
హాలీవుడ్ పాప్ సింగర్, నటి సెలీనా గోమెజ్ మంచి చేయబోయి విమర్శలపాలైంది. న్యూయార్క్‌లో తను కారు ఎక్కేముందు ఓ వ్యక్తి తనకు దానం చేయమని కోరాడు. తలదాచుకోవడానికి నిలువ నీడ కూడా లేని అతడికి కేవలం 20 డాలర్లు దానం చేసి బాగా భోజనం చేయు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

పాప్ సింగర్‌పై ట్రోలింగ్
ఇంకేముంది, నెటిజన్లు ఆమెపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. దాదాపు పదివేల కోట్ల సామ్రాజ్యానికి మహారాణివి, ఇల్లు లేని వ్యక్తికి కేవలం రూ.1600 చిల్లర (20 డాలర్లు) ఇస్తావా? నువ్వు తల్చుకుంటే నిరాశ్రయుడైన వ్యక్తికి ఏకంగా ఒక ఇల్లే కొనివ్వచ్చు, కానీ మరీ చిల్లర ఇవ్వడం బాగోలేదు, అంత డబ్బు ఏమాత్రం సరిపోతాయో.. అని కామెంట్లు చేస్తున్నారు.
ఆమె అభిమానులు మాత్రం.. తను ఆ మాత్రమైనా చేసిందని వెనకేసుకొస్తున్నారు. హడావుడిగా వెళ్లిపోకుండా ఆగి మరీ తనకు తోచింది సాయం చేయడం గొప్ప విషయమేనని చెప్తున్నారు.
చదవండి: రజనీకాంత్ ఫోటో షేర్ చేసి పెద్ద తప్పు చేశా: రాహుల్ సిప్లిగంజ్
Comments
Please login to add a commentAdd a comment