Duck boats
-
వైరల్ వీడియో: చూస్తుండగానే మునిగిపోయింది
ముస్సోరి: సరదాగా సాగుతున్న పడవ ప్రయాణంలో ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది. స్టోన్ కౌంటీలోని టేబుల్ రాక్ నదిలో గురువారం సాయంత్రం పడవ నీట మునిగింది. 31 మందితో ప్రకృతి అందాలను తిలకించడానికి బయల్దేరిన డక్ బోట్ (బాతు పడవ) నది మధ్యలో ఉండగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో తుఫాను గాలులు విరుచుకుపడడంతో అలలు ఎగసిపడి పడవ నీట మునిగింది. శాంతంగా ఉన్న నదీ జలాలు తుపాను కారణంగా ఉగ్ర రూపం దాల్చి 13 మంది ప్రాణాలను బలిగొన్నాయి. ఘటనలో నలుగురు గల్లంతవగా మరో 14 మంది ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, ప్రమాదానికి గురవుతున్న పడవను దూరంగా ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడయాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. ప్రయాణీకుల హాహాకారాలు, పడవ ప్రమాదం ఆసాంతం వీడియోలో నిక్షిప్తమైంది. -
వైరల్ వీడియో: 13 మందిని బలిగొన్న అలలు
-
రోడ్డుపై బస్సులా.. నదిలో పడవలా
గోదావరి, కృష్ణాలో డక్ బోట్లు రాజమండ్రి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: నదుల్లో పడవల్లా, రోడ్లపై బస్సుల్లా తిరిగే డక్ బోట్లు త్వరలో గోదావరి, కృష్ణా నదుల్లో పర్యాటకులను అలరించనున్నాయి. విదేశాల్లో బాగా ఆదరణ పొందిన ఈ యాంఫిబియస్ (ఉభయచర తరహా) బోట్లను త్వరలో విజయవాడ, రాజమండ్రిలో పరిచయం చేయనున్నారు. ఈ ప్రాజెక్టులపై యాంబిఫియస్ కార్పొరేషన్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ సమర్పించిన నివేదికలను ప్రభుత్వం ఇటీవలే ఆమోదించింది. విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నంలో ఈ బోట్లను నడిపేందుకు ఆ కంపెనీ నివేదికలివ్వగా తొలి దశలో విజయవాడ, రాజమండ్రిలో ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇక్కడ విజయవంతమైతే రెండో దశలో విశాఖలో ఈ బోట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా బోట్లను యాంఫిబియస్ కార్పొరేషన్ సెప్టెంబర్ 1న గోవాలో ప్రారంభించనుంది. ఆ తర్వాత మన రాష్ట్రంలో వీటిని నడపడానికి ఏర్పాట్లు చేస్తోంది.