
అనుమానాస్పదంగా యువకుడు మృతి
శరీర సున్నిత భాగాల్లో తీవ్ర గాయాలు
చిత్రహింసలు గురిచేశారని మృతుడి తల్లి అనుమానం
ఇద్దరిపై కేసు నమోదు
గద్వాల క్రైం: ట్రాన్స్‌జెండర్‌తో ప్రేమ వ్యవహారం చివరికి ప్రాణాల మీదకు తెచ్చింది. ట్రాన్స్‌జెండర్‌ను ప్రేమించి చివరకు పురుగుమందు తాగి బలవనర్మణానికి పాల్పడిన ఘటన గద్వాల జిల్లా కేంద్రంలో జరిగింది. మృతుడి తల్లి శంకుతుల, పట్టణ ఎస్‌ఐ కళ్యాణ్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు... గద్వాల పట్టణంలోని చింతలపేటకాలనీకి చెందిన బోయ నవీన్(25) అనే యువకుడు, ట్రాన్స్‌జెండర్(రవి అలియాస్ పల్లవి) ఇద్దరు స్నేహితులు. కాగా వారిద్దరు ఇటీవలే ప్రేమలో పడ్డారు. వారి ప్రేమకు గుర్తుగా నవీన్ తన చెస్ట్ (ఎడమ వైపు) ట్రాన్స్‌జెండర్ పల్లవి(రవి) టాటును సైతం వేయించుకున్నాడు.
ఇంతలో ఏం జరిగిందో కానీ మంగళవారం సాయంత్రం పురుగుమందు తాగి అపస్మారక స్థితికి చేరాడు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో గద్వాల జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు సిఫార్సు చేశారు. అక్కడ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రెండు రోజులుగా అందించినా పరిస్థితి మెరుగు పడకపోలేదు. చేసేదేమీ లేక గురువారం రాత్రి తిరిగి గద్వాల ప్రభుత్వాస్పత్రికి తీసుకు రాగా.. ఇక్కడే చికిత్స పొందుతూ మృతిచెందాడు.
కాగా ఈ విషయం ప్రస్తుతం గద్వాల జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే మృతుడి రెండు కాళ్లు, తోడలు, సున్నితమైన ప్రదేశాల్లో గాయాలు ఉన్నాయి. గాయాలను పరిశీలిస్తే వేడి చేసిన వస్తువుతో వాతలు పెట్టినట్లు ఎర్రగా కందిపోయి ఉన్నాయి. దీంతో మృతుడి తల్లి తన కుమారుడు పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోలేదని, చిత్రహింసలు పెట్టారని అనుమా నం వ్యక్తం చేసింది. ఈమేరకు ట్రాన్స్‌జెండర్ పల్లవి అలియాస్ రవి, నరేష్ పై ఆమె ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్‌ఐ కళ్యాణ్‌కుమార్ తెలిపారు.
పక్కా వ్యూహ రచనతోనే?
ట్రాన్స్‌జెండర్ (పల్లవి) రవి, నవీన్‌లు ఇద్దరూ గతంలో చింతలపేటకాలనీలోనే ఉండేవారు. కొన్నేళ్ల క్రితం రవి కాలనీ వదిలి వెళ్లిపోయి ట్రాన్స్‌జెండర్‌గా మారి పట్టణ శివారులో హమాలీ కాలనీలో సొంత ఇళ్లు కట్టుకున్నాడు. నవీన్ జిల్లాకేంద్రంలోని ఓ ఫైనాన్సియర్ వద్ద కలెక్షన్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవలే అతడి తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా కుటుంబ భారాన్ని మోస్తున్నాడు. ఈ క్రమంలో పల్లవితో నవీన్ ప్రేమలో పడ్డాడు.
ఈ నేపథ్యంలో పల్లవిని డబ్బులు యాచించేందుకు బయటికి వెళ్లొద్దని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు సమాచారం. ఈనెల 4న అర్ధరాత్రి వేళ నవీన్‌ను పల్లవి (రవి) తమ్ముడు నరేష్ ఇంటి వద్దకు వచ్చి స్కూటీపై ఎక్కించుకు వెళ్లిన వీడియో సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియోలు సైతం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో పక్కా వ్యూహరచనతోనే నవీన్‌ను చిత్రహింసలకు గురి చేసి హత్యచేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇరువురి మధ్య సంబంధాలపై ఆరా..
నవీన్ మృతిపై అతడి తల్లి శకుంతల ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేశాం. ఇరువురి మధ్య ఉన్న సంబంధాలపై ఆరా తీస్తాం. ట్రాన్స్‌జెండర్ పల్లవిపై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా అన్న కోణంలో విచారిస్తాం. ఈ నెల 4న జరిగిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుటాం.
– కళ్యాణ్‌కుమార్, పట్టణ ఎస్‌ఐ, గద్వాల
Mettuguda Incident: అంతా కట్టుకథేనా!
Comments
Please login to add a commentAdd a comment