భారత విద్యార్థి శరత్ హత్య కేసులో నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు మట్టుబెట్టారు. ఆదివారం కాన్సస్ సిటీ శివారులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అతన్ని కాల్చి చంపినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాన్సస్ నగర పోలీసులు ట్విటర్‌లో విషయాన్ని ధృవీకరించారు.
మిస్సోరి: ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన శరత్ కొప్పు(తెలంగాణ.. వరంగల్ చెందిన వ్యక్తి)ని.. ఈనెల 4వ తేదీన ఓ స్టోర్ లో నిందితుడు కాల్చి చంపాడు. ఘటన తర్వాత నిందితుడు పారిపోగా.. అప్పటి నుంచి పోలీసుల వేట కొనసాగుతోంది. చివరకు కాన్సస్ సిటీ శివార్లలో నిందితుడు ఉన్నాడన్న సమాచారం అందుకుని.. పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే, లొంగిపోవాలని పోలీసులు కోరటంతో.. ఆ హంతకుడు పోలీసులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులకు గాయాలు అయ్యాయి. పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించడంతో అతను మరణించాడు. (అలా చేయకపోయి ఉంటే బతికేవాడేమో!)
నిందితుడు తన వద్ద ఉన్న రైఫిల్ తో కాల్పులు జరిపాడని, దాంతో పోలీసులు ఎదురు కాల్పులకు దిగడంతో అతను మరణించాడు అని కాన్సస్ సిటీ పోలీస్ చీఫ్ రిక్ స్మిత్ వెల్లడించారు. ఈ ఎన్ కౌంటర్ లో గాయపడిన అధికారులను ఆసుపత్రికి తరలించామని, వారికి ప్రాణాపాయం తప్పిందని ఆయన తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment