సంబరాల వేళ...సమస్యలు లేకుండా | Eve without problems if ... | Sakshi
Sakshi News home page

సంబరాల వేళ...సమస్యలు లేకుండా

Published Thu, Oct 2 2014 12:19 AM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM

Eve without problems if ...

  • నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
  •  సాయంత్రం 4 నుంచి 11.30 గంటల వరకూ అమలు
  • నాంపల్లి: బతుకమ్మ సంబరాలకు ఇబ్బంది కలుగకుండా నగరంలో గురువారం ట్రాఫిక్ ఆంక్షలు విధించామని ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ జితేందర్ తెలిపారు. సంబరాలు తిలకిం చేందుకు 5 వేల మంది ప్రముఖులు వస్తున్నారన్నారు. తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో   వివరాలను ఆయన వెల్లడించారు.  సాయంత్రం 4 నుంచి రాత్రి 11.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి.
     
     ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
     సికింద్రాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ పైకి వచ్చే వాహనాలు కర్బల మైదాన్ నుంచి దారి మళ్లి, బైబిల్ హౌస్, కవాడిగూడ, లోయర్ ట్యాంక్ బండ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
         
     కట్టమైసమ్మ, కవాడి గూడ నుంచి వాహనాలను ట్యాంక్‌బండ్ పైకి అనుమతించరు. వీటిని డీబీఆర్ మిల్స్ నుంచి కవాడిగూడ వైపు మళ్లిస్తారు.
         
     ఎక్బాల్‌మినార్ టవర్ నుంచి ట్యాంక్‌బండ్ పైకి వచ్చే వాహనాలను పాత సచివాలయ గేట్ వద్ద దారి మళ్లిస్తారు. ఇవి తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా కట్టమైసమ్మ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
         
     ఏఆర్ పెట్రోల్ పంప్ జంక్షన్ నుంచి వచ్చే వాహనాలను బీజేఆర్ విగ్రహం జంక్షన్ వైపు అనుమతించరు. ఈ వాహనాలు నాంపల్లి, రవింద్రభారతి వైపు మళ్లిస్తారు.
         
     ఆబిడ్స్ నుంచి వ చ్చే వాహనాలను బీజేఆర్ విగ్రహం, బషీర్‌బాగ్ జంక్షన్ వైపు అనుమతించరు. ఈ వాహనాలు గన్‌ఫౌండ్రి నుంచి దారి మళ్లించి చాపల్ రోడ్డు వైపు వెళ్లాల్సి ఉంటుంది.
         
     ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్ వై జంక్షన్ మీదుగా మళ్లిస్తారు.
         
     కింగ్‌కోఠి నుంచి భారతీయ విద్యాభవన్ మీదుగా బషీర్‌బాగ్‌కు వచ్చే వాహనాలను కింగ్‌కోఠి చౌరస్తా నుంచి తాజ్‌మహల్ వైపు మళ్లిస్తారు.
         
     ఓల్డ్ పీసీఆర్ నుంచి బషీర్‌బాగ్ జంక్షన్‌కు వచ్చే వాహనాలను పీసీఆర్ నుంచి నాంపల్లి రోడ్డు వైపు మళ్లిస్తారు.
         
     హిల్ఫ్‌ఫోర్ట్ నుంచి వాహనాలను బషీర్‌బాగ్ చౌరస్తా వైపు అనుమతించరు. వాటిని నాంపల్లి రోడ్డు వైపు మళ్లిస్తారు.
         
     హిమాయత్‌నగర్ వై జంక్షన్ నుంచి లిబర్టీ చౌరస్తాకు వెళ్లే వాహనాలను హిమాయత్‌నగర్ వై జంక్షన్ నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు మళ్లిస్తారు.
         
     పంజగుట్ట, రాజ్‌భవన్ నుంచి ఖైరతాబాద్ ఫ్లైవర్ మీదుగా వచ్చే వాహనాలను ఇందిరాగాంధీ విగ్రహం చౌరస్తా నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు అనుమతించరు.
         
     నల్లగుట్ట జంక్షన్ నుంచి బుద్ధభవన్ వరకు వాహనాలను అనుమతించరు.
         
     ఎల్బీ స్టేడియం నుంచి బషీర్‌బాగ్, అంబేద్కర్ విగ్రహం మీదుగా ట్యాంక్‌బండ్ వరకు వాహనాలను అనుమతించరు.
         
     ఇందిరా గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.
         
     తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి రామకష్ణ మఠం వరకు వాహనాలను అనుమతిస్తారు.
     
     బస్సులు నిలిపే స్థలాలు
     ఉత్తర మండలం నుంచి వచ్చే వారు బీజేఆర్ విగ్రహం వద్ద దిగాల్సి ఉంటుంది. బస్సు ఎన్టీఆర్ స్టేడియంలో పార్క్ చేయాలి.
         
     దక్షణ మండలం నుంచి వచ్చే వారు ఏఆర్ పెట్రోల్ పంప్ వద్ద దిగాల్సి ఉంటుంది. బస్సు ఎన్టీఆర్ స్టేడియంలో పార్క్ చేయాలి.
         
     పశ్చిమ మండలం నుంచి వచ్చేవారు అయకర్ భవన్ వద్ద బస్సు దిగాలి. బస్సు ఎన్టీఆర్ స్టేడియంలో పార్క్ చేయాలి.
         
     మధ్య, తూర్పు మండలాల నుంచి వచ్చే వారు నిజాం కళాశాల వద్ద బస్సు దిగాలి. బస్సు ఎన్టీఆర్ స్టేడియంలో పార్క్ చేయాలి
         
     వీరంతా ఎల్బీ స్టేడియంలోకి వెళ్లాలి.
     
     ర్యాలీ మార్గం
     అన్ని మండలాల నుంచి ఎల్బీ స్టేడియంకు చేరుకునే మహిళలు ర్యాలీగా ఎల్బీ స్టేడియం, బషీర్‌బాగ్, లిబర్టీ, అంబేద్కర్ విగ్రహం, అప్పర్ ట్యాంక్‌బండ్ మీదుగా చిల్ట్రన్ పార్క్‌కు చేరుకుంటారు. అక్కడ బతుకమ్మ ఆడిన తరువాత డీబీఆర్ మిల్స్, వార్త లైన్, ధర్నా చౌక్ మీదుగా ఎన్టీఆర్ స్టేడియంకు చేరుకొని, అక్కడ పార్క్ చేసిన బస్సులలో గమ్యస్థానాలకు తిరిగి వెళ్లాలి. అందరూ వారి టీమ్ లీడర్లసెల్‌నెంబర్లను తమ వద్ద ఉంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
     
     పార్కింగ్ ప్రదేశాలు
     బస్సులు ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఆగుతాయి.
         
     కార్ల కోసం డీబీఆర్ మిల్స్ సమీపంలోని మసీదు దగ్గర, ధోబీఘాట్‌లను కేటాయించారు. బతుకమ్మ వేడుకలకు హాజరయ్యే వారి కోసం ఎ,బి,సి కారు పాస్‌లను ఇచ్చినట్లు తెలిపారు. పాస్‌పై కేటాయించిన ప్రదేశాల్లో కార్లను పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement