Kansas shooting
-
శరత్ హంతకుడ్ని కాల్చిచంపారు
భారత విద్యార్థి శరత్ హత్య కేసులో నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు మట్టుబెట్టారు. ఆదివారం కాన్సస్ సిటీ శివారులో జరిగిన ఎన్కౌంటర్లో అతన్ని కాల్చి చంపినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాన్సస్ నగర పోలీసులు ట్విటర్లో విషయాన్ని ధృవీకరించారు. మిస్సోరి: ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన శరత్ కొప్పు(తెలంగాణ.. వరంగల్ చెందిన వ్యక్తి)ని.. ఈనెల 4వ తేదీన ఓ స్టోర్ లో నిందితుడు కాల్చి చంపాడు. ఘటన తర్వాత నిందితుడు పారిపోగా.. అప్పటి నుంచి పోలీసుల వేట కొనసాగుతోంది. చివరకు కాన్సస్ సిటీ శివార్లలో నిందితుడు ఉన్నాడన్న సమాచారం అందుకుని.. పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే, లొంగిపోవాలని పోలీసులు కోరటంతో.. ఆ హంతకుడు పోలీసులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులకు గాయాలు అయ్యాయి. పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించడంతో అతను మరణించాడు. (అలా చేయకపోయి ఉంటే బతికేవాడేమో!) నిందితుడు తన వద్ద ఉన్న రైఫిల్ తో కాల్పులు జరిపాడని, దాంతో పోలీసులు ఎదురు కాల్పులకు దిగడంతో అతను మరణించాడు అని కాన్సస్ సిటీ పోలీస్ చీఫ్ రిక్ స్మిత్ వెల్లడించారు. ఈ ఎన్ కౌంటర్ లో గాయపడిన అధికారులను ఆసుపత్రికి తరలించామని, వారికి ప్రాణాపాయం తప్పిందని ఆయన తెలియజేశారు. శరత్ హత్య కేసు.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
శ్రీనివాస్ కూచిభొట్లను నేనే చంపాను!
అమెరికాలోని కాన్సన్ నగరంలో ప్రవాస తెలుగు వ్యక్తి శ్రీనివాస్ కూచిభొట్లను కాల్చిచంపేసిన కేసులో నిందితుడు కోర్టులో నేరాన్ని అంగీకరించాడు. నిందితుడు ఆడం పురింటన్‌కు మే 4న శిక్ష ఖరారు కానుంది. పథకం ప్రకారం చేసిన ఈ హత్యకు గాను అతనికి పెరోల్ లేకుండా 50 ఏళ్ల వరకు యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశముంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత ఆ దేశమంతటా విదేశీయులపై విద్వేషం వ్యక్తమైన నేపథ్యంలో కాన్సస్ నగరంలో శ్రీనివాస్ కూచిభొట్ల, అతని స్నేహితుడు అలోక్ మాదసానిపై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. విద్యార్థి వీసా మీద అమెరికాకు వెళ్లిన శ్రీనివాస్, అలోక్ అనంతరం అక్కడి జీపీఎస్ తయారీ కంపెనీ గార్మిన్‌లో ఇంజినీర్లుగా పనిచేసేవారు. ఈ క్రమంలో గత ఏడాది ఫిబ్రవరి 27న ఉద్యోగాన్ని ముగించుకొని స్నేహితులిద్దరు కాన్సస్‌లోని ఆస్టిన్స్ బార్ అండ్ గ్రిల్‌లోకి మద్యం సేవించేందుకు వెళ్లారు. అక్కడ వారిని చూసిన నిందితుడు పూరింటన్ జాతివిద్వేషంతో దూషణలకు దిగాడు. ‘నా దేశం నుంచి వెళ్లిపోండి’ అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో అతన్ని బార్ నుంచి వెళ్లిపోవాల్సిందిగా సిబ్బంది చెప్పారు. ఇలా బయటకు వెళ్లిన పూరింటన్ అనంతరం తుపాకీ తీసుకొని వచ్చి శ్రీనివాస్ కూచిభొట్ల, అలోక్‌పై కాల్పులు జరిపాడు. ఈ సమయంలో జోక్యం చేసుకొని.. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన సాటి శ్వేతజాతీయుడు ఇయాన్ గ్రిలాట్‌పై ఆ కిరాతకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ కూచిభొట్ల ప్రాణాలు విడువగా అలోక్, ఇయాన్ గాయాలపాలయ్యారు. ఈ ఘటన నేపథ్యంలో అమెరికాలోని ప్రవాస భారతీయుల భద్రతపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసులో తాజాగా నిందితుడు నేరాన్ని అంగీకరించిన నేపథ్యంలో శ్రీనివాస్ కూచిభొట్ల భార్య సునయన దుమల స్పందించారు. ఈ కేసులో నిందితుడు నేరాన్ని ఒప్పుకున్న నేపథ్యంలో విద్వేషం ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదనే బలమైన సందేశాన్ని అందించాలని, మనమంతా పరస్పరం ప్రేమించుకోవాలిగానీ ద్వేషించుకోకూడదని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
కన్సాస్ హీరోకు లక్ష డాలర్లు
భారీగా విరాళాలు సమకూర్చిన భారతీయులు హూస్టన్: కన్సాస్ కాల్పుల ఘటనలో తుపాకీకి వెరవకుండా అలోక్ మేడసాని ప్రాణాలను కాపాడిన అమెరికావాసి ఇయాన్ గ్రిల్లట్పై వెల్లువెత్తిన సానుభూతి... అతనిని లక్ష్మీదేవి రూపంలో వరించింది. స్వస్థలమైన కన్సాస్‌లో ఇంటిని కొనుగోలు చేసుకునేందుకు అమెరికాలోని భారతీయులంతా చేయిచేయి కలిపి లక్ష డాలర్ల మేర విరాళాలు సేకరించారు. గార్మిన్ కంపెనీలో పనిచేసే శ్రీనివాస్, అతని స్నేహితుడు మేడసాని అలోక్..ఫిబ్రవరి 22వ తేదీ రాత్రి కన్సాస్‌లోని ఓ బార్‌కు వెళ్లడం. అక్కడ నిందితుడు ఆడం పూరింటన్ వీరికి తారసపడడం తెలిసిందే. ‘మీరు మధ్యప్రాచ్యానికి చెందినవారు కదా. మా దేశం విడిచివెళ్లిపోండి’ అంటూ తొలుత శ్రీనివాస్, అలోక్‌లతో గొడవకు దిగాడు. ఆ తర్వాత బార్ నిర్వాహకులు అతనిని అక్కడి నుంచి బలవంతంగా బయటికి పంపగా కొద్దిసేపటి తర్వాత మళ్లీ అక్కడకు చేరుకుని ఆకస్మికంగా వీరిరువురిపై కాల్పులు జరపగా శ్రీనివాస్ చనిపోయాడు. నిందితుడిని అడ్డుకునేందుకు యత్నించిన గ్రిల్లట్‌తోపాటు అలోక్‌కు గాయాలవగా ఆస్పత్రికి తరలించగా వారిరువురు ప్రాణాలతో బయటపడడం తెలిసిందే. గ్రిల్లట్‌కు కృతజ్ఞతగా ఈ కానుకను అందజేస్తున్నామని తమ ఫేస్బుక్ పేజీలో ఇండియాహౌస్ హూస్టన్ పేర్కొంది. ఈ విరాళాల సేకరణకు హూస్టన్‌లోని భారత కాన్సులర్ జనరల్ డాక్టర్ అనుపమ్ రే చొరవ తీసుకోవడం గమనార్హం. అమెరికాలోని భారత రాయబారి నవ్‌తేజ్ సర్నా ఈ చెక్కును ఇయాన్కు అందజేశారు. -
కాన్సాస్ హీరోకు భారత్ ఆహ్వానం
హ్యూస్టన్: అమెరికాలో కాన్సాస్ కాల్పుల్లో తెలుగువారిని రక్షించే ప్రయత్నంలో గాయపడ్డ ఆ దేశ పౌరుడు ఇయాన్ గ్రిల్లాట్ (24)ను భారత్‌కు ఆహ్వానించారు. హ్యూస్టన్‌లోని భారత రాయబార కార్యాలయం దౌత్యాధికారి అనుపమ్ రే.. గ్రిల్లాట్‌ను కలిశారు. ఆస్పత్రిలో వారం రోజులు చికిత్స పొందిన గ్రిల్లాట్‌ను గత మంగళవారం డిశ్చార్జి చేసి ఇంటికి పంపారు. గ్రిల్లాట్ పూర్తిగా కోలుకునేందుకు సమయం పడుతుందని కాన్సాస్ యూనివర్శిటీ ఆరోగ్య విభాగం వెల్లడించింది. శుక్రవారం గ్రిల్లాట్ కుటుంబ సభ్యులతో కలసి ఆస్పత్రికి వెళ్లి అనుపమ్ రేను కలిశారు. తెలుగువారిని రక్షించేందుకు గ్రిల్లాట్ చూపిన తెగువను భారతీయులు అభినందిస్తున్నారని ఈ సందర్భంగా రే వారితో చెప్పినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. గ్రిల్లాట్ కోలుకున్న తర్వాత అతను, కుటుంబ సభ్యులు భారత్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు. కాన్సాస్‌లోని ఓ బార్లో శ్వేతజాతి దుండగుడు అడామ్ పురింటన్ (51) జాతివిద్వేషంతో జరిపిన కాల్పుల్లో శ్రీనివాస్ కూచిబొట్ల చనిపోగా అలోక్ మాదసాని గాయపడ్డాడు. వీరిని కాపాడేందుకు ప్రయత్నించిన గ్రిల్లాట్ గాయపడ్డాడు. ఛాతీ, చేతిలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. సంబంధిత వార్తలు చదవండి కాలుస్తుంటే ఏదో ఒకటి చేయాలనిపించింది రక్షించేందుకు కాల్పులకు ఎదురెళ్లిన హీరో ఇతడే -
అశ్రు‘నయన’ ప్రశ్న
బరువెక్కిన హృదయంతో నేనీ నాలుగు ముక్కలు రాస్తున్నాను. ఫిబ్రవరి 22, 2017 నాకో కాళరాత్రి. ఆ రోజు నేను నా భర్తను, ఆత్మబంధువును, మిత్రుడిని, అత్యంత నమ్మకస్తుడిని కోల్పోయాను. అతనో స్ఫూర్తి ప్రదాత. సహాయకారి. ఒక్క నాకే కాదు... తనని ఎరిగిన వారందరికీ. ఎవరు ఎదురైనా... ముఖంపై ఎప్పుడూ చిరునవ్వు ఉండేది. ప్రతి ఒక్కరిని గౌరవించేవాడు. తనకంటే పెద్దవారి పట్ల ఇంకా గౌరవభావంతో మెలిగేవాడు. 2006 ఆగస్టులో కామన్ ఫ్రెండ్స్ ద్వారా మా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. తర్వాత ‘ఆర్కుట్’ ద్వారా పలకరించుకునే వాళ్లం. తొలి పరిచయంతోనే ఇద్దరమూ ఒకరినొకరం ఇష్టపడ్డాం. మా ఇంట్లో ముగ్గురు ఆడపిల్లల్లో నేనే చిన్నదాన్ని. చాలా గారాబంగా, స్వేచ్ఛగా పెరిగాను. అమెరికాకు వెళ్లి చదువుకోవాలనే నా కలను నిజం చేసుకునేందుకు కావాల్సిన ధైర్యాన్ని నాకు శ్రీనివాసే ఇచ్చాడు. నేనీ రోజు ఇలా స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తిగా, సొంత కాళ్లపై నిలబడగల, ధైర్యమున్న మహిళగా ఎదగడానికి అమెరికాలో చదువు దోహదపడింది. గత ఏడాది మే నెల నుంచే నేను ఉద్యోగం చేయడం మొదలుపెట్టాను. నాకు ఉద్యోగం రావడంలో శ్రీనివాస్‌ది ముఖ్యపాత్ర. ఎల్లప్పుడూ ప్రోత్సహించేవాడు. నిరాశపడ్డప్పుడల్లా వెన్నుతట్టి ధైర్యం చెప్పేవాడు. అందుకే నాలుగేళ్ల విరామం తర్వాత నేను మళ్లీ ఉద్యోగ జీవితం మొదలుపెట్టాను. ఎన్నో కలలతో కాన్సస్‌కు వచ్చాం.. విమానయాన రంగంలో నిరంతరం కొత్త ఆవిష్కరణల కోసం ఆయన తపించేవాడు. రాక్వెల్ కోలిన్స్ కంపెనీలో చేరడం ద్వారా శ్రీనివాస్ తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఫ్లయిట్ కంట్రోల్ సిస్టమ్‌పై పనిచేసేవాడు. ప్రాథమిక ఫ్లయిట్ కంట్రోల్ కంప్యూటర్ అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. రాత్రి భోజనం కోసం ఇంటికి వచ్చి, అది కాగానే ఆఫీసుకు వెళ్లిపోయిన రోజులు చాలానే ఉన్నాయి. అలా వెళ్లి మళ్లీ ఏ రెండింటికో, మూడింటికో తిరిగివచ్చేవాడు. రాక్వెల్లో ఉద్యోగంతో చాలా సంతోషంగా ఉండేవాడు. అయోవాలోని చిన్న పట్టణం సెడార్ రాపిడ్స్‌లో ఉండటానికి కూడా ఇష్టపడ్డాడు. అయితే నేను ఉద్యోగం సంపాదించడానికి, నా కలలను సాకారం చేసుకోవడానికి పెద్ద పట్టణానికి మారాలని మేమిద్దరం నిర్ణయించుకున్నాం. మరో ఆలోచన లేకుండా వెంటనే కాన్సస్ రాష్ట్రాన్ని ఎంచుకున్నాం. ఎన్నో కలలతో కాన్సస్‌లో అడుగుపెట్టాం. సొంతింటి కలను నేరవేర్చుకున్నాం. ఈ ఇంటికి శ్రీనివాస్ స్వయంగా రంగులేశాడు.. గ్యారేజీకి తలుపు బిగించాడు. ఇంటికి సంబంధించిన ఏ పనినైనా అతనెంతో ఇష్టపడి చేసేవాడు. అందులో ఎంతో సంతోషం పొందేవాడు. మా కోసం, మాకు పుట్టబోయే బిడ్డల కోసం అతను కట్టిన ఇల్లు ఇది. మాకంటూ చిన్ని కుటుంబాన్ని ఏర్పరచుకోవడానికి వేసిన తొలి అడుగు. ఇప్పుడీ కల చెదిరిపోయింది. మా ఆశలు, ఆకాంక్షలు, కలలు అన్నీ చెదిరిపోయాయి.. తన చర్యవల్ల బాధిత కుటుంబంపై పడే ప్రభావం ఏమిటనేది ఆలోచించని ఒకే ఒక వ్యక్తి మూలంగా.. పోలీసులు చెబుతుంటే నమ్మలేదు.. ఆ రోజు రాత్రి పోలీసులు మా ఇంటి తలుపులు తట్టి... ఎవరో ఆగంతకుడు తుపాకీతో నా భర్త ప్రాణాలు తీశాడని చెబుతుంటే నేను నమ్మలేకపో యా. ‘మీరు చెబుతున్నది వాస్తవమేనా? మీరు శ్రీని వాస్‌ను చూశారా? తనను గుర్తుపట్టడానికి నాకేదైనా ఫోటోను చూపించగలరా? మీరు మాట్లాడుతున్నది ఆరు అడుగులు రెండు అంగుళాలు ఉండే వ్యక్తి గురిం చేనా? అని ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నా. అన్నిం టికీ పోలీసులు తలూపుతూ... ‘అవును’ అనే సమా ధానం ఇచ్చారు. వెంటనే డల్లాస్‌లో ఉంటు న్న శ్రీనివాస్ తమ్ముడికి ఫోన్ చేశా. నమ్మలేదు... నేనేదో జోక్ చేస్తున్నానని అనుకున్నాడతను. తమ ఆప్త మి త్రుడిని, అత్యంత సన్నిహితుడికి కడసారి వీడ్కోలు పలకడానికి అయోవా, మిన్నెసోటా, సెయింట్ లూ యిస్, డెన్వర్, కాలిఫోర్నియా, న్యూజెర్సీల నుంచి మి త్రులు వచ్చారు. న్యూయార్క్, నూజెర్సీలో ఉండే అతని బంధువులు వచ్చారు. ఈ మార్చి తొమ్మిదికి త ను 33వ ఏట అడుగుపెట్టేవాడు. తన కజిన్ ఎంగేజ్ మెంట్ కోసం న్యూజెర్సీకి విమానంలో వెళ్లొద్దామని మేము ప్లాన్ చేసుకున్నాం. ఈ ట్రిప్ కొరకు వీకెండ్లో షాపింగ్ చేయాలని కూడా అనుకున్నాం. కానీ జరిగింది మరొకటి. నేను భారత్‌కు ప్రయాణమయ్యాను. శవపేటికలో తనని తీసుకొని.. ఇమిగ్రేషన్‌పై ఆందోళన చెందేవాడు.. ఆయనకు చుట్టుపక్కల జరుగుతున్న విషయాలపై ఆసక్తి ఉండేది. రోజూ టీవీలో వార్తలు చూడటం, పత్రికలు చదవడం చేసేవాడు. భారత్ గురించి, నరేంద్ర మోదీ గురించి గర్వంగా ఫీలయ్యేవాడు. దేశానికి సమర్థ నాయకత్వం లభించిందనే భావనతో ఉండేవాడు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ విదేశాల్లో ఉన్న భారతీయులు కష్టాల్లో ఉంటే తక్షణం స్పందించే తీరు తనకు నచ్చేది. అలా సహాయం పొందే వాళ్లలో తాను ఒకడినవుతానని ఊహించి ఉండడు. కష్టకాలంలో మాకు సహాయపడ్డందుకు మరోసారి ధన్యవాదాలు మేడమ్. మిమ్మల్ని, మోదీ గారిని కలిసి మా ఇరువురి తరఫున కృతజ్ఞతలు తెలపాలని కోరుకుంటున్నాను. ఇమిగ్రేషన్ విధానం, చట్టాల గురించి ఆందోళన చెందేవాడు. ఇంటర్నెట్లో ఈ అంశాలను చాలా ఆసక్తితో చదివేవాడు. అమెరికా శాశ్వత నివాస కార్డు కోసం దరఖాస్తు చేసి ఏళ్లు గడిచిపోతోంది.. ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలో అని అప్పుడప్పుడు అనేవాడు. హెచ్–1బీ వీసాలపై వచ్చిన వారి జీవిత భాగస్వాములు ఉద్యోగాలు చేసుకోవడానికి వీలుకల్పించే హెచ్4 ఈఏడీ రూల్ చట్టసభల ఆమోదం పొందినపుడు ఎంత సంతోషించాడో. ‘నానీ... నువ్వు ఇక ఉద్యోగం చేయవచ్చురా. మనకు డబ్బు అవసరం ఉందని కాదు. నువ్వు నీ కలలను సాకారం చేసుకునేందుకు... నీ తల్లిదండ్రులు గర్వపడేలా చేయడానికి’ అని అన్నాడు. తక్కువ ఆదాయంతో ముగ్గురు మగపిల్లలను పెంచడానికి వాళ్ల తండ్రి బాగా కష్టపడ్డాడని రోజుకు ఒకసారైనా గుర్తు చేసుకునేవాడు. తల్లిదండ్రులకు ఎంతో చేయాల్సి ఉందనేవాడు. ‘నేనొకటి కచ్చితంగా చెప్పగలను శ్రీను... నువ్వు మీ తల్లిదండ్రులు గర్వపడేలా ఎదిగావు. కానీ నువ్విలా మమ్నల్ని విడిచి వెళ్లకుండా ఉండాల్సింది’. ముగ్గురు పిల్లలో శ్రీను రెండోవాడు. తనకు తమ్ముడంటే ఎంతో ఇష్టం. చిన్నప్పుడు ముగ్గురూ బాగా అల్లరి చేసేవారంట. వెళ్లిపోదామా అని అడిగేదాన్ని.. ఎవరైనా హత్యకు గురయ్యారనే వార్త విన్నపుడల్లా ఇక్కడి నుంచి వెళ్లిపోదామా అని అడిగేదాన్ని. ‘మన ఆలోచనలు మంచిగా ఉంటే, మనం సత్ప్రవర్తనతో నడుచుకుంటే... మనకు మంచే జరుగుతుందని, మనకేం కాదు అని ప్రతిసారీ దగ్గరికి తీసుకొని ధైర్యం చెప్పేవాడు. ఇప్పుడు ఆ ఆత్మీయ ఆలింగనం లేదు. నాకిక మునుపటిలా నిద్ర రాదేమో! ఎలాంటి ఆందోళన, భయం లేకుండా నేను హాయిగా నిద్రపోయేది ఒక్క నీ ఎదపైనే..! ఈ కష్టం ఎవరికీ రావొద్దు... గార్మిన్ సీఈఓవోకు, శ్రీను సహచరులకు, ఓలేత్ నగర మేయర్‌కు, కష్టకాలంలో అండగా నిలబడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. నేను పనిచేస్తున్న ఇన్టచ్ సొల్యూషన్స్ సీఈవో ఫ్రాంక్‌కు ధన్యవాదాలు. ఎంతకాలమైనా సెలవు తీసుకోమని, ఎప్పుడొచ్చినా... నా ఉద్యోగం నాకు ఉంటుందని చెప్పారాయన. నేను అమెరికాలో కెరీర్‌ను నిర్మించుకోవాలనేది నా శ్రీను కల. దానిని నేరవేర్చడానికి నేను అమెరికా తిరిగి రావాలి. నా భర్తను కాపాడటానికి తనవంతు ప్రయత్నం చేసి కాల్పుల్లో గాయపడ్డ ఇయాన్ గ్రిలాట్ త్వరగా కోలుకోవాలని ఆక్షాంక్షిస్తున్నాను. ఓలేత్‌కు తిరిగివచ్చాక మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవాలని కోరుకుంటున్నాను. గ్రిలాట్ సాటి మనిషిని కాపాడటానికి మీరు చేసిన ప్రయత్నం, మీరు ప్రదర్శించిన మానవత్వం... ప్రేమపై, ప్రేమను పంచడంపై నాలో ఉన్న విశ్వాసాన్ని సజీవంగా ఉంచాయి. ట్వీట్ల ద్వారా మద్దతు పలికిన సత్య నాదెళ్ల, కమలా హారిస్‌లకు కృతజ్ఞతలు. మార్క్ జుకెర్‌బర్గ్, సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ లాంటి వారందరికీ నా విన్నపం ఒకటే... మానవ హక్కులకు మీ మద్దతును వీలైనంతగా జనంలోకి తీసుకెళ్లండి. ద్వేషాన్ని ఆపాలి... ప్రేమను వ్యాపింపజేయాలి. ఈ రోజు గార్మిన్ ఉద్యోగికి జరిగింది... రేపు మీ ఉద్యోగుల్లో ఒకరు కావొచ్చు. మా కుటుంబానికి వచ్చిన ఈ కష్టం మరెవరికీ రాకూడదని నేను కోరుకుంటున్నాను. శ్రీనివాస్ పార్థివదేహం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటికి చేరేలా చూసిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. అమితాబ్‌బచ్చన్ సర్, షారూక్ ఖాన్ సర్... మేము మీకు వీరాభిమానులం. ప్రేమను పంచాలనే గట్టి సందేశాన్ని అందరికీ చేరవేయడానికి నాకు మీ మద్దతు కావాలి. నేను అదే ప్రశ్న మళ్లీ అడుగుతాను. చర్మం రంగును బట్టి ఒక మనిషి మంచివాడో, చెడ్డవాడో ఎవరైనా ఎలా నిర్ణయిస్తారు? ఇలాంటి ఘటనలు జరిగినపుడు కొంతకాలం వర్ణ, జాతి వివక్షలపై చర్చ జరుగుతుంది. కొన్ని వారాల తర్వాత జనం అంతా మర్చిపోతారు. ప్రజల మనసుల్లోని ద్వేషాన్ని రూపుమాపడానికి నిరంతర పోరాటం జరగాలి. ద్వేషపూరిత దాడులను ఆపడానికి ప్రభుత్వం ఏం చేయబోతోంది? ప్రతి వలసదారుడి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇది. మేమీ ప్రాంతానికి చెందిన వాళ్లమేనా? చివరగా దీనికి సమాధానం కావాలి. ఇది మేం కలలుగన్న దేశమేనా? పిల్లలు, కుటుంబంతో కలసి నివసించడానికి ఇది సురక్షితమేనా? – సునయన దుమాలా నువ్వు ఎప్పటికీ నా వాడివే.. కాన్సస్ ఎయిర్‌పోర్ట్‌లో ఎంతోమంది నన్ను గుర్తు పట్టారు. ఆలింగనం చేసుకొని ఓదార్చారు. నా జీవిత పర మార్థాన్నే మార్చేశావని ఓ డెర్మటాలజిస్టు అంది. ప్రేమను పంచే పోరాటంలో అది తొలి విజయమేమో. నీ గురించి.. చుట్టుపక్కల ఉన్న వారికి నువ్వు పంచిన ప్రేమ గురించి ఓ పుస్తకం రాసినా సరిపోదేమో. ఒకే సాయంత్రంతో అంతా మారిపోయింది. భార్య నుంచి వితంతువును అయిపోయాను. ఈ నిజాన్ని జీర్ణం చేసుకోవడానికి నేనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. శ్రీను... నా ప్రేమ, నీవు లేని వెలితిని నేనెలా పూడ్చుకోగలనో తెలియదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను... ఎప్పటికీ నీ ఆశలను, ఆశయాలను ఓడిపోనివ్వను. ఐ లవ్ యూ, నువ్వు ఎప్పటికీ నా వాడివే. టీ తాగడానికి ఇంటికి రమ్మని పిలిచినపుడు నీవు వచ్చుంటే బాగుండని అనుకుంటున్నాను. నాలో ఎన్నో సమాధానం లేని ప్రశ్నలున్నాయి. వాటికి నువ్వు జవాబివ్వాలని కోరుకుంటు న్నాను. అవతలి ప్రపంచంలో నీవున్న చోటికి నేను వచ్చినప్పుడే నా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ఆ రోజు ఎప్పుడొస్తుందో తెలియదు. నాకో బిడ్డ ఉంటే తనలో శ్రీనును చూసుకునేదాన్ని.. ఆరేళ్ల స్నేహం తర్వాత మేము పెళ్లి చేసుకున్నాం. అందత తేలికగా ఏమీ జరగలేదు. వాళ్ల తల్లిదండ్రులతో పాటు మా అమ్మానాన్నలను కూడా అతనే ఒప్పించాల్సి వచ్చింది. మీ ప్రియమైన కూతురిని బాగా చూసుకోగలనని, తగినవాడినని చెప్పి పెళ్లికి ఒప్పించడానికి పలుమార్లు మా కుటుంబీకులను కలిశాడు. అడిగిన ప్రశ్నలన్నింటికీ ముఖంపై చిరునవ్వుతో సమాధానాలిచ్చాడు. ఆయన సమ్మోహన శక్తి ఎలాంటిదంటే... అనతికాలంలోనే మా కుటుంబంలో అందరికీ అత్యంత ఆప్తుడైపో యాడు. అలాంటి వ్యక్తి ఇక లేడంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. చిన్నచిన్న వాటిల్లోనే సంతోషం పొందేవాడు. టీవీ చూడటం ఆయనకు అత్యంత ఇష్టమైన కాలక్షేపం. కుటుంబానికి ప్రాధాన్యమిచ్చే వ్యక్తి. ఇంట్లో వండినవి తినడమే ఆయనకిష్టం. ప్రతిరోజు రాత్రి... మరుసటి రోజు లంచ్‌కు మాకిద్దరికీ బాక్స్‌లను సిద్ధం చేసేదాన్ని. బాక్స్ సర్దుకోవడం అస్సలు ఇష్టముండేది కాదతనికి. ఎందుకలా... అని అడిగితే సరదాగా ఉండే వివరణలు ఇచ్చేవాడు. నా లంచ్ బాక్స్ నేనే సర్దుకుంటే... ఏం తినబోతున్నానో ముందే తెలుస్తుంది. అదే నువ్వు ప్యాక్ చేశావనుకో... ఈరోజు లంచ్‌లో ఏముందో అనే ఆసక్తి నాకుంటుంది అనేవాడు. ఆప్యాయంగా భోజనం పెట్టిన వారినీ ‘అన్నదాతా సుఖీభవ’ అని మనసారా దీవించేవాడు. చాలామంది మిత్రులకు శ్రీనివాస్ నుంచే ఈ అలవాటు వచ్చింది. లంచ్‌లో ఆర్నబ్ గోస్వామి షో ఎంజాయ్ చేసేవాడు. మళ్లీ ఎప్పుడు టీవీ తెరపై కనిపిస్తాడా? అని ఎదురుచూస్తుండే వాడు. పిల్లలంటే తనకెంతో ఇష్టం. పిల్లలను కనాలనే ఆలోచనతో ఉన్నాం. కొన్ని వారాల కిందటే డాక్టర్‌ను కలిశాం కూడా. ‘నానీ (తను నన్నలా పిలిచేవాడు)... కృత్రిమ గర్భధారణకు వెళ్లాల్సి వస్తే... దానికోసం డబ్బు దాచాలిరా..’ అని అన్నాడు. తను నాతో పంచుకొన్న కొన్ని చివరి ఆలోచనల్లో ఇదొకటి. మా ఈ కల చెదిరిపోయిందనేది ఇప్పుడిప్పుడే జీర్ణమవుతోంది... అందుకే రాస్తున్నాను. మాకో బిడ్డ ఉంటే... తనలోనైనా శ్రీనివాస్‌ను చూసుకునే దాన్ని. శ్రీనులా పెంచేదాన్ని. - ఫేస్బుక్లో తన ఆవేదనకు అక్షరరూపమిచ్చిన సునయన (అమెరికాలోని కాన్సస్‌లో ఫిబ్రవరి 22న జరిగిన ద్వేషపూరిత కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన కూచిభొట్ల శ్రీనివాస్ అర్ధాంగి సునయన 28–02–2017న తన ఫేస్బుక్ అకౌంట్లో చేసిన పోస్ట్) -
వైట్ హౌస్ ఒప్పుకుంది
వాషింగ్టన్: తెలుగు ఇంజనీర్ కూచిభొట్ల శ్రీనివాస్ హత్యను అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఖండిచింది. కూచిభొట్ల శ్రీనివాస్ ది జాత్యంహకార హత్యగా అంగీకరించింది. జాతి వివక్షతో కూడిన దాడిగా వర్ణించింది. ఇలాంటి ఘటనలను సహించబోమని స్పష్టం చేసింది. ‘ఇప్పటివరకు వెల్లడైన వాస్తవాలను బట్టి చూస్తే కాన్సస్ కాల్పులు.. జాతి వివక్షతో కూడిన విద్వేష దాడిగా రూడీ అవుతోంది. జాత్యంహకార దాడులను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండిస్తారు. ఇటువంటి దాడులను సహింబోమ’ని వైట్ హౌస్ అధికార ప్రతినిధి సారా శాండర్స్ మీడియాతో అన్నారు. మరోవైపు కూచిభొట్ల శ్రీనివాస్ మృతికి అమెరికా కాంగ్రెస్ సంతాపం తెలిపింది. కాన్సస్ కాల్పులు బాధితుల కోసం అమెరికా చట్టసభ సభ్యులు నిమిషం మౌనం పాటించారు. గత బుధవారం రాత్రి కాన్సస్ లోని ఆస్టిన్స్ బార్లో ఆడమ్ పూరింటన్ అనే వ్యక్తి జరిపిన కాల్పుల్లో కూచిభొట్ల శ్రీనివాస్ మృతి చెందాడు. మరో తెలుగు ఇంజనీర్ అలోక్ రెడ్డి, అమెరికన్ ఇయాన్ గ్రిల్లాట్ గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్టు ఎఫ్ బీఐ తెలిపింది. జాత్యంహకార దాడిగానే భావించి విచారణ చేపట్టామని ఎఫ్ బీఐ వెల్లడించింది. -
కాన్సన్ కాల్పుల ఘటనలో కొత్త కోణం
కాన్సన్: తెలుగు ఇంజనీరు కూచిభొట్ల శ్రీనివాస్ హత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఇరాన్ దేశస్తుడనుకుని శ్రీనివాస్ ను కాల్చానని నిందితుడు ఆడమ్ ప్యూరింటన్(51) కోర్టుకు తెలిపాడు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అతడిని జాన్సన్ కౌంటీ డిస్ట్రిక్ట్ కోర్టు ముందు హాజరుపరిచారు. ఫస్ట్ డిగ్రీ హత్య, ఫస్ట్ డిగ్రీ హత్యాయత్నం అభియోగాలు అతడిపై నమోదు చేశారు. కాల్పులు జరిపిన తర్వాత ప్యూరింటన్ 70 మైళ్ల దూరం పారిపోయారు. క్లింటన్ లోని ఆపిల్ బే రెస్టారెంట్ కు వెళ్లి బార్ అటెండర్ కు హత్య విషయం చెప్పాడు. తమతో పాటు ఉంటానని ప్యూరింటన్ అడిగాడని, దీనికి ఒప్పుకుంటేనే ఏం జరిగింది చెప్తాననన్నాడని బార్ అటెండర్ తెలిపాడు. తాము సరేననడంతో జరిగిందంతా చెప్పాడని వెల్లడించాడు. తాను వెంటనే 911 ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించడంతో ప్యూరింటన్ ను అరెస్ట్ చేసినట్టు చెప్పాడు. ప్యూరింటన్ కోరిక మేరకు అతడి తరపున వాదించేందుకు న్యాయవాదిని జాన్సన్ కౌంటీ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి నియమించారు. 2 మిలియన్ డాలర్ల బాండుతో అతడిని జైలుకు పంపారు. 5 నిమిషాల్లో విచారణ ముగిసింది. తదుపరి విచారణను మార్చి 9కి వాయిదా వేశారు. బుధవారం రాత్రి కాన్సాస్‌లోని ఆస్టిన్స్ బార్లో ప్యూరింటన్ జరిపిన కాల్పుల్లో శ్రీనివాస్ కూచిభొట్ల ప్రాణాలు కోల్పోయాడు. మరో తెలుగు ఇంజనీర్ అలోక్ రెడ్డి, అమెరికన్ ఇయాన్ గ్రిల్లాట్ గాయపడ్డారు. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని శ్వేతసౌధం అధికార ప్రతినిధి సీన్ స్పైసర్ ఆదేశించారు. -
కాన్సన్ కాల్పుల ఘటనలో కొత్త కోణం
-
అమెరికాలో ప్రమాదం ఇలా తప్పించుకోండి
న్యూయార్క్: అమెరికాలో ఉంటున్న భారతీయులు బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాతృభాషలో మాట్లాడకుండా ఉండటం ద్వారా దాడుల నుంచి బయటపడొచ్చని తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(టాటా) సూచించింది. భారతీయులపై ముఖ్యంగా తెలుగువారిపై జాతి వివక్ష పూరిత దాడులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉంటున్న తెలుగువారికి, భారతీయులకు కొన్ని సలహాలు, సూచనలు, జాగ్రత్తలు టాటా చెప్పింది. ముఖ్యంగా భారతీయులు బయట సమూహాల్లో కలుసుకునే సందర్భాల్లో వీలైనంత వరకు మాతృభాషను తక్కువగా ఉపయోగించాలని సలహా ఇచ్చింది. ప్రస్తుతం అమెరికాలో సవాళ్లను ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయని ఈ నేపథ్యంలో ఎవరికి వారు అప్రమత్తంగా ఉండటం మంచిదని జాగ్రత్తలు చెప్పింది. చుట్టుపక్కల అనుమానపూర్వక కదలికలపై, వ్యక్తులపై ఓ కన్నేసి ఉంచాలని, తమ చుట్టూ అలుముకుంటున్న పరిస్థితులను అంచనా వేయగలగాలని సూచించింది. వీలైనంత మేరకు ఎలాంటి వాదనలకు దిగొద్దని, బహిరంగ ప్రదేశాల్లో గొడవపడొద్దని, చాలామంది రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంటారని, ఆ సమయంలో సాధ్యమైనంతవరకు ఆంగ్ల భాషలోనే మాట్లాడాలని గట్టిగా చెప్పింది. మనుషుల కదలిక తక్కువగా ఉండే నిర్మానుష్య ప్రాంతాలకు గుంపులుగా వెళ్లాలని, ఒంటరిగా వెళ్లకూడదని కూడా సూచించింది. అత్యవసరం అనిపిస్తే 911 నంబర్‌కు ఫోన్ చేసేందుకు అస్సలు సంకోచించవద్దని కూడా సలహా ఇచ్చింది. ఇటీవల అమెరికా దుండగుడి కాల్పుల్లో ప్రాణాలుకోల్పోయిన శ్రీనివాస్ కూచిబొట్ల స్మృతి చిత్రంతో ఈ సలహాలు, సూచనలను టాటా సెక్రటరీ విక్రమ్ జంగం ఫేస్బుక్ ద్వారా తెలియజేశారు. సంబంధిత వార్తా కథనాలకై చదవండి.. రక్షించేందుకు కాల్పులకు ఎదురెళ్లిన హీరో ఇతడే ‘కాలుస్తుంటే ఏదో ఒకటి చేయాలనిపించింది’ శ్రీనివాస్ మృతిపట్ల యూఎస్ కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతి అమెరికాలో జాతి విద్వేష కాల్పులు శ్రీనివాస్ కుటుంబానికి ఎన్ఆర్ఐల బాసట -
‘కాలుస్తుంటే ఏదో ఒకటి చేయాలనిపించింది’
న్యూయార్క్: తోటివారిని రక్షించడం కోసం తన ప్రాణాలు సైతం ఇబ్బందుల్లో పెట్టుకోవడం తనకు సంతోషంగానే అనిపించదని కాన్సాస్ కాల్పుల్లో గాయపడిన ఇయాన్ గ్రిల్లాట్ చెప్పాడు. దుండగుడు భయంకరంగా కాల్పులు జరుపుతుంటే చూస్తూ ఉండలేకపోయానని, ఏదో ఒకటి చేయాలనే తాను అతడిపైకి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. జాత్యహంకారంతో కాన్సాస్‌లోని ఆస్టిన్ బార్లో మా దేశం విడిచి వెళ్లిపోండి అని గట్టిగా అరుస్తూ ఇద్దరు తెలుగువారిపై దుండగుడు కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో శ్రీనివాస్ కూచిబొట్ల చనిపోగా అలోక్ మాదసాని గాయపడ్డాడు. ఈ దాడిలోనే అలోక్ కంటే కూడా దారుణంగా ఇయాన్ తీవ్రంగా గాయపడ్డాడు. వీరంతా ఒక టేబుల్‌పై కూర్చుని ఉండగా దుండగులు కాల్పులు ప్రారంభించి తొమ్మిది రౌండ్లు కాల్చిన అనంతరం ఎక్కడివారు అక్కడ భయాందోళనలతో చెల్లాచెదురుగా పరుగెడుతుండగా ఒక్క ఇయాన్ మాత్రం ఆ దుండగుడిపైకి ఉరికాడు. దాంతో అతడిపైకి కూడా దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో ఒక బుల్లెట్ అతడి చాతీలోకి, మరొకటి చేతిలోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్న అతడిని మీడియా పలకరించింది. మీకు జరిగిన హానీని ఊహించుకొని బాధపడుతున్నారా అని మీడియా ప్రశ్నించగా.. ‘ఇతరుల ప్రాణాలు రక్షించేందుకు నా ప్రాణాలు పణంగా పెట్టే ప్రయత్నం చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆ సమయంలో బార్లో చాలా కుటుంబాలు ఉన్నాయి. పిల్లలు కూడా లోపల ఉన్నారు. అతడు అలా కాల్పులు జరుపుతుంటే చూస్తూ ఉండలేకపోయాను. ఏదో ఒకటి చేయాలనిపించింది. అందుకే నేను చేయాలనుకుంది చేసేశాను’ అని చెప్పాడు. సంబంధిత వార్తా కథనాలకై చదవండి.. రక్షించేందుకు కాల్పులకు ఎదురెళ్లిన హీరో ఇతడే శ్రీనివాస్ మృతిపట్ల యూఎస్ కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతి అమెరికాలో జాతి విద్వేష కాల్పులు శ్రీనివాస్ కుటుంబానికి ఎన్ఆర్ఐల బాసట -
కాన్సస్ కాల్పులు.. ట్రంప్‌కు రచయిత్రి చురకలు
న్యూఢిల్లీ: ట్రంప్ విపరీత పోకడలపై స్పందించేవారిలో అమెరికన్ రచయిత్రి జేకే రౌలింగ్ ముందుంటారు. కాన్సస్‌లో జాతివివక్షకు బలైపోయిన భారతీయుడి ఉదంతంలో ఆమె మరోసారి ట్రంప్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. కాన్సస్ జాతివివక్ష కాల్పులపై భారతీయ రచయిత ఆనంద్ గిరిధర్దాస్ ట్విట్టర్లో మండిపడ్డారు. ట్రంప్ అవలంభిస్తున్న విద్వేషపూరిత విధానాల మూలంగానే ఈ కాల్పులు జరిగాయని ఆయన విమర్శించారు. ఘటన అనంతరం ట్రంప్ వర్గాలు.. ఈ కాల్పులకు ట్రంప్ విధానాలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకోవడంలో అత్యుత్సాహం ప్రదర్శించాయని ఆయన ట్విట్టర్లో విమర్శించారు. ఆనంద్ గిరిధర్దాస్ చేసిన ఈ ట్వీట్లను ఉటంకిస్తూ.. 'విద్వేషపూరిత ప్రసంగం సరదాగా ఉండదు. మనం వాడే భాష ప్రభావం చూపుతుంది' అని రౌలింగ్ ట్వీట్ చేశారు. -
కాన్సస్ షూటింగ్: అమెరికా డ్రీమ్స్‌పై భయాందోళనలు
న్యూఢిల్లీ : అమెరికాలో పీహెచ్డీ చేయడం అనుపమ్ సింగ్‌కు ఓ డ్రీమ్. ఒక్క అనుపమ్ సింగ్‌కే కాదు, అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో ఉన్నత చదువులు చదివి మంచిగా సెటిల్ అవ్వాలని ప్రతిఒక్క భారతీయ యువత కలలు కంటుంటారు. కానీ బుధవారం అర్థరాత్రి జాతి విద్వేషంతో ఓ శ్వేత జాతి ఉన్మాది భారతీయులపై జరిపిన కాల్పులతో ఒక్కసారిగా భయాందోళనలు చెలరేగాయి. అసలు అమెరికా వెళ్లి చదవడం అవసరమా? అనే ఆలోచనలు ప్రారంభమయ్యాయి. అమెరికా స్టడీపై ఇప్పటికే ఓ ప్రణాళిక వేసుకున్న కొందరు విద్యార్థులు పునఃసమీక్షించడం ప్రారంభించారు. అయిష్టంగానే పిల్లల్ని విదేశాలకు పంపించే తల్లిదండ్రులైతే, ఎక్కడికి వెళ్లక్కర్లేదు తమ కళ్లెదుటే క్షేమంగా ఉంటే చాలని పట్టుబడుతున్నారు. తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారన్న ఆక్రోశంతో ఆడమ్ పూరింటన్ అనే ఓ శ్వేతజాతి ఉన్మాది ఓ బార్లో భారతీయులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ కూచిభొట్ల అనే ఇంజనీర్ చనిపోయారు. ఈ ఘటనలో శ్రీనివాస్ స్నేహితుడు అలోక్ రెడ్డి కూడా తీవ్ర గాయాలపాలయ్యారు. ఉన్మాదిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో అమెరికన్‌కూ గాయాలయ్యాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గద్దెనెక్కిన తర్వాత ఆ దేశంలో దారుణంగా విద్వేషపూరిత భావజాలం భారీగా బలపడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఘటనలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ట్రంప్ పాలనలో అమెరికా భారతీయులకు సురక్షితం కాదని భయాందోళనలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలోని తల్లిదండ్రులందరూ అమెరికాకు వారి పిల్లల్ని పంపించడం అంత మంచిది కాదని గాయపడిన అలోక్ తండ్రి విన్నపిస్తున్నారు. గ్రాడ్యుయేట్ స్టూడెంట్లు కూడా అమెరికాలో పోస్టు గ్రాడ్యుయేట్ చేసే ప్లాన్స్‌ను పునఃసమీక్షిస్తున్నామని, కెనడా కాని ఆస్ట్రేలియాకు కాని వెళ్లి చదువుకోవాలనుకుంటున్నట్టు చెబుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులు సద్దుమణిగితే భవిష్యత్తులో తమ పిల్లల డ్రీమ్స్‌ను తాము కాదనమని కొందరు పేరెంట్స్ ధైర్యంగా చెబుతున్నారు. కానీ ప్రస్తుతం అక్కడ చదువుకుంటున్న వారి పరిస్థితేమిటి? ఈ కాల్పుల ఘటనతో అమెరికాలో విద్వేషపూరిత వాతావరణం, భయాందోళనలు పెరిగాయని అక్కడి విద్యార్థులు పేర్కొంటున్నారు. ఇన్నిరోజులు వీసా నిబంధనల కఠినతరంతో భయాందోళనలు చెలరేగితే, ఈ ఆందోళనలను మరికొంత పెంచుతూ జాతి విద్వేషపూరిత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ విషయంపై ఏం పట్టన్నట్టు ట్రంప్ వ్యాఖ్యలు చేయడం కూడా ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. -
నా భర్త మరణానికి సమాధానం చెప్పాలి
► ట్రంప్ సర్కారును ప్రశ్నించిన మృతుడు శ్రీనివాస్ భార్య ► మైనారిటీల భద్రతకు ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ ► విచారణ వేగవంతానికి భారత దౌత్య కార్యాలయం డిమాండ్ ► ఆసుపత్రినుంచి అలోక్ రెడ్డి డిశ్చార్జ్ ► కోలుకుంటున్న మరో బాధితుడు హూస్టన్ : అమెరికాలోని కాన్సస్‌లో బుధవారం రాత్రి జరిగిన కాల్పుల ఘటనకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలని ఈ ఘటనలో మృతిచెందిన కూచిభొట్ల శ్రీనివాస్ భార్య సునయన డిమాండ్ చేశారు. అమెరికాలో మైనారిటీలపై వివక్షాపూరితమైన దాడులు ఆపేందుకు సర్కార్ ఏం చేస్తుందో చెప్పాలన్నారు. ‘కొంతకాలంగా అమెరికాలో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే మేం ఇక్కడి వారమా? కాదా? అని ఆశ్చర్యం కలుగుతోంది’ అని సునయన తెలిపారు. శ్రీనివాస్ ఉద్యోగం చేస్తున్న గార్మిన్ కంపెనీ శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సునయన మాట్లాడుతూ.. ‘ఇక్కడుండే ప్రతి ఒక్కరూ దేశానికి చెడు తలపెట్టరు. ఇక్కడ మా కుటుంబం బతకాలా? వద్దా? అనే అనుమానం వస్తోంది. విదేశీయులపై అమెరికాలో దాడుల వార్తలను చూసి బాధకలిగేది. మనం అమెరికాలో భద్రంగానే ఉంటామా? అనే అనుమానం వచ్చేది. కానీ మంచోళ్లకు మంచే జరుగుతుందని నా భర్త చెప్పేవారు. మంచిగా ఆలోచించాలి. మంచి పనులే చేయాలి. అప్పుడు మంచే జరుగుతుందని చెప్పేవారు. పని ఒత్తిడి నుంచి కాస్త రిలాక్స్ అవుదామని ఆయన బార్‌కు వెళ్లారు. అక్కడికొచ్చిన వ్యక్తి జాత్యహంకారంగా మాట్లాడుతున్నా.. శ్రీనివాస్ పట్టించుకోలేదు. బయటకు వెళ్లొచ్చిన ఆ వ్యక్తి ఓ మంచి మనిషిని, అందరినీ ప్రేమించే వ్యక్తిని పొట్టన పెట్టుకున్నాడు. మా ఇద్దరి కుటుంబాల్లో విషాదం నింపాడు. శ్రీనివాస్ వాళ్ల అమ్మకు ఇప్పుడేమని సమాధానం చెప్పాలి’ అని సునయన ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఆయనకు ఇలాంటి చావొస్తుందనుకోలేదు. మరో రెండు వారాల్లో ఆయన 33వ పుట్టినరోజు జరుపుకోవాలి. ఆయన అమెరికాను బాగా ప్రేమించారు. చాలా సార్లు వేరే దేశానికి వెళ్లిపోదామా అని అడిగాను. కానీ వేచి చూద్దామనే ఆయన సమాధానమిచ్చారు. ఇప్పుడాయన మృతికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలని’ అని సునయన డిమాండ్ చేశారు. ‘మా ఆయన్ను పొట్టన పెట్టుకున్న వ్యక్తి వేరే బార్‌కు వెళ్లి ఇద్దరు ముస్లిం యువకులను చంపానని గర్వంగా చెప్పుకున్నాడని తెలిసింది. శరీరం రంగు చూసి ఓ వ్యక్తి ముస్లిమా? హిందువా? క్రిస్టియనా అని ఎలా గుర్తిస్తారు?’ అని ఆమె ప్రశ్నించారు. (చదవండి: విద్వేషపు తూటా!) హైదరాబాద్‌లో అంత్యక్రియల కోసం భారత్‌కు బయలుదేరనున్న సునయన.. తన భర్త కలలను సాకారం చేసేందుకు కన్సాస్‌కు తిరిగి వెళ్లనున్నట్లు స్పష్టం చేశారు. ‘ఏ రంగంలోనైనా విజయం సాధించగలననే నమ్మకం నాకుంది. అయితే నా నిర్ణయాన్ని చెప్పేముందు అమెరికా ప్రభుత్వాన్ని అడుగుతున్నా.. ఇలాంటి విద్వేషపూరిత ఘటనలను ఆపేందుకు మీరేం చేస్తారో చెప్పండి’ అని ఆమె డిమాండ్ చేశారు. 2005లో కూచిభొట్ల అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్–ఎల్ పాసో (యూటీఈపీ)లో పీజీలో చేరేందుకు వచ్చారు. ఇదే యూనివర్సిటీలో చేరేందుకు ప్రయత్నించిన సునయనకు శ్రీనివాస్‌తో ఆన్ లైన్ లో స్నేహం కుదిరింది. 2007లో అమెరికా వచ్చిన సునయన మినసోటాలోని సెయింట్ క్లౌడ్ స్టేట్ యునివర్సిటీలో చేరారు. ఐదేళ్ల తర్వాత 2012లో వీరిద్దరూ వివాహం చేసుకుని న్యూ ఒలేత్లో ఇంటిని కొనుక్కున్నారు. కాగా, గార్మిన్ కంపెనీ ఆవరణలో శ్రీనివాస్‌కు ఉద్యోగులు ఉద్వేగపూరిత వాతావరణంలో ఘనంగా నివాళులర్పించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అలోక్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రంగంలోకి భారత కాన్సులేట్ కాన్సస్ ఘటనను భారత దౌత్యకార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఈ కేసు విచారణ వేగంగా జరపాలంటూ అమెరికా సర్కారుకు లేఖ రాసింది. హూస్టన్ భారత కాన్సులేట్ జనరల్ అనుపమ్ రాయ్ పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కుటుంబానికి అవసరమైన సాయాన్ని ఆయన అందిస్తున్నారు. డిప్యూటీ కాన్సుల్ ఆర్డీ జోషి, వైస్ కాన్సుల్ హర్పాల్ సింగ్‌లు ఈ ఘటనలో గాయపడ్డ అలోక్ రెడ్డి కుటుంబాన్ని, భయంతో ఉన్న స్థానిక భారత సంతతి ప్రజలను కలిసి ధైర్యాన్నిచ్చారు. కాగా, శనివారం అలోక్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అమెరికన్ ఇయాన్ గ్రిలాట్ (24) ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని కాన్సస్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్య నాదెళ్ల కన్సాస్‌లో భారతీయులపై దాడిని ఖండించారు. మతపరమైన దాడులు, హింస సరికాదని బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ట్వీటర్లో పేర్కొన్నారు. విద్వేష రాజకీయాలకు తమ మద్దతుండదని పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ తెలిపారు. ఖండించిన అమెరికన్ చట్టసభ్యులు కాన్సస్ కాల్పుల ఘటనను అమెరికన్ చట్టసభ్యులు బహిరంగంగా ఖండించారు. దేశంలో ఇలాంటి హింసకు తావులేదని ముక్తకంఠంతో వెల్లడించారు. ‘విద్వేషాన్ని ఎట్టిపరిస్థితుల్లో సహించం. ఈ వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది’ అని కాలిఫోర్నియా సెనేటర్ కమలా హ్యారీస్ తెలిపారు. ‘అమెరికాలో ఇలాంటి హింసను ఒప్పుకోం’ అని కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ అన్నారు. ‘ఇది ఇద్దరు వ్యక్తులపై జరిగిన దాడి మాత్రమే కాదు. భారతీయులు, భారత్–అమెరికన్ల భద్రతను కట్టుదిట్టం చేయాలి’ అని డెమొక్రటిక్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి తెలిపారు. పలువురు అమెరికన్ చట్టసభ్యులు దాడులపై నిరసన తెలిపారు. బార్లో ఏం జరిగింది? అమెరికాలోని కాన్సస్‌లోని ఆస్టిన్ బార్లో ఇద్దరు భారతీయులపై కాల్పుల ఘటనను.. బాధితుడు అలోక్ రెడ్డి న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్యూలో వెల్లడించారు. ‘బార్లో నేను (అలోక్) కూచిభొట్ల శ్రీనివాస్ కూర్చున్నాం. మాకు సమీపంలోనే పురింటన్ (కాల్పులకు పాల్పడిన వ్యక్తి) కూర్చున్నాడు. ఏ వీసాలపై వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు? అక్రమంగా ఇక్కడ ఉంటున్నారా? అని పురింటన్ అడిగాడు. దీనికి మేం స్పందించలేదు. చాలా మంది ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తుంటారు అని లైట్ తీసుకున్నాం. కానీ మమ్మల్ని దూషిస్తూ.. వీరు అమెరికన్లు కారు అని గట్టి గట్టిగా అరుస్తూనే ఉన్నాడు. అంతటితో ఆగకుండా బార్ మేనేజర్‌ను తీసుకొచ్చేందుకు లోపలకు వెళ్లాడు. ఆ తర్వాత ఏమైందేమో బయటకు వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత గన్ పట్టుకుని కోపంగా వచ్చిన పురింటన్ మాపై కాల్పులు జరిపాడు. కూచిభోట్ల అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. నాకు గాయాలయ్యాయి. అక్కడే ఉన్న ఓ 24 ఏళ్ల అమెరికన్ యువకుడు పురింటన్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు.అతన్నీ పురింటన్ కాల్చాడు’ అని అలోక్ రెడ్డి వెల్లడించారు. ట్రంప్ వ్యాఖ్యలతో సంబంధం లేదు అమెరికా అధ్యక్షుడు వలసలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే భారతీయ ఇంజనీర్ హత్యకు కారణమని వస్తున్న వార్తలను వైట్‌హౌస్ ఖండించింది. ‘ఇలాంటి ఘటనలు దురదృష్టకరం. మేం దీన్ని ఖండిస్తున్నాం. ట్రంప్ వ్యాఖ్యలకు ఈ ఘటనకు సంబంధమే లేదు’ అని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ వెల్లడించారు. అధ్యక్షుడి వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా లేవని దీన్ని తప్పుగా చూపిస్తున్నారన్నారు. కాగా, ఈ ఘట నపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ గ్యుటెరస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, కాన్సస్ కాల్పులకు కారకుడు పురింటోన్ పై ఫస్ట్ డిగ్రీ హత్యకేసు నమోదు చేసినట్లు జాన్సన్ కౌంటీ జిల్లా అటార్నీ స్టీఫెన్ హోవే వెల్లడించారు. ఈ ఘటన విద్వేషపూరిత నేరమా? కాదా? అనే విషయంలో ఎఫ్‌బీఐ విచారణ ప్రారంభమైందన్నారు. కోల్‌కతాలో శ్రీనివాస్‌కు నివాళులు అర్పిస్తున్న మేయర్ సావర్ ఛటర్జీ -
మనం అమెరికాకు చెందిన వాళ్లమేనా..?
-
ఇండియన్ అమెరికన్ ఎంపీల తీవ్ర స్పందన
-
డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
-
కాన్సాస్ కాల్పులపై సత్య నాదెళ్ల స్పందన
-
వైట్‌హౌస్ సంప్రదాయాలు కాలరాస్తున్న ట్రంప్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తనకు వ్యతిరేకంగా వార్తలు రాసే మీడియా సంస్థలపై చర్యలు తీసుకున్నారు. ఇన్నాళ్లూ మీడియా తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తోందని తీవ్ర ఆరోపణలు చేస్తూ వచ్చిన ట్రంప్ ఈసారి ఏకంగా పలు మీడియా సంస్థలను శ్వేతసౌధంలో రోజూ జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్‌కు అనుమతించకుండా నిషేధం విధించారు. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ మీడియా సమావేశం నుంచి సీఎన్ఎన్, న్యూయార్క్ టైమ్స్, లాస్ఏంజిల్స్ టైమ్స్ సహా పలు మీడియా సంస్థలను మినహాయించారు. తనకు అనుకూల కథనాలు ప్రసారం చేసే కొన్ని మీడియా సంస్థలనే ఈవెంట్లకు ఆహ్వానిస్తున్నారు. మరోవైపు వైట్‌హౌస్ సంప్రదాయాలను ట్రంప్ కాలరాస్తున్నారు. ప్రెస్ బ్రీఫింగ్ గదిలో నిత్యం జరిగేలా ఆన్-కెమెరా సమావేశం కాకుండా ఆఫ్-కెమెరా కెమెరా సమావేశం నిర్వహించారు. దీన్నిబట్టి చూస్తే మీడియాపై తన అధికారాలను మరింత విస్తృతం చేస్తూ అధ్యక్షుడు ట్రంప్ తన ఇష్ట రీతిన వ్యవహిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జాతి విద్వేషంతో శ్వేతజాతి ఉన్మాది భారతీయ ఇంజినీర్ శ్రీనివాస్ కుచిభోట్లను కాల్చి హత్య చేయడంపై అమెరికాలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణం చేసినప్పటి నుంచి దేశంలో విద్వేష నేరాలు, జాతి వివక్ష దాడులు పెరిగిపోయాయని ఇక్కడ నివాసం ఉంటున్న విదేశీయులు ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలోనూ మీడియా తనపై కావాలనే ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తుందని ట్రంప్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఓ సందర్భంలోనైతే ఏకంగా ఓ మీడియా ప్రతినిధిపై ట్రంప్ ఆదేశాలతో ఓ అధికారి దాడికి పాల్పడి చెయ్యి చేసుకోవడం వివాదానికి దారి తీసింది. తాజాగా భారతీయ ఇంజినీర్ శ్రీనివాస్ కుచిభోట్లను దారుణంగా కాల్చిచంపిన ఘటనపై ట్రంప్ పరోక్షంగా వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శల పాలయ్యారు. తాను కేవలం అమెరికాకే ప్రతినిధినని.. అమెరికా ప్రజలకు రక్షణ కల్పించడం, వారికి మాత్రమే ఉద్యోగాలు వచ్చేలా చేయడం తన పని అంటూ కన్సర్వేటీవ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ (సీపీఏసీ)లో పాల్గొన్న సందర్భంగా విదేశీ వలసదారులపై ట్రంప్ ఈ విద్వేష పూరిత వ్యాఖ్యలుచేశారు. -
తెలుగువారిపై కాల్పులు: స్పందించిన సత్య నాదెళ్ల
వాషింగ్టన్: తెలుగు ఇంజినీర్ శ్రీనివాస్ కూచిభొట్ల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న కాన్సాస్ కాల్పులపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల స్పందించారు. మన సమాజంలో ఇలాంటి మతిలేని హింసకు, మతవిద్వేషానికి తావులేదని పేర్కొన్నారు. ఈ ఘటనలో బాధితులైన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి అండగా ఉంటానని ట్విట్టర్లో తెలిపారు. తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారన్న ఆక్రోశంతో ఓ శ్వేతజాతి ఉన్మాది జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో శ్రీనివాస్ స్నేహితుడు అలోక్‌రెడ్డి తీవ్ర గాయాలపాలయ్యారు. ఉన్మాదిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో అమెరికన్‌కూ గాయాలయ్యాయి. అమెరికాలోని కన్సాస్ రాష్ట్రం ఒథాలే ప్రాంతంలో ఉన్న ఆస్టిన్స్ బార్లో బుధవారం అర్ధరాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనను ఇప్పటికే భారత సంతతికి చెందిన అమెరికన్ చట్టసభ సభ్యులు ఖండించారు. -
ఇండియన్ అమెరికన్ ఎంపీల తీవ్ర స్పందన
వాషింగ్టన్: జాతి విద్వేషంతో శ్వేతజాతి ఉన్మాది భారతీయ ఇంజినీర్ శ్రీనివాస్ కుచిభోట్ల (32)ను దారుణంగా కాల్చిచంపిన ఘటనపై ఇండియన్ అమెరికన్ ప్రజాప్రతినిధులు తీవ్రంగా స్పందించారు. శ్రీనివాస్ కుచిభోట్ల హత్యను తీవ్రంగా ఖండించారు. దేశంలో మతిలేని హింసకు తావులేదని తేల్చిచెప్పారు. 'కాన్సాస్‌లో జరిగిన కాల్పుల ఘటన తీవ్రంగా బాధ కలిగించింది. బాధితుల కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. విద్వేషం విజయం సాధించకుండా చూడాల్సిన అవసరముంది' అని భారత సంతతికి చెందిన కాలిఫోర్నియా సెనేటర్ కమల్ హారిస్ ట్వీట్ చేశారు. 'కాన్సాస్ కాల్పులతో ఛిన్నాభిన్నమైన కుటుంబం గురించే నేను మథనపడుతున్నా. మతిలేని హింసకు మన దేశంలో తావులేదు. జరిగిన ఘోరంతో నా గుండె పగిలింది' అని కాంగ్రెస్‌వుమెన్ పరిమళ జయపాల్ వ్యాఖ్యానించారు. అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి భారతీయురాలిగా పరిమళ జయపాల్ నిలిచిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నాటి నుంచి దేశంలో విద్వేష నేరాలు పెరిగిపోయాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కాన్సాస్ నగరంలో జరిగిన కాల్పులను ఇండియన్ అమెరికన్ చట్టసభ సభ్యుడు రో ఖన్నా ఖండించారు. ఈ మతిలేని హింసలో బాధితులైన కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారన్న ఆక్రోశంతో ఓ శ్వేతజాతి ఉన్మాది జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో శ్రీనివాస్ స్నేహితుడు అలోక్‌రెడ్డి తీవ్ర గాయాలపాలయ్యారు. ఉన్మాదిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో అమెరికన్‌కూ గాయాలయ్యాయి. అమెరికాలోని కన్సాస్ రాష్ట్రం ఒథాలే ప్రాంతంలో ఉన్న ఆస్టిన్స్ బార్లో బుధవారం అర్ధరాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది -
మనం అమెరికాకు చెందిన వాళ్లమేనా?
-
మనం అమెరికాకు చెందిన వాళ్లమేనా?
