నేడు శోభాయాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు | Traffic restrictions on activities today .. | Sakshi
Sakshi News home page

నేడు శోభాయాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు

Published Tue, Apr 15 2014 4:06 AM | Last Updated on Wed, Apr 3 2019 8:54 PM

నేడు శోభాయాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు - Sakshi

నేడు శోభాయాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు

మెహిదీపట్నం, న్యూస్‌లైన్: హనుమాన్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించే శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్‌కు ఎలాంటి ఆటంకాలు జరగకుండా నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ జితేందర్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. నేడు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని చేపట్టే ర్యాలీలకు పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గౌలీగూడ రామాలయం నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర తాడ్‌బండ్ హనుమాన్ టెంపుల్‌కు చేరుతుందని, ఈ మార్గాల్లో వెళ్లే ర్యాలీకి ట్రాఫిక్‌ను ఇతర వైపులకు మళ్లిస్తామని పేర్కొన్నారు.
 
ట్రాఫిక్ ఆంక్షలు ఇలా ...


అఫ్జల్‌గంజ్, శంకర్ హోటల్, ముక్తాయార్ గంజ్ మీదుగా పుత్లీ బౌలికి వెళ్లే వాహనాలు గౌలీగూడ చమాన్ నుంచి బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్ వైపు సీబీఎస్‌కు వెళ్లాలి.
     
ఆంధ్రాబ్యాంకు రంగ్‌మహల్ నుంచి గౌలీ గూడ చమాన్ వైపుకు ట్రాఫిక్‌ను అనుమతిం చరు. ఇక్కడి నుంచి వెళ్లే వాహనాలను పుత్లీ బౌలీ క్రాస్ రోడ్ మీదుగా రంగ్‌మహల్ వైపుకు మళ్లిస్తారు.  ఊరేగింపు ప్రారంభమైన తర్వాత చాదర్‌ఘాట్ నుంచి పుత్లీ బౌలి వైపు వెళ్లే వాహనాలు రంగ్‌మహల్ వై జంక్షన్ నుంచి సీబీఎస్ వైపుకు మళ్లిస్తారు.
     
పుత్లీబౌలి నుంచి ర్యాలీ ఆంధ్రాబ్యాంకు వైపు దాటిన తర్వాత జీపీఓ అబిడ్స్ జంక్షన్ నుంచి ఎంజే మార్కెట్ వైపుకు మళ్లిస్తారు. ఈ ర్యాలీ కోఠి ఆంధ్రాబ్యాంకు వచ్చే సమయంలో చాదర్‌ఘాట్ క్రాస్ రోడ్ నుంచి ఆంధ్రాబ్యాంకు వైపు వచ్చే వాహనాలను బీఎం అండ్ హెచ్‌ఎస్ జంక్షన్ నుంచి సుల్తాన్‌బజార్ క్రాస్ రోడ్‌వైపు మళ్లిస్తారు. ర్యాలీ కాచిగూడ క్రాస్ రోడ్ వచ్చే సమయంలో కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి వచ్చే వాహనాలు బడీచౌడీ టూరిస్టు హోటల్ జంక్షన్, బర్కత్‌పుర వైపు మళ్లిస్తారు.
     
అజమాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలను వీఎస్‌టీ క్రాస్‌రోడ్‌లోని క్రౌన్‌కేఫ్ వైపు మళ్లిస్తారు.
 
ముషీరాబాద్ క్రాస్ రోడ్ నుంచి వచ్చే వాహనాలను రాంనగర్ టీ జంక్షన్ మీదుగా మెట్రో కేఫ్ వైపు మళ్లిస్తారు.
     
 హిమాయత్‌నగర్ వై జంక్షన్ నుంచి నారాయణగూడ క్రాస్‌రోడ్‌కు వెళ్లే వాహనాలకు అనుమతి ఉండదు. వీటిని నేరుగా నారాయణగూడ ఫ్లైఓవర్ మీదుగా అనుమతిస్తారు.
     
 నారాయణగూడ క్రాస్‌రోడ్ వైపుకు ఎటువంటి వాహనాలకు అనుమతి ఉండదు.
     
 క్రౌన్‌కేఫ్ నుంచి నారాయణగూడ వైపు వచ్చే వాహనాలను నారాయణగూడ ఫ్లైఓవర్ మీదుగా అనుమతిస్తారు.
     
 నారాయణగూడ ఫ్లైఓవర్ కింద నుంచి హిమాయత్‌నగర్ వై జంక్షన్ వరకు అనుమతించరు.
     
 కింగ్‌కోఠి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వైఎంసీఏ సర్కిల్ వైపు వచ్చే వాహనాలను సిమెటరీ మీదుగా హిడెన్ గార్డెన్స్ వైపు మళ్లిస్తారు.     
 
 బర్కత్‌పుర చమాన్  నుంచి ఓఎంసీ వైపుకు వాహనాలకు అనుమతి ఉండదు. ఈ వాహనాలను ఓల్డ్ పోస్టాఫీస్ మీదుగా క్రౌన్ కేఫ్, కాచిగూడ క్రాస్‌రోడ్‌కు మళ్లిస్తారు.
     
 కవాడిగూడ క్రాస్‌రోడ్, రాగా టూల్స్ టీ జంక్షన్ మార్గంలో వాహనాలకు అనుమతి ఉండదు.  కర్బలా మైదానం నుంచి కవాడిగూడ క్రాస్ రోడ్ వైపుకు వాహనాల అనుమతి ఉండదు. వీటిని శైలింగ్ క్లబ్ టీ జంక్షన్ చిల్డ్రన్  పార్కు మీదుగా మళ్లిస్తారు.
     
 లోయర్ ట్యాంక్ బండ్ కట్టమైసమ్మ నుంచి వాహనాలను డీబీఆర్ మిల్స్ వద్ద అప్పర్‌ట్యాంక్‌బండ్ వైపు మళ్లిస్తారు.
      
 
 ర్యాలీ ఆర్‌పీ రోడ్‌కు రాగానే కర్బలా మైదానం నుంచి ఆర్‌పీ రోడ్ వెళ్లే వాహనాలను కర్బలా మైదానం క్రాస్ రోడ్ నుంచి రాణిగంజ్ ఎంజీ రోడ్‌వైపుకు ట్రాఫిక్ మళ్లిస్తారు.     
 
 అడవయ్య క్రాస్ రోడ్ వైపు వాహనాలకు అనుమతి ఉండదు. బైబిల్ హౌస్ నుంచి ట్యాంక్ బండ్ మీదుగా వచ్చే ఆర్టీసీ బస్సులు కర్బలా మై దానం నుంచి మినిస్టర్ రోడ్‌వైపు మళ్లిస్తారు.
     
 టివోలి క్రాస్ రోడ్ నుంచి బాలమ్‌రాయి వైపు వెళ్లే వాహనాలు గ్రూప్ బాండ్ క్రాస్ రోడ్ మస్తాన్ కేఫ్ డైమండ్ పాయింట్ వైపు మళ్లిస్తారు.     
 
 ఎన్‌సీసీ క్రాస్ రోడ్ నుంచి డైమండ్ పాయింట్ వెళ్లే వాహనాలను నార్నె ఎస్టేట్ పా యింట్ నుంచి కార్కాన బస్తీ వైపు మళ్లిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement