Hollywood singer
-
వేలకోట్లు ఉండి ఏం లాభం? సాయం చేసేందుకు చేతులే రావట్లేదుగా!
హాలీవుడ్ పాప్ సింగర్, నటి సెలీనా గోమెజ్ మంచి చేయబోయి విమర్శలపాలైంది. న్యూయార్క్‌లో తను కారు ఎక్కేముందు ఓ వ్యక్తి తనకు దానం చేయమని కోరాడు. తలదాచుకోవడానికి నిలువ నీడ కూడా లేని అతడికి కేవలం 20 డాలర్లు దానం చేసి బాగా భోజనం చేయు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.పాప్ సింగర్‌పై ట్రోలింగ్ఇంకేముంది, నెటిజన్లు ఆమెపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. దాదాపు పదివేల కోట్ల సామ్రాజ్యానికి మహారాణివి, ఇల్లు లేని వ్యక్తికి కేవలం రూ.1600 చిల్లర (20 డాలర్లు) ఇస్తావా? నువ్వు తల్చుకుంటే నిరాశ్రయుడైన వ్యక్తికి ఏకంగా ఒక ఇల్లే కొనివ్వచ్చు, కానీ మరీ చిల్లర ఇవ్వడం బాగోలేదు, అంత డబ్బు ఏమాత్రం సరిపోతాయో.. అని కామెంట్లు చేస్తున్నారు. ఆమె అభిమానులు మాత్రం.. తను ఆ మాత్రమైనా చేసిందని వెనకేసుకొస్తున్నారు. హడావుడిగా వెళ్లిపోకుండా ఆగి మరీ తనకు తోచింది సాయం చేయడం గొప్ప విషయమేనని చెప్తున్నారు.చదవండి: రజనీకాంత్ ఫోటో షేర్ చేసి పెద్ద తప్పు చేశా: రాహుల్ సిప్లిగంజ్ -
స్టార్ సింగర్ సర్ప్రైజ్.. ఒక్కో డ్రైవర్‌కు రూ.82 లక్షలు
చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి. కానీ దానం చేసేవాళ్లు చాలా తక్కువమంది ఉంటారు. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు అయితే పలు విధాల లాభపడుతుంటారు కానీ ఖర్చు పెట్టడానికి, వర్కర్స్‌కి బోనస్‌లు ఇవ్వడానికి ముందు వెనకా అవుతుంటారు. కానీ ఓ స్టార్ సింగర్ మాత్రం తన దగ్గర పనిచేస్తున్న డ్రైవర్లకు ఏకంగా రూ.50 కోట్ల వరకు ఇచ్చేసింది. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారిపోయింది. (ఇదీ చదవండి: సమంత ట్రీట్మెంట్ కోసం అన్ని కోట్ల ఖర్చు?) ఇంగ్లీష్ సాంగ్స్ వినేవాళ్లకు, హాలీవుడ్ టచ్ ఉన్నవాళ్లకు అమెరికన్ సింగర్ టేలర్ స్విఫ్ట్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. లైవ్ షోలు, ఆల్బమ్ సాంగ్స్ తో ఈమె చాలా పాపులర్. అలానే అమెరికాలోని ప్రతి సిటీలోనూ ఈవెంట్స్ చేస్తూ, జనాల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. అయితే ఈమెకు సంబంధించిన సామాను తిప్పడానికి ప్రత్యేకంగా 50 ట్రక్కులు ఉంటాయి. ఇప్పుడు ఆయా ట్రక్స్ డ్రైవర్లకు తలో లక్ష డాలర్స్ గిఫ్ట్‌గా ఇచ్చింది. భారతీయ కరెన్సీలో ఈ మొత్తం రూ.82 లక్షలు. ఇలా కేవలం తన సామాగ్రిని చాలా జాగ్రత్తగా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు తీసుకొస్తున్న డ్రైవర్ల విషయంలో టేలర్ స్విఫ్ట్ గొప్ప మనసు చాటకుంది. వాళ్లందరికీ కలిపి రూ.50 కోట్ల వరకు బోనస్ ఇచ్చింది. శాంటాక్లాజ్లో శనివారం.. ఈ డబ్బులు ఇచ్చే కార్యక్రమం జరిగింది. ఇకపోతే ఈ సింగర్.. నైట్‌లో జరిగే ఒక్కో ఈవెంట్‌కి రూ.100 కోట్ల వరకు సంపాదిస్తుందని టాక్. దీని ద్వారా ఆమె ఇప్పటివరకు 1.4 బిలియన్ డాలర్స్(రూ.94 వేల కోట్లకు పైగా) సంపాదించిందని తెలుస్తోంది. ఏదేమైనా ఇన్నిన్ని లక్షలు బోనస్ లేదా బహుమతిగా డ్రైవర్లకు ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారిపోయింది. View this post on Instagram A post shared by Taylor Swift (@taylorswift) (ఇదీ చదవండి: సీఎం బయోపిక్‌లో సేతుపతి ఫిక్స్!) -
రెండోసారి తండ్రి అయిన ప్రముఖ సింగర్.. పోస్ట్ వైరల్
Singer Ed Sheeran Announces The Birth Of Second Daughter Post Viral: బ్రిటిష్ సింగర్, పాటల రచయిత ఎడ్ షీరాన్ రెండోసారి తండ్రి అయ్యాడు. ఎడ్, తన భార్య చెర్రీ సీబోర్న్ వారి రెండో కుమార్తెకు ఆహ్వానం పలికారు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడు. 'మాకు మరో అందమైన ఆడపిల్ల పుట్టిందని మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాం. మేమిద్దరం ఆమెను ఎంతో ప్రేమిస్తున్నాం.' అని రాస్తూ ఒక చిన్ని సాక్స్ జత పిక్‌ను పోస్ట్ చేశాడు ఎడ్. అలాగే తన కుమార్తె పుట్టుక తన జీవితానికి కొత్త అర్థాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. ఈ పోస్ట్‌పై సింగర్ అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. తనకు 11 ఏళ్ల నుంచి పరిచయం ఉన్న సీబోర్న్ను ఎడ్ షీరాన్ 2019లో వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు 2020 ఆగస్టులో మొదటి కుమార్తె లైరా అంటార్కిటికా జన్మించింది. 31 ఏళ్ల ఎడ్ గత పదేళ్లలో అత్యంత పాపులర్ అయిన సింగర్. ఎడ్ మొదటిసారిగా 2011లో తన తొలి సింగిల్ 'ది ఏ టీమ్'తో అరగేంట్రం చేశాడు. 'షేఫ్ ఆఫ్ యూ' అనే సాంగ్ ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చదవండి: విజయ్ దేవరకొండతో రొమాంటిక్ మూవీ చేయాలనుంది: హీరోయిన్ View this post on Instagram A post shared by Ed Sheeran (@teddysphotos) -
చిన్న వయసులో గాయని అకాల మరణం.. నాలుగేళ్లుగా
Night Bride Jane Marczewski Dies At 31 With Cancer: హాలీవుడ్ ప్రముఖ గాయని, 'అమెరికాస్ గాట్ టాలెంట్' మాజీ కంటెస్టెంట్ జేన్ మార్షెస్కీ కన్నుమూశారు. క్యాన్సర్‌తో పోరాడి 31 ఏళ్ల చిన్న వయసులో మరణించారు. జేన్ లంగ్స్, లివర్, వెన్నెముకకు క్యాన్సర్ పాకడంతో ఆమెను కాపాడలేకపోయారు. క్యాన్సర్‌తో నాలుగేళ్ల పోరాటం తర్వాత ఫిబ్రవరి 19న జేన్ మరణించిందని ఆమె కుటుంబ సభ్యులు సోమవారం (ఫిబ్రవరి 21) తెలిపారు. 'జేన్ మరణం మాకు తీరని లోటు. తన అకాల మరణంతో మేము ఎంతో కృంగిపోయాం' అని జేన్ కుటుంబ సభ్యులు ప్రముఖ వార్త సంస్థకు తెలిపారు. ఇంకా 'జేన్ గురించి తెలిసిన వారు ఎవరైనా సరే ఆమె వ్యక్తిత్వం, హాస్య చతురతను ఎంతగానో ఇష్టపడతారు. ప్రతి సందర్భంలోనూ తనదైన చమత్కారపు శైలి ఉంటుంది. ఆమె సంగీతం, యేసు ప్రభువులో ఉన్న బలాన్ని ఎంతోమందికి అందించింది. జేన్పై ప్రేమ, మద్దతుకు చూపించిన ప్రతీ ఒక్కరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం.' అని పేర్కొన్నారు. జేన్ మార్షెస్కీ నైట్బ్రైడ్ అనే షోతో ఎంతో పాపులర్ అయింది. అమెరికాస్ గాట్ టాలెంట్ 16వ సీజన్లో జేన్ పార్టిసిపేట్ చేసింది. -
Fenty's Fortune: మీకేమైనా తెలుసా... వాట్స్ మై నేమ్?
బాబిడోస్ సింగర్ రిహాన రైటర్, నటి, ఫ్యాషన్ డిజైనర్ కూడా. ‘మ్యూజిక్ ఆఫ్ ది సన్’ ఆల్బమ్ ఆమెను లోకానికి పరిచయం చేసింది. ‘ఏ గర్ల్ లైక్ మీ’ రిహానను బిల్‌బోర్డ్‌లో అగ్రస్థానంలో నిలిపింది. ‘గుడ్ గర్ల్ గాన్ బ్యాడ్’ ఆమెకు ఎంతో మంది అభిమానులను సంపాదించింది. ‘అంబ్రెల్ల’ పాట ‘గ్రామీ అవార్డ్’ను తెచ్చిపెట్టింది. మీరు ఏ కాస్త తీరిగ్గా ఉన్నా....‘వాట్స్ మై నేమ్’ పాటను అందుకోండి...‘యూ ఆర్ సో అమేజింగ్’ అని, ‘వుయ్ ఫౌండ్ లవ్’ పాటను ‘వుయ్ ఫౌండ్ లవ్ ఇన్ ఏ హోప్లెస్ ప్లేస్ ఎల్లో డైమండ్ ఇన్‌ది లైట్’ అంటూ బేషుగ్గా పాడుకోవచ్చు. ‘రిచెస్ట్ ఫిమేల్ మ్యూజిషియన్ ఆన్ ది ప్లానెట్’గా ఘనత సాధించిన రిహాన సెల్ఫ్–మేడ్ ఆర్టిస్ట్. రిహాన ‘రిచెస్ట్’ కావడానికి మ్యూజిక్ మాత్రమే కారణం కాదు...ఆమె మంచి ఎంటర్ప్రెన్యూర్ కూడా. చదవండి: పదేళ్ల బాలుడికి అంతర్జాతీయ యంగ్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ అవార్డు..!! -
బియాన్స్... బడ్జెట్ అదుర్స్
ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కూతురి పెళ్లి సంబరాలు ఇటీవల జరిగిన విషయాన్ని వినే ఉంటారు. ఇండియన్ సెలబ్రిటీలను మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ సెలబ్రిటీలను కూడా ఆహ్వానించారు అంబానీ. కేవలం వెడ్డింగ్ పార్టీల కోసమే సుమారు వంద మిలియన్ డాలర్లను కార్లో పెట్రోల్లా ఖర్చు పెట్టారట ఆయన. ఈ ఫంక్షన్లో హాలీవుడ్ సింగర్ బియాన్స్ కనిపించడం విశేషం. ఎందుకంటే బియాన్స్ ఒక్క ప్రైవేట్ పార్టీకి సుమారు 3–4 మిలియన్ డాలర్స్ (దాదాపు 20 కోట్ల రూపాయలు) అందుకుంటారట. 2017లో మ్యూజిక్ ఇండస్ట్రీలో అత్యధికంగా సంపాదించిన సింగర్‌గా బియాన్స్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. ఇంతకీ ఆమె అంబానీ పార్టీ కోసం ఎంత తీసుకున్నారంటే.. సుమారు 28 కోట్లు పుచ్చుకున్నారని టాక్. -
ఓ ఇంటివారయ్యారు!
అత్తారింటికి దారి వెతుక్కుంటూ ఇండియాకి వచ్చారు ప్రియాంకా చోప్రా బాయ్‌ఫ్రెండ్, హాలీవుడ్ సింగర్, ఆర్టిస్ట్ నిక్ జోనస్. అత్తగారిని పరిచయం చేసుకోవడానికి రెక్కల వాహనంపై ఈ కాబోయే అల్లుడుగారు వచ్చారని బాలీవుడ్లో అనుకుంటున్నారు. విషయం ఏంటంటే.. ఇటీవలే ప్రియాంకా చోప్రా ఓ ఇంటివారయ్యారు. అదేనండీ... ముంబైలో కొత్త ఇల్లు కొనుక్కున్నారు. ఆ గృహప్రవేశానికి గెస్ట్‌గా తన బాయ్‌ఫ్రెండ్‌ని ఆహ్వానించారట. అలాగే అత్తగారిని కూడా పరిచయం చేసినట్టుంటుందని భావించారేమో, బాయ్‌ఫ్రెండ్‌కి కబురెట్టారు. దాంతో గురువారం రాత్రి ముంబై చేరుకున్నారు నిక్. ఫారిన్లో నిక్, ప్రియాంక బాహాటంగా తిరిగినా ముంబైలో కెమెరా కంటపడకుండా జాగ్రత్త పడ్డారు. ఆల్రెడీ ప్రియాంకాను నిక్ తన కజిన్ వెడ్డింగ్‌కి తీసుకెళ్లి తమ ఫ్యామిలీకి పరిచయం చేశారు. ఇప్పుడు తల్లి మధుచోప్రాకి పరిచయం చేయడానికే నిక్ని ప్రియాంక ముంబైకి రప్పించారట. ఈ లవ్ బర్డ్స్ ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారంటే త్వరలోనే డోలు భాజా మోగించేందుకు సిద్ధమవుతున్నారని అనుకోవచ్చు. -
'నా కూతురు చనిపోగానే బతకాలనిపించలేదు'
లండన్: తన కూతురు చనిపోయిన తర్వాత ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రముఖ హాలీవుడ్ సింగర్ బాబ్ గెల్డాఫ్ తెలిపారు. ఓ టీవీ చానెల్‌తో మాట్లాడిన ఆయన తన కూతురు చనిపోవడం పట్ల తీవ్ర మదనపడ్డారు. 2014లో తన కూతురు పీచెస్ విపరీతంగా మత్తుపదార్థాలు సేవించి ప్రాణాలు విడిచిందని, ఆమె ప్రవర్తనను ముందుగా అంచనా వేయకపోవడంవల్లే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పారు. ఆమె చనిపోయిన తర్వాత తనకు ఏం చేయాలో పాలుపోలేదని, ఒక రకమైన ఒత్తిడిలోకి పోయానని, అయితే, బతికి ఉండటానికి గల కారణాలు, చనిపోవడానికి కారణాలు ఒక జాబితాగా చేసుకొని పదే పదేవాటిని చూసుకున్నానని చెప్పారు. తన నిర్ణయంపట్ల మరో స్నేహితుడు చెంపదెబ్బ కొట్టినంతగా మాటలు అనండంతో ఆత్మహత్య చేసుకోకుండా ఆగిపోయానని తెలిపారు. ప్రతి ఒక్కరూ తనను తండ్రిగా విఫలమయ్యానని అంటుంటే ఎంతో బాధ కలిగిందని, అది కూడా నిజమే అన్నట్లుగా అనిపించిందన్నారు. -
నిన్ను ప్రేమించాను..కానీ నువ్వు బాకీ పడ్డావు!
లాస్ ఏంజిల్స్: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. కానీ నువ్వు నాకు బాకీ పడ్డావు అంటూ హోయలు ఒలకబోస్తోంది హాలీవుడ్ గాయని, నటి టేలర్ స్విఫ్ట్ . ఇదేదో ఆమె ప్రేమికుడు మధ్య జరిగిన సంభాషణ కాదండోయ్. తన పెంపుడు జంతువు పిల్లితో టేలర్ అన్న మాటలు. ఈ మధ్య తన కాళ్లను భారీ మొత్తంలో బీమా చేయించిన వార్తలు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై వస్తున్న వరుస కథనాలకు ఫుల్ స్టాప్ పెట్టింది టేలర్. తన పెంపుడు పిల్లి టేలర్ కాళ్లపై గాయం చేసిన కారణంగానే బీమా చేయించాల్సి వచ్చిందని తాజాగా వివరణ ఇచ్చింది.. 'నేను నిన్ను ప్రేమిస్తున్నా.. అయినా నువ్వు నా కాళ్లపై గాయం చేశావు. నువ్వు నాకు రూ.250 కోట్లు(40 మిలియన్ డాలర్లు) బాకీ పడ్డావు'అంటూ తన పెంపుడు పిల్లిని ఉద్దేశించి గారాలు పోతోంది టేలర్. అయితే తన కాళ్ల విలువ రూ. 60 కోట్లు వరకూ ఉంటుందని తొలుత భావించినా.. సదరు ఇన్సురెన్స్ కంపెనీ ఆ కాళ్లకు రూ.250 కోట్ల బీమా చేసింది. ఇంకేముంది ఆ అందమైన కాళ్లకు అంత మొత్తంలో ఇన్సురెన్స్ దక్కడంతో ఆ నటి ఆనందానికి అవధుల్లేవు. ప్రస్తుతం టేలర్ తన నటించిన'1989' సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రపంచవ్యాప్త పర్యటనకు సిద్దమవుతోంది. -
ఆమె కాళ్లు 250 కోట్లు!
వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజం! హాలీవుడ్ గాయని, నటి, నిర్మాత టేలర్ స్విఫ్ట్ తన కాళ్లను దాదాపు 250 కోట్ల రూపాయలకు బీమా చేయించారు. రెండు కాళ్లకు అంత మొత్తమా? అని ఆశ్చర్యంగా ఉంది కదూ. టేలర్ మంచి గాయని. వేదికలపై పాటలు పాడుతూ, ఆమె చేసే నృత్యాలకు విదేశాల్లో బోల్డంత క్రేజ్ ఉంది. పైగా.. ఈవిడ చేసే ఓ ప్రత్యేకమైన స్టెప్ని కళ్లార్పకుండా చూసే అభిమానులు ఉన్నారు. ఆ స్టెప్ వేస్తున్నప్పుడు టేలర్ కాళ్లు చూస్తూ ఉండాలనిపిస్తుంటుందని ఆమె అభిమానులు బహిరంగంగా పేర్కొన్న సందర్భాలు న్నాయి. ఈ మధ్య ఎందుకో టేలర్‌కి, ఒకవేళ తన కాళ్లకు ఏమైనా అయితే, అప్పుడు తన జీవితం ఏం కానూ అనిపించిందట. ఈ ఆలోచనే ఆమె తన కాళ్లను బీమా చేయించేలా చేసింది. మేలో ఓ మ్యూజికల్ టూర్ ప్లాన్ చేసుకున్నారామె. ఆ లోపు బీమా చేయించేయాలని అనుకున్నారట. మామూలుగా తన కాళ్లు 60 కోట్లు వరకూ పలుకుతాయని టేలర్ అనుకున్నారట. కానీ, బీమా కంపెనీవారు ‘మీ కాళ్ల విలువ మీకు తెలియడంలేదు. 250 కోట్ల వరకూ బీమా చేయొచ్చు’ అన్నారట. ఆ మొత్తం విని షాకయ్యారట టేలర్. ‘హమ్మయ్య ఒకవేళ కాళ్లకు ఏమైనా అయ్యి, డాన్స్ చేయడానికి సహకరించకపోతే.. భయపడాల్సిన అవసరంలేదు. జీవితాంతం కాలు మీద కాలేసుకుని బతికేయొచ్చు’ అని చిరునవ్వు నవ్వుకున్నారట టేలర్.