
లాస్‌ఏంజిలెస్ : హ్యారీ పోటర్ సినిమాలంటే తెలియని వారుండరు. ప్రపంచవ్యాప్తంగా పిల్లలనేకాదు పెద్దలనూ అలరించిన హ్యారీపోటర్ సీరిస్‌ను రచయిత జేకే రౌలింగ్ రాసిన నవల ఆధారంగా తీశారు. జేకే రాసిన ఏడు పుస్తకాల ద్వారా ఇప్పటివరకు ఎనిమిది సినిమాలు, ఒక బ్రాడ్వే నాటకం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించాయి. అయితే ఇక ఇంతటితో ఈ సిక్వెల్‌ను ముగిస్తున్నామని జేకే వెల్లడించారు. ఇప్పటివరకు హ్యారీ సినిమాలను డైరెక్టర్ జాన్ టిప్ఫనీ, నాటక రచయిత జాక్ థ్రోన్ కలిసి ప్రేక్షకులకు ముందుకు తెచ్చారు. చివరిగా వచ్చిన కర్స్‌డ్ చైల్డ్ సినిమా విడుదలైంది. దీనిలో హ్యారీ పాత్రకు చేయాల్సిన న్యాయం చేశామని రౌలింగ్ పేర్కొన్నారు. ‘ఇక ఈ కథ ఇంతటితో ముగిస్తేనే బావుంటుంద’ని జేకే అభిప్రాయపడ్డారు. ఇక ముందు ఈ కథను నడపాలంటే హ్యారీ మనవళ్లు , వారి భవిష్యత్తు సంతానాన్ని చూపించాలని,, అదంతా అవసరంలేదని, ఇప్పటిదాక వచ్చిన సిరీస్‌లతో హ్యరీ పాత్రకు న్యాయం చేశామని జేకే స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment