సరదాగా సాగుతున్న పడవ ప్రయాణంలో ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది. స్టోన్ కౌంటీలోని టేబుల్ రాక్ నదిలో గురువారం సాయంత్రం పడవ నీట మునిగింది. 31 మందితో ప్రకృతి అందాలను తిలకించడానికి బయల్దేరిన డక్ బోట్ (బాతు పడవ) నది మధ్యలో ఉండగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో అలలు విరుచుకు పడడంతో నీట మునిగింది.