jk rowling
-
Israel-Hamas war: హమాస్ రాక్షసత్వం
టెల్ అవీవ్: ప్రఖ్యాత రచయిత్రి జేకే రౌలింగ్ రచించిన హ్యారీ పోట్టర్ పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందాయి. చిన్నపిల్లలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇజ్రాయెల్‌కు చెందిన 12 ఏళ్ల బాలిక నోయా డాన్ ఆటిజం బాధితురాలు. ఆమెకు హ్యారీ పోట్టర్ సాహసాలంటే చెప్పలేనంత ఇష్టం. ఈ సిరీస్‌లో వచ్చిన పుస్తకాలన్నీ చదివేసింది. ఈ నెల 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు నోయా డాన్‌ను అపహరించారు. ఆమె నాన్నమ్మతోపాటు మరో ముగ్గురు కుటుంబ సభ్యులు బందీలుగా గాజాకు చేరారు. వారంతా ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో తెలియరాలేదు. అసలు బతికున్నారో లేదో కూడా తెలియని పరిస్థితి. ఆటిజం బాధితురాలైన నోయా డాన్‌ను విడుదల చేయాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం హమాస్‌ను కోరింది. హ్యారీపోట్టర్ పాత్రధారి ఆహార్యంతో ఉన్న నోయా డాన్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ పోస్టును ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది షేర్ చేశారు. హమాస్ చెర నుంచి నోయా డాన్‌ను విడిపించేందుకు చొరవ చూపాలంటూ జేకే రౌలింగ్‌కు ఇజ్రాయెల్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. జేకే రౌలింగ్ వెంటనే స్పందించారు. హ్యారీ పోట్టర్ అభిమాని కిడ్నాప్ అయ్యారని తెలుసుకొని చలించిపోయారు. ఆమెకు విముక్తి కలి్పంచాలని హమాస్‌ను అభ్యరి్థంచారు. నోడా డాన్ క్షేమంగా తిరిగిరావాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. రౌలింగ్ ప్రతిస్పందన తర్వాత ఇజ్రాయెల్ వ్య«థకు నోయా డాన్ ఒక ప్రతీకగా మారిపోయారు. ఇజ్రాయెల్ పౌరులంతా ఆమె గురించి చర్చించుకున్నారు. క్షేమంగా తిరిగిరావాలని ఆకాంక్షించారు. కానీ, ఇంతలోనే దుర్వార్త వినాల్సి వచ్చింది. నోయా డాన్తోపాటు ఆమె నాన్నమ్మ కార్మెలా మృతదేహాన్ని బుధవారం గాజాలో గుర్తించినట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. నోయా డాన్ ఇక లేదని తెలిసి ఇజ్రాయెల్ ప్రజలు కన్నీరు మున్నీరవుతున్నారు. బాలికను హమాస్ మిలిటెంట్లు హత్య చేసినట్లు తెలుస్తోంది. ‘‘అమ్మా, నాకు చాలా భయమేస్తోంది. ఎవరో బూచాళ్లు మన ఇంట్లోకి వచ్చారు. వెంటనే వచ్చి నన్ను నీతో తీసుకెళ్లు’’.. బయటకు వెళ్లిన తన తల్లితో ఫోన్లో నోయా డాన్ చివరి సంభాషణ ఇది. -
‘కంగారు పడొద్దు.. తర్వాత నువ్వే’.. నవలా రచయిత్రికి బెదిరింపులు..
లండన్: బ్రిటిష్ నవలా రచయిత్రి జేకే రౌలింగ్(57)కు పాకిస్తాన్‌కు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాది ట్విట్టర్ వేదికగా చంపుతామంటూ బెదిరించడం కలకలం రేపింది. శుక్రవారం అమెరికాలో సల్మాన్ రష్దీపై హత్యాయత్నం ఘటనపై జేకే రౌలింగ్ విచారం వ్యక్తం చేశారు. ‘తీవ్ర వేదనకు గురయ్యాను. ఆయన క్షేమంగా ఉండాలి’ అని ట్వీట్‌చేశారు. దీనిపై కరాచీకి చెందిన మీర్ ఆసిఫ్ అజీజ్ అనే వ్యక్తి స్పందిస్తూ.. ‘కంగారు పడొద్దు.తర్వాత నువ్వే’ అనే బెదిరింపుతో కూడిన వ్యాఖ్యలు చేశాడు. జేకే రౌలింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సామాజిక కార్యకర్త, రాజకీయ కార్యకర్త, విద్యార్థిగా తనకు తాను పేర్కొనే ఆసిఫ్ అజీజ్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి మద్దతుగా పోస్టులు పెడుతుంటాడని అధికారులు తెలిపారు. ఇతడి దృష్టిలో భారత్, ఇజ్రాయెల్, ఉక్రెయిన్లు ఉగ్రవాద దేశాలని తెలిపారు. వాటిని ఎలా నాశనం చేయాలనే దానిపై కుళ్లు జోకులు వేస్తుంటాడన్నారు. -
మధ్యలో నన్నెందుకు లాగడం?.. పుతిన్‌కి కౌంటర్
రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ పై ప్రముఖ బ్రిటిష్ రచయిత్రి, హ్యారీ పోటర్ ఫేమ్ జేకే రోలింగ్(56) ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసరమైన వివాదంలోకి తనను లాగినందుకు ఆమె పుతిన్ పై మండిపడ్డారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో.. రోలింగ్‌కు అనుకూలంగా పుతిన్ చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు బూమరాంగ్ అయ్యాయి. లింగమార్పిడి(ట్రాన్స్ జెండర్ ఇష్యూ) సమస్యలపై.. తన అభిప్రాయాలను తెలియజేసినందుకే రచయిత జెకె రౌలింగ్ స్వేచ్ఛను ఈయూ దేశాలు అడ్డుకున్నాయంటూ పుతిన్ ఈమధ్య ఓ ప్రసంగంలో పేర్కొన్నారు. రష్యా సాహిత్యం, సంగీతంపై ఆంక్షలు విధిస్తూ ఈయూ దేశాలు నిర్ణయం తీసుకోవడంపై ఆయన ఆ వర్చువల్ మీటింగ్‌లో మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన జేకే రోలింగ్ పేరును ప్రస్తావించారు. అయితే అసందర్భంగా తనను ఈ వివాదంలోకి లాగినందుకు ఆమెకు మండిపోయింది. ‘‘పాశ్చాత్య రద్దు సంస్కృతిపై ఎవరైతే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో.. అమాయకుల ప్రాణాల్ని బలిగొంటున్నవాళ్లు, వాళ్లను ఎవరైతే విమర్శిస్తారో వాళ్లను జైలులో పెట్టేవాళ్లు, విమర్శకులకు విషం పెట్టేవాళ్లు.. విమర్శలకు అర్హులు కాదేమో’’ అంటూ పరోక్షంగా పుతిన్‌ను ఉద్దేశించి కామెంట్ చేశారామె. అంతేకాదు.. పుతిన్‌ను విమర్శించినందుకు జైల్లో ఉంచిన ఓ విశ్లేషకుడికి సంబంధించిన కథనాన్ని సైతం ఆమె ట్యాగ్ చేశారు. #IStandWithUkraine హ్యాష్ ట్యాగ్ పోస్ట్ చేసిన ఆమె.. ఉక్రెయిన్‌కే తన మద్ధతు ఉంటుందని స్పష్టంగా పేర్కొన్నారు. తన ఫౌండేషన్ తరపున ఉక్రెయిన్‌లో అందుతున్న సాయంపైనా కొన్ని పోస్ట్‌లు చేశారు. Critiques of Western cancel culture are possibly not best made by those currently slaughtering civilians for the crime of resistance, or who jail and poison their critics. #IStandWithUkraine https://t.co/aNItgc5aiW — J.K. Rowling (@jk_rowling) March 25, 2022 పాశ్చాత్య దేశాలు చివరికి రష్యా సంస్కృతిపై సైతం ఆంక్షలు విధిస్తున్నాయి. రష్యాకు చెందిన ఎంతో మంది రచయితలను, వాళ్లు రాసిన పుస్తకాలనూ నిషేధించారు. ఇది నాజీ జర్మనీ చేష్టల్లాగే ఉన్నాయి. ఇంతకు ముందు పిల్లలు అభిమానించే రచయిత్రి జేకే రౌలింగ్ కూడా జెండర్ ఫ్రీడమ్ పేరుతో ఆమెకు ఇలాంటి అనుభవమే ఎదురైంది అంటూ వ్యాఖ్యానించాడు పుతిన్. కానీ, ఆమె మాత్రం పుతిన్‌కు మద్ధతు ఇవ్వకుండా ఇలా నెగెటివ్ పోస్ట్ చేసింది. -
‘అలాంటి వారికి ట్రంప్ తోడయ్యారు’
వాషింగ్టన్: సామాజిక అంశాల పట్ల గళమెత్తే ఉదారవాదులను అణచివేసేందుకు ప్రయత్నించే కొన్ని వర్గాలకు అమెరికా అధ్యక్షుడి స్థానంలో ఉన్న శక్తిమంతమైన వ్యక్తులు తోడయ్యారని పలువురు రచయితలు, విద్యావేత్తలు డొనాల్డ్ ట్రంప్‌ను విమర్శించారు. అలాంటి వారితో ప్రజాస్వామ్యానికి పెను ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించేలా వ్యవహరించే వారిని ఉపేక్షించకూడదని.. అయితే ఏకాభిప్రాయం కుదరనంత మాత్రాన లిబరల్స్ మధ్య విభేదాలు తలెత్తడం విచారకరమన్నారు. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జేకే రౌలింగ్, సల్మాన్ రష్దీ, మార్గరెట్ అట్వుడ్ వంటి దాదాపు 150 మంది రచయితలు సంతకం చేసిన లేఖను ప్రఖ్యాత ‘హార్పర్స్ మ్యాగజీన్’ మంగళవారం ప్రచురించింది.(మెలానియా విగ్రహం ధ్వంసం) ఆఫ్రో- అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ పోలీసుల చేతిలో దారుణ హత్యకు గురైన నేపథ్యంలో అమెరికాలో వెల్లువెత్తిన నిరసనలు, పోలీసు వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలనే డిమాండ్లు సహా ఇతర సామాజిక అంశాలపై ధైర్యంగా పోరాడుతున్న వారిపై అణచివేత ధోరణి అధికమవుతున్న వేళ ఈ మేరకు పలువురు తమ అభిప్రాయాలను లేఖలో పంచుకున్నారు. స్వేచ్ఛగా అభిప్రాయాలు వెల్లడిస్తున్న వారిపై పెరిగిపోతున్న అసహనం, సెన్సారియస్నెస్(పదే పదే విమర్శించడం) పై ఆందోళన వ్యక్తం చేశారు. (చైనాపై కఠిన చర్యలకు సిద్ధమైన అమెరికా!) ‘‘అభివృద్ధి జరిగినపుడు ప్రశంసించే మేము.. అలా జరగని పక్షంలో గొంతెత్తేందుకు సిద్ధంగా ఉంటాం. ఉదారవాదులపై అక్కసు వెళ్లగక్కే కొన్ని శక్తులకు డొనాల్డ్ ట్రంప్ వంటి వ్యక్తులు తోడయ్యారు. ప్రస్తుత సమాజంలో స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తపరచడం సహా ఆలోచనలు పంచుకోవడం కష్టంగా మారింది. కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. రైట్‌వింగ్ రాడికల్ శక్తులు నైతిక హక్కులు కాలరాసేలా ప్రవర్తిస్తున్నాయి. వాటి కారణంగా మీడియా, కళారంగం వారు స్వేచ్చగా భావాలు వెల్లడించలేకపోతున్నారు. జీవనోపాధి కోల్పోతామనే భయం, కొన్ని ఒప్పందాల కారణంగా జర్నలిస్టులు భయపడాల్సి వస్తోంది. ఇక రచయితలు, ఆర్టిస్టులు ఇప్పటికే అనేక రకాలుగా మూల్యం చెల్లించి ఉన్నారు’’ అని లేఖలో పేర్కొన్నారు. కాగా ఈ లేఖపై కూడా సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన రావడం గమనార్హం. ముఖ్యంగా ట్రాన్స్జెండర్ల పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జేకే రౌలింగ్ కూడా ఈ లెటర్‌పై సంతకం చేయడం విశేషమంటూ పలువురు విమర్శిస్తున్నారు.(హిజ్రాలంటే నాకిష్టం: నటి) -
హ్యారీ పోటర్ కథ ముగిసింది!
లాస్ఏంజిలెస్ : హ్యారీ పోటర్ సినిమాలంటే తెలియని వారుండరు. ప్రపంచవ్యాప్తంగా పిల్లలనేకాదు పెద్దలనూ అలరించిన హ్యారీపోటర్ సీరిస్‌ను రచయిత జేకే రౌలింగ్ రాసిన నవల ఆధారంగా తీశారు. జేకే రాసిన ఏడు పుస్తకాల ద్వారా ఇప్పటివరకు ఎనిమిది సినిమాలు, ఒక బ్రాడ్వే నాటకం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించాయి. అయితే ఇక ఇంతటితో ఈ సిక్వెల్ను ముగిస్తున్నామని జేకే వెల్లడించారు. ఇప్పటివరకు హ్యారీ సినిమాలను డైరెక్టర్ జాన్ టిప్ఫనీ, నాటక రచయిత జాక్ థ్రోన్ కలిసి ప్రేక్షకులకు ముందుకు తెచ్చారు. చివరిగా వచ్చిన కర్స్డ్ చైల్డ్ సినిమా విడుదలైంది. దీనిలో హ్యారీ పాత్రకు చేయాల్సిన న్యాయం చేశామని రౌలింగ్ పేర్కొన్నారు. ‘ఇక ఈ కథ ఇంతటితో ముగిస్తేనే బావుంటుంద’ని జేకే అభిప్రాయపడ్డారు. ఇక ముందు ఈ కథను నడపాలంటే హ్యారీ మనవళ్లు , వారి భవిష్యత్తు సంతానాన్ని చూపించాలని,, అదంతా అవసరంలేదని, ఇప్పటిదాక వచ్చిన సిరీస్‌లతో హ్యరీ పాత్రకు న్యాయం చేశామని జేకే స్పష్టం చేశారు. -
కాన్సస్ కాల్పులు.. ట్రంప్‌కు రచయిత్రి చురకలు
న్యూఢిల్లీ: ట్రంప్ విపరీత పోకడలపై స్పందించేవారిలో అమెరికన్ రచయిత్రి జేకే రౌలింగ్ ముందుంటారు. కాన్సస్‌లో జాతివివక్షకు బలైపోయిన భారతీయుడి ఉదంతంలో ఆమె మరోసారి ట్రంప్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. కాన్సస్ జాతివివక్ష కాల్పులపై భారతీయ రచయిత ఆనంద్ గిరిధర్దాస్ ట్విట్టర్లో మండిపడ్డారు. ట్రంప్ అవలంభిస్తున్న విద్వేషపూరిత విధానాల మూలంగానే ఈ కాల్పులు జరిగాయని ఆయన విమర్శించారు. ఘటన అనంతరం ట్రంప్ వర్గాలు.. ఈ కాల్పులకు ట్రంప్ విధానాలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకోవడంలో అత్యుత్సాహం ప్రదర్శించాయని ఆయన ట్విట్టర్లో విమర్శించారు. ఆనంద్ గిరిధర్దాస్ చేసిన ఈ ట్వీట్లను ఉటంకిస్తూ.. 'విద్వేషపూరిత ప్రసంగం సరదాగా ఉండదు. మనం వాడే భాష ప్రభావం చూపుతుంది' అని రౌలింగ్ ట్వీట్ చేశారు. -
హ్యారీపోటర్ న్యూ సిరీస్
సాక్షి, వీకెండ్: ఏ సినిమా.? ఏయే థియేటర్లలో.? అయినా ఆదివారం సినిమాలు విడుదల కావే.? అని ఆలోచిస్తుంటే... కాస్త ఆగండి... విడుదలకు సిద్ధంగా ఉన్నది ఒక పుస్తకం. అమ్మకాల్లో రికార్డులు సాధించే ఆ పుస్తకం కోసం ఎనిమిదేళ్ల నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. జేకే రౌలింగ్ రాసిన హ్యారీపోటర్ పుస్తకాల సీరిస్ గురించి పరిచయం అక్కర్లేదు. ఆమె రాసిన సీరిస్ పుస్తకాలుగానే కాదు చిత్రాలుగా కూడా విశేష ఆదరణ పొందాయి. ఆమె పుస్తకాల కోసం పాఠక ప్రపంచం ఎదురు చూస్తుంటుంది. పుస్తకం విడుదల తేదీకి ముందే ప్రతి పుస్తక దుకాణంలో, ఆన్లైన్లో బుకింగ్‌లు మొదలైపోతాయి. పుస్తక ప్రపంచంలోనే ఇటీవల కాలంలో ఇంతటి ప్రభంజనం మరే పుస్తకం విషయంలో ఉండదేమో... వెరీ ఇంట్రెస్టింగ్.. ఏడో సీరిస్తో హ్యారీపోటర్ సీరిస్‌లు ఆగిపోతాయి.. అనే కథనాలు అప్పట్లో జోరందుకున్నాయి. దాంతో పోటర్ పుస్తక ప్రియులు నిరుత్సాహపడ్డారు. కానీ ఎనిమిదేళ్ల విరామం అనంతరం విడుదలవుతున్న హ్యారీపోటర్– కర్స్డ్ చైల్డ్ పుస్తకంపై నగరవాసుల్లోనూ ఎంతో ఆసక్తి కనిపిస్తోంది. ‘హ్యారీపోటర్ అండ్ ది కర్స్డ్ చైల్డ్’ పుస్తకం విడుదలకు సిద్ధం కావడంతో పుస్తకాల షాపుల్లో పండుగ హడావుడి కొనసాగుతోంది. కింగ్స్ క్రాస్ స్టేషన్, హ్యారీ చదువుకున్న ఇంద్రజాల పాఠశాల హాగ్‌వర్ట్ ఫోర్ట్ నమూనాలు బుక్‌షాపుల్లో ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఇక ఆదివారం విడుదల కానున్న ఈ పుస్తకం కాపీలను ముందుగానే బుక్ చేసుకున్న వారు నగరంలో వేలల్లో ఉన్నారు అంటున్నారు బుక్ షాప్ కీపర్స్. పాత సీరిస్‌కి పెరిగిన గిరాకీ.. ఈ సీరిస్ మొదటి నుంచి ఫాలో అవుతున్న నగర రీడర్స్ ఎంతో ఆసక్తిగా ఈ పుస్తకం విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ఆసక్తి ఎంతగా ఉందటే ముందటి సీరిస్ పుస్తకాల అమ్మకాలు కూడా ఈ పుస్తకం విడుదల సందర్భంగా ఊపందుకున్నాయి. నవలా? నాటకమా? ఈ సీరిస్ కథ ఎలా ఉండబోతోందనే విషయంలో ముందు నుంచే చర్చ మొదలైంది. ఈ పుస్తకం నవలా? లేక నాటకంగా సాగుతుందా? అనే సందేహాలు కూడా ఉన్నాయి. అయితే ఈ పుస్తకం నాటక రూపంలో సాగనుంది. ఇది ఒక రిహార్సల్ స్క్రిప్ట్ అని తెలుస్తోంది. స్పెషల్ షోలు.. సోమాజిగూడ ల్యాండ్‌మార్క్‌లో ఆదివారం హ్యారీపోటర్ పుట్టిన రోజును సెలబ్రేట్ చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు పాల్గొనేలా కేక్ కట్టింగ్, మ్యాజిక్, క్విజ్షోలు ఏర్పాటు చేసినట్లు షాపు నిర్వాహకులు తెలిపారు. -
హ్యారీపోటర్‌తో ట్రంప్‌గారికి చిక్కులే!
వాషింగ్టన్: ప్రముఖ రచయిత్రి జేకే రౌలింగ్ రాసిన హ్యారీ పోటర్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతం సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. మాయామంత్రాలతో పిల్లల కోసం రాసిన ఈ అద్భుత నవలలు ప్రపంచవ్యాప్తంగా 45.5 కోట్ల కాపీలు అమ్ముడుపోయి రికార్డు సృష్టించాయి. హ్యారీ పోటర్ నవలలకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్‌కు ఓ ఆసక్తికరమైన లింక్ ఉన్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. సాధారణంగా హ్యారీపోటర్ నవలలు సహనాన్ని, భిన్నత్వాన్ని, ఐక్యతను ప్రబోధిస్తాయి. కాబట్టి ఈ నవలల్ని చదవిన అమెరికన్లు ట్రంప్ గురించి పెద్దగా పట్టించుకోకపోవచ్చునని ఓ అధ్యయనం తెలిపింది. హ్యారీ పోటర్ నవలలు చదివిన అమెరికన్లకు రిపబిక్లన్ అభ్యర్థి ట్రంప్ నచ్చకపోవచ్చునని వెల్లడించింది. హ్యారీ పోటర్ ప్రబోధించిన భావజాలాలకు విరుద్ధంగా ట్రంప్ అభిప్రాయాలు ఉండటం, అతని ప్రబోధాలన్నీ హ్యారీపోటర్ శత్రువు లార్డ్ వోల్డేమార్ట్ను పోలి ఉండటం ఇందుకు కారణమని పెన్సిల్వేనియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డయనా ముట్జ్ తెలిపారు. హ్యారీ పోటర్ నవలలను అమెరికన్లు ఎంత ఎక్కువగా చదివితే.. ట్రంప్‌పై అంత వ్యతిరేక ప్రభావం ఎన్నికల్లో పడే అవకాశముందని పేర్కొన్నారు. హ్యారీ పోటర్ సిరీస్ ప్రబోధించిన విలువలకు విరుద్ధంగా ట్రంప్ రాజకీయ అభిప్రాయాలు ఉండటమే ఇందుకు కారణమని డయానా చెప్పారు. అమెరికాలోకి ముస్లిం రాకను నిషేధిస్తా.. వలసదారులు రాకుండా దేశ సరిహద్దుల్లో గోడలు కడుతా అంటూ విచ్ఛిన్నకరమైన రాజకీయ అభిప్రాయాలను ట్రంప్ వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
జె.కె.రోలింగ్ రాయని డైరీ
పిల్లలు పడుకున్నట్లున్నారు. అలికిడి వినిపించడం లేదు. పిల్లలతో పాటు స్కాట్లాండ్ రాజధాని పట్టణం ఎడిన్‌బరో కూడా నెమ్మదిగా నీలి రంగు పడక దీపాల మాంత్రిక భ్రాంతివర్ణంలోకి ఫ్యాంటసైజ్ అయినట్లుంది! శరత్కాలపు నులివె చ్చని చలిలో ఈ మహానగరపు చీకట్లు.. నిశ్శబ్దాన్ని వెలిగిస్తున్నాయి. నాకిష్టమైన చీకటి. నాకిష్టమైన నిశ్శబ్దం. చీకటి గదిలో నేనొక్కదాన్నీ నిశ్శబ్దాన్ని వింటూ కూర్చున్నాను. ఆలోచనలు వాటికవే వచ్చి నన్ను అల్లుకుంటున్నాయి. లైటు వేసుకుని రాయడానికి కూర్చుంటే.. ఆ ఆలోచనలన్నీ సీతాకోక చిలుకలై ఎగిరిపోతే! వాటిని వెతికిపట్టి తేవడం ఎలా? పిల్లలు నమ్ముతారా.. రాత్రి మీ కోసం ఒక కథ రాయాలనుకున్నాను.. కానీ ఆ కథ రాత్రికి రాత్రే ఎగిరిపోయిందని చెబితే ఊరుకుంటారా? ఏ ఒడ్డుకు చేరుకుందో పడవ వేసుకుని వెళ్లి మరీ తెమ్మంటారు. కదలకుండా అలా కూర్చునే ఉన్నాను. హారీ పోట్టర్ తర్వాత ఇంకేం లేకుండా పోదు కదా అన్న ఆందోళన ఒక్కటే నాలో కదులుతోంది. ఇంకొక్కటైనా రాయాలి పిల్లల కోసం. పిల్లల కోసం మాత్రమే కాదు, పెద్దవాళ్లను ‘ఛూ మంత్రకాళి’ అని పిల్లలుగా మార్చేయడం కోసం కూడా. వయసులు వేర్వేరు కావచ్చు. పిల్లలు, పెద్దలు ఎప్పటికీ వేర్వేరు కాదు. ఊహా జగత్తు.. పిల్లల్ని వాస్తవాలలో తేలియాడిస్తుంది. అదే ఊహా జగత్తు.. పెద్దల్ని ‘టే’ నదీ తీరప్రాంత గ్రామం అబర్ఫెల్డీ తీసుకెళ్లి అక్కడి వారాంతపు సంతలో వారి చేత మ్యాజిక్ వాండ్ కొనిపిస్తుంది. వారిని ఆడిస్తుంది. పాడిస్తుంది. బుగ్గలు ఉబ్బేలా బూర ఊదిస్తుంది. ‘పిల్లల్ని గాలికి వదిలిపెట్టినట్టు అలా ఊహా లోకాల్లోకి వదిలిపెడతామా మిస్ రోలింగ్!’ అని హారీ పోట్టర్ తొలికాపీ చూసి పెదవి విరుస్తూ పన్నెండు మంది పబ్లిషర్లూ ఒకేమాట అన్నప్పుడు నాకేం ఆశ్చర్యంగా అనిపించలేదు. ఊహల్లేకుండా పెరిగిన పిల్లలు వాళ్లు. అలాగే ఉంటారు. అలాగే అంటారు. ఊహకు స్వేచ్ఛను ఇస్తే వికసిస్తుంది. ఊహను బంధిస్తే వికటిస్తుంది. అబర్ఫెల్డీ వెళ్లొచ్చి అప్పుడే వారం! హా.. హా.. యాభై ఏళ్ల ఒక వారం అనాలేమో! ‘జూలైలో అయిపోయింది కదా మీ బర్త్‌డే, మళ్లీ ఇప్పుడెందుకు సెలబ్రేట్ చేస్తున్నారు మిస్ రోలింగ్’ అని అడిగారు నా యాభయ్యవ జన్మదిన వేడుకలకు ప్రత్యేక ఆహ్వానంపై అబర్ఫెల్డీకి ప్రయాణమై వచ్చినవారు. నవ్వాను. ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. నవ్వు మాత్రమే ఉంది. కొద్దిగా భయం కూడా ఉందేమో! అప్పుడే యాభై!! యాభై అంటే సగమా? సంపూర్ణమా? పిల్లల కోసం మరో పుస్తకం రాసేందుకు త్వరపడవలసిన సమయమా? -
తిరస్కరణకు గురయ్యారు..!
‘కరేజ్ డజ్ నాట్ ఆల్వేస్ రోర్..’ అనేది ఇంగ్లిష్‌లోని ఒక నానుడి. వ్యక్తిలోని ప్రతిభను ఒక్కోసారి అవతలి వారు అర్థం చేసుకోలేకపోవచ్చు. ఒక రంగంలో అద్భుతాలు సాధించగల వారు కూడా ఒక్కోసారి అదే రంగంలో అనామకులనిపించవచ్చు. అందుకు ఉదాహరణ వీళ్లు. అపారమైన ప్రతిభను కలిగి ఉండి.. ఒకే లక్ష్యంతో పాటుపడుతున్న సమయంలో వీరికి తిరస్కారాలుఎదురయ్యాయి. అయితేనేం.. అలాంటి తిరస్కారాలను వైఫల్యాలుగా భావించకుండా, తిరిగి కృషి చేసి అద్భుతాలు సాధించిన స్ఫూర్తిమంతులు వీళ్లు. జేకే రౌలింగ్ ఒకరు కాదు ఇద్దరు కాదు... పన్నెండు మంది పబ్లిషర్స్ రౌలింగ్ రచనని తిరస్కరించారు. ఆమె అక్షరాల ద్వారా సృష్టించిన ‘హారీపొటర్’ ప్రపంచం వారిని ఆకట్టుకోలేకపోయింది. ప్రచురణకు ఎవరూ ముందుకు రాలేదు. అయితేనేం... రౌలింగ్ ప్రతిభకు ప్రచురణకర్తల తిరస్కరణ అడ్డు కాలేకపోయింది. ఆ తర్వాత దక్కిన చిన్న అవకాశంతో రౌలింగ్ తన సత్తాచాటారు. ఎమినిమ్ ఈ పేరు వింటే పాప్ ప్రపంచం ఊగిపోతుంది. సంగీత ప్రపంచంలో అతడొక తరంగమని కీర్తిస్తుంది. ఈ ప్రశంసలూ, పేరు ప్రఖ్యాతులన్నీ ఎమినిమ్ గ్రామీ అవార్డులను అందుకోవడం మొదలైన తర్వాత మొదలైనవి. డజను సార్లకుపైగా ఆ అవార్డును అందుకున్నాక పతాక స్థాయికి చేరినవి. అయితే సంగీతకారుడిగా పేరు తెచ్చుకోకమునుపు ఎమినిమ్ను ఆదరించిన వారు లేరు. తన ప్రతిభను గుర్తించకపోగా తన పేదరికాన్ని చూసి అనేకమంది అసహ్యించుకొన్నారని ఈ పాప్‌స్టార్ అనేక సార్లు తన గతం గురించి ప్రస్తావించాడు. మైఖేల్ జోర్డాన్ ‘గ్రేటెస్ట్ బాస్కెట్‌బాల్ ప్లేయర్ ఆఫ్ ఆల్‌టైమ్’ ఆట నుంచి రిటైర్ అయిన సమయానికి ఈ అమెరికన్ ప్లేయర్ పేరు ముందు చేరిన బిరుదు ఇది. ‘నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్’ లీగ్‌లో అద్భుతమైన ప్రదర్శన ద్వారా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సాధించిన మైఖేల్ జోర్డాన్ ఆట విషయంలో అనేక సార్లు నిరాదరణకు గురయ్యాడు. స్కూల్ టీమ్, టీనేజ్‌లలో సెలెక్టర్లు జోర్డాన్‌ను పట్టించుకునే వారు కాదట. అలాంటి సందర్భాల్లో ఒక్కడే రూమ్‌లో కూర్చొని ఏడ్చేసేవాడినని జోర్డాన్ చెబుతారు. అయితే నిరాదరణకు గురైన జోర్డాన్ ప్రతిభ అసలైన సమయంలో మాత్రం వికసించింది. స్టీవెన్ స్పీల్బర్గ్ యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా ఫిల్మ్ స్కూల్లో చేరాలని తీవ్రంగా ప్రయత్నించాడు స్పీల్బర్గ్. అయితే వర్సిటీ వాళ్లు స్టీవెన్‌కు అంత టాలెంట్ లేదని తేల్చేశారు. సినిమాల్లోకి రాకముందు రెండు సార్లు స్పీల్బర్గ్ దరఖాస్తును వారు తిరస్కరించారట. అలా ఫిల్మ్‌స్కూల్ లో స్థానం సంపాదించలేకపోయినా స్పీల్బర్గ్ హాలీవుడ్ ఆవిష్కరించిన అద్భుతాల గురించి ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు! లియోనల్ మెస్సీ ఇప్పుడంటే మెస్సీకి ప్రపంచమంతా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సాకర్ ప్లేయర్ ఆట తీరుకు ముగ్ధులవుతున్నారు. అయితే టీనేజ్‌లో మెస్సీని ఫుట్‌బాల్ ప్లేయర్‌గా గుర్తించిన వారెవరూ లేరు. ఆటపై అమితమైన ప్రేమ, ప్రావీణ్యత కలిగి ఉన్నా.. మెస్సీ టీమ్‌లలో చోటు సంపాదించలేకపోయాడు. అప్పటికి బక్కగా, రివటలా ఉన్న మెస్సీని గేలి చేస్తూ అతడిది సాకర్‌కు పనికొచ్చే పర్సనాలిటీ కాదని అందరూ తేల్చేశారట. అయితేనేం ఆ తర్వాత మెస్సీ అంతర్జాతీయ స్థాయిలో అద్భుత మైన ప్లేయర్ అనే పేరే తెచ్చుకున్నాడు.