లాయర్‌ దుస్తుల్లో వచ్చి కోర్టు ఆవరణలో కాల్పులు.. నలుగురు మృతి | Delhi top Gangster Jitender Gogi Shot Dead in Rohini Court Shootout | Sakshi
Sakshi News home page

లాయర్‌ దుస్తుల్లో వచ్చి కోర్టు ఆవరణలో కాల్పులు.. నలుగురు మృతి

Published Fri, Sep 24 2021 2:09 PM | Last Updated on Fri, Sep 24 2021 3:24 PM

Delhi top Gangster Jitender Gogi Shot Dead in Rohini Court Shootout - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. న్యాయస్థానం ఆవరణలో  ఓ గ్యాంగ్‌ లాయర్‌ దుస్తుల్లో వచ్చి కాల్పులకు పాల్పడటంతో నలుగురు మృతి చెందారు. ఢిల్లీలోని రోహిణి కోర్టు రూమ్‌ 207లో ఈ ఘటన జరిగింది. రెండు గ్యాంగుల మధ్య వాగ్వాదం ఏర్పడి కాల్పులకు దారి తీసింది. లాయర్‌ దుస్తుల్లో వచ్చిన సునీల్‌ గ్యాంగ్‌ కాల్పులకు పాల్పడింది. ఈ ఘటనలో గ్యాంగ్‌ స్టర్‌ జితేంద్ర మృతి చెందాడు.

ఓ కేసు విషయంలో గ్యాంగ్‌ స్టర్‌ జితేంద్ర కోర్టు రాగా లాయర్‌ దుస్తులు వచ్చిన కొంతమంది కాల్పులకు తెగబడ్డారు. ప్రత్యర్థి ముఠా కాల్పులకు దిగగానే షూటర్లను కాల్చి చంపిన గోగి గ్యాంగ్‌. కాగా, ఈ ఘటనలో గ్యాంగ్‌స్టర్‌ జితేంద్రతోపాటు మరో ముగ్గురు మృతి చెందారు. అందరూ చూస్తుండగానే ఇరు గ్యాంగ్‌లు విచ్చల విడిగా కాల్పులు జరుపుకున్నాయి.  కొంతకాలంగా సునీల్‌ గ్యాంగ్‌-జితేంద్ర గ్యాంగ్‌ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.

ఈ క్రమంలోనే జితేంద్ర టార్గెట్‌ చేసుకున్న సునీల్‌ గ్యాంగ్‌.. కోర్టు ఆవరణలోనే కాల్పులకు దిగింది. జితేంద్ర గోగి అలియాస్‌ దాదా మోస్గ్‌ వాంటెడ్‌ క్రిమినల్‌.  2016లో పోలీస్‌ కస్టడీ నుంచి జితేంద్ర గోగి పరారీ కాగా, ఆ గ్యాంగ్‌ స్టర్‌పై రూ. 4 లక్షల రివార్డు ఉంది. కాగా, గోగిపై ఇప్పటికే 12 దోపిడీ, హత్య కేసులున్నాయి. కంట్రోల్‌ ఆఫ్‌ ఆర్గనైజ్‌డ్‌ క్రైమ్‌ యాక్ట్‌ కింద కూడా గోగిపై కేసు నమోదైంది. 

చదవండి: ఫారెన్‌ వెళ్లలేకపోతున్నా.. మనస్తాపంతో యువతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement