కాన్సస్ కాల్పులు.. ట్రంప్‌కు రచయిత్రి చురకలు
న్యూఢిల్లీ: ట్రంప్ విపరీత పోకడలపై స్పందించేవారిలో అమెరికన్ రచయిత్రి జేకే రౌలింగ్ ముందుంటారు. కాన్సస్‌లో జాతివివక్షకు బలైపోయిన భారతీయుడి ఉదంతంలో ఆమె మరోసారి ట్రంప్పై విమర్శలు ఎక్కుపెట్టారు.
కాన్సస్ జాతివివక్ష కాల్పులపై భారతీయ రచయిత ఆనంద్ గిరిధర్‌దాస్ ట్విట్టర్‌లో మండిపడ్డారు. ట్రంప్ అవలంభిస్తున్న విద్వేషపూరిత విధానాల మూలంగానే ఈ కాల్పులు జరిగాయని ఆయన విమర్శించారు. ఘటన అనంతరం ట్రంప్ వర్గాలు.. ఈ కాల్పులకు ట్రంప్ విధానాలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకోవడంలో అత్యుత్సాహం ప్రదర్శించాయని ఆయన ట్విట్టర్‌లో విమర్శించారు. ఆనంద్ గిరిధర్‌దాస్ చేసిన ఈ ట్వీట్లను ఉటంకిస్తూ.. 'విద్వేషపూరిత ప్రసంగం సరదాగా ఉండదు. మనం వాడే భాష ప్రభావం చూపుతుంది' అని రౌలింగ్ ట్వీట్ చేశారు.