మనది అమెరికానేనా.. మనం అమెరికాకు చెందిన వాళ్లమా? ఇక్కడ మనకు భద్రత ఉందా?.. ఇవి కన్సాస్‌లో శ్వేతజాతి ఉన్మాది చేతిలో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాస్ కూచిభోట్ల భార్య సునయన దుమల అడిగిన ప్రశ్నలు. అమెరికాలో చోటుచేసుకున్న విద్వేష కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాస్ కూచిభోట్ల ఉద్యోగం చేసే గార్మిన్ కంపెనీ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన భార్య సునయన మాట్లాడారు. అమెరికాలో జరుగుతున్న కాల్పుల ఘటనలు తనను ఆందోళనకు గురిచేశాని, ఒకదశలో ఈ దేశంలో మనం ఉండగలమా? అని తన భర్తని అడిగితే.. ఏం కాదు అమెరికాలో మంచి రోజులు వస్తాయని ఆయన చెప్పేవారని ఆమె గుర్తుచేసుకున్నారు. అమెరికాలో మైనారిటీలు, విదేశీయులపట్ల వివక్ష చూపుతున్న ఘటనలు భయాందోళనకు గురిచేస్తున్నాయని, మేం ఇక్కడి వాళ్లమేనా? అన్న సందేహాలు కలిగిస్తున్నాయని ఆమె అన్నారు. ఇప్పటికైనా ఈ విద్వేష నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? అని ఆమె ప్రశ్నించారు. విద్వేష దారుణాలపై అమెరికా ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తన భర్తకు ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియాకు వెళ్లిపోదామని తాను గతంలో ఎన్నోసార్లు చెప్పినా తన భర్త ఒప్పుకోలేదని ఆమె అన్నారు. ఇంత జరిగాక, ఇంకా అమెరికాలో ఉండటం అవసరమా? అని ఆమె వ్యాఖ్యానించారు. తమకు పిల్లలు కూడా లేరని, తన భర్త జ్ఞాపకాలే ఇప్పుడు తమకు మిగిలాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు మృతుడు శ్రీనివాస్ కుటుంబానికి ఆదుకునేందుకు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం రంగంలోకి దిగింది. హుస్టన్‌లోని భారత కౌన్సెల్ జనరల్ అనుపమ రాయ్ ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షిస్తూ.. శ్రీనివాస్ కుటుంబానికి అన్ని విధాల సాయం చేసేందుకు కృషి చేస్తున్నారు. తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారన్న ఆక్రోశంతో ఓ శ్వేతజాతి ఉన్మాది జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో శ్రీనివాస్ స్నేహితుడు అలోక్‌రెడ్డి తీవ్ర గాయాలపాలయ్యారు. ఉన్మాదిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో అమెరికన్‌కూ గాయాలయ్యాయి. అమెరికాలోని కన్సాస్ రాష్ట్రం ఒథాలే ప్రాంతంలో ఉన్న ఆస్టిన్స్ బార్లో బుధవారం అర్ధరాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది\ -
డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
వాషింగ్టన్: అమెరికాలో విద్వేషపూరితంగా విదేశీయులపై తూటాలు పేలుతున్నా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీరు ఏ మాత్రం మారలేదు. తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారన్న ఆవేశంతో యూఎస్ నేవీ మాజీ ఉద్యోగి జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన ఇంజినీర్ మరణించిన మరుసటిరోజు ట్రంప్ మరింత దురుసుగా ప్రవర్తించారు. కన్సర్వేటీవ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ (సీపీఏసీ)లో పాల్గొన్న ట్రంప్ ప్రసంగిస్తూ.. తానేమీ ప్రపంచానికి ప్రతినిధిని కాదని, కేవలం అమెరికాకు మాత్రమే అధ్యక్షుడిని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గన్ ఓనర్షిప్ రైట్స్ కోసం చర్యలు తీసుకుంటానని, అమెరికా పౌరుల రక్షణ కోసం పాటు పడతానని, అమెరికన్లకే ఉద్యోగాలు కల్పిస్తామని ఈ సందర్భంగా ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. అయితే ట్రంప్ గానీ, వైట్ హౌస్ గానీ కన్సాస్ కాల్పుల ఘటనపై ఎలాంటి ప్రకటన చేయలేదు. 'ప్రపంచమంతటా అన్ని దేశాలకూ కలిసి ఒకే గీతం ఉందా.. అదే విధంగా ఒకే రకమైన కరెన్సీ ఉందా.. ఒకే జెండా లాంటివి ఉన్నాయా' అని ట్రంప్ ప్రశ్నించారు. చికాగోలోని పలు ప్రాంతాల్లో తుపాకీ కాల్పుల్లో ఏడుగురు మృతిచెందడంపై ట్రంప్ ట్విట్టర్లో స్పందించారు. వారి మృతిపట్ల సంతాపం ప్రకటించారు. 'అసలు చికాగోలో ఏం జరుగుతుంది. పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. చికాగోకు ఇప్పుడు సహాయం అవసరం' అని ట్రంప్ తన ట్వీట్లో రాసుకొచ్చారు. అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన ట్రంప్.. ఇతర దేశస్తులను అమెరికా నుంచి వెల్లగొట్టేందకు సాధ్యమైనంత వరకు చర్యలు తీసుకుంటూ విదేశీయులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ట్రావెల్ బ్యాన్, వీసా రూల్స్, జాబ్ రూల్స్ అంటూ ఏదో రకంగా విదేశీయులను వారి స్వస్తలాలకు పంపించేసి.. దేశ పౌరులతోనే అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశీయులపై ఎలాంటి దాడులు జరిగినా పట్టించుకునే ప్రసక్తే లేదని, కేవలం అమెరికా ప్రజల కోరకు మాత్రమే తాను పని చేయనున్నట్లు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై స్థానికంగానూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత వార్తా కథనాలకై చదవండి.. (జాతి వివక్షకు 'అధికారం' తోడైతే..) (‘కూచిబొట్ల’కు కొండంత అండ) శ్రీనివాస్ మృతిపట్ల యూఎస్ కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతి అమెరికాలో జాతి విద్వేష కాల్పులు శ్రీనివాస్ కుటుంబానికి ఎన్ఆర్ఐల బాసట -
అమెరికాలో మళ్లీ విద్వేషపు తూటా పేలింది
-
జాతి వివక్షకు 'అధికారం' తోడైతే..
- ట్రంప్ వచ్చాక అమెరికాలో పెరిగిపోతున్న జాతి వివక్ష దాడులు - ఇప్పటిదాకా ఏకంగా 1,094 ఘటనలు - అత్యధికం యూనివర్సిటీ క్యాంపస్‌లలోనే.. - భారతీయ విద్యార్థులకు కరువవుతున్న భద్రత ‘మా దేశం నుంచి వెళ్లిపొండి...’ తెలుగు ఇంజనీర్ కూచిబొట్ల శ్రీనివాస్‌ను కాల్చి చంపుతూ దుండగుడు అడమ్ పూరింటన్ గట్టిగా అరుస్తూ అన్న మాటలివి! వీటిలో అతడి నరనరాన జీర్ణించుకుపోయిన జాతి వివక్ష ధ్వనిస్తోంది. ‘అమెరికా మాది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి మా ఉద్యోగాలను కొల్లగొడుతున్నారు. మా పొట్ట కొడుతున్నారు. విదేశీయులకు ఇక్కడ స్థానం లేదు. వెళ్లిపోవాల్సిందే...’ అన్నది ఇలాంటి వారి ఆక్రోశం. శ్వేత జాత్యహంకార భావజాలం. అయితే ఇది ఏ కొద్దిమందికో పరిమితమైంది కాదు. శ్వేత జాతీయుల్లో అంతర్లీనంగా విస్తరించి.. బలపడుతోంది. అందుకే ‘ఫస్ట్ అమెరికా...’ అన్న డొనాల్డ్ ట్రంప్ వీరికి నచ్చాడు. విద్వేషపూరిత భావజాలమున్న వారిని ట్రంప్ తన బృందంలో చేర్చుకోవడంతో.. అధికారంపై ఈ అతివాదుల పట్టు బిగుస్తోంది. భవిష్యత్తులో ద్వేషపూరిత దాడులు మరింత తీవ్రమవుతాయేమోననే భయాన్ని రేకెత్తిస్తోంది. ఈ భయం సహేతుకమే అని చెప్పడానికి తగిన ఆధారాలూ ఉన్నాయి. ట్రంప్ వచ్చాక ఇదీ పరిస్థితి.. ట్రంప్ గెలుపు ఖాయమైన రోజు(నవంబర్ 9) నుంచి తీసుకుంటే.. మొత్తం 1,094 ద్వేషపూరిత ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇందులో దూషణలు మొదలుకుని దాడులు చేయడం, కాల్పులకు తెగబడటం దాకా అన్నిరకాల విద్వేషపూరిత ఘటన లున్నాయి. మత, జాతి వివక్ష, వలస జీవులపై వ్యతిరేకత, స్వలింగసంపర్కులపై ఏహ్యభావం, మహిళల పట్ల చులకన భావం వంటివి ఎన్నో రకాల ద్వేషపూరిత దాడులున్నాయి. సదరన్ పావర్టీ లా సెంటర్ ఇలాంటి ఘటనలను నమోదు చేస్తుంది. ఇందులో వలసలపై వ్యతిరేకతతో జరిగిన ఘటనలే 315. తర్వాతి స్థానం జాతి వివక్షది. నల్ల జాతీయులపై దాడులు, దూషణలకు దిగిన ఘటనలు 221. న్యూయార్క్ పోలీసు విభాగానికి చెందిన డిటెక్టివ్స్ చీఫ్ రాబర్ట్ బోయెస్ కూడా ద్వేషపూరిత దాడులు 115% పెరిగాయని(ట్రంప్ గెలిచాక) అంగీకరించారు. అంతకుముందు అమెరికావ్యాప్తంగా తీసుకున్నా ఇలాంటి ఘటనలు రెండంకెలకు మించలేదు. ట్రంప్ గెలిచిన రోజున ఏకంగా 200 పైగా ఘటనలు నమోదయ్యాయి. ద్వేషపూరిత దాడుల్లో చాలావాటిలో దుండగులు ట్రంప్ పేరును వాడటం.. ‘మా వాడొచ్చాడు, మీకిక మూడినట్లే..’ అని అనడం శ్వేతజాత్యహంకారుల్లో బలపడిన నమ్మకాన్ని రుజువు చేస్తోందని విశ్లేషకుల అభిప్రాయం. శ్వేతసౌధంలో అతివాదులు... ట్రంప్ ఎన్నిక... రాజకీయాల్లో అతివాదులకు మార్గం సుగమం చేసింది. స్వలింగ సంపర్కాన్ని గట్టిగా వ్యతిరేకించే కెన్నెత్ బ్లాక్వెల్ను అధికార మార్పిడి బృందానికి సారథిగా ట్రంప్ నియమించారు. ఇస్లాంను ‘భయంకరమైన క్యాన్సర్’గా పోల్చిన, ముస్లింలను చూసి భయపడటం సహేతుకమేనన్న మైక్ ఫ్లిన్‌ను జాతీయ భద్రతా సలహాదారుగా నియమించారు (ఈయన కొద్దిరోజులకే వివాదంలో ఇరుక్కొన్ని పదవిని పోగొట్టుకున్నారు). ముస్లింలను తీవ్రంగా వ్యతిరేకించే సంస్థలతో సన్నిహిత సంబంధాలున్న మైక్ పాంపియోను సీఐఏ డైరెక్టర్‌గా ట్రంప్ ఎంచుకున్నారు. వీటన్నింటి కంటే ముఖ్యమైనది... చీఫ్ స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా స్టీఫెన్ బానన్‌ను నియమించడం. అందరికంటే శ్వేతజాతి గొప్పదని, అమెరికా వాళ్లకే చెందినదనే భావజాలాన్ని ప్రచారం చేసే ‘బ్రీయిట్బార్ట్’ వెబ్‌సైట్‌కు బానన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా పనిచేశారు. తీవ్ర జాత్యహంకార భావజాలమున్న వ్యక్తి. తాను అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ద్వేషపూరిత దాడులు పెరిగాయనే వార్తలు రావడంతో ‘వాటిని ఆపండి’ అంటూ ట్రంప్ ఖండించారు. అయితే అధ్యక్షుడికి కనులు, చెవులుగా స్టీఫెన్ బానన్ లాంటి వ్యక్తి శ్వేతసౌధంలో ఉండగా... ఈ శక్తులు తగ్గుతాయా అనేదే ప్రశ్న. ఆజ్యం పోస్తున్న ట్రంప్ మాటలు...చేతలు నేషనల్ పాలసీ ఇనిస్టిట్యూట్ అనే సంస్థ ద్వారా శ్వేత జాత్యహంకార భావజాలాన్ని రిచర్డ్ స్పెన్సర్ లాంటి అతివాదులు ప్రచారం చేస్తున్నప్పటికీ... వీరికి ట్రంప్ రూపంలో పెద్ద అండ కనబడింది. కాబట్టే ఈ భావజాలంతో ఉన్న గ్రూపులు, సంస్థలు ట్రంప్ విజయానికి శాయశక్తులా దోహదపడ్డాయి. ‘ఐడెంటిటీ ఎవ్రోపా’ అనే కాలిఫోర్నియా కేంద్రంగా ఉన్న క్యాంపస్ గ్రూపు, ది రైట్ స్టఫ్, అమెరికన్ వాన్గార్డ్ అనే సంస్థలు ఇంటర్నెట్ కార్యక్షేత్రంగా ట్రంప్‌కు అనుకూలంగా విస్తృత ప్రచారం చేశాయి. ద్వేషపూరిత భావజాలాన్ని వ్యాప్తి చేసే సైట్లలో నంబర్ వన్‌గా ఉన్న ‘డైలీ స్ట్రోమర్’ ట్రంప్‌ను మోసింది. ‘అమెరికాను మళ్లీ గొప్పదేశంగా నిలబెడదాం’ అనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన ట్రంప్ ప్రచారపర్వం ఆద్యంతం వ్యతిరేక భావజాలాన్నే రెచ్చగొట్టారు. మెక్సికన్లను రేపిస్టులు, డ్రగ్ డీలర్లుగా అభివర్ణిస్తూ... వలసలను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో గోడ కడతానని వాగ్దానం చేశారు. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే అన్నారు. ముస్లింలు అమెరికాలోకి అడుగుపెట్టకుండా అడ్డుకుంటామన్నారు. అన్నట్లుగానే ఏడు ముస్లిం ఆధిక్య దేశాల నుంచి వచ్చేవారిని అమెరికాలోకి రానీయకుండా నిషేధాజ్ఞలు జారీచేశారు. కోర్టులు దీన్ని కొట్టివేసినా.. దానిపై ముందుకే వెళుతున్నారు. హెచ్1–బీ వీసాలపై ఆంక్షలు పెట్టడం ద్వారా వలసలను అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న వారిని స్వదేశానికి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. వీటన్నింటిని కారణంగా... జాత్యహంకార భావజాలమున్న వ్యక్తులు, సంస్థలు ట్రంప్ రూపంలో తమకో అండ ఉందనే భరోసాతో రెచ్చిపోతున్నారు. ఆర్థిక అసమానతలు కూడా అమెరికన్లలో అసంతృప్తిని పెంచి అతివాదం వైపు మొగ్గేలా చేస్తున్నాయి. క్యాంపస్‌లలో భద్రత ఏది? ఈ ఘటనల్లో ఏకంగా 74% యూనివర్సిటీ క్యాంపస్‌లలోనే చోటుచేసుకున్నాయని ఎస్‌పీఎల్‌సీ సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. అమెరికన్ వర్సిటీల్లో దాదాపు లక్షా 65 వేల మంది భారతీయులు చదువుతున్నారు. వీరిలో తెలుగు విద్యార్థులు గణనీయంగా ఉంటారు. ఇది మనకు ఆందోళన కలిగించే విషయం. భారత విద్యార్థుల భద్రతపై భయాలను పెంచుతోంది. పెరుగుతున్న వలసలు... విదేశాల్లో జన్మించిన అమెరికా పౌరులు 1970లో ఆ దేశ జనాభాలో 4.7 శాతం ఉండగా... 2015లో ఇది ఏకంగా 13.7 శాతం. వలసలు పెరిగిన తీరుకు ఇది అద్దం పడుతుంది. అలాగే అమెరికా జనాభాలో శ్వేత జాతీయుల (మెక్సికో, లాటిన్ అమెరికా మూలాలున్న వారు కాకుండా) శాతం 1960ల దాకా 90 ఉండేది. ఇప్పుడిది 62 శాతానికి పడిపోయింది. 2043 కల్లా ఇది జనాభాలో వీరి శాతం 50 లోపునకు పడిపోతుందని సెన్సెస్ బ్యూరో అంచనా. పెరుగుతున్న గ్రూపులు ద్వేషపూరిత భావజాలాన్ని ప్రచారం చేసే సంస్థలు, గ్రూపులు 1999లో 457 ఉండగా 2016 కల్లా ఇవి రెట్టింపయ్యాయి. 917 గ్రూపులు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. ఉగ్రదాడులు, ముస్లింలు కాల్పులకు తెగబడి పదుల సంఖ్యలో జనాలను చంపడం లాంటి ఘటనలతో ముస్లిం వ్యతిరేకతను ప్రచారం చేసే గ్రూపులు ఒక్క ఏడాదిలోనే అనూహ్యంగా పెరిగిపోయాయి. 2015లో 34 ముస్లిం వ్యతిరేక గ్రూపులుంటే 2016 కల్లా వీటి సంఖ్య 101కి చేరింది. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
విద్వేషపు తూటా!
- అమెరికాలో కాల్పుల ఉదంతం.. జాతి వివక్ష కోణంలో ఎఫ్‌బీఐ దర్యాప్తు - మృతుడు శ్రీనివాస్, గాయపడ్డ అలోక్‌రెడ్డి ఇద్దరూ హైదరాబాదీలే - తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారంటూ అమెరికన్ ఘాతుకం - వారిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో అమెరికన్‌కూ గాయాలు - కాల్పులు జరిపిన పూరింటన్ అరెస్ట్.. నేవీ మాజీ ఉద్యోగిగా గుర్తింపు - విషాదంలో మునిగిపోయిన శ్రీనివాస్ కుటుంబం - ఘటనపై కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ దిగ్భ్రాంతి.. ‘మా ఉద్యోగాలు మాకే..’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో ఇచ్చిన నినాదం వెర్రితలలు వేస్తోందా? గద్దెనెక్కాక ఆయన తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు అమెరికాలో జాత్యహంకార భావజాలానికి మరింత ఊతమిస్తున్నాయా? కన్సాస్‌లో ఇద్దరు తెలుగు ఇంజనీర్లపై జరిగిన కాల్పుల ఘటన చూస్తుంటే ఇది నిజమేనని అన్పిస్తోంది! బార్లోకి వచ్చిన అమెరికన్.. జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తూ ఇంజనీర్లపై కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో అమెరికాలో ఉంటున్న భారతీయులు ముఖ్యంగా తెలుగువారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. హ్యూస్టన్/వాషింగ్టన్/హన్మకొండ/ సాక్షి, హైదరాబాద్: అమెరికాలో మళ్లీ విద్వేషపు తూటా పేలింది. తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారన్న ఆక్రోశంతో ఆడమ్ పూరింటన్ అనే ఓ శ్వేతజాతి ఉన్మాది కాల్పులకు తెగబడ్డాడు. హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ కూచిభొట్ల అనే ఇంజనీర్‌ను పొట్టన పెట్టుకున్నాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ స్నేహితుడు అలోక్‌రెడ్డి తీవ్ర గాయాలపాలయ్యారు. ఉన్మాదిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో అమెరికన్‌కూ గాయాలయ్యాయి. అమెరికాలోని కన్సాస్ రాష్ట్రం ఒథాలే ప్రాంతంలో ఉన్న ఆస్టిన్స్ బార్లో బుధవారం అర్ధరాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. కాల్పులు జరిపిన పూరింటన్ అమెరికా నేవీ మాజీ ఉద్యోగి అని గుర్తించారు. ఘటన జరిగిన 5 గంటల్లోనే మిస్సోరి ప్రాంతంలోని ఓ బార్లో అతడిని అరెస్టు చేశారు. మీరు నాకంటే ఎక్కువా..? హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్, మేడసాని అలోక్‌రెడ్డి అమెరికాలోని కన్సాస్ రాష్ట్రంలో ఉన్న ఓవర్‌ల్యాండ్ పార్క్‌లో నివసిస్తున్నారు. జీపీఎస్ వ్యవస్థలను తయారు చేసే గార్నిమ్ అనే సంస్థలో ఉద్యోగం నిర్వస్తున్నారు. ఇద్దరూ మంచి స్నేహితులు కూడా. ఇద్దరూ కలసి బుధవారం రాత్రి అక్కడి ఒథాలే ప్రాంతంలోని ఆస్టిన్స్ బార్‌కు వెళ్లారు. కొంతసేపటి తర్వాత çపూరింటన్ అనే అమెరికన్ వారి వద్దకు వచ్చి వాదనకు దిగాడు. తాము (అమెరికన్లు) మేధావులమేనని, తమకు ప్రతిభ ఉన్నా విదేశాల వారి కారణంగా తమకు ఉద్యోగాలు రావట్లేదని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘మీరు మా ఉద్యోగాలను కాజేస్తున్నారు. తక్షణం అమెరికా విడిచివెళ్లిపోండి. ఉగ్రవాదులు.. మీరు నాకంటే ఎలా ఎక్కువ? అమెరికాలో ఎందుకుంటున్నారు, ఏం చేస్తున్నారు..’అంటూ గొడవకు దిగాడు. దీంతో శ్రీనివాస్, అలోక్‌రెడ్డిలు బార్ మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. అక్కడికి వచ్చిన బార్ మేనేజర్, సిబ్బంది పూరింటన్‌ను బయటికి పంపేశారు. కొద్దిసేపటికే తిరిగొచ్చి.. బార్ నుంచి బయటికి వెళ్లగొట్టినా.. పూరింటన్ కొద్దిసేపటికి తుపాకీతో తిరిగి వచ్చాడు. ‘మా దేశం విడిచి వెళ్లిపోండి.. ఉగ్రవాదులారా..’ అని అరుస్తూ శ్రీనివాస్, అలోక్‌రెడ్డిలపై కాల్పులు జరిపాడు. శ్రీనివాస్ ఛాతీలో బుల్లెట్ దిగడంతో అక్కడే కుప్ప కూలిపోయారు. అలోక్‌కి తొడ భాగంలో తూటా దూసుకుపోయింది. ఈ సమయంలో అక్కడే ఉన్న ఇయాన్ గ్రిలట్ అనే మరో అమెరికన్.. పూరింటన్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. దాంతో అతడి చేతిపై బుల్లెట్ గాయమైంది. వారందరినీ వెంటనే ఆస్పత్రికి తరలించగా.. శ్రీనివాస్ అప్పటికే మరణించారు. అలోక్‌రెడ్డి, ఇయాన్ గ్రిలట్‌లు చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారంలోకి వచ్చాక జాతి, మత విద్వేష నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన ఈ కాల్పుల ఘటన భారతీయ అమెరికన్లలో భయాందోళన నింపుతోంది. కాగా.. తమ ఏవియేషన్ ఇంజనీరింగ్ టీమ్‌లో పనిచేస్తున్న శ్రీనివాస్ కాల్పుల్లో మృతిచెందడం, అలోక్ గాయపడ్డం తమను కలచివేసిందని గార్మిన్ కంపెనీ తెలిపింది. 1.చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న అలోక్‌రెడ్డి 2.కుమారుడి మరణవార్త తెలిసి విలపిస్తున్న శ్రీనివాస్ తల్లిదండ్రులు 3.శ్రీనివాస్, అలోక్రెడ్డిపై కాల్పులు జరిగింది ఈ బార్లోనే.. శ్రీనివాస్ కుటుంబానికి వెల్లువలా సాయం.. శ్రీనివాస్ కూచిభొట్ల కుటుంబాన్ని ఆదుకోవడానికి, ఆయన మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు సహాయం చేసేందుకు చాలా మంది ముందుకొచ్చారు. ఆయన స్నేహితురాలు కవిప్రియ మథురమాలింగం సోషల్ మీడియాలో ఏర్పాటు చేసిన ‘గోఫండ్‌మి’పేజీ ద్వారా పలువురు అమెరికన్లు సహా దాదాపు 7,200 మంది 2,61,996 డాలర్ల (సుమారు రూ.కోటి 80 లక్షలు) సాయం అందించారు. శ్రీనివాస్ స్నేహశీలి అని, ఎవరినీ పల్లెత్తుమాట అనేవాడు కాదని అమెరికాలో ఆయన ఇంటి పొరుగువారు చెప్పారు. 1. ప్రణీత్ నేచర్స్ బౌంటీలోని శ్రీనివాస్ నివాసం 2. ఆర్కేపురంలోని అలోక్‌రెడ్డి నివాసం పదేళ్ల కింద అమెరికా వెళ్లి.. అమెరికాలో మరణించిన శ్రీనివాస్ తండ్రి కూచిభొట్ల మధుసూదనరావు ఐడీపీఎల్ విశ్రాంత ఉద్యోగి. వారు ఐదేళ్లుగా హైదరాబాద్ శివార్లలోని బాచుపల్లి మల్లంపేట గ్రామ పరిధిలో ఉన్న ప్రణీత్ నేచర్స్ బౌంటీ ఫేజ్–1లో నివసిస్తున్నారు. వారికి శ్రీనివాస్ తోపాటు పరశురామశాస్త్రి, సాయి కిశోర్ సంతానం. పరశు రామశాస్త్రి హైదరాబాద్‌లోనే స్థిరపడగా.. శ్రీనివాస్, సాయి కిశోర్ అమెరికాలో ఉంటున్నారు. శ్రీనివాస్ హైదరాబాద్ శివార్లలోని విద్యా జ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజనీ రింగ్ చదివారు. పదేళ్ల క్రితం అమెరికా వెళ్లి మాస్టర్స్ పూర్తి చేశారు. తొలుత అమెరికాలోని రాక్వెల్ కొలిన్స్ సంస్థలో సిస్టమ్స్ ఇంజనీర్‌గా పనిచేసి.. అనంతరం గార్నిమ్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేరారు. శ్రీనివాస్‌కు నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌కే చెందిన సునయనతో వివాహం జరిగింది. వారికి ఇంకా సంతానం లేదు. శ్రీనివాస్ మరణవార్త విని వారి కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయింది. స్నేహితుడితో కలసి.. అమెరికన్ కాల్పుల్లో గాయపడిన అలోక్ కుటుంబం హైదరాబాద్‌లోని చైతన్యపురి పరిధిలో ఉన్న ఆర్కే పురంలో నివసిస్తోంది. ఆయన తండ్రి మేడసాని జగన్మోహన్రెడ్డి, తల్లి రేణుక. వీరి స్వస్థలం వరంగల్ జిల్లా హన్మకొండలోని అడ్వొకేట్స్ కాలనీ. పదేళ్లుగా వారి కుటుంబం హైదరాబాద్‌లో నివాసం ఉంటోం ది. మిషన్ భగీరథ ప్రాజెక్టులో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న జగన్మోహన్రెడ్డికి ఇద్దరు కుమారులు అలోక్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి. అలోక్‌రెడ్డి హైదరాబాద్ లోని వాసవి కాలేజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూని కేషన్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 2006లో అమెరికా వెళ్లి మాస్టర్స్ డిగ్రీ చేశారు. శ్రీనివాస్‌తో కలసి రాక్వెల్ కొలిన్స్ సంస్థలో పనిచేసిన ఆయన.. తర్వాత శ్రీనివాస్ మాదిరిగానే గార్నిమ్ సంస్థలో చేరారు. ప్రస్తుతం కో–ఆర్డినేటర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అలోక్రెడ్డికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్య దీప్తి అమెరికాలోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఆమె ప్రస్తుతం గర్భవతి. ఐదు గంటల్లోనే దుండగుడు అరెస్ట్.. ఎఫ్‌బీఐ దర్యాప్తు శ్రీనివాస్ కూచిభొట్ల, అలోక్‌రెడ్డిలపై కాల్పులు జరిపిన జాత్యహంకారి పూరింటన్ (51)ను అమెరికా పోలీసులు గురువారం ఉదయం అరెస్టు చేశారు. పూరింటన్‌పై హత్య (ఫస్ట్ డిగ్రీ మర్డర్), హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. కాల్పుల ఘటన జరిగిన తర్వాత ఐదు గంటల్లోనే దుండగుడిని పట్టుకోవడం గమనార్హం. కాల్పుల ఘటన తర్వాత మిస్సోరీలోని క్లింటన్లో ఉన్న ఓ బార్లో దాక్కున్న పూరింటన్ తాను తూర్పుఆసియా వాసులిద్దరిని చంపానని అక్కడి ఉద్యోగితో చెప్పాడని అమెరికన్ స్థానిక మీడియా పేర్కొంది. కాల్పుల ఘటనపై అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) కూడా దర్యాప్తు చేపట్టింది. ఈ ఘటన వెనుక జాతి వివక్ష కోణం ఉందా, లేదా అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నామని కన్సాస్ నగరంలోని ఎఫ్‌బీఐ ప్రతినిధి ఎరిక్ జాక్స్ వెల్లడించారు. ఈ దుర్ఘటన జరిగిన బార్‌ను నిరవధికంగా మూసివేశారు. దుండగుడు అమెరికన్ నేవీ మాజీ ఉద్యోగి! కాల్పులు జరిపిన పూరింటన్ అమెరికా నావికాదళం మాజీ ఉద్యోగి అని స్థానిక మీడియా వెల్లడించింది. అతడి వద్ద పైలట్ లైసెన్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సర్టిఫికెట్లు కూడా ఉన్నాయని తెలిపింది. అతను ఒథాలేలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌గా పనిచేశాడని, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్‌లోనూ పనిచేసి 2010లో బయటికొచ్చాడని పేర్కొంది. మానవత్వమున్న మనిషిని.. దుండగుడిని అడ్డుకున్న అమెరికన్‌పై ప్రశంసలు కాల్పులు జరిపిన పూరింటన్‌ను ప్రాణాలకు తెగించి అడ్డుకున్న 24 ఏళ్ల అమెరికన్ యువకుడు ఇయాన్ గ్రిలట్‌కు ప్రశంసలు లభిస్తున్నా యి. ఒక అమెరికన్ జాతి విద్వేషంతో కాల్పులు జరపగా.. మరో అమెరికన్ మానవత్వంతో అడ్డుకోవడాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. పూరింటన్ కాల్పులు మొదలుపెట్టడంతో టేబుల్ వెనక దాక్కున్న గ్రిలట్.. ఒక్కసారిగా విసురుగా వెళ్లి అతడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దుండగుడు అతడిపైనా కాల్పులు జరపడంతో.. గ్రిలట్ చేతి గుండా ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఆస్పత్రిలో గ్రిలట్‌ను యూనివర్సిటీ ఆఫ్ కన్సాస్ హెల్త్ సిస్టమ్ ఇంటర్వూ్య చేసింది. అందు లో.. ‘సాటి మనిషి కోసం నేనేం చేయాలో అదే చేశాను. అతడు (బాధితుడు) ఎక్కడి వాడు, ఏ జాతి వాడదన్నది ముఖ్యం కాదు. మనమంతా మనుషులం. దుండగుడు మరొకరి వైపు వెళ్లకుండా ఏం చేయాలో అది చేశాను’ అని గ్రిలట్ పేర్కొన్నారు. శ్రీనివాస్ కుటుంబానికి అండగా ఉంటాం: కాల్పుల ఘటనపై సుష్మ దిగ్భ్రాంతి సాక్షి, న్యూఢిల్లీ: అమెరికాలో తెలుగువారిపై జాతి విద్వేష కాల్పుల పట్ల విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడు శ్రీనివాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే అమెరికాలోని భారత రాయబారి నవతేజ్ సర్నాతో మాట్లాడానని, అక్కడి అధికారులు కన్సాస్‌కు చేరుకున్నారని ట్విటర్లో పేర్కొన్నారు. శ్రీనివాస్ భౌతిక కాయాన్ని హైదరాబాద్‌కు చేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, ఆయన కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. కన్సాస్‌లో కాల్పులను ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ఖండించింది. ఈ ఘటనపై అమెరికా దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయని రాయబార కార్యాలయ అధికారి మ్యారికే కార్లసన్∙ పేర్కొన్నారు. కాగా, అమెరికాలో జాత్యహంకార దాడుల పట్ల సీపీఐ ఆందోళన వ్యక్తం చేసింది. జాత్యహంకారం, ట్రంప్ విధానాలపై పోరాడాలని అమెరికాలోని ప్రజాస్వామ్య శక్తులకు విన్నవించింది. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని కన్సాస్‌లో దుండగుడు ఇద్దరు తెలుగు విద్యార్థులపై కాల్పులు జరపడం, ఈ ఘటనలో ఒకరు మరణించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కాల్పుల ఘటనలో శ్రీనివాస్ కూచిభొట్ల అనే విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా అలోక్ మేడసాని అనే విద్యార్థి గాయపడ్డారు. కన్సాస్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అలోక్‌కు రక్షణ కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా వైఎస్ జగన్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాలి: కృష్ణమోహన్, శ్రీనివాస్ బంధువు ‘‘ఇప్పటికే అమెరికాలో నలుగురు జాత్యహంకార దాడుల్లో చనిపోయారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాలి. శ్రీనివాస్ మృతదేహాన్ని మూడు, నాలుగు రోజుల్లో రప్పించేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ హామీ ఇచ్చారు..’’ తెలుగు ప్రజలు కలసికట్టుగా ఉండాలి: జగన్మోహన్రెడ్డి, అలోక్‌రెడ్డి తండ్రి ‘‘అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలంతా కలసికట్టుగా ఉండాలి. అమెరికా వాళ్లు పిచ్చివాళ్లలా మారిపోతున్నారు. ఏ విషయమైనా వారితో వాదించవద్దు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతోనే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. భారత యువత పునరాలోచన చేసుకుని స్వదేశానికి తిరిగి రావాలి..’’ సంబంధిత వార్తా కథనాలకై చదవండి.. (జాతి వివక్షకు 'అధికారం' తోడైతే..) (‘కూచిబొట్ల’కు కొండంత అండ) శ్రీనివాస్ మృతిపట్ల యూఎస్ కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతి అమెరికాలో జాతి విద్వేష కాల్పులు శ్రీనివాస్ కుటుంబానికి ఎన్ఆర్ఐల బాసట -
‘కూచిబొట్ల’కు కొండంత అండ
- గోఫండ్ మీ పేజీకి వెల్లువెత్తిన విరాళాలు - పరిమళించిన మానవత్వం - మృతుడి భార్యకు అందజేయనున్న రూపకర్తలు హోస్టన్/న్యూఢిల్లీ/హైదరాబాద్: అమెరికాలోని కన్సాస్ బార్లో జరిగిన కాల్పుల్లో చనిపోయిన తెలుగు వ్యక్తి కూచిబొట్ల శ్రీనివాస్ (32) కుటుంబానికి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసేందుకు వేలాది మంది మానవతావాదులు ముందుకొచ్చారు. గతంలో శ్రీనివాస్‌తో కలసి పనిచేసిన కవిప్రియ ముతురామలింగం విరాళాల కోసం గోఫండ్‌మీ పేజీని రూపొందించగా కేవలం ఆరు గంటల వ్యవధిలోనే 6,100 మంది స్పందించి 2,27,500 డాలర్లు పంపారు. లక్షా 50 వేల డాలర్ల కోసం ఈ పేజీని ఏర్పాటుచేయగా రెండు లక్షలకు పైగా వచ్చాయి.ఈ సొమ్మును మృతుడి భార్య సునయనకు అందజేయనున్నారు. మృతదేహాన్ని భారత్‌కు పంపడానికి ఆయన కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఈ డబ్బును ఉపయోగించనున్నట్లు వారు చెప్పారు. ‘శ్రీనివాస్ అత్యంత కరుణాస్వభావం కలిగిన వ్యక్తి. అందరితోనూ ఎంతో ప్రేమగా మెలిగేవాడు. ద్వేషం అనే పదమే అతనికి తెలియదు, ఎంతో తెలివైన వ్యక్తి’ అని సదరు పేజీలో పోస్టు చేశారు. అలాగే అలోక్ చికిత్స కోసం, శ్రీనివాస్ కుటుంబానికి సహాయం కోసం బ్రియాన్ ఫోర్డ్ అనే వ్యక్తి ఫండ్ పేజీని ఏర్పాటు చేయగా 32,660 డాలర్లు వచ్చాయి. ఈ ఇద్దరు యువకులను కాపాడేందుకు ఇయాన్ గ్రిల్లట్ అనే అమెరికన్ యువకుడు ప్రయత్నించి గాయపడడం తెలిసిందే. గ్రిల్లట్ వైద్యసేవలకోసం అతని బంధువులు గోఫండ్ మీ పేజీని ప్రారంభించగా దానికి 99వేల డాలర్లు వచ్చాయి. తోచిందే చేశా: గ్రిల్లట్ ఆ సమయంలో తనకు తోచిందే చేశానని ప్రాణాలకు తెగించి నిందితుడిని అడ్డుకునేందుకు యత్నించిన అమెరికావాసి ఇయాన్ గ్రిల్లట్ గురువారం మీడియాకు చెప్పాడు. ఆస్టిన్స్ బార్ అండ్ గ్రిల్‌లోకి తిరిగివచ్చిన నిందితుడు పూరింటన్ కాల్పులు జరిపేందుకు సన్నద్ధమవుతున్న సమయంలో గ్రిల్లట్ అతని వెనక కుర్చీలోనే ఉన్నాడు. పూరింటన్ కాల్పులు ప్రారంభించగానే రంగంలోకి దిగిన గ్రిల్లట్ అడ్డుకునేందుకు యత్నించగా ఓ తూటా తగలడంతో గాయపడడం తెలిసిందే. ‘పైకి లేచి వెనుకనుంచి అతనిని లొంగదీసుకునేందుకు యత్నించా. దీంతో అతను నావైపు తిరిగి కాల్పులు జరిపాడు’ అని తెలిపాడు. బాధితుడి ఏ దేశానికి లేదా ఏ జాతికి చెందినవాడనేది అనవసరమని, మనమంతా మనుషులమేనంటూ తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు. అమెరికాలో జాతి విద్వేష కాల్పులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సుష్మ కాల్పుల ఘటనలో భారతీయుడు చనిపోవడంపై విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ‘అమెరికాలోని భారతీయ రాయబారి నవ్‌తేజ్ సర్నాతో మాట్లాడానన్నారు. ‘కాన్సులేట్ కార్యాలయంలో పనిచేసే ఆర్డీ జోషి అక్కడికి చేరుకున్నారు, బాధిత కుటుంబాలకు అండదండగా నిలుస్తారు. జోషితోపాటు మరో అధికారి హర్పాల్సింగ్ కూడా చేయూతనిస్తారు. వారిరువురు స్థానిక పోలీసులతో వీళ్లిద్దరు సంప్రదింపులు జరుపుతున్నారు. అవసరమైన చర్యలు తీసుకుంటారు’ అని ఆమె ట్వీటర్లో పేర్కొన్నారు. ఖండించిన అమెరికా రాయబార కార్యాలయం కన్సాస్ జాతి విద్వేష కాల్పులను భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం ఖండించింది. ఈ ఘటనపై తమ దేశ దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయని అమెరికా ఎంబసీ అధికారి మ్యారీకే ఎల్ కార్లసన్ వెల్లడించారు. కేసుపై వేగంగా దర్యాప్తు జరుపుతుందని అన్నారు. ఈ ఘటనలో తెలుగు వ్యక్తి శ్రీనివాస్ కూచిభొట్ల ప్రాణాలు కోల్పోవడం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అలోక్‌ను పరామర్శించిన భారత అధికారులు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వెంటనే స్పందించింది. గాయపడిన మేడసాని అలోక్ ఇంటికి వెళ్లిన భారత కాన్సులేట్ జనరల్ ఆర్డీ జోషి అతడిని పరామర్శించారు. అలోక్ క్షేమంగా ఉన్నాడని, అతడికి అవసరమైన సహాయం అందిస్తామని హోస్టన్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారి అనుమప్ రే హామీయిచ్చారు. శ్రీనివాస్ మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని కన్సాస్‌లో దుండగుడు అడమ్ పూరింటన్ తెలుగు విద్యార్ధులపై కాల్పులు జరపడం పట్ల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అప్రమత్తంగా ఉండాలి అమెరికాలో నివసిస్తున్న తెలుగువారు అప్రమత్తంగా ఉండాలని మేడసాని అలోక్ తండ్రి జగన్మోహన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్‌లో శుక్రవారం సాక్షితో మాట్లాడుతూ అమెరికాలో భారతీయులపై ఇటీవల దాడులు పెరిగిపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కన్సాస్ లో దుండగుడు జరిపిన కాల్పుల నుంచి తన కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడని చెప్పారు. ఘటనాస్థలి వద్ద ఉన్న తన కుమారుడు అలోక్ అక్కడి నుంచి పరుగెత్తుకుని వెళ్లిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడని తెలిపారు.ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. బయటకు వెళ్లినప్పుడు ఎవరితోనూ వాదనలు దిగొద్దని అమెరికాలో ఉంటున్న తెలుగువారికి ఆయన సూచించారు.