రోడ్డుపై బస్సులా.. నదిలో పడవలా | Neighbors concerned about Ride the Ducks plans | Sakshi
Sakshi News home page

రోడ్డుపై బస్సులా.. నదిలో పడవలా

Published Fri, Jul 24 2015 1:32 AM | Last Updated on Wed, Apr 3 2019 5:24 PM

రోడ్డుపై బస్సులా.. నదిలో పడవలా - Sakshi

రోడ్డుపై బస్సులా.. నదిలో పడవలా

గోదావరి, కృష్ణాలో డక్ బోట్లు
రాజమండ్రి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: నదుల్లో పడవల్లా, రోడ్లపై బస్సుల్లా తిరిగే డక్ బోట్లు త్వరలో గోదావరి, కృష్ణా నదుల్లో పర్యాటకులను అలరించనున్నాయి. విదేశాల్లో బాగా ఆదరణ పొందిన ఈ యాంఫిబియస్ (ఉభయచర తరహా) బోట్లను త్వరలో విజయవాడ, రాజమండ్రిలో పరిచయం చేయనున్నారు. ఈ ప్రాజెక్టులపై యాంబిఫియస్ కార్పొరేషన్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ సమర్పించిన నివేదికలను ప్రభుత్వం ఇటీవలే ఆమోదించింది.

విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నంలో ఈ బోట్లను నడిపేందుకు ఆ కంపెనీ నివేదికలివ్వగా తొలి దశలో విజయవాడ, రాజమండ్రిలో ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇక్కడ విజయవంతమైతే రెండో దశలో విశాఖలో ఈ బోట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా బోట్లను యాంఫిబియస్ కార్పొరేషన్ సెప్టెంబర్ 1న గోవాలో ప్రారంభించనుంది. ఆ తర్వాత మన రాష్ట్రంలో వీటిని నడపడానికి ఏర్పాట్లు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement