love affairs
-
సెక్రటరీతో సహజీవనం.. అది భరించలేకే ఉరేసుకున్న హీరోయిన్ భర్త?
అందాల అభినయానికి నిలువెత్తు నిదర్శనం రేఖ. దక్షిణాది నుంచి వెళ్లి బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన రేఖ జీవితంలో ప్రేమకథలెన్నో ఉన్నాయి. పెళ్లైందని తెలిసి కూడా అమితాబ్ బచ్చన్‌ను ప్రేమించింది రేఖ. కానీ జయాబచ్చన్ కఠినంగా వ్యవహరించడంతో వీరి ప్రేమకు ఫుల్స్టాప్ పడింది. క్రికెటర్, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో కూడా ఆమె ప్రేమలో పడిందంటూ ఆ మధ్య ఓ పేపర్ క్లిప్ బాగా వైరలయింది. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారని, పెళ్లి చేసుకుంటారనుకునేలోపే విడిపోయారని అందులో రాసుకొచ్చారు. ఏడాది తిరగకముందే ఆత్మహత్య పెళ్లి కాకముందే రేఖ నుదుటన సింధూరం ధరించేది. వినోద్ మెహ్రాను సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందని, కానీ అతడితో సెట్ అవ్వకపోవడంతో తనకు దూరంగా వచ్చేసిందని కూడా ప్రచారం నడిచింది. సెలబ్రిటీలతో నడిపిన ఏ లవ్ స్టోరీకి మంచి క్లైమాక్స్ పడకపోవడంతో అవుట్సైడర్ను పెళ్లాడింది. నాలుగు పార్టీల్లో కలిసిన వ్యాపారవేత్త ముఖేశ్ అగర్వాల్ ‘మనం పెళ్లి చేసుకుందామా’ అని అడగడం, రేఖ సరేనని తలూపడంతో ఆగమేఘాల మీద పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన ఏడు నెలలకే రేఖ చున్నీతో ముఖేశ్ ఉరేసుకుని మరణించాడు. మహిళా సెక్రటరీతో ఎఫైర్ ఆ సమయంలో రేఖ నటించిన ‘శేష్నాగ్’ విడుదలైతే జనం పోస్టర్ల మీద పేడ కొట్టారు. రేఖ భర్త మరణానికి ఆమె తన సెక్రటరీయే ప్రపంచంగా బతకడమనే పుకార్లు కూడా పుట్టుకొచ్చాయి. ఇకపోతే రేఖ జీవిత కథను రచయిత యాజీర్ ఉస్మాన్ ఓ పుస్తకంగా తీసుకొచ్చాడు. ఇందులో రేఖకు తన మహిళా సెక్రటరీతో ఉన్న సంబంధాన్ని బట్టబయలు చేశాడు. ఎవరితో ఎంత చనువుగా ఉన్నా సరే రేఖ బెడ్రూమ్లోకి అడుగుపెట్టే స్వేచ్ఛ, అధికారం ఒక్క ఫర్జానాకు మాత్రమే ఉండేదట. ఈవిడ రేఖ దగ్గర వ్యక్తిగత సెక్రటరీగా పని చేసేది. ఫర్జానా ఏది చెప్తే అదే చేసేది రేఖ. వీరిద్దరూ మూడు దశాబ్దాలపాటు కలిసి పని చేశారు. ఆమె లేకుండా రేఖ బతకలేదా? రేఖ ఎంత పెద్ద హీరోయిన్ అయినా సరే, తన సెక్రటరీ అనుమతి లేనిదే ఒక్క అడుగు కూడా ముందుకు వేసేది కాదు. రేఖ భర్త ముఖేశ్ మరణానికి ఫర్జానాయే కారణమని సదరు పుస్తకంలో పరోక్షంగా ప్రస్తావించారు. 'రేఖకు ఫర్జానా సరైన జోడి. ఆమె తన స్నేహితురాలు, మద్దతురాలు.. తన ప్రపంచం. సింపుల్‌గా చెప్పాలంటే ఆమె లేకుండా రేఖ బతకలేదు' అని పుస్తకంలో పొందుపరిచారు. రేఖ ఆమెతో సహజీవనం చేసిందని అందరూ అంటుంటే.. తను మాత్రం ఆమెను సొంత సోదరిలా భావిస్తానని ఎప్పుడూ చెప్పుకొచ్చేది. చదవండి: నో అంటే నో అంతే.. ఇంక ఎక్కువ వాగద్దు.. విశ్వక్ ట్వీట్ బేబి డైరెక్టర్నుద్దేశించేనా? తమన్నాతో పెళ్లి.. ఇంట్లో ఒత్తిడి ఎక్కువైందన్న విజయ్ వర్మ -
పెళ్లి పీటలెక్కాల్సిన ప్రేమ జంట ఒకే చెట్టుకు ఉరికి వేలాడుతూ..
ప్రేమ అనేది కొందరికి మోదాన్ని పంచితే, మరెంతోమందికి ఖేదాన్ని కలిగిస్తోంది. తరచూ సంభవిస్తున్న అమానుష సంఘటనలే ఇందుకు రుజువులు. తాజాగా రాష్ట్రంలో మూడుచోట్ల దారుణాలు చోటుచేసుకున్నాయి. పెళ్లి పీటలెక్కాల్సిన ప్రేమ జంట ఒకే చెట్టుకు ఉరికి వేలాడారు. కుమారుడు ప్రేమించిన యువతితో వెళ్లిపోగా, యువతి కుటుంబం వేధింపులను తట్టుకోలేక అతని తల్లి, అన్న వదినలు ఉరి వేసుకున్నారు. ఇక దావణగెరెలో తను మనసుపడ్డ యువతికి మరెవరితోనో పెళ్లవుతోందనే ఈర్ష్యతో అమ్మాయిని రోడ్డు మీదే కసితీరా చంపాడో ప్రేమోన్మాది. సాక్షి, బెంగళూరు: చెట్టుకు ప్రేమ జంట ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి కారణం ఓ యువతి జోక్యం చేసుకోవడమే. ఈ ఘటన చిక్కమగళూరు తాలూకా మల్లందూరు సమీపంలోని కల్లుగుడ్డె గ్రామంలో జరిగింది. వివరాలు... కల్లుగుడ్డెకి చెందిన దర్శన్, హాసన్ జిల్లా సకలేశపుర తాలూకా హాన్‌బాళుకు చెందిన పూరి్వక ప్రేమించుకున్నారు. ఐదేళ్ల కిందట మంగళూరులో ఒక ఫ్యాక్టరీలో పని చేస్తున్న పూర్వికతో దర్శన్‌కు పరిచయమై ప్రేమగా మారింది. ఇద్దరి పెళ్లికి పెద్దలు కూడా అనుమతించారు. ఇంతలో ఒక యువతి తెరమీదకు వచ్చింది. ఈమెది కూడా దర్శన్ గ్రామమే. అతడు తనను ప్రేమించి గర్భవతిని చేశాడని నెలరోజుల కిందట మల్లందూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్శన్‌ను పిలిచి విచారించారు. ఈ సంగతి పూర్వికకు తెలియటంతో దర్శన్‌ను నిలదీసింది. మూడు రోజుల క్రితం మంగళూరు నుంచి దర్శన్ ఊరికి వచ్చిన పూర్విక అతనితో మాట్లాడింది. తాము చనిపోతున్నామని తల్లిదండ్రులకు మొబైల్లో వాయిస్ సందేశాన్ని పంపి బుధవారం ఆల్దూరు సమీపంలోని గుల్షన్‌పేట వద్దనున్న సత్తిహళ్లిలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మరో యువతి కేసు పెట్టడం వల్ల తమకు ఇక పెళ్లి కాదేమోనన్న ఆందోళనతో ప్రాణాలు తీసుకుని ఉండవచ్చని అనుమానాలున్నాయి. ఆల్దూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన జంట విగతజీవులుగా మారడంతో ఇరు గ్రామాల్లో విషాదం నెలకొంది. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన హావేరి తాలూకా అగడి గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. అగడికి చెందిన భారతి కమడొళ్లి (40), ఆమె కొడుకు కిరణ్ (28), కోడలు సౌజన్య (20) ఉరి వేసుకొని తనువు చాలించారు. సౌజన్య, కిరణ్‌లకు మూడు నెలల క్రితమే వివాహమైంది. అంతలోనే శవాలుగా మారారు. సమస్య ఏమిటంటే.. భారతి చిన్న కొడుకు అరుణ్ అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. ఇటీవల వారిద్దరూ ఊరి నుంచి వెళ్లిపోయారు. దీంతో యువతి కుటుంబసభ్యులు అరుణ్ ఇంటికి వచ్చి నానా గొడవ చేసేవారు. ఇది తట్టుకోలేక ముగ్గురూ ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. హావేరి రూరల్ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. ఉన్మాది చేతిలో యువతి దారుణ హత్య ప్రేమోన్మాది యువతిని పట్టపగలే దారుణంగా హత్య చేసిన ఘటన దావణగెరె నగరంలోని పీజీ లేఔట్ చర్చి రోడ్డులో జరిగింది. వినోబా నగరకు చెందిన చాంద్ సుల్తానా (24) హతురాలు. వివరాలు... 8 నెలల క్రితం హరిహరకు చెందిన యువకునితో ఆమెకు నిశి్చతార్తం జరిగింది. హరిహరకు చెందిన సాదిక్ అనే యువకుడు ఆమెను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలని వెంట పడేవాడు. ఆమె ససేమిరా అనడంతో హత్య చేయాలని నిర్ణయించాడు. గురువారం ఉదయం దావణగెరెకి వెళ్లాడు. ఆమె చర్చి రోడ్డులో స్కూటర్‌పై వెళ్తుండగా మాట్లాడాలని సాదిక్ అడ్డగించాడు. మాట్లాడుతూ ఉండగానే చాకు తీసి ఆమె గొంతులో పొడిచాడు. బాధితురాలు తీవ్ర గాయాలతో కుప్పకూలింది. హత్యోదంతం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. దుండగుడు అక్కడి నుంచి పరారై పురుగుల మందు తాగాడు. ప్రాణాపాయంలో ఉన్న అతన్ని పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. హత్యాస్థలిని ఎస్పీ సీబీ రిష్యంత్ పరిశీలించారు. పీజె నగర పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన స్థానికంగా భయాందోళన కలిగించింది. -
ఆరేళ్ల ప్రేమ వ్యవహరం.. ప్రియుడిపై ఫిర్యాదు
సాక్షి, తిరువళ్లూరు(తమిళనాడు): ప్రేమపేరిట గర్భవతిని చేసి పెళ్లికి నిరాకరించిన డీఎంకే నాయకుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత యువతి బుధవారం ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. వివరాలు.. పుదూర్‌కు చెందిన నివేద(23). స్థానిక డీఎంకే గ్రామ కార్యదర్శి మురుగన్‌తో ఆరు సంవత్సరాలుగా ప్రేమ వ్యవహరం నడిపింది, ఈ ఈమె ప్రస్తుతం మూడు నెలల గర్భవతి. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని బాధితురాలు కోరగా మురుగన్ నిరాకరించాడు. దీంతో నివేద బుధవారం ఎస్పీ వరుణ్‌కుమార్‌ను కలిసి సమస్యను విన్నవించింది. యువతికి న్యాయం చేయాలని ఎస్పీ మహిళా పోలీసులను ఆదేశించారు. చదవండి: కన్నా.. నీ వెంటే మేమూ.. కుమారుడి మృతితో భార్యతో పాటు డీఎంకే నేత ఆత్మహత్య -
టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం.. ప్రయోజకురాలవుతుందనుకుంటే..
జీవితం ఓ ప్రయాణం.. ఆటుపోట్లు.. కష్ట సుఖాలు కేనీడ వంటివి. ఒక్కక్షణం ఆలోచిస్తే సమస్యకు చక్కని పరిష్కారం దొరుకుతుందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నా... ఈ ప్రపంచంలో పరిష్కారంకాని సమస్య ఏదీ లేదని తత్వవేత్తలు బోధిస్తున్నా.. చాలామంది క్షణికావేశానికి లోనవుతున్నారు. బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అందమైన జీవితాలను అగ్నికి ఆహుతిచేస్తున్నారు. అయినవారికి ఆవేదన మిగుల్చుతున్నారు. జిల్లాలో మూడేళ్లలో సుమారు 654 మంది ఆత్మహత్యలకు పాల్పడడం అందరినీ ఆలోచింపజేస్తున్న అంశంగా మారింది. విద్యార్థిని ఆత్మహత్య గజపతినగరం: గజపతినగరం మండలం పిడిశీల గ్రామానికి చెందిన ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థిని ఉరివేసుకుని సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొండపల్లి మండలం శ్యామలవలస గ్రామానికి చెందిన తాడ్డి ఉష (18) తాతగారి గ్రామం అయిన పిడిశీలలో ఊంటూ చదువుతోంది. ఉష తల్లిదండ్రులు పార్వతి, రమణమూర్తిలు విజయనగరం మయూర జంక్షన్ సమీపంలో టిఫిన్ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఉషను గజపతినగరంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో చదివిస్తున్నారు. చక్కగా చదువుకుని ప్రయోజకురాలు అవుతుందని ఊహించారు. బైపీసీ గ్రూపును చదవలేక రెండురోజులుగా ఉష కళాశాలకు వెళ్లడం లేదు. మరి చదవలేనన్న బెంగతో మనస్థాపానికి గురై సోమవారం సాయంత్రం అమ్మమ్మ అప్పయ్యమ్మ పొలంపనికి వెళ్లే సమయంలో ఇంటి దూలానికి సున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పార్వతి, రమణమూర్తిలకు ఇద్దరు ఆడపిల్లలు. అందులో పెద్దమ్మాయి పావనికి వివాహం కాగా, ఉష ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉషను ప్రయోజకురాలిని చేయాలనే ఊరిని విడిచిపెట్టి కష్టపడుతున్నామని, ఇంతలో అఘాయిత్యానికి పాల్పడిందంటూ తల్లి బోరున విలపిస్తోంది. మృతురాలి అమ్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ రమేష్, ఎస్ఐ గంగరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. చదవండి: (భర్త లింగమార్పిడి.. మరొకరితో సహజీవనం.. అంతలోనే..) సాక్షి, విజయనగరం: ప్రేమ విఫలమైందని కొందరు.. భర్త, అత్తమామలు వేధించారని.. ఆరోగ్యం మరి కుదుటపడదని.. చదువుకోమని తల్లిదండ్రులు మందలించారని.. ఇలా.. చిన్నచిన్న కారణాలకే చాలామంది క్షణికావేశానికి గురవుతున్నారు. ప్రాణాలు తీసుకుంటున్నారు. పరిష్కరించుకోగలిగే చిన్నపాటి సమస్యలే అయినా ఆలోచించకుండా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఏటా వందలాది మంది ఆత్మహత్యలకు పాల్పడతుండం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న అంశం. పెద్దవారిలో పురుషులు ఎక్కువుగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పిల్లల్లో బాలికలు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు వైద్య గణాంకాలు చెబుతున్నాయి. మారిన వ్యవహారశైలి.. జీవన వ్యవహార శైలిలో చాలా మార్పులు వచ్చాయి. సాంకేతికత పెరుగుతున్నప్పటకీ మానవ సంబంధాలు, కుటుంబ విలువల గురించి నేటితరం పెద్దగా పట్టించుకోవడం లేదు. పూర్వ కాలంలో విలువలు పాటించేవారు. తగాదాలు అనేవి చాలా తక్కువుగా వచ్చేవి. ఆత్మహత్యలు కూడా అరుదు. ఉమ్మడి కుటుంబాలకు ప్రాధాన్యమిచ్చేవారు. 10 నుంచి 20 మంది వరకు ఒకే కుటుంబంగా కలిసి జీవించేవారు. కొంతమంది అయితే 30 నుంచి 40 మంది వరకు కలిసి ఉండేవారు. కుటుంబంలో ఏ చిన్న సమస్య వచ్చినా ఇంట్లోనే కూర్చొని పరిష్కరించుకునేవారు. చిన్నచిన్న గొడవలు వచ్చినా పోలీస్ స్టేషన్ గడప కూడా తొక్కేవారు కాదు. ప్రస్తుతం ఒంటరి జీవితాలకు అలవాటు పడుతున్నారు. భర్త, భార్య, పిల్లలు మాత్రమే ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో వారికి ఏది మంచి, ఏది చెడు అనేది చెప్పేవారు ఉండడం లేదు. భార్యాభర్తల మధ్య చిన్నపాటి వివాదం వచ్చినా గొడవ పెద్దది చేసుకోవడం, ఆత్మహత్యలకు పాల్పడడం చేస్తున్నారు. అధికశాతం మంది ఆత్మహత్యలకు కుటుంబ కలహాలే కారణంగా కనిపిస్తోంది. మనోధైర్యం లేని యువత బలవన్మరణాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. జీవితం తృణప్రాయంగా.. 2019 నుంచి 2021 అక్టోబర్ నెలఖారు నాటికి 654 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో పెద్దవారు 621 మంది కాగా, 16 ఏళ్లలోపు వారు 33 మంది. పెద్దవారిలో మగవారు 458 మంది కాగా మహిళలు 163 మంది ఉన్నారు. 16 ఏళ్లు లోపు వారిలో బాలురు 10 మంది, బాలికలు 23 మంది ఉన్నారు. కౌన్సెలింగ్ ఇప్పించాలి పిల్లలతో తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా ఉండాలి. మనోధైర్యం కోల్పోయిన వారికి సకాలంలో ఫ్యామిలీ సపోర్టు కావాలి. పిల్లలతో ఎక్కువసేపు గడపాలి. పిల్లలతో ప్రస్తుతం ఎక్కువుగా తల్లిదండ్రులు గడపడం లేదు. దీనివల్ల వారు స్నేహితులతో గడుపుతున్నారు. మంచి స్నేహం అయితే ఫర్వాలేదు. చెడు అలవాట్లు ఉన్నవారితో స్నేహం కుదిరితే చెడుమార్గంలో వెళ్తున్నారు. వివాహేతర సంబంధాలు, కుటుంబ తగాదాల వల్ల ఎక్కువుగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కౌన్సెలింగ్ సెంటర్ల ఆవశ్యకత ప్రస్తుతం ఎంతైనా ఉంది. మద్యం సేవించడం తగ్గించుకోవాలి. సకాలంలో కౌన్సెలింగ్ ఇచ్చి, మందులు వాడిస్తే ఆత్మహత్యల బారినుంచి కాపాడవచ్చు. – డాక్టర్ జాగరపు రమేష్, మానసిక వైద్యుడు, విజయనగరం సమస్యను ఎదుర్కొనే శక్తి లేకనే.. ఏదైనా సమస్య వస్తే దానిని ఎదుర్కోగలిగే శక్తి లేక మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అనారోగ్య సమస్యలున్న వారు వాటిని మంచి వైద్యుని దగ్గర చూపించుకుని వైద్యం చేయించుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. మానవజన్మ దేవుడిచ్చిన వరం. క్షణికావేశానికి లోనై ఆత్మహత్యలకు పాల్పడకూడదు. సమస్య వచ్చినప్పడు స్నేహితులకు, బంధువులకు చెప్పి పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి. మనసుకు బాధ కల్గినప్పుడు మనోధైర్యాన్ని కోల్పోరాదు. మానవ సంబంధాల గురించి నేటివారికి తెలియజేయాలి. – డాక్టర్ ఎస్వీ రమణకుమారి, డీఎంహెచ్ఓ ►విజయనగరానికి చెందిన కాకర్లపూడి అనిత అనే మహిళ ఎంవీజీఆర్ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. భర్త మందలించారన్న కారణంతో గతనెల 20న గంట్యాడ మండలం తాటిపూడి జలాశయంలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ►పార్వతీపురం పట్టణానికి చెందిన పిచ్చిక ప్రదీప్‌కుమార్ అనే యువకుడు మానసిక స్థితి బాగులేక ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ►జామి ఎస్సీ కాలనీకి చెందిన లక్ష్మి అనే మహిళ నెలరోజుల కిందట కడుపునొప్పి తాళలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ►మధ్యప్రదేశ్‌కు చెందిన సాహు అనే వ్యక్తి గంట్యాడ మండలంలోని కరకవలసగ్రామం సమీపంలో ఉన్న తోటలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ►పార్వతీపురం మండలానికి చెందిన సురేష్ అనే యువకుడు ప్రేమ విఫలమైందన్న మనస్థాపంతో పురుగుమందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. -
పెళ్లైన వ్యక్తితో ప్రేమ.. తల్లిదండ్రులు తిరస్కరించడంతో
యశవంతపుర: వివాహిత వ్యక్తితో యువతి ప్రేమాయణం ఇద్దరినీ బలిగొంది. ఈ దుర్ఘటన చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకా కోనికెరె గ్రామంలో జరిగింది. చెళ్లకెరె తాలూకా పరశురామపుర గ్రామానికి చెందిన తిప్పేస్వామి (32), హిరియూరు తాలూకా ఉడువళ్లివాసి పుష్పలత (21) ప్రేమికులు. తిప్పేస్వామికి ఇప్పటికే పెళ్లయి పిల్లలున్నారు. మూడేళ్ల నుంచి తిప్పేస్వామి ఆమెకు ప్రేమపేరుతో దగ్గరయ్యాడు. అతనితో వివాహం చేయాలని పుష్పలతా తల్లిదండ్రుల వద్ద పట్టుబట్టింది. తల్లిదండ్రులు తిరస్కరించడంతో మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. కోనికెరె వద్ద ప్రేయసీ ప్రియుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. హిరియూరు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ముగ్గురు యువతులతో ప్రియుడి డేటింగ్.. ట్విస్ట్ ఏంటంటే..
వాషింగ్టన్: ఈ మధ్యకాలంలో తరచుగా అబ్బాయిలు, అమ్మాయిలు ప్రేమ పేరుతో మోసపోతున్న సంఘటనలు చాలానే చోటు చేసుకుంటున్నాయి. అయితే, వీటి వెనుక అనేక కారణాలు ఉంటున్నాయి. కొన్ని చోట్ల ఒక యువకుడు.. ఇద్దరు, ముగ్గురు యువతులతో డేటింగ్ చేస్తుండగా.. మరికొన్ని చోట్ల యువతులు తామేమి తీసిపోనట్టు ఇదే విధంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో ఇలాంటి మోసాలు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా, యూఎస్‌కి చెందిన ఒక యువకుడు ఒకేసారి ముగ్గురు యువతులను మోసం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఈ సంఘటన బోయిస్లో జరిగింది. కాగా, బోయిస్ కు చెందిన మోర్గాన్ అనే యువకుడు.. బెకా కింగ్, అబిరాబర్ట్స్, టాబోర్ యువతులతో ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం నడిపాడు. కొంత కాలం ఇతగాడి మోసం బాగానే సాగింది. అయితే, కొన్ని రోజుల తర్వాత టాబోర్ అనే యువతి, తన ప్రియుడి మోసాన్ని గ్రహించింది. దీంతో ఈ బండారం కాస్త వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా తన చేదు అనుభవాన్ని సిఎన్ఎన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. టాబోర్ ఒక రోజు ఫేస్బుక్లో తన ప్రియుడు వేరే యువతితో కలిసి ఉన్న ఫోటోలను చూసింది. దీంతో ఆమె అనుమానంతో తన ప్రియుడి అకౌంట్‌ను తెరిచి చూసింది. ఆమెకు షాకింగ్ విషయాలు తెలిశాయి. అతను మరో యువతితో డేటింగ్ చేస్తున్నట్లు తెలుసుకుంది. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించింది. తాను ఎవరితో అయితే, జీవితం పంచుకోవాలనుకుందో.. అతను మోసం చేయడంతో తట్టుకోలేక పోయింది. దీంతో సదరు, ప్రియుడికి బుద్ధి చెప్పాలనుకుంది. అతని అకౌంట్‌ను మరింత పరిశీలించింది. అతనితో డేటింగ్లో బెకాసింగ్, రాబర్ట్స్అనే మరో ఇద్దరు యువతులు కూడా ఉన్నట్లు గుర్తించింది. అయితే, టాబోర్ వీరిని రహస్యంగా కలుసుకుంది. తన ప్రియుడి మోసం గురించి వారికి తెలియజేసింది. దీంతో అతని బండారం కాస్త బయటపడింది. ఒకరోజు మోర్గాన్, టాబోర్ను కలవటానికి వచ్చాడు. ఈ క్రమంలో వారంతా ఒక్కచోటికి చేరి అతగాడిని నిలదీశాడు. వారిని ఒక చోట చూసి అతను షాక్‌కు గురయ్యాడు. అయితే, అప్పటికి వారికి మాయమాటలు చెప్పాడానికి ప్రయత్నించాడు. ఆ ముగ్గురు యువతులు ప్రియుడికి బుద్ధి చెప్పారు. అతగాడి బారినుంచి తప్పించుకున్నారు. అతగాడు వీరినే కాకుండా, మరో ఆరుగురిని కూడా మోసం చేస్తున్నట్లు తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ఈ మోసం నుంచి బయటకు పడ్డాక.. బెకా కింగ్, అబిరాబర్ట్స్, మోర్గాన్ టాబోర్లు మంచి స్నేహితులుగా మారిపోయారు. ఈ మోసం నుంచి బయటపడాటానికి ఎక్కడికైనా విహార యాత్రకు వెళ్లాలనుకున్నారు. ఈ క్రమంలో వారు ముగ్గురు కూడా ఒక పాత బస్సు కొనుగోలు చేశారు. వారు దానికి కొన్ని మరమ్మత్తులు చేయించారు. ఆ తర్వాత వారి యాత్రను ప్రారంభించారు. దీనికి కొంత మంది దాతలు కూడా సహయం చేశారు. ఈ క్రమంలో వారు.. బోయిస్‌లోని సరస్సులు, గ్రాండ్ టెటన్ నేషనల్ పార్క్, ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ లను సందర్శించినట్లు తెలిపారు. ఇప్పుడు మేము చాలా ఆనందంగా ఉన్నాము. మా గతంలోని చేదు అనుభవాలను పూర్తిగా మరిచిపోయామని రాబర్ట్, బెకాసింగ్ తెలిపారు. అతనికి ప్రేమను పొందే హక్కులేదు. ఇప్పుడు తామంతా ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించామని టాబోర్ తెలియజేసింది. -
ప్రేమ హత్యలే అధికం!
సాక్షి, అమరావతి: దేశంలో అధిక శాతం హత్యలకు ప్రేమ వ్యవహారాలే కారణమవుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) వెల్లడించింది. ఎన్సీఆర్బీ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశంలో 28% హత్యలు ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాల వల్లే జరుగుతున్నాయి. 2001–2017 మధ్య కాలంలో జరిగిన హత్యలకు మూడో అతిపెద్ద కారణం ప్రేమ వ్యవహారాలే. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్రల్లో జరిగిన హత్యల్లో అత్యధిక శాతం ప్రేమ వ్యవహారాలవే ఉన్నాయి. ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రెండో స్థానంలో ప్రేమ హత్యలున్నాయి. 2001లో దేశవ్యాప్తంగా 36,202 హత్య కేసులు నమోదుకాగా, 2017లో 21 శాతం తగ్గి 28,653 కేసులు నమోదయ్యాయి. వ్యక్తిగత కక్షతో చేసే హత్యలు 4.3% తగ్గగా, ఆస్తి వివాదాల వల్ల జరిగే హత్యలు 12% తగ్గాయి. 2016లో 71 పరువు హత్య కేసులు నమోదు కాగా, 2017లో 92 కేసులు నమోదయ్యాయి. -
ప్రేమ హత్యలే అధికం!
సాక్షి, అమరావతి: దేశంలో అధిక శాతం హత్యలకు ప్రేమ వ్యవహారాలే కారణమవుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) వెల్లడించింది. ఎన్సీఆర్బీ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశంలో 28% హత్యలు ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాల వల్లే జరుగుతున్నాయి. 2001-2017 మధ్య కాలంలో జరిగిన హత్యలకు మూడో అతిపెద్ద కారణం ప్రేమ వ్యవహారాలే. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్రల్లో జరిగిన హత్యల్లో అత్యధిక శాతం ప్రేమ వ్యవహారాలవే ఉన్నాయి. ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రెండో స్థానంలో ప్రేమ హత్యలున్నాయి. 2001లో దేశవ్యాప్తంగా 36,202 హత్య కేసులు నమోదుకాగా, 2017లో 21% తగ్గి 28,653 కేసులు నమోదయ్యాయి. వ్యక్తిగత కక్షతో చేసే హత్యలు 4.3% తగ్గగా, ఆస్తి వివాదాల వల్ల జరిగే హత్యలు 12% తగ్గాయి. 2016లో 71 పరువు హత్య కేసులు నమోదు కాగా, 2017లో 92 కేసులు నమోదయ్యాయి. -
ఆ కారణంగానే ఎక్కువ హత్యలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రేమవ్యవహారాల వల్లే భారత్‌లో అత్యధిక హత్యలు జరుగుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) నివేదికల్లో వెల్లడైంది. ఎన్సీఆర్బీ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2001-2017 మధ్య కాలంలో జరిగిన హత్యలకు మూడవ అతిపెద్ద కారణం ప్రేమ వ్యవహారాలే. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్రల్లో జరిగిన హత్యల్లో అత్యధికంగా ప్రేమ వ్యవహారాలకు సంబంధించినవే. ఇక ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో రెండవ స్థానంలో ప్రేమవ్యవహార హత్యలు ఉన్నాయి. వీటిల్లో ఎక్కువగా వివాహేతర సంబంధాల వల్ల జరిగిన హత్యలే ఉన్నాయి. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం 2001లో దేశావ్యాప్తంగా 36,202 హత్య కేసులు నమోదు కాగా, 2017లో 21 శాతం తగ్గి 28,653 కేసులు నమోదు అయ్యాయి. ఇక వ్యక్తిగత కక్ష్యతో చేసే హత్యలు 4.3శాతం తగ్గాయి. ఆస్తి వివాదాల వల్ల జరిగే హత్యల సంఖ్య కూడా 12 శాతం తగ్గింది. ప్రేమ వ్యవహారాలు మరియు వివాహేతర సంబంధాల వల్లే 28శాతం హత్యలు జరుగుతున్నాయని వెల్లడైంది. 2016లో 71 పరువు హత్య కేసులు నమోదు కాగా, 2017లో 92 కేసులు నమోదు అయ్యాయి. -
ఆమె కోసం హత్య.. శవాన్ని సగమే పూడ్చి..
సాక్షి, చెన్నై : ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు యువకుల మధ్య ఏర్పడిన ఘర్షణ ఒకరి హత్యకు దారితీసింది. తిరువళ్లూరు జిల్లా ఎగువనల్లాటూరు గ్రామానికి చెందిన మహేష్‌కుమార్ (20) దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం ఇతడిని దారుణంగా హత్య చేసి చెరువులో పూడ్చే ప్రయత్నం చేశారు. సమీపంలోని పశువుల కాపర్లు గుర్తించడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. సగం మాత్రమే పూడ్చిన శవాన్ని పోలీసులు వెలికితీశారు. తిరువళ్లూరు తాలుకా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. హత్యకు గురైన మహేష్ కుమార్ సెల్‌ఫోన్ ఆధారంగా డేటా సేకరించిన పోలీసులు అనుమానితులు మణిబారతి, సుకుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో పలు అసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మనవాలనగర్‌కు చెందిన మణిబారతి అదే ప్రాంతానికి చెందిన యువతిని గత మూడు సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే అమ్మాయిని మహేష్‌కుమార్ సైతం ప్రేమిస్తున్నట్టు తెలుసుకున్న మణిభారతి పలు సార్లు మహేష్‌కుమార్‌ను హెచ్చరించినట్టు తెలుస్తుంది. అమ్మాయి కోసం ఇద్దరు యువకులు పలుమార్లు ఘర్షణ కూడా పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. మహేష్‌కుమార్ ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో అతడిని హత్య చేయాలని ప్రణాళిక రచించి స్నేహితుల సాయంతో హత్య చేసినట్టు మణిభారతి అంగీకరించారు. దీంతో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు మరో ఐదు మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు గాలస్తున్న విషయం తెలుసుకున్న నిందితులు అజిత్(18), శివలింగం(19) కార్తీక్(19) విఘ్నేష్(20) దినేష్(18) ఎగ్మోర్ కోర్టులో లొంగిపోయారు. నిందితులు సుకుమారన్, మణిభారతి -
యువతిని గర్భవతిని చేసి.. కానిస్టేబుల్ నిర్వాకం
సాక్షి, నెల్లూరు : యువతిని ప్రేమించి.. పెళ్లి పేరుతో మోసగించి గర్భవతిని చేసి.. మరో పెళ్లికి సిద్ధమైన ఓ కానిస్టేబుల్ బాగోతం ఇది. ప్రేమించిన వాడే తనతో పెళ్లికి నిరాకరిస్తుండటంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. మహిళా సంఘాలు ఆమెకు అండగా నిలిచాయి. ఈ ఘటన నెల్లూరు జిల్లా కావలిలో చోటుచేసుకుంది. వివరాలివి.. నెల్లూరు ఐదో నగర పోలీసు స్టేషన్లో సాయి కిరణ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతను-అనూష అనే యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని సాయికిరణ్ తనను నమ్మించి.. తనను గర్భవతిని చేశాడని బాధిత యువతి తెలిపారు. పెళ్లి విషయంలో ముఖం చాటేస్తూ వచ్చిన సాయికిరణ్ ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధమయ్యాడని, ఈ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో బాధిత యువతికి అండగా నిలిచిన మహిళా సంఘాలు.. పోలీస్‌శాఖలో పనిచేస్తున్న సాయికిరణ్‌పై సత్వరమే చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. -
ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని..
సాక్షి, యాదాద్రి : ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని ప్రియురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రామన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వీరమల్ల ప్రసన్న-రేపాక గణేష్‌లు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే గణేష్ వివాహానికి నిరాకరించడంతో.. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనను పోలీసులు అడ్డుకోవడంతో తృటిలో ప్రమాదం తప్పింది. -
మీ ప్రేమకు.. మా ప్రపోజ్
ప్రేమించడం అందరూ చేస్తారు.. కానీ ఆ ప్రేమను వ్యక్తపరిచేది మాత్రం కొందరే. ప్రేమించిన వ్యక్తితో మాట్లాడటానికి ఉండే సిగ్గు.. భయం.. మొహమాటం.. ఏమంటారో అనే సందేహం.. ఇలా ఏదైనా కావచ్చు.. కొన్ని ప్రేమలు చూపులతో ప్రారంభమై.. చూపులతోనే ఆగిపోతాయి. ఇలాంటి వారి కోసమే జపాన్‌లోని ‘కొకునావీ’ అనే కంపెనీ మేమున్నాం మీకోసం అంటోంది. మీ ప్రేమను మీ తరఫున మేము ప్రపోజ్ చేస్తామంటోంది. మీ ప్రేమ భావాలకు మరింత మెరుగులు దిద్ది.. కవితలుగా మార్చి మీరు ప్రేమించిన వారికి వ్యక్తపరుస్తామని చెబుతోంది. ఇదంతా చూస్తుంటే స్నేహితులకు ప్రేమ లేఖలు ఇచ్చి ప్రేయసి/ప్రియుడికి ఇవ్వమని పంపే విషయం గుర్తుకు వస్తుంది కదూ.. ఇది కూడా అలాంటిదే. కానీ ఇదంతా కొకునావీ ఊరికే ఏం చేయదు. కొంత చార్జ్ చేస్తుంది. ఇలా ప్రపోజ్ చేయడానికి 3 రకాల ప్యాకేజ్‌లు కూడా ఉన్నాయి వారి దగ్గర. తక్కువ ఖర్చుతో.. సింపుల్‌గా చెప్పాలనుకునే వారికి బేసిక్ ప్లాన్ సరిపోతుందట. ఇక ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు అనుకునేవారికి కొకునావీ సపోర్ట్ ప్లాన్ సరిగ్గా సూట్ అవుతుందని కంపెనీ చెబుతోంది. మరో ప్యాకేజ్ కూడా ఉంది. మీరు ఇష్టపడేవారు మిమ్మల్ని ఇష్టపడేలా చేసుకోవాలంటే ఈ ప్యాక్ తీసుకోవాల్సిందేనని చెబుతోంది. ఈ ప్యాక్‌లో భాగంగా ఎలా ప్రేమను ప్రపోజ్ చేస్తే ఇష్టపడతారు.. గతంలో లవ్ సక్సెస్ అయిన సందర్భాలు.. ప్రేమ లేఖలో ఎలాంటి కవితలు ఉండాలి.. తదితర విషయాలని డేటా ఎనాలసిస్ సాంకేతికతను ఉపయోగించి ఓ అందమైన ప్రపోజల్‌ను మీ ప్రేయసి/ప్రియుడి ముందు ఉంచుతారు. ఇప్పటికే కొకునావీ సహాయంతో చాలా మంది ఒక్కటయ్యారు. జపాన్‌లో ఈ పద్ధతి చాలా ప్రాచుర్యం పొందడంతో కంపెనీకి బాగా పేరొచ్చింది. -
ఎన్నాళ్లీ దారుణాలు!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. తెలిసీ తెలియని వయసులో...పరిపక్వత లేని ప్రేమలు విషాదంగా మారుతున్నాయి. కాచిగూడలో బుధవారం చోటు చేసుకున్న మధులిక ఉదంతం తీవ్ర కలకలం సృష్టించింది. మనిషికీ మనిషికీ మధ్య అనుబంధవారధిగా ఉండాల్సిన ప్రేమ ఇక్కడి ఆడపిల్లల జీవితాలను బలి తీసుకుంటుంది. ప్రేమ ముసుగులో మృగాళ్ల ఉన్మాదం రంకెలు వేస్తోంటే... అభంశుభం తెలియని ఎందరో అసువులు బాస్తున్నారు. ఓ జంట సహజీవనం చేయడానికి చట్టం ఎలాంటి అభ్యంతరం చెప్పదు. అయితే ఓ బాలికతో ఆమె ఇష్టపూర్వకంగానే శారీరకంగా కలిసినా... దాన్ని అత్యాచారంగానే పరిగణిస్తుంది. కామాంధుల చేతిలో పసి మొగ్గలు బలికాకుండా చూసేందుకు చేసిన కఠిన చట్టమిది. ప్రేమ పేరుతో రెచ్చిపోతున్న ఉన్మాదులు చేసే నేరాలపట్ల ఇదే తరహా స్పష్టమైన, కఠిన నిర్ణయాలు లేకపోవడంతో ఇవి నానాటికీ పెరిగిపోతున్నాయి. ఎందరో యువతులు, బాలికలు అకారణంగా బలవుతున్నారు. ఎందుకిలా..? పరిపక్వత లేని ప్రేమలే ఈ దారుణాలకు కారణం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జీవితం అంటే ఏమిటి? దాని విలువ ఏమిటి? అనేవి పూర్తిగా అవగతం కాని పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయిల్లో పుట్టే ఆకర్షణే దారుణాలకు దారి తీస్తోంది. తెలిసీ తెలియని వయసులో ఆకర్షణ–వ్యామోహంలో పడి దాన్నే ప్రేమగా భావిస్తున్నారు. ఆనక ఇద్దరిలో ఎవరో ఒకరు అసలు విషయాన్ని గుర్తించి జాగ్రత్తపడితే... రెండో వాళ్లు రెచ్చిపోతున్నారు. అయితే ఆత్మహత్య చేసుకోవడమో... లేదంటే హత్యకు తెగబడటమో జరుగుతోంది. ఒక్కో సందర్భంలో బెదిరింపులు, బ్లాక్ మెయిల్, దాడులకు పాల్పడి కటకటాల్లోకీ చేరి జీవితాన్ని బలి చేసుకుంటున్నారు. ఆడపిల్లలపై ప్రేమ పేరుతో ఉన్మాదులు కత్తులతోనే, యాసిడ్‌తోనే దాడులకు తెగబడినప్పుడల్లా... ‘నేరగాళ్లను కఠినంగా శిక్షిస్తాం. ఇటువంటివి పునరావృతం కాకుండా చూస్తాం’ అంటూ గంభీరంగా ప్రకటించే అధికార యంత్రాంగం, పాలకుల హామీలు ‘అవినీతిపై కఠినంగా వ్యవహరిస్తున్న’ చందంగానే మారిపోయాయి. నగరంలోనే కాదు... రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ఈ తరహా ఉదంతం ఒక్కటి జరిగితే చాలు పోలీసులు ‘అత్యంత అప్రమత్తం’ అవుతారు. పోకిరీలు, ప్రేమోన్మాదులను కట్టడి చేయడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామంటూ ఉదరగొడతారు. ఏదైనా ఉదంతం జరిగినప్పుడు కేసు నమోదు చేసినా... ఇది దర్యాప్తు పూర్తి చేసుకుని, న్యాయస్థానంలో విచారణ పూర్తయి, దోషులకు శిక్ష పడటం పెద్ద ప్రహసనంగా మారిపోయింది. ఈలోపు బాధిత కుటుంబాల్లో ‘పోరాడే’ (ఆ)శక్తి సన్నగిల్లిపోతోంది. ఇవన్నీ ఈ ఉన్మాదులు రెచ్చిపోవడానికి కారణాలుగా మారుతున్నాయి. మరోవైపు చట్టాల్లోని లోసుగులూ నిందితుల్లో భయం లేకుండా చేస్తున్నాయి. అటకెక్కిన యువజన విధానం... సమాజంలో మహిళలకు గల సమున్నత స్థానం, వారి హక్కులను యువకులకు, ముఖ్యంగా ఇప్పుడిప్పుడే యవ్వనంలో అడుగిడుతున్న యువతకు క్షుణ్ణంగా బోధించాలన్న ఉద్దేశంతో రూపొందినదే జాతీయ యువజన వి«ధానం. మహిళలపట్ల యువజనులు గౌరవంగా మసలుకొనేలా వారికి అవసరమైన కౌన్సెలింగ్ ఇవ్వాలని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఆ లక్ష్యాలు నెరవేరేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకున్న దాఖలాలే లేవు. యువజనులను 13–19, 20–35 ఏళ్ల మధ్య వయస్సు గల వారిగా రెండు గ్రూపులుగా యువజన విధానంలో విభజించారు. యవ్వన దశలో కీలకమైన 13–19 ఏళ్ల మ«ధ్య వయస్కులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని అందులో నిర్దేశించారు. ప్రేమోన్మాదులు, వారి బారినపడుతున్న వారిలో అత్యధికులు ఈ పాతికేళ్లలోపు వారే. జాతీయ యువజన విధానంలో పొందుపరిచిన విధంగా ఇక్కడి సమాజంలో స్త్రీల స్థానం, వారికి గల హక్కులపై మగపిల్లలకు చక్కని అవగాహన కల్పించడంలో కానీ, మహిళల పట్ల గౌరవంగా మసలుకొనేలా కౌన్సెలింగ్ చేయడంలో కానీ ప్రభుత్వాలు ఎంతటి ‘చిత్తశుద్ధిని’ చూపిస్తున్నాయో తెలుస్తూనే ఉంది. ఇకనైనా పాలకులకు పట్టేనా? అభంశుభం తెలియకుండానే మృత్యువుతో పోరాడుతున్న మధులిక ఉదంతమైనా యంత్రాంగాల కళ్లు తెరిపించాలి. దీన్ని ఓ గుణపాఠంగా తీసుకుని వీరి రక్షణకు నడుంబిగించాలి. జాతీయ యువజన విధానాన్ని అమలులో పెట్టడానికి అవసరమైన చర్యలు ప్రారంభించాలి. చట్టాలకు పదును పెట్టడంతో పాటు మహిళలు, బాలికలపై జరిగే అకృత్యాలు, ఉన్మాదుల దాడులను తీవ్రంగా పరిగణించాలి. బాధితులకు కోర్టుల చుట్టూ తిరిగే బాధలు తప్పిస్తూ... ఈ కేసులపై తక్షణ విచారణ చేపట్టాలి. దీని కోసం తక్షణం సంస్కరణలు అనివార్యం. జ్యోతిర్మయి కేసులో బర్మింగ్‌హామ్ పోలీసులు చూపించిన చొరవను అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. దోషులకు వీలైనంత త్వరగా శిక్షలు పడేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. అప్పటికి కానీ నగరంలో మరో మధులిక ఉదంతం చోటు చేసుకోకుండా ఉంటుంది. పెద్దల పర్యవేక్షణ కీలకం యుక్త వయస్సు వచ్చిన పిల్లల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక్కసారిగా స్వేచ్ఛ వస్తుంది. ఆ సమయంలో వారిపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం యాంత్రిక జీవితంలో కేవలం ఉన్నత కుటుంబాలకే కాదు... మధ్య తరగతి వారిలోనూ పిల్లలపై శ్రద్ధ తగ్గింది. ఫలితంగా పిల్లలకు ఎక్కడ లేని స్వేచ్ఛ వచ్చి పడుతోంది. దాంతో యుక్తవయస్సు రాగానే పెడదారులు పడుతున్నారు. ప్రేమ వ్యామోహంలో పడుతున్నారు. ఇవే సినిమా–టీవీల ప్రభావంతో ఒక్కోసారి హద్దులు దారుణాలకు దారి తీస్తున్నాయి. మరోపక్క విద్యాసంస్థలు, కాలేజీల యాజమాన్యాలకు విద్యార్థుల బాగోగులు పట్టించుకునే, వారికి జీవితం విలువ తెలియజెప్పే తీరిక లేకుండా పోయింది. అనునిత్యం వీరి దృష్టి అంతా పరీక్షలు, ర్యాంకుల పైనే. జీవిత ప్రస్థానంలో కీలకమైన యుక్తవయస్సులో యువతీయువకులపై పర్యవేక్షణకొరవడి దారితప్పుతున్నారు. – రాజశేఖర్, మానసిక నిపుణులు ‘మచ్చ’తునకలు.. ♦ రాజేంద్రనగర్ పరిధిలో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య చదివే అనురాధపై యాసిడ్ దాడికి పాల్పడింది ఆమెకు సీనియరే. ఈ ఉదంతం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ♦ దిల్సుఖ్నగర్ ప్రాంతంలో భార్గవి యాదవ్ బలైంది. ప్రేమ పేరుతో ఆమెను అనునిత్యం వేధింపులకు గురిచేస్తున్న సంతోష్ ఒకరోజు రెచ్చిపోయాడు. కళాశాల నుంచి తిరిగి వస్తున్న భార్గవిని సరూర్‌నగర్‌లోని ఆమె ఇంటి సమీపంలోనే అత్యంత దారుణంగా హతమార్చాడు. ♦ కార్వాన్ ప్రాంతంలో వివాహిత రాణి వెంటపడిన కామాంధుడు కన్నయ్య సింగ్ ప్రేమ పేరుతో తీవ్రంగా వేధించాడు. ఎప్పటికీ ఆమె మాట వినట్లేదని క„ý కట్టి కత్తితో దాడి చేశాడు. ♦ స్వాతి అనే యువతిపై బంజారాహిల్స్ పరిధిలో ఓ ప్రేమోన్మాది విరుచుకుపడ్డాడు. ఆమె బంధువుతో సహా సజీవ దహనం చేయాలని ప్రయత్నించాడు. ♦ వర్థమాన నటి భార్గవిని ఉన్మాదిగా మారిన ప్రవీణ్‌కుమార్ హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ♦ బాలానగర్ ప్రాంతంలో అరుణ అనే బాలికపై ఆమె సమీప బంధువు శివశంకర్‌రెడ్డి దాడి చేసి హత్య చేశాడు. ♦ మీర్‌పేటలో ఉన్న టీఆర్ఆర్ కాలేజీలో లావణ్య అనే విద్యార్థినిపై ఓ మృగాడు దాడి చేశాడు. -
ఆమె అంగడి బొమ్మ?
నిమేష్ బక్షి (23)అనే యువకుడు ఓ యువతితో ప్రేమాయణం సాగించాడు. కొంతకాలానికి ఇద్దరూ విడిపోయారు. తనతో సన్నిహితంగా ఉన్నపుడు తీసిన ఆమె ఫోటోలను అతడు అశ్లీల వెబ్సైట్లలో పోస్ట్ చేశాడు. బాధితురాలి ఇంట్లో గగ్గోలు చెలరేగింది. నిందితునిపై కేసు నమోదై జైలు శిక్ష పడింది. ఇద్దరూ ప్రైవేటు రంగంలో ఉన్నతోద్యోగులు. భర్త వేధింపులు తట్టుకోలేక భార్య కొన్నినెలలుగా దూరంగా ఉంటోంది. దీంతో అతనిలోని సైకో నిద్రలేచాడు. ఆమె ఫోటోలను నెట్లో పోస్ట్ చేసి అసభ్య రాతలతో పాటు ఫోన్ నెంబర్ కూడా పెట్టాడు. దీంతో బాధితురాలికి నరకం మొదలైంది. ఆ ఘరానా భర్త కటకటాల పాలయ్యాడు. ఇలాంటి కేసులు ఈ రెండే కాదు... ఎన్నో ఉన్నాయి. అప్పటివరకు సాగిన బంధంలో పొరపొచ్ఛాలు రాగానే కథ మలుపు తిరుగుతుంది. భర్తలు/ ప్రియులు తమ భాగస్వాముల పర్సనల్ ఫోటోలను నెట్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతుంటారు. ఐటీ రంగానికి పేరుపొందిన బెంగళూరులో కొంతకాలంగా ఈ ఇలాంటి పెడధోరణలు ప్రబలుతున్నాయి. బొమ్మనహళ్లి: టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతున్నదో, నేరాలు కూడా అంతే వేగంగా విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం నగరంలో అశ్లీల ప్రతీకారం (రివెంజ్ పోర్న్) కేసుల సంఖ్య పెరుగుతుండడం పోలీసులను కలవరపెడుతోంది. విడాకులు తీసుకున్న భార్యలు, ప్రేమ వికటించి దూరమైన ప్రియురాళ్లు వీటి బారిన పడి మానసిక క్షోభకు గురవుతున్నారు. కొందరూ ఆత్మహత్యలకూ పాల్పడుతున్నారు. ఇటీవల నగరానికి చెందిన ఓ వ్యక్తి తన మాజీ భార్య చిత్రాన్ని మార్ఫింగ్ చేసి ఒక అశ్లీల వెబ్సైట్లో పెట్టాడు. ఆమె ఫోన్‌కు పదపదే అపరిచితులు ఫోన్లు చేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఖాకీలు మాజీ భర్తను కటకటాల వెనక్కు పంపారు. మాజీ ప్రియురాళ్లకు సంబంధించి అశ్లీల చిత్రాలను ఇలా పోస్ట్ చేయడం లాంటి సంఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయని పోలీసులు చెబుతున్నారు. సొంత కుటుంబం లేదా సమాజం నుంచి చీత్కారాలను ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో చాలా మంది యువతులు లేదా మహిళలు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. సిలికాన్ సిటీలో ఇలాంటి కేసులు ప్రతి నెలా పదుల సంఖ్యలో నమోదవుతున్నాయి. అది మానసిక రుగ్మతే అశ్లీల చిత్రాలను పోర్న్ సైట్లలో పెట్టడం మానసిక వికృతత్వంలో ఒక భాగమని మానసిక నిపుణులు చెబుతున్నారు. సాంకేతిక పురోగతి.... గిట్టనివారి పరువు తీయడాన్ని సులభతరం చేసిందని సీనియర్ వైద్య నిపుణుడు డాక్టర్ రోషన్ జైన్ తెలిపారు. వదంతులు, అబద్ధాలు, శృంగార చిత్రాలను విశ్వవ్యాప్తం చేయడం కూడా ఇప్పుడు చాలా తేలికగా మారిందని పేర్కొన్నారు. దీని వల్ల బాధితులు తీవ్ర మానసిక అస్వస్థతకు లోనవుతారని, ఈ చిత్రాలతో కుటుంబంలో రేకెత్తే గొడవల వల్ల కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పురుషులకు సంబంధించి బాల్యంలో లేదా పెద్దయ్యాక ఉండే మానసిక రుగ్మతలు కొందరిని ఇలా పెడదారి పట్టిస్తుంటాయని ఆయన పేర్కొన్నారు. తక్షణం పోలీసులను సంప్రదించాలి ఇలాంటి ఉచ్చులో చిక్కుకున్న మహిళలు ఏ మాత్రం సంకోచించకుండా వెంటనే తమను సంప్రదించాలని సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు. పోలీసుల దగ్గరకు వెళితే తమ పరువు పోతుందనో మరే ఇతర భయాల వల్లనో అనేకమంది బాధిత మహిళలు తమకు ఫిర్యాదు చేయడానికి జంకుతుంటారని పేర్కొన్నారు. ఇలాంటి కేసుల్లో పోలీసులు పూర్తి గోప్యతను పాటిస్తారని, మహిళలు భయపడాల్సిన అవసరం లేదని నగర పోలీసు కమిషనర్ టీ. సునీల్ కుమార్ తెలిపారు. బాధిత మహిళలు ఫిర్యాదు చేయకపోతే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వ్యక్తులు మరితంగా చెలరేగిపోతారని, చట్టమంటే కూడా భయం లేకుండా తమ పని సాగిస్తూనే ఉంటారని ఆయన హెచ్చరించారు.– సునీల్‌కుమార్, పోలీస్ కమిషనర్ దొరికిపోతారు జాగ్రత్త చెత్త పోస్ట్‌లు పెట్టేవారు దొరక్కుండా పోరు. ఆన్లైన్లో రివెంజ్ పోర్న్‌లను పోస్ట్ చేసే వారిని, వారి కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ ఐపీ అడ్రస్ ద్వారా పోలీసులు పట్టుకోగలుగుతున్నారు. తమను ఎవరూ ఏమీ చేయలేరని ఇలాంటి పనులు చేసిన ఎంతోమంది విద్యావంతులు, యువత జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుని మగ్గిపోతున్నారు. ఇలాంటి నేరాల్లో కనిష్టంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. -
మౌనికకు న్యాయం జరిగేనా?
దండేపల్లి(మంచిర్యాల) : పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు, ఏడాది కాలంగా ప్రేమించి గర్భవతిని చేశాడు. ఇక పెళ్లి విషయం అడిగితే పెళ్లి లేదు ఏమీ లేదంటూ, తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ, యువతి గత కొద్ది రోజుల క్రితం ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించింది. ఆ తర్వాత ఆమె పోలీసు, రెవెన్యూ, ఐకేపీ అధికారులను కలిసింది. అయినా ఆమెకు ఎలాంటి న్యాయం జరగలేదు. దీంతో ఆమె మళ్లీ ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించింది. మండలంలోని గుడిరేవుకు చెందిన జంగిల్ శ్రావణ్ ఇదే గ్రామానికి మౌనిక అనే యువతిపై కన్నేశాడు. కొద్ది రోజులు ఆమె వెంటపడ్డాడు. ఏంటీ నావెంట పడుతున్నావని ఆమె అడిగితే పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. దీంతో ఆమె అతడి మాటలు నమ్మింది. ఏడాది కాలంగా ఇద్దరూ ప్రేమించుకున్నారు. యువతి అప్పుడప్పుడు శ్రావణ్ వాళ్ల ఇంటికి కూడా వచ్చి ఇంటి పనులు చేసేది. దీంతో వీరిద్దరి ప్రేమ విషయం అతడి తల్లికి కూడా తెలిసింది. ఇంతలో యువతి గర్భం దాల్చింది. విషయం అతడికి చెప్పడంతో గర్భం తీయించుకోవాలని శ్రావణ్ ఆమెను ఒత్తిడి చేసి చేయి చేసుకున్నాడు. ఇలా జరిగిన తర్వాత కొద్ది రోజులు ఆమె వద్దకు రాకుండా తప్పించుకు తిరిగాడు. ఓ రోజు గ్రామ సమీపంలో అడ్డుకుని నా పరిస్థితి ఏంటని ఆమె నిలదీసింది. పెళ్లి చేసుకోనని శ్రావణ్ చెప్పడంతో గ్రామ పెద్దలను ఆశ్రయించింది. గత నెల 17న ప్రియుడి ఇంటి ముందు పురుగుల మందు డబ్బా పట్టుకుని తల్లిదండ్రుతో కలిసి బైఠాయించింది. స్థానికుల సలహాతో పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది. తహసీల్దార్, ఐకేపీ ఏపీఎంతో పాటు మహిళా సంఘాలను కలిసి తన గోడు వెల్లబోసుకుంది. పోలీసులు కూడా యువకుడిని పిలిపించి కౌన్సిలింగ్ చేశారు. అయినా అతను పెళ్లికి ఒప్పుకోలేదు. ఆతర్వాత అధికారులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. దీంతో సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. శనివారం మళ్లీ ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించింది. ఆమె బైఠాయించడం చూసిన ప్రియుడి తల్లి ఇంటికి తాళం వేసి వెళ్లి పోయింది. యువతికి స్థానిక సర్పంచ్ మంజుభార్గవి, గ్రామానికి చెందిన పలువురు మహిళలు మద్దతుగా నిలిచారు. -
లవ్.. బ్రేకప్.. ప్యాచప్...
‘ప్రేమలో ఉండకుండా ఉండలేరెవ్వరూ..’ అని ఏ కవో ఎక్కడో చెప్పే ఉంటాడు. అలాగే ఉంటాయి ప్రేమకథలు. కొన్ని అప్పుడప్పుడే చూసుకుంటున్న ప్రేమలు. కొన్ని చేతులందుకున్న ప్రేమలు. కొన్ని చెయ్యి జారిన ప్రేమలు. కొన్ని జారవిడిచిన చెయ్యిని మళ్లీ అంది పట్టుకున్న ప్రేమలు. అవి ఏ కథలైనా ప్రేమకు అటో.. ఇటో.. ఉంటూనే ఉండడమే మ్యాజిక్. హాలీవుడ్లో ఇప్పుడు ఇలా అటూ, ఇటూ, ఆ మధ్యలో కొట్టుకుంటున్న కొన్ని ప్రేమకథలను చూద్దాం... దాచేదేముంది.. ప్రేమే ఎమ్మా వాట్సన్ కథ ఇలా ఉంటే, మరో స్టార్ హీరోయిన్ టేలర్ స్విఫ్ట్ మాత్రం ‘దాచడానికి ఏముంది? ప్రేమేగా!’ అంటూ బాయ్‌ఫ్రెండ్ జాయ్ అల్విన్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తోంది. టేలర్ షూటింగ్‌తో బిజీగా ఉన్నప్పుడు, ఒకవేళ జాయ్ ఖాళీగా ఉంటే ఆమెతో పాటు షూటింగ్స్‌కు వెళ్లిపోతున్నాడు. ఇద్దరూ ఒకరి టైమింగ్స్, షెడ్యూల్స్ ప్రకారం ఇంకొకరు అడ్జస్ట్ అయిపోతూ, ప్రేమలో పడిన కొత్తల్లో, దూరం ఉండలేని ఒక ఫీలింగ్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హాలీవుడ్లో ఇప్పుడున్న హాట్ కపుల్స్‌లో వీళ్లూ టాప్ ప్లేసెస్‌లోనే ఉంటున్నారు. టేలర్ స్విఫ్ట్, జాయ్ అల్విన్ వాళ్లు విడిపోయారు మార్చి 4న ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆస్కార్ అవార్డు ఫంక్షన్లో ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ది షేప్ ఆఫ్ వాటర్’ బెస్ట్ పిక్చర్ అవార్డు అందుకుంది. అదే ఫంక్షన్లో ఆయన బెస్ట్ డైరెక్టర్‌గా కూడా అవార్డు అందుకున్నాడు. ఆయనే గెలెర్మో డెల్‌టోరో. ఆరోజుకు సరిగ్గా ఏడాది క్రితం తన జీవితంలో జరిగిన ఓ కీలక విషయాన్ని మాత్రం ఆయన ఆరోజు తర్వాతిరోజు వరకూ దాచాడు. అదే.. భార్య లొరెంజో న్యూటన్తో వేరు పడడం. ముప్పై ఏళ్ల తమ బంధానికి గతేడాది ఫిబ్రవరిలో బ్రేకప్ చెప్పుకున్నారు గెలెర్మో, న్యూటన్. అయితే ఆ విషయాన్ని ఆస్కార్ అందుకున్న రోజు వరకూ ప్రపంచానికి చెప్పలేదు గెలెర్మో. ఆయన వయస్సు ఇప్పుడు 53 సంవత్సరాలు. లొరెంజో న్యూటన్, గెలెర్మో డెల్‌టోరో వీళ్లు మళ్లీ కలిసిపోయారు ఈ దశాబ్దంలో హాలీవుడ్లో హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్స్‌లో ఒకరైన జెన్నిఫర్ లారెన్స్ ప్రేమకథలు ఎప్పటికప్పుడు కొత్త మలుపులు తీసుకుంటాయి. ‘‘నా లైఫ్‌లో బెస్ట్ రొమాన్స్ ఎప్పుడూ చూడలేదు. నాకది ఇష్టం లేదేమో కూడా!’’ అంటుందామె. 2014కు ముందువరకూ నికోలస్ హౌల్ట్తో పీకల్లోతు ప్రేమలో ఉన్న లారెన్స్, కొన్ని అనుకోని పరిస్థితుల్లో అతనికి బ్రేకప్ చెప్పేసింది. అయితే తాజాగా ఈ జంట మళ్లీ కలిసిపోయింది. ఇప్పుడు కొత్తగా పాత రొమాన్స్‌ను తలుచుకుంటూ మళ్లీ ప్రేమలో పడిపోతోంది. ఈ ప్రేమ జంట మళ్లీ పూర్తిగా కలిసిపోతే మాత్రం, ఇద్దరూ ప్రేమను వెతుక్కుంటూ ఒకే దగ్గర ఆగారని చెప్పుకోవచ్చు. జెన్నీఫర్ లారెన్స్, నికోలస్ హౌల్ట్ లవ్వా? అదేం లేదే ‘‘నేనంటూ ప్రేమలో ఉంటే అది నా పర్సనల్ విషయం. బయటకు అస్సలు చెప్పను. నాకు నచ్చదు.’’ అంది ఎమ్మా వాట్సన్ ఒక ఇంటర్వ్యూలో. ఈ హ్యారీపాటర్ స్టార్‌కు ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. సో, ప్రేమలో ఉంటే ఎలాగూ చెప్పనని ముందే చెప్పింది కాబట్టి, ఎమ్మా ప్రేమకథ ఏదైనా ఉంటే అది అఫీషియలా కాదా ఎవ్వరూ చెప్పలేరు. తాజాగా ఎమ్మా వాట్సన్ ఆస్కార్ పార్టీలో కోర్డ్ ఓవర్స్ట్రీట్తో కనిపించింది. మరో రెండు పార్టీల్లోనూ ఈ జంటే కలర్ఫుల్గా కనిపించింది. ఈ ఫొటోలు, వీళ్లిద్దరు కలిసి ఉండడం చూసి కోర్డ్తో ఆమె ప్రేమలో ఉందనుకున్నారంతా. కాకపోతే, కోర్డ్ తనకు ‘జస్ట్ ఫ్రెండ్’ అని చెబుతోందట ఎమ్మా. వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని, ఇంకా అఫీషియల్‌గా ప్రేమలో అయితే పడలేదని హాలీవుడ్ సమాచారం. మరి ఇష్టపడుతున్నారంటే, త్వరలోనే ప్రేమలోనూ పడొచ్చైతే.. చూడాలి! ఎమ్మా వాట్సన్, కోర్డ్ ఓవర్ స్ట్రీట్ అటో.. ఇటో.. ఎటో.. అన్ని ప్రేమకథలదీ ఒక ఎత్తు. జస్టిన్ బీబర్, సెలెనా గోమేజ్ల ప్రేమకథ ఇంకో ఎత్తు. వీళ్లిద్దరూ ఎప్పుడు కలిసుంటారో, ఎప్పుడు విడిపోతారో, మళ్లీ ఎప్పుడు కలుస్తారో ఎవ్వరికీ అర్థం కాదు. ఎనిమిదేళ్లుగా ఈ ప్రేమకథ ఇలాగే నడుస్తోంది. గత జనవరిలో మళ్లీ కలిసి ఒక్కటైన ఈ జంట, తాజాగా మరోసారి ‘టేక్ ఎ బ్రేక్’ అనుకున్నారట. ఇప్పుడు జస్టిన్‌కు కాస్తంత దూరంగానే ఉంటోందట సెలెనా. అయితే ఇది బ్రేకప్ కాదు. టేక్ ఎ బ్రేక్ అంతే. అంటే మళ్లీ త్వరలోనే ఒక్కటైపోతారని అనుకోవాలి. ఇంకొన్నాళ్లకైనా ఈ ఆన్ అండ్ ఆఫ్ ప్రేమకథ ఒక దగ్గర ఆన్ అయి అలా వెలుగుతూనే ఉండాలని కోరుకుందాం. స్టిన్ బీబర్, సెలెనా గోమేజ్ -
ప్రాణస్నేహితుల మధ్య ప్రేమ పగ
దొడ్డబళ్లాపురం: ప్రేమికుల రోజు వారి జీవితాల్లో విషాదం నింపింది. ఒక అమ్మాయి ప్రేమ కోసం ఇద్దరు మిత్రులు గొడవపడి కత్తితో పొడవడంతో ఒకరి ప్రాణం పోయింది. ఈ సంఘటన తాలూకాలోని కంచిగనాళ గ్రామంలో చోటుచేసుకుంది. కంచిగనాళ గ్రామం నివాసులయిన సంతోష్ (24), హరీష్ (24) చిన్నప్పటి నుండి ఆప్త స్నేహితులు. సంతోష్ వ్యవసాయం చేసుకుంటుండగా, హరీష్ చదువు సగంలో వదిలేసి షేర్ ఆటో డ్రైవర్‌గా ఉన్నాడు. ఇలా ఉండగా ఏడాది కాలంగా హరీష్, ఇదే గ్రామానికి చెందిన ఒక యువతి పరస్పరం ప్రేమించుకున్నారు. ఇదే సమయంలో ఆ యువతి తమ కులం అమ్మాయి కావడంతో సంతోష్ కూడా ఇష్టపడి ప్రేమించడం ప్రారంభించాడు. ఈ విషయంలో స్నేహితులు కొంతకాలంగా శత్రువులుగా మారారు. తరచూ అమ్మాయి ప్రేమ కోసం కొట్టుకున్నారు. ఈ క్రమంలో గత వారం అమ్మాయికి హరీష్ ఆటోలో అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చాడట. ఈ విషయం తెలుసుకున్న సంతోష్ హరీష్‌తో ఘర్షణపడి బెదిరించాడు. ఈ విషయమై హరీష్ గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు విచారణ కోసం గ్రామానికి వచ్చి సంతోష్ ఇంటికి వెళ్లారు. దీనిని అవమానంగా భావించిన సంతోష్ మంగళవారం రాత్రి గ్రామంలోని అశ్వత్థకట్ట వద్ద హరీష్‌తో గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే సంతోష్ కత్తితో హరీష్ గొంతు, ఎద భాగాల్లో విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితున్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందాడు. సంతోష్ పరారయ్యాడు. గ్రామస్థుల్లో భయాందోళన ప్రేమ పేరుతో యువకులు జీవితాలను నాశనం చేసుకోగా, ఇన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న కంచిగనాళ గ్రామంలో కొత్తగా కుల కక్షలు రాజుకోవడం పట్ల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హరీష్, సంతోష్, వీరి ప్రేమికురాలి ఇళ్లు గ్రామంలో ఒకే వీధిలో ఉండడంతో ఎప్పుడేం గలాటా జరుగుతుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా ఎస్పీ అమిత్‌సింగ్, ఏఎస్పీ మల్లికార్జున్, డీవైఎస్పీ నాగరాజు, సీఐ సిద్ధరాజు సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించారు. గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమలేఖలో కొత్త విషయాలు గురువారం నాడు మృతుని తల్లితండ్రులు హరీష్‌కు సంబంధించిన వస్తువులు పరిశీలించగా కొన్ని లవ్ లెటర్లు లభించాయి. అవన్నీ హరీష్ ప్రేమిస్తున్న అమ్మాయి రాసినవే. ఆమె ఇద్దరు యువకులతోనూ ప్రేమ సాగిస్తోందని తేలింది. ముఖ్యంగా అమ్మాయి హరీష్ వల్ల గర్భవతి అయిన సంగతి తెలిసింది. ఆ అమ్మాయి తల్లిదండ్రులే సంతోష్‌ను ఉసిగొల్పి తమ కొడుకును హత్య చేయించారని హరీష్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తక్కువ కులానికి చెందిన తమ కుమారుడికి అమ్మాయినిచ్చి వివాహం చేయడం ఇష్టంలేకే హత్య చేయించారని చెబుతున్నారు. -
ప్రేమ ‘కుల’ చిచ్చు
సేలం: సేలం, ధర్మపురి పరిసరాల్లో ప్రేమ వ్యవహారాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తూ వస్తున్నాయి. ఇప్పటికే కులాంతర ప్రేమ వ్యవహారాలకు ఇలవరసన్, గోకుల్ రాజ్‌లు బలి అయ్యారు. ఈ ఘటనలు పెను కలకలాన్ని సృష్టించాయి. తాజాగా, ఆ జాబితాలో సయ్య ద్ ఇంతియాజ్ చేరాడు. ఓమలూరు కోమలికి చెందిన సయ్యద్ ఇంతియాజ్(22) ఆటో డ్రైవర్. గురువారం ఉదయం ఇతడి మృతదేహం రైల్వే ట్రాక్ వద్ద బయట పడింది. మృత దేహానికి ఆగమేఘాలపై పోస్టుమార్టం పూర్తి అయింది. తమ వాడు మృతి సమాచారంతో సేలంకు ఉరకలు తీసిన కుటుం బీకులు, ఇది ముమ్మాటికి హత్యేనని ఆరోపించారు. సమాచారం అందుకున్న మైనారిటీ సంఘాలు, వీసీకే పార్టీ వర్గా లు జిహెచ్ వద్దకు చేరుకున్నాయి. సయ్యద్ ఓమలూరులో ఓ కులానికి చెందిన యువతిని ప్రేమిస్తూ వచ్చినట్టుగా, గత వారం ఆ యువతి బంధువులు ఆటో స్టాండ్‌కు వచ్చి బెదిరించి వెళ్లినట్టు మైనారిటీ సంఘాలు పేర్కొంటున్నాయి. బుధవారం రాత్రి సయ్యద్‌ను హతమార్చి రైలు పట్టాలపై పడేసి ఉన్నారని, అతడి శరీరం మీదున్న గాయాలను చూస్తే అది హత్య అన్నది స్పష్టం కాక తప్పదని వాపోయారు. ఈ కేసును హ త్య కేసుగా నమోదు చేయాలని కోరు తూ, మైనారిటీ సంఘాలు, వీసీకే వర్గాలు శుక్రవారం ఉదయం కలెక్టరేట్లో నిరసన తెలియజేశారు. కలెక్టర్‌ను కలవడానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొని ఉన్నది. హత్య కేసు నమోదు చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపు నిస్తామని మైనారిటీ సంఘాలు, వీసీకే వర్గాలు హెచ్చరికలు జారీ చేసి ఉన్నాయి. సయ్యద్ మృత దేహానికి రీ పోస్టుమార్టం సైతం జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. -
'ప్రేమంటే సై.. పెళ్లికి నై'
బంజారాహిల్స్: ప్రేమిస్తున్నానంటూ.. ప్రియురాలితో కలసి విహరించాడు. తీరా పెళ్లెప్పుడూ అంటే.. పెళ్లి చేసుకోను గాక చేసుకోనన్నాడు. దీంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌రోడ్ నెం. 56లోని గురుబ్రహ్మనగర్ బస్తీలో నివసించే యాదగిరి ఎస్ఐ ఉద్యోగం కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఇదే బస్తీలో నివసిస్తున్న ఓ యువతితో ప్రేమిస్తున్నానని చెప్పి ఏడాదిగా చెట్టా పట్టాలేసుకొని తిరిగాడు. తీరా పెళ్లి చేసుకోవాలని ఆమె కోరగా.. లేదని తేల్చి చెప్పాడు. దీంతో బాధితురాలు తల్లిదండ్రులతో కలసి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించినా ఫలితం లేకపోవడంతో కేసు నమోదు చేశారు. -
ప్రేమించి మోసం చేశాడని..
వైఎస్సార్ జిల్లా (ఎర్రగుంట్ల): వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని చిలమకూర్ గ్రామంలో ప్రేమించి మోసం చేశాడనే కారణంతో హిమాని(22) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. ఆ యువకుడికి వేరే యువతితో నిశ్చితార్థం జరుగతున్నట్లు తెలియడంతో హిమాని శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి హిమాని ఉరి వేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మ మాట జవదాటను
అమ్మ మాట జవదాటను చాలా మంది హీరోయిన్లు అమ్మ గారాల బిడ్డలే. వారి మాటలే వేదం. క్రేజీ నటి హన్సిక తల్లి చాటు కూతురే. అమ్మే ఆమెకు మార్గ దర్శకురాలు. బాలతారగా ప్రవేశించిన ఈ బబ్లీ గర్ల్ స్టేజీ కార్యక్రమాలు, మోడలింగ్, యాడ్స్ అంటూ తన నటనకు పదునుపెట్టుకుంటూ వచ్చింది. ప్రస్తుతం ప్రముఖ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. కోలీవుడ్‌లో అత్యధిక చిత్రాలు చేస్తున్న హీరోయిన్ హన్సికే. ఆ మధ్య ప్రేమ వ్యవహారంలో కాస్త వేడి పుట్టించినా ప్రస్తుతం బుద్దిగా నటనపైనే దృష్టి సారించింది. ఈ భామ త్వరలో నటుడు విశాల్‌తో రొమాన్స్‌కు సిద్ధం అవుతోంది. అమ్మ మాట జవదాటని హన్సిక ఈ మధ్య నటుడు శింబుతో ప్రేమ వ్యహారంలో పడి తల్లి హితబోధను పెడచెవిన పెట్టి తప్పటడుగులు వేసే ప్రయత్నం చేసింది. ఆ విధంగా కాస్త సంచలనం కలిగించినా శింబు ప్రేమకు రాంరాం పలికి మళ్లీ అమ్మ గూటికే చేరింది. ఏ విషయమైనా అమ్మతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటోందట. కథల ఎంపికలోనే కాకుండా ఏ హీరోతో జత కట్టాలి వంటి విషయాలను హన్సిక అమ్మే చూసుకుంటున్నారట. దీని గురించి ఈ క్రేజీ హీరోయిన్ తెలుపుతూ బాల తారగా నటిస్తున్నప్పటి నుంచే అమ్మ చెప్పినట్టే నడుచుకుంటున్నానని తెలిపింది. ఇప్పటికీ అదే అలవాటుగా మారిందని పేర్కొంది. ఇటీవల ఈ అమ్మడు ఒక సాహస కార్యం చేసింది. చెన్నైలోని ఒక సినీ కాంప్లెక్స్‌కు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఒంటరిగా వెళ్లి సినిమా చూసొచ్చింది. హన్సిక లాంటి స్టార్ సినిమా కొస్తే ప్రేక్షకుల కంట పడకుండా ఉండడం సాధ్యమా చాలా మంది ఆమెను గుమికూడి ఆటోగ్రాఫ్‌లు తమ సెల్ఫోన్లతో ఫొటోలు తీసుకోవడం కార్యక్రమాలతో ఆ ప్రాంతం కలకలంగా మారిపోయింది. అయినా అదంతా అధిగమించి హన్సిక సురక్షితంగా ఎవరి సాయం లేకుండా ఇల్లు చేరింది. -
నయా ప్రేమ!
ప్రేమ గుడ్డి దంటారు. అది మహా చెడ్డది కూడా. కొందరిని కవ్విస్తుంది, మురిపిస్తుంది. చివరికి మాయ చేస్తుంది. చిత్ర రంగంలో చాలామంది నటీనటులు ప్రేమ మాయలో పడి కొట్టుకుపోయారు. తాజాగా నటి నయనతారకు కూడా ప్రేమ కలసి రాలేదు. ఈ భామను అదే ప్రేమ రెండుసార్లు మోసం చేసింది. అయినా నయనకు మనో నిబ్బరం ఎక్కువ. ముచ్చటగా మూడవసారి ప్రేమలో పడినట్టు తాజా ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ జయం రవికి జంటగా ఆయన సోదరుడు జయం రాజా దర్శకత్వంలో తనీ ఒరువన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార పోలీసు అధికారిగా లాఠీ చేతబడుతున్నారట. ఇంతవరకు బాగానే ఉంది. ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో గణేష్ వెంకట్రామన్ నటిస్తున్నారు. ఈయన నయనతార స్నేహితుడిగా నటిస్తున్నారట. అయితే నిజ జీవితంలో కూడా వీరిద్దరూ చాలా స్నేహితంగా మెలగుతున్నారన్న వార్తలు ఊపందుకున్నాయి. ఇద్దరూ కలసి ఎక్కువ సమయం గడిపేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయాన్ని నటుడు గణేష్ వెంకట్రామన్ ఖండిస్తున్నారు. నయనతార తన సహ నటి మాత్రమేనని, తమ మధ్య మంచి స్నేహం మినహా మరేమీ లేదని అంటున్నారు. ఎవరైనా మొదట్లోనే అవును మేము ప్రేమించుకుంటున్నాం అని అంటారా? అయితే నిప్పు లేనిదే పొగ రాదన్న సామెత వీరికి తెలియంది కాదు సుమా! -
శ్రీమతికొక బహుమతి
రెండు హృదయాల మధ్య తీయని ఆనందాన్ని, అనుబంధాన్ని పెంచే మంచి వస్తువు బహుమతి. రక్త సంబంధం కావచ్చు, ప్రేమికులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు. ముఖ్యంగా ప్రేమికులకంటూ ఒక రోజు ఉంది కాబట్టి ఫిబ్రవరి 14 కోసం ఈ జంటలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇక సినిమా జంటల విషయానికొస్తే ఒకరికొకరు ఖరీదైన బహుమతులతో తమ అనుబంధాన్ని పెంచుకుంటుంటారు. అలా బహుమతుల పంపకాలతో ప్రణయ సాగరంలో మునిగితేలుతున్న కొన్ని జంటల గురించి చూద్దాం. బాయ్స్, కాదల్, వానం, 555 వంటి పలు చిత్రాలతో ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న నటుడు భరత్. ఈయన ఈ మధ్య జెస్సీని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమ, పెళ్లి గురించి ఆయన మాటల్లోనే.. జస్లీ దంత వైద్యురాలు. దంత వైద్యశాలలోనే నేనామెను తొలిసారిగా కలుసుకున్నాను. కొన్ని నెలల తర్వాత ఒక స్నేహితుని వేడుకలో మళ్లీ కలుసుకున్నాం. ఆ కలయిక మమ్మల్ని స్నేహితుల్ని చేసింది. తొలి చూపులోనే మామధ్య ప్రేమ పుట్టలేదు. ఎస్ఎంఎస్ల ద్వారా మా స్నేహం పెరిగి ప్రేమగా మారింది. గత ఏడాది ప్రేమికుల రోజున జెస్సీకి విందు ఇచ్చాను. ఈ ఏడాది ఆమె కోసం వజ్రాల నెక్లెస్ బహుమతిగా అందజేశాను. చిరకాలంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న మరో నవజంట సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్, గాయని సైందవి. వీరి ప్రేమానుబంధం గురించి జీవీ ప్రకాష్ కుమార్ పేర్కొంటూ ‘నేను పదవ తరగతి చదువుతున్న సమయంలో అదే పాఠశాలలో సైందవి ఎనిమిదవ తరగతి చదువుతుండేది. లవ్ ఎట్ ఫస్ట్ టైమ్ అన్నట్లు తొలి చూపులోనే మా మధ్య ప్రేమ మొలకెత్తింది. అలా 12 ఏళ్లు మా మధ్య ప్రేమ కొనసాగింది. గత ఏడాది ప్రేమికుల రోజున సైందవికి సర్ప్రైజ్ ఇచ్చాను. ఈ ఏడాది ఒక పెద్ద సర్ప్రైజ్ ఆమె కోసం ఎదురు చూస్తోంది’ అని తెలిపారు. సంచలన ప్రేమ జంట శింబు హన్సిక మధ్య గత ఏడాది ప్రేమ మొలకెత్తింది. ఇద్దరు పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించి సంచలనం కలిగించారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ బ్రేక్ అయినట్లు ప్రచారం జరిగింది. అలాంటి పరిస్థితిలో ఇటీవల శింబు పుట్టిన రోజున నటి హన్సిక హఠాత్తుగా ఆయన ముందు ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో వీరి ప్రేమ గురించి మళ్లీ రకరకాల ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నయనతార సరసన ఇదు నమ్మ ఆళు చిత్రంలో నటిస్తున్న శింబును హన్సిక, నయనతార గురించి అడగ్గా హన్సిక నా లవర్, నయనతార నా ఫ్రెండ్ అంటూ బదులిచ్చారు. -
కూతురిని కడతేర్చిన తండ్రి అరెస్ట్
మహబూబాబాద్, న్యూస్‌లైన్ : కూతురిని హతమార్చిన కేసులో తండ్రిని పోలీసులు అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. కేసముద్రంలో బుధవారం అర్ధరాత్రి తండ్రి చేతిలో కుమార్తె హత్యకు గురైన విషయం తెలిసిందే. డీఎస్పీ రమాదేవి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వె ల్లడించారు. కేసముద్రం మండల కేంద్రానికి చెందిన నర్ర సత్యనారాయణ, జయ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె వివాహాన్ని చేయగా చిన్న కుమార్తె మహేశ్వరి, కుమారుడు మాత్రమే ఇంటి వద్ద ఉంటున్నారు. మహేశ్వరి హన్మకొండలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. మహేశ్వరి ఫోన్లో తరచూ మాట్లాడుతుండడంతో గమనించిన కళాశాల ప్రిన్సిపాల్ ఆ బాలికను నిలదీశారు. సెల్ఫోన్లో ఉన్న మెసేజ్‌లను పరిశీలించగా ప్రేమ వ్యవహారాలకు సంబంధించినవే ఉన్నాయి. దీంతో జూలై 31న తల్లిదండ్రులకు ప్రిన్సిపాల్ సమాచారం ఇచ్చి ఈ నెల 1న ఇంటికి పంపించారు. ఇంటికి చేరుకున్నాక కూతురి సెల్ఫోన్లో ఉన్న సిమ్‌కార్డును తీసి తండ్రి డబ్బాలో దాచాడు. 13వ తేదీన ఆయన భార్య జయ బంధువులకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో హైదరాబాద్‌కు వెళ్లింది. సత్యనారాయణ 14వ తేదీ సాయంత్రం వరంగల్‌కు వెళ్లి ఇంటికి వచ్చేసరికి మహేశ్వరి ఇంట్లోని చివరి గదిలో ఫోన్లో మాట్లాడడం కనిపించింది. తాను 15 రోజుల్లో మేజర్ అవుతానని, అప్పుడు పెళ్లి చేసుకుందామని ప్రియుడితో మాట్లాడడం వినిపించింది. దీంతో ఆగ్రహించిన ఆయన ఎన్నిసార్లు చెప్పినా మారవా ? నా పరువు తీస్తున్నావంటూ కర్రతో కొట్టాడు. ఆ రోజు రాత్రి దెబ్బలు తిన్న మహేశ్వరి వేరేగదిలో నిద్రించగా ఆ రోజు రాత్రి రెండు గంటలకు నిద్ర నుంచి లేపి మళ్లీ విషయాన్ని తండ్రి అడిగాడు. అయినా ఏమి మాట్లాడకుండా నిలబడడంతో సహనం నశించి ఆమె మెడకు ఉన్న చున్నీని గట్టిగా చుట్టి రెండు చేతులతో లాగాడు. దీంతో అక్కడికక్కడే మృతిచెందింది. వెంటనే హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. స్లాబ్‌కు ఎలాంటి కొక్కాలు లేకపోవడంతో ఆమె మెడకు చున్నీ కట్టి మంచం కోడుకు కట్టి ఉరివేసుకుని ఆత్యహత్య చేసుకుందని చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. తిరిగి తన మంచంలో పడుకుని గురువారం ఉదయం లేచి ఏమి తెలియనట్లే తన కుమారుడు శిశప్రసాద్‌ను లేపి అక్క నిద్ర నుంచి లేచిందో చూడమని పంపాడు. అక్క ఉరివేసుకుందని అతడు వచ్చి చెప్పడంతో ఏమి తెలియనట్లే నటించాడు. పోలీసులను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. కానీ మంచం కోడుకు ఉరి వేయడం, ఆ ఘటన ప్రాంతాన్ని పరిశీలిస్తే హత్యగానే భావించిన స్థానిక పోలీసులు డీఎస్పీ రమాదేవికి సమాచారమందించారు. రంగంలోకి దిగిన డీఎస్పీ కూపి లాగి బంధువులను విచారించి, ఆ తర్వాత తండ్రిని విచారించగా వాస్తవాలు బయటపడ్డాయి. ఇదిలా ఉండగా నిందితుడి భార్య, బంధువులు మాత్రం ఏ కేసు వద్దని, అతడిని అరెస్ట్ చేయొద్దని వేడుకున్నారు. అతడి అరెస్ట్‌తో కుటుంబం రోడ్డున పడుతుందని వారు వాపోయూరు. సమావేశంలో రూరల్ సీఐ వాసాల సతీష్, కేసముద్రం ఎస్పై కరుణాకర్, సిబ్బంది పాల్గొన్నారు.