లవ్‌.. బ్రేకప్‌.. ప్యాచప్‌... | hollywood acteres Love brakup .. patchup | Sakshi
Sakshi News home page

లవ్‌.. బ్రేకప్‌.. ప్యాచప్‌...

Published Mon, Mar 12 2018 1:00 AM | Last Updated on Mon, Mar 12 2018 1:00 AM

hollywood acteres Love brakup .. patchup - Sakshi

‘ప్రేమలో ఉండకుండా ఉండలేరెవ్వరూ..’ అని ఏ కవో ఎక్కడో చెప్పే ఉంటాడు. అలాగే ఉంటాయి ప్రేమకథలు. కొన్ని అప్పుడప్పుడే చూసుకుంటున్న ప్రేమలు. కొన్ని చేతులందుకున్న ప్రేమలు. కొన్ని చెయ్యి జారిన ప్రేమలు. కొన్ని జారవిడిచిన చెయ్యిని మళ్లీ అంది పట్టుకున్న ప్రేమలు. అవి ఏ కథలైనా ప్రేమకు అటో.. ఇటో.. ఉంటూనే ఉండడమే మ్యాజిక్‌. హాలీవుడ్‌లో ఇప్పుడు ఇలా అటూ, ఇటూ, ఆ మధ్యలో కొట్టుకుంటున్న కొన్ని ప్రేమకథలను చూద్దాం...

దాచేదేముంది.. ప్రేమే
ఎమ్మా వాట్సన్‌ కథ ఇలా ఉంటే, మరో స్టార్‌ హీరోయిన్‌ టేలర్‌ స్విఫ్ట్‌ మాత్రం ‘దాచడానికి ఏముంది? ప్రేమేగా!’ అంటూ బాయ్‌ఫ్రెండ్‌ జాయ్‌ అల్విన్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తోంది. టేలర్‌ షూటింగ్‌తో బిజీగా ఉన్నప్పుడు, ఒకవేళ జాయ్‌ ఖాళీగా ఉంటే ఆమెతో పాటు షూటింగ్స్‌కు వెళ్లిపోతున్నాడు. ఇద్దరూ ఒకరి టైమింగ్స్, షెడ్యూల్స్‌ ప్రకారం ఇంకొకరు అడ్జస్ట్‌ అయిపోతూ, ప్రేమలో పడిన కొత్తల్లో, దూరం ఉండలేని ఒక ఫీలింగ్‌ను బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. హాలీవుడ్‌లో ఇప్పుడున్న హాట్‌ కపుల్స్‌లో వీళ్లూ టాప్‌ ప్లేసెస్‌లోనే ఉంటున్నారు.

                                                       టేలర్‌ స్విఫ్ట్, జాయ్‌ అల్విన్‌                        
వాళ్లు విడిపోయారు
మార్చి 4న ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆస్కార్‌ అవార్డు ఫంక్షన్‌లో ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌’ బెస్ట్‌ పిక్చర్‌ అవార్డు అందుకుంది. అదే ఫంక్షన్‌లో ఆయన బెస్ట్‌ డైరెక్టర్‌గా కూడా అవార్డు అందుకున్నాడు. ఆయనే గెలెర్మో డెల్‌టోరో. ఆరోజుకు సరిగ్గా ఏడాది క్రితం తన జీవితంలో జరిగిన ఓ కీలక విషయాన్ని మాత్రం ఆయన ఆరోజు తర్వాతిరోజు వరకూ దాచాడు. అదే.. భార్య లొరెంజో న్యూటన్‌తో వేరు పడడం. ముప్పై ఏళ్ల తమ బంధానికి గతేడాది ఫిబ్రవరిలో బ్రేకప్‌ చెప్పుకున్నారు గెలెర్మో, న్యూటన్‌. అయితే ఆ విషయాన్ని ఆస్కార్‌ అందుకున్న రోజు వరకూ ప్రపంచానికి చెప్పలేదు గెలెర్మో. ఆయన వయస్సు ఇప్పుడు 53 సంవత్సరాలు.

                                                      లొరెంజో న్యూటన్, గెలెర్మో డెల్‌టోరో

వీళ్లు మళ్లీ కలిసిపోయారు
ఈ దశాబ్దంలో హాలీవుడ్‌లో హయ్యెస్ట్‌ పెయిడ్‌ యాక్టర్స్‌లో ఒకరైన జెన్నిఫర్‌ లారెన్స్‌ ప్రేమకథలు ఎప్పటికప్పుడు కొత్త మలుపులు తీసుకుంటాయి. ‘‘నా లైఫ్‌లో బెస్ట్‌ రొమాన్స్‌ ఎప్పుడూ చూడలేదు. నాకది ఇష్టం లేదేమో కూడా!’’ అంటుందామె. 2014కు ముందువరకూ నికోలస్‌ హౌల్ట్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్న లారెన్స్, కొన్ని అనుకోని పరిస్థితుల్లో అతనికి బ్రేకప్‌ చెప్పేసింది. అయితే తాజాగా ఈ జంట మళ్లీ కలిసిపోయింది. ఇప్పుడు కొత్తగా పాత రొమాన్స్‌ను తలుచుకుంటూ మళ్లీ ప్రేమలో పడిపోతోంది. ఈ ప్రేమ జంట మళ్లీ పూర్తిగా కలిసిపోతే మాత్రం, ఇద్దరూ ప్రేమను వెతుక్కుంటూ ఒకే దగ్గర ఆగారని చెప్పుకోవచ్చు.

                                                జెన్నీఫర్‌ లారెన్స్, నికోలస్‌ హౌల్ట్‌                     

లవ్వా? అదేం లేదే
‘‘నేనంటూ ప్రేమలో ఉంటే అది నా పర్సనల్‌ విషయం. బయటకు అస్సలు చెప్పను. నాకు నచ్చదు.’’ అంది ఎమ్మా వాట్సన్‌ ఒక ఇంటర్వ్యూలో. ఈ హ్యారీపాటర్‌ స్టార్‌కు ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో ఫాలోయింగ్‌ ఉందో చెప్పక్కర్లేదు. సో, ప్రేమలో ఉంటే ఎలాగూ చెప్పనని ముందే చెప్పింది కాబట్టి, ఎమ్మా ప్రేమకథ ఏదైనా ఉంటే అది అఫీషియలా కాదా ఎవ్వరూ చెప్పలేరు. తాజాగా ఎమ్మా వాట్సన్‌ ఆస్కార్‌ పార్టీలో కోర్డ్‌ ఓవర్‌స్ట్రీట్‌తో కనిపించింది. మరో రెండు పార్టీల్లోనూ ఈ జంటే కలర్‌ఫుల్‌గా కనిపించింది. ఈ ఫొటోలు, వీళ్లిద్దరు కలిసి ఉండడం చూసి కోర్డ్‌తో ఆమె ప్రేమలో ఉందనుకున్నారంతా. కాకపోతే, కోర్డ్‌ తనకు ‘జస్ట్‌ ఫ్రెండ్‌’ అని చెబుతోందట ఎమ్మా. వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని, ఇంకా అఫీషియల్‌గా ప్రేమలో అయితే పడలేదని హాలీవుడ్‌ సమాచారం. మరి ఇష్టపడుతున్నారంటే, త్వరలోనే ప్రేమలోనూ పడొచ్చైతే.. చూడాలి!

                                                   ఎమ్మా వాట్సన్, కోర్డ్‌ ఓవర్‌ స్ట్రీట్‌                         

అటో.. ఇటో.. ఎటో..
అన్ని ప్రేమకథలదీ ఒక ఎత్తు. జస్టిన్‌ బీబర్, సెలెనా గోమేజ్‌ల ప్రేమకథ ఇంకో ఎత్తు. వీళ్లిద్దరూ ఎప్పుడు కలిసుంటారో, ఎప్పుడు విడిపోతారో, మళ్లీ ఎప్పుడు కలుస్తారో ఎవ్వరికీ అర్థం కాదు. ఎనిమిదేళ్లుగా ఈ ప్రేమకథ ఇలాగే నడుస్తోంది. గత జనవరిలో మళ్లీ కలిసి ఒక్కటైన ఈ జంట, తాజాగా మరోసారి ‘టేక్‌ ఎ బ్రేక్‌’ అనుకున్నారట. ఇప్పుడు జస్టిన్‌కు కాస్తంత దూరంగానే ఉంటోందట సెలెనా. అయితే ఇది బ్రేకప్‌ కాదు. టేక్‌ ఎ బ్రేక్‌ అంతే. అంటే మళ్లీ త్వరలోనే ఒక్కటైపోతారని అనుకోవాలి. ఇంకొన్నాళ్లకైనా ఈ ఆన్‌ అండ్‌ ఆఫ్‌ ప్రేమకథ ఒక దగ్గర ఆన్‌ అయి అలా వెలుగుతూనే ఉండాలని కోరుకుందాం.

                                                              స్టిన్‌ బీబర్, సెలెనా గోమేజ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement