మహబూబ్‌నగర్ క్రైం: విధుల్లో ఉన్న ఓ ఏఆర్ కానిస్టేబుల్ గుండెపోటు రాగా.. ఆస్పత్రితో చికిత్స అందిస్తుండగానే మృతి చెందాడు. మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని మర్లులో నివాసం ఉంటూ హెడ్‌క్వార్టర్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న వెంకటేష్(50)కు సోమవారం ఎస్కాట్ డ్యూటీ పడింది.
ఈక్రమంలో సోమవారం ఉదయం ఎస్పీ కార్యాలయం నుంచి జిల్లా జైలుకు వెళ్లి అక్కడ ఖైదీలను వాహనంలో తీసుకుని కోర్టులో హాజరుపరిచి మళ్లీ మధ్యాహ్నం సమయంలో జైలులో ఖైదీలను అప్పగించి తిరిగి బయట వచ్చాడు. ఆ సమయంలో చాతీలో నొప్పి వస్తున్నట్లు వెంకటేష్ తోటి కానిస్టేబుల్స్‌కు చెప్పి కింద కూర్చుకున్నాడు. వెంటనే వారు చికిత్స కోసం జిల్లా జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
వైద్యులు సీపీఆర్ చేయడంతో పాటు చికిత్స అందిస్తున్న క్రమంలోనే మృతి చెందాడు. క్యాజువాలిటీలో ఉన్న వెంకటేష్ మృతదేహన్ని ఎస్పీ డి.జానకి పరిశీలించి కుటుంబసభ్యులను పరామర్శించారు. మృతుడు వెంకటేష్‌కు భార్య వనీత, ఇద్దరూ కొడుకులు అభినవ్, వర్షవర్ధన్‌లు ఉన్నారు. మృతదేహన్ని అతని స్వస్థలం సీసీకుంటకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment