమణదారుల వ్యవహారం నానాటికీ తలనొప్పిగా మారుతోందని ట్రాఫిక్ విభాగం అధికారులు చెప్తున్నారు. ఓ దుకాణదారుడు తొలుత తన దుకాణం ముందు ఉన్న ఫుట్‌పాత్‌పై కన్నేస్తున్నాడు. కొన్ని రోజుల పాటు దుకాణం తెరిచినప్పుడు అక్కడ సామాను పెట్టి, మూసేప్పుడు తిరిగి తీసేయడంతో ఆక్రమణ మొదలవుతోంది. కొన్నాళ్లకు ఆయా ఫుట్‌పాత్‌లపై నిర్మాణాలు చేపట్టి రహదారిని కూడా ఆక్రమిస్తున్నారు. ఇలా నానాటికీ కుంచించుకుపోతున్న ఫుట్‌పాత్‌లు, రహదారులు సామాన్యులకు అనేక ఇబ్బందులు కలిగించడంతో పాటు నరకం చూపిస్తున్నాయి. ఒకప్పుడు జరిమానా మాత్రమే... ఫుట్‌పాత్, రోడ్డు ఆక్రమణలపై ఒకప్పుడు కఠిన చర్యలు తీసుకునే ఆస్కారం ఉండేదికాదు. వీరిపై కేవలం సిటీ పోలీసు (సీపీ) యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి జరిమానాతో సరిపెట్టేవారు. దీంతో ఈ ఆక్రమణదారులపై ఎలాంటి ప్రభావం ఉండేది కాదు. ట్రాఫిక్ పోలీసులు వచ్చినప్పుడల్లా జరిమానాలు కట్టేస్తూ తమ పంథా కొనసాగించేవారు. ఫలితంగా సమస్య తీరకపోవడంతో పాటు ఆక్రమణదారుల సంఖ్య నానాటికీ పెరిగేది. ఏళ్లుగా కొనసాగుతున్న జరిమానా విధానంలోని లోపాలను గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. క్రిమినల్ కేసులతో కోర్టుకు... నగరంలో ఈ తరహా ఆక్రమణలకు పాల్పడుతున్న వ్యాపారులపై క్రిమినల్ కేసుల నమోదు ప్రక్రియ ప్రారంభించారు. దీనికోసం ‘మొబైల్ ఈ–టికెట్’ పేరుతో ప్రత్యేక యాప్‌ను రూపొందించి ట్రాఫిక్ పోలీసులు వినియోగిస్తున్న ట్యాబ్‌్సలో పొందుపరిచారు. దీని ఆధారంగా ఆక్రమణదారులపై సాంకేతికంగా కేసులు నమోదు చేసే ఆస్కారం ఏర్పడింది. ఈ యాప్‌లో టిన్ నెంబర్, దుకాణం, యజమాని వివరాలతో పాటు ఆక్రమణ ఫొటో సైతం తీసుకునే ఆస్కారం ఉంది. ఇది జీపీఎస్ ఆధారితంగా పని చేయడంతో న్యాయస్థానంలో బలమైన సాక్ష్యంగా పనికి వస్తోంది. వీటి ఆధారంగా ఆక్రమణదారులను న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నారు. రెండుసార్లు అవకాశం ఇచ్చాకే: ‘సిటీలో ఫుట్‌పాత్‌లు, రహదారుల్ని ఆక్రమిస్తున్న దుకాణదారులకు రెండు అవకాశాలు ఇస్తున్నాం. తొలుత రెండుసార్లు కేవలం జరిమానా, కౌన్సెలింగ్‌తో సరిపెడుతున్నాం. మూడోసారి కూడా పునరావృతమైతే క్రిమినల్ కేసు నమోదు చేసి అభియోగపత్రాలతో సహా కోర్టుకు తరలిస్తున్నాం. ఇప్పటికే కొందరికి జైలు శిక్ష కూడా పడింది. ఈ వివరాల ఆధారంగా జీహెచ్ఎంసీ అధికారులకూ లేఖ రాసి వారి ట్రేడ్ లైసెన్సు రద్దుకు సిఫార్సు చేస్తున్నాం.’ – జితేందర్, నగర ట్రాఫిక్ చీఫ్