అమెరికాలో కాల్పులు.. ఒకరి దుర్మరణం | USA: One dead, 21 injured in Super Bowl parade shooting | Sakshi

అమెరికాలో కాల్పులు.. ఒకరి దుర్మరణం

Feb 16 2024 5:40 AM | Updated on Feb 16 2024 5:40 AM

USA: One dead, 21 injured in Super Bowl parade shooting - Sakshi

కాన్సాస్‌ సిటీ: అమెరికాలోని మిస్సౌరీ రాష్ట్రం కాన్సాస్‌ సిటీలో కాల్పులు చోటు చేసుకు న్నాయి.. ఈ ఘటనలో ఒకరు చనిపోగా 8 మంది చిన్నారులు సహా మరో 22 మంది గాయాలపాలయ్యారు. బుధవారం సూపర్‌ బౌల్‌ చాంపియన్‌ షిప్‌ గెలుచుకున్న జట్టు విజయోత్సవాలు జరుపుతున్న వేళ గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు దిగారు.

దీంతో జనమంతా భయంతో కేకలు వేస్తూ తలోదిక్కుకు పరుగులు తీయడంతో అంతా గందరగోళంగా మారింది. కాల్పులకు కారకులుగా అనుమానిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పులకు కారణాలు తెలియాల్సి ఉంది.

మరో ఘటనలో..
రాజధాని వాషింగ్టన్‌లో బుధవారం ఉదయం పోలీసు అధికారులు జంతు హింస కేసులో జూలియస్‌ జేమ్స్‌ అనే వ్యక్తికి వారెంట్లు ఇచ్చేందుకు అతడి ఇంటికి వెళ్లారు. నిందితుడు పారిపోయేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అతడు ఇంట్లో ఉండే  పోలీసులపైకి కాల్పులకు దిగాడు. ఘటనలో ముగ్గురు అధికారులకు గాయాలయ్యాయి. కొన్ని గంటల అనంతరం నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement