చిన్న వయసులో గాయని అకాల మరణం.. నాలుగేళ్లుగా | Night Bride Jane Marczewski Dies At 31 With Cancer | Sakshi
Sakshi News home page

Jane Marczewski: చిన్న వయసులో గాయని అకాల మరణం.. నాలుగేళ్లుగా

Published Wed, Feb 23 2022 2:08 PM | Last Updated on Wed, Feb 23 2022 2:45 PM

Night Bride Jane Marczewski Dies At 31 With Cancer - Sakshi

Night Bride Jane Marczewski Dies At 31 With Cancer: హాలీవుడ్​ ప్రముఖ గాయని, 'అమెరికాస్​ గాట్​ టాలెంట్'​ మాజీ కంటెస్టెంట్​ జేన్​ మార్షెస్కీ కన్నుమూశారు. క్యాన్సర్​తో పోరాడి 31 ఏళ్ల చిన్న వయసులో మరణించారు. జేన్ లంగ్స్​, లివర్, వెన్నెముకకు క్యాన్సర్​ పాకడంతో ఆమెను కాపాడలేకపోయారు. క్యాన్సర్​తో నాలుగేళ్ల పోరాటం తర్వాత ఫిబ్రవరి 19న జేన్​ మరణించిందని ఆమె కుటుంబ సభ్యులు సోమవారం (ఫిబ్రవరి 21) తెలిపారు. 'జేన్ మరణం మాకు తీరని లోటు. తన అకాల మరణంతో మేము ఎంతో కృంగిపోయాం' అని జేన్ కుటుంబ సభ్యులు ప్రముఖ వార్త సంస్థకు తెలిపారు. 

ఇంకా 'జేన్​ గురించి తెలిసిన వారు ఎవరైనా సరే ఆమె వ్యక్తిత్వం, హాస్య చతురతను ఎంతగానో ఇష్టపడతారు. ప్రతి సందర్భంలోనూ తనదైన చమత్కారపు శైలి ఉంటుంది. ఆమె సంగీతం, యేసు ప్రభువులో ఉన్న బలాన్ని ఎంతోమందికి అందించింది. జేన్​పై ప్రేమ, మద్దతుకు చూపించిన ప్రతీ ఒక్కరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం.' అని పేర్కొన్నారు. జేన్​ మార్షెస్కీ నైట్​బ్రైడ్​ అనే షోతో ఎంతో పాపులర్​ అయింది. అమెరికాస్​ గాట్​ టాలెంట్​ 16వ సీజన్​లో జేన్​ పార్టిసిపేట్​ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement