shootings
-
బిహార్ గ్యాంగ్ పనేనా?
సాక్షి, హైదరాబాద్ : బీదర్‌లో డబ్బు దోచుకోవడానికి.. పట్టుబడతామనే భయంతో అఫ్జల్‌గంజ్‌లో కాల్పులు జరిపిన దుండగులు బిహార్‌కు చెందిన వారై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిలో ఒకరిని బిహార్‌కు చెందిన పాతనేరగాడు మనీశ్కుష్వాడగా గుర్తించినట్టు తెలిసింది. గురువారం చోటు చేసుకున్న ఈ ఉదంతాల్లో నిందితులను పట్టుకోవడానికి పోలీసులు పది ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపగా, శుక్రవారం తెలంగాణతోపాటు ఛత్తీస్‌గఢ్, బిహార్‌ల్లో గాలిస్తున్నా యి. మరోపక్క కర్ణాటక పోలీసులు నగరానికి చేరుకొని కేసు దర్యాప్తులో పాలుపంచుకున్నారు. ఆటోలో ఎంజీబీఎస్ వైపు నుంచి ..: బీదర్‌లో దుండగులిద్దరూ ‘ఏపీ’రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న బైక్‌పై రూ.93 లక్షలున్న అల్యూమినియం డబ్బా ఎత్తుకొని ఉడాయించారు. అక్కడ నుంచి హైదరాబాద్ వైపు వచ్చి మార్గమధ్యలో ఆ డబ్బును బ్యాగ్‌లోకి మార్చుకున్నారు. తెలంగాణ సరిహద్దు గ్రామమైన సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ గ్రామంలోని ßæనుమాన్ టెంపుల్ వద్ద గల సీసీ ఫుటేజీల్లో దుండగులు కనిపించారు. సుల్తాన్పూర్, డప్పూర్, హత్నూర్, న్యాల్కల్ మీదుగా హైదరాబాద్ వెళ్లారు. అయితే ఆ డబ్బా, బైక్ ఎక్కడ వదిలేశారన్నది ఇంకా తేలలేదు. ఒకరు ఈ పెద్ద బ్యాగ్ పట్టుకొని, మరొకరు బ్యాక్ ప్యాక్ తగిలించుకొని గురువారం సాయంత్రానికి రోషన్ ట్రావెల్స్ వద్దకు వచ్చారు. ఈ ద్వయం ఎంజీబీఎస్ వైపు నుంచి ఆటోలో వచ్చి ట్రావెల్స్ వద్ద దిగినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ ఫోన్ నంబర్ ఇచ్చి... రాయ్‌పూర్ వెళ్లడానికి అమిత్‌కుమార్ పేరుతో రెండు టికెట్లు బుక్ చేసుకున్నారు. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ సెల్‌నంబర్ ఇచ్చారు. బస్సు, సీట్ల నంబర్లు ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయని, సరిచూసుకోవాలని ట్రావెల్స్ నిర్వాహకులు చెప్పారు. దీంతో ఓ దుండగుడు తన ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యిందని, ఇక్కడే ఉండి మీతోనే వచ్చి బస్సు ఎక్కుతామని వారికి చెప్పాడు. ఆ బస్సు ప్రయాణించే మార్గం, మార్గమ«ధ్యలో దాని స్టాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనే వివరాలు ట్రావెల్స్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. మదీనాలో రెండు బ్యాగ్స్ ఖరీదు.... రూ.93 లక్షలతో కూడిన బ్యాగ్‌ను చేత్తో పట్టుకొని మోయడం కష్టంగా ఉండటంతో ట్రాలీ బ్యాగ్ ఖరీదు చేయాలని భావించారు. అవి ఎక్కడ దొరుకుతాయంటూ ట్రావెల్స్ నిర్వాహకులను అడిగారు. మదీనా ప్రాంతంలో దుకాణాలు ఉన్నాయని చెప్పగా, అక్కడకు వెళ్లి రెండు ట్రాలీ బ్యాగ్స్ ఖరీదు చేశారు. మూసీనది సమీపంలో లేదా పబ్లిక్ టాయిలెట్లోకి వెళ్లి పెద్ద బ్యాగ్‌లో ఉన్న నగదును ఓ ట్రాలీలోకి మార్చారు. మరో దాంట్లో కొన్ని వ్రస్తాలతోపాటు హెల్మెట్ పెట్టారు. బ్యాక్ ప్యాక్‌లో మాత్రం తుపాకీ దాచి ఉంచారు. కాల్పులు జరిపింది మినీ బస్సులోనే... రోషన్ ట్రావెల్స్ కార్యాలయం అఫ్జల్‌గంజ్ బస్టాప్‌లోనే ఉంటుంది. అక్కడ మినీ బస్సుల్ని ఆపడానికి అవకాశం ఉండదు. దీంతో తమ ప్రయాణికుల్ని ట్రావెల్స్ బస్సుల వరకు చేర్చే మినీ బస్సుల్ని సమీపంలో ఉన్న మెట్రో ట్రావెల్స్ వద్ద ఆపుతారు. గురువారం సైతం ఇలానే ఆగడంతో..రోషన్ ట్రావెల్స్ నుంచి మిగిలిన ప్రయాణికులు, బీదర్ పోలీసులతో కలిసి ఇద్దరు దుండగులూ ఆ బస్సు ఎక్కారు. బస్సులో ప్రయాణికుల లగేజీ తనిఖీ చేస్తున్న ట్రావెల్స్ ఉద్యోగి జహంగీర్ దుండగుల ఓ ట్రాలీని తెరిచి చూసి హెల్మెట్, వస్త్రాలు గుర్తించారు. రెండోది తెరవడానికి ప్రయత్నిస్తుండగా, అందులో నగదు ఉండటంతో ఓ దుండగుడు తన బ్యాక్ ప్యాక్ నుంచి తుపాకీ బయటకు తీసి ఒక రౌండ్ కాల్చాడు. ఈ శబ్దం విన్న బస్సు డ్రైవర్ తొలుత టైరు పగిలిందని భావించి కిందకు దిగాడు. అదే అదనుగా ఇద్దరు దుండగులూ తమ ట్రాలీలతో సహా కిందకు దిగి ట్రాఫిక్‌కు రాంగ్ సైడ్‌లో నడుచుకుంటూ వెళ్లారు. పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఆటో ఎక్కి... అదే మినీ బస్సులో ఉన్న ఇద్దరు బీదర్ పోలీసు కానిస్టేబుళ్లు వీరిని పట్టుకునే ప్రయత్నం చేసినా ఫలించలేదు. అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ సమీపం వరకు నడుచుకుంటూ వెళ్లిన దుండగులు ఓ ఆటో ఎక్కి ఎంజే మార్కెట్ మీదుగా ఉడాయించారు. ఠాణా సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను బట్టి రాత్రి 7.09 గంటలకు దుండగులు ఆటో ఎక్కారు. దీని ప్రకారం కాల్పులు 7 గంటల ప్రాంతంలో జరిగినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. క్షతగాత్రుడు మినీ బస్సు దగ్గర నుంచి రోషన్ ట్రావెల్స్ వరకు వచ్చి, వారికి విషయం చెప్పి, పోలీసులకు సమాచారం ఇచ్చేసరికి సమయం దాదాపు రాత్రి 7.30 గంటలైంది. సికింద్రాబాద్ మీదుగా పరారీ... దుండగులు ప్రయాణించిన ఆటో ఎంజే మార్కెట్, అబిడ్స్, ట్యాంక్‌బండ్ మీదుగా సికింద్రాబాద్ వరకు వెళ్లినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆటో నంబర్, దాని ద్వారా డ్రైవర్‌ను గుర్తించిన అధికారులు శుక్రవారం సాయంత్రం ప్రశ్నించారు. తాను ఇద్దరినీ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న ఆల్ఫా హోటల్ వరకు తీసుకెళ్లానని చెప్పాడు. దీంతో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రైలులో ఛత్తీస్‌గఢ్ లేదా బిహార్‌కు పారిపోయి ఉంటారని భావిస్తున్నారు. -
శ్రీలంకవైపు ఇండియన్ సినిమా చూపు
శ్రీలంక అడవుల్లో రిస్కీ ఫైట్స్ తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి విజయ్ దేవరకొండ ఇటీవల శ్రీలంక వెళ్లొచ్చారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఆ మధ్య శ్రీలంకలో జరిగింది. అక్కడ ఓ భారీ రిస్కీ ఫైట్‌ని చిత్రీకరించారని సమాచారం. అటు బాలీవుడ్ వైపు వెళితే... అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో ప్రియదర్శన్ దర్శకత్వంలో రానున్న హారర్ కామెడీ చిత్రంలోని కీలక సన్నివేశాలను శ్రీలంకలో చిత్రీకరిస్తున్నారు. ఇవి కాకుండా కొన్ని దక్షిణాసియా చిత్రాలు కూడా లంకలో షూటింగ్స్ జరుపుకుంటున్నాయి.లంకలో ప్యారడైజ్మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై ప్రముఖ దర్శకుడు మణిరత్నం సమర్పణలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘ప్యారడైజ్’ను పూర్తిగా శ్రీలంకలోనే చిత్రీకరించారు. మలయాళ నటుడు రోషన్ మ్యాథ్యూ ఇందులో హీరోగా నటిస్తే ప్రముఖ శ్రీలంక దర్శకుడు ప్రసన్న వితనకే డైరెక్ట్ చేశారు. ఇక మమ్ముట్టి, మోహన్ లాల్ కాంబినేషన్ లో త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న మలయాళం మూవీని 30 రోజుల పాటు శ్రీలంకలోనే షూట్ చేయనున్నురు. ఈ చిత్రానికి లంక ప్రభుత్వం ఎంతటిప్రాధాన్యత ఇచ్చిందంటే నిర్మాత, దర్శకుడితో ఆ దేశ ప్రధానమంత్రి నినేష్ గుణవర్దెన నేరుగా చర్చలు జరిపారు. ఇక ఫ్యూచర్ప్రాజెక్ట్స్కు షూటింగ్ లొకేషన్ గా శ్రీలంకను ఎంచుకోవాలని మలయాళ ఫిల్మ్ ప్రోడ్యూసర్స్ అసోసియేషన్ భావిస్తోంది.ఇండియన్ సినిమాకి రెడ్ కార్పెట్ఒకప్పుడు శ్రీలంకలో సినిమా షూటింగ్స్ వ్యవహారం ఓ ప్రహసనంలా సాగేది. దేశ, విదేశీ సినిమాల షూటింగ్స్ అనుమతుల కోసం 41 ప్రభుత్వ విభాగాలను సంప్రదించాల్సి వచ్చేది. దీంతో భారత్‌తో పాటు ఇతర దేశాల చిత్ర నిర్మాతలు లంక లొకేషన్స్ కు దూరమవుతూ వచ్చారు. దీనికి తోడు 2022 నాటి ఆర్థిక సంక్షోభం ఆ దేశాన్ని రోడ్డున పడేసింది. అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో దేశాన్ని పునర్నిర్మించడం ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది. అప్పటివరకు టూరిస్ట్ డెస్టినేషన్ గా ఉన్న శ్రీలంకకు పర్యాటకులు రావడం కూడా తగ్గిపోయింది.దేశాన్ని గాడిలో పెట్టేందుకు ఎన్నో మార్గాలు అన్వేషించిన లంక పాలకులకు భారతీయ సినీ రంగుల ప్రపంచం జీవనాడిలా కనిపించింది. మళ్లీ పర్యాటకులను ఆకర్షించడంతో పాటు సినిమా షూటింగ్స్‌తో దేశాన్ని కళకళలాడేలా చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. సినిమా షూటింగ్స్ కోసం తమ దేశంలో అడుగుపెట్టే ఎవరికైనా సింగిల్ విండో ద్వారా అనుమతులు మంజూరు చేసే విధానాన్నిప్రారంభించింది. ముఖ్యంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రాలకు సంబంధించిన షూటింగ్స్ కోసం అనుమతులను వేగవంతం చేసింది. భారతీయ సినీ ప్రముఖులకు అక్కడి టూరిజం ప్రమోషన్ బ్యూరో రెడ్ కార్పెట్ పరిచింది. దీంతో ఇండియన్ మూవీ షూటింగ్స్‌కు శ్రీలంక కేరాఫ్ అడ్రెస్‌గా మారిపోయిందిఆర్థిక అస్త్రంగా...ఫిల్మ్ టూరిజాన్ని లంక ప్రభుత్వం ఆర్థిక అస్త్రంగా ఎంచుకోవడం వెనక మరో కారణం కూడా ఉంది. ఇండియన్ మూవీస్ అంటే సింహళీయుల్లో విపరీతమైన క్రేజ్. బాలీవుడ్‌తో పాటు ఇతర భారతీయ చిత్రాలు లంక థియేటర్స్‌లో నిత్యం స్క్రీనింగ్ అవుతాయి. షూటింగ్స్ కోసం భారతీయ సినీ ప్రముఖులు లంక బాటపడితే దేశ పర్యాటక రంగానికి కూడా కొత్త ఊపు వస్తుంది. విదేశీ మారక ద్రవ్యం కూడా పెరుగుతుంది. లంక ప్రభుత్వం వేసుకున్న ప్రణాళికకు తగ్గట్టుగానే షూటింగ్స్ కోసం ఇండియన్ డైరెక్టర్స్,ప్రోడ్యూసర్స్ లంక వైపు చూస్తున్నారు. ఆ దేశం కల్పించే ప్రత్యేక సదుపాయాలను ఉపయోగించుకుంటూ అందమైన లంక లొకేషన్స్ ను షూటింగ్ స్పాట్స్‌గా మార్చేశారు. ఒక రకంగా లంక ఎకానమీకి భారతీయ చిత్ర పరిశ్రమ వెన్నెముకగా మారిపోయింది. – ఫణికుమార్ అనంతోజు శ్రీలంక పిలుస్తోంది.... రారమ్మంటోంది.... అందుకే ఈ మధ్య కాలంలో ఇండియన్ ఫిల్మ్స్ శ్రీలంకకు క్యూ కడుతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్... ఇలా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ శ్రీలంక వైపు చూస్తోంది. సినిమా షూటింగ్స్ కోసం ఏకంగా శ్రీలంక ప్రధానమంత్రితో కూడా భారతీయ సినీ నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. ఒకప్పుడు విదేశాల్లో షూటింగ్స్ అంటే అమెరికాతో పాటు యూరప్ దేశాల పేర్లు ఎక్కువగా వినిపించేవి. కానీ ఇప్పుడు ఇండియన్ సినిమా రూటు మార్చింది. ఆ విశేషాల్లోకి...పచ్చందనమే... పచ్చందమనే పచ్చదనమే అన్నట్లు... శ్రీలంక గ్రీనరీతో అందంగా ఉంటుంది. పాటల చిత్రీకరణకు బెస్ట్ ప్లేస్. ఫైట్లు తీయడానికి దట్టమైన అడవులు ఉండనే ఉన్నాయి. అలాగే అబ్బురపరిచే చారిత్రక కట్టడాలూ, కనువిందు చేసే సముద్ర తీరం ఉన్నాయి. వీటికి తోడు భారతీయులకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుబంధం ఉండటంతో ఇండియన్ ఫిల్మ్ మేకర్స్‌ను తమ దేశంవైపు తిప్పుకుంటోంది లంక సర్కార్. శ్రీలంకలో గతంలోనూ షూటింగ్స్ జరిగాయి. అక్కడ షూట్ చేయడం కొత్త కాకపోయినా ఆ దేశం భారతీయ చిత్ర నిర్మాణాలకు ఇప్పుడు సింగిల్ డెస్టినేషన్ గా మారిపోయిందని అనొచ్చు. 2022 నాటి ఆర్థిక సంక్షోభం నుంచి ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేకపోతున్న శ్రీలంక గతంలో ఎప్పుడూ లేని విధంగా ఫిల్మ్ టూరిజాన్ని ్రపోత్సహిస్తూ తమ దేశ ఎకానమీకి ఊతమిచ్చే ప్రయత్నాలు చేస్తోంది. -
మాస్కోలో మారణహోమం
మాస్కో/న్యూఢిల్లీ: రష్యా రాజధాని మాస్కోలో క్రాకస్ సిటీ హాల్లో చోటుచేసుకున్న మారణహోమంలో మృతుల సంఖ్య శనివారం 133కు పెరిగింది. శుక్రవారం అర్ధరాత్రి సంగీత కచేరి జరుగుతుండగా ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకోవడం తెలిసిందే. ఈ దారుణంలో 120 మందికి పైగా గాయపడ్డారు. వారిలో చాలామంది తీవ్ర గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నలుగురు దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ వెల్లడించింది. వారిని పారిపోతుండగా పశి్చమ రష్యాలోని బ్రియాన్‌స్‌్కలో ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలోనే బంధించినట్లు తెలిపింది. సరిహద్దు దాటి ఉక్రెయిన్ చేరాలన్న పన్నాగాన్ని భగ్నం చేసినట్లు స్పష్టం చేసింది. ఈ దాడికి పాల్పడింది తామేనని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్(ఖోరసాన్) ప్రకటించిన సంగతి తెలిసిందే. రష్యా అధికారులు మాత్రం ఇది ముమ్మాటికీ ఉక్రెయిన్ ముష్కరుల పనేనని ఆరోపిస్తున్నారు. కాల్పులకు తెగబడింది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులేనని అమెరికా నిఘా వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. తాజా పరిణామాలపై రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ చీఫ్ శనివారం రష్యా అధినేత పుతిన్‌తో సమావేశమయ్యారు. అనుమానితుల అరెస్టు తదితరాల గురించి తెలియజేశారు. రష్యాలో ఇటీవల జరిగిన జాతీయ ఎన్నికల్లో పుతిన్ మరోసారి ఘన విజయం సాధించి ఆరేళ్లపాటు అధికారం దక్కించుకున్నారు. కొన్ని రోజులకే మాస్కోలో భీకర దాడి జరగడం, 133 మంది మరణించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయంగా మారింది. మోదీ దిగ్భ్రాంతి మాస్కో ఘోరకలిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ అమానుష దాడిని భారత్ ఖండిస్తోందని పేర్కొన్నారు. విపత్కర సమయంలో రష్యా ప్రజలకు అండగా ఉంటామంటూ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఉక్రెయిన్‌కు సంబంధం ఉంది: పుతిన్ కాల్పుల ఘటనతో ఉక్రెయిన్‌కు సంబంధం ఉందని పుతిన్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా భద్రతను పటిష్టం చేసినట్లు తెలిపారు. పట్టుబడిన దుండుగుల్లో నలుగురు వ్యక్తులు ఈ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని చెప్పారు. కాల్పుల తర్వాత వారు ఉక్రెయిన్‌కు పారిపోయేందుకు ప్రయతి్నంచారని అన్నారు. మా పని కాదు: ఉక్రెయిన్ రష్యా కాల్పులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సలహాదారుడైన మైఖైలో పొదొలాయిక్ స్పందించారు. మాస్కో మారణహోమంతో తమకు సంబంధం లేదని తేలి్చచెప్పారు. ఉగ్రవాద పద్ధతులను పాటించే అలవాటు ఉక్రెయిన్‌కు లేదన్నారు. పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చేశారు ► కాల్పులు జరిగిన క్రాకస్ సిటీ హాల్ చాలా విశాలమైన కాంప్లెక్స్. ఇందులో మ్యూజిక్ హాల్‌తోపాటు షాపింగ్ సెంటర్ ఉంది. ► శుక్రవారం రాత్రి సంగీత కచేరి ప్రారంభం కావడానికి ముందు జనం సీట్లలో కూర్చున్నారు. మొత్తం 6,200 సీట్లూ నిండిపోయాయి. ► సంగీత కార్యక్రమం ప్రారంభం కాకముందే కాల్పుల మోత మొదలైనట్లు వీడియో ఫుటేజీని బట్టి తెలుస్తోంది. ► సైనిక దుస్తుల్లో వచి్చన ముష్కరులు అటోమేటిక్ రైఫిళ్లతో విరుచుకుపడ్డారు. ఉన్మాదుల్లాగా చెలరేగిపోయారు. జనంపై పాయింట్ బ్లాంక్ రేంజ్లో గురిపెట్టి కాల్పులు జరిపారు. తూటా నుంచి రక్షణ కోసం పలువురు సీట్ల వెనుక దాక్కున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ► అరుపులు కేకలతో గందరగోళం నెలకొంది. చాలామంది బయటకు పరుగులు తీసేందుకు ప్రయతి్నంచారు. తొక్కిసలాట జరిగింది. హాల్ కిక్కిరిసి ఉండడంతో తప్పించుకునే వీల్లేకుండా పోయింది. మృతుల సంఖ్య భారీగా పెరిగింది. లోపలంతా పొగ అలుముకుంది. ► ముష్కరులు గ్రెనేడ్లు, బాంబులు కూడా వేసినట్టు రష్యా మీడియా వెల్లడించింది. కాల్పులు, పేలుళ్ల ధాటికి హాల్లో మంటలు రేగాయి. పైకప్పు కూలిపోయింది. అగి్నమాపక సిబ్బంది గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. క్రాకస్ సిటీ హాల్లో కాల్పులు జరుపుతున్న దుండగులు -
అమెరికాలో కాల్పులు.. ఒకరి దుర్మరణం
కాన్సాస్ సిటీ: అమెరికాలోని మిస్సౌరీ రాష్ట్రం కాన్సాస్ సిటీలో కాల్పులు చోటు చేసుకు న్నాయి.. ఈ ఘటనలో ఒకరు చనిపోగా 8 మంది చిన్నారులు సహా మరో 22 మంది గాయాలపాలయ్యారు. బుధవారం సూపర్ బౌల్ చాంపియన్ షిప్ గెలుచుకున్న జట్టు విజయోత్సవాలు జరుపుతున్న వేళ గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు దిగారు. దీంతో జనమంతా భయంతో కేకలు వేస్తూ తలోదిక్కుకు పరుగులు తీయడంతో అంతా గందరగోళంగా మారింది. కాల్పులకు కారకులుగా అనుమానిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పులకు కారణాలు తెలియాల్సి ఉంది. మరో ఘటనలో.. రాజధాని వాషింగ్టన్లో బుధవారం ఉదయం పోలీసు అధికారులు జంతు హింస కేసులో జూలియస్ జేమ్స్ అనే వ్యక్తికి వారెంట్లు ఇచ్చేందుకు అతడి ఇంటికి వెళ్లారు. నిందితుడు పారిపోయేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అతడు ఇంట్లో ఉండే పోలీసులపైకి కాల్పులకు దిగాడు. ఘటనలో ముగ్గురు అధికారులకు గాయాలయ్యాయి. కొన్ని గంటల అనంతరం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
బందీలపై కాల్పులు!
రఫా(గాజా స్ట్రిప్): కదనరంగంలో తమను దీటుగా ఎదిరించే సత్తా హమాస్ సాయుధులకు లేదని అతివిశ్వాసంతో ఉన్న ఇజ్రాయెల్ సేనలు జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో ముగ్గురు అమాయక బందీలు బలైపోయారు. హమాస్ మిలిటెంట్లుగా భావించి వారిని హతమార్చామని ఇజ్రాయెల్ సైన్యం తర్వాత తీరిగ్గా చెప్పింది. ఉత్తరగాజాలోని షెజాయా పట్టణంలో హమాస్ మిలిటెంట్లుగా భావించి వారిపై కాల్పులు జరిపామని ఇజ్రాయెల్ సైన్యం(ఐడీఎఫ్) అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ చెప్పారు. దాడి వివరాలను మరో ఉన్నతాధికారి వెల్లడించారు. ‘ ఇజ్రాయెల్ దాడికి భయపడి ఈ ముగ్గురినీ బంధించిన హమాస్ మిలిటెంట్లు అక్కడి నుంచి పారిపోయారు. దీంతో ఈ ముగ్గురు బందీలు చొక్కాలు విప్పేసి తెల్ల జెండాలు ఊపుతూ భవనం బయటకు వచ్చారు. అయినాసరే సైన్యం వీరిపైకి తుపాకీ గుళ్ల వర్షం కురిపించింది. దీంతో ఇద్దరు మరణించారు. మూడో వ్యక్తి ప్రాణభయంతో మళ్లీ భవంతిలోపలికి ఏడుస్తూ పరుగెత్తాడు. అయినాసరే సైన్యం కాల్పులు జరపడంతో అతనూ మరణించాడు’’ అని సైన్యాధికారి ఒకరు వెల్లడించారు. ఈ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని ఇజ్రాయెల్‌కు చెందిన యోటమ్ హైమ్(28), సమీర్ తలాల్కా(22), అలోన్ షామ్రిజ్(26)గా గుర్తించారు. ఈ ఘటనపై దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. -
Israeli-Palestinian Conflict: రంగంలోకి లెబనాన్ హెజ్బుల్లా మిలిటెంట్లు
టెల్ అవివ్: ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలోకి లెబనాన్‌కు చెందిన హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ కూడా అడుగుపెట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం దక్షిణ ఇజ్రాయెల్ వీధుల్లో ఇజ్రాయెల్ సైనికులు, హమాస్ తీవ్రవాదుల మధ్య పరస్పరం కాల్పులు జరిగాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజాలోని పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ఉత్తర ఇజ్రాయెల్‌లో హెజ్బుల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్ జవాన్లతో ఘర్షణకు దిగారు. ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. దీనివల్ల ఇజ్రాయెల్–లెబనాన్ సరిహద్దుల్లో అవాంఛనీయ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇజ్రాయెల్‌కు బద్ధ శత్రువులైన హెజ్బుల్లా మిలిటెంట్లకు ఇరాన్ అండగా నిలుస్తోంది. ఆయుధ, ఆర్థిక సాయం అందిస్తోంది. హెజ్బుల్లా వద్ద వేలాది రాకెట్లు, ఆయుధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్–లెబనాన్ సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతాల్లో హెజ్బుల్లా మిలిటెంట్లు మకాం వేశారు. ఆదివారం ఒక్కడి నుంచి మూడు ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై పదుల సంఖ్యలో రాకెట్లు ప్రయోగించారు.ప్రతిగా ఇజ్రాయెల్ సాయుధ డ్రోన్లు ప్రయోగించింది. దీంతో లెబనాన్ వైపు ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. ఉత్తర సరిహద్దులో ప్రస్తుతం సాధారణ పరిస్థితులుండగా దక్షిణ ప్రాంతంలో పోరాటం కొనసాగుతోందని ఇజ్రాయెల్ పేర్కొంది. -
మాలిలో దుండగుల కాల్పులు
బమాకో: పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో గుర్తుతెలియని దుండగుల కాల్పుల్లో 21 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్ మాలిలోని మోప్తీ ప్రాంతంలో తాజాగా ఈ ఘోరం చోటుచేసుకుంది. బందీయాగార పట్టణం సమీపంలోని యారౌ అనే ఓ గ్రామంపై దుండగులు విరుచుకుపడ్డారని, జనంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ కాల్పుల్లో 21 మంది ప్రజలు చనిపోయారని, మరో 30 మందికిపైగా గాయపడ్డారని తెలియజేసింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు సమాచారం. కాల్పులకు గల కారణాలు తెలియరాలేదు. మాలిలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలైన అల్‌ఖైదా, ఐసిస్ చురుగ్గా పనిచేస్తున్నాయి. ఉగ్రముఠాల అండతో తిరుగుబాటుదారులు కొన్ని భూభాగాలను ఆక్రమించారు. -
సమ్మర్లో ఫారిన్ షూటింగ్ అంటున్న స్టార్ హీరోలు
సమ్మర్లో కూల్‌గా ఉండే లొకేషన్స్‌ని ఎంచుకుని, వెకేషన్‌కి వెళుతుంటారు కొందరు స్టార్స్. కొందరిని షూటింగే చల్లని ప్రాంతాలకు తీసుకెళుతుంది. అలా ‘కేరాఫ్ ఫారిన్’ అంటూ షూటింగ్స్‌కి, వెకేషన్‌కి విదేశాలు వెళ్లిన స్టార్స్ గురించి తెలుసుకుందాం. ► రెండు వారాలుగా ఫారిన్లోనే ఉంటున్నారు ఇండియన్. హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ‘ఇండియన్’ (‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల తైవాన్‌లో జరిగిన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం సౌతాఫ్రికాలో జరుగుతోంది. కమల్‌పై ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారు శంకర్. ఈ వారం కూడా ‘ఇండియన్ 2’ టీమ్ సౌతాఫ్రికాలోనే ఉంటుందని తెలిసింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్ సింగ్, బాబీ సింహా కీలక పాత్రలు చేస్తున్నారు. ► ఇటలీలో ఫైట్స్ చేశారు ప్రభాస్. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగ ‘సలార్’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ గత నెలలో ఇటలీ లొకేషన్స్‌లో జరిగింది. ముఖ్యంగా ప్రభాస్‌పై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. కాగా ‘సలార్’ సినిమా యూనిట్ మరోసారి ఫారిన్ వెళ్లనుందని సమాచారం. బుడాపెస్ట్ లొకేషన్స్‌లో ‘సలార్’ షూటింగ్‌ను ప్లాన్ చేశారు. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ‘సలార్’ చిత్రం సెప్టెంబరు 28న విడుదల కానుంది. ఇదిలా ఉంటే... ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ‘రాజా డీలక్స్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రీకరణలో ప్రభాస్ పాల్గొంటున్నారని తెలిసింది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి కాగానే ‘సలార్’ కోసం ప్రభాస్ ఫారిన్ ఫ్లైట్ ఎక్కుతారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ► లండన్‌లో ప్రేమ పాఠాలు నేర్చుకుంటున్నారు శర్వానంద్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్, కృతీ శెట్టి జంటగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల లండన్‌లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతోంది. గత వారం శర్వానంద్, కృతీపై కీలక సన్నివేశాలు, ఓ పాట చిత్రీకరించారు. ► బాలీవుడ్ ‘బడే మియా చోటే మియా’ లండన్‌కు షిఫ్ట్ అయ్యారు. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలోరూపొందుతున్న సినిమా ‘బడే మియా చోటే మియా’. ఇటీవల ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను స్కాట్లాండ్లో చిత్రీకరించారు. అట్నుంచి అటు లండన్ వెళ్లారు. మరో పది రోజులపాటు లండన్ షెడ్యూల్ జరుగుతుందట. అలాగే మరో బాలీవుడ్ మూవీ ‘యానిమల్’ షూటింగ్ కూడా లండన్‌లో జరిగింది. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్.ఈ చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాలు ఫారిన్ లొకేషన్స్‌లో షూటింగ్స్‌ను ప్లాన్ చేశాయి. -
అలాంటి చిత్రాలకు అవార్డ్స్ ఇస్తే బాగుంటుంది: విజయేంద్ర ప్రసాద్
గత కొంతకాలంగా ఆపేసిన నంది అవార్డులను ఇచ్చి సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్ అన్నారు. అవార్డులు ఇవ్వడం ద్వారా తెలంగాణ పర్యాటకంగానూ అభివృద్ధి చెందుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సహకారంతో ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్’ ఆధ్వర్యంలో టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా- 2023 వేడుకలు దుబాయ్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన విజయేంద్రప్రసాద్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలోనే `ఆర్ఆర్ఆర్` సినిమాటోగ్రాఫర్ కె.కె సెంథిల్ కుమార్‌ను ఘనంగా సన్మానించారు. విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ..' గత కొన్నేళ్లుగా ఆగిపోయిన నంది అవార్డ్స్‌ను ప్రభుత్వ సహకారంతో ఇవ్వడం సంతోషకరం. అయితే తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తీసే చిత్రాలకు స్పెషల్‌గా నంది అవార్డులు కేటాయిస్తే బాగుంటుందని నా ఆలోచన. అలాగే తెలంగాణలో అద్భుతమైన టూరిజం స్పాట్స్ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకుని 90 శాతం ఇక్కడే షూటింగ్ చేసే సినిమాలకు నంది అవార్డ్స్‌తో పాటు నగదు ప్రోత్సాహకాలిస్తే తెలంగాణలో టూరిజం పెరిగే అవకాశం ఉంటుంది.' అని అన్నారు. టీయస్‌ఐఐసీ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు మాట్లాడుతూ...' ప్రతాని రామకృష్ణ ఇస్తోన్న అవార్డ్స్‌కు ప్రభుత్వం తరఫు నుంచి కచ్చితంగా మంచి సపోర్ట్ ఉంటుంది. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. విజయేంద్రప్రసాద్ చెప్పిన విషయాన్ని కచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.' అని అన్నారు. ఈ కార్యక్రమంంలో ప్రసన్న కుమార్, కెయల్ఎన్ ప్రసాద్, శంకర్ గౌడ్, అశోక్ గౌడ్, వంశీ , శ్రీశైలం , నటి శుభశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రేణూ దేశాయ్
కొన్నేళ్లుగా గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వెల్లడించారు నటి–దర్శకురాలు రేణూ దేశాయ్. తన అనారోగ్యం గురించి రేణు ఓ పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘నా అనారోగ్య సమస్యల గురించి నా సన్నిహితులకు తెలుసు. కానీ ఇప్పుడు నేనే అందరికీ చెప్పాలనుకున్నాను. ఎందుకంటే నాలాగే వివిధ రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న వారు ధైర్యంగా ఉండాలని చెప్పడం కోసం... వారిలో జీవితం పట్ల సానుకూలమైన ఆలోచనలను రేకెత్తించడం కోసం. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనలోని ధైర్యాన్ని, జీవితం పట్ల ఆశను కోల్పోకూడదు. ఎందుకంటే మన కోసం ఎన్నో స్వీట్ సర్ప్రైజెస్ను కాలంప్లా న్ చేసి ఉండొచ్చు’’ అన్నారు రేణు. ప్రస్తుతం చికిత్స చేయించుకుంటున్నానని, త్వరలోనే కోలుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతూ, సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటాననే నమ్మకం ఉందని రేణుదేశాయ్ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
ఆద్య ఆన్ సెట్
‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ సినిమాల సక్సెస్ జోష్‌తో రెట్టింపు ఉత్సాహంతో వర్క్ చేస్తున్నారు హీరోయిన్ శ్రుతీహాసన్. ఇటీవలే ఇంగ్లిష్ ఫిల్మ్ ‘ది ఐ’ షూటింగ్‌ను దాదాపు పూర్తి చేసిన ఈ బ్యూటీ తాజాగా ‘సలార్’ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ‘‘నాకు ఎంతో ఇష్టమైన ‘సలార్’ సెట్స్‌లో ఉన్నాను. మంచి యూనిట్‌తో, మంచి మనుషులతో వర్క్ చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను’’ అని శ్రుతీహాసన్ పేర్కొన్నారు. ప్రభాస్ హీరోగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ రూపొందుతోంది. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఆద్య పాత్రలో కనిపిస్తారు శ్రుతి. ప్రస్తుతం ప్రభాస్, శ్రుతీలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ చిత్రం సెప్టెంబరు 28న విడుదల కానుంది. కాగా ‘సలార్’ రెండు భాగాలుగా రిలీజ్ కానుందనే టాక్ వినిపిస్తోంది. -
కళాతపస్వికి నివాళులు.. షూటింగ్స్ బంద్ చేస్తూ నిర్ణయం
కళాతపస్వీ కె. విశ్వనాథ్ మరణంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన ఇక లేరన్న వార్త తెలిసి చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. గొప్ప దర్శకుడిగానే కాకుండా ఇండస్ట్రీ ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయిందంటూ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ను కడసారి చూసేందుకు సినీ ప్రముఖులంతా కదిలి వస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కె.విశ్వనాథ్ నివాసానికి చేరుకొని ఆయన పార్థీవదేహానికి నివాళులు అర్పిస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. కె. విశ్వనాథ్ మృతి నేపథ్యంలో సినీ పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన మరణానికి నివాళిగా సినిమా నేడు జరగనున్న అన్ని షూటింగులు బంద్ చేస్తున్నట్లు తెలిపింది. స్వచ్చందంగానే షూటింగులను నిలిపివేసినట్లు తెలిపింది. -
ప్రొడ్యూసర్స్ గిల్డ్ కీలక నిర్ణయం, షూటింగ్స్ పున:ప్రారంభంపై ప్రకటన
‘‘చిత్రపరిశ్రమలోని సమస్యలు పరిష్కరించడానికి షూటింగ్స్ నిలిపివేసినప్పటి నుంచి పలు సమావేశాలు ఏర్పాటు చేసి, చర్చించాం. ఇందులో భాగంగా అందర్నీ సమన్వయ పరచడానికి ఎగ్జిబిటర్స్, నిర్మాతలు, డిస్టిబ్యూటర్స్‌తో పాటు 24 క్రాఫ్ట్స్‌కు చెందిన యూనియన్స్, కౌన్సిల్స్‌తో చర్చించాం. సెప్టెంబర్ 1నుంచి యథావిధిగా షూటింగ్స్ చేసుకోవచ్చనే నిర్ణయానికి వచ్చాం’’ అని ‘దిల్’ రాజు అన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆగస్ట్ 1నుంచి షూటింగ్‌లు నిలిపివేసిన విషయం విదితమే. సెప్టెంబర్ 1నుంచి షూటింగ్స్ పునః ప్రారంభించుకోవచ్చని మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మాతలు వెల్లడించారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘తెలుగు రాష్ట్రాల్లో 1800 థియేటర్లు ఉన్నాయి. వీపీఎఫ్ చార్జీల విషయంలో క్యూబ్, యూఎఫ్‌ఓలతో సంప్రదించి, అగ్రిమెంట్ విధానంలో నిర్ణయాలను తీసుకున్నాం. అలాగే టికెట్స్, తినుబండారాలు వంటివాటి ధరలు ప్రేక్షకులకు అందుబాటులో ఉంటాయి. పెద్ద సినిమాలకు బడ్జెట్ బట్టి టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటు ఉంటుంది. మరికొన్ని క్రాఫ్ట్స్‌తో చర్చించి ఈ నెల 30న పూర్తి విషయాలను వెల్లడిస్తాం’’ అన్నారు. సి. కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘ముందుగా షూటింగ్స్ ప్రారంభించాలనుకునేవారు ఫిల్మ్ చాంబర్‌ను సంప్రదిస్తే ఈ నెల 25 నుంచి అనుమతులు ఇస్తాం’’ అన్నారు. -
టాలీవుడ్లో షూటింగులు తిరిగి ప్రారంభం?
టాలీవుడ్లో త్వరలోనే షూటింగులు పునఃప్రారంభం కానున్నాయి. నేడు (గురువారం)ఫిల్మ్ ఛాంబర్ కీలక ప్రెస్‌మీట్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ఇండస్ట్రీలో ప్రస్తుతం నిలిచిపోయిన షూటింగులు తిరిగి ప్రారంభించడంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం టాలీవుడ్లో వరుసగా మూడు సినిమాలు హిట్ కావడం, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుండటంతో మళ్లీ షూటింగులు ప్రారంభించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈనెల 22 నుంచే షూటింగులు ప్రారంభం కానున్నట్లు సమాచారం. కాగా సినిమాలకు అవుతున్న అధిక బడ్జెట్,ఓటీటీ విడుదల సహా ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యల కారణంగా ఆగస్ట్1 నుంచి షూటింగ్స్‌ను ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాయిదా వేసిన సంగితి తెలిసిందే. -
రేపటి నుంచి తెలుగు సినిమా షూటింగ్ లు బంద్
-
షూటింగ్లో ప్రమాదాలు.. అయినా ‘తగ్గేదే లే’ అంటున్న హీరోలు
స్క్రీన్‌పై హీరో రిస్కీ ఫైట్స్ చేస్తుంటే ఫ్యాన్స్‌కి ఫీస్ట్. అందుకే ఫ్యాన్స్ కోసం కూడా హీరోలు రిస్కులు తీసుకుంటుంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి ప్రమాదాలు జరుగుతుంటాయి. అలా ఈ మధ్య షూటింగ్లో గాయపడిన హీరోలు కొందరు ఉన్నారు. డాక్టర్ విశ్రాంతి తీసుకోమన్నా ‘తగ్గేదే లే’ అంటూ షూటింగ్‌కి హాజరు అయ్యారు. ఆ హీరోల గురించి తెలుసుకుందాం. మనుషులకు దొరక్కుండా జాగ్రత్తగా జారుకునే పనిలో ఉన్నారు రవితేజ. ఎత్తయిన మేడల మీద నుంచి దూకడం, ఎత్తుపల్లాలు ఉన్న రోడ్డు మీద పరిగెత్తడం, అడ్డం వచ్చినవారిని ఇరగ్గొట్టడం... ఇదే పని. ఇదంతా ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా కోసమే. వంశీ దర్శకత్వంలో స్టూవర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో నాగేశ్వరరావు పాత్రను రవితేజ చేస్తున్నారు. దొంగ పాత్ర కాబట్టి సినిమాలో యాక్షన్ పార్ట్ ఎక్కువ. ఓ రిస్కీ ఫైట్ తీస్తున్నప్పుడు రవితేజ గాయాలపాలయ్యారు. ఫలితంగా పది కుట్లు వరకూ పడ్డాయి. అయినా రెస్ట్ తీసుకోకుండా రవితేజ షూటింగ్లో పాల్గొన్నారు. ఇక రవితేజలానే గోపీచంద్ కూడా తన తాజా చిత్రం షూటింగ్లో గాయపడ్డారు. ఈ మూవీ కోసం మైసూర్లో ఓ టెంపుల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లో గోపీచంద్ పాల్గొన్నప్పుడు కాలుజారి ఎత్తయిన ప్రదేశం నుంచి జారిపడ్డారు. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్లో ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఎంత రిస్కీ ఫైట్‌ని అయినా డూప్ లేకుండా చేస్తుంటారు హీరో విశాల్. ఇప్పటికే పలు చిత్రాల షూటింగ్స్‌లో ఆయన గాయపడ్డారు. తాజాగా ‘లాఠీ’ సినిమా షూటింగ్ సెట్లో ఒక్కసారి కాదు.. పలుమార్లు ప్రమాదం బారినపడ్డారు. ఈ చిత్రంలో విశాల్‌ది పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. ఫైట్స్ కూడా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ఈ ఒక్క సినిమా సెట్లోనే ఎక్కువసార్లు గాయపడినా షూటింగ్‌కి బ్రేక్ ఇవ్వకుండా చేస్తున్నారు విశాల్. మరోవైపు ‘కార్తికేయ 2’ కోసం యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు హీరో నిఖిల్ గాయపడ్డారు. ఈ ప్రమాదంలో చీలమండ బెణకడంతో డాక్టర్లు కొన్ని రోజులు విశ్రాంతి కూడా సూచించారు. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటించిన ‘కార్తికేయ’ (2014)కి సీక్వెల్‌గా ‘కార్తికేయ 2’ రూపొందుతోంది. చందూనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇంకా సెట్స్‌లో ఉన్న కొన్ని చిత్రాల షూటింగ్స్‌లో గాయపడిన హీరోలు ఉన్నారు. పెయిన్ కిల్లర్‌తో... బాలీవుడ్లో ఆమిర్ ఖాన్ని ‘మిస్టర్ పర్ఫెక్షనిస్ట్’ అంటారు. పాత్ర ఎలా డిమాండ్ చేస్తే ఫిజిక్‌ని అలా మార్చేస్తుంటారు ఆమిర్. అందుకు ఒక ఉదాహరణ ‘దంగల్’. ఇక 57ఏళ్ల వయసులోనూ ఆయన రిస్క్ తీసుకున్న తాజా చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’. ఈ చిత్రం షూటింగ్లో లాంగ్ రన్ చేసే చేజింగ్ సీన్ ఒకటి ఉంది. ఆ సీన్ చేస్తున్నప్పుడు ఆమిర్ కాలికి గాయమైంది. ఫిజియోథెరపీ చేయించుకోవాల్సిన పరిస్థితిలో పెయిన్ కిల్లర్లు తీసుకుని, బ్రేక్ తీసుకోకుండా షూటింగ్ చేశారు ఆమిర్ ఖాన్. -
అక్కడ సినిమా తీస్తే.. బంపర్ హిట్టే..
వేకువనే నిదుర లేపుతున్న పక్షుల కిలకిల రావాలు.. మంచుపరదాల ముసుగుల్లో మసక కాంతులు.. తల్లి పాల కోసం లేగ దూడల అరుపులు.. పచ్చని పంట పొలాలు.. కొబ్బరి తోటలు.. కార్మికుల శ్రమ జీవన సౌందర్యం.. బంధాలను పెనవేసుకున్న మండువా లోగిళ్లు.. హృదయాన్ని హత్తుకుని ఊయలలూపే ఇటువంటి సౌందర్యాన్ని చూడాలంటే పల్లెల్లోకి.. అందునా కోనసీమ పల్లెల్లోకి అడుగు పెట్టాల్సిందే. ఎంతటి వారైనా అక్కడ అడుగు పెట్టగానే బాహ్య ప్రపంచాన్ని మరచిపోవాల్సిందే.. ఆ పల్లె వాతావరణానికి మంత్రముగ్ధులవ్వాల్సిందే. అల్లవరం మండలంలోని కోడూరుపాడు, గూడాల అటువంటి పల్లెలే. గూడాలలో పోలిశెట్టి భాస్కరరావు మండువా లోగిలి ముందు శతమానంభవతి చిత్రం తారాగణం సాక్షి, అల్లవరం (తూర్పుగోదావరి): కోడూరుపాడు, గూడాల గ్రామాలకు.. తెలుగు సినీ రంగానికి అవినాభావ సంబంధం ఉంది. 1962 నుంచి అనేక సినిమాలు ఈ రెండు గ్రామాల నుంచి తెరకెక్కాయి. ఇక్కడ తీసిన సినిమాలు బంపర్ హిట్టు అవుతాయనే సెంటిమెంట్ బలంగా ఉంది. కోడూరుపాడు, గూడాల గ్రామాల్లో కనీసం ఒక్క సన్నివేశమైనా చిత్రీకరించాలని నిర్మాతలు, హీరోలు కోరుకుంటారు. ఎన్టీఆర్, శోభన్‌బాబు, బాలకృష్ణ, రాజశేఖర్, శర్వానంద్, ప్రకాష్‌రాజ్, తనికెళ్ల భరణి, శ్రీహరి, నాని, విజయశాంతి, జయసుధ, జీవిత, హేమ వంటి హేమాహేమీలు ఇక్కడ తీసిన అనేక చిత్రాల్లో నటించారు. టాలీవుడ్‌నే కాకుండా బాలీవుడ్ హీరోలను కూడా ఈ రెండు గ్రామాలు ఆకర్షించాయి. జీవనజ్యోతి, భానుమతి గారి మొగుడు, శివయ్య, శతమానంభవతి, అష్టాచమ్మా, శ్రీనివాస కళ్యాణం వంటి చిత్రాల్లో అనేక సన్నివేశాలు ఇక్కడే చిత్రీకరించారు. బాలీవుడ్ అగ్రహీరో ఆమిర్‌ఖాన్ తీస్తున్న లాల్‌సింగ్ చద్దా సినిమాలోని పలు సన్నివేశాలను ఇటీవల కోడూరుపాడులో చిత్రీకరించారు. దీంతో ఈ గ్రామాల ఖ్యాతి మరింత పెరిగింది. లాల్‌సింగ్ చద్దా చిత్రం షూటింగ్ కోసం కోడూరుపాడులో సందడి చేసిన బాలీవుడ్ అగ్రహీరో ఆమిర్‌ఖాన్ గూడాలలో ఎకరం విస్తీర్ణంలో వందేళ్ల క్రితం నిర్మించిన పోలిశెట్టి భాస్కరరావుకు చెందిన మండువా లోగిలిలో 2009లో తొలిసారిగా అష్టాచమ్మా సినిమా తీశారు. ఈ సినిమా నుంచే తెలుగు సినిమా రంగానికి నాని, అవసరాల శ్రీనివాస్ హీరోలుగా పరిచయమయ్యారు. బాలీవుడ్ నిర్మాత నితిన్ తివారీ బిల్డింగ్ బ్లాక్ గ్రూప్ యాడ్ ఇక్కడే తీశారు. నాలుగు స్తంభాలాట సీరియల్ ఇక్కడే చిత్రీకరించారు. శర్వానంద్ హీరోగా ఇక్కడి మండువా లోగిళ్లలో పల్లె వాతావరణంలో తీసిన శతమానం భవతి చిత్రం ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరించిందో అందరికీ తెలిసిందే. నితిన్ హీరోగా కోడూరుపాడులో తీసిన శ్రీనివాస కళ్యాణం సినిమా కూడా సక్సెస్ సాధించింది. ప్రముఖ దర్శకులు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ, వేగేశ్న సతీష్‌తో పాటు దిల్‌రాజు వంటి అగ్ర నిర్మాతలు ఈ గ్రామాల్లో సినిమా తీయడం సెంటిమెంట్‌గా భావిస్తున్నారని పోలిశెట్టి భాస్కరరావు తెలిపారు. అష్టాచమ్మా సినిమా : కోడూరుపాడులోని పెంకుటిశాల వద్ద హీరో నాని -
మైసూరులో పట్టపగలే నగల దుకాణంలో దోపిడీ
మైసూరు: పర్యాటక రాజధాని నగరం మైసూరులో పట్టపగలు దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఒక నగల దుకాణంలోకి చొరబడి దోపిడీకి పాల్పడిన దుండగులు ఒకరిని కాల్చి చంపారు. సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో విద్యారణ్యపురలో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానిక అమృత్ జ్యువెల్లరీ షాపునకు రెండు బైకులపై సుమారు ముగ్గురు– నలుగురు వ్యక్తులు వచ్చారు. లోపలికి ప్రవేశించిన వెంటనే షట్టర్‌ను మూసేసి దుకాణం యజమాని ధర్మేంద్రను పిస్టల్‌తో బెదిరించి అతని కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో బట్టలు కుక్కారు. బంగారు నగలను బ్యాగుల్లో నింపుకుంటుండగా, అటువైపుగా వచ్చిన ధర్మేంద్ర బంధువు శరత్ చంద్ర షాపు షట్టర్ మూసి ఉండడం చూసి అనుమానంతో తెరవాలని యత్నించాడు. లోపలి నుంచి దుండగులు అతన్ని తుపాకీతో బెదిరించగా గట్టిగా కేకలు వేశాడు. దొంగలు తుపాకీతో కాల్పులు జరపడంతో శరత్ చంద్ర తప్పించుకోగా అతని వెనుకే ఉన్న చంద్రు (23) అనే సమీప బంధువు తలకు తూటా తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. ఇంతలో దొంగలు బంగారం దోచుకుని తమ బైక్‌లపై పరారయ్యారు. కొంతసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ సాయంతో ముమ్మరంగా దర్యాప్తు ప్రారంభించారు. -
సెట్టుకి వెళదాం.. షూటింగు చేద్దాం... ఛలో ఛలో
కెమెరా ఆన్ అయ్యేదెప్పుడు? క్లాప్ బోర్డ్ కొట్టేదెప్పుడు? డైరెక్టర్ స్టార్ట్ యాక్షన్ అనేదెప్పుడు? నటీనటులు మేకప్ బాక్స్ తెరిచేదెప్పుడు? అనే ఎదురుచూపులకు బ్రేక్ పడింది. ఆదివారం ఒకటి, సోమవారం ఒకటి, మంగళవారం ఒక సినిమా... సెట్టుకి వెళదాం.. షూటింగు చేద్దాం... ఛలో ఛలో అంటూ షూటింగ్స్ ప్రారంభించుకున్నాయి. నెలాఖరుకల్లా మరిన్ని సినిమాల షూటింగ్స్‌తో పరిశ్రమ కళకళలాడనుంది. ఆన్ సెట్స్‌లో ఉన్న, త్వరలో ఆన్ సెట్స్‌కి రానున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. నితిన్ హీరోగా నటిస్తున్న ‘మ్యాస్ట్రో’ సినిమా షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైన విషయం తెలిసిందే. మరోవైపు సంపూర్ణేష్‌బాబు హీరోగా చేస్తున్న ‘క్యాలీఫ్లవర్’ షూటింగ్ ఆల్రెడీ హైదరాబాద్‌లో మొదలైపోయింది. ఈ నెలాఖరు లోపు మరికొన్ని సినిమాలు సెట్స్‌పైకి వెళ్లేందకు సిద్ధమవుతున్నాయి. ప్రభాస్ హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ షూటింగ్ ఈపాటికే పూర్తి కావాల్సింది. కానీ కోవిడ్ వల్ల కుదరలేదు. ఈ సినిమా షూటింగ్‌ని ఈ నెలాఖరున ప్రారంభించాలనుకుంటున్నారు. కె. రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ పీరియాడికల్ ఫిల్మ్ జూలై 30న విడుదలకు షెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే. మరోవైపు హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘పుష్ప’ షూటింగ్ మూడు నాలుగు రోజులు చేస్తే పూర్తయ్యే పరిస్థితుల్లో లాక్డౌన్ వచ్చిపడింది. ఈ నెల చివర్లో ఈ సినిమా షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారు. అలాగే కోవిడ్ కారణంగా బ్రేక్ పడిన ‘ఖిలాడి’ చిత్రీకరణ కూడా ఈ నెల చివర్లో షురూ కానుంది. రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా ఈ ఏడాది మే 28న విడుదల కావాల్సింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయింది. ఇక ‘మనం’ మూవీ తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కె కుమార్ కాంబినేషన్లో వస్తున్న ‘థ్యాంక్యూ’ మూవీ ఫైనల్ షెడ్యూల్ మినహా పూర్తయింది. మేజర్‌గా వైజాగ్, ఇటలీలో షూటింగ్ జరుపుకున్న ‘థ్యాంక్యూ’ చిత్రం ఫైనల్ షెడ్యూల్ ఈ నెల 20 తర్వాత హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అవికా గౌర్ కీలక పాత్రధారి. కోవిడ్ క్లిష్ట పరిస్థితుల్లోనూ అన్ని జాగ్రత్తలతో కొన్నాళ్లు ‘శాకుంతలం’ చిత్రీకరణ జరిగింది. లాక్డౌన్ వల్ల బ్రేక్ పడింది. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటిస్తున్న ఈ మైథాలాజికల్ మూవీ చిత్రీకరణ కూడా ఈ నెలాఖరున ఆరంభం కానుంది. ఈ చిత్రాలతో పాటు నాని ‘శ్యామ్ సింగరాయ్’, బెల్లంకొండ గణేష్ కొత్త చిత్రం, సిద్ధు జొన్నలగడ్డ ‘నరుడి బ్రతుకు నటన’ సినిమాలు ఈ నెలలోనే పక్కాగా సెట్స్‌కి వెళతాయని తెలిసింది. ఇక ఎన్టీఆర్–రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’, నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా, రవితేజ హీరోగా శరత్ మండవ డైరెక్షన్‌లోని మూవీ, నిఖిల్ ‘18 పేజెస్’, బెల్లకొండ సాయిశ్రీనివాస్ హీరోగా వీవీ వినాయక్ తెరకెక్కిస్తున్న ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ చిత్రాల షూటింగ్స్ ప్రారంభం కానున్నాయని సమాచారం. బాలీవుడ్లో కూడా షూటింగ్స్ బెల్ మోగింది. తన తాజా చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’ షూటింగ్లో సోమవారం నుంచి ఆమిర్ ఖాన్ పాల్గొంటున్నారు. అలాగే బిగ్ బి అమితాబ్ బచ్చన్ నేను సైతం అంటూ షూటింగ్‌కి రెడీ అయ్యారు. ‘‘లాక్డౌన్ 2.0 తర్వాత తిరిగి షూటింగ్లో పాల్గొంటున్నాను. షాట్ కోసం ఉదయం ఏడు గంటలకే లొకేషన్‌కు చేరుకునేందుకు డ్రైవింగ్ చేస్తున్నాను’’ అని అమితాబ్ తన సోషల్æమీడియా అకౌంట్లో షేర్ చేశారు. ‘గుడ్ బై’ షూటింగ్లో పాల్గొంటున్నారాయన. ఇదే సినిమా షూటింగ్లో జాయినయ్యారు రష్మికా మందన్నా. ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్‌ఖాన్ హీరోగా పరిచయం అవుతున్న ‘మహారాజా’ సినిమా షూటింగ్ ఆల్రెడీ ముంబైలో స్టార్ట్ అయ్యింది. ‘‘ఇక వర్క్ చేయాల్సిన టైమ్ వచ్చింది’ అని రీసెంట్గా షారుక్ ఖాన్ ట్వీట్ చేశారు. దీన్ని బట్టి షారుక్‌ఖాన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పఠాన్’ చిత్రీకరణ ఈ నెలలోనే ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఇంకా ఆలియా భట్ ‘గంగూబాయి కతియావాడి’, సల్మాన్‌ఖాన్ ‘టైగర్ 3’, రణ్వీర్ సింగ్ ‘సర్కస్’, అజయ్ దేవగణ్ ‘మైదాన్’ వంటి చిత్రాలు కూడా సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయని సమాచారం. కోలీవుడ్‌లో కూడా షూటింగ్స్ జరుపుకునేందుకు ఆయా చిత్రబృందాలు ప్రణాళికలు వేసుకుంటున్నాయి. విశాల్ తాజా సినిమా షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో ఆరంభమైంది. ఇక కమల్‌హాసన్ ‘విక్రమ్’, విజయ్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా, సూర్య హీరోగా పాండిరాజ్ డైరెక్షన్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం, విక్రమ్ ‘కోబ్రా’, కార్తీ ‘సర్దార్’ చిత్రాలు షూటింగ్స్‌కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. -
మా మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి!
పెళ్లయ్యాక హీరోయిన్లకు అవకాశాలు తగ్గుతాయా? ఊహూ.. ప్రియమణి కెరీర్‌ని పరిశీలించండి. మూడు వెబ్ సిరీస్‌లు... ఆరు సినిమాలు అన్నట్లుగా ఉంది. టీవీ షోలకు జడ్జిగానూ చేస్తున్నారు. పెళ్లయితే కెరీర్‌ను వదులుకోవాలా? ఊహూ.. అక్కర్లేదు అంటున్నారు ప్రియమణి. ఆమె కెరీర్ ఫుల్ పీక్స్.. మరి.. పర్సనల్ లైఫ్.. అది కూడా పసందుగా ఉంది. మరిన్ని విషయాలను సాక్షితో ప్రియమణి ఇలా పంచుకున్నారు. దర్శకులు రాజ్ అండ్ డీకే ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌లోని సుచిత్ర పాత్ర గురించి చెప్పినప్పుడు బాగా నచ్చి, ఓకే చెప్పాను. ఈ సిరీస్ ఫస్ట్ సీజన్‌తో పోలిస్తే రెండో సీజన్లో నా పాత్రకు మంచి ప్రాధాన్యం లభించిందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ సీజన్లో అరవింద్, సుచిత్ర పాత్రల మధ్య లోనావాలాలో ఏం జరిగిందో ఇప్పుడు చెప్పను. అది టాప్ సీక్రెట్. సీజన్ 2లో సమంత బాగా చేశారు. సమంత నటనను మా కుటుంబసభ్యులు కూడా మెచ్చుకున్నారు. రాజీ పాత్రను యాక్సెప్ట్ చేసినందుకు సమంతకు ధన్యవాదాలు. అది చాలా కష్టమైన పాత్ర. నేను చేసిన సుచిత్ర పాత్ర గురించి సమంత ఏం అనుకుంటున్నారో ఆమెనే అడగాలి. ‘ది ఫ్యామిలీమ్యాన్ 2’ వివాదం గురించి నేను మాట్లాడాలనుకోవడం లేదు. వెంకీ సార్ అలా అనడం హ్యాపీ వెంకటేశ్ సార్‌తో గతంలో మూడు నాలుగు సినిమాల్లో అవకాశం వచ్చింది కానీ కుదరలేదు. ‘నారప్ప’కి కుదిరింది. ‘ఈ సినిమాకి మనం పని చేయాలని రాసి పెట్టి ఉందేమో’ అని వెంకీ సార్ అన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. శ్రీకాంత్ అడ్డాలగారు, శ్యామ్ కె. నాయుడుగారు లుక్ టెస్ట్ చేస్తున్నప్పుడే నక్సలైట్ డ్రెస్‌లో ఉన్న నన్ను చూసి ‘లుక్స్ బాగున్నాయి.. మీరు ఈ పాత్ర చేయొచ్చు.. మేము ఫిక్స్ అయ్యాం’ అనడంతో ధైర్యం వచ్చింది. ఈ సినిమాలో నా పాత్ర అనంతపురం యాసలో మాట్లాడుతుంది. ఈ చిత్రం కోసం మూడు రోజుల్లో సొంతంగా డబ్బింగ్ చెప్పాను. ‘విరాటపర్వం’లో నాది భారతక్క అనే నక్సలైట్ పాత్ర. ఇందులో యాక్షన్ చాలా బాగుంటుంది. నా ఒక్క యాక్షన్ సీక్వెన్స్ అనే కాదు.. రానా, సాయి (సాయి పల్లవి)ది కూడా చాలా బాగుంటుంది. ప్రస్తుతం ‘సైనైడ్, కొటేషన్ గ్యాంగ్’ అనే సినిమాలతోపాటు హిందీ ‘మైదాన్’లో హీరో అజయ్ దేవగన్ భార్యగా నటిస్తున్నాను. 99 శాతం డైరెక్టర్స్ ఆర్టిస్ట్‌ని ఇప్పటివరకు చేసిన పాత్రల కోసం నేను ప్రత్యేకంగా ఎటువంటి హోమ్ వర్క్ చేయలేదు. కానీ చేయాల్సి వస్తే చేస్తాను కూడా. అయితే స్క్రిప్ట్ విన్నప్పుడే నా పాత్ర గురించి ఆలోచించుకుని చేస్తానంటే చేస్తానని లేకపోతే లేదని నా నిర్ణయం చెబుతాను. నేను 99 శాతం డైరెక్టర్స్ యాక్టర్‌ని. ఆ ఒక్క పర్సెంట్ నాకు ఏదైనా అనిపిస్తే చెబుతాను. తనని చూస్తే నాకు గర్వం విద్యాబాలన్, నేను కజిన్స్. ఆమె నటనని చూసి గర్వంగా ఫీలవుతా.. తను మా కజిన్ అని కాదు. ఆమె ఎంచుకునే పాత్రలు చాలా బాగుంటాయి. బాలీవుడ్లో ఖాన్స్, కపూర్స్ ఫ్యామిలీలు ఉన్నా తను అక్కడ నిలబడి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సింగర్ మాల్గాడి శుభగారు మా చిన్న మేనమామగారి భార్య. మా అమ్మ తరఫువాళ్లందరూ సంగీతంతో ముడిపడి ఉన్నవాళ్లే. అతను నా లక్కీ చార్మ్ నాకు జతగా అద్భుతమైన సహచరుడు (ముస్తఫా రాజ్) దొరికాడు. మంచి సపోర్టింగ్ భర్త దొరకడం నా అదృష్టం. పెళ్లయ్యాక ఆయన ఇచ్చే సపోర్ట్‌తోనే నేను సినిమాలు చేయగలుగుతున్నా. నిజం చెప్పాలంటే పెళ్లయ్యాక కూడా నాకు ఎక్కువ అవకాశాలు వస్తుండటం నా అదృష్టం. అందుకే తను నా లక్కీ చార్మ్. మా మధ్య కూడా చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి.. ఆ సమయంలో ఆయనే తగ్గుతుంటారు. మైండ్‌సెట్ మారింది! òపెళ్లయినా నాకు మంచి మంచి రోల్స్ ఇస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా కాజల్, సమంత మెయిన్ లీడ్‌గా సినిమాలు చేస్తున్నారు. సాధారణంగా పెళ్లయ్యాక హీరోయిన్స్‌కు అంత మంచి రోల్స్ రావు. వదిన, సిస్టర్ రోల్స్ ఆఫర్ చేస్తారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. మైండ్‌సెట్ మారింది. సీనియర్ నటి నయనతార కూడా ఇంకా మెయిన్ లీడ్‌గా సినిమాలు చేస్తోంది. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల్లో కొనసాగడమా? లేదా అనేది హీరోయిన్స్ ఛాయిస్. పెళ్లయిన హీరోయిన్ల లుక్స్‌పై కామెంట్స్ చేస్తుంటారు కొందరు. కానీ బాడీ షామింగ్ గురించిన కామెంట్స్ నాపై రాలేదు. పెళ్లి చేసుకున్నందుకు నాకు చాలామంది శుభాకాంక్షలు చెబుతున్నారు. పారితోషికం తగ్గించాను కరోనా సెకండ్ వేవ్‌లోనూ రియాలిటీ షోస్ షూటింగ్స్ చేస్తున్నాం. అయితే కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా చేస్తున్నాం. గతంలో షూటింగ్ చేస్తున్నప్పుడు 50 నుంచి 100 మంది ఉండేవారు. షూటింగ్స్ చూసేందుకు కూడా వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చాలా తక్కువ మంది ఉంటున్నారు.. కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారు.. డాక్టర్ కూడా సెట్స్‌లోనే ఉంటున్నారు. ‘విరాట పర్వం, నారప్ప’ సినిమాలు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చేశాం. కోవిడ్ సమయంలో కొంచెం పారితోషికం తగ్గించాను. -
వ్యాక్సిన్ వేసుకున్నవాళ్లకే షూటింగ్‌లోకి అనుమతి
చెన్నై: లాక్డౌన్ ముగిసి షూటింగులు ప్రారంభమైనా వ్యాక్సిన్ వేసుకున్న వారికే అనుమతి ఉంటుందని దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడు వ్యాక్సిన్ వేసుకున్న వారికే అనుమతి ఉంటుందని. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న విషయం తెలిసిందే. దాని బారిన పడి వేలాదిమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కరోనాను కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ వేయించుకోవడం ఒక్కటే మార్గమని వైద్యులు చెబుతున్నారు. లాక్డౌన్ కారణంగా ఈ నెల 31వ తేదీ వరకు సినిమా, టీవీ సీరియళ్ల షూటింగ్‌లను నిలిపి వేస్తున్నట్లు ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్.కె.సెల్వమణి ప్రకటించారు. ఆయన తాజాగా మరో ప్రకటన విడుదల చేశారు. లాక్డౌన్ తర్వాత షూటింగులు ప్రారంభమైనప్పుడు అందులో పాల్గొనే వారు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలని పేర్కొన్నారు. వారికే షూటింగ్లో పాల్గొనడానికి అనుమతి ఉంటుందని తెలిపారు. అందుకు తగిన ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాలని తెలిపారు. -
టీవీ సీరియల్స్‌కు బ్రేక్.. షూటింగ్‌లు రద్దు
ముంబై : దేశ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా కేసులు అధికమవుతుండటంతో మహమ్మారి కట్టడికి ప్రభుత్వం ఇప్పటికే మినీ లాక్ డౌన్ (పాక్షిక లాక్ డౌన్)ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉదయం సెక్షన్ 144, నైట్ కర్ఫ్యూతోపాటు వీకెండ్లో అంటే వచ్చే శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి సోమవారం ఉదయం ఏడు వరకు (శని, ఆది) సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధించింది.తాజాగా కరోనాను అదుపుచేసే చర్యల్లో భాగంగా రాష్ష్ర్ట ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముంబైలో టీవీ సీరియళ్ల షూటింగ్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే మినీ లాక్డౌన్లో భాగంగా ఇప్పటికే హోటళ్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, ధార్మిక, దర్శనీయ స్థలాలు, మైదానాలు, జిమ్‌లు, సెలూన్లు మూసి వేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1,45,384 కొత్త కేసులు నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే కరోనాతో 794 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1, 32,05,926కు చేరుకుంది. కాగా మొత్తం మరణాల సంఖ్య 1,68,436కి చేరుకుంది.నిన్న కరోనా నుంచి కోలుకుని 77,567 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 19,90,859 మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ సంఖ్య 10,46,631కి చేరుకుంది. చదవండి: మహారాష్ట్రలో మినీ లాక్డౌన్ సంపూర్ణ లాక్డౌన్: 9 నుంచి 19 వరకు మొత్తం బంద్ -
నలుగురు లష్కరే ముష్కరులు హతం
శ్రీనగర్: సోమవారం జమ్ముకశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతాదళాలు నలుగురు లష్కరే తోయిబా తీవ్రవాదులను మట్టుబెట్టాయి. జిల్లాలోని మనిహల్ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి భద్రతాదళాలు తీవ్రవాదుల కోసం గాలింపు చర్యలు జరుపుతున్నాయని, మిలిటెంట్లను గుర్తించిన అనంతరం లొంగిపోవాలని హెచ్చరించినా వినకుండా కాల్పులు జరిపారని, దీంతో భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరపగా నలుగురు తీవ్రవాదులు మరణించారని ఐజీ విజయ్ కుమార్ చెప్పారు. వీరంతా తమను తాము లష్కరే ముస్తఫా వర్గంగా చెప్పుకుంటారని, కానీ పోలీసు రికార్డుల్లో వీరు లష్కరేతోయిబా తీవ్రవాదులనే ఉందని చెప్పారు. ఎన్కౌంటర్ స్థలంలో మూడు పిస్టల్స్, ఒక ఏకే 47 రైఫిల్ స్వాధీనం చేసుకున్నారన్నారు. మృతులను రాయిస్ అహ్మద్ భట్, అమిర్ షఫి మిర్, రఖిబ్ అహ్మద్ మాలిక్, అఫ్తాబ్ అహ్మద్ వనిగా గుర్తించారు. సంఘటనలో ఒక ఆర్మీ జవాను గాయపడగా ఆస్పత్రిలో చేర్చినట్లు తెలిపారు. ఈ ఏడాది ంతవరకు 9 ఎన్కౌంటర్లు జరిగాయని, వీటిలో 19మంది తీవ్రవాదులు హతమయ్యారని ఐజీ వివరించారు. తిరిగి వచ్చేయండి ఈ సంవత్సరం 18 మంది యువకులు మిలిటెంట్లలో చేరారని, వీరిలో 5గురు ఎన్‌కౌంటరయ్యారని, ముగ్గురు అరెస్టయ్యారని, మిగిలిన వారు లొంగిపోయేలా చర్యలు తీసుకోవాలని వారి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశామని చెప్పారు. ఇలా ఏడుగురు యువకులు మిలిటెంట్లనుంచి తిరిగి వచ్చారన్నారు. సెక్యూరిటీ దళాలపై లోయలో తల్లిదండ్రులకు నమ్మకం పెరుగుతోందన్నారు. స్థానిక యువతను తీవ్రవాదంవైపు మరల్చేందుకు పాకిస్థాన్ కుయుక్తులు పన్నుతోందని, సోషల్‌మీడియా ద్వారా రెచ్చగొడుతోందని విమర్శించారు. దీనికితోడు పాక్ డ్రగ్స్‌ను కూడా సరఫరా చేస్తోందని, ఇలా డ్రగ్స్‌కు బానిసైనవారు తమను సంప్రదిస్తే డీఅడిక్షన్ కేంద్రాలకు పంపుతామని చెప్పారు. యువతకు సాయం చేసేందుకు పోలీసులు సదా సిద్ధమన్నారు. లోయలో శాంతిస్థాపన తమ ధ్యేయమన్నారు. దళాలపై రాళ్లురువ్వే సంఘటనలు చాలా తగ్గిపోయాయని, గతంలోలాగా కాకుండా మిలిటెంట్లకు భయపడకుండా ప్రజా జీవనం కొనసాగుతోందని చెప్పారు. నిజానికి మిలిటెన్సీ కన్నా రాళ్లు రువ్వే ఘటనలు చాలా తీవ్రమైనవని, సామాజికంగా సీరియస్ సమస్యని చెప్పారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా పలువురిని ప్రజా భద్రతా చట్టం కింద అరెస్టు చేస్తున్నామని చెప్పారు. -
అమెరికాలో మళ్లీ కాల్పులు
అట్లాంటా: అమెరికాలోని అట్లాంటాలో వరస కాల్పులు కలకలం రేపాయి. ఒక గంట వ్యవధిలోనే మూడు వేర్వేరు మసాజ్ సెంటర్లలో జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది మృతి చెందారు. వీరిలో ఆరుగురు మహిళలు ఆసియా దేశాలకు చెందినవారే ఉన్నారు. కాల్పులకు పాల్పడ్డాడని అనుమానిస్తున్న 21 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోనికి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అట్లాంటా పోలీసు చీఫ్ రాడ్నీ బ్రియాంట్ తెలిపిన వివరాలు ప్రకారం ఉత్తర అట్లాంటాకు 50 కి.మీ. దూరంలోని గ్రామీణ ప్రాంతమైన అక్వర్త్లో మంగళవారం సాయంత్రం 5 గంటలకు యంగ్స్ ఆసియన్ మసాజ్ పార్లర్లో తుపాకుల మోత మోగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలు అవుతుండగా అట్లాంటాకి సమీపంలోని బక్‌హెడ్‌లోని గోల్డ్ స్పాలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఆ మసాజ్ సెంటర్లో దోపిడి జరుగుతోందన్న సమాచారం మేరకు పోలీసులు వచ్చి చూడగా ముగ్గురు మహిళలు విగతజీవులై పడి ఉన్నారు. అక్కడికి సమీపంలోనే ఉన్న మరో వీధిలో అరోమాథెరపీ స్పాలో కూడా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసు చీఫ్ వివరించారు. ఈ బీభత్సకరమైన హింసాకాండలో బాధి తుల కోసం మేమంతా ప్రార్థనలు చేస్తున్నామంటూ అట్లాంటా గవర్నర్ బ్రెయిన్ కెంప్ ట్వీట్ చేశారు. కాల్పులు జరిపింది ఒక్కడేనా ? అక్వర్త్ ఘటనలో కాల్పులకు తెగబడినట్టుగా అనుమానిస్తున్న వ్యక్తిని అదుపులోనికి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. స్పా బయట అతను తిరుగుతున్న దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వుడ్‌స్టాక్‌కు చెందిన రాబర్ట్ ఆరన్ లాంగ్గా అతనిని గుర్తించారు. మిగిలిన రెండు చోట్ల కాల్పులు జరిపింది అతని పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. మొదటి వీడియోలో కనిపించిన కారు, కాల్పులు జరిగిన ఇతర ప్రాంతాల్లో కూడా కనిపించింది. కరోనా వైరస్ అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ఆసియన్ అమెరికన్లపై దాడులు విస్తృతంగా జరుగుతున్నాయి. ఈ కాల్పులు కూడా అందులో భాగమేనన్న ఆందోళన పెరుగుతోంది. మరోవైపు అక్వర్త్లో యంగ్స్ ఆసియన్ మసాజ్ పార్లర్లో మరణించిన వారందరూ దక్షిణ కొరియాకి చెందిన మహిళలేనని ఆ దేశ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. -
హైకోర్టు ఆగ్రహం: వారికి అనుమతించిన మహారాష్ట్ర
ముంబై: చలనచిత్ర, టీవీ పరిశ్రమలో పనిచేసే 65 ఏళ్లకు పైబడిన నటీనటులు యధావిధిగా షూటింగ్‌ల్లో పాల్గొనేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా నేపథ్యంలో చైల్డ్ ఆర్టిష్టులు, సీనియర్ సిటిజన్లు అవుట్ డోర్ షూటింగ్లో పాల్గొనడానికి వీలు లేదని ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయం వారి కుటుంబాలకు ఆర్థిక సవాలుగా మారింది. ప్రభుత్వ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ప్రమోద్ పాండే అనే సీనియర్ నటుడు జూలై 21 హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఇటీవల ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ప్రభుత్వ ఉత్తర్వులను ముంబై హైకోర్టు రద్దు చేసింది. 65 ఏళ్లు పైబడిన నటులను షూటింగ్‌లకు అనుమతించకపోవడం వెనుక ఉన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వివరించాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. (చదవండి: మహారాష్ట్రలో 10,163 మంది పోలీసులకు కరోనా) అయితే కరోనా నేపథ్యంలో 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు, 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న సిబ్బందిని షూటింగ్లో పాల్గొనడాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ప్రమోద్ పాండే పిటిషన్‌పై విచారణ చేపట్టిన ముంబై హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒక సీనియర్ సిటిజన్ తన దుకాణం తెరిచి రోజంతా కూర్చోవడానికి అనుమతి ఉన్నప్పుడు.. 65 ఏళ్లు పైబడిన నటీనటులు బయటకు వెళ్లకుండా ఏ ప్రాతిపదికన నిరోధించారని పేర్కొంది. ఇది వివక్ష చూపేదిగా ఉందంటూ ప్రభుత్వ తీరుపై ముంబై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో హైకోర్టు ఆదేశం మేరకు సీనియర్ సిటిజన్లు తిరిగి షూటింగ్లో పాల్గొనేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. (చదవండి: కరోనా: 38 శాతం ఐదు రాష్ట్రాల నుంచే!) -
కృష్ణా నగర్ మూగబోయింది..
సనత్‌నగర్: సినీ కళాకారుల కలలధామం.. 24 క్రాప్ట్స్కు ఆశల దీపం... కృష్ణానగర్ మూగబోయింది. నిత్యకల్యాణం పచ్చతోరణం అన్నట్లుగా ఉండే ఆ బస్తీ సినిమా షూటింగ్‌లతో పాటే నాలుగు మాసాల క్రితమే ప్యాకప్ అయిపోయింది. కరోనా మాటున కనుమరుగైన వెండి తెర వెలుగులు మాదిరిగానే సినీ కార్మికుల జీవితాలు సైతం మసకబారిపోయాయి. కోడి కూయకముందే అందంగా ముస్తాబై రోడ్డెక్కే జూనియర్ ఆర్టిస్ట్‌లు..సాయంత్రమైతే రేపటి షెడ్యూల్డ్ ముచ్చట్లు... నవ్వులు...కేరింతలు...వారి కోసం వచ్చిపోయే వాహనాలు..ఇలా కష్ణానగర్ ఎప్పుడూ కళకళలాడేది. కానీ ఆ ‘కళ’ను కరోనా మింగేసింది. పూర్ణా టిఫిన్స్, మంగ టిఫిన్ సెంటర్, శ్రీశ్రీ టిఫిన్స్... పొట్టివీరయ్య బంకు వంటికి సినీ కార్మికులకు అడ్డాలు. బాధలు... బందీలు... కలలు...కన్నీళ్లు... ఆనందం... అభిమానం ఏది పంచుకోవాలనుకున్నా ఇక్కడికొచ్చి సింగిల్ చాయ్ కొట్టాల్సిందే. కానీ ఇప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదు. దాతల సహకారంతో.. సినీ వృక్షపు కొమ్మలను కరోనా తెగనరికేయడంతో చెట్టుకొకరు పుట్టకొకరుగా మిగిలిపోయారు. పెట్రేగిపోతున్న కరోనా భయం ఒకవైపు..షూటింగ్‌లు లేక ఛిద్రమైన జీవితాలు మరోవైపు..వెరసి రంగుల లోకాన్ని విడనాడి సొంత ఊళ్ల బాట పట్టిన వారు ఎందరో.. చేసే వృత్తిని వదల్లేక..అద్దెల భారాన్ని దిగమింగుకుని..స్వచ్ఛంద సంస్థలు, మానవతావాదులు పంచే నిత్యావసరాలనే పరమాన్నంగా భావించి కుటుంబాన్ని నెట్టుకువస్తున్న వారు మరెందరో.. సినిమానే లోకం....బతుకే సినిమాగా... సినిమానే లోకం అనుకుని వచ్చేవారు కొందరైతే.. బతుకునే సినిమాగా మలచుకునే వారు మరికొందరు. ఎలాగైనా... వెండితెరపై సింగిల్‌కార్డ్ పడాలిరా....అప్పుడే ఇంటికి తిరిగివస్తానురా మామా! అంటూ పెట్టేబేడా సర్దుకుని కృష్ణానగర్ ఒడిన చేరిపోతుంటారు. సినిమానే లోకం అనుకుని వచ్చేవారు రాజీపడి బతుకునే సినిమాగా మలచుకుంటున్నవారు కష్ణానగర్ గుండెను టచ్ చేస్తే తారసపడతారు. సినిమా షూటింగ్ ఉంటే పండగే...లేదంటే దండగే...అన్నట్లు ఉంటాయి వీరి జీవితాలు. అందుకే వేషాల పైనే ఆధారపడకుండా 24 ఫ్రేమ్స్‌లోని ఏదోఒక రీల్‌ను ఎంచుకుని తమ బతుకు సినిమాను నడిపిస్తుంటారు. రంగుల ప్రపంచంలో అడుగిడిన వారు 24 శాఖల్లో ఏదోఒక దానికి పరిమితమై జీవనం కొనసాగిస్తుంటారు. కానీ కరోనా వారి కలలన్నింటినీ కల్ల చేసింది. చాలామందిని మళ్లీ పెట్టెబేడా సర్ధుకుని సొంతూళ్లకు వెళ్లేలా చేసింది. ఆ స్పాట్లన్నీ బోసిపోయి... 24 శాఖలకు చెందిన వారిది ఒక్కొక్కరిదీ ఒక్కోస్పాట్. తెల్లవారకముందే తమ తమ అడ్డాల వైపు వారి అడుగులు కదులుతాయి. అప్పటికే వాహనాలు రెడీగా ఉంటాయి. వారు రావడంతోనే షూటింగ్ స్పాట్ల వైపు వాహనాలు దూసుకుపోతుంటాయి. ముఖ్యంగా కృష్ణానగర్‌లో డైరెక్టర్ల స్పాట్ అంటే గణపతి కాంప్లెక్స్. ఉదయం నాలుగయ్యిందంటే ఇక్కడ డైరెక్టర్స్, కో–డైరెక్టర్స్‌తో పాటు వేషాల కోసం వారి చుట్టూ తిరిగే వారు తారసపడుతుంటారు. జూనియర్ ఆర్టిస్ట్‌ల స్పాట్ ఇందిరానగర్ గడ్డ. కృష్ణానగర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు వెళ్లే మూలమలుపులో ఉన్న ఈ గడ్డే జూనియర్ ఆర్టిస్ట్‌ల ఆశల అడ్డా. పాత వారైతే సరేసరి...కొత్త వారైతే మాత్రం ఏజెంట్లను ప్రసన్నం చేసుకుంటేనే వేషం మరి. అలా ఒకరోజు...రెండు రోజులు కాదు... నెలల తరబడి వేషాల కోసం తిరిగేవారు కూడా ఇక్కడ కనిపిస్తుంటారు. ఇక స్టంట్స్‌కు వేదిక అంటే స్థానిక బాబురావు లాడ్జి ఎదుట లైన్లో గల కార్యాలయమే. ఇలా కాస్ట్యూమ్, మేకప్మేన్లకు వేర్వేరుగా ఉన్న స్పాట్ల వద్దకు వచ్చి వాహనాల్లో షూటింగ్ ప్రాంతానికి వెళ్తుంటారు. ఉదయం 4 నుంచి 8 గంటల వరకు వారి సందడి ఇక్కడ ఉంటూనే ఉంటుంది. స్పాట్లు వేరైనా మాదంతా ‘సినిమా’ లోకమే అంటారు వీరు. మరి ఇప్పుడు. ఆ ’సీన్’ను కరోనా రివర్స్ చేసేసింది. ఎవరెక్కడ ఉన్నారో కూడా అర్థం కాని పరిస్థితి. నాలుగు నెలల క్రితమే మా జీవితాలు ప్యాకప్ ... కరోనాకు ముందు ‘మూడు పువ్వులు ఆరు కాయలు’ అన్నట్లుగా చేతి నిండా పని ఉండేది. ఎప్పుడైతే కరోనా వచ్చిందో అప్పటి నుంచీ సినిమా, సీరియల్ షూటింగ్‌లు ప్యాకప్ అయినట్టే మా పనులు కూడా ప్యాకప్ అయిపోయాయి. మా యూనియన్‌లో 40–50 శాతం మంది ఇళ్ల అద్దెలు చెల్లించలేక, కరోనా భయంతో ఊర్లకు వెళ్లిపోయారు. ఈ రోజు కాకపోతే రేపైనా షూటింగ్‌లు జరగకపోవా అన్న ఆశతో ఇంకొందరు వేచి చూస్తున్నారు. రంగాల వైపు వెళ్ల లేరు. కష్టమైనా.. నష్టమైనా సరే అప్పోసొప్పో చేసి బతుకును వెళ్లదీస్తూ షూటింగ్‌లు జరిగే వరకు వేచి చూడక తప్పదు. చిరంజీవి ఛారిటబుల్ సంస్థ నుంచి ఇటీవల నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం మాకు కొంతవరకు ఊరటనిచ్చింది. అవే ఇప్పటివరకు మా ఆకలిని తీర్చాయి. – సుధీర్, కాస్ట్యూమర్ అందరి పరిస్థితి అగమ్యగోచరమే... సినిమా షూటింగ్‌లు ఉంటే చేతి నిండా పని ఉండేది. ప్రొడక్షన్లో ఉండేవారందరికీ క్యారియర్లు అందిస్తుంటాను. కరోనాతో షూటింగ్‌లు బంద్ కావడంతో మా క్యారియర్లు కూడా అటకెక్కాయి. వ్యాపారం లేక పూట గడవడమే కష్టంగా మారింది. మా కింద పనిచేసే సిబ్బందికి కూడా ఉపాధి కరువైంది. ఐదు నెలలుగా ఇదే పరిస్థితి ఉంటే బతికేదెట్టా. అక్కడికే పలువురు హీరోలు, మానవతామూర్తులు ఆదుకుంటున్నారు. వారు మాత్రం ఎన్ని రోజులు ఆదుకుంటారు. మళ్లీ షూటింగ్‌లు మొదలైతే తప్ప ఉపాధి దొరకదు. సినిమాపై ఆధారపడ్డ వారి అందరి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. –నాగమణి, సినిమా క్యాటరింగ్ సర్వీసెస్ కోలుకోలేని దెబ్బ... సినిమా ఫీల్డ్‌లో విగ్‌లకు డిమాండ్ బాగానే ఉంటుంది. అయితే నాలుగు నెలలుగా షూటింగ్‌లు ఆగిపోవడంతో మా వ్యాపారం కూడా పూర్తిగా పడిపోయింది. షాపు అద్దెలు, ఇంటి అద్దెలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాం. కరోనా కోలుకోలేని దెబ్బ తీస్తుందని ఊహించలేదు. ఆ విభాగం ఈ విభాగం అని తేడా లేకుండా సినిమాలోని 24 శాఖలకు చెందిన కార్మికుల పొట్ట కొట్టింది. ప్రభుత్వం యూనియన్ల వారీగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి సహాయం అందిస్తే బాగుంటుంది. లేనిపక్షంలో మేము ఎప్పుడు కోలుకుంటామో తెలియడం లేదు. –బ్రహ్మాజీ, విగ్స్ సప్లయర్ సాఫీగా సాగే జీవితంపై పిడుగు పడింది కరోనా ముందు వరకు జీవితం సాఫీగా సాగిపోయింది. మా యూనియన్‌లో దాదాపు 650 మంది వరకు ఉంటే సగం మంది ఇక్కడ పనులు లేక ఊర్లకు వెళ్లిపోయారు. ఇక్కడేమో ఇంటి అద్దెల కోసం యజమానులు పీడిస్తున్నారు. కొంతమంది షూటింగ్‌లు ఉన్నప్పుడే అద్దెలు ఇవ్వండంటూ మానవత్వంతో వ్యవహరిస్తున్నారు. మరికొంత మంది అద్దె ఇవ్వండి లేదా ఖాళీ చేయండి అంటూ హుకుం జారీ చేస్తుండటం బాధాకరం. షూటింగ్‌లు బంద్ అయ్యాయి కదా? కనీసం బ్రైడల్ మేకప్‌లు చేసుకుందామన్నా పెళ్లిళ్లు కూడా వాయిదా వేసుకుంటున్నారు. దీంతో మేకప్మెన్ల జీవితాలు అగమ్యగోచరంగా తయారయ్యాయి. హీరో, హీరోయిన్లకు మేకప్‌లు వేసేవారు మా యూనియన్ సభ్యుల పరిస్థితిని వివరించి కొంతమేర సహాయం చేసేలా చూశారు. కానీ ఇంటి అద్దెలను మాత్రం ఎలా చెల్లించాలో అర్థం కావడంలేదు. –సునీల్, మేకప్ ఆర్టిస్ట్ అద్దెలు భారం, కరోనా భయంతో ఊరికి వచ్చేశా... కరోనా భయంతో బయటకు రావాలంటే బయమేస్తోంది. షూటింగ్లో ఎవరికి కరోనా ఉంటుందోనన్న ఆందోళనతో ఎవరూ రావడం లేదు. నేను కూడా ఊరికి వచ్చేశా. మా యూనియన్‌లో 250 మంది వరకు ఉంటే 50 శాతం వరకు ఊర్లలోనే ఉన్నారు. హైదరాబాద్‌లో కరోనా భయంతో పాటు అద్దెలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని నెలలు ఊర్లోనే ఉంటే బెటర్ అనిపించింది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు, హీరోలు కొంతమేరకు ఆదుకున్నారు. ప్రభుత్వం కూడా మా పై దయదలిస్తే బాగుంటుంది. –మహిపాల్, లైటింగ్ డిపార్ట్మెంట్ కష్టాలతో ’ఫైట్’ చేయాల్సి వస్తోంది... సినిమాలో ఫైటింగ్‌లతో జీవితాన్ని నెట్టుకువచ్చే మేము ఇప్పుడు కరోనా తెచ్చిన కష్టాలతో ఫైట్ చేయాల్సి రావడం దురదృష్టకరం. మా యూనియన్‌లో 250 మంది వరకు ఉంటే చాలా మంది సొంత ఊర్లకు వెళ్లిపోయారు. ఉన్నవారు పనులు లేక ఇంటికే పరిమితమయ్యారు. షూటింగ్‌లు నిలిచిపోవడంతో చిల్లిగవ్వ ఆదాయం కూడా లేదు. చిరంజీవి సీసీసీ నుంచి నెలకు 2,000 చొప్పున ఇవ్వడంతో పాటు కొంతమంది హీరోలు, నటులు దయదలచి నిత్యావసరాలను అందించడంతో కుటుంబం గడుస్తోంది. షూటింగ్‌లు జరిగే వరకు తాము దాతలపై ఆధారపడక తప్పదేమో? –శ్రీనివాస్, స్టంట్ ఫైటర్ కరోనా సినీ కార్మికుల జీవితాలను చిదిమేసింది... కరోనా వచ్చి మా సినీ కార్మికుల జీవితాలను ఛిద్రం చేసింది. కుటుంబం గడవడమే కష్టంగా మారింది. చాలామంది ఊర్లకు వెళ్లిపోగా..., ఇంకొందరు అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఏదో ఒకచోట చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. నేను మటుకు ఏదీ చేయలేక ఖాళీగా ఉన్నా. మార్చి నుంచి జీతాలు లేవు. యూనియన్ వారు అందించిన నిత్యావసర సరుకులు, కొద్దిపాటి సహాయంతో నెట్టుకువస్తున్నాం. కరోనా భయంతో ఆర్టిస్ట్‌లు రావడానికి కూడా భయపడుతుండటంతో షూటింగ్‌లు జరగడం లేదు. పూర్వ వైభవం ఎప్పటికి వస్తుందో అర్థం కావడం లేదు. –శ్రీను, ప్రొడక్షన్, మేనేజర్ -
పరిస్థితి మెరుగయ్యేదాకా షూటింగ్‌లు ఆపాలి!
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి అటు బాలీవుడ్ ప్రముఖులను, ఇటు బుల్లి తెర నటులను బెంబేలెత్తిస్తోంది. వరుసగా నటులు కరోనా బారినపడుతూ ఉండటంతో లాక్డౌన్ సడలింపుల తరువాత మొదలైన షూటింగ్‌ల సందడి నీరుగారిపోయింది. దీనికి తోడు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కుటుంబానికి వైరస్ సోకడం మరింత ఆందోళన కలిగిస్తోంది. షూటింగ్ సమయంలోనే అమితాబ్‌కు వైరస్ అంటుకుందన్నఅంచనాలు ఈ భయాలకు మరింత తోడయ్యాయి. దక్షిణాది టీవీ నటుడు, ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ‘కసౌతి జిందగీ కే-2’ నటుడు పార్థ్ సమతాన్‌కు కోవిడ్-19 పాజిటివ్ రావడంతో నటి బిపాసా బసు సోషల్ మీడియాలో స్పందించారు. కరోనా వైరస్ బారిన పడే అవకాశాలు నటీనటులకే ఎక్కువ ఉన్నాయంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు కొంత కాలంపాటు షూటింగ్‌లకు దూరంగా ఉంటే మంచిదని ఆమె సూచించారు. యూనిట్ సభ్యులు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ (పీపీఈ) కిట్లు, ఫేస్ షీల్డ్స్ లాంటి సేఫ్టీ మెజర్స్తో పనిచేయవచ్చు..కానీ నటులకు అలాంటి పరిస్థితి లేదు. మాస్క్‌లు తదితర రక్షణ కవచాలు లేకుండానే నటించాల్సి ఉంటుందని బిపాసా బసు గుర్తు చేశారు. నటీనటులు కరోనా బారిన పడుతుండటానికి ఇదే కారణమన్నారు. అందుకే పరిస్థితులు మెరుగయ్యేంతవరకు అన్ని రకాల షూటింగులను ఆపేయాలని కోరారు. (నటుడికి కరోనా.. సహా నటులకు కోవిడ్ పరీక్షలు) మరోవైపు బిపాసా బసు భర్త, నటుడు కరణ్ సింగ్ గ్రోవర్, కసౌతి జిందగీ కే 2 లో మిస్టర్ బజాజ్ పాత్రను పోషించారు. అయితే కరోనా కారణంగా కరణ్ సింగ్ ఈ ప్రాజెక్టునుంచి తప్పుకోవడంతో నటుడు కరణ్ పటేల్ ఈ పాత్రలో నటిస్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని ఎపిసోడ్ల షూటింగ్ పూర్తయింది. ఈ వారంలో ఇవి టెలికాస్ట్ కావాల్సి ఉంది. అయితే పార్థ్ సమతాన్ కు కరోనా సోకడంతో ‘కసౌతి జిందగీ కే’ సెట్లో ప్రకంపనలు రేపింది. దీనిపై నిర్మాత ఏక్తా కపూర్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు.(బాలీవుడ్లో మరో విషాదం) కాగా కరోనా కట్టడికోసం దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్లో క్రమంగా సడలింపుల నేపథ్యంలో టెలివిజన్ షోలు, సినిమాలు, ఇతర ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్టుల చిత్రీకరణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇటు తెలుగు టీవీ నటులు కూడా కరోనా బారిన పడటం కలవరం రేపిన సంగతి తెలిసిందే. View this post on Instagram All necessary precautions are being taken, SOPs being followed. For us at Balaji, Health & Safety comes first, above all else! Take care. Jai Mata Di.🙏🏻 #Repost @balajitelefilmslimited with @make_repost A post shared by Erk❤️rek (@ektarkapoor) on Jul 12, 2020 at 4:50am PDT -
రెడీ.. స్టార్ట్... యాక్షన్
కరోనా వల్ల ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొటోంది. షూటింగ్స్‌కు ప్రభుత్వం అనుమతులు ఇస్తే నిర్మాతల ఇబ్బందులు కొంత మేరకైనా తగ్గి ఇండస్ట్రీ తిరిగి పుంజుకుంటుందని అందరూ ఆశించారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం నుంచి అనుమతులు లభించినప్పటికీ సినిమాల షూటింగ్స్ ఊపందుకోవడం లేదు. కొన్ని రోజుల క్రితం కంటే ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతుండటం, టీవీ షూటింగ్స్‌ను స్టార్ట్ చేసిన తర్వాత కొంతమంది బుల్లితెర నటీనటులు కరోనా బారిన పడటం.. ఇలా కారణాలు ఏవైనా సినిమా సెట్లో అనుకున్నంతగా లైట్ వెలగడం లేదు. సినీ కార్మికుల పొట్ట నిండటం లేదు. ‘కరోనా ఇక లేదు అన్నాకే షూటింగ్స్ చేస్తాం’ అని కొందరు నటీనటులు అంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కరోనా ఎంత కలవరపెడుతున్నా ‘మేం రెడీ’ అంటూ కొందరు నటీనటులు, డైరెక్టర్లు రెడీ.. స్టార్ట్.. యాక్షన్ అనగానే నటించడానికి కెమెరా ముందుకొచ్చారు. వారి గురించి తెలుసుకుందాం. టాలీవుడ్లో విభిన్నమైన సినిమాలు తీస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు దర్శక–నిర్మాత, నటుడు రవిబాబు. ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన తర్వాత తన దర్శకత్వంలోని ‘క్రష్’ సినిమా షూటింగ్‌ను ఆరంభించారు రవిబాబు. అయితే కరోనా జాగ్రత్తలను పాటిసూ,్త పీపీఈ సూట్స్ ధరించి షూటింగ్స్ చేయడం అంత సులువైన విషయమేమి కాదని అభిప్రాయపడుతున్నారు రవిబాబు. ఇక ‘విజేత’ చిత్రంతో హీరోగా పరిచయం అయిన చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ కూడా షూటింగ్లో పాల్గొంటున్నారు. కల్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న రెండో చిత్రం‘సూపర్ మచ్చి’ షూటింగ్ ఇటీవల వారం రోజుల పాటు హైదరాబాద్‌లో జరిగింది. అటు బాలీవుడ్‌కి వెళితే... బిగ్ బి అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ నెక్ట్స్ షో కోసం కావాల్సిన ప్రోమో చిత్రీకరణలో పాల్గొన్నారు. కరోనా వైరస్ గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించే ఓ వీడియో కోసం బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ ఈ ఏడాది జూన్‌లో కెమెరా ముందుకు వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. బాలీవుడ్లో ప్రస్తుతం మస్త్ బిజీగా ఉన్న హీరోయిన్లలో తాప్సీ ఒకరు. జూన్‌లో తాప్సీ షూటింగ్లో జాయిన్ అయ్యారు. కరోనా తర్వాత షూటింగ్ లొకేషన్లో అడుగుపెట్టిన తొలి హీరోయిన్ తాప్సీనే అట. వాణిజ్య ప్రకటనల చిత్రీకరణలో పాల్గొన్నారు కథానాయికలు విద్యాబాలన్, కాజల్ అగర్వాల్, సన్నీ లియోన్. దాదాపు నాలుగు నెలల తర్వాత శనివారం షూటింగ్లో పాల్గొన్నారు అర్జున్ కపూర్. ‘‘కొత్త నియమ నిబంధనలను పాటిస్తూ మా వర్క్ లైఫ్‌ను రీస్టార్ట్ చేశాం. నాలుగు నెలల తర్వాత నేను షూటింగ్లో జాయిన్ అయ్యాను’’ అన్నారు అర్జున్ కపూర్. ఓ యాడ్ కోసం డైలాగ్స్ చెప్పారు బాలీవుడ్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా. ‘పాయిజన్ 2’ వెబ్ సిరీస్ కోసం మళ్లీ పని మొదలు పెట్టారు హీరోయిన్ రాయ్ లక్ష్మీ. ఇక హాలీవుడ్ విషయానికి వస్తే... జేమ్స్ కామెరూన్ ‘అవతార్ 2’ చిత్రీకరణను న్యూజిల్యాండ్‌లో ఆరంభించారు. వీరితో పాటు కరోనా జాగ్రత్తల మధ్య మరికొంతమంది షూటింగ్లో జాయిన్ అయ్యారు. ఇంకొందరు సిద్ధమౌతున్నారు. అర్జున్ కపూర్, సన్నీలియోన్ రాయ్ లక్ష్మీ, విద్యాబాలన్ -
మధ్యప్రదేశ్‌లో సినిమా షూటింగ్‌లకు అనుమతి
భోపాల్: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన నిబంధనలకు అనుగుణంగా మధ్యప్రదేశ్‌లో పలు బాలీవుడ్ సినిమా, టీవీ, వెబ్‌సిరీస్‌ల షూటింగ్‌లను తిరిగి ప్రారంభించేందుకు అనుమతించినట్లు రాష్ట్ర పర్యాటక బోర్డు సలహాదారుడు ఆదివారం తెలిపారు. బోర్డు అదనపు మేనేజింగ్ డైరెక్టర్ సోనియా మీనా మాట్లాడుతూ.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం షూటింగ్‌లను తిరిగి ప్రారంభించడానికి బోర్డు కొన్ని నియమాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. రాష్ట్ర టూరిజం బోర్డు ఫిల్మ్ ఫసిలిటేషన్ సెల్ కొన్ని నిబంధనలను జారీ చేసిన అనంతరం కొంతమంది చిత్ర నిర్మాతలు తిరిగి షూటింగ్‌లను పారంభించడానికి అనుమతి కోరుతూ బోర్డును సంప్రదించినట్లు పేర్కొన్నారు. దీంతో బోర్డు కొన్ని మార్గదర్శకాలను విధిస్తూ షూటింగ్‌లకు అనమతించినట్లు తెలిపారు. (ఆ సినిమాలను బాయ్‌కాట్ చేయండి) అవి.. ఇండోర్ షూటింగ్‌కు 15 మంది సిబ్బంది మాత్రమే పాల్గొనాలని, అవుట్ డోర్ షూటింగ్‌లకు 30 మంది పాల్గొనవచ్చని బోర్డు నిబంధనలు విధించిందని చెప్పారు. అంతేగాక షూటింగ్ సిబ్బంది తమ ఆరోగ్యానికి సంబంధించిన ఆరోగ్య పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని, షూటింగ్లో తప్పనిసరిగా సామాజిక దూరం పాటించడం, తరచూ శానిటైజర్ వాడటం, చేతులు కడుక్కుంటూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని తెలిపింది. ఇక సిబ్బందిలో ఎవరైనా కరోనా లక్షణాలతో కనిపిస్తే వెంటనే ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాలని, షూటింగ్ సమయంలో రద్దీకి అనుమతి లేదని బోర్డు స్పష్టం చేసినట్లు మీనా వెల్లడించారు. అంతేగాక భోపాల్, గ్వాలియర్, మహేశ్వర్, ఓర్చా, ఉజ్జయిని, మధాయ్ (హోషంగాబాద్), ఖజురహో, పన్నా, జబల్పూర్లతో పాటు ఇండోర్‌లోని వివిధ ప్రదేశాలలో సుమారు 25 వెబ్ సిరీస్‌లు, సినిమాలు, సీరియల్స్, మ్యూజిక్ వీడియోల షూటింగ్ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని బోర్డు ఆమె తెలిపారు. వాటిలో తమిళం, తెలుగు, బెంగాలీ చిత్రాలు, కనీసం ఐదు వెబ్ సిరీస్‌లు ఉన్నాయని మీనా తెలిపారు. (పాట్నాలో సుశాంత్ మెమోరియల్) -
సెల్ఫీ అంటే కష్టమే
‘రన్ రాజా రన్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్గాపరిచయం అయ్యారు సీరత్ కపూర్. ఆ తర్వాత ‘టైగర్’, ‘రాజుగారి గది 2’,‘ఒక్క క్షణం’ వంటి చిత్రాల్లో సీరత్ నటనకు ప్రేక్షకులు మంచి మార్కులేవేశారు. ఇటీవల ఓటీటీలో విడుదలైన‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రంలోకథానాయికగా నటించారు సీరత్.ఈ సందర్భంగా తన కెరీర్ జర్నీగురించి సీరత్ ఈ విధంగా చెప్పారు. ‘కృష్ణ అండ్ హీజ్ లీల’లో చేసిన పాత్ర గురించి? ఎవరి మీదా ఆధారపడని ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయి పాత్రను ఇందులో చేశాను. ఇతరులు చెప్పింది వింటుంది కానీ తన నిర్ణయానికే ప్రాధాన్యం ఇస్తుంది. ఈ క్యారెక్టర్ గురించి డైరెక్టర్ రవికాంత్ చెప్పినప్పుడు ఆసక్తికరంగా అనిపించింది. ఎందుకంటే నా నిజజీవితానికి కాస్త దగ్గరగా ఈ పాత్ర ఉంటుంది. కరోనా కారణంగా ప్రస్తుతం థియేటర్స్ ఓపెన్ చేసి లేవు. లాక్డౌన్ వల్ల ఆడియన్స్ ఇంట్లోనే ఉంటున్నారు. ఇప్పుడు ఓటీటీ మంచి ఆప్షన్. మంచి కంటెంట్ ఉన్న మా సినిమా ఆదరణ పొందుతోంది. లాక్డౌన్ వల్ల కొందరి జీవనశైలి గాడి తప్పింది.. అవును. చాలా బాధగా ఉంది. అదే సమయంలో నాకింత సౌకర్యవంతమైన జీవితాన్ని ఇచ్చిన ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. లైఫ్‌లో ఎలాంటి ఇబ్బంది లేని అమ్మాయిగా ఇతరుల పట్ల దయగా ఉండాలని, ఎవరినీ అనవసరంగా నిందించకూడదని, చేతనైతే సహాయం చేయాలని, ఎవరికీ హాని చేయకూడదని బలంగా నిర్ణయించుకున్నాను. హీరోయిన్ కావడం వల్ల స్వేచ్ఛ కోల్పోయినట్లు అనిపిస్తోందా? తెరపై మమ్మల్ని చూసి చాలామంది ఇష్టపడతారు. అదే సమయంలో మా వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంటారు. సినిమా స్టార్స్ ఎవరైనా వ్యక్తిగత జీవితాలకు సంబంధించి కొన్ని త్యాగాలు చేయక తప్పదు. యాక్టర్స్ కనిపించినప్పుడు ఫ్యాన్స్ సెల్ఫీ అడుగుతారు. షూటింగ్ చేసి, అప్పటికే అలసిపోయి ఉంటాం. ఒకవేళ షూటింగ్‌కి వెళ్తుంటే సమయానికి లొకేషన్‌కు చేరుకునే టెన్షన్లో ఉంటాం. అప్పుడు సెల్ఫీ అంటే కష్టమే. కానీ అభిమానుల ప్రేమను అర్థం చేసుకోవాలి. వారి ప్రేమ వెలకట్టలేనిది. మీ లైఫ్‌లో లవ్ ప్రపోజల్స్ ఉన్నాయా? ఎక్కువేం రాలేదు కానీ కొన్ని వచ్చాయి. కాలేజ్ డేస్‌లో కొంతమంది అబ్బాయిలు ప్రపోజ్ చేశారు కూడా. అబ్బాయిలు అంత ధైర్యంగా అమ్మాయిలకు ఎలా ప్రపోజ్ చేస్తారా? అని నవ్వుకునేదాన్ని. ఆ విషయంలో అబ్బాయిలంటే నాకు గౌరవం ఏర్పడింది. అయితే నేను ఎవరి లవ్‌నీ అంగీకరించలేదనుకోండి (నవ్వుతూ). ∙కరోనా ‘భౌతిక దూరం’ పాటించాలంటోంది.. మరి.. షూటింగ్‌లు ఆరంభమయ్యాక రొమాంటిక్ సీన్స్ చేయాలంటే.. కథలోని పాత్ర డిమాండ్ చేస్తే ఆ సీన్స్‌లో నటిస్తాను. తప్పదు. అయితే ఇకనుంచి షూటింగ్స్ అన్నీ కరోనాకి తగ్గట్టుగా జరుగుతాయి కదా. చూడాలి మరి.. మీ తర్వాతి ప్రాజెక్ట్స్? ‘మా వింత గాధ వినుమా’ సినిమా చేస్తున్నాను. -
మళ్లీ షూటింగ్‌లకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: తెలుగు టీవీ పరిశ్రమలో కరోనా కలకలం చెలరేగింది. దీంతో మరోసారి షూటింగ్స్‌కు బ్రేక్ పడింది. మంగళవారం ఓ సీరియల్లోని ముఖ్య నటుడికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో వెంటనే ఆ సీరియల్ షూటింగ్‌ను నిలిపివేసి యూనిట్ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. ఈ ఘటనతో మిగతా సీరియల్స్ సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. షూటింగ్‌లు ఇలాగే కొనసాగిస్తే నటీనటులు, సిబ్బంది కరోనా బారిన పడే అవకాశం ఉందని భయభ్రాంతులకు గురవుతున్నారు. దీంతో షూటింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేశారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు నటీనటులు, నిర్మాతలు సమావేశం అయ్యారు. (తెలుగు టీవీ పరిశ్రమలో కరోనా కలకలం) కరోనా లాక్డౌన్ కారణంగా రెండు నెలలకు పైగా వాయిదా పడిన టీవీ సీరియల్స్ షూటింగ్‌లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఇటీవలే మళ్లీ మొదలయ్యాయి. కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్స్ జరుపుతున్నా.. ఓ టీవీ సీరియల్ నటుడికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడం బుల్లితెరను వణికిస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే షూటింగ్ పూర్తి చేసుకున్న పలు చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి. అంతేకాకుండా కొన్ని చిన్న సినిమా షూటింగ్‌లు పలు జాగ్రత్తలతో ప్రారంభమయ్యాయి. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితల నేపథ్యంలో పెద్ద హీరోల సినిమాలు ఈ మధ్యకాలంలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం లేనట్లే కనిపిస్తోంది. (షూటింగ్‌లు స్టార్ట్.. యాంకర్స్ సందడి) -
తెలుగు టీవీ పరిశ్రమలో కరోనా కలకలం
సాక్షి, హైదరాబాద్ : తెలుగు సినిమా పరిశ్రమలో కరోనా కలకలం చోటుచేసుకుంది. ఓ సీరియల్లోని ముఖ్య నటుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో టీవీ సీరియల్ నటుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వివరాల్లోకి వెళితే.. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం టీవీ, సినిమా షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే షూటింగ్‌లు జరిపేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడంతోపాటుగా.. కొన్ని మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. దీంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సీరియల్స్, టీవీ షోల షూటింగ్‌లు ప్రారంభమయ్యాయి. (చదవండి : ఆ జ్ఞాపకాలు షేర్ చేసిన అనసూయ) ఈ క్రమంలో ఓ ప్రముఖ చానల్లో ప్రసారమయ్యే సీరియల్ నటుడికి కరోనా సోకింది. జ్వరం, ఇతర లక్షణాలతో బాధపడుతున్న అతడికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో నిర్మాతలు ఆ సీరియల్ షూటింగ్‌ను నిలిపివేశారు. యూనిట్ సభ్యులందరిని క్వారంటైన్‌కు పంపించినట్టుగా సమాచారం. కరోనా సోకిన నటుడు.. మరో చానల్లో ప్రసారమయ్యే సీరియల్లో కూడా నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ నటుడు ఇప్పటివరకు ఎవరెవరిని కలిసారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక, సినిమాల విషయానికి వస్తే.. కేవలం రెండు, మూడు చిత్రాలు మినహా షూటింగ్‌లు ప్రారంభం కాలేదు. (చదవండి : షూటింగ్‌లు స్టార్ట్.. యాంకర్స్ సందడి) -
షూటింగ్‌లు స్టార్ట్.. యాంకర్స్ సందడి
హైదరాబాద్ : కరోనా లాక్డౌన్ కారణంగా దాదాపు మూడు నెలల తర్వాత టీవీ షూటింగ్‌లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్‌లకు అనుమతించిన తెలంగాణ ప్రభుత్వం.. సెట్లలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అతి తక్కువ మంది సిబ్బందితో షూటింగ్‌లు జరుపుకోవాలని కూడా చెప్పింది. ఇందుకు సంబంధించి పలు మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. షూటింగ్‌లు ప్రారంభం కావడంతో యాంకర్లు తమ పనుల్లో బిజీ అయిపోయారు. దీంతో చాలా రోజుల తర్వాత సెట్లలో సందడి వాతావరణం నెలకొంది. తమ షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్స్ను పలువురు యాంకర్లు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ప్రముఖ యాంకర్ సుమ.. ‘చాల రోజుల తర్వాత సెట్లోకి వచ్చాను. అన్ని జాగ్రత్తలు తీసుకుని.. బాధ్యతగా ఉండాలి’ అని పేర్కొన్నారు. అలాగే తను మేకప్ వేసుకుంటున్న ఓ చిన్నపాటి వీడియోను కూడా సుమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. మరోవైపు నటి, యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్ సెట్లో ఉన్న ఫొటోను షేర్ చేశారు. వీ ఆర్ బ్యాక్ అని తెలిపారు. అలాగే యాంకర్లు రవి, భానుశ్రీలు కూడా షూటింగ్ సెట్లో చేసిన సందడిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. View this post on Instagram Never thought that satti and ramesh will have to dress up like this . A post shared by Suma Kanakala (@kanakalasuma) on Jun 18, 2020 at 6:44am PDT -
మా ఆవిడ ఏ పని చెబితే అది: అలీ
కరోనా వైరస్ నియంత్రణకు 21రోజుల పాటు లాక్డౌన్ విధించడంతో సామాన్య జనం నుంచి ప్రముఖులు వరకూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో హాస్యనటుడు అలీ... ఇంటి పనులతో బిజీ బిజీగా ఉన్నారు. షూటింగ్‌లతో ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఖాళీ దొరకని ఆయన ఇప్పుడు ఇంట్లో వాళ్లు చెప్పిన పనులు చేస్తున్నారు. ’రోజూ కార్లు కడుగుతున్నా.. ఇంట్లో పని చేస్తున్నా. కాయగూరలు కట్ చేస్తున్నా. ఇల్లంతా శుభ్రపరుస్తున్నా. (కిచెన్ స్వాధీనం చేసుకున్న రాజేంద్రప్రసాద్) అప్పుడప్పుడు ఓ గంటో, గంటన్నరో టీవీ చూస్తున్నా. ఇంకా మా ఆవిడ ఏ పని చెబితే అది చేస్తున్నా.. వంట పని లాంటివి. నాకు కొన్ని వంటలు వచ్చు. బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు రూమ్‌లో వంట చేసేవాణ్ణి.. అందుకని నన్ను బాడుగ (అద్దె) కట్టమనేవాళ్లు కాదు. అప్పుడు నా బట్టలు నేనే ఉతుక్కునేవాణ్ణి. ఇస్త్రీ మాత్రం బయట చేయించుకునేవాణ్ణి. అప్పుడు షర్ట్‌కి యాభై పైసలు, ప్యాంటుకి యాభై పైసలు ఉండేది. ఇంటిలో మన పని మనం చేసుకోవడంలో తప్పేమీ లేదు. ఏం మనం స్నానం చేయడం లేదా? వేరే వాళ్లు చేయిస్తున్నారా? చిన్నప్పుడంటే తల్లిదండ్రుల చేయించేవాళ్లు.’ అని తెలిపారు. (బుల్లితెర కార్మికులకు యాంకర్ ప్రదీప్ చేయూత) -
బొమ్మని గీస్తే...
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దీని ప్రభావంతో సినిమా థియేటర్లు మూతపడ్డాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్, హాలీవుడ్ వరకూ సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడింది. ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే నటీనటులకు కరోనా ప్రభావంతో కాస్త విరామం దొరికింది. దీంతో ఇంటి పట్టునే ఉండి తమకు ఇష్టమైన పని చేస్తూ సమయాన్ని గడిపేస్తున్నారు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఇంట్లో ఉండి తన సృజనాత్మకతను బయపెట్టారు. సల్మాన్‌కి బొమ్మలు గీయడం వచ్చు. ఓ బొమ్మ గీస్తూ, ఆ వీడియోను షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు సల్మాన్. డ్రాయింగ్ ప్యాడ్, స్కెచ్‌లు, వాటర్ కలర్స్‌తో కాలక్షేపం చేశారు. కేవలం రెండు నిమిషాల్లోనే చక్కని బొమ్మ వేశారట. ఆ బొమ్మలో ఇద్దరు వ్యక్తుల తలలు, ముఖాలు పాక్షికంగా కప్పబడి ఉన్నాయి. వారి కళ్లు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. సల్మాన్ ఖాన్ స్కెచ్ చూసిన ఆయన అభిమానులు ‘వావ్.. భాయ్’ అని అభినందిస్తున్నారు. -
వారం రోజుల్లో సినిమా షూటింగ్‌లకు పర్మిషన్
సాక్షి, హైదరాబాద్: నిర్మాతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎఫ్డీసీ నోడల్ ఏజెన్సీగా వారం రోజుల్లో సింగిల్ విండో విధానంలో సినిమా షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సినిమా షూటింగ్‌ల అనుమతుల కోసం వివిధ శాఖల అధికారుల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వస్తుందని, దీంతో ఎంతో సమయం వృథా అవుతుందని పేర్కొన్నారు. గురువారం మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో చలనచిత్ర రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. షూటింగ్‌ల నిర్వహణకు అవసరమైన సమాచారాన్ని కొన్ని శాఖలు అందజేశాయని, మరికొన్ని శాఖలు ఇవ్వాల్సి ఉందని, వీలైనంత త్వరగా ఆయా శాఖల సమాచారం కూడా సేకరించాలని ఆదేశించారు. రాష్ట్రంలో సుమారు 600 థియేటర్లు ఉన్నాయని, వీటిలో ఎఫ్డీసీ పోర్టల్ ద్వారా ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని వీలైనంత త్వరగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆర్టీసీ బస్టాండ్లలో మినీ థియేటర్ల నిర్మాణానికి కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో హోంశాఖ ఇన్చార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, పశుసంవర్థకశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎఫ్డీసీ సీఐవో కిషోర్‌బాబు,పలువురు నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గొల్లపూడి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి సీనియర్ నటుడు గొల్లపూడి మారుతీరావు మృతిపట్ల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రచయిత, వ్యాఖ్యాత గా కూడా గొల్లపూడి రాణించారని గుర్తు చేశారు. సుమారు 250 కి పైగా చిత్రాలలో నటించిన ఆయన ఆ నంది అవార్డులు అందుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి గా ఎంతో గుర్తింపు పొందారు. ఆయన మృతి తో చిత్ర పరిశ్రమ ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో హింస
కొలంబో: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల సందర్భంగా హింస చెలరేగింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళుతున్న ముస్లిం ఓటర్ల బస్సుల కాన్వాయ్‌పై ఓ ముష్కరుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. కాల్పులు జరపడంతోపాటు రాళ్లు కూడా విసిరాడని పోలీసులు వెల్లడించారు. దాదాపు 100 బస్సులున్న కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు మార్గంలో దుండగులు టైర్లు కాల్చి వేశారని తెలిపారు. కొలంబో దగ్గర్లోని తాంతిరిమలే ప్రాంతంలో ఘటన చోటుచేసుకుందని చెప్పారు. కాగా, ఎన్నికల్లో దాదాపు 80 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఎక్కువ పోలింగ్ కేంద్రాలతో పాటు దాదాపు 26 అంగుళాల పొడవైన బ్యాలెట్ పేపర్‌తో ఈసారి ఎన్నికలు రికార్డుల్లోకెక్కాయి. ఈ ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడనున్నాయి. -
ఫేస్బుక్ లైవ్‌లపై ఇక ఆంక్షలు
సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఫేస్బుక్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గోప్యతా ఉల్లంఘనల ఆందోళన, న్యూజిలాండ్ నరమేధం సంఘటన తరువాత పలు సంస్కరణలకు పూనుకుంటోంది. ఇటీవల శ్వేత జాతీయవాద, వేర్పాటువాద పోస్టులను, ప్రసంగాలను నిషేధిస్తున్నట్టు ప్రకటించిన సంస్థ తాజాగా మరో దిద్దుబాటు చర్యకు శ్రీకారం చుట్టింది. ఇక పై ఫేస్బుక్ లైవ్‌లను మానిటర్ చేయనుంది. ఈ మేరకు కొన్ని ఆంక్షలు విధించాలని కూడా నిర్ణయించింది. అంటే ఇకపై ఫేస్బుక్ లైవ్‌లపై ఒక కన్నేసి ఉంచుతుందన్నమాట. క్రైస్ట్‌చర్చ్ ఊచకోత సంఘటన లైవ్ స్ట్రీమింగ్పై రేగిన దుమారం నేపథ్యంలో తన ప్లాట్‌పాంపై ప్రత్యక్ష ప్రసారాలను కట్టడి చేయనుంది. ఈ మేరకు ఫేస్బుక్ సీవోవో షెరిల్ శాండ్‌బెర్గ్ శుక్రవారం తన బ్లాగ్‌లో ప్రకటించారు. ప్రామాణిక ఉల్లంఘనలులాంటి అంశాలపై ఆధారఫడి ఫేస్బుక్లో ఎవరు లైవ్‌కు వెళ్లవచ్చు అనే విషయాన్ని ఫేస్బుక్ పరిశీలిస్తుందని ఆమె వెల్లడించారు. చదవండి : న్యూజిలాండ్ సంచలన నిర్ణయం మృతుల్లో ఐదుగురు భారతీయులు -
బిజీ బిజీ
అటు ప్రమోషన్స్ ఇటు షూటింగ్స్‌తో బిజీ బిజీగా ఉంటున్నారు రాశీఖన్నా. విజయ్‌సేతుపతి, రాశీ జంటగా ‘స్కెచ్’ ఫేమ్ విజయ్‌చందర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో ముగిసింది. దీంతో విశాల్ ‘అయోగ్య’ (తెలుగు ‘టెంపర్’ తమిళ రీమేక్) సినిమా ప్రమోషన్స్ కోసం చెన్నై వెళ్లారు రాశీ. విజయ్ సేతుపతి సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కూడా చెన్నైలో స్టార్ట్ కానుంది. అంటే.. కొన్ని రోజులు రాశీ అక్కడే ఉంటారా? అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేఎస్. రవీంద్ర దర్శకత్వంలో ‘వెంకీమామ’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోసం చెన్నై నుంచి రాశీ సూట్ కేస్ సర్దుకుని వేరే లొకేషన్లోకి వాలిపోవాల్సిందే. ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడీగా నటిస్తున్నారు రాశీ. ఇలా గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారీ బ్యూటీ. -
మెక్సికోలో కాల్పులు
గ్వానజువాటో: మెక్సికోలో దుండగులు రెచ్చిపోయారు. గ్వానజువాటో రాష్ట్రంలోని లాప్లాయా నైట్‌క్లబ్‌పై శనివారం తెల్లవారుజామున కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వరంగ ఆయిల్ సంస్థ పెమెక్స్ పైప్లైన్ల నుంచి ఇంధనాన్ని దొంగిలిస్తున్న ముఠాలు లక్ష్యంగా మెక్సికో సైన్యం వేట మొదలెట్టింది. ఈ నేపథ్యంలో అత్యాధునిక ఆయుధాలతో నైట్‌క్లబ్‌పై కాల్పులు జరిపిన దుండగులు ఘటనాస్థలం నుంచి కారులో పరారయ్యారు. పెమెక్స్ పైప్లైన్ల నుంచి ఆయిల్ చోరీ కారణంగా మెక్సికో గత కొన్నేళ్లలో రూ.21,000 కోట్లు నష్టపోయింది. -
అమెరికాలో కాల్పులు..ముగ్గురి మృతి
న్యూ ఓర్లియాన్స్: అమెరికాలోని న్యూ ఓర్లియాన్స్ నగరంలో శనివారం రాత్రి పదిన్నర గంటల సమయంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని దగ్గరలోని రెండు ఆసుపత్రులలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. న్యూఓర్లియాన్స్ నగరంలోని ఫ్రెంచ్ క్వార్టర్ సమీపంలో ఉన్న క్లాయ్‌బోర్న్‌అవెన్యూలో ఈ కాల్పులు జరిగాయి. ముసుగులు ధరించి ఉన్న ఇద్దరు వ్యక్తులు విచక్షణా రహితంగా జన సమూహంపై తుపాకులతో కాల్పులు జరిపారని స్థానిక పోలీసు అధికారి మైఖేల్ హారీసన్ తెలిపారు. కాల్పులు జరిపిన వారిని పట్టుకోవడానికి గాలింపు చర్యలు వేగవంతం చేశామని హారీసన్ తెలిపారు. కాల్పులకు సంబంధించి ఎవరికైనా సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని కోరారు. కాల్పుల సంఘటనను నగర మేయర్ లాటోయో కాంట్రెల్ ఖండించారు. ఇలాంటి ఘటనలకు ఓర్లియాన్స్లో తావులేదని ట్విటర్ ద్వారా తెలిపారు. -
రజనీకాంత్ విల్లా
‘రజనీకాంత్ విల్లాని రెండు రోజులకు బుక్ చేస్తాం. తలైవర్ స్పెషల్ టీ ఇవ్వాలి’ అని అడగాలట అలిట్టా హోటల్లో. ఏంటి చెన్నైలో రజనీకాంత్ అభిమానులెవరైనా ఆయన పేరుతో హోటల్ ఓపెన్ చేశారా? అంటే కాదు. ఇది వెస్ట్ బెంగాల్‌లోని స్టోరీ. రజనీకాంత్ ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో ఓ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వెస్ట్ బెంగాల్లో జరుగుతోంది. షూటింగ్లో భాగంగా రజనీకాంత్ ఓ విల్లాలో పది రోజులు ఉన్నారట. ఆయన గుర్తుగా ఆ రిసార్ట్‌లోని ఒక విల్లాకు రజనీకాంత్ పేరు పెట్టింది హోటల్ మేనేజ్మెంట్. అలాగే అక్కడ రజనీకాంత్‌కి నచ్చిన టీను ‘తలైవర్ స్పెషల్’గా ఇక మీదట సర్వ్ చేయనున్నారట. విల్లాలో బస చేసినందుకు గుర్తుగా రజనీకాంత్ ఆ రిసార్ట్‌లో ఒక మొక్కను నాటడం విశేషం. -
మా జీవితంలో ఆనందం లేదు : హీరోయిన్
తమిళసినిమా: మాది ఆడంబర జీవితమే కానీ ఆనందం లేదు అంటోంది నటి తమన్నా. తమిళం మాత్రమే కాకుండా, తెలుగు, హింది భాషల్లోనూ కథానాయకిగా వెలుగొందుతున్న తమన్నా అంటున్న మాటలు తారలు సంతోషంగా లేరన్నదే. తమన్నా ఏమంటుందో చూద్దాం. నటీమణులు అనగానే సుఖ జీవనం అని అపోహ చాలా మందిలో ఉంది. తమ జీవితాలు సమస్యల మయం అని వారికి తెలియడం లేదు. నటీమణులెవ్వరూ ఇక్కడ పరిపూర్ణ సంతోషాన్ని అనుభవించడం లేదు. రేయనక పగలనక షూటింగ్లో పాల్గొంటున్నాం. ఒక్క నిమిషం కూడా విశ్రమించకుండా శ్రమిస్తున్నాం. షూటింగ్ స్పాట్లో షాట్ రెడీ అని పిలవగానే వెళ్లి నిలబడాలి. మనసులో ఎలాంటి కష్టనష్టాలున్నా, అవి బయట పడకుండా నటించాలి. సొంత పనులకు కూడా సమయాన్ని కేటాయించలేని పరిస్థితి. కాసేపు కుటుంబంతో కలిసి గడపాలని ఆశించినా కుదరదు. ఇష్టమైన ఆహారాన్ని కూడా తినలేం. అందాన్ని కాపాడుకోవడానికి కసరత్తులు చేయాలి. శరీర సౌష్టవాన్ని నాజూగ్గా ఉంచుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణ అమ్మాయిలను చూసినప్పుడు నేను వారిలా స్వేచ్ఛగా జీవించలేకపోతున్నాననే బాధ కలుగుతుంది. అయితే సినిమాలో సంతోషమే లేదని చెప్పను గానీ, మేము చాలా త్యాగాలు చేస్తున్నామన్నది ఇతరులు గ్రహించాలి. సినిమాల్లో కొనసాగడానికి, అవకాశాల కోసం పరితపించాల్సి ఉంటుంది. ఇక్కడ దర్శకుడే కెప్టెన్. వాళ్లు చెప్పినట్లు నటించాల్సిందే అని అంటోంది నటి తమన్నా. పెద్దలు ఊరికే అనలేదు తారల జీవితం అద్దాల మేడ అని. -
అమెరికాలోని మేరీలాండ్‌లో కాల్పుల కలకలం
-
అమెరికాలో కాల్పుల కలకలం
మేరీలాండ్, అమెరికా : అమెరికాలోని మేరీలాండ్‌లో గల నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ(ఎన్ఎస్ఏ) వద్ద కాల్పులు కలకలం రేపాయి. ఎన్ఎస్ఏ ప్రాంతంలో కాల్పులకు దిగిన దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. అరెస్టు చేసిన దుండగుడిని పోలీసులు విచారిస్తున్నారు. -
కోర్టు ఆవరణలో నిందితుడి కాల్చివేత
న్యూఢిల్లీ : ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిపై దేశ రాజధానిలోని రోహిణి కోర్టు కాంప్లెక్స్ పరిధిలో సోమవారం దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నిందితుడు వినోద్ తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. రోహిణి కోర్టు కాంప్లెక్స్ క్యాంటీన్‌కు చేరువలో ఈ ఘటన జరిగినట్లు వివరించారు. కాల్పులతో కోర్టు ఆవరణలోని వారందరూ షాక్‌కు గురైనట్లు తెలిపారు. గాయపడిన వినోద్‌ను ఆసుపత్రికి తరలించేలోగా ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. రోహిణి కోర్టు కాంప్లెక్స్ పరిసరాల్లో కాల్పులు జరగడం ఈ ఏడాది ఇది రెండోసారి. గత ఏప్రిల్‌లో ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని కొందరు కాల్చి చంపారు. -
బర్త్‌డే.. బుల్లెట్స్
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ శివార్లలోని మైలార్‌దేవ్‌పల్లి కింగ్స్‌కాలనీ (శాస్త్రీపురం జిల్లెలగుట్ట)లో శనివారం తెల్లవారుజామున కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. తన వ్యాపారాలపై ఆదాయపన్ను శాఖకు సమాచారమిచ్చాడనే అనుమానంతో జుబేర్ అనే రియల్టర్ ముస్తఫా అనే తన స్నేహితుడిని తుపాకీతో కాల్చాడు. పుట్టినరోజు పార్టీకి పిలిచి.. ఆ పార్టీ అయిపోయిన తర్వాత తుపాకీతో రెండు రౌండ్లు కాల్చాడు. అనంతరం ఆస్పత్రిలో చేర్చి పరారయ్యాడు. కాల్పులు జరిపినట్లుగా భావిస్తున్న జుబేర్ ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన ఎంఐఎం నేత, రియల్ఎస్టేట్ వ్యాపారి షానవాజ్ కుమారుడు. వ్యాపార లావాదేవీలు, అప్పుల వివాదంతోపాటు ఐటీకి సమాచారమిచ్చాడనే అనుమానాలు ఈ కాల్పుల ఘటనకు కారణాలని ప్రాథమికంగా నిర్ధారించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఘటన అనంతరం గాలింపు చేపట్టిన పోలీసులు జుబేర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. పుట్టినరోజు పార్టీలో.. మొఘల్‌పురా ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ముస్తాఫా (35). శుక్రవారం రాత్రి ఓ పుట్టినరోజు పార్టీ కోసం కింగ్స్కాలనీలోని తన స్నేహితుడు, వ్యాపారి జుబేర్ వద్దకు వచ్చారు. పార్టీ చేసుకున్నారు. అయితే శనివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ముస్తాఫాపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముస్తాఫా ఛాతీలో బుల్లెట్ దిగడంతో కుప్పకూలిపోయాడు. అనంతరం జుబేర్‌తో పాటు తోటి స్నేహితులు ఆయనను వెంటనే బంజారాహిల్స్‌లోని విరించి ఆసుపత్రికి తరలించారు. బాధితుడు ముస్తాఫాకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు ఒక బుల్లెట్‌ను వెలికితీశారని మైలార్‌దేవ్‌పల్లి ఇన్స్పెక్టర్ జగదీశ్వర్ వెల్లడించారు. ప్రస్తుతం ముస్తాఫా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. కోలుకున్న తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయని పేర్కొన్నారు. వేగంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు కాల్పుల ఘటన విషయం తెలిసిన వెంటనే పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. నిందితుడు జుబేర్‌కు గతంలో నేరచరిత్ర ఉన్నట్లు గుర్తించారు. అతడికి, ముస్తాఫాకు మధ్య రియల్ ఎస్టేట్ గొడవలు కూడా ఉన్నట్లు తెలిసింది. తనను జుబేర్ బెదిరిస్తున్నాడని గతంలోనే ముస్తాఫా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గుర్తించారు. వారి మధ్య లావాదేవీలు, వివాదాలను తేల్చేందుకు శాస్త్రీపురం జిల్లెలగుట్ట (శాస్త్రీపురం గుట్ట)పై ఉన్న జుబేర్ రియల్ ఎస్టేట్ కార్యాలయంలో సోదాలు చేశారు. కింగ్స్ కాలనీ, శాస్త్రీపురం ప్రధాన రహదారి, జుబేర్ కార్యాలయంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. జుబేర్, ఆయన తండ్రి షానవాజ్‌లు ఇద్దరికీ లైసెన్స్ రివాల్వర్లు ఉన్నాయి. అయితే ముస్తాఫాపై కాల్పులు జరిపింది ఈ లైసెన్స్ రివాల్వర్తోనేనా..? ఇంకేదైనా రివాల్వర్‌తో కాల్పులు జరిపారా అన్నది తేల్చాల్సి ఉంది. ఎవరీ జుబేర్, ముస్తాఫా? ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన ఎంఐఎం నేత, రియల్ఎస్టేట్ వ్యాపారి షానవాజ్ కుమారుడు జుబేర్. జుబేర్ కూడా కొన్నేళ్లుగా ఇదే వ్యాపారం చేస్తున్నారు. ఇక మొఘల్‌పురా ప్రాంతానికి చెందిన ముస్తాఫా గతంలో చిన్నపాటి రియల్ ఎస్టేట్ వ్యాపారి. తర్వాతి కాలంలో జుబేర్‌తో స్నేహం ఏర్పడింది. అనంతరం ముస్తాఫా కొంతకాలంలోనే పెద్ద రియల్టర్‌గా ఎదిగారు. అప్పటినుంచి జుబేర్‌కు కుడిభుజంగా వ్యవహరిస్తున్నాడని, ఆయన వ్యాపారాల్లో భాగస్వామిగా కూడా ఉన్నారని సమాచారం. అయితే కొంతకాలం కింద జుబేర్ కార్యాలయం, ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఐటీ శాఖకు సమాచారమిచ్చింది ముస్తాఫాయేనని జుబేర్ అనుమానించడంతో.. వారి మధ్య విభేదాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. -
నో సెట్టింగ్ రెడీ 2 షూటింగ్
సినిమా అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సెట్టింగ్స్ లేకుండా ఒక్కపనీ జరగదు. చివరికి స్టూడియోల్లో సైతం సీన్‌కు తగ్గట్టు ‘సెట్’ చేయాల్సిందే. ఖరీదైన ఇల్లులాంటిది వేయాలంటే.? అందులో ఇంటీరియర్ రిచ్‌గా ఉండాలంటే.? మాత్రం లక్షలకు లక్షలు ఖర్చు చేయాల్సిందే. మరి ఏ గ్రాఫిక్నో నమ్ముకుంటే.? అబ్బే.. ప్రేక్షకులు గుర్తుపట్టేస్తారు. అంతా నేచురల్‌గా ఉండాలి. మరేం చేయాలి. నిజమైన ఇంట్లోనే షూటింగ్ చేయాలి. అదెలా అంటారా? ఇప్పుడు నగరంలోని కొన్ని ఖరీదైన ఇళ్లను అద్దెకు ఇస్తున్నారు. ఇళ్ల యజమానులకు ఇదో ఆదాయ మార్గంగా మారింది. ‘లౌక్యం’ సినిమాలోని కొన్ని సీన్లు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్.72లోని ఇంట్లో (ఇంటి నంబర్ 96–3) చిత్రీకరించారు. ఆ ఇంటి యజమానికి సినిమాలంటే ఇష్టం. నాలుగేళ్లుగా ఆ ఇంట్లో చాలా సినిమాలు షూట్ చేశారు. లైఫ్ ఈజ్ బ్యూటిపుల్, పైసా, పవిత్ర, ఒక లైలా కోసం.. వంటి సినిమాల్లోని ఇంటి లోపల సీన్లు చాలా వరకూ ఇక్కడే చిత్రీకరించారు. షూటింగ్ లొకేషన్‌కు తగ్గట్టుగా ఈ ఇంట్లోని చెట్లు, మొక్కలు అందర్నీ ఆకర్షిస్తాయి. అందుకే ఈ ఇల్లు సినిమా లొకేషన్‌గా మారింది. సెట్టింగులకు బోలెడంత ఖర్చుతో పాటు సమయం కూడా వృథా అవుతుంది. అందుకే రిచ్‌గా ఉండే హౌస్‌లను నమ్ముకుంటున్నారు నిర్మాతలు. నగరంలో ఇలాంటి ఇళ్లు పదుల సంఖ్యలో ఉన్నాయి. అలాంటి ఇళ్లను కొన్ని రోజులు బుక్ చేసుకొని తక్కువ మొత్తంలోనే పని కానిచ్చేస్తున్నారు. సినిమాలపై అభిమానం, వెండితెరపై తమ ఇల్లు కనిపిస్తుందన్న ఆశ.. పైగా ఆర్థికంగా లాభసాటిగా ఉండడంతో వాటి యజమానులూ ఓకే అంటున్నారు. ఇంటి లోపల రిచ్‌నెస్ క్లాస్ అండ్ క్లాసిక్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని సాయితేజ అపార్ట్మెంట్ టెరస్ర్ సినిమా లొకేషన్ పాయింట్. అపార్ట్మెంట్ ఐదో అంతుస్తులో ‘ఎరబ్రస్సు’ చిత్రీకరణ జరిగింది. ఇంటి యజమాని రవీంద్రారెడ్డి బిల్డర్. దీంతో ఇంటిని కాస్త భిన్నంగా, అందంగా కట్టించారు. టెరస్ర్పై విశాల స్థలంలో గార్డెన్ ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా చేయించుకున్న వాల్ మ్యూరల్స్ ఈ గార్డెన్‌కు అదనపు ఆకర్షణ. అంతేకాదు అడుగడుగునా శిల్పకళా సౌందర్యం కనిపిస్తుంది. రాత్రిపూట టెరస్ర్ మొత్తం రంగురంగుల కాంతుల్లో మెరిసిపోతుంది. రెండేళ్లుగా ఈ ఇంట్లో పదుల సంఖ్యలో సినిమాలు షూట్ చేశారు. ఇంటి లోపల లేటెస్ట్గా డిజైన్ చేసిన ఓపెన్ కిచెన్, విశాలమైన హాల్ కూడా షూటింగ్లో చేరిపోయాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్. 26లోని ‘ఛత్రపతి హౌస్’లోనూ షూటింగ్‌లు జరుగుతుంటాయి. ‘ఛత్రపతి’ సినిమాలోని చాలా సీన్లు ఇక్కడ షూట్ చేయడంతో ఆ ఇంటికా పేరు వచ్చింది. -
తుపాకి రాజ్యంలో ఉన్మాదం
ఆయుధాలపై ఉన్న యావను వదుల్చుకోవడానికి ససేమిరా సిద్ధపడని అమెరికా అందుకు మరోసారి మూల్యం చెల్లించింది. సోమవారం లాస్‌వెగాస్‌లో కోలా హలంగా సాగుతున్న సంగీత కచేరీని తన్మయులై వీక్షిస్తున్న వేలాదిమందిపై అక్కడికి సమీపంలో ఉన్న భవనం నుంచి విచక్షణారహితంగా కాల్పులు సాగించి ఒక ఉన్మాది 59మందిని పొట్టనబెట్టుకుని, మరో 515మందిని గాయపరిచాడు. 32వ అంతస్తు నుంచి ఇష్టానుసారం కాలుస్తుంటే ఎటునుంచి ఎవరు గురిపెట్టారో, ఎటు పోయి ప్రాణాలు దక్కించుకోవాలో తెలియక వేలాదిమంది పరుగులు తీశారు. ఇదంతా తమ ఘనతేనని ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ప్రకటించుకున్నా ఆ సంస్థ నెవరూ విశ్వసించే స్థితి లేదు. అమెరికా విధానాలనూ, రాజకీయాలనూ తుపాకులే శాసిస్తున్న దుస్థితిలో ఇలాంటి ఉన్మత్త ఉదంతాలు నిరాటంకంగా కొనసాగడంలో వింతేమీ లేదు. ఇప్పుడు విషాద ఘటన చోటుచేసుకున్న లాస్‌వెగాస్ నెవడా రాష్ట్రం లోనిది. అక్కడ రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నవారికంటే, అంటువ్యాధులతో మరణిస్తున్నవారికంటే తుపాకులకు బలవుతున్నవారి సంఖ్యే అధికంగా ఉన్నదంటే ఆయుధాలెంత విచ్చలవిడిగా పెరిగిపోయాయో అర్ధం చేసుకోవచ్చు. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ లాస్‌వెగాస్ ఘటనపై విచారం వ్యక్తం చేసి ఉండొచ్చు. కానీ ఈ పాపంలో ఆయనా, ఆయన ప్రాతినిధ్యం వహి స్తున్న రిపబ్లికన్ పార్టీ తమ బాధ్యత నుంచి తప్పించుకోలేరు. తుపాకుల వినియో గాన్ని నియంత్రించడానికి ఉద్దేశించిన బిల్లు సెనేట్ ముందుకొచ్చినప్పుడల్లా రిపబ్లికన్లు గట్టిగా వ్యతిరేకిస్తూ వచ్చారు. ఆఖరికి నిరుడు జూన్‌లో ఓర్లాండో నైట్ క్లబ్‌పై దాడి జరిగి 50మందిని కాల్చిచంపిన తర్వాత కూడా సెనేట్‌లో వచ్చిన ప్రతిపాదనలను వారు తోసిపుచ్చారు. ఈ మాదిరి తుపాకి సంస్కృతి అమెరికాలో మినహా ప్రపంచంలో మరే దేశంలోనూ లేదు. బ్రిటన్‌తోసహా అభివృద్ధి చెందిన దేశాలన్నీ క్రమేపీ దానికి దూరమయ్యాయి. పరిమితులు విధించుకున్నాయి. అమెరికాలో కూడా తుపాకి లైసెన్స్‌ల జారీలో ఆంక్షలను అమలు చేస్తున్న రాష్ట్రాలు న్నాయి. ఆ రాష్ట్రాల్లో కాల్పుల ఘటనలు అతి స్వల్పంగా ఉన్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయినా వాటిని ఆదర్శంగా తీసుకోవడానికి ఫెడరల్ ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలూ నిరాకరిస్తున్నాయి. సంక్షోభం తలెత్తినప్పుడు దాన్ని అన్ని కోణాల్లోనూ పరిశీలించి పరిష్కరిం చడం, భవిష్యత్తులో తలెత్తకుండా చూడటం ప్రభుత్వం బాధ్యత. ప్రజల స్పంద నలను తెలుసుకోవడం, వాటిపై చర్చ జరిగేలా చూడటం, సహేతుకమైన నిర్ణయం తీసుకుని సమాజాన్ని ఒప్పించడం దాని కనీస కర్తవ్యం. కానీ అమెరికాలో దేని దారి దానిదే. ఘటన జరిగిన రోజు దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం మినహా ప్రభుత్వం వైపు చేసేదేమీ ఉండదు. అటు విపక్షం నుంచి చెదురుమదురు ప్రకటనలొచ్చినా వాటిని ఖండించేందుకు తుపాకి లాబీల నుంచి కొందరు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. లాస్‌వెగాస్ ఘటన తర్వాత హిల్లరీ క్లింటన్ తుపాకులను అదుపు చేయా లని డిమాండ్ చేస్తే ఆ వెంటనే దాన్ని రాజకీయం చేయొద్దని విమర్శిస్తూ ట్విటర్ హోరెత్తింది. పైగా కాల్పుల ఘటన చోటు చేసుకున్నాక తుపాకులు ఉండాలా వద్దా అనే అంశంపై సర్వేలు జరగడం, వాటిల్లో అధిక సంఖ్యాకులు ఉండాలని కోరడం రివాజుగా మారింది. రెండేళ్లక్రితం ఒరెగన్ రాష్ట్రంలో కళాశాలలోకి ప్రవేశించి ప్రొఫెసర్‌తో పాటు మరో 9 మందిని ఒక ఉన్మాది కాల్చి చంపినప్పుడు అప్పట్లో రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న ట్రంప్, జెబ్ బుష్లిద్దరూ తుపాకుల నిషేధం డిమాండ్‌ను అవహేళన చేశారు. ‘సమస్య పరిష్కారం తుపా కుల నిషేధంలో లేదు. మరిన్ని తుపాకులు అందుబాటులోకి తీసుకురాకపోవ డంలో ఉంది’ అని వాదించారు. కళాశాల విద్యార్థుల వద్ద తుపాకులుంటే ఆ ఉన్మాదిని సులభంగా నిలువరించేవారని చెప్పారు. తుపాకులు కొంటున్నవారెవరో, వారికి ఆ అవసరం ఎందుకొచ్చిందో తెలుసు కోవాలన్న ఆసక్తి ప్రభుత్వాలకు ఉండటం లేదు. కొంటున్నవారి నేపథ్యం తెలియక పోవడం ప్రమాదానికి దారితీయొచ్చన్న సంశయంగానీ, అమ్మకాలపై నిఘా అవసరమనిగానీ వాటికి తోచడం లేదు. లాస్‌వెగాస్ ఘటనే తీసుకుంటే ఉన్మాది స్టీఫెన్ పెడాక్ చాలా సాధారణమైన వ్యక్తి అని, అతనికి ఏ సంస్థతోనూ సంబంధాల్లే వని అతడి సోదరుడు చెబుతున్నాడు. అలా అంటూనే అతన్ని కలిసి ఆర్నెల్లయిం దని అంటున్నాడు. అటు పోలీసులు సైతం పెడాక్పై గతంలో ఎలాంటి కేసులూ లేవంటున్నారు. పెడాక్‌కు స్వయానా సోదరుడైన వ్యక్తికే సరైన సంబంధాలు లేనప్పుడు ఇరుగుపొరుగువారి గురించి చెప్పేదేముంది? సవ్యంగానే ఉన్నాడను కున్న వ్యక్తి ఒక హోటల్లో రూం తీసుకుని అక్కడ 45 తుపాకులు పోVó శాడంటే, ఆ సంగతి ఎవరికీ తెలియలేదంటే తామెంతటి ప్రమాదకర స్థితిలో ఉన్నామో అమెరికన్లు అర్ధం చేసుకోవాల్సి ఉంది. ప్రపంచంలో ఉగ్రవాదం ఏమూలనున్నా అంతం చేస్తామని చెప్పే అమెరికా తన ఇంట ఏం జరుగుతున్నదో తెలుసుకోలేక పోవడం ఒక వైచిత్రి. దాడి చేసిన వ్యక్తి ముస్లిం అయితే వెనువెంటనే ఆ చర్యను ఉగ్రవాదంగా ప్రకటించే ట్రంప్ ఈ ఉదంతంలో దాని ఊసెత్తలేదు. నెవడా చట్టం ప్రకారం విద్రోహ చర్య, భౌతికంగా హాని తలపెట్టడం, బలప్రయోగంతో నిర్బంధించడం, విధ్వంసం సృష్టించడం, భవనం లేదా మరే ఇతర ఆస్తులను, కమ్యూనికేషన్లు, రవాణా సదాపాయాలను విచ్ఛిన్నం చేయడం, ప్రకృతి వనరులకు నష్టం కలిగిం చడం వగైరాలు ఉగ్రవాదం కిందికొస్తాయని చెబుతున్నది. లాస్ వెగాస్ ఉదం తంలో ఇవన్నీ వర్తించినా ఆ పదాన్ని ఉపయోగించకపోవడాన్నిబట్టి ట్రంప్ ఆంత ర్యాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఏటా తుపాకులు, తూటాల పరిశ్రమ రూ. 10,000 కోట్లకుపైగా లాభాలను ఆర్జిస్తూ వెలుగులీనుతుంటే రోడ్లపై అమాయకులు పిట్టల్లా రాలుతున్నారు. తుపాకి ఉండటం ఒక హోదాగా భావిస్తూ, ప్రాణానికి అదే గ్యారెంటీ అని నమ్ముతూ బతికితే అసలుకే మోసం వస్తుందని సగటు పౌరులు గ్రహించనంత వరకూ, పాలకులపై ఒత్తిడి తీసుకురానంత వరకూ ఇలాంటి ఉన్మాద చర్యలు ఆగవు. -
విక్రమ్‌గౌడ్ అరెస్టు.. వీల్‌ఛైర్‌పై కోర్టుకు!
హైదరాబాద్: సంచలనం రేపిన కాల్పుల డ్రామా కేసులో మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ తనయుడు, కాంగ్రెస్ నేత విక్రమ్ గౌడ్‌ను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొంటూ అపోలో ఆస్పత్రి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఆ వెంటనే పోలీసులు విక్రమ్ గౌడ్‌ను అదుపులోకి తీసుకొని.. వీల్‌ఛైర్ మీదనే ఆయనను కోర్టుకు తరలించారు. జనాల్లో సానుభూతి కూడగట్టుకునేందుకు విక్రమ్ గౌడ్ ఈ కాల్పుల డ్రామాకు తెరతీశారని పోలీసులు బుధవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. విక్రమ్ గౌడ్‌పై జరిగిన కాల్పులు వెనుక ప్రధాన సూత్రధారి కూడా ఆయనేనని, పథక రచన, కాల్పులకు కాంట్రాక్ట్ ఇవ్వడం, ఆయుధాన్ని దాచి పెట్టడం, నిందితులకు షెల్టర్ ఇవ్వడం.. ఇలా ప్రతి అంశాన్నీ విక్రమ్ స్వయంగా పర్యవేక్షించాడని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఇలా తనపై తాను కాల్పులు జరిపించుకోవడం వెనుక ప్రధాన కారణాలను పోలీసులు గుర్తించారు. కాల్పుల పథక రచన వెనుక విక్రమ్ గౌడ్‌కు ఈ కింది ఉద్దేశాలు ఉన్నట్టు వెల్లడించారు.. ♦ సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న నేపథ్యంలో పార్టీ టికెట్, తన నియోజకవర్గ ప్రజల్లో సానుభూతి పొందడం.. ♦ తన శత్రువులపై పోలీసుల దృష్టి పడేలా చేయడం, అప్పులవాళ్లు తన జోలికి రాకుండా చేయడం.. ♦ ఒడిశాలో మైనింగ్ రంగానికి సంబంధించి సాంబశివరావు దగ్గర తాను పెట్టుబడిగా పెట్టిన సొమ్ము తిరిగి తెప్పించుకోవడం.. ♦ కొంతకాలంగా దూరంగా ఉంటున్న కుటుంబంతో పాటు స్నేహితుల నుంచీ సానుభూతి పొందటం.. ♦ గతంలో రద్దయిన ఆయుధ లైసెన్స్ తిరిగి పొందటంతో పాటుపోలీసులే గన్మన్లను ఏర్పాటు చేసేలా చేయడం.. -
నాకు నచ్చనది అదే: రజనీకాంత్!
చెన్నై: తనకు నచ్చని విషయాల్లో వర్క్ హాలిడే ఒకటని దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ పేర్కొన్నారు. ప్రస్తుతం తమిళసినిమా పెద్ద సమస్యను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తమిళ నిర్మాతల మండలి, దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య(ఫెఫ్సీ)కి మధ్య వేతనాలు, విధి విధానాల విషయంలో విభేదాల కారణంగా ఫెఫ్సీ సమ్మెకు దిగడంతో మంగళవారం నుంచి చాలా వరకు చిత్రాల షూటింగ్‌లు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి బృందం నిన్న ఉదయం నటుడు రజనీకాంత్‌ను కలిసి పరిస్థితులను వివరించారు. దీనిపై రజనీకాంత్ స్పందిస్తూ ఇరు సంఘాల వారు సామరస్య చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ తనకు నచ్చని కొన్ని విషయాల్లో పని నిలిపివేయడం ఒకటన్నారు. ఎలాంటి సమస్య అయినా చర్చలతో పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా ఆర్కే.సెల్వమణి మాట్లాడుతూ మంగళ, బుధవారం 40కి పైగా చిత్రాల షూటింగ్‌లు రద్దయ్యాయని, అందులో రజనీకాంత్ నటిస్తున్న కాలా చిత్రం కూడా ఉందని పేర్కొన్నారు. కాలా షూటింగ్లో 150 మంది పని చేస్తున్నారని, ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ రజనీని కలిసి పరిస్థితి వివరించామన్నారు. ఆయన ఆనారోగ్యంతో ఉన్నా ఓపిగ్గా సమస్యను విన్నారని ఆర్కే.సెల్వమణి తెలిపారు. -
వ్యాపారి మురళీని కాల్చి చంపేశారు!
పార్వతీపురంలో కాల్పుల కలకలం విజయనగరం: జిల్లాలోని పార్వతీపురంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండుగులు స్థానిక వ్యాపారి మురళీపై దాడి చేశారు. తుపాకీతో ఆయనను కాల్చిచంపి.. పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీమ్స్‌తో సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. మురళీ వ్యాపార భాగస్వాములను ప్రశ్నిస్తున్నారు. మురళీని ఎవరు హత్య చేశారు? ఎందుకు ఈ హత్య జరిగింది? అన్న కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. -
అమెరికాలో మళ్లీ కాల్పులు
- లిటిల్‌రాక్ సిటీలోని నైట్‌క్లబ్‌లో తూటాల వర్షం - 17 మందికి గాయాలు.. హైఅలర్ట్ లిటిల్‌రాక్: న్యూయార్క్‌లో వైద్యుడి కాల్పుల ఉదంతం జరిగిన కొద్ది గంటలకే.. అర్కాన్సస్ రాష్ట్ర రాజధాని లిటిల్ రాక్ సిటీలో భీకరకాల్పులు చోటుచేసుకున్నాయి. శుక్రవారం రాత్రి నగరంలోని ఓ నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో సుమారు 17 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు నైట్‌క్లబ్, పరిసర ప్రాంతాలను చుట్టుముట్టారు. ఇది ఉగ్రదాడేమోననే భయంతో అక్కడివారు భయాందోళనకు గురయ్యారు. నైట్‌క్లబ్‌లో రెండు వర్గాలకు మధ్య తలెత్తిన వివాదమే కాల్పులకు దారితీసిందని లిటిల్ రాక్ సిటీ పోలీస్ చీఫ్ కెన్టన్ బక్నర్ మీడియాకు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని, కాల్పులు జరిపిన దుండగుడిని ఇంకా గుర్తించలేదని పేర్కొన్నారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. (న్యూయార్క్‌లో డాక్టర్ కాల్పులు.. సహవైద్యురాలి మృతి, ఆరుగురికి గాయాలు) -
మ్యూనిక్‌లో కాల్పులు; కలకలం
మ్యూనిక్: జర్మన్‌లోని ప్రఖ్యాత మ్యూనిక్ నగరం మంగళవారం కాల్పులతో దద్దరిల్లింది. సబర్బన్ రైల్వే స్టేషన్లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రైల్వే స్టేషన్లో సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో దుండగుడు.. ఓ మహిళా పోలీసు నుంచి తుపాకి లాక్కుని కాల్పులు జరిపినట్లు సమాచారం. కాల్పుల్లో మహిళా పోలీసుల సహా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు చెప్పారు. అరగంట ఉత్కంఠ అనంతరం నిందితుడిని బంధించగలిగామని, ప్రస్తుతం ప్రజలకు ఎలాంటి అపాయం లేదని పోలీసులు ప్రకటించారు. కాల్పులు జరిగిన సబర్బన్ రైల్వే స్టేషన్ నుంచి నేరుగా మ్యూనిక్ ఎయిర్‌పోర్టుకు వెళ్లే వీలుండటంతో ఇది ఉగ్రచర్యేమోనని అధికారులు హడలిపోయారు. సరిగ్గా ఏడాది కిందట మ్యూనిక్‌లోని షాపింగ్ మాల్లో చోటుచేసుకున్న ఉగ్రదాడిలో 10 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. -
హింసాత్మకంగా నిరసన ర్యాలీ
-
నేను పర్ఫెక్ట్ కాదు!
సమంత మంచి నటి. ఆమె చేస్తున్న సినిమాలు చూసినవాళ్లు ఈ మాటతో ఏకీభవిస్తారు. ఈ బ్యూటీ మంచి మనసున్న అమ్మాయి కూడా. అందుకు నిదర్శనంగా ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలను చెప్పొచ్చు. ఓవరాల్‌గా సమంత గురించి ఎవరైనాసరే ‘పర్ఫెక్ట్ గాళ్’ అనుకుంటారు. కానీ, సమంత మాత్రం ‘నేను పర్ఫెక్ట్ కాదు’ అంటున్నారు. గత ఎనిమిది నెలలుగా షూటింగ్స్‌తో ఆమె ఫుల్ బిజీ. ఈ సమ్మర్లో ఇప్పటికే తమిళ చిత్రం ‘తెరి’, తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ‘24’ చిత్రాలతో తెరపై మెరిశారు. ఇంకా ‘బ్రహ్మోత్సవం’, ‘ఆ..ఆ’ విడుదలకు సిద్ధమవుతున్నాయి. చేతిలో రెండు, మూడు సినిమాలున్నాయి. మొత్తానికి వేసవిలోనే నాలుగు సినిమాలు విడుదల ఉండటంతో నాన్‌స్టాప్‌గా షూటింగ్ చేశారు. ఆ విషయం గురించి సమంత చెబుతూ - ‘‘ఈ ఎనిమిది నెలలు రెస్ట్ లేకుండా షూటింగ్స్ చేశాను. ఒక్కోసారి అలసిపోయేదాన్ని. కానీ, నా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల చేయగలిగాను. నా పని ఒత్తిడి వల్ల నేను పర్ఫెక్ట్ కూతురిగా, పర్ఫెక్ట్ ఫ్రెండ్‌గా, పర్ఫెక్ట్ గాళ్ ఫ్రెండ్‌గా ఉండలేకపోయాను. అందుకే కొంచెం ఒత్తిడి తగ్గించుకోవాలనుకుంటున్నాను. ఇంకొన్ని రోజులకు కొత్త సినిమాలేవీ అంగీకరించకూడదని నిర్ణయించుకున్నాను’’ అన్నారు. దీన్నిబట్టి సమంత ఈ మధ్య ఏ స్థాయిలో హార్డ్‌వర్క్ చేశారో ఊహించుకోవచ్చు. -
ప్యారిస్ ఉగ్రదాడులు జరిగిందిలా..
ప్యారిస్: ఫ్రాన్స్ ఉగ్రవాద దాడుల్లో సుమారు 150 మందికి పైగా మరణించారు. మరో 300 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. దాడులు జరిగిన తీరు ఇలా ఉంది... మొదటగా టెన్త్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్ లో కాల్పులు జరిగాయి. అత్యాధునిక తుపాకులు చేతపట్టుకున్న దుండగులు.. భోజనం చేస్తున్నవారిపై కాల్పులు జరిపారు. ఆ వెంటనే జాతీయ ఫుట్ బాల్ స్టేడియం స్టేడ్ డీ ఫ్రాన్స్ బయట మూడు శక్తిమంతమైన పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో ఫ్రాన్స్, జర్మనీల మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ జరుతుండటంతో స్టేడియం కిక్కిరిసి ఉంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోసిస్ హోలాండ్ కూడా అదే స్టేడియంలో మ్యాచ్ వీక్షిస్తుండటం గమనార్హం. పేలుళ్ల శబ్ధంతో ఉలిక్కిపడ్డ అధికారులు.. అధ్యక్షుణ్ని సురక్షిత ప్రాంతానికి తరలించి, ప్రేక్షకులను అత్యవసరద్వారాలగండా బయటికి పంపేప్రయత్నం చేశారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న తోపులాటలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. మరి కాసేపటికే లెవెన్త్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలోని ఓ థియేటర్ లోకి చొరబడ్డ దుండగులు.. ప్రేక్షకులపై ఏకబిగిన కాల్పులు జరిపారు. ఇక్కడ కనీసం 15 మంది మరణించినట్లుగా భావిస్తున్నపోలీసులు.. వందలమందిని ఉగ్రవాదులు బందీలుగా తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. సెంట్రల్ ఫ్రాన్స్ లోని బటాక్లాన్ కాన్సెర్ట్ హాలులోనూ ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. అత్యధిక ప్రాణనష్టం ఇక్కడే జరిగినట్లు పోలీసులు తెలిపారు. చార్లీ హెబ్డో పత్రికా కార్యాలయానికి ఈ ప్రాంతం కూతవేటు దూరంలో ఉండటం గమనార్హం. గత జనవరిలో చార్లీ హెబ్డో ఆఫీసులో జరిగిన ఉగ్రదాడిలో 17 మంది దుర్మణం చెందిన సంగతి తెలిసిందే. ఇక్కడికి సమీపంలోని ఓ కాంబోయియన్ రెస్టారెంట్ లోకీ చొరబడ్డ దుండగులు ముగ్గురిని హతమార్చారు. వరుస కాల్పులు, పేలుళ్ల సంఘటనలతో అప్రమత్తమైన ఫ్రాన్స్ ప్రభుత్వం అత్యయిక పరిస్థితిని ప్రకటించింది. యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ దళాలు, క్యాబినెట్ మంత్రులు, పారిస్ మేయర్, ఇతర ఉన్నతాధికారులతో ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ అత్యవసర సమావేశం నిర్వహించి, పరిస్థితిని సమీక్షించారు. పారిస్ లో ఉగ్రవాదుల దాడులను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఖండించారు. అమాయక ప్రజలను పొట్టనబెట్టుకుంటున్నారని, ఇది మానవత్వంపై జరిగిన దాడి అని పేర్కొన్నారు. కాల్పుల ఘటనపై యురోపియన్ యూనియన్ (ఈయూ) చీఫ్ జేన్ క్లౌడే జాంకర్ దిగ్భాంతి వ్యక్తం చేశారు. గడిచిన ఏడాది కాలంగా ఫ్రాన్స్ లో చోటుచేసుకున్న కాల్పుల ఉదంతాల్లో 200 మందికిపైగా అమాయకులు ప్రాణాలు కోల్పోవటం శోచనీయం. కాగా, ఈ సంఘటనలకు బాధ్యత వహిస్తున్నట్లు ఉగ్రవాద సంస్థలేవీ ఇప్పటివరకు ప్రకటించలేదు. అయితే, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సంస్థపై అమెరికా, రష్యా, ఫ్రాన్స్ దేశాలు మూకుమ్మడిగా దాడులు చేస్తుండటంతో.. తమ లక్ష్యం రష్యానే అని వాళ్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ప్యారిస్ ఉగ్రదాడులు జరిగిందిలా..
-
బిజీ బిజీ
మన స్టార్ హీరోల్లో చాలామంది ప్రస్తుతం షూటింగ్స్‌తో బిజీ బిజీగా ఉన్నారు. మరికొందరు ప్రీ-ప్రొడక్షన్లో పాలుపంచుకుంటూ, నెక్ట్స్ మంత్ సెట్స్‌కి వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆ విశేషాల్లో కొన్ని మీ కోసం.... ఒకటికి రెండు! సీనియర్ స్టార్ హీరో నాగార్జున చాలా బిజీగా ఉన్నారు. నూతన దర్శకుడు కల్యాణకృష్ణ దర్శకత్వంలో ‘సోగ్గాడే చిన్నినాయనా’ చేస్తున్నారు. ఆ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. ఈ నెల 26న హైదరాబాద్‌లో ఈ సినిమాకు సంబంధించి మరో షెడ్యూలు మొదలుకానుంది. ఇది కాక, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ హీరో కార్తీతో కలిసి నాగ్ నటిస్తున్న మరో చిత్రం కూడా చిత్రీకరణ దశలో ఉంది. జూలై 10 తర్వాత ఈ సినిమా షెడ్యూలు ఉంటుందని సమాచారం. మహారాష్ట్ర టు గుజరాత్ పవన్‌కల్యాణ్ కూడా కొత్త సినిమా షూటింగ్‌కు సిద్ధమయ్యారు. పవన్ కల్యాణ్ హీరోగా బాబీ దర్శకత్వంలో శరత్‌మరార్ నిర్మిస్తున్న ‘గబ్బర్‌సింగ్2’ (ఇది వర్కింగ్ టైటిల్. అసలు పేరింకా ఖరారు కాలేదు) ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. మహారాష్ట్రలోని పుణేకు సమీపంలో ఇటీవలే కొద్దిరోజులు చిత్రీకరణ జరిపారు. త్వరలోనే రెండో షెడ్యూల్ గుజరాత్లో ప్రారంభం కానుంది. మొన్నటి దాకా బెంగుళూరు పరిసరాల్లో జిమ్‌కు వెళుతూ కనిపించిన పవన్ ఆ షెడ్యూల్‌కు తనను తాను సిద్ధం చేసుకుంటున్నారు. ఒకటి చివర్లో..! మరొకటి మొదట్లో..! స్టార్ హీరో మహేశ్ ఇప్పుడు ‘శ్రీమంతుడు’ చిత్రం పూర్తి చేసే హడావిడిలో ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుదిఘట్టంలో ఉంది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణా ఏడెకరాల్లో వేసిన గాజుల దుకాణాల స్ట్రీట్ సెట్లో చిత్రీకరణ సాగుతోంది. మహేశ్‌తో పాటు శ్రుతీహాసన్, తదితరులు షూటింగ్లో పాల్గొంటున్నారు. మహేశ్ పుట్టిన రోజు (ఆగస్టు 9) కానుకగా, ఆగస్టు 7న ‘శ్రీమంతుడు’ విడుదల కానుంది. ఈ సినిమా ఇలా చివరలో ఉండగానే, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘బ్రహ్మోత్సవం’కి ఇప్పటికే పూజాకార్య క్రమాలు జరిపారు. ‘శ్రీమంతుడు’ పూర్తవుతూనే, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్లో మహేశ్ పాల్గొంటారు. విదేశాలకు... రెడీ ‘టెంపర్’ తర్వాత ఎన్టీఆర్ స్పీడు పెంచారు. వరుసపెట్టి సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో ఆయన ఓ సినిమా కమిటయ్యారు. ఈ నెలాఖరు నుంచి యూరప్‌లో భారీ షెడ్యూలు జరగనుంది. ఇప్పటికే సుకుమార్, ఛాయా గ్రాహకుడు విజయ్ కె. చక్రవర్తి యూరప్‌లో లొకేషన్ల ఎంపిక పూర్తిచేశారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేస్తారని కృష్ణానగర్ కబురు. జోరు... మాస్ ఎంటర్టైనర్ల హోరు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ హీరోగా చేసిన ‘కిక్2’ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటోంది. కొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులతో పాటు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రవితేజ, మరోపక్క సంపత్ నంది దర్శకత్వంలో రాధా మోహన్ నిర్మిస్తున్న ‘బెంగాల్ టైగర్’తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంతో సాగుతోంది. ఆర్.ఎఫ్.సి.లో భారీ షెడ్యూల్ జరుగుతోంది. ఇందులో రవితేజతో పాటు బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ, తదితర నటీనటులు పాల్గొంటున్నారు. ఏకకాలంలో రెండు షూట్స్ రామ్ శరవేగంతో రెండు సినిమాలు చేస్తున్నారు. ఈ రెండూ స్రవంతి మూవీస్ సంస్థలోనే తయారవుతున్నాయి. ఈ రెండు సినిమాల ద్వారా ఇద్దరు కొత్త దర్శకులు పరిచయమవుతుండడం విశేషం. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ‘శివం’ ఇప్పటికే 70 శాతం పూర్తయింది. గతవారం రోజులుగా ఊటీలో షెడ్యూలు జరుపుకుంది. సెప్టెంబరులో ఈ చిత్రం విడుదలవుతుంది. ఇక మరో చిత్రం కథ ‘హరికథ’ కూడా కొంత చిత్రీకరణ జరుపుకొంది. కిశోర్ తిరుమల దర్శకుడు. ఈ రెండు చిత్రాలకూ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్నారు. ఫీల్‌గుడ్ మూవీలో! గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మన్జిమా మోహన్, నాగచైతన్య జంటగా తయారవుతున్న చిత్రం ప్రస్తుతం షూటింగ్లో ఉంది. గతంలో ఒకే కథ వేర్వేరు హీరోలతో తమిళంలో ‘విన్నై తాండి వరువాయా’, తెలుగులో ‘ఏం మాయ చేశావే’ చేసి, విజయం సాధించినట్లే, ఇప్పుడు ఈ సినిమాను గౌతమ్ మీనన్ రూపొందిస్తున్నారు. ఈ తెలుగు - తమిళ ద్విభాషా చిత్రంలో తెలుగు వెర్షన్లో నాగచైతన్య హీరో అయితే, తమిళంలో శింబు కథానాయకుడు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం తమిళనాట సాగుతోంది. యాక్షన్ హంగామా అక్కినేని అఖిల్ పరిచయ చిత్రం షూటింగ్ దేశవిదేశాల్లో జరుగుతోంది. ఇటీవలే స్పెయిన్‌లో కీలక ఎపిసోడ్స్ చిత్రీకరణ చేసివచ్చారు. కొద్దిరోజుల్లోనే బ్యాంకాక్‌లో షూటింగ్ చేయడానికి చిత్ర బృందం బయలుదేరి వెళ్తోంది. అక్కడ పాటలు, ముఖ్య సన్నివేశాలు చిత్రీకరిస్తారు. వి.వి. వినాయక్ దర్శకత్వంలో హీరో నితిన్ నిర్మిస్తున్నారీ చిత్రాన్ని. ముచ్చటగా మూడు! దేవ కట్టా దర్శకత్వంలో ‘డైనమైట్’ చిత్రంతో మంచు విష్ణు బిజీగా ఉన్నారు. ఈ సినిమా జూలై రిలీజ్ కోసం సన్నాహాలు జరుపుకొంటూ ఉండగానే, ఆయన మరో రెండు సినిమాలు ఎనౌన్స్ చేశారు. నూతన దర్శకుడు హనుమాన్ నిర్దేశకత్వంలో ఒక సినిమా, తనికెళ్ళ భరణి దర్శకత్వంలో పౌరాణిక గాథ ‘కన్నప్ప కథ’కు కసరత్తులు చేస్తున్నారు. ప్రత్యేకించి, ‘కన్నప్ప కథ’ కోసం లుక్ నుంచి అన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇక అల్లు అర్జున్, గోపీచంద్ తదితర కథానాయకుల కొత్త చిత్రాలు కూడా ఇప్పటికే ముహూర్తాలు జరుపుకొన్నాయి. వచ్చే నెలలో పూర్తి స్థాయిలో సెట్స్ మీదకు వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. -
చిన్నబోయిన సినీ లోకం
రామానాయుడి మృతితో ఫిలింనగర్, సినీవిలేజ్‌లో విషాదం రాయదుర్గం: మూవీమొగల్ రామానాయుడు మృతితో నానక్‌రాంగూడలోని సినీ విలేజ్, జూబ్లీహిల్స్‌లోని ఫిలింనగర్ గురువారం మూగ బోయాయి. ఆయన మృతికి సంతాప సూచకంగా షూటింగ్‌లు నిలిపివేసి బంద్ పాటించడంతో సినీ విలేజ్ ప్రాంగణం బోసి పోయింది. 1994లో రామానాయుడు ఔట్ డోర్ షూటింగ్‌ల కోసం ప్రత్యేకంగా ఖాజాగూడ-నానక్‌రాంగూడ మధ్యన భగీరథ చెరువు సమీపంలో సినీ విలేజ్ ఏర్పాటు చేశారు. సినిమాలకు చెందిన ఔట్ డోర్ షూటింగ్‌లను ఇక్కడ నిర్వహిస్తుండడంతో ఎప్పుడు సినీ కళాకారులతో ఈ ప్రాంతం కిటకిటలాడుతుంటోంది. గత 20 ఏళ్లుగా ఆయున వారంలో కనీసం రెండు సార్లయినా ఇక్కడి వచ్చి పరిసరాలు, చెట్లు, మొక్కలు పరిశీలించి, సిబ్బందికి అవసరమైన సూచనలు చేసేవారని ఉద్యోగులు తెలిపారు. రామానాయుడి మృతికి సంతాపం... రామానాయుడు మృతితో నిశ్చేష్టులైన ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది ప్రధాన గేటు వద్ద రామానాయుడు చిత్రపటాన్ని ఉంచి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. దీంతోపాటు స్టూడియో ముందున్న ఔటర్ రింగు రోడ్డు సర్కిల్ వద్ద ఉన్న రోడ్డు పక్కన నాగదేవత గుడి ముందు భారీ చిత్రపటాన్ని ఉంచి పూలమాలలు వేశారు. కళతప్పిన కృష్ణానగర్ సినీ కార్మికుల ఆరాధ్య దైవంగా వెలుగుతున్న మూవీ మొఘల్ రామానాయుడు మృతితో కృష్ణానగర్, ఫిలింనగర్, ఇందిరానగర్ ప్రాంతాలు శోకసంద్రంలో మునిగిపోయూరుు. నిత్యం సినీ కార్మికులతో కిటకిటలాడే ఈ ప్రాంతాలు గురువారం నిర్మానుష్యంగా మారాయి. ప్రతి యూనియన్ కార్యాలయం ముందు రావూనాయుుడు చిత్రపటాలు ఏర్పాటు నివాళులర్పించారు. యూనియన్ కార్యాలయాలు మూసివేశారు. షూటింగ్లో నిలిపివేశారు. థియేటర్లను కూడా వుూసివేసి సినీ కార్మికులంతా రామానాయుడు స్టూడియో దారి పట్టారు. తమ అభిమాన నిర్మాత ఇకలేరన్న విషయాన్ని తలుచుకొని మహిళా కార్మికులు కంటతడిపెట్టారు. సంతాపం బహుభాషా సినీ నిర్మాత డాక్టర్ డి. రామానాయుడు మృతికి తీవ్ర సంతాపాన్ని తెలుపుతూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు ఏపీ చిల్ట్రన్స్ ఫిల్మ్ సొసైటీ చైర్మన్ వేదకుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రామానాయుడు మృతి తెలుగు సినీపరిశ్రమకు తీరనిలోటని పేర్కొన్నారు. పెద్ద సార్‌తో 18 ఏళ్ల అనుబంధం పెద్ద సార్‌తో 18 ఏళ్ల అనుబంధం ఉందని నానక్‌రాంగూడలోని రామానాయుడు సినీ విలేజ్ సెక్యూరిటీ గార్డు ఎస్ కె సింగ్ గద్గద స్వరంతో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి 18 ఏళ్ల క్రితం వలస వచ్చి సెక్యూరిటీ గార్డుగా చేరానన్నాడు. ఇక్కడ పనిచేసే అయిదుగురు సెక్యూరిటీ సిబ్బంది, ఇతర ఉద్యోగులను ఆప్యాయుంగా పలకరించేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. -ఎస్.కె.సింగ్, సెక్యూరిటీ గార్డు -
తుళ్లూరుపై కెమెరా కన్ను
విస్తృతంగా షూటింగ్‌లు కెమెరాలతో వీడియో, ఫొటోగ్రాఫర్ల హడావుడి తుళ్లూరు అందాలు, స్థల పురాణాల చిత్రీకరణలు డాక్యుమెంటరీ తీస్తున్న జర్నలిజం విద్యార్థులు తుళ్లూరు అందాలు కెమెరా కళ్లలో బందీ అవుతున్నారుు. నిజమే.. భవిష్యత్తులో ఇక్కడి పచ్చటి పొలాలు, సెలయేటి పరవళ్లు, వాగులు, వంకలు కనుమరుగై కాంక్రీట్ జంగిల్ ప్రత్యక్షం కానున్న నేపథ్యంలో అనేక సినీ సంస్థలు, విద్యార్థులు ఇప్పటి అందాలను చిత్రీకరించి భద్రపరుస్తున్నారు. ఇందులో భాగంగానే చాలామంది వీడియో, ఫొటోగ్రాఫర్లు కెమెరాలు చేతపట్టుకుని తుళ్లూరులో పర్యటిస్తున్నారు. గతంలో మాజీమంత్రి, తాడికొండ మాజీ ఎమ్మెల్యే డొక్కా మాణిక్యవరప్రసాద్ తుళ్లూరు మండలంలోని ప్రతి గ్రామంపై డాక్యుమెంటరీలు తీసి భావితరాలకు అందిస్తామని ప్రకటించారు. తాజాగా మద్రాసుకు చెందిన ఏషియన్ స్కూల్ ఆఫ్ జర్నలిజం విద్యార్థులు పది రోజులుగా మండలంలోని ప్రతి గ్రామాన్ని వీడియోలో చిత్రీకరిస్తున్నారు. అలాగే, అనేక టీవీ చానళ్లు, పత్రికల ఫొటోగ్రాఫర్లు కూడా తుళ్లూరు మండలంలోని అనేక ప్రాంతాలను ఫొటోలు తీస్తున్నారు. ఇటీవల వారాహి చలనచిత్ర సంస్థ కూడా తుళ్లూరు అందాలను వీడియో తీసింది. నవజన జాగృతి సేవాసంస్థ ఆధ్వర్యంలో ఇక్కడి స్థల పురాణాలు, ప్రత్యేకతలు చిత్రీకరించే ప్రయత్నంలో ఉన్నారు. - తుళ్లూరు -
భార్య కోసం షూటింగులన్నీ రద్దు
లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న తన భార్య కిరణ్ ఖేర్ తరఫున ప్రచారం చేయడానికి ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ మొత్తం షూటింగులన్నింటికీ తాత్కాలికంగా విరామం పలికారు. చండీగఢ్ నుంచి కిరణ్ పోటీచేస్తున్నారు. ఆమెకోసం ఏప్రిల్ నెలలో తనకున్న షూటింగులన్నింటినీ అనుపమ్ ఖేర్ రద్దుచేసుకున్నారు. ఈనెల ఆరంభంలో కిరణ్ తన నామినేషన్ పత్రాలు దాఖలు చేసినప్పుడు ఆమె వెంట అనుపమ్ ఖేర్ కూడా ఉన్నారు. కిరణ్ ఖేర్‌కు చండీగఢ్‌లో పరిస్థితి చాలా బాగుందని, ఆమెకు సాయం చేయడానికి అద్భుతమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయని అనుపమ్ చెప్పారు. ఆమెకు కొంతకాలం పాటు సాయం ఉంటానని, ఇదంతా తన సంతృప్తి కోసమే తప్ప ఆమెకు నిజానికి తన అవసరం ప్రస్తుతానికి లేదని తెలిపారు. కిరణ్ వయస్సు గురించి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిని గుల్ పనగ్ చేసిన వ్యాఖ్యలపై అనుపమ్ మండిపడ్డారు. రాజకీయాల్లో ఒత్తిడి తట్టుకోడానికి కిరణ్ వయసు సహకరించదని చెప్పేవాళ్లు ఆమె ప్రచార ఉధృతిని చూడాలని అన్నారు. ''మా తాతగారు ఒకటే చెప్పేవారు. అప్పటికే తడిసి ఉన్నప్పుడు మళ్లీ వర్షం గురించి భయపడటం అనవసరమన్నారు. కిరణ్, నేను ఇద్దరమూ యోధులమే. దేనికీ భయపడేది లేదు" అని ఆయన చెప్పారు.