ఆకస్మిక తనిఖీలు చేయండి.. త్వరలో నేనూ జిల్లాల్లో పర్యటిస్తా
పోలీస్ ఉన్నతాధికారుల సమావేశంలో డీజీపీ జితేందర్
సాక్షి, హైదరాబాద్: పోలీస్‌స్టేషన్లలో ప్రజలు ఇచ్చే ఫిర్యాదుల ఆధారంగా వెంటనే కేసులు నమోదు చేయాలని, ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని డీజీపీ జితేందర్ పోలీస్ ఉన్నతాధికారులకు సూచించారు. పోలీసు కమిషనర్లు, ఎస్పీలు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లలో ఆకస్మిక తని ఖీల చేయాలని, తాను సైతం త్వరలోనే జిల్లాల వారీగా తనిఖీలు చేపడతానని వెల్ల డించారు.
సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిష నర్లతో డీజీపీ జితేందర్ పోలీస్ కేంద్ర కార్యా లయంలో సమావేశమయ్యారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రాష్ట్రంలోని అన్నియూనిట్ల ఉన్నతాధికారు లతో నిర్వ హించిన ఈ సమీక్షలో జితేందర్ పలు కీలక సూచనలు ఇచ్చారు.
ప్రజావాణి దరఖాస్తుల్లోని ప్రజాసమస్యల పరిష్కారా నికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టాల్సిన అవ సరాన్ని నొక్కిచెప్పిన డీజీపీ, అవసరమైతే ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహించా లని ప్రతిపాదించారు. ఆయుధాల లైసెన్స్‌ల జారీపై జాగ్రత్త వహించాలని స్పష్టం చేశారు.
సమావేశంలో శాంతి భద్రతల అడిషన ల్ డీజీ మహేశ్‌భగవత్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, అదనపు డీజీలు శిఖా గోయెల్, అభిలాష బిస్త్, వీవీ శ్రీనివాస్ రావు, విజయ్ కుమార్, స్టీఫెన్ రవీంద్ర, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి, రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్‌బాబుతో పాటు జోనల్ ఐజీలు, జిల్లా ఎస్పీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment