missouri
-
మిస్సోరీ చాప్టర్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన నాట్స్
అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలబడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా మిస్సోరీలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. నాట్స్ జాతీయ నాయకత్వం అండదండలతో మిస్సోరీ చాప్టర్ నూతన కార్యవర్గం ముందుకు సాగనుంది. నాట్స్ సలహా మండలి సభ్యులు డాక్టర్ సుధీర్ అట్లూరి, నాట్స్ బోర్డ్ డైరక్టర్లు శ్రీనివాస్ మంచికలపూడి, రమేశ్ బెల్లం, నాట్స్ సోషల్ మీడియా నేషనల్ కో ఆర్డినేటర్ సంకీర్త్ కటకంల పర్యవేక్షణలో మిస్సోరీ నూతన కార్యవర్గం పనిచేయనుంది. మిస్సోరి చాప్టర్ కో ఆర్డినేటర్ గా సందీప్ కొల్లిపర, జాయింట్ కో ఆర్డినేటర్‌గా అన్వేష్ చాపరాల లను నాట్స్ నాయకత్వం నియమించింది. నాట్స్ మిస్సోరీ సభ్యత్వ నమోదు చైర్ తరుణ్ దివి, క్రీడా వ్యవహారాలు చైతన్య పుచ్చకాయల, కార్యక్రమాల నిర్వహణ నవీన్ కొమ్మినేని, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ హరీశ్ గోగినేని, నిధుల సేకరణ శ్రీకాంత్ కొండవీటి, వెబ్ & మీడియా చైర్ రాకేష్ రెడ్డి మరుపాటి, యువజన కార్యక్రమాలు హరి నెక్కలపు, సాంస్కృతిక అంశాలు మధుసూదన్ దద్దాల, కమ్యూనిటీ సర్వీసెస్ చైర్ యుగేందర్ చిలమకూరి, ఇమ్మిగ్రేషన్ చైర్ మురళీ బండారుపల్లి, హాస్పిటాలిటీ చైర్ నరేష్ రాయంకుల, హాస్పిటాలిటీ కో చైర్ సునీల్ సి స్వర్ణ, హెల్ప్ లైన్ చైర్ దేవి ప్రసాద్, హెల్ప్ లైన్ కో చైర్ చైతన్య అప్పని లకు బాధ్యతలు అప్పగించింది. నాట్స్ మిస్సోరీ చాప్టర్ 2.0 కు అప్పలనాయుడు గండి, శివకృష్ణ మామిళ్లపల్లి, మధు సామల, కవిత ములింటిలను సలహాదారులుగా నియమించింది. ఈ కమిటీల సభ్యులందరూ, మిస్సోరి నాట్స్ సభ్యులకు అండగా నిలవనున్నారు.నాట్స్ మిస్సోరీ నూతన కార్యవర్గానికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి అభినందనలు తెలిపారు. మిస్సోరీలో నాట్స్ ప్రతిష్టను ఇనుమడింప చేసేందుకు నాట్స్ మిస్సోరీ టీం కృషి చేయాలని వారు కోరారు.(చదవండి: గ్రేటర్ ఓర్లాండోలో నాట్స్ ప్రస్థానం) -
USA presidential election 2024: మరో మూడు ప్రైమరీలు
కొలంబియా(యూఎస్): అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యరి్థత్వం డొనాల్డ్ ట్రంప్‌కు దాదాపుగా ఖాయమైనట్టే. తాజాగా మిస్సోరీ, ఐదహో, మిషిగన్ ప్రైమరీల్లో ఆయన విజయం సాధించారు. ఆయనకు మద్దతు పలికిన డెలిగేట్ల సంఖ్య 244కు పెరిగింది. ప్రత్యర్థి నిక్కీ హేలీ కేవలం 24 డెలిగేట్ల మద్దతుతో చాలా వెనుకంజలో ఉన్నారు. రిపబ్లికన్ అభ్యర్థిత్వం దక్కాలంటే 1,215 డెలిగేట్ల మద్దతు కావాలి. మిషిగన్ రాష్ట్ర ప్రైమరీలో 68 శాతం ఓట్లు ట్రంప్‌కు, 27 శాతం ఓట్లు హేలీకి పడ్డాయి. మంగళవారం జరగబోయే 16 ప్రైమరీల ఫలితాలతో రిపబ్లికన్, డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థులు దాదాపు తేలిపోనున్నారు. మొత్తం డెలిగేట్లలో మూడింట ఒక వంతు మంది ఆ రోజున తమ పార్టీ తరఫున అభ్యర్థిగా ఎవరు ఉండాలనేది ఓటేసి నిర్ణయిస్తారు. ఇప్పటివరకు కొనసాగిన ట్రంప్ అజేయ జైత్రయాత్ర చూస్తుంటే బైడెన్‌కు పోటీగా బరిలో దిగే రిపబ్లికన్ అభ్యర్థి ట్రంపేనని దాదాపు ఖరారైనట్టు కన్పిస్తోంది. -
అమెరికాలో కాల్పులు.. ఒకరి దుర్మరణం
కాన్సాస్ సిటీ: అమెరికాలోని మిస్సౌరీ రాష్ట్రం కాన్సాస్ సిటీలో కాల్పులు చోటు చేసుకు న్నాయి.. ఈ ఘటనలో ఒకరు చనిపోగా 8 మంది చిన్నారులు సహా మరో 22 మంది గాయాలపాలయ్యారు. బుధవారం సూపర్ బౌల్ చాంపియన్ షిప్ గెలుచుకున్న జట్టు విజయోత్సవాలు జరుపుతున్న వేళ గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు దిగారు. దీంతో జనమంతా భయంతో కేకలు వేస్తూ తలోదిక్కుకు పరుగులు తీయడంతో అంతా గందరగోళంగా మారింది. కాల్పులకు కారకులుగా అనుమానిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పులకు కారణాలు తెలియాల్సి ఉంది. మరో ఘటనలో.. రాజధాని వాషింగ్టన్లో బుధవారం ఉదయం పోలీసు అధికారులు జంతు హింస కేసులో జూలియస్ జేమ్స్ అనే వ్యక్తికి వారెంట్లు ఇచ్చేందుకు అతడి ఇంటికి వెళ్లారు. నిందితుడు పారిపోయేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అతడు ఇంట్లో ఉండే పోలీసులపైకి కాల్పులకు దిగాడు. ఘటనలో ముగ్గురు అధికారులకు గాయాలయ్యాయి. కొన్ని గంటల అనంతరం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
అమెరికా స్పోర్ట్స్ పరేడ్‌లో కాల్పులు
కేన్సాస్ సిటీ: అమెరికాలో మరోమారు కాల్పుల ఘటన చోటు చేసుకుంది. మిస్సోరి రాష్ట్రం(స్టేట్) కేన్సాస్ సిటీలో స్పోర్ట్స్ పరేడ్‌పై దుండగులు తుపాకులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 22 మంది దాకా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఎక్కువగా చిన్నారులే ఉన్నారని.. వాళ్ల పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది. కేన్సాస్ సిటీ చీఫ్స్ ‘సూపర్ బౌల్’ విజేతగా నిలవడంతో.. పరేడ్ నిర్వహించారు. ఆ సమయంలోనే కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ పరేడ్‌లో వేలాది మంది పాల్గొనగా.. ఎటునుంచి కాల్పులు జరుగుతున్నాయో తెలియక అక్కడికి వచ్చిన వారు పరుగులు పెట్టారు. క్షతగాత్రులను పోలీసులు సమీప ఆసుపత్రులకు తరలించారు. కాల్పులు జరిపిన ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు కేన్సాస్ సిటీ పోలీస్ చీఫ్ స్టేసీ గ్రేవ్స్ తెలిపారు. కాల్పులకు గల కారణాలపై దర్యాప్తు దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. సూపర్ బౌల్ ఛాంపియన్షిప్ అనేది అమెరికా నేషనల్ ఫుట్‌బాల్ లీగ్‌లో భాగం. ఏటా సూపర్ బౌల్ ఛాంపియన్ షిప్ జరుగుతుంది. గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కేన్సాస్ జట్టు శాన్‌ఫ్రాన్సిస్కోపై నెగ్గింది. దీంతో ఆ జట్టు విజయోత్సవ ర్యాలీ నిర్వహించగా.. వేల మంది ఫ్యాన్స్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే కాల్పులు జరిగాయి. New video shows moment gunfire erupts at the Super Bowl rally in Kansas City. At least 22 people shot pic.twitter.com/dUYM9G07fg — BNO News (@BNONews) February 15, 2024 అమెరికాలో గన్ కల్చర్‌లో మాస్ షూటింగ్(సామూహిక కాల్పుల) ఘటనలూ తరచూ చోటుచేసుకుంటున్నాయి. కిందటి ఏడాది.. ఎన్బీఏ ఛాంపియన్షిప్ విజయం నేపథ్యంలో డెన్వర్(కొలరాడో)లో నిర్వహించిన ఫ్యాన్స్ సంబురాల్లోనూ కాల్పులు జరిగాయి. అప్పుడు పది మంది గాయపడ్డారు. అంతకు ముందు.. 2019లో టోరంటోలో జరిగిన కాల్పుల్లో నలుగురు గాయపడ్డారు. -
USA: చిన్నారిని ఓవెన్‌కు బలి చేసుకుంది...
కాన్సాస్ సిటీ: నిద్ర పుచ్చేందుకు ఉయ్యాలలో ఉంచాల్సిన శిశువును పొరపాటున ఓవెన్లో పెట్టింది ఓ తల్లి. తప్పు గ్రహించేలోగానే ఆ శిశువు తీవ్రంగా కాలిన గాయాలతో తనువు చాలించింది. ఈ విషాద ఘటన అమెరికాలోని మిస్సోరి రాష్ట్రం కాన్సాస్ సిటీలో చోటుచేసుకుంది. నగరానికి చెందిన మరియా థామస్ శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో తన శిశువును ఉయ్యాల తొట్టిలో పడుకోబెట్టి నిద్ర పుచ్చాలనుకుంది. అయితే, చిన్నారిని పొరపాటున ఓవెన్లో ఉంచి, ఆన్ చేసింది. తప్పు తెలుసుకునే సరికే చిన్నారి ఒళ్లు తీవ్రంగా కాలిపోయింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే శిశువు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
ఏమిటీ వింత..గద్ద పొదగని గుడ్డు .. అనాథ పిల్లకు తండ్రి కూడా!
మనుషులే కాదు.. ఒక్కోసారి మూగజీవాల ప్రవర్తన కూడా విపరీతమైన చర్చకు దారి తీస్తుంటుంది. మనిషికి మించిన మానవత్వం, ప్రేమను కనబర్చినప్పుడు అది తప్పకుండా ఆకట్టుకుంటుంది కూడా. అలా అమెరికా దృష్టిని ఆకట్టుకున్న ఓ గద్ద.. నెల తిరగకుండానే మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. మొదటిసారి పొదగని ఓ గుడ్డుతో.. ఇప్పుడు ఓ అనాథ పిల్లతో.. మర్ఫీ.. మిస్సోరి వ్యాలీ పార్క్‌లో ఉంటున్న ఓ బాల్డ్ ఈగల్. వయసు సుమారుగా 31 ఏళ్లు ఉంటుంది. రెక్కకు గాయం కావడంతో ఎగరలేని స్థితి దానిది పాపం. మార్చి చివర్లో.. ఈ పక్షి ప్రవర్తన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అందుకు కారణం.. ఈ మగ పక్షి ఓ రాయిని పొదగడానికి ప్రయత్నించడం. గుడ్డు ఆకారంలోని ఆ రాయిని తనకింద ఉంచుకోవడం మాత్రమే కాదు.. దాని దగ్గరికి వచ్చిన తోటి గద్దలను తరిమి తరిమి కొట్టాడు మర్ఫీ. అలా మొదటిసారి వార్తల్లో నిలిచాడు. ఆ సమయంలో దాని ప్రవర్తన పక్షులపై అధ్యయనం చేసే వాళ్లను సైతం ఆశ్చర్యపోయేలా చేసింది. ఇక ఇప్పుడు రెండోసారి.. మళ్లీ అది మీడియా సెన్సేషన్ అయ్యింది. ఈసారి ఓ నిజం పక్షికి తండ్రిగా మారింది మర్ఫీ. అక్కడికి అరవై మైళ్ల దూరం నుంచి కొట్టుకొచ్చిన ఓ పక్షి గూడులోని పిల్లను జాగ్రత్తగా చూసుకుంటోంది ఈ మగ గద్ద. ఆహారం అందించడం మాత్రమే కాదు.. ఎప్పుడూ వెంట ఉంటూ తోటి గద్దల నుంచి దానిని సంరక్షిస్తోంది. అయితే ఈ క్రమంలో తన ‘రాకీబేబీ’ని మాత్రం నిర్లక్ష్యం చేయట్లేదండోయ్. ఒకవైపు ఆ రాయిని.. మరోవైపు అనాథ పక్షిని ఇద్దరి సంరక్షణను చూసుకుంటూ తన మంచి గుణం చాటుకుంటోంది మర్ఫీ. ఇదేం విచిత్రమో మరి.. ! -
అమెరికాలో విషాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
సాక్షి, వరంగల్: అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మిస్సోరిలోని ఓజార్క్ సరస్సులో ఈతకు వెళ్లిన నలుగురు తెలుగు విద్యార్థులు.. ప్రమాదవశాత్తు అందులో గల్లంతయ్యారు. వీరిలో వికారాబాద్‌కు చెందిన శివదత్తు, హనుమకొండకు చెందిన ఉత్తేజ్ మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరికోసం గాలిస్తున్నారు. నలుగురు తెలుగు విధ్యార్థులు మిస్సోరి రాష్ట్రం సెయింట్ లూయిస్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. హనుమకొండకు చెందిన ఉత్తేజ్ మరణ వార్త తెలియడంతో అతని తల్లిదండ్రులు జనార్థన్, ఝాన్సీ లక్ష్మీ బోరున విలపిస్తున్నారు. కాగా గతేడాది ఆగస్టులో అమెరికా వెళ్లిన ఉత్తేజ్ హెల్త్ సైన్స్ డేటాలో మాస్టర్స్ చేస్తున్నాడు. ఈ ప్రమాదంలో వికారాబాద్ జిల్లాతాండూరుకు చెందిన అపెక్స్ ఆస్పత్రి యజమాని వెంకటేశం, జ్యోతి దంపతుల రెండో కుమారుడు శివదత్తు (25) కూడా మరణించారు. వైద్య విద్యను అభ్యసించేందుకు ఈ ఏడాది జనవరిలో అమెరికా వెళ్లాడు శివదత్తు. సెయింట్ లూయిస్ వర్సిటీలో డెంటల్ ఎంఎస్ విద్య అభ్యసిస్తున్నాడు. శనివారం దత్తు స్నేహితులతొ కలిసి ఓజార్క్ లేక్‌కు వెళ్లాడు. సరస్సులో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు ఇద్దరూ మునిగిపోయారు. విషయం తెలిసి మృతుని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. చదవండి: రాత్రి ఇంటికి రానని చెప్పి.. ఫ్రెండ్‌ను బస్టాప్‌లో దింపేందుకు వెళ్తుండగా.. -
హైస్కూల్‌తో తుపాకీతో రెచ్చిపోయిన యువకుడు.. భీకరంగా కాల్పులు..
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. మిస్సోరిలోని సెయింట్ లూయిస్ హైస్కూల్లో ఓ సాయుధుడు తుపాకీతో రెచ్చిపోయాడు. విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్పులకు పాల్పడిన నిందితుడిని షూట్ చేశారు. అనంతరం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే నిందితుడు సహా మరో ఇద్దరు బాధితులు అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుల్లో ఓ మహిళ, ఓ టీనేజర్ ఉన్నారు. ఉదయం 9:10 గంటలకు తమకు కాల్పులు జరుగుతున్నట్లు ఫోన్ వచ్చిందని పోలీసులు చెప్పారు. 2 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకున్నట్లు పేర్కొన్నారు. స్కూల్ లోపల పెద్ద తుపాకీతో ఓ దుండగుడు కాల్పులు జరుపుతున్నట్లు విద్యార్థులు తమకు తెలిపారని, వెంటనే అతడ్ని షూట్ చేసినట్లు చెప్పారు. నిందితుడి వయసు 20 ఏళ్లు పైబడి ఉంటుందని, అతడి వివరాలు తెలియాల్సి ఉందని వివరించారు. చదవండి: ఓడలో భారీ అగ్నిప్రమాదం.. 14 మంది సజీవదహనం.. 226 మందిని.. -
మెడికల్ మిరాకిల్..18వ పడిలోకి ‘రెండు ముఖాల’ బాలుడు!
వాషింగ్టన్: ఈ బాలుడిని ప్రపంచ వింతగానే చెప్పుకోవాలి. సాధారణంగా జన్యులోపంతో జన్మించిన పిల్లలు ఎక్కువ కాలం బతకరని వైద్యులు చెబుతుంటారు. రెండు ముఖాలతో జన్మించిన ఈ బాలుడు సైతం ఎంతో కాలం జీవించలేడని వైద్యులు చెప్పేశారు. కానీ, ఈ బాలుడు తనకు ఎదురైవుతున్న సమస్యలన్నింటినీ దాటుకుని ఇప్పుడు 18వ పడిలోకి అడుగుపెట్టాడు. వైద్యుల మాట తప్పు అని నిరూపిస్తూ మెడికల్ మిరాకిల్ అనిపించుకుంటున్నాడు. ఆ బాలుడే అమెరికాకు చెందిన ట్రెస్ జాన్సన్. అమెరికాలోని మిస్సోరీకి చెందిన ట్రెస్ జాన్సన్.. రెండు ముఖాలతో జన్మించాడు. ఎస్హెచ్ఎచ్ అనే జన్యు లోపం కారణంగా ఇలా జరిగినట్లు వైద్యులు తెలిపారు. ముఖంపై రెండు ముక్కులు, మూడు కళ్లు, నోటిలోనూ చిలిక.. దాదాపుగా రెండు ముఖాలు ఉన్నాయి. తొలుత చాలా ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. అయితే.. అధునాత చికిత్సలతో బాలుడు వేగంగా కోలుకున్నాడు. గంజాయి ఆయిల్ తీసుకోవటం ద్వారా ముక్కు కారే సమస్య దాదాపుగా నియంత్రణలోకి వచ్చిందని జాన్సన్ తల్లితండ్రులు తెలిపారు. అదే ఆయిల్‌ను గత ఏడేళ్లుగా ఉపయోగిస్తున్నామని చెప్పారు. వింత జబ్బులతో బాధపడుతున్న తన కుమారుడికి ఔషధాల కోసం చాలా ఇబ్బందులు పడ్డామని, ప్రసవం తర్వాత తొలిసారి తన బిడ్డను చూసుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు జాన్సన్ తల్లి బ్రాండీ. ప్రస్తుతం తన కుమారుడు 18 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టినట్లు చెప్పారు. జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు వెల్లడించారు. View this post on Instagram A post shared by TresMa (@diprosopusdiaries) ఇదీ చదవండి: విమాన సిబ్బందికి ‘లోదుస్తులు’ కంపల్సరీ.. పాక్ ఎయిర్‌లైన్స్ నవ్వులపాలు, ఆగ్రహజ్వాలలు -
ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన నేరస్తుడు
మిస్సోరి: మిస్సోరీకి చెందిన 46 ఏళ్ల మైఖేల్ కాంప్‌బెల్ తన ముఖమంతా పూర్తిగా టాటూలు వేయించుకున్నందుకు గానూ 'ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన క్రిమినల్' గా పిలుస్తున్నారు. అంతే కాదు యురోపియన్ సంతతికి చెందిన మైఖేల్ ముక్కు, పెదవులు, మెడ కింద మాత్రమే చర్మం కనిపిస్తుంది తప్ప ముఖం అంతా టాటులతో నిండి ఉంటుంది. పైగా నదుదిటిపై పెంటాగ్రామ్, అతని మెడపై విల్లులాంటి టై, కుక్క అతని గుండు పైన 88 సంఖ్య ఉన్నాయి. (చదవండి: అమేజింగ్ ఆర్ట్ .....ఒక చిత్రం ఎన్ని చిత్రాలుగా మారుతుందో!) అయితే ఇటీవలే అత్యాచారయత్నం కేసులో అరెస్టు అయిన నేరస్తుడు. ఈ మేరకు మైఖేల్ గతేడాది ఆస్తి నష్టం, దాడి వంటి ఆరోపణలతో ఆరు నెలలు జైలు శిక్షను కూడా అనుభవించాడని పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు ఈ కేసులో దోషిగా నిర్ధారణ అయితే మరోసారి జీవితాంతం జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందంటున్నారు. అంతేకాదు మైఖేల్ కేవలం 20 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతని మొదటి నేరారోపణ జరిగినట్లు వివరించారు. కానీ ఆ సమయంలో మైఖేల్ ముఖం పై కేవలం ఒక పచ్చబొట్టు మాత్రమే ఉంది. ఈ క్రమంలో ఇటీవలే అతని తండ్రి కోవిడ్‌తో చనిపోవడంతో అతని జ్ఞాపకార్థం మైఖేల్ ఇద్దరూ సోదరీమణులు కూడా టాటులు వేయించుకున్నారు. దీంతో ఈ విషయం కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు నెటిజన్లు టాటుల కుటుంబం అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: మా స్కూల్ సమీపంలో మద్యం షాపును తీసేయండి!) -
నెటిజన్లను మెప్పిస్తున్న పెంగ్విన్లు: వైరల్ వీడియో
మిస్సౌరీ: పెంగ్విన్లు ప్రధానాంశంగా పుస్తకాలు, సినిమాలు, డాక్యుమెంటరీలు చాలానే వచ్చాయి. కార్టూన్లు, టెలివిజన్ డ్రామాలు వినోదాన్ని పంచాయి. వీటి నడక, నాట్యం తమాషాగా ఉండటం వలన పెంగ్విన్లను అనేక కార్టూన్ పాత్రలుగా సృష్టించారు. కాగా యూఎస్‌లో మిస్సౌరీలోని సెయింట్ లూయిస్ జూ పార్క్‌లో తీసిన ఓ వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. రెడిట్‌లో పోస్ట్ చేసిన 44 సెకన్ల నివిడి గల ఈ వీడియోను 5 గంటల్లో 37000 వేల మంది వీక్షించారు. పెంగ్విన్లు బరువు చూసుకోవడానికి ఆత్రుతగా ఎదుచూస్తున్న ఈ వీడియో వేల కామెంట్స్‌తో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ క్రమంలో.. ‘‘ నేను పెంగ్విన్ కావాలనుకుంటున్నాను.’’ అంటూ ఓ నెటిజన్ చమత్కరిస్తే".. ‘‘ఇది నిజంగా ఓ మేధావి ఆలోచనలా ఉంది. వీటిని చూస్తే నిటారుగా ఉన్న కొండను చూసినట్టుంది.’’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక పెంగ్విన్లు తమ జీవిత కాలంలో సగం నేలమీద, సగం నీటిమీద నివసిస్తాయి. ఆడ పెంగ్విన్ల కన్నా మగ పెంగ్విన్లు ఆకారంలో కొద్దిగా పెద్దగా..పెద్ద ముక్కుతో ఉంటాయి. (చదవండి: చనిపోయే ముందు వీడియో.. యూట్యూబర్ ఆఖరి మాటలు) -
62 ఏళ్ల వయసులో గుడ్లను పెట్టింది..
మిస్సౌరీ : 60 ఏళ్లు దాటిన తర్వాత పైతాన్లు గుడ్లు పెట్టే సామర్థ్యాన్ని కోల్పోతాయని.. సంతాన్పోత్పత్తి జరిగే అవకాశం ఉండదని పలు పరిశోధనల్లో తేలింది. కానీ 62 ఏళ్ల బాల్ పైతాన్ ఈ అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా ఏడు గుడ్లను పెట్టింది. ఇక్కడ ఆశ్యర్యమేంటంటే గత 20 ఏళ్లుగా అది సంతానోత్పత్తికి దూరంగా ఉంటుంది. దీంతో పాటు అది ఎలాంటి మగ పైతాన్‌తో కలయిక లేకుండానే గుడ్లను పెట్టడం విశేషం. ఈ వింత ఘటన మిస్సౌరీలోని సెయింట్ లూయిస్ జూలో చోటుచేసుకుంది.(చదవండి : అలా సరదాగా రేసుకు వెళ్దామా!) జూ మేనేజర్ మార్క్ వానర్ స్పందించాడు. 'ఇది నిజంగా నమ్మశక్యం కాని విషయం. సాధారణంగా బాల్ పైతాన్స్ 60 ఏళ్లు పైబడితే గుడ్లు పెట్టే సామర్థ్యాన్ని కోల్పోతాయి. మా జూలో ఉన్న బాల్ పైతాన్ 20 ఏళ్లకు పైగా మగ పైతాన్‌తో కలయిక జరపలేదు. అయినా 62 ఏళ్ల వయసులో గుడ్లను పెట్టింది.. బహుశా బాల్ పైతాన్ మగ పైతాన్‌కు సంబంధించిన వీర్యం తన శరీరంలో ఒకచోట నిల్వ ఉంచుకొని ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ అండాన్ని విడుదల చేసి గుడ్లను పెట్టి ఉంటుంది.' అని తెలిపాడు. ఈ విషయంపై సెయింట్ లూయిస్ జూ యాజమాన్యం స్పందించింది. జూలై 23 న బాల్ పైతాన్ 7 గుడ్లను పెట్టగా.. అందులో మూడింటిని ఇన్క్యూబేటర్లో ఉంచారు. రెండింటిని జెనిటిక్ శాంపిల్స్ కోసం పరీక్షించారు. మిగతా రెండు గుడ్లలో ఉన్నవి మాత్రం చనిపోయాయని తెలిపింది. అయితే జెనటిక్ శాంపిల్స్ కోసం గుడ్లను పరిక్షించిన తర్వాత ఆసక్తికర విషయం బయటిపడింది. బాల్ పైతాన్‌లో ఎలాంటి కలయిక లేకపోయినా(సెక్య్సుయల్ లేదా అసెక్య్సుయల్) వాటిలో పునరుత్పత్తి జరుగుతుందని.. దీనినే ఫ్యాకల్టేటివ్ పార్థినోజెనిసిస్ అంటారు. ఇప్పుడు సెయింట్ లూయిస్ జూలో ఒకటే మగ బాల్ పైతాన్ ఉందని.. దాని వయసు 31 ఏళ్లని యాజమాన్యం తెలిపింది. గుడ్లు పెట్టిన ఆడ బాల్ పైతాన్‌ను 1961లో ఒక వ్యక్తి జూకు విరాళంగా ఇచ్చాడని.. అప్పటినుంచి అది ఇక్కడే పెరుగుతుందని తెలిపారు. -
కరోనా సంక్షోభం: చైనాపై మరో దావా!
వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) గురించి నిజాలు దాచి కల్లోలానికి కారణమైందంటూ అమెరికా రాష్ట్రం మిస్సోరి చైనాను పరిహారం కోరుతూ మంగళవారం స్థానిక కోర్టులో దావా వేసింది. ఉద్దేశపూర్వకంగానే డ్రాగన్ దేశం ప్రపంచాన్ని మోసం చేసిందని... మహమ్మారిని అరికట్టడానికి సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే సంక్షోభం తలెత్తిందని ఆరోపించింది. చైనాలోని వుహాన్ నగరంలో తొలిసారిగా బయటపడ్డ కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అన్ని దేశాల కంటే అగ్రరాజ్యం అమెరికాలోనే ఎక్కువ కరోనా మరణాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా ఇతర నేతలు చైనానే వైరస్‌ను సృష్టించి ప్రపంచం మీదకు వదిలిందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. (చైనాపై అమెరికన్ లాయర్ కేసు) ఈ క్రమంలో కరోనా సంక్షోభంపై చైనాను నిలదీయాలంటూ ట్రంప్ కాంగ్రెస్‌లో పిలుపునిచ్చిన నేపథ్యంలో మిస్సోరి ఆసియా దేశంపై ఫెడరల్ కోర్టులో వాజ్యం దాఖలు చేసింది. ఈ విషయం గురించి మిస్సోరి అటార్నీ జనరల్ ఎరిక్ మాట్లాడుతూ.. ‘‘కోవిడ్-19 వ్యాప్తి, ప్రమాదం గురించి చైనా ప్రభుత్వం ప్రపంచానికి అబద్ధాలు చెప్పింది. చాపకింద నీరులా అంటువ్యాధి వ్యాపించింది. దీనికి వాళ్లు జవాబుదారీగా ఉండాల్సిందే’’అని పేర్కొన్నారు. అదే విధంగా కరోనా సంక్షోభం కారణంగా మిస్సోరి బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసిందని... దీనిని చైనా అధికార కమ్యూనిస్టు పార్టీ భరించాలని డిమాండ్ చేశారు. మనిషి నుంచి మనిషికి వైరస్ వ్యాపించదని చెప్పి ఇంతటి విధ్వంసానికి చైనా కారణమైందని మండిపడ్డారు. (వలసల నిషేధంపై స్పష్టతనిచ్చిన ట్రంప్..!) కాగా అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన మిస్సోరి ప్రభుత్వం చైనాపై వేసిన దావా (అమెరికా చట్టాల ప్రకారం విదేశీ ప్రభుత్వాలపై చర్యలు తీసుకునే అధికారం స్థానిక కోర్టుకు ఉండదు) చట్టపరంగా ఎంతవరకు నెగ్గుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక మిస్సోరిలో మంగళవారం నాటికి 189 కరోనా మరణాలు సంభవించాయి. ఇదిలా ఉండగా... కోవిడ్-19ను సృష్టించి వ్యాప్తి చేసిందని ఆరోపిస్తూ... చైనా 20 లక్షల కోట్ల డాలర్ల పరిహారం చెల్లించాలని కోరుతూ అమెరికా న్యాయవాది లారీ క్లేమన్ కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
‘నుదటి మీద తోకతో కుక్కపిల్లా.. అచ్చం ఏనుగు తొండంలా’
-
‘తోకతో కుక్కపిల్ల.. అచ్చం ఏనుగు తొండంలా’
వాషింగ్టన్: కొన్ని జంతువులు ఏదో ఒక లోపంతో జన్మిస్తుంటాయి. అది సాధారణ విషయమే అయినప్పటికీ ఓ కుక్కపిల్ల మాత్రం దానికున్న లోపంతోనే ప్రపంచమంతా ఫేమస్ అయ్యింది. నుదుటి మీద తోకతో జన్మించిన పది వారాల వయస్సున్న ఈ కుక్కపిల్ల ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శనివారం ఫేస్బుక్లో షేర్ చేసిన ఈ కుక్కపిల్లను చూసి పెటిజన్లంతా ఫిదా అవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని మిస్సోరి నగర వీధుల్లో పుట్టిన ఈ కుక్క పేరు ‘నార్వాల్ ది లిటిల్ మ్యాజికల్ ఫ్యూరీ యునికార్న్’ అని డాగ్ రెస్య్కూ సంస్థ ‘మాక్స్ మిషన్’ తెలిపింది. ఆ సంస్థ సిబ్బందికి ఈ కుక్కపిల్ల (నార్వాల్) మిస్సోరి వీధుల్లో దొరికినట్లు సమాచారం. కాగా రెండు కనుబొమ్మల మధ్య మొలిచిన ఈ తోక.. చిన్నగా ఉండి ఏనుగు తొండాన్ని తలపించేలా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సంస్థ షేర్ చేసిన వీడియోలో నార్వాల్ ఆడుకుంటున్నప్పుడు దాని తోక అటూ ఇటూ కదులుతూ భలే ముద్దుగా ఉండటం అందర్ని ఆకట్టుకుంటోంది. నార్వాల్ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతూ.. దీనిని చూస్తుంటే ఓ కలలా ఉందని, ఎంతకు అమ్ముతారంటూ కామెంట్లు పెడుతున్నారు. మాక్స్ మిషన్ సంస్థ ఇలాంటి లోపాలున్న కుక్కలను తీసుకొచ్చి వాటికి వైద్యం అందిస్తుంది. నార్వాల్ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉందని సంస్థ ఫేస్బుక్ పోస్ట్ ద్వారా తెలిపింది. నార్వాల్‌కు స్కానింగ్ చేయించగా ఈ తోక ఏ శరీర భాగంతో కలసి లేనందున దానికి ఎలాంటి నొప్పి ఉండదని డాక్టర్లు తెలిపారు. అలాగే నుదుటిపై మొలిచిన ఈ తోక వల్ల కుక్కకు ఎలాంటి ప్రమాదం లేదని, ఆరోగ్యవంతమైన మిగతా కుక్కల్లాగే అదీ చురుగ్గా ఆడుకోవడానికి ఎక్కవగా ఇష్టపడుతుందని పేర్కొన్నారు. అలాగే దీనిని పెంచుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారని, ఇప్పటికే పలువురు సంస్థకు 50కి పైగా దత్తత దరఖాస్తులు వచ్చినట్లు మాక్స్ మిషన్ సంస్థ వెల్లడించింది. -
కలకలం : అమెరికాలో ఆగంతకుడి కాల్పులు
మిస్సోరి : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌లో దుండగుడు కాల్పులు జరపడంతో ఎనిమిదేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఘటనలో మరో మహిళ, ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా సోల్డాన్ హైస్కూల్ వద్ద ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు వెళ్లగా దుండగుడు కాల్పులకు తెగబడినట్టు తెలుస్తోంది. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. పొట్టలోకి తూటా దూసుకుపోవడంతో బాలిక ప్రాణాలు కోల్పోయిందని సెయింట్ లూయిస్ పోలీస్ చీఫ్ జాన్ హెడెన్ వెల్లడించారు. బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తుండగా ఘటన జరిగిందని అన్నారు. పాఠశాలలో జరుగుతున్న ప్రీ-సీజన్ ఫుట్‌బాల్ ఈవెంట్‌ను వారంతా చూసేందుకు వచ్చారని తెలిపారు. ఈ క్రమంలోనే కాల్పులు జరిగినట్టు వెల్లడించారు. ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు వచ్చారని, కాల్పుల అనంతరం హుటాహుటిన ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించామని చెప్పారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఇదిలాఉండగా.. సెయింట్ లూయిస్‌లో గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 12 మంది బాలికలు తూటాలకు బలయ్యారు. -
వైఎస్సార్ సీపీ ప్రభంజనం.. సెయింట్ లూయిస్‌లో సంబరాలు
సెయింట్ లూయిస్ : ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తూ 151 స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. వైఎస్సార్ సీపీ అఖండ విజయంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లువిరిశాయి. రాష్ట్ర, జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఉన్న వైఎస్సార్ సీపీ అభిమానులు పార్టీ ఘనవిజయం సాధించటంతో సంబరాలు చేసుకున్నారు. మిస్సోరిలోని సెయింట్ లూయిస్ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు సైతం ఆటలు, పాటలతో తమ ఆనందాన్ని వ్యక్త పరిచారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వేషధారణ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. -
వైఎస్సార్ సీపీ ప్రభంజనం.. సెయింట్ లూయిస్‌లో సంబరాలు
-
మిస్సోరిలో జగన్ కోసం మనం
మిస్సోరి : ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 341 రోజుల పాటు ప్రజాసంకల్పయాత్ర చేసిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర దిగ్విజయంగా పూర్తయిన సందర్భంగా, వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం మిస్సోరి ఆధ్వర్యంలో జనం కోసం జగన్.. జగన్ కోసం మనం కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ 3648కిలోమీటర్ల దూరం నడిచి ఓ చరిత్రను సృష్టించారని ఎన్ఆర్ఐలు అన్నారు. ఈ కార్యక్రమంలో సెయింట్ టూయిస్‌లోని వైఎస్ జగన్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు కోన రఘుపతి, బాలరాజు పోలవరం, కాటం రెడ్డి శ్రీధర్, అన్నబత్తిన శివకుమార్, తోపుర్తి ప్రకాశ్ రెడ్డి, ఆదిములపు సురేష్, దువ్వాడ శ్రీనివాస్ తమ సందేశాన్ని వీడియో తీసి పంపించారు. కావాలి జగన్ రావాలి జగన్ నినాదాలతో సభాప్రాంగణం మారుమోగిపోయింది. యాత్ర చిత్ర పాటలకి చిన్నారులు డ్యాన్స్ వేశారు. సెయింట్ లూయిస్, మిస్సోరి వైఎస్సార్సీపీ అధ్యక్షులు నవీన్ గుడవల్లి, వెఎస్సార్సీపీ యూఎస్ఏ సెంట్రల్ కమిటీ సభ్యులు సుబ్బారెడ్డి పమ్మి, వెఎస్సార్సీపీ యూఎస్ఏ సెంట్రల్ కమిటీ సభ్యులు గోపాల్ రెడ్డి తాటిపత్రి, రంగా చక్క ట్రెజరర్, విజయ్ బైక, హరి తోటపల్లి, రామక్రిష్ణా బోరెడ్డి, రాజేంద్ర ఎమ్, యుగేందర్ తలాటి, సుధాకర్ రెడ్డి, రమేష్ కొరప్రోలు, సుబ్బారెడ్డి తాటిపత్రిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. -
ఏకగ్రీవంగా టాస్ పరిపాలనా విభాగం ఎన్నిక
సెయింట్ లూయిస్ : అమెరికాలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ సెయింట్ లూయిస్ మిస్సోరి స్టేట్ యూఎస్ఏ(టాస్) జనరల్ అసెంబ్లీ నిర్వహించింది. టాస్ పరిపాలనా విభాగాన్ని సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టాస్ పరిపానా విభాగానికి ఎన్నికైన సభ్యులందరూ ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి 800మందికి పైగా తెలుగువారు హాజరయ్యారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ 2019-2020 ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్- సురేంద్ర బచిన వైస్ ప్రెసిడెంట్-వెంకట్ గోని ట్రెజరర్- రంగ సురేష్ చక్కా కల్చరల్ సెక్రటరీ- అర్చన ఉపామక ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ- తిరుమల రమేష్ కొండముట్టి బీఓడీ 2019-2022 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ - జనార్థన్ రావు విజేండ్ల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్- శ్రీనివాసరావు భూమ -
వైరల్ వీడియో: చూస్తుండగానే మునిగిపోయింది
ముస్సోరి: సరదాగా సాగుతున్న పడవ ప్రయాణంలో ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది. స్టోన్ కౌంటీలోని టేబుల్ రాక్ నదిలో గురువారం సాయంత్రం పడవ నీట మునిగింది. 31 మందితో ప్రకృతి అందాలను తిలకించడానికి బయల్దేరిన డక్ బోట్ (బాతు పడవ) నది మధ్యలో ఉండగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో తుఫాను గాలులు విరుచుకుపడడంతో అలలు ఎగసిపడి పడవ నీట మునిగింది. శాంతంగా ఉన్న నదీ జలాలు తుపాను కారణంగా ఉగ్ర రూపం దాల్చి 13 మంది ప్రాణాలను బలిగొన్నాయి. ఘటనలో నలుగురు గల్లంతవగా మరో 14 మంది ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, ప్రమాదానికి గురవుతున్న పడవను దూరంగా ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడయాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. ప్రయాణీకుల హాహాకారాలు, పడవ ప్రమాదం ఆసాంతం వీడియోలో నిక్షిప్తమైంది. -
వైరల్ వీడియో: 13 మందిని బలిగొన్న అలలు
-
శరత్ హంతకుడ్ని కాల్చిచంపారు
భారత విద్యార్థి శరత్ హత్య కేసులో నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు మట్టుబెట్టారు. ఆదివారం కాన్సస్ సిటీ శివారులో జరిగిన ఎన్కౌంటర్లో అతన్ని కాల్చి చంపినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాన్సస్ నగర పోలీసులు ట్విటర్లో విషయాన్ని ధృవీకరించారు. మిస్సోరి: ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన శరత్ కొప్పు(తెలంగాణ.. వరంగల్ చెందిన వ్యక్తి)ని.. ఈనెల 4వ తేదీన ఓ స్టోర్ లో నిందితుడు కాల్చి చంపాడు. ఘటన తర్వాత నిందితుడు పారిపోగా.. అప్పటి నుంచి పోలీసుల వేట కొనసాగుతోంది. చివరకు కాన్సస్ సిటీ శివార్లలో నిందితుడు ఉన్నాడన్న సమాచారం అందుకుని.. పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే, లొంగిపోవాలని పోలీసులు కోరటంతో.. ఆ హంతకుడు పోలీసులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులకు గాయాలు అయ్యాయి. పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించడంతో అతను మరణించాడు. (అలా చేయకపోయి ఉంటే బతికేవాడేమో!) నిందితుడు తన వద్ద ఉన్న రైఫిల్ తో కాల్పులు జరిపాడని, దాంతో పోలీసులు ఎదురు కాల్పులకు దిగడంతో అతను మరణించాడు అని కాన్సస్ సిటీ పోలీస్ చీఫ్ రిక్ స్మిత్ వెల్లడించారు. ఈ ఎన్ కౌంటర్ లో గాయపడిన అధికారులను ఆసుపత్రికి తరలించామని, వారికి ప్రాణాపాయం తప్పిందని ఆయన తెలియజేశారు. శరత్ హత్య కేసు.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
అమెరికాలోనే శరత్ మృతదేహం
కాన్సస్: అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలోని కాన్సస్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన విద్యార్థి శరత్ కొప్పు తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. రోజులు గడుస్తున్నా కుటుంబానికి శరత్ భౌతిక కాయం చేరలేదు. శరత్ భౌతిక కాయాన్ని హైదరాబాద్ తరలించేందుకు మరింత సమయం పట్టేలా ఉంది. హైదరాబాద్‌లోని వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో శరత్ బీటెక్ చేశారు. ఆరునెలల కిందట ఎంఎస్ చదివేందుకు శరత్ అమెరికా వెళ్లారు. కాన్సస్ నగరంలోని ఓ రెస్టారెంట్లో శరత్ పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం డ్యూటీలో ఉండగా ఓ వ్యక్తి రెస్టారెంట్లోకి వచ్చి గన్‌తో బెదిరింపులకు పాల్పడ్డాడు. భయంతో రెస్టారెంట్ సిబ్బందితోపాటు ముగ్గురు కస్టమర్లు టేబుళ్ల కింద నక్కారు. కానీ, శరత్ మాత్రం భయంతో పరుగులు తీయటంతో.. నిందితుడు శరత్‌పై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఘటన తర్వాత నిందితుడు పారిపోగా.. బయటకు వచ్చిన సిబ్బంది ఎమర్జెన్సీ నంబర్ 911కు కాల్ చేసి సమాచారం అందించారు. శరత్‌ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. -
పరిగెత్తడంతోనే శరత్ ప్రాణాలు గాల్లోకి...
గుర్తు తెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో భారతీయ విద్యార్థి కొప్పు శరత్(26) ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజీ దృశ్యాలను స్థానిక మీడియా ఛానెళ్లకు విడుదల చేసిన కాన్సస్ నగరం పోలీసులు.. నిందితుడిని పట్టించిన వారికి నజరానా ఇస్తామని ప్రకటించారు. అయితే పరిగెత్తటంతోనే శరత్ ప్రాణాలు గాల్లో కలిసిపోయానని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. మిస్సోరి: కాన్సస్ నగరంలోని ఓ రెస్టారెంట్లో వరంగల్‌కు చెందిన శరత్ పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం డ్యూటీలో ఉండగా ఓ వ్యక్తి రెస్టారెంట్లోకి వచ్చి గన్‌తో బెదిరింపులకు పాల్పడ్డాడు. భయంతో రెస్టారెంట్ సిబ్బందితోపాటు ముగ్గురు కస్టమర్లు టేబుళ్ల కింద నక్కారు. కానీ, శరత్ మాత్రం భయంతో పరుగులు తీయటంతో.. నిందితుడు శరత్‌పై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఘటన తర్వాత నిందితుడు పారిపోగా.. బయటకు వచ్చిన సిబ్బంది ఎమర్జెన్సీ నంబర్ 911కు కాల్ చేసి సమాచారం అందించారు. శరత్‌ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించిన అధికారులు.. నిందితుడి చిత్రాలను విడుదల చేసి పట్టించిన వారికి 10,000 డాలర్ల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. సాక్షి, హైదరాబాద్/వరంగల్: శరత్ మృతితో అతని స్వస్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హైద్రాబాద్ వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసిన శరత్.. ఆ తర్వాత ఓ సాప్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. ముస్సోరి యూనివర్సిటీలో ఎంఎస్ సీటు రావటంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ఆరు నెలల క్రితం అక్కడికి వెళ్లాడు. అయితే శరత్ క్యాంపస్‌లోనే పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నాడని మాత్రమే తమకు తెలుసని, రెస్టారెంట్లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలీదని తండ్రి రామ్మోహన్ చెబుతున్నారు. త్వరలో శరత్ సోదరి వివాహం ఉంది. ఆ వేడుకకు వచ్చేందుకు శరత్ సిద్ధమయ్యాడు. ఇంతలోనే ఆ ఇంట విషాదం నెలకొంది. పరామర్శించిన కేటీఆర్.. కాగా, శరత్ కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘దౌత్య సిబ్బందితో మాట్లాడాం. కుటుంబ సభ్యులు వెళ్లాలనుకుంటే అమెరికాకు పంపించే ఏర్పాట్లు చేస్తాం. వీలైనంత త్వరగా మృత దేహం ఇక్కడికి వచ్చేలా చూస్తాం’ అని కేటీఆర్ అన్నారు. ‘ప్రస్తుతం శరత్ మృత దేహాం ఇంకా ఆస్పత్రిలోనే ఉంది. ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత ఇండియన్ ఎంబసీకి పంపిస్తారు. అక్కడ క్లియరెన్స్ లభించాక ఇండియాకు తరలిస్తారు. ఈ ప్రక్రియకు రెండు రోజులు పట్టొచ్చు అని అధికారులు పేర్కొన్నట్లు’ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.