Harry Potter
-
'హ్యారీ పోటర్' నటి- ఆస్కార్ విజేత కన్నమూత
'హ్యారీ పోటర్' పేరు చెప్పగానే అద్భుతమైన సినిమాలు గుర్తొస్తాయి. దాదాపు ఇరవై ఏళ్ల క్రితమే అదిరిపోయే గ్రాఫిక్స్‌తో తీసిన చిత్రాలు చాలామందికి ఫేవరెట్. ఇందులో పాత్రధారులకు కోట్లాది మంది అభిమానులున్నారు. గత కొన్నాళ్లుగా 'హ్యారీ పోటర్' నటీనటులు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. గతేడాది మైఖేల్ గ్యాంబెన్ అలియాస్ ప్రొఫెసర్ డంబెల్ డోర్ చనిపోయారు. ఇప్పుడు ఆయన మృతి చెందిన సరిగ్గా ఏడాదికి మరో నటి చనిపోయారు.(ఇదీ చదవండి: 'దేవర' పార్ట్ 2లో స్టోరీ ఏం ఉండొచ్చు?)'హ్యారీ పోటర్' సిరీస్‌లో ప్రొఫెసర్ మెక్ గొనగల్ పాత్రలో అలరించిన మ్యాగీ స్మిత్ (89) అనారోగ్య కారణాలతో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. కెరీర్లో మంచి మంచి సినిమాలు చేసిన ఈమె.. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుని కూడా రెండు సార్లు అందుకున్నారు. అలానే 'డౌన్ టౌన్ అబే' అనే టీవీ సిరీస్‌తోనూ ఈమె పాపులారిటీ సొంతం చేసుకున్నారు.(ఇదీ చదవండి: కేసు పెట్టిన సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్)One year ago today: Michael Gambon passed away.Today: Maggie Smith passed away.Two legendary people who played two of our favorite Harry Potter characters. 😢#RIPMichaelGambon#RIPMaggieSmith pic.twitter.com/TE8nmaVSqS— Harry Potter Universe (@HPotterUniverse) September 27, 2024All four of them have passed away 💔💔💔💔 pic.twitter.com/4B2D7bNBnP— Harry Potter Universe (@HPotterUniverse) September 27, 2024 -
'హ్యారీ పోటర్' నటుడు డంబెల్డోర్ కన్నుమూత
ఇప్పటి జనరేషన్‌కి పెద్దగా తెలియకపోవచ్చు కానీ 90ల్లో 'హ్యారీపోటర్' సినిమాలు ఓ ఊపు ఊపాయి. వందల కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకోవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా విశేషాదరణ దక్కించుకున్నాయి. ఇందులో ప్రధాన పాత్రల్లో నటించిన యాక్టర్స్‌తోపాటు మిగతా వాళ్లు కూడా బోలెడంత క్రేజ్ తెచ్చుకున్నారు. అలా 'హ్యారీపోటర్'లో డంబెల్ డోర్ పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ ఇప్పుడు తుదిశ్వాస విడిచారు. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' కోసం నాగార్జునకి అన్ని కోట్ల రెమ్యునరేషన్!?) 'హ్యారీపోటర్' డంబెల్డోర్గా ప్రసిద్ధి చెందిన నటుడి అసలు పేరు సర్ మైకేలే గాంబన్. ఐర్లాండ్ పుట్టిన ఈయన చిన్నతనంలోనే తల్లిదండ్రులతో కలిసి లండన్ వచ్చేశారు. కాస్త వయసొచ్చిన తర్వాత థియేటర్, టీవీ, సినిమాల్లో పలు పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇకపోతే 'హ్యారీపోటర్' తొలి రెండు భాగాల్లో డంబెల్డోర్ పాత్రధారి రిచర్డ్ హ్యారీస్ చనిపోవడంతో ఆ రోల్ చేసే ఛాన్స్ ఈయనకు వచ్చింది. అలా దాదాపు 'హ్యారీపోటర్' ఫ్రాంచైజీలోని 6 సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఈయన వయసు 82 ఏళ్లు. గత కొన్నాళ్లుగా న్యూమోనియోతో బాధపడుతున్న ఈయన.. ఆస్పత్రిలో కుటుంబసభ్యులు ముందే కన్నుమూశారు. ఇప్పుడు ఈ విషయం.. 'హ్యారీపోటర్' అభిమానుల్ని కంటతడి పెట్టిస్తోంది. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 37 సినిమాలు) RIP #MichaelGambon - you will be missed! “Happiness can be found, even in the darkest of times, if one only remembers to turn on the light” - Prof. Albus Percival Wulfric Brian #Dumbledore pic.twitter.com/lIQqQKkklp — Jason Frazer (@ITSJASONFRAZER) September 28, 2023 -
స్మార్ట్ఫోనే కొంపముంచిందా? పాపులర్ పబ్లిషింగ్ హౌస్ సీఈవో దుర్మరణం
Bloomsbury US CEO Adrienne Vaughan: హ్యారీ పోటర్ బ్లూమ్స్బరీ అమెరికా పబ్లిషింగ్ హౌస్ సీఈవో అడ్రియన్ వాఘన్ (45) దుర్మరణం విషాదాన్ని నింపింది. ఇటలీలోని అమాల్ఫీ తీరంలో జరిగిన ఘోర బోటింగ్ ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై బ్లూమ్స్బరీ అమెరికా తీవ్ర విచారాన్ని ప్రకటించింది. అడ్రియన్ అకాల మరణం తమకు తీరని లోటని వ్యాఖానించింది. ఆమె నేతృత్వంలోనే అమెరికా తమకు అతిపెద్ద మార్కెట్‌గా ఎదిగిందని తెలిపింది. సీఎన్ఎన్ ప్రకారం తన భర్త,ఇద్దరు పిల్లలతో విహార యాత్రంలోఉండగా ఈ విషాదం చోటు చేసుకుంది. అద్దెకు తీసుకున్న స్పీడ్‌బోట్‌లో ప్రయాణిస్తుండగా, 80 మంది పర్యాటకులతో ప్రయాణిస్తున్న పెద్ద సెయిలింగ్ బోట్‌ను ఢీకొట్టింది. దీంతో వాఘన్ నీటిలో పడిపోవడంతో, తీవ్ర గాయాల పాలయ్యారు. అత్యవసర సిబ్బంది వచ్చి ఆమెను రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే మరణించినట్లు ప్రకటించారు.వాఘన్ భర్త మైక్ వైట్‌కు స్వల్పగాయాలయ్యాయి.వారి ఇద్దరు పిల్లలు లియన్నా (14) మేసన్(11) కు ఎలాంటి గాయాలు కానప్పటికీ, తల్లి మరణంవారిని తీవ్రంగా కలిచి వేసింది. మరోవైపు బోట్ స్కిప్పర్ ఎలియో పెర్సికోపై వాఘన్ భర్త తీవ్ర ఆరోపణలు గుప్పించారు. మద్యం సేవించడంతోపాటు, స్మార్ట్‌ఫోన్ వాడుతూనే ఉన్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సలెర్నోలోని ఇటాలియన్ ప్రాసిక్యూటర్లు దర్యాప్తు ప్రారంభించారు. అటు అనుమానితుడుమద్యం సేవించి, కొకైన్ వాడినట్లు టాక్సికాలజీ పరీక్షలు నిర్ధారించాయి. కాగా 2021లో బ్లూమ్స్బరీ అమెరికాకు హెడ్‌గా నిమిమితులైన వాఘన్ 2020లో అమెరికాలో హ్యారీ పాటర్ పుస్తకాలను ప్రచురించే సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీవోవోగా చేరారు. ఫైనాన్స్‌లో ఎంబీఏతోపాటు NYU స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో గ్రాడ్యుయేట్ అయిన వాఘన్ గతంలో డిస్నీ పబ్లిషింగ్ గ్రూప్, ఆక్స్ఫర్డ్ ఫ్రీ ప్రెస్‌కి ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. వాఘన్ నెట్‌వర్త్ దాదాపు 1 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. -
సినీ పరిశ్రమలో విషాదం.. ‘హ్యారీపోటర్’ నటుడు హఠాన్మరణం
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు, ‘హ్యారీపోటర్’ ఫేం పాల్ గ్రాంట్(56) కన్నుమూశారు. బ్రిటిష్ నటుడైన పాల్ గ్రాంట్ లండన్‌లోని యాస్టర్ రోడ్ సెయింట్ పాంక్రస్ స్టేషన్లో ఒక్కసారిగా కుప్పుకూలిపోయాడు. దీంతో స్థానికులు ఆయనను ఆస్పత్రిలో చెర్పించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు స్థానికి మీడియా పేర్కొంది. దీంతో ఆయన మృతిపై పలువురు హాలీవుడ్ నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. చదవండి: మోహన్ బాబు బర్త్‌డేలో కొత్త కోడలు మౌనిక సందడి! విష్ణు ఫ్యామిలీ ఎక్కడా? కాగా పాల్ గ్రాంట్ 1980ల టైంలో విల్లో, లైబరన్త్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కాలంలో హ్యారీపోటర్, స్టార్ వార్స్ లాంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఆయనకు ముగ్గురు పిల్లలు భార్య ఉన్నారు. స్పాండిలోపిఫిసిల్ డైస్పాల్షియా కాంజెనిటల్ అనే అరుదైన జెనిటిక్ డిజార్డర్ కారణంగా మరగుజ్జులా ఉండిపోయాడు. ఈ కారణంగా ఇతడికి పలు అనారోగ్య సమస్యల కూడా వచ్చేవి. ఈ పరిస్థితుల్లోనూ డ్రగ్, ఆల్కహాల్ తాగడం వ్యసనంగా మారిపోయిమంది. ఈ క్రమంలో 2014లో కొకైన్ సేవిస్తూ అడ్డంగా దొరికిపోవడం అప్పట్లో హాట్ టాపిక్ అయిపోయింది. NEW: Paul Grant, who played an Ewok in Star Wars: Return of the Jedi and a goblin in Harry Potter and the Philosopher's Stone, died after collapsing outside a London train station. He was 56 years old. #diedsuddenly pic.twitter.com/NmjTkyhGrl — DiedSuddenly (@DiedSuddenly_) March 20, 2023 -
మోస్ట్ వాంటెడ్ గేమ్
ఒపెన్–వరల్డ్, యాక్షన్ రోల్–ప్లేయింగ్ గేమ్ ‘హాగ్వార్ట్స్ లెగసీ’ నేడు విడుదల అవుతుంది. హ్యారీపోటర్ నవలల ఆధారంగా అల్లుకున్న కథ ఇది. ఈ గేమ్‌లో ప్లేయర్స్ హాగ్వార్ట్స్ స్కూల్ ఆఫ్ విచ్‌క్రాఫ్ట్ క్లాస్‌లకు హాజరు కావాల్సి ఉంటుంది. ప్లేయర్ క్యారెక్టర్ యుద్ధతంత్రాలలో నైపుణ్యం సాధించాల్సి ఉంటుంది. లియర్జర్ఫిగ్లాంటి కొత్త క్యారెక్టర్లను ఈ ఆటలో ప్రవేశ పెట్టారు. మూడు మంత్రదండాలలో ప్రతిదానికి తనదైన ప్రత్యేక శక్తి ఉంటుంది. హ్యారీపోటర్ అభిమానులకు ‘మోస్ట్ వాంటెడ్ గేమ్’ గా గుర్తింపు ΄పొందింది. జానర్స్: ఒపెన్ వరల్డ్ ఎంటర్టైన్మెంట్ నెరేటివ్ మోడ్: సింగిల్–ప్లేయర్ వీడియో గేమ్ ప్లాట్‌ఫామ్స్: పీసి, పీఎస్5, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్ -
తీవ్ర విషాదం.. హ్యారీ పాటర్' నటుడు కన్నుమూత
ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. 'హ్యారీ పాటర్' నటుడు రాబో కాల్ట్రైన్(72) కన్నుమూశారు. ఈ విషయాన్ని కాల్ట్రైన్ ఏజెంట్ బెలిందా రైట్ దృవీకరించారు. 'ఆయన అద్భుతమైన నటుడే కాకుండా, న్యాయపరంగా ఎంతో తెలివైనవాడని, అతన్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాం' అంటూ బెలిందా ఎమోషనల్ అయ్యింది.అయితే కాల్ట్రైన్ మరణానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ప్రముఖ టీవీ సిరీస్ క్రాకర్లో నేరాలను పరిష్కరించే సైక్రియార్టిస్ట్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న కాల్ట్రైన్ హ్యారీ పాటర్ చిత్రంతో మరింత పాపులర్ అయ్యాడు. ఈ సినిమాలో హ్యాగ్రిడ్ పాత్రలో ఆయన నటనకు ఫిదా కాని ప్రేక్షకులు ఉండరు. ఇక కాల్ట్రైన్ తన నటనతో వరుసగా మూడుసార్లు ఉత్తమ నటుడిగాబ్రిటీష్ అకాడమీ టెలివిజన్ అవార్డులను గెలుచుకున్నాడు. జేమ్స్ బాండ్,గోల్డెన్ ఐ, ది వరల్డ్ ఈజ్ వంటి పలు చిత్రాల్లో ఆయన నటించాడు. కాల్ట్రైన్ చివరగా రిటర్న్ టు హాగ్వార్ట్స్ వార్షికోత్సవంలో కనిపించాడు. కాగా కాల్ట్రైన్ మరణంపై పలువురు హాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. -
మీరు గానీ.. ఒక్కసారి గానీ.. ఈ షీల్డ్ వెనక్కి వెళ్లారంటే!
హ్యారీ పాటర్ సినిమాలో చూసే ఉంటారు. ఒక వింత వస్త్రాన్ని చుట్టేసుకొని హ్యారీ టక్కున మాయమైపోతుంటాడు. అతను అక్కడే ఉన్నా చూసే వాళ్లకు మాత్రం లేడనిపించేలా ఆ వస్త్రం కనికట్టు చేస్తుంది. వెనకున్న వస్తువులు కనిపిస్తాయి కాని అతను మాత్రం కనిపించడు. మళ్లీ దాన్ని తీసేయగానే హ్యారీ బయటకు కనిపిస్తుంటాడు. ఇలా సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కనిపించే ఈ వెరైటీ వస్త్రాన్ని ఇప్పుడు నిజంగానే షీట్ రూపంలో తయారు చేశారు. లండన్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ ‘ఇన్విజిబిలిటీ షీల్డ్ కో’.. ఈ మ్యాజిక్ షీట్‌ను తాజాగా ప్రపంచానికి పరిచయం చేసింది. ఎంతలా కష్టపడ్డారో! ఇన్విజిబిలిటీ షీల్డ్‌ను అనుకున్నట్టు తయారు చేయడానికి ఎంతో కష్టపడ్డామని తయారీ బృందం చెప్పింది. ఎన్నో వస్తువులు, పదార్థాలను పరీక్షించామని, ఎన్నో వైఫల్యాలు ఎదురయ్యాయని తెలిపింది. విభిన్న కోణాలు, ఆకృతులు, దూరాల్లో లెన్స్‌లను పరీక్షించామని.. చివరగా కుంభాకార కటకాలను పాలిమర్ షీట్లో ఓ శ్రేణిలో అమర్చి అనుకున్న ఫలితాన్ని రాబట్టామని వివరించింది. గడ్డి ప్రాంతాలు, తీర ప్రాంతాలు లాంటి బ్యాక్‌గ్రౌండ్ ఒకేలా ఉన్న ప్రదేశాల్లో ఈ షీల్డ్‌లు అద్భుతంగా పని చేస్తాయంది. ఎక్కువ ఉష్ణోగ్రతను, అల్ట్రావయోలెట్ కాంతిని తట్టుకోగలవని తెలిపింది. ఇంతకీ ఈ షీల్డ్‌ల ధరెంతో తెలుసా? 37్ఠ25 ఇంచుల షీల్డ్‌కు కేవలం రూ.30 వేలు. ఇప్పటికే 25 షీల్డ్‌లను తయారు చేశారు. మరిన్ని తయారు చేసేందుకు సిద్ధమవుతున్నారు. షీల్డ్ ఎలా పని చేస్తుందంటే..? ఇన్విజిబిలిటీ షీల్డ్ వెనుక దాక్కునే వ్యక్తులు, వస్తువులు కనిపించకుండా ఉండేందుకు నిలువు పద్ధతిలో ప్రత్యేక లెన్స్ శ్రేణిని (ఒకదాని పక్కన మరొకటి వరుసగా పేర్చడం) వాడారు. షీల్డ్ ముందు నుంచి చూసే వ్యక్తికి షీల్డ్ వెనకున్న వ్యక్తి కనిపించకుండా కాంతిని పరావర్తనం చెందించే సూత్రాన్ని ఉపయోగించారు. అంటే షీల్డ్ వెనకున్న వ్యక్తి నుంచి పరావర్తనం చెందే కాంతి షీల్డ్ ముందున్న వ్యక్తి వరకు చేరకుండా పక్కలకు ప్రసరించేలా లెన్స్‌లను వాడారు. షీల్డ్ వెనకున్న బ్యాక్‌గ్రౌండ్ మాత్రం బాగా కనబడేలా జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తంగా షీల్డ్ వెనకున్న వ్యక్తి కనిపించడు కానీ వెనకాల బ్యాక్‌గ్రౌండ్ మాత్రం కనిపిస్తుంది. అంటే షీల్డ్ వెనకున్న వ్యక్తి మాయమైనట్టే! చదవండి: 24 వేల ఏళ్లుగా గడ్డకట్టే మంచులోనే పడిఉంది... కానీ ఆ జీవి బతికే ఉంది! –సాక్షి సెంట్రల్ డెస్క్ -
నిర్వాహకుల పొరపాటుపై హీరోయిన్ స్పందన.. అది నేను కాదు కానీ
Emma Watson Reacts To Mistake Of Harry Potter Hogwarts Reunion: అప్పుడప్పుడూ సినీ సెలబ్రిటీలు, చిత్ర యూనిట్ సభ్యులు తెలిసో తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అవి గమనించిన నెటిజన్లు మాత్రం కావాలనే ట్రోల్ చేస్తుంటారు. సెటైర్లు వేస్తుంటారు. నెటిజన్ల క్రియేటివిటీని చూసి తారలు, చిత్ర బృంద తమదైన శైలీలో స్పందిస్తారు. ఇంతకుముందు ఆర్ఆర్ఆర్ సినిమాలో ఐటమ్ సాంగ్ గురించి కామెంట్ చేసిన ఒక యూజర్‌కు 'నువ్ యాక్ట్ చేస్తావా' అని ఆ ఆర్ఆర్ఆర్ ట్విటర్ గ్రూప్ అడ్మిన్ స్పందించిన తీరు ఎంతోమందికి నవ్వు తెప్పిచ్చింది. ఇటీవల నూతన సంవత్సరం సందర్భంగా హ్యారీ పోటర్ 20వ వార్షికోత్సవాన్ని (Harry Potter Reunion Special) హెచ్‌బీవో మ్యాక్స్ నిర్వహించింది. ఇదీ చదవండి: అది ఇది కాదు.. ఎమ్మా వాట్సన్‌కు బదులు మరో హీరోయిన్ 'హ్యారీ పోటర్ 20వ వార్షికోత్సవం: రిటర్న్ టు హాగ్వార్ట్' (Hogwarts Reunion) పేరుతో టెలీకాస్ట్ చేసిన స్పెషల్ ఎపిసోడ్లో ఎమ్మా వాట్సన్‌కు బదులు ఎమ్మా రాబర్ట్స్ చిన్నప్పటి ఫొటో పెట్టి పొరపాటు చేశారు నిర్వాహకులు. దీనిపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ పొరపాటుపై స్పందించింది ఎమ్మా వాట్సన్. మీక్కీ మౌస్ చెవులను ధరించిన ఎమ్మా రాబర్ట్స్ చిన్నప్పటి పిక్‌ను తన ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేస్తూ 'ఈ క్యూట్‌గా ఉన్నది నేను కాదు' అని క్యాప్షన్ ఇచ్చింది. అలాగే #వాట్సన్సిస్టర్స్ఫరెవర్ అని హ్యాష్‌ట్యాగ్ యాడ్ చేసింది. View this post on Instagram A post shared by Emma Watson (@emmawatson) ఇదీ చదవండి: స్పానిష్ నటి ఇంట్లో వినాయకుడి చిత్రపటం.. వైరల్ -
యో చూస్కో బడలా.. ఆమెకు బదులు మరో హీరోయిన్.. నెటిజన్ల ట్రోలింగ్
Emma Watson Or Emma Roberts Trolled In Harry Potter Reunion Special: హాలీవుడ్ నుంచి వచ్చిన హ్యారీ పోటర్ చిత్రం అంటే తెలియని వారుండరు. సినిమాలోని వింతలు, అద్భుతాలు పిల్లల నుంచి పెద్దవారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. 2011లో ఈ సిరీస్‌లోని ఎనిమిదో చిత్రం 'హ్యారీ పోటర్ అండ్ ది డెత్లీ హాలోస్ పార్ట్ 2'తో ఈ ఫ్రాంచైజీ ముగిసింది. నూతన సంవత్సరం సందర్భంగా హ్యారీ పోటర్ 20 వార్షికోత్సవాన్ని (Harry Potter Reunion Special) నిర్వహించింది హెచ్‌బీవో మ్యాక్స్. దీనికి 'హ్యారీ పోటర్ 20వ వార్షికోత్సవం: రిటర్న్ టు హాగ్వార్ట్' స్పెషల్ ఎపిసోడ్‌ను టెలికాస్ట్ చేశారు. హెచ్‌బీవో మ్యాక్స్ అందిస్తున్న ఈ స్పెషల్ ఎపిసోడ్ ఇండియాలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది. ఈ ఎపిసోడ్లో డేనియల్ రాడ్‌క్లిఫ్, ఎమ్మా వాట్సన్, తదితర సహ నటులు మెమరీ లేన్‌లో తమ అనుభవాలను పంచుకున్నారు. అయితే ఇందులో నిర్వాహకులు ఒక పెద్ద తప్పు చేశారు. ఎమ్మా వాట్సన్ తన అనుభవాలను చెబుతున్న సెగ్మెంట్లో ఆమెకు బదులు ఎమ్మా రాబర్ట్స్ చిన్న నాటి ఫొటోను చూపించారు. ఇందులో రాబర్ట్స్ మాంటేజ్ మిన్నీ మౌస్ చెవులను ధరించి ఉంటుంది. ఆ పిక్ 2012లో తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది ఎమ్మా రాబర్ట్స్. ఇది చూసిన ఎమ్మా అభిమానులు రీయూనియన్ నిర్వాహకులపై 'యో.. చూస్కో బడలే, అది ఇది కాదు' అన్నట్లుగా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంకా 'దయచేసి నాకు సహాయం చేయండి. తను కచ్చితంగా ఎమ్మా వాట్సన్ కాదు.. ఎమ్మా రాబర్ట్స్ అని చెప్పండి' అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. అలాంటి మరికొన్ని పోస్టులను చూసేయండి. View this post on Instagram A post shared by Emma Roberts (@emmaroberts) GUYS HELP ME THATS LITERALLY EMMA ROBERTS NOT EMMA WATSON ☠️☠️☠️☠️☠️☠️☠️☠️☠️ #ReturnToHogwarts #HarryPotter20thAnniversary pic.twitter.com/bLbXcCUpnh — 𝕞𝕒𝕟𝕚𝕒 (@vee_delmonico99) January 1, 2022 Harry Potter 20th Anniversary how do u mess up putting an Emma Roberts child photo instead of an Emma Watson one? You think with such an icon series there would 2X & 3X check things for the reunion.😋 An American actress when we know American kids weren’t used. #ReturnToHogwarts — Krista (@BeatGrrl18) January 2, 2022 I tried to search "emma watson baby" on google and yes that emma roberts baby picture shows up at the top 😂#EmmaWatson #ReturnToHogwarts pic.twitter.com/rkGkqbDPYi — loony (@girlonquibbler) January 2, 2022 Wow. The editors / producers of #HarryPotter #ReturnToHogwarts seriously used a picture of a young Emma Roberts instead of Emma Watson. HOW did this get past everyone?!?! 😂😂😂 pic.twitter.com/kNm0ZkWOh5 — Tyler (@OldGoldenSnitch) January 2, 2022 -
వావ్ ఏంటీ అద్భుతం... ఆకాశంలో హ్యారీపాటర్సినిమాలో మాదిరి ఎగురుతోంది!!
ఒక్కోసారి మనకు రకరకాల ఆకృతిలో ఆకాశంలోని మబ్బులు కనిపిస్తాయి. అవి చూడంగానే భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక్కొసారి ఆకాశంలో అరుదైన దృశ్యాలు కనిపిస్తాయి. పైగా వాటిని కెమరాలో బంధించే లోపే అవి దృశ్యమైపోతాయి. మనం పొరపడ్డామేమో అనిపించేలాంటి కొన్ని విచిత్ర దృశ్యాలు చూసిన అనుభవం కొద్దిమందికి ఎదురై ఉంటుంది. అలాగే ఇక్కడొక మనిషికి అలాంటి సంఘటన ఎదురైంది. కాకపోతే అతను దాన్ని కెమరాలో బంధించి మరి చూపిస్తున్నాడు. ఇపుడు దానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: అమెరికా జర్నలిస్ట్‌కి 11 ఏళ్లు జైలు శిక్ష) అసలు విషయంలోకెళ్లితే...యూఎస్‌లో నివసిస్తున్న లూకా అనే ఒక డెలివరీ డ్రైవర్ ఆకాశంలో తేలియాడే ఒక చెక్ చీపురుని చూస్తాడు. దీంతో అతను ఒక్కసారిగా షాక్‌కి గురవుతాడు. పైగా ఆ చీపురికి ఎవరైన తాడు కట్టి అలా ఎగిరేలా చేస్తున్నారా అని కూడా పరిశీలనగా చూస్తాడు. కానీ అది మాములుగానే మాయద్వీపం, అల్లావుద్దీన్ అద్భుతం దీపం, హ్యారీపాటర్ వంటి సినిమాల్లో మాదిరి అదృశ్య వస్త్రంలా ఎగురుతుంది. పైగా దాన్ని వీడియోలో బంధించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తాడు. దీంతో నెటిజన్లు ఏంటి మాయా దృశ్యం అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: నువ్వే స్టెప్ వేస్తే అదే స్టెప్ వేస్తా!!:వైరల్ అవుతున్న క్యూట్ వీడియో) -
హిజ్రాలు కూడా మహిళలే: నటి
హ్యారీపోటర్ సిరీస్‌లో కనిపించిన నటి బోనీ రైట్ ట్రాన్స్జెండర్లకు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేసింది. "హ్యారీపోటర్ ప్రేమకు మూలమైతే.. ఆ అనంతమైన ప్రేమ నీతోపాటు అందరికీ ఎలాంటి తారతమ్యాలు లేకుండా అందాల్సిందే. ఎందుకంటే ట్రాన్స్జెండర్లు కూడా మహిళలే.. వారిని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను" అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. కాగా 'హ్యారీపోటర్' చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న జేకే రౌలింగ్ ట్రాన్స్జెండర్లపై వివాదాస్పద ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అది హిజ్రాలకు వ్యతిరేకంగా ఉండటంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. దీంతో ఆమె వ్యాఖ్యలను నెటిజన్లు తీవ్రంగా ఖండించారు. (డేంజర్లో హలీవుడ్) వీరితోపాటు "హ్యారీపోటర్" సిరీస్‌లో నటించిన పలువురు నటీనటులు కూడా ఆమె వాదనను ఖండిస్తూ ట్రాన్స్జెండర్లకు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. కానీ ఏ ఒక్కరూ కూడా జేకే రౌలింగ్ పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇప్పటికే హాలీవుడ్ బ్యూటీ ఎమ్మా వాట్సన్ ట్రాన్స్జెండర్లకు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. హిజ్రాలకు సాధారణంగా జీవించే హక్కు ఉందని తెలుపుతూ వారికోసం పాటుపడే సంస్థలకు విరాళం అందజేస్తున్నట్లు ప్రకటించింది. (అదే తేదీకి అవతార్!) -
హ్యారీపొటర్ నాటి పరిస్థితులు రాకూడదు: డేనియల్
హ్యారీపొటర్ ఫేమ్ డేనియల్ రాడ్‌క్లిఫ్ ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తను విపరితంగా మద్యం సేవించేవాడినని వెల్లడించాడు. ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డేనియల్ మాట్లడుతూ.. హ్యారీపొటర్ సినిమా సమయంలో మద్యం తనని ఎంతగా ప్రభావితం చేసిందో ఈ సందర్భంగా వివరించాడు. ‘యువనటుడిగా ఎప్పటికీ గుర్తుండిపోవాలని చాలా కష్టపడ్డాను. అయితే హ్యారీపొటర్లోలో తెలివైన అబ్బాయిగా కనిపించిన నేను... వాస్తవ జీవితంతో దానికి పూర్తిగా భిన్నంగా ఉన్నాను. తరచూ మద్యం సేవిస్తూ ఎప్పుడూ మత్తులోనే ఉండేవాడిని. ఆ సమయంలో తనపై వీపరితంగా విమర్శలు వచ్చేవని ఇక వాటిని పట్టించుకోకుండా ఉండేందుకు మరింతగా మద్యం సేవించేవాడిని’ అని అప్పటీ చేదు అనుభవాలను పంచుకున్నాడు. (నాకు నటించడం రాదు: నటుడు) 2010 నుంచి మంచి నటుడిగా ఉన్న డేనియల్ తన స్నేహితుల సహాయంతో తాగడం మానేసినట్లు పేర్కొన్నాడు. ‘‘ఓ రోజు ఉదయం లేవగానే.. నన్ను నేను ప్రశ్రించుకున్నాను. ఇంతగా మద్యానికి బానిసకావడం మంచిది కాదని.. మానేయాలని నిర్ణయించుకున్నానని. మద్యం మానేయాలనేది నా స్వంతంగా తీసుకున్ననిర్ణయం’’ అని చెప్పాడు. అయితే ‘‘నేను మద్యం మత్తులో ఉన్నప్పటికీ ఒక్కరోజు కూడా షూటింగ్‌కి వేళ్లడం మానలేదు. ఎందుకంటే నేను నా వృత్తిని ఇష్టపడతాను. సెట్లో ఉన్నంత సేపు నా వ్యక్తిగత ఆలోచనలు ప్రభావితం చేసే రోజు ఒక్కరోజు కూడా రాలేదు. ఇందుకు చాలా సంతోషం. ఇక హ్యారీపొటర్ నాటి పరిస్థితులు నా జీవితంలో ఎప్పటికీ రాకూడదని కోరుకుంటున్న’’ అని పేర్కొన్నాడు. -
ఈ ‘హ్యారీపోటర్’ ను చూశారా?
ఇటానగర్ : ఆకుపచ్చ రంగులో ఉన్న ఈ అరుదైన పాము పేరు ‘సలజర్స్ పిట్ వైపర్’. ‘సలజర్ స్లితరిన్’ అనేది హ్యారీపోటర్ సినిమాలోని ఓ క్యారెక్టర్. సలజర్ క్యారెక్టర్‌ను పోలి ఉన్న కారణంగా ఈ పాముకు ఆ పేరు పెట్టారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని అడవుల్లో దీన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. కొన్ని నెలల క్రితం బెంగళూరు నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్‌కు చెందిన జీసన్ ఏ అయాజ్ మిర్జా, బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీకి చెందిన హర్షల్ ఎస్ బోషలే, మరో ఇద్దరు దీన్ని కనుగొన్నారు. ( పైసల పరేషాన్.. బ్యాంకులకు పరుగులు తీస్తున్న జనం ) సలజర్స్ పిట్ వైపర్ ఈ ఏప్రిల్‌లో విడుదలైన ‘జూసిస్టమాటిక్ అండ్ ఎవాల్యూయేషన్’ మ్యాగజైన్లో దీనికి సంబంధించిన వివరాలు బహిర్గతం చేశారు. వారు మాట్లాడుతూ.. ‘సలజర్ అరుణాచల్ ప్రదేశ్‌లో గుర్తించబడ్డ ఐదో అరుదైన పాము. ఈ పాము విషపూరితమైనది. వీపు భాగంలో ఉన్న డిజైన్ కారణంగానే దీనికి ఆ పేరు పెట్టాము. ఇది జినస్ ట్రిమెరెసారస్ లాసపెడెకి వర్గానికి చెందింద’ని తెలిపారు. ( నాకు నటించడం రాదు: నటుడు ) -
నాకు నటించడం రాదు: నటుడు
లాస్ ఎంజెల్స్: తనకు ఎలా నటించాలో తెలియదని అంటున్నాడు ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబర్ట్ థామస్ ప్యాటిన్సన్. ‘నిజంగా నాకు ఎలా నటించాలో రాదు. ఏదో ఒక విధంగా నటించి దాన్ని నిజమని ప్రేక్షకులు అనుకునేలా చేయాలనుకుంటాను. నా నటనతో ప్రేక్షకుల్ని కదిలించగలిగితే.. అప్పుడే దానిని నిజం చేయాగలిగానని నమ్ముతాను. అయితే ప్రేక్షకులు భిన్నమైన అనుభూతిని కలిగించే సన్నివేశాల కోసం ఎదురు చూడటం మానేయాలి’ అని ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చాడు ఈ హ్యరీ పోటర్ నటుడు. అదే విధంగా నటించేటప్పుడు తన చూట్టు కెమెరాలు ఉన్న విషయాన్ని కూడా మరిచిపోతానని, దాదాపుగా సీన్లు అన్నింటిని సింగిల్ టేక్‌లోనే చేస్తానని, ఇది చూసి డైరెక్టర్లు, నిర్మాతలు కొన్నిసార్లు ఆశ్చర్యపోతారంటూ ప్యాటిన్సన్ చెప్పాడు. అయితే కొన్ని సందర్భాలలో తాను పరాభవాలు చూడాల్సి వస్తుందేమోనని అప్పుడప్పుడూ నిరాశకు గురవుతానని, నిరాశ దృక్పథం కూడా కొన్నిసార్లు ప్రయోజనకరంగా ఉంటుందని ప్యాటిన్సన్ చెప్పుకొచ్చాడు. ‘నేను నిరాశ వాదిని. ఏదో ఒక రోజు జీవితంలో నాకు చేదు అనుభవం ఎదురుపడొచ్చు అని అనుకుంటూ ఉంటాను. ఒకవేళ అది జరిగినా కూడా నాకు సంతోషమే.. దానిని ఎదుర్కొవడానికి నేను ఎప్పుడూ సిద్ధమే’. అని అన్నాడు. అలాగే ‘ఓ సాధారణ నటుడిలా ఎలా నటించాలో నాకు తెలియదు. అలా అని నేనో గొప్ప నటుడినని కూడా అనుకోను కానీ.. నేను కొన్ని పాత్రలను ఇష్టపడతాను, కొన్ని ప్రత్యేక పాత్రలకు ఆకర్షితుడిని అయ్యాను.’ అంటూ ప్యాటిన్సన్ తెలిపాడు. -
ఈ యూనివర్సిటీలో హ్యారీ పోటర్ పాఠాలు
కోల్‌కతా : హ్యారీ పోటర్ సిరిస్ సినిమాలకు, పుస్తకాలుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అంతేకాక ఈ నవలా రచయిత జేకే రోలింగ్‌కి కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ అభిమానులున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రాసిన ఈ పుస్తకాలు చదువరులను మరో ప్రపంచానికి తీసుకెళ్తాయనడంలో సందేహం లేదు. అందుకే నిరంతరం ఒకే రకమైన సబ్జెక్ట్ చదువుతూ బోర్‌గా ఫీలయ్యే విద్యార్థుల కోసం ఈ సైన్స్ ఫిక్షన్ నవలని పాఠ్యాంశాలుగా చేర్చనుంది కోల్‌కతాలోని ఓ యూనివర్సిటీ. వివారాలు.. కోల్‌కతాలోని ‘నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ జ్యురిడికల్ సైన్సెస్’లో ఈ వినూత్న ప్రయోగం జరగనుంది. ‘యాన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ఫాంటసీ ఫిక్షన్ లిటరేచర్ అండ్ లా : స్పెషల్ ఫోకస్ అన్ రోలింగ్స్ పోట్టర్వర్స్’ అనే పేరుతో ఈ కోర్స్‌ను ప్రారంభించనున్నట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఇది ఈ ఏడాది వింటర్ సెమిస్టర్ నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు. నాలుగో సంవత్సరం, ఐదో సంవత్సరం బీఏ ఎల్ఎల్బీ ఆనర్స్ చదువుతున్న విద్యార్థులకు దీన్ని ఓ ఎలక్టివ్‌గా ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయం గురించి యూనివర్సిటీ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘లా కాలేజ్‌లో విద్యార్థులకు వేర్వేరు అంశాలను బోధిస్తుంటాము. దాంతో పాటు ఇక్కడ నేర్చుకున్న లీగల్ అంశాలు బయట ప్రపంచంలో ఏ విధంగా అమలు అవుతున్నాయి అనే పరిస్థితుల గురించి కూడా వారికి అవగాహన కల్పిస్తాము. ఆయా చట్టాలను నిజజీవితంలో ఎలా అన్వయించుకోవాలనే అంశాల గురించి మరింత బాగా నేర్పించడం కోసం ఇలాంటి వినూత్న అంశాలను చేర్చాము. వీటి వల్ల విద్యార్థులకు కూడా తమ కోర్స్ పట్ల ఆసక్తి పెరుగుతుంది’ అన్నారు. -
బాలనటిగా యువరాజ్‌సింగ్ భార్య
సాక్షి, న్యూఢిల్లీ : హాలీవుడ్ నటి, క్రికెటర్ యువరాజ్ సింగ్ భార్య హేజిల్ కీచ్ ప్రఖ్యాత హ్యారీపొటర్ సినిమాల్లో నటించిందట. హోగ్వార్ట్స్ యాక్టింగ్ స్కూల్లో ట్రెయినింగ్ తీసుకుంటున్నప్పుడు మూడు హ్యారీపొటర్ చిత్రాల్లో బాలనటిగా నటించినట్టు ఆమె తెలిపారు. మిస్‌ఫీల్డ్ అనే షోలో కీచ్ ఆనాటి సంగతుల్ని గుర్తు చేసుకుని మురిసిపోయారు. తన కెరీర్లో హ్యారీ పొటర్ చిత్రాల్లో నటించడం మరచిపోలేని అనుభూతి అని చెప్పారు. రాడ్‌క్లిఫ్ (హ్యారీపొటర్), ఎమ్మా వాట్సన్ (హెర్మాయిన్), రూపర్ట్ గ్రింట్ (రోన్)లతో స్క్రీన్ షేర్ చేసుకున్నానని చెప్పుకొచ్చారు. యాక్టింగ్ స్కూల్లో పిల్లలకు సంబంధించిన ప్రతివిషయంపై నిర్వాహకులు జాగ్రత్త వ్యవహరిస్తారని అన్నారు. పాత్రలు ధరించేటప్పుడు విద్యార్థుల హెయిర్ స్టయిల్, మేకప్ విషయాల్లో కొంచెం కూడా తేడా రానీయరనీ, పశ్చిమ దేశాల్లో పని సంస్కృతి చాలా గొప్పగా ఉంటుందని అన్నారు. అన్నట్టు సల్మాన్‌ఖాన్ సూపర్‌హిట్ సినిమా ‘బాడీగార్డ్’లో నటించిన కీచ్... హిందీ బిగ్‌బాస్ 7 కూడా కంటెస్ట్ చేశారు. కొన్నాళ్లపాటు డేటింగ్ చేసిన యువీ, కీచ్ జంట 2016లో పెళ్లిచేసుకున్న సంగతి తెలిసిందే. -
అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ కాపీ కొట్టారా?
సాక్షి, వెబ్‌డెస్క్: మార్వెల్ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. విలన్ థానోస్ నుంచి కాపాడేందుకు సూపర్ హీరోలు చేసే సాహసాలు, ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలు... భారీ విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ ఇలా అన్ని విభాగాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. అయితే ఈ సినిమాపై ఇప్పుడు కాపీ చేశారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. హ్యారీ పాటర్ సిరీస్‌లోని సన్నివేశాలను ఎత్తేసి ఇన్ఫినిటీ వార్‌ను రూపొందించారంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఇన్ఫిలోని చాలా మట్టుకు సన్నివేశాలను.. హ్యారీ పాటర్ అండ్ ది డెత్లీ హాలోస్లోని సీన్లతో పోలుస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. హ్యారీ పాటర్ సిరీస్‌ల్లోని ది సెంట్రల్ క్వెస్ట్.. వోల్దెమార్ట్ చనిపోయే సన్నివేశం.. డీమెంటర్స్-రెడ్స్కల్ మధ్య పోలికలు.. మ్యాడ్ఊ మూడీ కన్నును థోర్ కంటితో పోలుస్తూ కాపీ కొట్టారంటూ వాదిస్తున్నారు. మరికొందరు జేకే రౌలింగ్(హ్యారీ పాటర్ రచయిత్రి) నుంచి రాయల్టీ తీసుకోవాల్సిందేనంటూ చమక్కులు పేలుస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే విదేశీ మార్కెట్‌తోపాటు భారత్‌లోనూ అవెంజర్స్ ప్రభంజనం కొనసాగుతోంది. తొలిరోజు రూ. 30 కోట్లు(2000 వేల స్క్రీన్లలో మాత్రమే విడుదలైంది) వసూలు చేసిన ఈ చిత్రం.. వీకెండ్లో భారీ వసూళ్ల దిశగా వెళ్తోంది. Watching the Avengers: Infinity War feels like watching Harry Potter and the Deathly Hallows — Niekholois (@Khloivillaverde) 28 April 2018 Curious question, I've only seen 3 Harry Potter movies... How many Harry Potter Flicks do I need to see to catch up for Avengers: Infinity War??? #AvengersInfinityWar #InfinityGauntlet — ᴹᶦᶜʳᵒ (@Micromonics) 28 April 2018 The truth has been revealed. Harry Potter was fake. It was Thanos who killed Voldemort.#Avengers #InfinityWar #ThanosTheRealHero #Avengers4 pic.twitter.com/L0zMl0GujS — Abhishek D (@abh1shekdas) 28 April 2018 Hello, Avengers? JK Rowling called and wants some royalties. #horcruxes #HarryPotter — Jeffrey Pugh (@JeffreyCPugh) 28 April 2018 ఇన్ఫినిటీ స్టోన్స్ సాయంతో ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకునే విలన్ థానోస్.. అతని నుంచి ప్రపంచాన్ని కాపాడానికి సూపర్ హీరోలు.. వాళ్లు చేసే పోరాటాల నేపథ్యంతో అవెంజర్స్ ఇన్ఫినిటీ చిత్రం రూపొందింది. ఆంథోని రుస్సో, జోయ్ రుస్సో ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాబర్ట్ డౌనీ జూనియర్(ఐరన్ మ్యాన్), క్రిస్ ప్రాట్, క్రిస్ హెమ్స్ వర్త్, బెనెడిక్ట్ కుంబర్‌బ్యాచ్, స్కార్లెట్ జాన్సన్ తదితరులు నటించారు. -
హ్యారీ పోటర్ కథ ముగిసింది!
లాస్ఏంజిలెస్ : హ్యారీ పోటర్ సినిమాలంటే తెలియని వారుండరు. ప్రపంచవ్యాప్తంగా పిల్లలనేకాదు పెద్దలనూ అలరించిన హ్యారీపోటర్ సీరిస్‌ను రచయిత జేకే రౌలింగ్ రాసిన నవల ఆధారంగా తీశారు. జేకే రాసిన ఏడు పుస్తకాల ద్వారా ఇప్పటివరకు ఎనిమిది సినిమాలు, ఒక బ్రాడ్వే నాటకం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించాయి. అయితే ఇక ఇంతటితో ఈ సిక్వెల్ను ముగిస్తున్నామని జేకే వెల్లడించారు. ఇప్పటివరకు హ్యారీ సినిమాలను డైరెక్టర్ జాన్ టిప్ఫనీ, నాటక రచయిత జాక్ థ్రోన్ కలిసి ప్రేక్షకులకు ముందుకు తెచ్చారు. చివరిగా వచ్చిన కర్స్డ్ చైల్డ్ సినిమా విడుదలైంది. దీనిలో హ్యారీ పాత్రకు చేయాల్సిన న్యాయం చేశామని రౌలింగ్ పేర్కొన్నారు. ‘ఇక ఈ కథ ఇంతటితో ముగిస్తేనే బావుంటుంద’ని జేకే అభిప్రాయపడ్డారు. ఇక ముందు ఈ కథను నడపాలంటే హ్యారీ మనవళ్లు , వారి భవిష్యత్తు సంతానాన్ని చూపించాలని,, అదంతా అవసరంలేదని, ఇప్పటిదాక వచ్చిన సిరీస్‌లతో హ్యరీ పాత్రకు న్యాయం చేశామని జేకే స్పష్టం చేశారు. -
రోడ్డు ప్రమాదంలో హ్యారీపోటర్ నటుడికి గాయాలు!
న్యూయార్క్: ప్రముఖ హాలీవుడ్ నటుడు జిమ్ తవారే ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. ప్రతిష్టాత్మక హ్యారీపోటర్ చిత్రంలో నటించిన తవారే రోడ్డు ప్రమాదం గురించి ఆయన భార్య ఫేస్బుక్లో తెలిపింది. అయితే, ప్రమాదం ఎప్పుడు? ఎక్కడ? ఎలా? జరిగిందనే వివరాలు మాత్రం తెలియజేయలేదు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడని తెలిపింది. ఈ ప్రమాదంలో అతడి మెడ విరిగిపోవడమే కాకుండా ఊపరితిత్తులకు కూడా గాయాలయ్యాయి. అలాగే, 15 పక్కటెముకలు విరిగిపోయాయి. కుడికాలుతోపాటు బ్రెస్ట్‌బోన్ కూడా విరిగిపోయిందని ఆమె ఫేస్బుక్లో పేర్కొంది. ఇప్పటికే అతడికి తొలి శస్త్ర చికిత్స పూర్తి చేశారని, రెండుసార్లు రక్త మార్పిడి చేశారని, ప్రమాదం చాలా తీవ్రంగా జరిగిందని ఆమె అందులో విచారం వ్యక్తం చేసింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని బలంగా ఢీకొనడం వల్లే ఈ విషమ పరిస్థితి తలెత్తిందని తెలిపింది. -
మెడ విరిగి, రిబ్స్ పగిలి.. నటుడికి ఘోర ప్రమాదం
న్యూయార్క్: ప్రముఖ హాలీవుడ్ నటుడు జిమ్ తవారే ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. ప్రతిష్టాత్మక హ్యారీపోటర్ చిత్రంలో నటించిన తవారే రోడ్డు ప్రమాదం గురించి ఆయన భార్య ఫేస్బుక్లో తెలిపింది. అయితే, ప్రమాదం ఎప్పుడు? ఎక్కడ? ఎలా? జరిగిందనే వివరాలు మాత్రం తెలియజేయలేదు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడని తెలిపింది. ఈ ప్రమాదంలో అతడి మెడ విరిగిపోవడమే కాకుండా ఊపరితిత్తులకు కూడా గాయాలయ్యాయి. అలాగే, 15 పక్కటెముకలు విరిగిపోయాయి. కుడికాలుతోపాటు బ్రెస్ట్‌బోన్ కూడా విరిగిపోయిందని ఆమె ఫేస్బుక్లో పేర్కొంది. ఇప్పటికే అతడికి తొలి శస్త్ర చికిత్స పూర్తి చేసినట్లు, రెండుసార్లు రక్త మార్పిడి చేశారని, ప్రమాదం చాలా తీవ్రంగా జరిగిందని ఆమె అందులో విచారం వ్యక్తం చేసింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని బలంగా ఢీకొనడం వల్ల తీవ్రంగా గాయాలయ్యి విషమ పరిస్థితి తలెత్తిందని వివరించింది. అందరూ ఆయన బ్రతకాలని కోరుకోవాలని విజ్ఞప్తి చేసింది. -
లెజండరీ నటుడు ఇక లేరు!
బ్రిటిష్ సీనియర్ నటుడు, ప్రపంచ గొప్ప నటుడిగా పేరొందిన సర్ జాన్ హర్ట్ (77) కన్నుమూశారు. గతకొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. ఐకానిక్ పాత్రలతో అనేక ప్రఖ్యాత సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకుని లెజండ్ గా నిలిచారు. ముఖ్యంగా ది మిడ్ నైట్ ఎక్స్ ప్రెస్, ది లార్డ్ ఆఫ్ ద రింగ్స్, ఎలిఫెంట్ మ్యాన్, ఏలియన్, హ్యారీ పాటర్ సిరీస్ , హెర్య్కులస్, తదితర ప్రఖ్యాత సినిమాల ద్వారా ప్రపంచసినీ ప్రేక్షకులకు సుపరిచితం. సుమారు ఆరు దశాబ్దాలపాటు ఆయన సినీరంగానికి ఎనలేని సేవలందించారు. అనేక రివార్డులు, అవార్డులు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు తోపాటు, 2015 లో బ్రిటిష్ రాణి చేతుల మీదుగా 'సర్' సత్కారాన్ని కూడా అందుకున్నారు. ఆయా పాత్రలకు ప్రాణం పోసే జాన్ అనేకమంది విశిష్ట దర్శకులచేత ప్రపంచ మేటి నటుడిగా ప్రశంసంలు పొందారు. రెండుసార్లు ఆస్కార్ కు నామినేట్ అయ్యారు. -
‘హ్యారీపోటర్’ అంతా అప్పజెబుతుంది
-
హ్యారీపోటర్ న్యూ సిరీస్
సాక్షి, వీకెండ్: ఏ సినిమా.? ఏయే థియేటర్లలో.? అయినా ఆదివారం సినిమాలు విడుదల కావే.? అని ఆలోచిస్తుంటే... కాస్త ఆగండి... విడుదలకు సిద్ధంగా ఉన్నది ఒక పుస్తకం. అమ్మకాల్లో రికార్డులు సాధించే ఆ పుస్తకం కోసం ఎనిమిదేళ్ల నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. జేకే రౌలింగ్ రాసిన హ్యారీపోటర్ పుస్తకాల సీరిస్ గురించి పరిచయం అక్కర్లేదు. ఆమె రాసిన సీరిస్ పుస్తకాలుగానే కాదు చిత్రాలుగా కూడా విశేష ఆదరణ పొందాయి. ఆమె పుస్తకాల కోసం పాఠక ప్రపంచం ఎదురు చూస్తుంటుంది. పుస్తకం విడుదల తేదీకి ముందే ప్రతి పుస్తక దుకాణంలో, ఆన్లైన్లో బుకింగ్‌లు మొదలైపోతాయి. పుస్తక ప్రపంచంలోనే ఇటీవల కాలంలో ఇంతటి ప్రభంజనం మరే పుస్తకం విషయంలో ఉండదేమో... వెరీ ఇంట్రెస్టింగ్.. ఏడో సీరిస్తో హ్యారీపోటర్ సీరిస్‌లు ఆగిపోతాయి.. అనే కథనాలు అప్పట్లో జోరందుకున్నాయి. దాంతో పోటర్ పుస్తక ప్రియులు నిరుత్సాహపడ్డారు. కానీ ఎనిమిదేళ్ల విరామం అనంతరం విడుదలవుతున్న హ్యారీపోటర్– కర్స్డ్ చైల్డ్ పుస్తకంపై నగరవాసుల్లోనూ ఎంతో ఆసక్తి కనిపిస్తోంది. ‘హ్యారీపోటర్ అండ్ ది కర్స్డ్ చైల్డ్’ పుస్తకం విడుదలకు సిద్ధం కావడంతో పుస్తకాల షాపుల్లో పండుగ హడావుడి కొనసాగుతోంది. కింగ్స్ క్రాస్ స్టేషన్, హ్యారీ చదువుకున్న ఇంద్రజాల పాఠశాల హాగ్‌వర్ట్ ఫోర్ట్ నమూనాలు బుక్‌షాపుల్లో ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఇక ఆదివారం విడుదల కానున్న ఈ పుస్తకం కాపీలను ముందుగానే బుక్ చేసుకున్న వారు నగరంలో వేలల్లో ఉన్నారు అంటున్నారు బుక్ షాప్ కీపర్స్. పాత సీరిస్‌కి పెరిగిన గిరాకీ.. ఈ సీరిస్ మొదటి నుంచి ఫాలో అవుతున్న నగర రీడర్స్ ఎంతో ఆసక్తిగా ఈ పుస్తకం విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ఆసక్తి ఎంతగా ఉందటే ముందటి సీరిస్ పుస్తకాల అమ్మకాలు కూడా ఈ పుస్తకం విడుదల సందర్భంగా ఊపందుకున్నాయి. నవలా? నాటకమా? ఈ సీరిస్ కథ ఎలా ఉండబోతోందనే విషయంలో ముందు నుంచే చర్చ మొదలైంది. ఈ పుస్తకం నవలా? లేక నాటకంగా సాగుతుందా? అనే సందేహాలు కూడా ఉన్నాయి. అయితే ఈ పుస్తకం నాటక రూపంలో సాగనుంది. ఇది ఒక రిహార్సల్ స్క్రిప్ట్ అని తెలుస్తోంది. స్పెషల్ షోలు.. సోమాజిగూడ ల్యాండ్‌మార్క్‌లో ఆదివారం హ్యారీపోటర్ పుట్టిన రోజును సెలబ్రేట్ చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు పాల్గొనేలా కేక్ కట్టింగ్, మ్యాజిక్, క్విజ్షోలు ఏర్పాటు చేసినట్లు షాపు నిర్వాహకులు తెలిపారు. -
హ్యారీపోటర్‌తో ట్రంప్‌గారికి చిక్కులే!
వాషింగ్టన్: ప్రముఖ రచయిత్రి జేకే రౌలింగ్ రాసిన హ్యారీ పోటర్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతం సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. మాయామంత్రాలతో పిల్లల కోసం రాసిన ఈ అద్భుత నవలలు ప్రపంచవ్యాప్తంగా 45.5 కోట్ల కాపీలు అమ్ముడుపోయి రికార్డు సృష్టించాయి. హ్యారీ పోటర్ నవలలకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్‌కు ఓ ఆసక్తికరమైన లింక్ ఉన్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. సాధారణంగా హ్యారీపోటర్ నవలలు సహనాన్ని, భిన్నత్వాన్ని, ఐక్యతను ప్రబోధిస్తాయి. కాబట్టి ఈ నవలల్ని చదవిన అమెరికన్లు ట్రంప్ గురించి పెద్దగా పట్టించుకోకపోవచ్చునని ఓ అధ్యయనం తెలిపింది. హ్యారీ పోటర్ నవలలు చదివిన అమెరికన్లకు రిపబిక్లన్ అభ్యర్థి ట్రంప్ నచ్చకపోవచ్చునని వెల్లడించింది. హ్యారీ పోటర్ ప్రబోధించిన భావజాలాలకు విరుద్ధంగా ట్రంప్ అభిప్రాయాలు ఉండటం, అతని ప్రబోధాలన్నీ హ్యారీపోటర్ శత్రువు లార్డ్ వోల్డేమార్ట్ను పోలి ఉండటం ఇందుకు కారణమని పెన్సిల్వేనియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డయనా ముట్జ్ తెలిపారు. హ్యారీ పోటర్ నవలలను అమెరికన్లు ఎంత ఎక్కువగా చదివితే.. ట్రంప్‌పై అంత వ్యతిరేక ప్రభావం ఎన్నికల్లో పడే అవకాశముందని పేర్కొన్నారు. హ్యారీ పోటర్ సిరీస్ ప్రబోధించిన విలువలకు విరుద్ధంగా ట్రంప్ రాజకీయ అభిప్రాయాలు ఉండటమే ఇందుకు కారణమని డయానా చెప్పారు. అమెరికాలోకి ముస్లిం రాకను నిషేధిస్తా.. వలసదారులు రాకుండా దేశ సరిహద్దుల్లో గోడలు కడుతా అంటూ విచ్ఛిన్నకరమైన రాజకీయ అభిప్రాయాలను ట్రంప్ వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
టార్జాన్ వస్తున్నాడు
ఆరేళ్ల పిల్లల నుంచి ఆరవై ఏళ్ల పెద్దల వరకు కుటుంబమంతా కలసి చూడదగ్గ చిత్రం ‘ది లెజెండ్ ఆఫ్ టార్జాన్’ అని నిర్మాత పారాస్‌జైన్ అన్నారు. ‘హ్యారీపోటర్’ సిరీస్ చిత్రాల దర్శకుడు డేవిడ్‌యేట్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ ప్రై.లి. సంస్థ ఉభయ రాష్ట్రాల్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేస్తోంది. పారాస్‌జైన్ మాట్లాడుతూ.. ‘‘అత్యాధునిక టెక్నాలజీ 2కె ఫార్మాట్లో సుమారు 150 థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేస్తున్నాము. విజువల్, వాయిస్ చాలా స్పష్టంగా ఉండటం 2కె ఫార్మాట్ ప్రత్యేకత. 2డి, 3డి, ఐమాక్స్ 3డి వెర్షన్స్‌లో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూడొచ్చు. ఈ చిత్రకథ తెలుగువారికి చాలా దగ్గరగా ఉంటుంది’’ అని చెప్పారు. -
హుర్రే పోటర్
హ్యారీ పోటర్ సీరీస్ రాసిన జె.కె.రోలింగ్‌కి ప్రపంచం హిప్ హిప్ హుర్రే చెప్పింది. మళ్లీ ఇప్పుడు మరో పోటర్ పుస్తకం విడుదల కాబోతున్న సందర్భంలో... ‘జో’ జీవిత పుస్తకాన్ని మనం ఒకసారి ఆవిష్కరించుకుందాం. గెలుపు.. పాఠాలు మాత్రమే చెప్తుంది. ఓటమి.. గుణపాఠాలు నేర్పుతుంది. ‘హ్యారీ పోటర్’ రచయిత్రి జె.కె.రోలింగ్ ఓటమి నుంచే పైకి వచ్చారు! కానీ ‘ఓటమి’ని ఓటమి అని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. ‘పైకి’ అన్న మాటను గెలుపు అని కూడా అనుకోలేదు. పాట్లు పడ్డప్పుడు పడ్డారు. ఆ పాట్లను తన రచనలకు ‘ప్లాట్’గా చేసుకున్నారు. విజయం సాధించారు. అయితే అది.. అనుకుని సాధించిన విజయం కాదు. నడుస్తూ నడుస్తూ మెట్లెక్కేశారు. ఎందుకో చూసుకుంటే పై మెట్టు మీద ఉన్నారు! మొదటి మెట్టు, చిట్ట చివరి మెట్టు రెండూ ఒకటే రోలింగ్‌కి! జీవితంలో రెండూ ఇంపార్టెంటే అంటారు. ‘ఐ కాంట్ స్టాప్ క్రయింగ్’ అమెరికాలోని ఆర్లెండో క్లబ్లో ఇటీవల ఒక ఉన్మాది కాల్పులు జరిపాడు. 50 మంది చనిపోయారు. వాళ్లలో ఒకరు లూయీ వియల్మా. 22 ఏళ్ల కుర్రాడు. అర్లెండోలోని హ్యారీ పోటర్ థీమ్ పార్క్‌లో అతడు రైడ్ అటెండెంట్. ఆ వార్త విని బ్రిటన్‌లో ఉన్న రోలింగ్ షాక్ తిన్నారు. ‘ఐ కాంట్ స్టాప్ క్రయింగ్’ అని ట్వీట్ చేశారు. రోలింగ్‌కి అతడు తెలుసు. హ్యారీ పోటర్పై అతడికి ఉన్న పిచ్చి అభిమానం గురించీ తెలుసు. అందుకే కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. కన్నీళ్లనే కాదు... ఏ ఉద్వేగాన్నీ ఆపులేరు రోలింగ్. ఆమె సున్నితమైన మనిషి. సృజనాత్మకత ఉన్న మనిషి. ఆ సున్నితత్వం, సృజనాత్మకత కలిసి ఆమె చేత పిల్లల కోసం హ్యారీ పోటర్‌ను రాయించాయి. తొమ్మిదేళ్ల విరామం తర్వాత (కథ పరంగా పందొమ్మిదేళ్ల తర్వాత) ఆ చిన్నపిల్లల గొలుసు నవలకు కొనసాగింపుగా హ్యారీ పోటర్ ఎనిమిదో పుస్తకం రాశారు. అది జూలై 31న విడుదలౌతోంది. రోలింగ్ ఏంటి? రోలింగ్ పిన్‌లా?! హ్యారీ పోటర్ సీరీస్‌తో పోల్చి చూస్తే జె.కె.రోలింగ్ జీవిత చరిత్ర చాలా చిన్న పారాగ్రాఫ్! రచయిత్రిగా పేరొచ్చాక రోలింగ్ పాత్ర చిన్నదైపోయి, పాత్రగా పోటర్ పెద్దవాడైపోయాడు. ఏ సృష్టికర్తకైనా ఇంతకు మించిన జన్మసార్థకత ఏముంటుంది? రోలింగ్ పుట్టింది చిప్పింగ్ సాడ్బరీలో. ఇంగ్లండ్‌లోని సౌత్‌వెస్ట్ (ఆగ్నేయం) టౌన్ అది. ‘రోలింగ్ ఏంటి? రోలింగ్ పిన్‌లా’ అని చిన్నప్పుడు స్కూల్లో పిల్లలు ఏడిపించేవాళ్లు రోలింగ్‌ని. అదొక్కటే ఆమె బాల్యంలోని చేదుజ్ఞాపకం. మిగతాదంతా హ్యాపీ లైఫ్. ‘పోటర్’ అనే పేరు ఎందుకో అమెకు చిన్నప్పట్నుంచే ఇష్టమయ్యేది. రోలింగ్ తొమ్మిదో యేట సౌత్ వేల్స్ లోని చప్స్టో పట్టణానికి మారింది ఆ కుటుంబం. అప్పటివరకు గ్లౌస్టర్షైర్లోని సెయింట్ మైఖేల్స్ ప్రాథమిక పాఠశాలలో చదువుకుంది రోలింగ్. అక్కడ చదువుతున్నప్పుడు చిన్నారి రోలింగ్ ‘రాబిట్’ అనే కథ రాసింది! అమ్మవారు పోసిన కుందేలు కథ అది. తల్లి ముగ్ధురాలైపోయింది. ‘భలే ఉందిరా జో’ అని కూతుర్ని ముద్దు పెట్టుకుంది. ‘అయితే ప్రింట్ ఎప్పుడు చేయిస్తావ్?’ అని అడి గేసింది రోలింగ్! అప్పుడే అనుకున్నారట యాన్.. తన కూతురు పెద్ద రచయిత్రి అవుతుందని. తల్లి తర్వాత రోలింగ్‌కి అంతటి కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఆమె ఫ్రెండు సీన్ హ్యారిస్. అప్పర్ సిక్స్త్‌లో క్లాస్మేట్. ‘జో.. నువ్వు చక్కగా రాస్తావ్’ అనేవాడట హ్యారిస్. అతడి దగ్గర పాత యాంగ్లియా ఫోర్డ్ కారు ఉండేది. తర్వాత అది హ్యారీ పోటర్ నవలల్లో ఫ్లయింగ్ కార్గా ప్రత్యక్షమైంది. అది ఒకటే కాదు, తన జీవితంలోని ఏ దశను, సందర్భాన్ని, అనుభవాన్ని, జ్ఞాపకాన్నీ వదలకుండా హ్యారీ పోటర్‌లో సీరీస్‌లో ఎక్కడో ఒక చోట నిక్షిప్తం చేశారు రోలింగ్. నిజ జీవితం నుంచి వచ్చిన కల్పన కాబట్టే పిల్లలకు హ్యారీ పోటర్ అంతగా కనెక్ట్ అయింది. ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’లో ఉద్యోగం రోలింగ్ తల్లిదండ్రులకు ఫ్రెంచ్ భాష మీద నమ్మకం. ఉద్యోగాలు తెచ్చి పడేస్తుందని. అందుకే రోలింగ్‌ని ఎక్సెటర్ యూనివర్శిటీలో ఫ్రెంచ్ లాంగ్వేజ్ చదవమన్నారు. రోలింగ్‌కి ఇంగ్లిష్ లాగ్వేజ్ ఇష్టం. అయినా సరే, అమ్మానాన్నల ఇష్టం ప్రకారం ఎక్సెటర్ తరఫున ప్యారిస్ వెళ్లి అక్కడ ఫ్రెంచ్‌లో గ్రాడ్యుయేట్ అయి లండన్ వచ్చారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషన్లో ద్విభాషా కార్యదర్శిగా, పరిశోధకురాలిగా చేరారు. ఆమ్నెస్టీ నుంచి బయటికి వచ్చి, రచయిత్రిగా బాగా డబ్బు సంపాదించాక ఆమ్నెస్టీకీ, ఇంకా అలాంటి ధార్మిక సంస్థలకు భారీగా విరాళాలు ఇచ్చారు రోలింగ్. ట్రైన్ లేటైంది.. థాట్ తట్టేసింది! ఆమ్నెస్టీలో ఉన్నప్పుడే మాంఛెస్టర్‌లోని చాంబర్ ఆఫ్ కామర్స్‌లో పని చేయడానికి రోలింగ్‌కి అవకాశం వచ్చింది. ఆమె వెంట ఆమె బాయ్‌ఫ్రెండ్ కూడా మాంఛెస్టర్ వెళ్లాడు. సెలవు దొరికినప్పుడు లండన్ వచ్చి వెళుతుండేవారు రోలింగ్. 1990లో ఓరోజు లండన్ వచ్చేందుకు ఆమె మాంఛెస్టర్‌లో రెలైక్కారు. మామూలుగా రెండు గంటల్లో గమ్యం చేరే ఆ లైన్లో ట్రైన్ నాలుగు గంటలు ఆలస్యంగా నడిచింది. ఆ ఆలస్యమే రోలింగ్ జీవితాన్ని వేగవంతం చేసింది! ప్రయాణంలోనే కథకు ప్లాట్ తయారుచేసుకున్నారు. ఒక కుర్రాడు ఉంటాడు. వాడు ‘స్కూల్ ఆఫ్ విజడ్రీ’కి వెళుతుంటాడు. మానవాతీత శక్తులు వాడి అనుభవంలోకి వస్తుంటాయి. ఇదీ సారాంశం. రైలు క్లాఫమ్ జంక్షన్‌కు చేరుకునే సమయానికి కథ రాయడం మొదలుపెట్టేశారు రోలింగ్. అయితే అది ముందుకు సాగలేదు! ఆ డిసెంబర్లో రోలింగ్ తల్లి చనిపోయారు. మల్టిపుల్ స్క్లెరోసిస్ అనే వ్యాధితో పదేళ్లు బాధపడి చివరిశ్వాస వదిలారు. తల్లి మరణం రోలింగ్‌ని కుంగదీసింది. రచన కుంటుపడింది. నవల పూర్తయ్యాక తల్లికి చెబుదామనుకున్నారు రోలింగ్. కానీ తన కూతురు ప్రపంచ బాలసాహిత్య చరిత్రలోనే ఒక సంచలనాత్మకమైన రచన చేస్తోందన్న సంగతి తెలియక ముందే యాన్ మరణించారు. ఈ బాధనంతా రోలింగ్ తన తొలి హ్యారీ పోటర్ నవలలో హ్యారీ ఫీలింగ్స్ ద్వారా వ్యక్తం చేసుకున్నారు. ‘పోర్టో’కి వెళితే.. పార్ట్నర్ దొరికాడు రోలింగ్‌కి ఫ్రెంచ్‌తో పాటు ఇంగ్లిష్‌లోనూ ప్రావీణ్యం ఉంది. పోర్టోలోని (పోర్చుగల్) ఒక విద్యా సంస్థలో ఫారిన్ లాంగ్వేజ్‌గా ఇంగ్లిష్ నేర్పించడానికి అవకాశం వస్తే అక్కడ 18 నెలలు ఉన్నారు. రాత్రి ఉద్యోగం, ఉదయం నవల రాయడం. వయెలిన్ సంగీతాన్ని వింటూ నవల రాసేవారు రోలింగ్. ఆ సమయంలోనే ఒక బార్లో ఆమెకు పోర్చుగీసు టెలివిజన్ జర్నలిస్టు జార్జి ఆరెంచిస్ పరిచయం అయ్యాడు. ఇద్దరికీ జేన్ ఆస్టిన్ నవలలంటే ఇష్టం. అలా దగ్గరయ్యారు. పెళ్లి చేసుకున్నారు. అప్పటికి రోలింగ్ వయసు 27 ఏళ్లు. పెళ్లయిన ఏడాదికే రోలింగ్ తల్లి అయ్యారు. బిడ్డకు జెస్సికా అని పేరు పెట్టుకున్నారు. రోలింగ్ అభిమాన రచయిత్రి జెస్సికా మిట్‌ఫోర్డ్ పేరు అది. జెస్సికా పుట్టిన నాలుగు నెలల తర్వాత భార్యాభర్త విడిపోయారు. రోలింగ్ జీవిత చరిత్ర రాసిన గ్రంథకర్తలు చెప్పడం ఏమంటే - తరచు ఆమె కుటుంబ హింసకు గురయ్యేవారని! భర్తను వదిలేశాక నెలల బిడ్డను తీసుకుని ఎడిన్‌బరో (స్కాట్లాండ్)లోని తన చెల్లెలు ఇంటికి వెళ్లారు రోలింగ్. అప్పుడామె సూట్‌కేసులో ఉన్నది మూడు చాప్టర్ల హ్యారీ పోటర్ మాత్రమే. డిప్రెషన్లోకి వెళ్లిపోయారు! వైఫల్యాలన్నీ ఒక్కసారిగా తనను చుట్టుముట్టినట్టు ఫీలయ్యారు రోలింగ్. గ్రాడ్యుయేషన్ అయి అప్పటికి ఏడేళ్లయినా జీవితంలో ఆమె స్థిరపడలేదు. తల్లి చనిపోయింది. భర్తను వదలి వచ్చేసింది. ఉద్యోగం లేదు. బిడ్డ తల్లిగా పోషణ, సంరక్షణ లేవు. ఓ రోజంతా కూర్చొని ఆమె ఆలోచించారు. పరిస్థితులు తనని ఒంటరిని చేయలేదు. స్వేచ్ఛను ప్రసాదించాయి. ఆ స్వేచ్ఛను ఉపయోగించుకుని నవలను పూర్తి చేయాలి అని స్థిరంగా అనుకున్నారు రోలింగ్. అయితే అదంత సులభం కాలేదు! అకస్మాత్తుగా ఆమె డిప్రెషన్లోకి వెళ్లిపోయేవారు. ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వచ్చేవి. ఈ మనోవేదనలోంచి పుట్టుకొచ్చిన ఆత్మలేని పాత్రలే డెమెంటర్స్. హ్యారీ పోటర్ మూడో పుస్తకంలోనివి. ఆర్థికంగా కూడా బాగా చితికిపోవ డంతో ప్రభుత్వం అందించే సంక్షేమ సహాయాలకు దరఖాస్తు చేసుకున్నారు రోలింగ్. సరిగ్గా అప్పుడే భర్త ఆమెను వెతుక్కుంటూ స్కాట్లండ్ వచ్చాడు! నా బిడ్డ నాకు కావాలి అన్నాడు. ఉంటే నువ్వు కూడా నాతో ఉండొచ్చు అన్నాడు. రోలింగ్ ఒప్పుకోలేదు. విడాకులతో అతడిని వదిలించుకున్నారు. నవల మీద సీరియస్‌గా కూర్చున్నారు. 1995 నాటికి నవల పూర్తయింది. కేఫ్‌లలో కూర్చొని ముక్కలు ముక్కలుగా ఆమె హ్యారీ పోటర్ని రాశారు. జెస్సికా నిద్రపోతున్న సమయమే ఆమె నవల చకచక సాగే సమయం. ఇంట్లో వె చ్చదనం లేకనే రోలింగ్ అలా కేఫ్‌లలో రాసేవారని వచ్చిన పుకార్లను ఓసారి బి.బి.సి. ఇంటర్వ్యూలో కొట్టిపడేశారు రోలింగ్. వాకింగ్ చేయిస్తే త్వరగా నిద్రపడుతుందని జెస్సికాను అమె బయటికి తీసుకొచ్చేవారు. ఎక్కడ తను నిద్రలోకి జారుకుంటే అక్కడి కేఫ్‌లో కూర్చొని రాయడం మొదలు పెట్టేవారట రోలింగ్. పోటర్ ప్రసాదించిన జీవితం! 1997 నాటికి ఫస్ట్ కాపీ రెడీ! హ్యారీ పోటర్ అండ్ ది ఫిలాసఫర్స్ స్టోన్! రెమ్యూనరేషన్ 1500 పౌండ్లు. తొలి ప్రచురణలో 1000 కాపీలతోనే బుక్కు క్లిక్ అయింది. ఆ తర్వాత ఆరు పుస్తకాలు. చివరి పుస్తకం ‘హ్యారీ పోటర్ అండ్ ది డెత్లీ హాలోస్’ 2007లో వచ్చింది. నాలుగో పుస్తకానికి, ఐదో పుస్తకానికి మధ్య 2001లో రోలింగ్ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. రెండేళ్లకు కొడుకు పుట్టాడు. తర్వాత రెండేళ్లకు కూతురు. 2007 తర్వాత తిరిగి ఇన్నేళ్లకు మళ్లీ ఇంకో హ్యారీ పోటర్ రాబోతోంది. అతీంద్రియ శక్తులతో హ్యారీ సీరీస్ రాసి పిల్లల్నీ పెద్దల్ని అలరించిన జె.కె.రోలింగ్ ఒక మాట మాత్రం కచ్చితంగా చెబుతారు. ‘‘ప్రపంచాన్ని మార్చడానికి మ్యాజిక్‌లు అవసరం లేదు. మనకు కావలసిన శక్తిని మన లోపల ఎప్పుడూ మనం మోస్తూనే ఉంటాం. ఆ శక్తి చాలు మెరుగైన ప్రపంచాన్ని నిర్మించుకోడానికి’’. జె.కె.రోలింగ్ కొన్ని విశేషాలు రోలింగ్ తొలి హ్యారీ పోటర్ నవలను 12 మంది పబ్లిషర్లు తిరస్కరించారు. చివరికి బ్లూమ్స్బరీ పబ్లిషర్లు తీసుకున్నారు. అయితే బ్లూమ్స్బరీ వాళ్లు ఆమెను కలం పేరు పెట్టుకోవాలని కోరారు. జోయాన్ రోలింగ్ అంటే రచయిత్రి అని తెలిసిపోతుందనీ, కథలో అబ్బాయి హీరో కనుక, అబ్బాయిలు చదవాలంటే రాసింది రచయిత్రి కాకుండా, రచయిత అయితే బాగుంటుందని వాళ్ల ఉద్దేశం. దాంతో జోయాన్ రోలింగ్ తన పేరును జె.కె.రోలింగ్ అని మార్చుకున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు రోలింగ్‌ని ‘జో’ అని పిలుస్తారు. పుస్తకాలు రాసి బిలియనీర్ అయిన తొలి రచయిత్రిగా ఫోర్బ్స్ మేగజైన్ రోలింగ్‌ను గుర్తించింది. ఇప్పటి వరకు అమ్ముడైన హ్యారీ పోటర్ సీరీస్ ప్రతులు 40 కోట్లు. ట్విట్టర్లో రోలింగ్‌కు 50 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. అనాథ బాలలను, బాలకార్మికులకు తిరిగి వాళ్ల తల్లిదండ్రుల దగ్గర చేర్చడం కోసం రోలింగ్ ‘ల్యూమస్’ అనే అంతర్జాతీయ సంస్థను స్థాపించారు.హ్యారీ పోటర్ పుస్తకాల్లోని ఊహాత్మకమైన ‘క్విడిచ్’ ఆటను అనేక యూనివర్శిటీలు నిజమైన ఆటగా స్వీకరించాయి! జె.కె.రోలింగ్ (50) ‘హ్యారీ పోటర్’ నవలా రచయిత్రి అసలు పేరు : జోయాన్ ‘జో’ రోలింగ్ కలం పేర్లు : జె.కె.రోలింగ్, రాబర్ట్ గాల్బ్రెయిత్ జన్మ స్థలం : యేట్, (ఇంగ్లండ్) జన్మ దినం : 31 జూలై 1965 తల్లిదండ్రులు : పీటర్ జేమ్స్ రోలింగ్ (ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజినీర్) యాన్ రోలింగ్ (సైన్స్ టెక్నీషియన్) చదువు : బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ రచనాప్రక్రియ : ఫాంటసీ, డ్రామా, యంగ్ అడల్ట్ ఫిక్షన్ ట్రాజికామెడీ, క్రైమ్ ఫిక్షన్ భర్త : జార్జ్ అరేంచిస్ (వివాహం: 1992-95) నీల్ ముర్రే (వివాహం: 2001) పిల్లలు : జెస్సికా అరేంచిస్ (కూ), డేవిడ్ ముర్రే (కొ) మెకెన్జీ ముర్రే (కూ) ప్రస్తుత నివాసం : ఎడిన్‌బరో (రెండో భర్త, పిల్లలతో కలిసి) తొలి నవల : హ్యారీ పోటర్ అండ్ ది ఫిలాసఫర్స్ స్టోన్ (1997) సీరీస్‌లో చివరి, ఏడవ నవల : హ్యారీ పోటర్ అండ్ ది డెత్లీ హాలోస్ (2007) తొమ్మిదేళ్ల విరామం తర్వాత : హ్యారీ పోటర్ అండ్ ది కర్స్డ్ చైల్డ్ (విడుదల 31 జూలై 2016) -
తెలివైన అమ్మ ఏం చేసిందంటే..!
సాక్షి వెబ్ చిన్నపిల్లలను పెంచడం పెద్ద సవాలే. నిలకడలేని ఆలోచనలు.. వేగంగా పరుగెత్తే వారి మనసును అందుకోవడం మహా కష్టమే. మారాం చేశారంటే చాలా తక్కువ మంది మాత్రమే వారిని కంట్రోల్ చేయగలుగుతారు. ఇలా కంట్రోల్ చేయగలిగే వారిలో ఎప్పుడూ అమ్మదే అగ్రస్థానం. దేశాలు వేరైనా నాన్న మాటలు నమ్మరేమోగానీ.. అమ్మ చెప్పిన మాటలు మాత్రం చిన్నపిల్లలకు ఎప్పటికీ వేదాలే. అమెరికాలో స్కూల్‌కు వెళ్లనని మారాం చేస్తున్న తన మూడేళ్ల బాలుడిని తన తల్లి కొట్టకుండా తిట్టకుండా కేవలం తన తెలివి తేటలతో తిరిగి పాఠశాలకు వెళ్లేలా చేసింది. అది కూడా గతంలో కంటే ఎక్కువ విశ్వాసంతో తరగతులకు హాజరయ్యేలా. పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్రిటానీ బినేష్ అనే మహిళకు ఆడేన్ అనే మూడేళ్ల కొడుకు ఉన్నాడు. వాడు ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేసుకుంటూ స్కూల్‌కు వెళుతున్నాడు. అయితే, ఇటీవల ఆ బాలుడు కిందపడ్డాడు. దీంతో అతడి నుదుటిపై గీతగీసినట్లుగా ఓ గాయం ఏర్పడింది. అలా గాయపడిన మరుసటి రోజే తాను స్కూల్ కు వెళ్లనని.. తన ఫ్రెండ్స్ ఏడిపిస్తారని మారాం చేయడం మొదలుపెట్టాడు. అన్ని రకాలుగా బతిమిలాడిన ఆ తల్లి చివరకు ఓ చక్కటి ఉపాయాన్ని ఆలోచించింది. గాయం అయ్యి గీతలాగా కనిపిస్తున్న దానిని ఓ రెడ్ మార్కర్‌తో ఎస్ గా మార్చింది. అనంతరం ఆ బాలుడికి హ్యారీ పోటర్ సినిమాలో హ్యారీ ధరించిన కళ్లద్దాల్లాంటివి పెట్టి అతడికి చూపించింది. హ్యారీ పోటర్ సినిమాలో హ్యారీకి కూడా నుదుటిపై అచ్చం ఇలాంటి గుర్తే ఉండటంతో ఆ బాలుడు తాను కూడా ఓ హ్యారీ పోటర్నే అన్న సంతోషంలో గెంతుతూ స్కూల్‌కు వెళ్లడం మొదలుపెట్టాడు. ఈ సందర్భంగా ఆ తల్లి తన కుమారుడి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టగా అవి హల్చల్ చేస్తున్నాయి. -
హ్యారీపోటర్ కుర్చీకి కోట్లలో డిమాండ్!
న్యూయార్క్: పురాతన, చారిత్రక నాణేలు, వస్తువులు, అపురూప చిత్రాలు, వజ్రాలు ఇలా కొన్ని ప్రత్యేక వస్తువులు వేలం పాటలో వేలు, లక్షల కోట్ల రూపాయల ధర పలకడం చూస్తుంటాం. కానీ ఇప్పుడు కేవలం ఓ చెక్క కుర్చీ కోట్ల రూపాయలకు అమ్ముడుపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించింది. అయితే దాని వెనుక ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందిని అలరించి, వేలాది కోట్ల రూపాయలు వసూలు చేసిన హ్యారీపోటర్ కథ ఉంది. అందుకే ఆ కుర్చీ అంత ధర పలికింది. హ్యారీపోటర్ సిరీస్ తో ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది అభిమానులను ఆకట్టుకున్న బ్రిటిష్ రచయిత జెకె రోలింగ్ వాడిన కుర్చీ వేలంలో 2 కోట్ల 63 లక్షల రూపాయలకు అమ్ముడుపోయింది. రోలింగ్ ఆ కుర్చీలోనే కూర్చొని హ్యారీపోటర్ లోని మొదటి రెండు వ్యాల్యూమ్ లు రాయడమే ఆ కుర్చీకి అంత డిమాండ్ రావడానికి కారణం. రోలింగ్ కు ఆమె తల్లి 1930 శకం నాటి ఓ మిస్ మ్యాచ్ కుర్చీని (ఇంట్లోని నాలుగు సరిపోలని కుర్చీల్లో ఒకదాన్ని) బహుమతిగా ఇచ్చిందట. న్యూయార్క్ లో నిర్వహించిన వేలంలో ఇప్పుడా ఓక్ కుర్చీ 2 కోట్ల 63 లక్షల రూపాయల ధర పలికినట్లు హెరిటేజ్ ఆక్షన్స్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఏభై ఏళ్ళ వయసున్న రచయిత రోలింగ్ 1997, 1998 ల్లో ప్రచురితమైన 'హ్యారీపోటర్ అండ్ ది ఫిలాసఫర్స్ స్టోన్', 'హ్యారీపోటర్ అండ్ ది ఛాంబర్ ఆఫ్ సీక్రెట్స్' రెండు సిరీస్ ను ఆ కుర్చీలోనే కూర్చొని రాసిందట. కుర్చీని ఆక్షన్ కు ఇచ్చిన రోలింగ్ తాను టైప్ రైటర్ ముందు కూర్చొనేందుకు అదే కుర్చీని వాడానని, నా రచనలకు ఆ కుర్చీ ఎంతో సహాయపడిందని తెలుపుతూ కుర్చీతోపాటు ఓ లేఖను కూడ రాసి ఇచ్చినట్లు ఆక్షన్ హౌస్ తెలిపింది. అయితే ఎంతో గుర్తుగా ఉన్న ఆ కుర్చీని వీడేందుకు చాలా బాధ అనిపించినా దాని అమ్మకం వెనుక అంతకంటే ప్రముఖమైన కారణం ఉందని తెలిపింది. గులాబీ, బంగారు, ఆకుపచ్చ రంగు పెయింట్ చేసిన పదాలతో అలంకరించిన ఆ కుర్చీని 2002 లో నేషనల్ సొసైటీకి విరాళంగా ఇచ్చినట్లు ఆమె తెలిపింది. మాంత్రిక జగతి, పురాణాలతో కూడిన పిల్లల సాహిత్యాన్నిరాసిన చరిత్ర ఆ కుర్చీకి ఉందని, అందుకే ఆ కుర్చీ అంతటి ప్రాముఖ్యతను పొందిందని ఆక్షన్ హౌస్ తెలిపింది. -
మూవీలకు ఏడాది గ్యాప్ ఇచ్చింది!
లండన్: బహిరంగ ప్రదేశాల్లో చురుగ్గా కనిపించకుండా బోరింగ్ పర్సన్‌లా ఉండటానికే ఇష్టపడే హాలీవుడ్ తార ఎమ్మా వాట్సన్. ఓ ఏడాది పాటు ఈ ముద్దుగుమ్మ సినిమాల జోలికి వెళ్లనంటోంది. తనకు కొన్ని పనులున్నాయని వాటిని నిర్వహించిన తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇస్తానని చెపుతోంది ఎమ్మా వాట్సన్. 'హ్యారీపొటర్' సిరీస్ చిత్రాల్లో హెర్మియన్ గ్రాంజర్‌గా నటించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేరుప్రఖ్యాతలు తెచ్చుకుంది ఈ సుందరి. ఐక్యరాజ్యసమితి గుడ్ విల్ అంబాసిడర్ ఎమ్మా వాట్సన్ 'హీ ఫర్ షీ' లాంటి కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. స్త్రీవాదం గురించి తాను ఎంతో తెలుసుకోవాల్సి ఉందని, ఎన్నో పుస్తకాలు చదవాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. కేవలం రెండు విషయాలపై దృష్టిసారించడానికి ఈ గ్యాప్ తనకు అవసరమని మీడియాకు వివరించింది. మొదటిది స్త్రీవాదం, లింగ సమానత్వం కాగా, వ్యక్తిత్వ వికాసం రెండో అంశమని వెల్లడించింది. ఇప్పటినుంచి ప్రతివారం ఓ బుక్ చదవడం లక్ష్యంగా పెట్టుకోవడంతో పాటు తన వద్ద ఉన్న లైబ్రరీ నుంచి నెలకు మరో పుస్తకాన్ని చదవడాన్ని ఎంచుకున్నట్లు చెప్పింది. ప్రపంచంలో ఎన్ని రకాల మహిళలు ఉంటారో తెలుసుకుంటానంటోంది. ఎమ్మా తదుపరి చిత్రం 'బ్యూటీ అండ్ ద బీస్ట్' తో 2017లో వెండితెర మీద కనిపించనుందట. -
హ్యారీపోటర్ 'ప్రొఫెసర్' కన్నుమూత
లండన్: ప్రముఖ హాలీవుడ్ నటుడు, దర్శకుడు అలాన్ రిక్ మాన్(69-బ్రిటన్) కన్నుమూశాడు. గత కొంతకాలంగా క్యాన్సర్ మహమ్మారితో బాధపడుతున్న ఆయన తిరిగి కోలుకోలేక తుది శ్వాసవిడిచారు. రిక్ మాన్ చాలా ప్రసిద్ధి చెందిన నటుడు. హ్యారీ పోటర్ సిరీస్ చిత్రాల్లో ప్రొఫెసర్ గా ఆయన నటించిన పాత్ర ఇప్పటికే ప్రేక్షకుల మదిలో మెదులుతుంటుంది. అంతేకాదు, బ్రిటన్ కు చెందిన ఈ నటుడు డై హార్డ్, ట్రూలీ మ్యాడ్లీ డీప్లీ, రాబిన్ హుడ్: ప్రిన్స్ ఆఫ్ థీవ్స్ వంటి విజయవంతమైన చిత్రాల్లో అసాధారణ నటనా ప్రతిభ చూపించారు. రాబిన్ హుడ్ చిత్రంలో నటనకుగానీ ఆయనకు బఫ్తా అవార్డు కూడా వచ్చింది. 'నటుడు, దర్శకుడు అయిన అలాన్ రిక్ మాన్ గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతూ చివరకు కన్నుమూసి మమ్మల్ని శోకసంద్రంలో ముంచాడు' అంటూ ఆయన కుటుంబం ఒక ప్రకటన విడుదల చేసింది. రిక్ మృతిపట్ల ప్రముఖ హాలీవుడ్ నటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
'కావాలనే బోరింగ్ పర్సన్‌లా కనిపిస్తా'
లండన్: బహిరంగ ప్రదేశాల్లో తాను పెద్ద చురుగ్గా కనిపించనని, బోరింగ్ పర్సన్ (పెద్దగా ఆసక్తి లేని వ్యక్తి)లా ఉండటానికే ఇష్టపడుతానని చెపుతోంది హాలీవుడ్ హీరోయిన్ ఎమ్మా వాట్సన్. 'హ్యారీపొటర్' సిరీస్ చిత్రాల్లో హెర్మియన్ గ్రాంజర్‌గా నటించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేరుప్రఖ్యాతలు తెచ్చుకుంది ఈ సుందరి. అయితే లైమ్‌లైట్‌లో ఉండి ప్రజల అందరి దృష్టి తనవైపు తిప్పుకోవడం అసలు ఇష్టం ఉండదని, తన ప్రైవసిని కాపాడుకోవడానికే అధిక ప్రాధాన్యం ఇస్తానని ఆమె చెపుతోంది. 'నేను చాలా బోరింగ్ పర్సన్‌లా అందరికీ కనిపించేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటా. నన్ను నేనుగా గుర్తుంచుకొని ప్రైవసీని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తా. ఉదాహరణకు రెడ్‌కార్పెట్‌పై నడుస్తున్నప్పుడు కాస్తా స్తబ్దుగా, నాలో నేను ఉన్నట్టు కనిపిస్తా' అని ఎమ్మా వాట్సన్ పోర్టర్ మ్యాగజీన్‌కు తెలిపింది. 'నాకు ఇప్పుడు 25 ఏళ్లు వచ్చాయి. నాకు నేను నచ్చేవిధంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. నేను ఏదైతే చెప్తానో అదే చేయాలనుకుంటాను. నాకు నేనుగా నా ప్రామాణికంగా ఉండాలనుకుంటా. పబ్లిక్ లైఫ్, వ్యక్తిగత జీవితం మధ్య పెద్దగా తేడా చూపించడం నాకు నచ్చదు' అని ఎమ్మా వివరించింది. -
ఆయనో విద్వేష ప్రబోధకుడు.. హ్యారీపొటర్ విలన్!
లండన్: ముస్లింలను ఉద్దేశించి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన రిపబ్లికన్ ఫ్రంట్‌రన్నర్ డోనాల్డ్ ట్రంప్ పై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ముస్లింలు అమెరికాలోకి ప్రవేశించకుండా శాశ్వత నిషేధం విధించాలని, లండన్‌లో కొన్ని వర్గాలు రాడికల్ గా మారుతుండటంతో అక్కడి పోలీసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీచేసేందుకు ప్రయత్నిస్తున్న డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన సంగత తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్, ఫ్రాన్స్ ప్రధానమంత్రి మాన్యుయెల్ వాల్స్ తప్పుబట్టారు. ఆయన వ్యాఖ్యలు మరింతగా విద్వేషాన్ని పెంచేలా ఉన్నాయని వారు అభిప్రాయపడ్డారు. మరోవైపు లండన్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు బ్రిటన్ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డోనాల్డ్ ట్రంప్ ఓ విద్వేష ప్రబోధకుడని లేబర్ పార్టీ ఎంపీ స్టెల్లా క్రిసీ, ఎస్ఎన్పీ ఎంపీ తస్మినా అహ్మద్ షైక్ మండిపడ్డారు. డోనాల్డ్ ట్రంప్ భవిష్యత్తులో బ్రిటన్ రాకుండా నిషేధించాలని అక్కడి ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద కార్యకర్తలు పలువురు డిమాండ్ చేశారు. ప్రముఖ రచయిత్రి జేకే రౌలింగ్ కూడా డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించారు. హ్యారీపొటర్ సిరీస్ లో అత్యంత కిరాతకమైన విలన్ వోల్డ్‌మార్ట్ తో ఆయనను పోల్చారు. వోల్డ్మర్ట్ కంటే దారుణంగా ఆయన వ్యవహరించారని మండిపడ్డారు. ఇటీవల ఓ సర్వేలో రిపబ్లికన్ అభ్యర్ఠి డోనాల్డ్ ట్రంప్ కంటే వోల్డ్‌మార్ట్ బెటర్ అని బ్రిటన్ ప్రజలు అభిప్రాయపడ్డారు. అదేవిషయాన్ని ఆమె తాజాగా ఉటంకించారు. How horrible. Voldemort was nowhere near as bad. https://t.co/hFO0XmOpPH — J.K. Rowling (@jk_rowling) December 8, 2015 -
హిందీలో... ‘హ్యారీ పోటర్’కథానాయిక?
‘హ్యారీ పోటర్’ మూవీ సిరీస్‌లో బాలనటిగా సినీ కెరీర్‌ను ప్రారంభించి, ఇప్పుడు కథానాయికగా కుర్రకారును ఓ ఊపు ఊపుతున్న హాలీవుడ్ అమ్మాయి ఎమ్మా వాట్సన్. ఆమె త్వరలో బాలీవుడ్ తెరపై కనిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ పాత్రికేయుడు జ్యోతిర్మయీ డే జీవితం ఆధారంగా నందితా సింఘా అనే దర్శకురాలు ఓ చిత్రాన్ని తెరకెక్కించే సన్నాహాలు చేస్తున్నారు. మాఫియాకు వ్యతిరేకంగా వార్తలు రాసిన కారణంగా ఆయన హత్యకు గురయ్యారు. సాహసోపేతమైన ఆయన జీవితాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో నందిత ఈ చిత్రానికి పూనుకున్నారు. జ్యోతిర్మయి పాత్రను నటుడు ఆమీర్‌ఖాన్ పోషించనున్నట్లు సమాచారం. అలాగే ఇందులో బ్రిటన్ పాత్రికేయురాలి పాత్ర ఉందట. ఆ పాత్రను హాలీవుడ్ నటి ఎమ్మా వాట్సన్ చేయనున్నారని బాలీవుడ్ టాక్. -
‘టాపు’ లేచిపోద్దట!
హాలీవుడ్ అందాల భరిణ ఎమ్మా వాట్సన్ అభిమానులకు అపు‘రూప’ కానుక ఇస్తోందట. తన రాబోయే చిత్రం ‘రిగ్రెషన్’లో ఈ ముద్దుగుమ్మ నగ్నంగా కనిపించనుందట. ఈ వార్త నెట్టింట్లో లావాలా పాకేసి పురుష పుంగవుల బాడీలు హీటెక్కిస్తోంది. అయితే దీనిపై క్రిటిక్స్ మాత్రం పెదవి విరుస్తున్నారు. దీనివల్ల ఈ చిత్రానికి ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదంటూ అప్పుడే అక్కసు వెళ్లబోసుకొంటున్నారనేది ఓ ఆంగ్ల పత్రిక కథనం. ఈ హ్యారీ పోటర్ స్టార్ గతంలో కూడా అందాల ప్రదర్శనలో కాస్త వెసులుబాటు ఇచ్చినా... అది అంతగా కిక్కెంచలేదనేది వారి అసలు బాధ. ఏదిఏమైనా... రిగ్రెషన్లో ‘ట్రైనింగ్ డే’ నటుడు ఇథాన్ హాకె అమ్మడితో జతకడుతున్నాడట. -
ప్రియుడు దూరమయ్యాడు!
‘హారీ పోట్టర్’ తార ఎమ్మా వాట్సన్ కెరీర్ మంచి జోరు మీద ఉంది. అదే ఆమెకు తంటా అయ్యింది. బోయ్‌ఫ్రెండ్ మాథ్యూ జాన్నీతో కాసిన్ని ప్రేమ ఊసులు చెప్పుకోవడానికి కుదరడం లేదట. జాన్నీయేమో రగ్బీ ప్లేయర్. ఆటలాడుకున్నప్పుడు మినహా మిగతా సమయంలో ఎక్కువ శాతం ప్రియురాలితోనే ఉండాలనుకుంటాడట. కానీ, ఎమ్మాకి అంత తీరిక లేదు కదా. ఈ విషయంలోనే జాన్నీ అలిగాడని సమాచారం. ఆ ఆలక విడిపోయేదాకా వచ్చేసింది. ఇటీవలే ఈ ఇద్దరూ తాము విడిపోయిన విషయాన్ని బాహాటంగా అంగీకరించేశారు. ప్రేమికులుగా విడిపోయినా.. స్నేహితుల్లా మిగిలిపోతాం అంటున్నారు. -
డ్రైవింగ్‌లో మాత్రం వీక్ అని..
ఇరవై నాలుగేళ్ల ‘హ్యారీపాటర్’ స్టార్ సినిమాల్లోనైతే అదరగొడుతున్నాడు గానీ... డ్రైవింగ్‌లో మాత్రం వీక్ అని ఇప్పుడే తెలిసింది. ఇన్నేళ్లుగా మనోడికి డ్రైవింగ్ లెసైన్సే లేదట. ఈస్ట్ లండన్ సబర్బన్ హార్న్చర్చ్లో రీసెంట్గా వేసిన ట్రయల్స్‌లో పాసైపోయాడట. విషయమేమంటే.. ఇదే ఈ హీరోగారి ఫస్ట్ అండ్ లాస్ట్ డ్రైవింగ్ టెస్ట్..! తనను ఎవరూ గుర్తు పట్టలేనంతగా... చింపిరి జుత్తు, మాసిన గడ్డంతో వెళ్లాడట రాడ్‌క్లిఫ్. విషయమేమంటే... అదే సమయంలో టెస్ట్‌లో గట్టెక్కిన జర్రా కషింగ్ అనే అమ్మాయికి కూడా అతడు క్లిఫ్ అని తెలియలేదట! -
ఫేస్బుక్లో హేరీపోటర్ పుస్తకమే టాప్!
ఫేస్బుక్ కమ్యూనిటీలో ఎక్కువమంది ఇష్టపడుతున్న పుస్తకం ఏంటో మీకు తెలుసా.. ఇంకేముంది.. హేరీపోటర్! ఎక్కువగా చదివి, దాచిపెట్టుకున్న పది టాప్ పుస్తకాల జాబితాలో హేరీపోటర్ సిరీస్ అగ్రస్థానంలో నిలిచింది. భారత సంతతికి చెందిన పింకేష్ పటేల్ రాసిన పుస్తకాలు కూడా ఫేస్బుక్ అభిమానులు మెచ్చిన పుస్తకాల్లో ఉన్నాయి. మొత్తం లక్షా 30 వేల పుస్తకాలను వీటిలో చూడగా, అగ్రస్థానంలో మాత్రం హేరీపోటర్ పుస్తకాలే నిలిచాయి. జేకే రౌలింగ్ రాసిన ఈ పుస్తకాలను 21 శాతం మంది మెచ్చుకున్నారు. దీంతో 'ఫేస్బుక్లో అత్యంత ప్రభావవంతమైన పుస్తకం' టైటిల్‌ను ఈ సిరీస్ ఎగరేసుకుపోయింది. రెండో స్థానంలో పులిట్జర్ బహుమతి విజేత హార్పర్ లీ రాసిన 'టు కిల్ ఎ మాకింగ్ బర్డ్' నిలిచింది. అలాగే జేఆర్ఆర్ టోల్కీన్ రాసిన 'ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్' పుస్తకానికి మూడోస్థానం లభించింది. టాప్ 20 జాబితాలో పిల్లల కథల పుస్తకాలు కూడా చాలానే ఉన్నాయి. -
వీక్షణం
చైనాలో ఓ రహదారిని నిర్మించడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అడ్డుగా ఉన్న నిర్మాణాలను పడగొట్టి, యజమానులందరికీ వేరేచోట స్థలాలు ఇప్పించారు. కానీ ఓ ఇద్దరు దంపతులు మాత్రం తమ ఇంటిని కూలగొట్టడానికి ఒప్పుకోలేదు. వారిని బతిమాలి విసిగిపోయిన అధికారులు ఇంటిని పడగొట్టడం మొదలు పెట్టారు. అయినా కూడా బయటకు వచ్చేది లేదని వాళ్లు మొరాయించడంతో చివరికి ఆ ఇంటిని అలాగే ఉంచి రోడ్డు వేసేశారు. ఇప్పుడా ఇల్లు సరిగ్గా దారి మధ్యలో ఉంది! ‘హ్యారీపాటర్’లో రాన్ వెస్లీగా నటించిన రూపర్ట్ గ్రింట్ చాలా పాపులర్ అయ్యాడు. బాగా సంపాదించాడు కూడా. అయితే అతగాడికి చిన్నప్పుడు ఐస్క్రీములమ్మాలనే కోరిక ఉండేదట. దాన్ని తీర్చుకోవడానికి ఓ వ్యాన్ కొనుక్కుని, అందులో ఐస్‌క్రీములు పెట్టుకుని ఊరూ వాడా తిరగడం మొదలెట్టాడు. అయితే అమ్మడంలేదులెండి... పంచుతున్నాడంతే! జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి ఒక పెంగ్విన్ని పెంచుకుంటున్నాడు. దాని పేరు లాలా. ఇది ఇంట్లో ఎన్ని పనులు చేస్తుందో తెలుసా? రోజూ ఒక బ్యాగ్‌ని వీపునకు తగిలించుకుని వెళ్లి, పక్క వీధిలో ఉన్న మార్కెట్లో చేపలు కూడా కొనుక్కొస్తుంది. దాని యజమాని ఆ బ్యాగ్‌లో డబ్బులు వేసి పంపిస్తాడట. చేపలు బ్యాగ్‌లో వేశాక, ఆ డబ్బిచ్చి వీటిని ఇంటికి తీసుకొస్తుందట లాలా! -
హీరోయిన్ పెదవుల నుంచి రక్తం కారేలా లిప్ లాక్!
తెరమీద లిప్ లాక్ లు ప్రేక్షకులకు బ్రహ్మండమైన అనుభూతిని కలిగిస్తాయనడంలో సందేహం అక్కర్లేదు. ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచడానికి లిప్ లాక్ సీన్ షూటింగ్ లో హీరో, హీరోయిన్స్ వాళ్ల కష్టం దేవుడెరుగు. అయితే 'హ్యారీ పోటర్' హీరోయిన్ ఎమ్మా వాట్సన్ కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. డగ్లస్ బూత్ తో కలిసి చేసిన లిప్ లాక్ సన్నివేశం వాట్సన్ కు పెదాల నుంచి రక్తం కారేలా చేసింది. గాఢ చుంబనం కారణంగా పెదాలకు గాయమై రక్తం కారడంతో ఆస్పత్రికి తరలించినట్టు తెలిసింది. పాఠకులను విశేషంగా ఆకట్టుకున్న ఓ నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఓ చిత్రంలో పరుగెత్తుకుంటూ వచ్చి గాఢంగా ముద్దు పెట్టుకోవాలి. ఫర్ ఫెక్షన్ కోసం ఆ సీన్ ను పదే పదే షూట్ చేయడంతో వాట్సన్ పెదాలకు గాయమై రక్తం కారడం జరిగిందన్నారు. ఈ షూటింగ్ లో డగ్లస్ ముక్కుకు కూడా గాయమైందట.