'హ్యారీ పోటర్' నటి- ఆస్కార్ విజేత కన్నమూత | Harry Potter Actress Maggie Smith Passed Away At The Age Of 89 | Sakshi
Sakshi News home page

Maggie Smith Death: తుదిశ్వాస విడిచిన 'హ్యారీపోటర్' నటి

Published Sat, Sep 28 2024 9:44 AM | Last Updated on Sat, Sep 28 2024 10:04 AM

Harry Potter Actress Maggie Smith Passed Away

'హ్యారీ పోటర్' పేరు చెప్పగానే అద్భుతమైన సినిమాలు గుర్తొస్తాయి. దాదాపు ఇరవై ఏళ్ల క్రితమే అదిరిపోయే గ్రాఫిక్స్‌తో తీసిన చిత్రాలు చాలామందికి ఫేవరెట్. ఇందులో పాత్రధారులకు కోట్లాది మంది అభిమానులున్నారు. గత కొన్నాళ్లుగా 'హ్యారీ పోటర్' నటీనటులు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. గతేడాది మైఖేల్ గ్యాంబెన్ అలియాస్ ప్రొఫెసర్ డంబెల్ డోర్ చనిపోయారు. ఇప్పుడు ఆయన మృతి చెందిన సరిగ్గా ఏడాదికి మరో నటి చనిపోయారు.

(ఇదీ చదవండి: 'దేవర' పార్ట్ 2లో స్టోరీ ఏం ఉండొచ్చు?)

'హ్యారీ పోటర్' సిరీస్‌లో ప్రొఫెసర్ మెక్ గొనగల్ పాత్రలో అలరించిన మ్యాగీ స్మిత్ (89) అనారోగ్య కారణాలతో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. కెరీర్‌లో మంచి మంచి సినిమాలు చేసిన ఈమె.. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుని కూడా రెండు సార్లు అందుకున్నారు. అలానే 'డౌన్ టౌన్ అబే' అనే టీవీ సిరీస్‌తోనూ ఈమె పాపులారిటీ సొంతం చేసుకున్నారు.

(ఇదీ చదవండి: కేసు పెట్టిన సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement