సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల ఆత్మహత్యలపై డీజీపీ జితేందర్ స్పందించారు. ఈ ఏడాదే కాదు, ప్రతి సంవత్సరం ఏదో ఒక కారణంతో సూసైడ్ చేసుకుంటున్నారని డీజీపీ అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆర్థిక, వ్యక్తిగత ఇబ్బందులు, ఫ్యామిలీ సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. కొన్ని కేసుల్లో పని ఒత్తిడి వలన కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని డీజీపీ వెల్లడించారు. పోలీసులకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అల్లు అర్జున్ కేసు కోర్టు పరిధిలో ఉందని.. సమగ్ర విచారణ జరుగుతుందని డీజీపీ పేర్కొన్నారు.
క్రైమ్ రేట్‌పై వార్షిక నివేదికను విడుదల చేస్తూ.. ఈ ఏడాది కేసుల నమోదు పెరిగిందని డీజీపీ తెలిపారు. డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే పోలీసు శాఖ లక్ష్యమని.. మోసాలకు పాల్పడుతున్న 1800 వెబ్‌సైట్ యూఆర్‌ఎల్‌లను బ్లాక్ చేసినట్లు ఆయన చెప్పారు. కొత్త నేర చట్టాల అమలు కోసం పోలీసులకు శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్న డీజీపీ.. డిజిటల్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని తెలిపారు.
ఈ ఏడాది 33,618 సైబర్ క్రైమ్ కేసులను నమోదయ్యాయి.703 చోరీ, 58 దోపిడీ, 1,525 కిడ్నాప్, 856 హత్య, 2,945 లైంగిక దాడుల కేసులు నమోదు చేశాం. డయల్ 100కు 16,92,173 పిర్యాదులు వచ్చాయి. కొత్త చట్టం వచ్చిన తర్వాత 85,190 కేసులను నమోదు చేశాం. కొత్త చట్టం ప్రకారం సైబరాబాద్ పరిధిలో 15,360, హైదరాబాద్‌లో 10,501, రాచకొండలో 10,251 కేసులు నమోదయ్యాయి. సైబర్ క్రైం కేసుల్లో రూ.180 కోట్లను తిరిగి బాధితులకు అప్పగించాం. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 142.95 కోట్లు మాద్రకద్రవ్యాలను సీజ్ చేశాం. డ్రగ్స్ కేసుల్లో 4,682 మంది నిందితులను అరెస్టు చేశాం’’ అని డీజీపీ జితేందర్ వివరించారు.
‘‘ఇల్లిగల్ ప్రైవేట్ ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటాం. సోషల్ మీడియాపై ప్రత్యేక మానిటరింగ్ ఏర్పాటు చేశాం. సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పేరుతో సోషల్ మీడియా ప్రచారాలపై దర్యాప్తు చేస్తాం.. కేసులు పోలీసులు మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేస్తారు.. ప్రైవేట్ వ్యక్తులకు ఎవరికి సంబంధం ఉండదు’’ అని డీజీపీ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: నేరాల్లో మరో కోణం!
Comments
Please login to add a commentAdd a comment