Stein
-
లవ్.. బ్రేకప్.. ప్యాచప్...
‘ప్రేమలో ఉండకుండా ఉండలేరెవ్వరూ..’ అని ఏ కవో ఎక్కడో చెప్పే ఉంటాడు. అలాగే ఉంటాయి ప్రేమకథలు. కొన్ని అప్పుడప్పుడే చూసుకుంటున్న ప్రేమలు. కొన్ని చేతులందుకున్న ప్రేమలు. కొన్ని చెయ్యి జారిన ప్రేమలు. కొన్ని జారవిడిచిన చెయ్యిని మళ్లీ అంది పట్టుకున్న ప్రేమలు. అవి ఏ కథలైనా ప్రేమకు అటో.. ఇటో.. ఉంటూనే ఉండడమే మ్యాజిక్. హాలీవుడ్లో ఇప్పుడు ఇలా అటూ, ఇటూ, ఆ మధ్యలో కొట్టుకుంటున్న కొన్ని ప్రేమకథలను చూద్దాం... దాచేదేముంది.. ప్రేమే ఎమ్మా వాట్సన్ కథ ఇలా ఉంటే, మరో స్టార్ హీరోయిన్ టేలర్ స్విఫ్ట్ మాత్రం ‘దాచడానికి ఏముంది? ప్రేమేగా!’ అంటూ బాయ్‌ఫ్రెండ్ జాయ్ అల్విన్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తోంది. టేలర్ షూటింగ్‌తో బిజీగా ఉన్నప్పుడు, ఒకవేళ జాయ్ ఖాళీగా ఉంటే ఆమెతో పాటు షూటింగ్స్‌కు వెళ్లిపోతున్నాడు. ఇద్దరూ ఒకరి టైమింగ్స్, షెడ్యూల్స్ ప్రకారం ఇంకొకరు అడ్జస్ట్ అయిపోతూ, ప్రేమలో పడిన కొత్తల్లో, దూరం ఉండలేని ఒక ఫీలింగ్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హాలీవుడ్లో ఇప్పుడున్న హాట్ కపుల్స్‌లో వీళ్లూ టాప్ ప్లేసెస్‌లోనే ఉంటున్నారు. టేలర్ స్విఫ్ట్, జాయ్ అల్విన్ వాళ్లు విడిపోయారు మార్చి 4న ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆస్కార్ అవార్డు ఫంక్షన్లో ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ది షేప్ ఆఫ్ వాటర్’ బెస్ట్ పిక్చర్ అవార్డు అందుకుంది. అదే ఫంక్షన్లో ఆయన బెస్ట్ డైరెక్టర్‌గా కూడా అవార్డు అందుకున్నాడు. ఆయనే గెలెర్మో డెల్‌టోరో. ఆరోజుకు సరిగ్గా ఏడాది క్రితం తన జీవితంలో జరిగిన ఓ కీలక విషయాన్ని మాత్రం ఆయన ఆరోజు తర్వాతిరోజు వరకూ దాచాడు. అదే.. భార్య లొరెంజో న్యూటన్తో వేరు పడడం. ముప్పై ఏళ్ల తమ బంధానికి గతేడాది ఫిబ్రవరిలో బ్రేకప్ చెప్పుకున్నారు గెలెర్మో, న్యూటన్. అయితే ఆ విషయాన్ని ఆస్కార్ అందుకున్న రోజు వరకూ ప్రపంచానికి చెప్పలేదు గెలెర్మో. ఆయన వయస్సు ఇప్పుడు 53 సంవత్సరాలు. లొరెంజో న్యూటన్, గెలెర్మో డెల్‌టోరో వీళ్లు మళ్లీ కలిసిపోయారు ఈ దశాబ్దంలో హాలీవుడ్లో హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్స్‌లో ఒకరైన జెన్నిఫర్ లారెన్స్ ప్రేమకథలు ఎప్పటికప్పుడు కొత్త మలుపులు తీసుకుంటాయి. ‘‘నా లైఫ్‌లో బెస్ట్ రొమాన్స్ ఎప్పుడూ చూడలేదు. నాకది ఇష్టం లేదేమో కూడా!’’ అంటుందామె. 2014కు ముందువరకూ నికోలస్ హౌల్ట్తో పీకల్లోతు ప్రేమలో ఉన్న లారెన్స్, కొన్ని అనుకోని పరిస్థితుల్లో అతనికి బ్రేకప్ చెప్పేసింది. అయితే తాజాగా ఈ జంట మళ్లీ కలిసిపోయింది. ఇప్పుడు కొత్తగా పాత రొమాన్స్‌ను తలుచుకుంటూ మళ్లీ ప్రేమలో పడిపోతోంది. ఈ ప్రేమ జంట మళ్లీ పూర్తిగా కలిసిపోతే మాత్రం, ఇద్దరూ ప్రేమను వెతుక్కుంటూ ఒకే దగ్గర ఆగారని చెప్పుకోవచ్చు. జెన్నీఫర్ లారెన్స్, నికోలస్ హౌల్ట్ లవ్వా? అదేం లేదే ‘‘నేనంటూ ప్రేమలో ఉంటే అది నా పర్సనల్ విషయం. బయటకు అస్సలు చెప్పను. నాకు నచ్చదు.’’ అంది ఎమ్మా వాట్సన్ ఒక ఇంటర్వ్యూలో. ఈ హ్యారీపాటర్ స్టార్‌కు ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. సో, ప్రేమలో ఉంటే ఎలాగూ చెప్పనని ముందే చెప్పింది కాబట్టి, ఎమ్మా ప్రేమకథ ఏదైనా ఉంటే అది అఫీషియలా కాదా ఎవ్వరూ చెప్పలేరు. తాజాగా ఎమ్మా వాట్సన్ ఆస్కార్ పార్టీలో కోర్డ్ ఓవర్స్ట్రీట్తో కనిపించింది. మరో రెండు పార్టీల్లోనూ ఈ జంటే కలర్ఫుల్గా కనిపించింది. ఈ ఫొటోలు, వీళ్లిద్దరు కలిసి ఉండడం చూసి కోర్డ్తో ఆమె ప్రేమలో ఉందనుకున్నారంతా. కాకపోతే, కోర్డ్ తనకు ‘జస్ట్ ఫ్రెండ్’ అని చెబుతోందట ఎమ్మా. వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని, ఇంకా అఫీషియల్‌గా ప్రేమలో అయితే పడలేదని హాలీవుడ్ సమాచారం. మరి ఇష్టపడుతున్నారంటే, త్వరలోనే ప్రేమలోనూ పడొచ్చైతే.. చూడాలి! ఎమ్మా వాట్సన్, కోర్డ్ ఓవర్ స్ట్రీట్ అటో.. ఇటో.. ఎటో.. అన్ని ప్రేమకథలదీ ఒక ఎత్తు. జస్టిన్ బీబర్, సెలెనా గోమేజ్ల ప్రేమకథ ఇంకో ఎత్తు. వీళ్లిద్దరూ ఎప్పుడు కలిసుంటారో, ఎప్పుడు విడిపోతారో, మళ్లీ ఎప్పుడు కలుస్తారో ఎవ్వరికీ అర్థం కాదు. ఎనిమిదేళ్లుగా ఈ ప్రేమకథ ఇలాగే నడుస్తోంది. గత జనవరిలో మళ్లీ కలిసి ఒక్కటైన ఈ జంట, తాజాగా మరోసారి ‘టేక్ ఎ బ్రేక్’ అనుకున్నారట. ఇప్పుడు జస్టిన్‌కు కాస్తంత దూరంగానే ఉంటోందట సెలెనా. అయితే ఇది బ్రేకప్ కాదు. టేక్ ఎ బ్రేక్ అంతే. అంటే మళ్లీ త్వరలోనే ఒక్కటైపోతారని అనుకోవాలి. ఇంకొన్నాళ్లకైనా ఈ ఆన్ అండ్ ఆఫ్ ప్రేమకథ ఒక దగ్గర ఆన్ అయి అలా వెలుగుతూనే ఉండాలని కోరుకుందాం. స్టిన్ బీబర్, సెలెనా గోమేజ్ -
‘యువీ’ అవసరం లేదు
♦ వదిలేసుకున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ ♦ స్టెయిన్‌ను తప్పించిన హైదరాబాద్ ♦ 101 మందిని కొనసాగించనున్న ఐపీఎల్ జట్లు న్యూఢిల్లీ: భారీ విలువను భుజాన మోస్తూ ఐపీఎల్-8లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను ఆ జట్టు ఒక్క ఏడాదికే పరిమితం చేసింది. గత సీజన్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిన యువీని ఊహించినట్లుగానే ఢిల్లీ వదిలేసుకుంది. 2015 ఐపీఎల్లో ఢిల్లీ తరఫున 13 ఇన్నింగ్స్‌లలో 19.07 సగటుతో 248 పరుగులు మాత్రమే చేసిన యువరాజ్ ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. ఆ సీజన్ కోసం రికార్డు స్థాయిలో యువీకి డేర్‌డెవిల్స్ రూ. 16 కోట్లు చెల్లించింది. భారత జట్టులో పునరాగమనం చేసినా ఢిల్లీ ఫ్రాంచైజీ యువీపై నమ్మకం ఉంచలేదు. ‘యువరాజ్ గొప్ప ఆటగాడు. మంచి ఫామ్‌లో ఉండి టీమిండియాకు ఎంపికయ్యాడు కూడా. అయితే మా బడ్జెట్ పరిమితుల కారణంగా అతడిని తప్పించాల్సి వస్తోంది. ఈ విషయాన్ని యువీకి ముందే చెప్పాం కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు’ అని డేర్‌డెవిల్స్ సీఈఓ హేమంత్ దువా వెల్లడించారు. భారీ మొత్తం (రూ. 7 కోట్లు) చెల్లించిన శ్రీలంక కెప్టెన్ ఏంజెలో మ్యాథ్యూస్‌ను కూడా ఢిల్లీ వదిలేసింది. దాంతో ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే తప్పించి ఆ జట్టు రూ. 23 కోట్లు ఆదా చేసుకుంది. జహీర్‌ఖాన్ రిటైర్ అయినా... ప్రధానంగా మెంటార్ బాధ్యత అప్పజెప్పే అవకాశం ఉండటంతో అతడిని డీడీ కొనసాగిస్తోంది. ఐపీఎల్-9 కోసం ఆటగాళ్లను మార్చుకునే లేదా తప్పించే అవకాశం కల్పించే తొలి విండో ట్రేడింగ్ గురువారం ముగిసింది. ఇషాంత్‌శర్మ అవుట్...: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ ప్రధాన పేసర్లు డేల్ స్టెయిన్, ఇషాంత్ శర్మలను వదిలేసింది. గత సీజన్లో ట్రెంట్‌బౌల్ట్ ఫామ్ కారణంగా స్టెయిన్‌కు ఆరు మ్యాచ్‌లలో మాత్రమే ఆడే అవకాశం లభించగా, ఇషాంత్ నాలుగు మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. రూ.10.5 కోట్లు పెట్టి కొనుక్కున్న దినేశ్ కార్తీక్‌కు కూడా బెంగళూరు గుడ్‌బై చెప్పింది. ఈ ట్రేడింగ్ విండోలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అత్యధికంగా 14 మందిని, కోల్‌కతా 10 మంది ఆటగాళ్లను తప్పించాయి. ఈ ట్రేడింగ్‌లో ఢిల్లీకి చెందిన కేదార్ జాదవ్ ఒక్కడినే మరో జట్టు తీసుకోవడం విశేషం. జాదవ్‌ను ఢిల్లీ తప్పించగా... బెంగళూరు సొంతం చేసుకుంది. ఇక్కడ వదిలేసిన ఆటగాళ్లందరూ వేలానికి అందుబాటులో ఉంటారు. వేలానికి ముందు ఢిల్లీ ఖాతాలో రూ. 36.85 కోట్లు, సన్‌రైజర్స్‌కు రూ. 30.15 కోట్లు ఉన్నాయి. వివిధ జట్లు వదిలేసుకున్న కొందరు ప్రధాన ఆటగాళ్లు ♦ యువరాజ్, మ్యాథ్యూస్, మనోజ్ తివారి (ఢిల్లీ) ♦ బెయిలీ, అవానా, తిసార పెరీరా (పంజాబ్) ♦ డస్కటే, అజహర్ మహమూద్ (కోల్‌కతా), ్ఞ ప్రజ్ఞాన్ ఓజా, ఫించ్ (ముంబై) ♦ దినేశ్ కార్తీక్, డారెన్ స్యామీ, దిండా (బెంగళూరు) ♦ స్టెయిన్, ఇషాంత్, బొపారా, ప్రవీణ్ కుమార్, విహారి, మిలింద్ (సన్‌రైజర్స్) -
దక్షిణాఫ్రికా ఎదురీత
♦ లక్ష్యం 416 ♦ ప్రస్తుతం 136/4 ♦ ఇంగ్లండ్‌తో తొలి టెస్టు డర్బన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు ఎదురీదుతోంది. ఇంగ్లండ్ నిర్దేశించిన 416 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా మంగళవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 47 ఓవర్లలో 4 వికెట్లకు 136 పరుగులు చేసింది. డివిలియర్స్ (37 బ్యాటింగ్), స్టెయిన్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్ ఎల్గర్ (40) రెండు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. వాన్‌జెల్ (33)తో తొలి వికెట్‌కు 53; ఆమ్లా (12)తో రెండో వికెట్‌కు 32 పరుగులు జోడించాడు. అయితే ఫిన్ వరుస ఓవర్లలో ఆమ్లా, ఎల్గర్‌ను అవుట్ చేయడంతో సఫారీ జట్టు 88 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో డివిలియర్స్, డు ఫ్లెసిస్ (9) నాలుగో వికెట్‌కు 48 పరుగులు జత చేసి ఆదుకునే ప్రయత్నం చేశారు. ఫిన్ 3 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా ఇంకా 280 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు 172/3 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 102.1 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. రూట్ (73), టేలర్ (42), బెయిర్‌స్టో (79) నిలకడగా ఆడారు. పీట్ 5 వికెట్లు తీశాడు. -
ఆ జ్ఞాపకాలు పదిలం
భారత్-దక్షిణాఫ్రికా... రెండు సమాన స్థాయి ఉన్న జట్లు. అందుకే ఈ రెండు జట్ల మధ్య సిరీస్ అంటే అందరిలోనూ ఆసక్తి. అలాంటి సిరీస్‌లో ఓ అద్భుతమైన ప్రదర్శన చేస్తే... చరిత్రలో కలకాలం నిలబడిపోతారు. అందుకే ప్రతి ఆటగాడూ ఈ పర్యటనలో మరింత కష్టపడతాడు. గతంలో దక్షిణాఫ్రికా జట్టు భారత్‌లో పర్యటించిన అనేక సందర్భాల్లో కొంతమంది క్రికెటర్లు చేసిన ప్రదర్శన ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకం. అలాంటి వాటిలో కొన్ని... సచిన్ ‘డబుల్’... 2010లో భారత పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా జట్టుపై మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ ఓ అరుదైన ఫీట్ సాధించి క్రికెట్ చరిత్రను మలుపు తిప్పాడు. అదే వన్డేల్లో ‘డబుల్ సెంచరీ’. ఊహించడానికే కష్టంగా అనిపించే ఈ ఘనతను ఫిబ్రవరి 24న గ్వాలియర్‌లో జరిగిన రెండో వన్డేలో సచిన్ సుసాధ్యం చేశాడు. బలమైన సఫారీ బౌలర్లను తన ట్రేడ్ మార్క్ షాట్లతో దీటుగా ఎదుర్కొని అతను ఇన్నింగ్స్‌కు ప్రాణం పోసిన తీరు ఇప్పటికీ అభిమానులకు చిర పరిచితం. 90 బంతుల్లో మొదటి 100 పరుగులు చేసిన మాస్టర్ మిగతా 100 కోసం కేవలం 57 బంతులే తీసుకున్నాడు. 150 పరుగుల తర్వాత కండరాలు పట్టేసినా రన్నర్‌ను కూడా తీసుకోకుండానే ఓ సంచలన ఇన్నింగ్స్‌కు తెరలేపాడు. 46వ ఓవర్లో వన్డేల్లో అత్యధిక పరుగుల (194) రికార్డును అధిగమించినా.. ఏమాత్రం భావోద్వేగాలు, సెలబ్రేషన్ లేకుండా తన లక్ష్యంవైపు సాగిపోయాడు. లాంగ్‌వెల్ట్ వేసిన చివరి ఓవర్లో బంతిని బ్యాక్వర్డ్ పాయింట్లోకి నెట్టి ఎవరికి సాధ్యంకాని మ్యాజిక్ ఫిగర్ (200) అందుకోవడంతో ఒక్కసారిగా రూప్సింగ్ స్టేడియం హోరెత్తిపోయింది. క్లూసెనర్ కేక 1996లో తొలిసారి భారత పర్యటనకు వచ్చిన ఆల్‌రౌండర్ లాన్స్ క్లూసెనర్‌కు రెండో టెస్టు మధురానుభూతిని మిగిల్చింది. తొలి టెస్టులో ఓడి కాస్త నిరాశతో ఉన్న సఫారీ జట్టు కోల్‌కతాలో జరిగిన రెండో మ్యాచ్‌లో క్లూసెనర్‌కు అరంగేట్రం చేసే అవకాశం ఇచ్చింది. దీంతో మెక్‌మిలన్ వారసుడిగా జట్టులోకి వచ్చిన లాన్స్... రెండో ఇన్నింగ్స్‌లో బంతి తో నిప్పులు చెరిగాడు. 467 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియాను క్లూసెనర్ గంటల వ్యవధిలో కూల్చేశాడు. అద్భుతమైన యార్కర్లతో హడలెత్తించాడు. 8 వికెట్లు తీసి ప్రొటీస్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో సహచరులందరూ వెనుదిరిగినా అజహరుద్దీన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. వీరూ ‘ట్రిపుల్’ టెస్టుల్లో స్థానం కోల్పోయి ఏడాది తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చిన సెహ్వాగ్... 2008లో చెన్నైలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో విశ్వరూపం చూపెట్టాడు. టి20, వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ పరుగుల వరద పారించాడు. దాదాపు 9 గంటల పాటు బ్యాటింగ్ చేసి అసాధారణ రీతిలో ‘ట్రిపుల్ సెంచరీ’ మోత మోగించాడు. తేమ వల్ల డీహైడ్రేషన్ సమస్య ఎదురైనా జట్టులో చోటు సుస్థిరం చేసుకోవాలనే ఏకైక లక్ష్యంతో అతను బ్యాటింగ్ చేసిన తీరుకు సఫారీ బౌలర్లు చేష్టలుడిగిపోయారు. కేవలం 278 బంతుల్లో తన రెండో ట్రిపుల్ సెంచరీ చేసి తనపై వచ్చిన విమర్శలకు చక్కటి సమాధానం చెప్పాడు. ఓవరాల్‌గా సెహ్వాగ్ వీరోచిత బ్యాటింగ్‌తో ప్రకంపనాలు సృష్టించినా.. ప్రొటీస్ కూడా దీటుగా స్పందించడంతో ఈ మ్యాచ్ ‘డ్రా’ అయ్యింది. స్టెయిన్ ‘గన్’ 2008చెన్నై టెస్టులో సెహ్వా గ్ జోరు చూపెడితే... అహ్మదాబాద్‌లో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా పేసర్ స్టెయిన్ బంతితో హడలె త్తించాడు. స్వింగ్‌తో పాటు ‘ఎక్స్ట్రా బౌన్స్’ అనే ఆయుధంతో టీమిండియాను బొక్కబోర్లా పడగొట్టాడు. ఎన్తిని, మోర్కెల్ సహకారంతో భారత్‌కు పట్టపగలే చుక్కలు చూపెట్టాడు. కనీసం బంతిని ముట్టుకోవడానికి కూడా భయపడిన భార త బ్యాట్స్‌మన్ తొలి ఇన్నింగ్స్‌లో 76 పరుగులకే ఆలౌటయ్యారు. రెండో ఇన్నింగ్స్‌లో నూ స్టెయిన్ నిప్పులు కురిపించాడు. 3వికెట్లు తీసి ఒకే ఒక్క సెషన్లో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. మూడు రోజుల్లోనే సఫారీ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.