సాక్షి,మహబూబ్‌నగర్:ఛత్తీస్‌గఢ్‌లో వరుసగా జరుగుతున్న ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో సరిహద్దులో గస్తీ పెంచామని, రాష్ట్రంలోకి మానోయిస్టుల చొరబాట్లు జరుగుతున్నాయన్న సమాచారం లేదని డీజీపీ జితేందర్ తెలిపారు. శుక్రవారం(జనవరి17) మహబూబ్‌నగర్ ఎస్పీ కార్యాలయంలో నేరాలపై సమీక్ష జరిపిన అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడారు.
‘అన్ని రకాల క్రైంపై సమీక్ష చేశాం. ప్రమాదాలు,నేరాల తగ్గుదల కోసం సూచనలు చేశాం. అఫ్జల్ గంజ్ కాల్పుల కేసులో కర్ణాటక,ఛత్తీస్‌గఢ్ పోలీసులతో కలిసి నేరస్తుల కోసం పనిచేస్తున్నాం. రోడ్డు ప్రమాదాలు నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.
కొత్త స్టేషన్‌ల ఏర్పాటే కాకుండా పాతవాటిని కూడా అప్ గ్రేడ్ చేయాలను కుంటున్నాం,రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్ డబ్బుల విడుదలకు వెంటనే చర్యలు తీసుకుంటాం’అని తెలిపారు. కాగా, గడిచిన కొన్ని నెలల్లో ఛత్తీస్‌గఢ్‌లో వరుస ఎన్‌కౌంటర్లు కలకలం రేపాయి. ఈ ఎన్‌కౌంటర్లలో మావోయిస్టులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోయినప్పటికీ పలువురు పోలీసులు కూడా మృత్యువాత పడ్డారు.
పోలీసులపై మావోయిస్టుల ప్రతీకార దాడులు కూడా పెరగడంతో వారి ప్రాబల్యం పెరిగిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పక్కనే ఉన్న తెలంగాణలోనూ మావోయిస్టులు మళ్లీ బలపడొచ్చన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో డీజిపీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇదీ చదవండి: అఫ్జల్‌గంజ్ టు ట్యాంక్‌బండ్ అలర్ట్.. బీదర్ ముఠా ఎక్కడ
Comments
Please login to add a commentAdd a comment