Delhi Rohini area
-
ఢిల్లీలో భారీ పేలుడు.. పోలీసులు అలర్ట్
సాక్షి, ఢిల్లీ: రోహిణి ప్రాంతంలోని ప్రశాంత్ విహార్ సీఆర్పీఎఫ్ పాఠశాలలో ఆదివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది.పేలుడు ధాటికి పాఠశాల గోడతో పాటు, పలు షాపుల అద్దాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.ఫోరెన్సిక్ బృందాలు, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పేలుడుకు కారణాలను అన్వేషిస్తున్నారు. స్థానికుడు రికార్డ్ చేసిన వీడియోలో పేలుడు జరిగిన ప్రదేశానికి సమీపంలో నుంచి పొగలు కమ్ముకోవడం కనిపించింది.తాను ఇంట్లోనే ఉన్నానని.. పెద్ద శబ్దం, పొగలు కమ్ముకోవడంతో వీడియో రికార్డ్ చేశానని.. అంతకుమించి ఏమీ తెలియని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఈ పేలుడు ఉదయం 7.47 గంటలకు జరిగింది. పేలుడు కారణాలపై దర్యాప్తు చేసేందుకు నిపుణులను పిలిపించామని సీనియర్ పోలీసు అధికారి అమిత్ గోయల్ తెలిపారు.ఈ ఘటనలో ఇంకా ఎలాంటి ఆధారాలు లభించలేదని.. విచారణలో భాగంగా భూగర్భ మురుగునీటి లైన్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. పేలుడు తర్వాత భరించలేని దుర్గంధం వ్యాపించింది. డ్రైనేజీ పైపు పేలి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తుండగా, క్రూడ్ బాంబు కూడా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: వయనాడ్ ఎవరది?.. డైనమిక్ లీడర్ నవ్య Vs ప్రియాంక -
కోర్టులో షూటౌట్; వెలుగులోకి సంచలన విషయాలు
ఢిల్లీలో మోస్ట్ వాండెటెడ్ గ్యాంగ్‌స్టర్ జితేందర్ గోగి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జితేందర్‌ను శుక్రవారం రోహిణి కోర్టు ఆవరణలో అందరూ చూస్తుండగా కాల్చి చంపిన సంగతి విదితమే. అతడి హత్యకు ప్రధాన సూత్రధారుడిగా మరో గ్యాంగ్‌స్టర్ టిల్లు తాజ్‌పూరియాను పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి బలం చేకూర్చే ఆధారాలు పోలీసులకు లభ్యమయినట్టు సమాచారం. రోహిణి కోర్టు షూటౌట్‌కు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ ద్వారా టిల్లు తెలుసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. టిల్లు తాజ్పూరియా ప్రస్తుతం తీహార్‌లోని మండోలా జైలులో ఉన్నాడు. కారాగారం నుంచే జితేందర్ హత్యకు సంబంధించిన విషయాలను తన ఇద్దరు అనుచరుల ద్వారా ఎప్పటికప్పుడు అతడు తెలుసుకున్నట్టు సమాచారం. జితేందర్‌ను కాల్చిచంపిన ఇద్దరు దుండగులు పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో హతమయ్యారు. వీరిని ఉమాంగ్ యాదవ్, వినయ్‌గా పోలీసులు గుర్తించారు. దీనికి ముందు ఇంటర్నెట్ కాలింగ్ ద్వారా టిల్లుకు వీరిద్దరూ సమాచారం ఇచ్చినట్టు వెల్లడైంది. రోహిణి కోర్టుకు చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది, ఇప్పుడు ఎక్కడికి చేరుకున్నారు వంటి ప్రశ్నలు.. తన ఇద్దరు అనుచరులను ఫోన్లో టిల్లు అడిగినట్టు తెలుస్తోంది. రోహిణి కోర్టుకు చేరుకున్న తర్వాత ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వాలని ఉమాంగ్, వినయ్‌లను ఆదేశించాడట. రోహిణి కోర్టులో షూటౌట్‌కు కొద్ది నిమిషాల ముందు కూడా వారికి కాల్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘దాడి చేసిన ఇద్దరూ కోర్టు గది లోపల కూర్చున్నారని.. కోర్టు లోపల, బయటా పోలీసు భద్రత కట్టుదిట్టంగా ఉందని తెలుసుకుని.. తన అనుచరులు తప్పించుకోవడం కష్టమని టిల్లు భావించాడు. దీంతో మరోసారి ఫోన్ చేసి వారి ఆచూకీ గురించి అడిగాడు. వారు పార్కింగ్ స్థలంలో ఉన్నారని చెప్పినప్పుడు అక్కడి నుంచి వెంటనే పారిపోవాలని టిల్లు సూచించాడ’ని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ గ్యాంగ్‌వార్: ఒకప్పటి ఫ్రెండ్స్.. శత్రువులుగా ఎందుకు మారారు? -
ఢిల్లీ గ్యాంగ్‌వార్: ఒకప్పటి ఫ్రెండ్స్.. శత్రువులుగా ఎందుకు మారారు?
దేశ రాజధాని ఢిల్లీలో రెండు హంతక ముఠాల గ్యాంగ్‌వార్ పెను సంచలనం రేపింది. ఏకంగా న్యాయస్థానం ఆవరణలోనే మారణహోమం సృష్టించింది. మోస్ట్ వాండెటెడ్ గ్యాంగ్‌స్టర్ జితేందర్ గోగిని కోర్టు ప్రాంగణంలోనే పట్టపగలు ప్రత్యర్థులు కాల్చి చంపారు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు దుండగులు మృతి చెందారు. దుండగులు టిల్లు తాజ్పూరియా గ్యాంగ్‌కు చెందిన వారని అనుమానిస్తున్నారు. కాలేజీ రోజుల నుంచే వైరం జితేందర్ గోగి, టిల్లు తాజ్పూరియా ఒకప్పుడు స్నేహితులుగా ఉండేవారు. కాలేజీ స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు వీరిద్దరి మధ్య వైరానికి దారితీశాయి. 2010లో ఔటర్ ఢిల్లీలో జరిగిన కాలేజీ విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో వీరిద్దరి మధ్య మొదలైన గొడవలు గ్యాంగ్‌వార్‌గా మారాయి. 2018లో బూరారీ ప్రాంతంలో ఈ రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవల్లో ముగ్గురు చనిపోగా, ఐదుగురు గాయపడ్డారు. రెండు ముఠాల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో ఇప్పటివరకు 100 మందికి పైగా మరణించారని సమాచారం. ఎవరీ జితేంద్ర? గ్యాంగ్‌స్టర్ జితేంద్ర మన్ అలియాన్ గోగి.. ఢిల్లీ-హరియాణా సరిహద్దులోని అలీపూర్ ప్రాంతానికి చెందినవాడు. పోలీసులు టాప్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో అతడి పేరే ముందుంది. 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్తను తీహార్ జైలు నుంచి బెదిరించడంతో మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కాడు. కారాగారం లోపల నుంచే హంతక దందా నడిపించినట్టు ఆరోపణలు ఉన్నాయి. మూడుసార్లు జైలు నుంచి పారిపోయాడు. 2016, జూలై 30న బహదూర్‌గఢ్‌లో పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. గతేడాది మార్చి 3న గురుగ్రామ్‌లోని సెక్టార్ 82లో జితేంద్రను పోలీసులు పట్టుకున్నారు. ఈ రోజు రోహిణి కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరయ్యేందుకు వెళుతుండగా ప్రత్యర్థుల దాడిలో హతమయ్యాడు. దశాబ్ద కాలంగా గ్యాంగ్‌వార్ టిల్లు తాజ్‌పురియా కూడా తీహార్ జైలులో ఉన్నాడు. కారాగారం నుంచే ముఠా కార్యాలపాలు సాగించినట్టు ఇతడిపైనా ఆరోపణలు ఉన్నాయి. 2010 నుంచి గోగి, టిల్లు ముఠాల మధ్య ఆధిపత్య పోరు సాగుతున్నా 2013లో జరిగిన ఘటనతో గ్యాంగ్‌వార్ మరింత తీవ్రమైంది. ఢిల్లీకి డాన్‌గా చెప్పుకునే మరో గ్యాంగ్‌స్టర్ నీతూ దబోడియా అప్పట్లో పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు. దీంతో జితేంద్ర గోగి, టిల్లు తాజ్‌పురియా మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. దశాబ్ద కాలంగా రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్‌వార్ కొనసాగుతోంది. తాజాగా ఢిల్లీలోని రోహిణి కోర్టు రూమ్ 206లో ప్రత్యర్థులు జరిపిన కాల్పుల్లో జితేంద్ర హతమయ్యాడు. లాయర్ డ్రెస్‌లో వచ్చిన దుండగులు అతడిని తుపాకులతో కాల్చి చంపారు. -
ఢిల్లీలో కాల్పుల కలకలం
-
కోర్టులోనే రెండు గ్రూపుల కాల్పులు
-
లాయర్ దుస్తుల్లో వచ్చి కోర్టు ఆవరణలో కాల్పులు.. నలుగురు మృతి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. న్యాయస్థానం ఆవరణలో ఓ గ్యాంగ్ లాయర్ దుస్తుల్లో వచ్చి కాల్పులకు పాల్పడటంతో నలుగురు మృతి చెందారు. ఢిల్లీలోని రోహిణి కోర్టు రూమ్ 207లో ఈ ఘటన జరిగింది. రెండు గ్యాంగుల మధ్య వాగ్వాదం ఏర్పడి కాల్పులకు దారి తీసింది. లాయర్ దుస్తుల్లో వచ్చిన సునీల్ గ్యాంగ్ కాల్పులకు పాల్పడింది. ఈ ఘటనలో గ్యాంగ్ స్టర్ జితేంద్ర మృతి చెందాడు. ఓ కేసు విషయంలో గ్యాంగ్ స్టర్ జితేంద్ర కోర్టు రాగా లాయర్ దుస్తులు వచ్చిన కొంతమంది కాల్పులకు తెగబడ్డారు. ప్రత్యర్థి ముఠా కాల్పులకు దిగగానే షూటర్లను కాల్చి చంపిన గోగి గ్యాంగ్. కాగా, ఈ ఘటనలో గ్యాంగ్‌స్టర్ జితేంద్రతోపాటు మరో ముగ్గురు మృతి చెందారు. అందరూ చూస్తుండగానే ఇరు గ్యాంగ్‌లు విచ్చల విడిగా కాల్పులు జరుపుకున్నాయి. కొంతకాలంగా సునీల్ గ్యాంగ్-జితేంద్ర గ్యాంగ్‌ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలోనే జితేంద్ర టార్గెట్ చేసుకున్న సునీల్ గ్యాంగ్.. కోర్టు ఆవరణలోనే కాల్పులకు దిగింది. జితేంద్ర గోగి అలియాస్ దాదా మోస్గ్ వాంటెడ్ క్రిమినల్. 2016లో పోలీస్ కస్టడీ నుంచి జితేంద్ర గోగి పరారీ కాగా, ఆ గ్యాంగ్ స్టర్‌పై రూ. 4 లక్షల రివార్డు ఉంది. కాగా, గోగిపై ఇప్పటికే 12 దోపిడీ, హత్య కేసులున్నాయి. కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కింద కూడా గోగిపై కేసు నమోదైంది. చదవండి: ఫారెన్ వెళ్లలేకపోతున్నా.. మనస్తాపంతో యువతి #WATCH | Visuals of the shootout at Delhi's Rohini court today As per Delhi Police, assailants opened fire at gangster Jitender Mann 'Gogi', who has died. Three attackers have also been shot dead by police. pic.twitter.com/dYgRjQGW7J — ANI (@ANI) September 24, 2021 -
పట్టపగలు మెట్రో స్టేషన్ లో కిరాతకం
గుర్గావ్: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలు అందరూ చూస్తుండగా మహిళను ఓ దుర్మార్గుడు కిరాతకంగా హత్య చేశాడు. గుర్గావ్ లోని ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్ లో సోమవారం ఉదయం జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. రోహిణి ప్రాంతంలో బ్యూటీ పార్లర్ లో పనిచేస్తున్న పింకీ దేవి(34) అనే మహిళను జితేందర్ అనే ఆటోడ్రైవర్ పాశవికంగా పొడిచి చంపాడు. ముందుగా వెనుక నుంచి ఆమెపై జితేందర్ దాడి చేశాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తర్వాత ఆమె గొంతు కోసి, విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడని చెప్పాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని కత్తితో బెదిరించాడు. ఎలక్ట్రిక్ స్టాండింగ్ ఫ్యాన్ విసిరి అతడిని పట్టుకున్నారు. పింకీ దేవిని సమీపంలోని ఉమా సంజీవని ఆస్పత్రికి తరలించగా సివిల్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. తీవ్రగాయాలతో మధ్యాహ్నం ఆమె మృతి చెందింది. ఆమె దేహంలో 30 కత్తి గాయాలున్నాయని పోస్టుమార్టం చేసిన వైద్యుడు దీపక్ మాథూర్ తెలిపారు. షిల్లాంగ్ కు చెందిన పింకీ దేవి తన భర్త మాన్ సింగ్ తో కలిసి గుర్గావ్ లోని సార్ హాల్ గ్రామంలో నివసిస్తోంది. మూడేళ్ల క్రితం వీరికి పెళ్లైంది. నిందితుడు జితేందర్ ను ప్రభుత్వాసుపత్రిలో చేర్చామని పోలీసులు తెలిపారు. అతడు ఎందుకు ఈ దారుణానికి ఒడిగట్టాడో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన జితేందర్ గుర్గావ్ లోని రాజీవ్ నగర్ లో నివసిస్తున్నాడని వెల్లడించారు. అయితే గత కొన్ని నెలలుగా పింకీ దేవిని జితేందర్ వేధిస్తున్నాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.