ఢిల్లీలో భారీ పేలుడు.. పోలీసులు అలర్ట్‌ | Loud Explosion Near School In Delhi Rohini, Forensic Team To Find Cause, More Details Inside | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో భారీ పేలుడు.. పోలీసులు అలర్ట్‌

Published Sun, Oct 20 2024 11:03 AM | Last Updated on Sun, Oct 20 2024 1:19 PM

Loud Explosion Near School In Delhi Rohini

సాక్షి, ఢిల్లీ: రోహిణి ప్రాంతంలోని ప్రశాంత్ విహార్‌ సీఆర్పీఎఫ్ పాఠశాలలో ఆదివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది.పేలుడు ధాటికి  పాఠశాల గోడతో పాటు, పలు షాపుల అద్దాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

ఫోరెన్సిక్ బృందాలు, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పేలుడుకు కారణాలను అన్వేషిస్తున్నారు. స్థానికుడు రికార్డ్ చేసిన వీడియోలో పేలుడు జరిగిన ప్రదేశానికి సమీపంలో నుంచి పొగలు కమ్ముకోవడం కనిపించింది.

తాను ఇంట్లోనే ఉన్నానని.. పెద్ద శబ్దం, పొగలు కమ్ముకోవడంతో వీడియో రికార్డ్ చేశానని.. అంతకుమించి ఏమీ తెలియని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఈ పేలుడు ఉదయం 7.47 గంటలకు జరిగింది. పేలుడు కారణాలపై దర్యాప్తు చేసేందుకు నిపుణులను పిలిపించామని సీనియర్ పోలీసు అధికారి అమిత్ గోయల్ తెలిపారు.

ఈ ఘటనలో ఇంకా ఎలాంటి ఆధారాలు లభించలేదని.. విచారణలో భాగంగా భూగర్భ మురుగునీటి లైన్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. పేలుడు తర్వాత భరించలేని దుర్గంధం వ్యాపించింది. డ్రైనేజీ పైపు పేలి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తుండగా, క్రూడ్ బాంబు కూడా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: వయనాడ్‌ ఎవరది?.. డైనమిక్‌ లీడర్‌ నవ్య Vs ప్రియాంక
 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement